Olympics
-
ఒలింపిక్స్‌కు ముందు ‘కామన్వెల్త్’ నిర్వహించండి.. భారత్‌కు సీజీఎఫ్ చీఫ్ సూచన
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ఇటీవల తరచూ ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం తహతహలాడుతోంది. 2036 ఒలింపిక్స్ నిర్వహణకు ఆసక్తి కనబరుస్తోంది. అయితే భారత్ లక్ష్యం విశ్వక్రీడలైతే ముందుగా కామన్వెల్త్ క్రీడలు నిర్వహిస్తే ఇది మెగా ఈవెంట్‌కు ముందు మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని కామన్వెల్త్ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్) సీఈఓ కేటీ సాడ్లియెర్ సూచించారు. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన ‘గ్లోబల్ బిజినెస్ సమ్మిట్’లో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఏ దేశానికైనా ఒలింపిక్స్ ఆతిథ్యమనేది గొప్ప కీర్తిని తెస్తుంది. అయితే అలాంటి ప్రతిష్టాత్మక క్రీడలకు ముందు కామన్వెల్త్ క్రీడలు (2030) నిర్వహిస్తే మేటి అంతర్జాతీయ ఈవెంట్‌కు సరైన సన్నాహకంగా, చక్కని ముందడుగుగా ఉపయోగపడుతుంది’ అని అన్నారు. భవిష్యత్తులో ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్ టాప్–10లో నిలుస్తుందని ఆమె చెప్పారు. ‘భారత్ దశ, దిశ ఇప్పుడు మారుతోంది. సరైన నాయకత్వం, మౌలిక వసతుల కల్పన, ప్రామాణిక శిక్షణతో క్రీడల భవిష్యత్ మారబోతోంది. అంతర్జాతీయ క్రీడా వేదికలపై ప్రదర్శన, పతకాలనేవి ఆ దేశ ప్రతిష్టను కచ్చితంగా పెంచుతాయి. తప్పకుండా భారత్ క్రీడాశక్తిగా ఎదుగుతుంది’ అని కేటీ సాడ్లియెర్ తెలిపారు. సరిగ్గా పదిహేనేళ్ల క్రితం భారత్ ఒకే ఒక్కసారి 2010లో కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమిచ్చింది. -
సౌదీ అరేబియాలో ఇ–స్పోర్ట్స్ ఒలింపిక్స్
లుసానే (స్విట్జర్లాండ్): మొట్టమొదటి ఒలింపిక్స్ ఇ–స్పోర్ట్స్‌కు సౌదీ అరేబియా ఆతిథ్యమివ్వబోతోంది. 2027లో సౌదీ రాజధాని రియాద్‌లో ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ విశ్వక్రీడలు జరుగనున్నాయి. గతేడాది పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా ఈ ఏడాదే ఇ–స్పోర్ట్స్ మెగా ఈవెంట్ నిర్వహించాలని మొదట అనుకున్నారు. అయితే ఇది కార్యరూపం దాల్చేందుకు ఇంకో రెండేళ్లు ఆలస్యమవుతుంది. అయితే 2027 నుంచి రెగ్యులర్‌గా ప్రతీ రెండేళ్లకోసారి మెగా ఈవెంట్ ఇ–స్పోర్ట్స్ నిర్వహించేందుకు సౌదీ ప్రభుత్వం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)తో 12 ఏళ్ల ఒప్పందం చేసుకుంది. గతేడాది జూలై, ఆగస్టు నెలల్లో రియాద్‌లో ఇ–స్పోర్ట్స్ ప్రపంచకప్ జరిగింది. కాల్ ఆఫ్ డ్యూటీ, ఫోర్ట్‌నైట్, స్ట్రీట్ ఫైటర్ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. అయితే ఇందులో సాధారణ షూటర్లకు అనుమతించేది లేనిది తేలలేదు. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుంది. సౌదీ క్రీడల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజిజ్ బిన్ తుర్కీ అల్ ఫైజల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ ఒలింపిక్స్ ఇ–స్పోర్ట్స్ క్రీడాంశాలపై చర్చించనుంది. ఇటీవల ఐఓసీ చైర్మన్ థామస్ బాచ్, సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ల మధ్య చర్చలు ఫలప్రదంగా జరగడంతో తాజాగా ఇ–స్పోర్ట్స్ విశ్వక్రీడలపై ప్రకటన వెలువడింది. అయితే ఇంకో రెండేళ్లలో జరిగే ఈ పోటీల కోసం ఈ ఏడాది నుంచే క్వాలిఫయింగ్ పోటీలు మొదలవుతాయని ఐఓసీ వర్గాలు తెలిపాయి. -
2032 ఒలింపిక్స్‌లోనూ క్రికెట్‌ను కొనసాగించాలి..!
లూసానే: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ జై షా మంగళవారం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్‌తో భేటీ అయ్యారు. త్వరలో లూసానేలోనే ఐఓసీ ఉన్నతస్థాయి అధికారులు పాల్గొనే అసాధారణ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మేటి క్రీడా కమిటీల చీఫ్‌ల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెలాఖరున (30వ తేదీ) జరిగే ఈ కీలకమైన సమావేశంలో క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో కొనసాగించే అంశంపై చర్చ జరుగనుంది. దీంతో ఈ చర్చ కంటే ముందుగా జై షా, థామస్ బాచ్లు అ అంశంపై అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఐసీసీ సోషల్ మీడియాలో ఇద్దరి ఫొటోను పోస్ట్ చేసింది. ‘లాస్ ఏంజెలిస్–2028 ఒలింపిక్స్‌లో టి20 ఫార్మాట్లో క్రికెట్ ఈవెంట్ జరగనుంది. అయితే 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్‌లో క్రికెట్ ఉంటుందా లేదా అన్నది ఇంకా ఖరారు కాలేదు. దాంతో తదుపరి విశ్వక్రీడల్లోనూ క్రికెట్ క్రీడను కొనసాగించే విషయంపై ప్రాథమిక దశ సంప్రదింపులు మొదలయ్యాయి. ఐసీసీ చైర్మన్ జై షా ఈ అంశమై ఐఓసీ చీఫ్ బాచ్‌తో సమావేశమయ్యారు’ అని ఐసీసీ ‘ఎక్స్’లో ట్వీట్ చేసింది. -
పాపాల భోపాల్‌లో పారా తారలు.. విషం కాటేసినా ఆటై మెరిశారు
భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి నేటికి 40 ఏళ్లు. డిసెంబర్ 2, 1984 అర్ధరాత్రి మొదలై డిసెంబర్ 3 వరకూ కొనసాగిన విష వాయువులు ఆ ఒక్క రాత్రితో తమ ప్రభావాన్ని ఆపేయలేదు. అవి జన్యువుల్లో దూరి నేటికీ వెంటాడుతూనే ఉన్నాయి. ఆ దుర్ఘటన నుంచి బయటపడిన వారికి నేటికీ అవకరాలతో పిల్లలు పుడుతున్నారు. ఏనాటి ఎవరి పాపమో ఇప్పటికీ వీళ్లు అనుభవిస్తున్నారు. అయితే వీరిలో కొందరు పిల్లలు పారా స్పోర్ట్స్‌లో ప్రతిభ చూపుతుండటం ఒక ఆశ. కాని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని చెప్పడమే వీరు మనకు కలిగిస్తున్న చైతన్యం.పదిహేడేళ్ల దీక్షా తివారి ‘ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ డిజార్డర్’ (ఐడిడి) రుగ్మతతో బాధ పడుతోంది. ఆ అమ్మాయిని బాల్యంలో గమనించిన తల్లిదండ్రులు మహేష్ తివారి, ఆర్తి తివారి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లినప్పుడు ఆయన ‘ఇది భోపాల్ గ్యాస్ విష ఫలితం’ అనంటే ఆ తల్లిదండ్రులు హతాశులయ్యారు. ‘అదెప్పటి సంగతో కదా’ అన్నారు. ‘అవును... ఇప్పటికీ వెంటాడుతోంది’ అన్నాడు డాక్టర్. దానికి కారణం భోపాల్ ఘటన జరిగినప్పుడు మహేష్ వయసు 5 ఏళ్లు, ఆర్తి వయసు 3 సంవత్సరాలు. వారు భోపాల్‌లో ఆ గ్యాస్‌ని పీల్చారు. కాని అది జన్యువుల్లో దూరి సంతానానికి సంక్రమిస్తుందని నాడు వాళ్లు ఊహించలేదు.అదృష్టం ఏమిటంటే దీక్షా తివారి 2023 స్పెషల్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున బాస్కెట్ బాల్లో రజత పతకం తేవడం. ఈ అమ్మాయే కాదు భోపాల్ విష వాయువు వెంటాడుతున్న చాలా మంది బాలలు భోపాల్‌లోని జేపీ నగర్ప్రాంతంలో అత్యధికం ఉన్నారు. వీరంతా తమ శారీరక, మానసిక లోపాలను, రుగ్మతలను జయించడానికి స్పోర్ట్స్‌ను ఎంచుకున్నారు. అథ్లెటిక్స్, సైక్లింగ్, ఫుట్‌బాల్ తదితర ఆటల్లో ప్రతిభ చూపుతున్నారు. బతుకు జీవచ్ఛవం కాకుండా ఉండేందుకు క్రీడలు వారిని కాపాడుతున్నాయి. కాని ప్రభుత్వం వీరికి చేయవలసింది చేసిందా?40 టన్నుల గ్యాస్డిసెంబర్ 2, 1984 అర్ధరాత్రి భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి అత్యంత ప్రాణాంతకమైన ‘మిథైల్ ఐసొసైనెట్’ విడుదలవడం మొదలయ్యి మరుసటి రోజు సాయంత్రం వరకూ వ్యాపించింది. దాదాపు 40 టన్నుల విషవాయువు విడుదలైంది. దీని వల్ల చనిపోయిన వారు అధికారికంగా 2,259 కాని 20 వేల నుంచి 40 వేల వరకు మరణించి ఉంటారని సామాజిక కార్యకర్తల అంచనా. ఆ సమయంలో బతికున్నవారు జీవచ్ఛవాలుగా మారితే కొద్దిపాటి అస్వస్థతతో బయటపడిన వారూ ఉన్నారు. విషాదం ఏమంటే ఈ ఘటన జరిగినప్పుడు చంటిపాపలు, చిన్న పిల్లలుగా ఉన్నవారు ఆ ఘటన నుంచి బయట పడి అదృష్టవంతులం అనుకున్నారు కానీ వారికి యుక్తవయసు వచ్చి పిల్లలు పుట్టాక వారిలో అధిక శాతం దివ్యాంగులుగా, మానసిక దుర్బలురుగా మిగిలారు.1300 మంది దివ్యాంగులు‘‘భోపాల్ విషవాయువులు భోపాల్‌లోని 42 వార్డుల మీద ప్రభావాన్ని చూపాయి. ఆ 42 వార్డుల్లో దివ్యాంగ శిశువులు జన్మిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం వీరి సంఖ్య అధికారికంగా 1300. వీరిలో అత్యధికులు అంధత్వం, సెరిబ్రల్ పాల్సీ, డౌన్ సిండ్రోమ్, మస్క్యులర్ డిస్ట్రఫీ, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) వంటి సమస్యలతో బాధ పడుతున్నారు.వీరికి రెగ్యులర్‌గా థెరపీ అవసరం. కాని మా వద్ద వున్న వనరులతో కేవలం 300 మందికే సేవలు అందించగలుగుతున్నాం. మిగిలినవారికీ ఏ థెరపీ అందడం లేదు. వీరిలో చాలామంది పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల వారు. ఈనాటికీ వీరికి నష్టపరిహారం అందలేదు’’ అని ‘చింగారి’ ట్రస్ట్ బాధ్యుడొకరు తెలిపారు. భోపాల్ విషవాయువు బాధిత దివ్యాంగ శిశువులకు ఈ సంస్థ వైద్య సహాయం అందిస్తుంది.కల్లాకపటం లేని పిల్లలుభోపాల్లోని జేపీనగర్‌లో కల్లాకపటం లేని అమాయక బాలలు చాలామంది కనిపిస్తారు. ముద్దొచ్చే మాటలు మాట్లాడుతూ అందరిలాగా ఆటలాడాలని, స్కూలుకు వెళ్లాలని, కబుర్లు చెప్పే వీరంతా చాలామటుకు బుద్ధిమాంద్యంతో బాధపడే పిల్లలే. కొందరు శరీరం చచ్చుబడ్డ వారే. ప్రతి సంవత్సరం డిసెంబర్ 2వ తేదీన వీరంతా నిరసన కార్యక్రమం జరుపుతుంటారు. న్యాయం కోరుతుంటారు. కానీ దుర్ఘటన జరిగి 40 ఏళ్లు అవుతున్నా వీరు రోడ్ల మీదకు వస్తూనే ఉండాల్సి రావడం బాధాకరం.నీరు తాగిభోపాల్ విషవాయులు భూమిలోకి ఇంకడం వల్ల కొన్ని చోట్ల ఇప్పటికీ ఆ నీరు విషతుల్యం అయి ఉంది. వేరే దిక్కు లేక పేదలు ఆ నీరే చాలాకాలం తాగి ఇప్పుడు దివ్యాంగ శిశువులకు జన్మనిస్తున్నారు. ‘ఆటలాడే ఉత్సాహం ఉన్నా వీరికి ఆటవస్తువులు లేవు. హెల్త్ కార్డులు లేవు’ అని తల్లిదండ్రులు భోరున విలపిస్తుంటే ఏ పాపానికి ఈ శిక్ష అనిపిస్తుంది. -
శుభారంభంపై సింధు దృష్టి
కుమమొటో: భారత స్టార్ షట్లర్లు పూసర్ల వెంకట (పీవీ) సింధు, లక్ష్యసేన్ వైఫల్యాలను అధిగమించి టైటిళ్ల వేటలో పడాలనే పట్టుదలతో జపాన్ ఓపెన్ టోర్నీ బరిలోకి దిగుతున్నారు. నేటి నుంచి జపాన్ మాస్టర్స్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్ జరగనుంది. ఇద్దరు భారత అగ్రశ్రేణి షట్లర్లు పారిస్ ఒలింపిక్స్ తర్వాత బరిలోకి దిగిన ఏ టోర్నీలోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శనే చేయలేకపోయారు. గతంలో ఒక సీజన్లో వరుస టైటిల్స్ సాధించిన వారు ఇప్పుడు కనీసం క్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోవడం ఇబ్బందికరంగా మారింది. రెండు ఒలింపిక్ పతకాల విజేత, ఆంధ్రప్రదేశ్ వెటరన్ స్టార్ పీవీ సింధు ఫిన్లాండ్లో జరిగిన ఆర్క్టిక్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే విఫలమైనా... డెన్మార్క్ ఓపెన్‌లో మాత్రం క్వార్టర్ ఫైనల్ చేరింది. కానీ లక్ష్యసేన్ మాత్రం ఈ రెండు టోర్నీల్లో ఆరంభ రౌండ్లలోనే కంగుతిని ఇంటిదారి పట్టాడు. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 29 ఏళ్ల సింధు... థాయ్‌లాండ్‌కు చెందిన ఎనిమిదో సీడ్ బుసానన్‌తో తలపడనుండగా, పురుషుల ఈవెంట్లో 23 ఏళ్ల లక్ష్యసేన్ మలేసియాకు చెందిన లియోంగ్ జున్ హవొను ఎదుర్కొంటాడు. తొలి రౌండ్ అడ్డంకిని అధిగమిస్తే... అతను రెండో రౌండ్లో ఎనిమిదో సీడ్ ఆంథోనీ గిన్టింగ్ (ఇండోనేసియా)తో పోటీపడే అవకాశముంది. ఇక డబుల్స్‌లో ఒకే ఒక్క భారత జోడీ బరిలో ఉంది. పుల్లెల గాయత్రి గోపీచంద్–ట్రెసా జాలీ జంట మహిళల డబుల్స్ మొదటి రౌండ్లో చైనీస్ తైపీకి చెందిన సూ యిన్ హూ–లిన్ జి యున్ జోడీతో తలపడుతుంది. కొత్త కోచ్‌ల మార్గదర్శనంలో టోర్నీ కోసం సిద్ధమైనట్లు సింధు చెప్పింది. ‘నేనిపుడు బాగా ఆడుతున్నాను. శారీరకంగా, మానసికంగానూ దృఢంగా ఉన్నాను. కొన్ని లోపాలపై కసరత్తు చేశాం. కోర్టులో డిఫెన్స్, స్పీడ్ మెరుగుపర్చుకునేందుకు ఇటీవల బాగా శ్రమించాను. జపాన్‌తో పాటు త్వరలో చైనాలో జరిగే టోరీ్నలోనూ రాణిస్తాను’ అని సింధు ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం కొరియన్ దిగ్గజం, కోచ్ లీ స్యూన్, అనూప్ శ్రీధర్‌లతో ఆమె శిక్షణ తీసుకుంటుంది. -
అధికారిక బడ్జెట్ రూ. 98 వేల కోట్లు.. తొలి అడుగు వేసిన భారత్! కానీ..
భారత్‌లో ఇప్పటి వరకు జరిగిన ఏకైక ప్రపంచ స్థాయి మెగా స్పోర్ట్స్ ఈవెంట్ 2010 కామన్వెల్త్ గేమ్స్. దేశ రాజధాని వేదికగా జరిగిన ఈ పోటీలు ఆటల పరంగా విజయవంతంగా ముగియడంతో పాటు ఆర్థికపరంగా వివాదాలను కూడా వెంట తెచ్చాయి. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మన దేశం మరో ప్రతిష్టాత్మక క్రీడా సంబరం కోసం ముందుకు వస్తోంది.2036 ఒలింపిక్స్ నిర్వహించేందుకు తామూ సిద్ధంగా ఉన్నామని భారత్ ప్రకటించింది. దీనికి సంబంధించి తమ ఆసక్తిని కనబరుస్తూ అక్టోబర్ 1న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి చెందిన ఫ్యూచర్ హోస్ట్ కమిషన్‌కు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ‘లెటర్ ఆఫ్ ఇన్టెంట్’ను సమర్పించింది.ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు‘ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం వస్తే అది భారత ఆర్థిక వ్యవస్థకు, సామాజిక పురోగతికి, దేశవ్యాప్తంగా యువత స్వావలంబనకు ఎంతో మేలు చేస్తుంది’ అని ఐఓఏ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఏడాది క్రితం దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముంబైలో జరిగిన ఐఓసీ సెషన్లో భారత్‌లో ఒలింపిక్స్ నిర్వహించే అంశాన్ని మొదటిసారి ప్రస్తావించారు. ఆయన సూచనల మేరకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఆధ్వర్యంలోని మిషన్ ఒలింపిక్ సెల్ అధికారులు సమగ్ర సమాచారంతో ప్రత్యేక నివేదికను రూపొందించారు.ఒలింపిక్స్‌కు ఎలా బిడ్ వేయాలనే అంశం మొదలు అవకాశం దక్కించేందుకు సాగే ప్రక్రియకు సంబంధించి అన్ని వివరాలను ఇందులో పొందుపరిచారు. ఆ తర్వాతే ఐఓఏ దీనిపై ముందుకు వెళ్లింది. 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజెలిస్ (అమెరికా)లో, 2032 బ్రిస్బేన్ (ఆస్ట్రేలియా)లో జరగనున్నాయి. ప్రక్రియ ఇలా... సాధారణంగా ఒలింపిక్స్ నిర్వహణపై ఆసక్తి మొదలు హక్కుల కేటాయింపు వరకు మూడు దశలు ఉంటాయి. ఎలాంటి ప్రక్రియలో అడుగుపెట్టకుండా వేర్వేరు వేదికలపై మేమూ నిర్వహిస్తాం అంటూ ప్రకటించే ‘ఇన్ఫార్మల్ డైలాగ్’ ఇందులో మొదటిది. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా కొంత ఆసక్తి మాత్రం ఏర్పడుతుంది తప్ప అధికారికంగా ఎలాంటి విషయమూ ఉండదు. అయితే ఇప్పుడు ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ ఇవ్వడంతో దానిని దాటి భారత్ ‘కంటిన్యూయస్ డైలాగ్’ దశకు చేరింది.ఆసక్తి కనబర్చిన దేశాలు, అక్కడి రాజకీయ, ఇతర సామాజిక అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఐఓసీ తెలుసుకుంటుంది. ఇందులో పర్యావరణ పరిరక్షణ, మానవ హక్కుల అమలు లేదా ఉల్లంఘన వంటివి కూడా ఉంటాయి. ఆయా దేశాలతో కూడా దీనిపై ఐఓసీ చర్చిస్తుంది. అయితే నిర్వహణపై ఎలాంటి హామీని ఇవ్వదు. మూడో దశలో ‘టార్గెటెడ్ డైలాగ్’ ఉంటుంది. ఇక్కడే అసలు నిర్వహణపై స్పష్టత వస్తుంది.తుది నిర్ణయం ఆ కమిటీదేఆయా దేశాలు నిర్వహణపై తమ ప్రణాళికలు, మొత్తం బడ్జెట్ సహా ఇతర ఆర్థికపరమైన సమాచారం, తమకు అవకాశం ఇస్తే ఇతర దేశాలకంటే భిన్నంగా ఏం చేస్తామో అనే అన్ని అంశాలకు ఒక ఫార్మాట్లో వెల్లడించాల్సి ఉంటుంది. దీనిపై ఐఓసీ ఫ్యూచర్ హోస్ట్ కమిషన్ తుది నిర్ణయం తీసుకుంటుంది. 2036 క్రీడల వేదికను 2025 తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. అవకాశం వస్తే అహ్మదాబాద్‌లో! ఒలింపిక్స్ నిర్వహణ కోసం ఆసక్తి చూపిస్తున్న దేశాలు బిడ్‌లో వేదికగా నగరాల పేర్లను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ను దీని కోసం భారత్ ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. అహ్మదాబాద్, గాంధీనగర్‌లలో కలిపి 22 రకాల క్రీడా వేదికలను అధికారులు గుర్తించారు. అయితే 2036 కోసం పోటీ పడుతున్న ఇతర నగరాలు, దేశాలతో పోలిస్తే మన దేశానికి అవకాశం రావడం అంత సులువు కాదనేది వాస్తవం.నుసాన్తారా (ఇండోనేసియా), ఇస్తాంబుల్ (తుర్కియే), శాంటియాగో (చిలీ), న్యూ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ (ఈజిప్ట్), సియోల్ (దక్షిణ కొరియా), దోహా (ఖతర్), రియాద్ (సౌదీ అరేబియా), బుడాపెస్ట్ (హంగేరి), ట్యురిన్ (ఇటలీ), కోపెన్‌హాగెన్ (డెన్మార్క్), టొరంటో–మాంట్రియల్ (కెనడా) ఈసారి భారత్‌తో హక్కుల కోసం పోటీ పడుతున్నాయి. వీటిలో సియోల్, మాంట్రియల్లకు గతంలోనే ఈ క్రీడలను నిర్వహించిన అనుభవం ఉండగా... సుసాన్తారా, ఇస్తాంబుల్, దోహా నగరాలు వరుసగా హక్కుల కోసం పోటీ పడుతూ త్రుటిలో అవకాశాలు చేజార్చుకున్నాయి.అధికారిక బడ్జెట్ రూ. 98 వేల కోట్లుఈ నగరాల్లో అన్నింటిలో కూడా ఆర్థికపరంగా పరిపుష్టిగా ఉండటంతో పాటు 2022లో ‘ఫిఫా’ వరల్డ్ కప్ నిర్వహణతో ఇప్పటికే తమ స్థాయిని చూపించిన దోహా... 2034 ‘ఫిఫా’ వరల్డ్ కప్ హక్కులు దక్కించుకున్న రియాద్ ఒలింపిక్ రేసులో మిగతా నగరాలకంటే ముందున్నాయి. వీటన్నింటిని దాటి భారత్ అవకాశం దక్కించుకుంటుందా అనేది ఆసక్తికరం. ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్ నిర్వహణ బడ్జెట్ అధికారికంగా 900 కోట్ల పౌండ్లు (సుమారు రూ.98 వేల కోట్లు) అంటే ఒలింపిక్స్ నిర్వహణ స్థాయి ఏమిటో ఊహించుకోవచ్చు! చదవండి: ఆఫ్రో–ఆసియా కప్ పునరుద్ధరణ! -
2036 ఒలింపిక్స్ నిర్వహణ భారత్‌లో..?
2036 ఒలింపిక్స్, పారాలింపిక్స్ నిర్వహణకు తాము సిద్దంగా ఉన్నామని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ)కి లేఖ (Letter Of Intent) రాసింది. అక్టోబర్ 1న ఐఓసీ ఫ్యూచర్ హోస్ట్ కమీషన్‌కు భారత ఒలింపిక్స్ సంఘం లేఖ రాసినట్లు పీటీఐ పేర్కొంది. గతేడాది భారత ప్రధాని నరేంద్ర మోదీ 141వ ఐఓసీ సెషన్లో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఒలింపిక్స్ నిర్వహణకు తాము సిద్దంగా ఉన్నామని ప్రధాని మోదీ ప్రకటించారు.2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులు ఏ దేశానికి దక్కుతాయన్న విషయం వచ్చే ఏడాది తెలుస్తుంది. ఒలింపిక్స్ నిర్వహణ విషయంలో భారత్‌కు సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ, సౌత్ కొరియా గట్టి పోటీ ఇస్తున్నాయి. మరోవైపు మెక్సీకో, ఇండోనేషియా, పోలాండ్, ఈజిప్ట్ కూడా ఒలింపిక్స్ నిర్వహణ రేసులో ఉన్నట్లు తెలుస్తుంది.కాగా, ఈ ఏడాదే (2024) పారిస్‌లో విశ్వ క్రీడలు ముగిసిన విషయం తెలిసిందే. 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజెల్స్‌లో జరుగబోతున్నాయి. అనంతరం ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ వేదికగా 2032 విశ్వ క్రీడలు జరుగనున్నాయి. 2036 ఒలింపిక్స్ వేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 2036 ఒలింపిక్స్ నిర్వహణ కోసం భారత దేశ ప్రజలంతా ఉత్సాహంగా ఉన్నారని ప్రధాని మోదీ అన్నారు. ఒలింపిక్స్ నిర్వహణ 140 కోట్ల భారతీయుల కల. -
జులానాలో విజేత.. వినేశ్ ఫొగాట్!
సాక్షి, న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోయినా హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి సత్తా చాటారు రెజ్లర్ వినేశ్ ఫొగాట్(30). జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీకి దిగిన ఫొగాట్ దాదాపు 19 ఏళ్ల అనంతరం ఆ పార్టీకి విజయాన్ని సాధించి పెట్టారు. రెజ్లింగ్‌లో విజయం సాధించలేకపోయిన ఫొగాట్‌ను జులానా ఓటర్లు ఆదరించారు. ఫొగాట్‌కు 65,080 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్‌కు 59,065 ఓట్లు పడ్డాయి. ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి ఆధిక్యాన్ని ప్రదర్శించిన ఫొగాట్ మధ్యలో కాస్త వెనుకబడ్డారు. చివరకు 6,015 ఓట్ల తేడాతో గెలుపు తీరాలకు చేరారు. అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టే అవకాశం దక్కించుకున్నారు. కాగా, 2019 ఎన్నికల్లో ఇక్కడ కేవలం 12,440 ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఒలింపియన్ వినేశ్ ఫొగాట్‌ను బరిలోకి దింపి జాట్ ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేసి, సఫలమైంది. మరోవైపు, బీజేపీ యోగేష్ కుమార్‌ను నిలిపి ఓబీసీ ఓట్లను ఆకర్షించేందుకు ప్రయతి్నంచి, విఫలమైంది. -
ఒలింపిక్ పతక విజేతలతో నీతా అంబానీ: వైరల్ వీడియో
ముంబైలోని అంబానీ నివాసం యాంటిలియాలో ఆదివారం రాత్రి రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ అండ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసి) సభ్యురాలు నీతా అంబానీ 'యునైటెడ్ ఇన్ ట్రయంఫ్' ఈవెంట్లో భారతదేశ ఒలింపిక్స్, పారాలింపిక్స్ పోటీదారులకు ఆతిథ్యం ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ ఈవెంట్లో.. పారిస్ ఒలింపిక్స్ 2024 పతక విజేతలు మను భాకర్, నీరజ్ చోప్రాతో పాటు పారిస్ పారాలింపిక్స్ 2024 పతక విజేతలు నవదీప్ సింగ్, మోనా అగర్వాల్‌లతో నీతా అంబానీ ఫోటోకు ఫోజులిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన క్రీడాకారులు సత్కరించారు.Mrs Nita M Ambani, Founder and Chairperson of Reliance Foundation, welcomed the athletes to United in Triumph: an unprecedented evening that united India's Olympians and Paralympians and rejoiced and cherished their success. Speaking on the occasion, Mrs Ambani said, "Today is a… pic.twitter.com/7wxsO9TE0c— Reliance Industries Limited (@RIL_Updates) September 30, 2024సుమిత్తో పాటు నీరజ్ చోప్రా, మను భాకర్, మురళీకాంత్ పెట్కర్, దేవేంద్ర ఝఝరియా సహా భారతదేశ ఒలింపిక్ & పారాలింపిక్ ఛాంపియన్లు అంటిల్, నితేష్ కుమార్, హర్విందర్ సింగ్, ధరంబీర్ నైన్, నవదీప్ సింగ్, ప్రవీణ్ కుమార్, దీపా మాలిక్, సానియా మీర్జా, కర్ణం మల్లీశ్వరి, పుల్లెల గోపీచంద్, హర్భజన్ సింగ్ వంటి క్రీడా దిగ్గజాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.భారత మాజీ దిగ్గజ గోల్‌కీపర్ పిఆర్ శ్రీజేష్ తన కుటుంబంతో సహా ఆంటిలియాకు చేరుకున్నారు. పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన పారా షట్లర్లు సుహాస్ యతిరాజ్, నితేష్ కుమార్ కూడా ఈ ఈవెంట్‌ను హాజరయ్యారు.ఇదీ చదవండి: ఉద్యోగాల సృష్టికి ఏం చేయాలంటే?.. రఘురామ్ రాజన్యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ ఈవెంట్లో నీతా అంబానీ మాట్లాడుతూ.. భారతదేశం మొత్తం మన అథ్లెట్లను చూసి గర్విస్తోంది. మొదటిసారి భారత పారిస్ ఒలింపియన్లు, పారా ఒలింపియన్లు ఒకే వేదికపైకి చేరుతున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ తరపున, 'యునైటెడ్ వుయ్ ట్రయంఫ్' ఒక ఉద్యమంగా మారాలని కోరుకుంటున్నానని అన్నారు.Together as one, celebrating unity ✨✨ India’s star Paralympians & Olympians arrive at Reliance Foundation’s United In Triumph awards to celebrate spirit of Olympism together🤝🤝 #RFsports #UnitedinTriumph #Paris2024 #Paralympics2024 pic.twitter.com/7xVfxJ7lhV— RF Youth Sports (@RFYouthSports) September 29, 2024 -
ప్రజాభీష్టానికి పాతర
వేసవి ఒలింపిక్స్, పారాలింపిక్స్ – రెండూ పూర్తవడంతో ఫ్రాన్స్‌లో ఆటల వేడి ముగిసిందేమో కానీ, రాజకీయ క్రీడ మాత్రం బాగా వేడెక్కింది. కన్జర్వేటివ్ రిపబ్లికన్స్ పార్టీ నేత మిషెల్ బార్నియెర్ను దేశ ప్రధానిగా నియమిస్తున్నట్టు ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ గడచిన గురువారం చేసిన ప్రకటనతో రచ్చ రేగుతోంది. కొద్ది నెలల క్రితం జూన్ 9న పార్లమెంట్ దిగువ సభను రద్దు చేసి, ఆకస్మిక ఎన్నికలు ప్రకటించి, దేశాన్ని రాజకీయ ప్రతిష్టంభనకు గురి చేసిన మెక్రాన్ తీరా ఎన్నికల ఫలితాలొచ్చిన 60 రోజుల తర్వాత తాపీగా ప్రజాతీర్పుకు భిన్నంగా నాలుగో స్థానంలో నిలిచిన పార్టీ వ్యక్తిని ప్రధానమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లయిన దేశంలో జరిగిన ఈ అపహాస్యమే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఆగ్రహించిన వేలాది జనం వీధుల్లోకి వచ్చి, ప్రదర్శనలకు దిగింది అందుకే. కొత్త ప్రధాని సారథ్యంలో సరికొత్త ప్రభుత్వం కొలువు తీరుతుంది కానీ, రాజకీయ సంక్షోభం అంచున ఉన్న దేశానికి సారథ్యం వహించడం అగ్నిపరీక్షే. వెరసి ఫ్రాన్స్‌లో అనిశ్చితి తొలగకపోగా, మరింత పెరగనుండడమే వైచిత్రి. నిజానికి, ఫ్రాన్స్‌లో జూలైలో రెండో విడత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తీవ్ర మితవాద పక్షమైన ‘నేషనల్ ర్యాలీ’నీ, అలాగే మెక్రాన్‌కు చెందిన ‘రినైజెన్స్ బ్లాక్’నూ వెనక్కి నెట్టారు. వామపక్ష కూటమి ‘న్యూ పాపులర్ ఫ్రంట్’ (ఎన్‌ఎఫ్‌పీ)కి అధిక మద్దతు ప్రకటించారు. అయితే, ఎన్ఎఫ్పీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో హంగ్ పార్లమెంట్ ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ లేని విధంగా ఇన్నాళ్ళుగా కొత్త ప్రభుత్వమేదీ లేకుండానే మెక్రాన్ కథ నడిపారు. పైగా, అధ్యక్షుడిగా తనకున్న విశేషాధికారాన్ని వాడి, వామపక్ష కూటమి ప్రతిపాదించిన అభ్యర్థు లెవరినీ ప్రధానిగా అంగీకరించలేదు. చివరకు ఎన్నికల్లోని ప్రజా తీర్పును అగౌరవిస్తూ, నాలుగో స్థానంలోని పార్టీ తాలూకు వ్యక్తిని ప్రధానిగా దేశాధ్యక్షుడు ఎంపిక చేయడం ఓటర్లకు, అందునా యువతరానికి అమితమైన ఆగ్రహం కలిగించింది. దాని పర్యవసానమే – వేలాదిగా జనం వీధు ల్లోకి రావడం! ఒక రకంగా ఈ ప్రధానమంత్రి ఎంపిక ‘ఎన్నికల చోరీ’ అని పేర్కొంటూ, ఏకంగా దేశాధ్యక్షుడు మెక్రాన్కే ఉద్వాసన పలకాలంటూ వాదించే స్థాయికి పరిస్థితి వెళ్ళింది. ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ లేని పరిస్థితుల్లో ఉన్నంతలో అధిక స్థానాలున్న కూటమికే పగ్గాలు అప్పగించడం విహితమని స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వ సిద్ధాంతాలను ప్రవచించిన ఘన ప్రజాస్వామ్యం నుంచి ఎవరైనా ఆశిస్తారు. కానీ, 2017 నుంచి విభజన రాజకీయాలు చేస్తున్న ప్రెసి డెంట్ మెక్రాన్ ఎన్నికలలో తన పార్టీ కింద పడ్డా తనదే పైచేయిగా వ్యవహరించారు. వరుసగా చేస్తూ వస్తున్న తప్పుల్ని కొనసాగిస్తూ ఇష్టారీతిన వ్యవహరించారు. ఆ మాటకొస్తే, రాజకీయాల పట్ల నమ్మకం క్షీణింపజేసే ఇలాంటి చర్యల వల్లనే ఫ్రాన్స్ సహా యూరప్ అంతటా తీవ్ర మితవాదం పైకి ఎగసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఆధిక్యం కనబరిచినవారికి కనీసం ఏకాభిప్రాయ సాధనకైనా అవకాశమివ్వకుండా అధ్యక్షుడు తన పదవీకాలపు లెక్కలతో తోచిన ఎంపికలు చేయడం అవివేకం. తీవ్ర మితవాదానికీ, దాని జాత్యహంకార, విదేశీయతా విముఖ సిద్ధాంతానికీ పట్టం కట్టరాదన్న ప్రజాభీష్టానికి వ్యతిరేకం. ఈ కొత్త సర్కార్ కింగ్ మేకర్లయిన తీవ్ర మితవాదుల మద్దతుపై ఆధార పడక తప్పని స్థితి. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో అధ్యక్షుడు దేశాన్ని మళ్ళీ చిక్కుల్లోకి నెట్టారు. అలాగని ప్రధానిగా ఎంపికైన 73 ఏళ్ళ బార్నియెర్ మరీ అనామకుడేమీ కాదు. బ్రెగ్జిట్‌పై యూరోపియన్ యూనియన్ పక్షాన గతంలో సంప్రతింపులకు సారథ్యం చేసిన వ్యక్తి. ఏకాభిప్రాయ సాధనలో ప్రసిద్ధుడు. రాజకీయ – సైద్ధాంతిక విభేదాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోగలి గినవాడు. ముగ్గురు దేశాధ్యక్షుల హయాంలో మంత్రిగా చేసిన ఆయనది యూరోపియన్ అనుకూల వైఖరి. అది వామపక్షాలకు నచ్చవచ్చు. ఇక, వలసల నియంత్రణకు మరింత కఠినమైన నిబంధనలు ఉండాలన్న వాదననే బార్నియెర్ సమర్థిస్తున్నారు. అది కన్జర్వేటివ్‌లకు నచ్చే అంశం. ప్రభుత్వ భవితవ్యంపై అనిశ్చితి నెలకొనడంతో... ప్రధానిగా ఇలాంటి వ్యక్తే సరైనవాడని మెక్రాన్ ఎంచు కున్నారట. కానీ, ఫ్రెంచ్ సమాజం నుంచి ఆమోదం లభించడం, రాజకీయంగా విజయం సాధించడం మెక్రాన్, బార్నియెర్లు ఇద్దరికీ అంత సులభమేమీ కాదు. సుదీర్ఘంగా శ్రమించక తప్పదు. యూకేతో బ్రెగ్జిట్ ఒప్పందం వేళ చేసినట్టే... ఇప్పుడూ ఏదో ఒక రాజీ మార్గంలో, అందరి మధ్య సహకారం సాగేలా కొత్త ప్రధాని చేయగలుగుతారా అన్నది ఆసక్తికరమైన అంశం. వచ్చే 7 నుంచి 12 ఏళ్ళ లోగా ఫ్రాన్స్ తన ప్రభుత్వ లోటును 10 వేల కోట్లు యూరోల పైగా తగ్గించనట్లయితే, ఇటలీ లాగానే ఫ్రాన్స్ సైతం అప్పుల సుడిగుండంలో చిక్కుకుపోతుందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అక్టోబర్ 1లోగా కొత్త ప్రధాని, ఆర్థిక మంత్రితో కలసి 2025 బడ్జెట్ ముసాయిదాతో బిల్లుకు రూపకల్పన చేయాల్సి ఉంది. అది అతి కీలకమైన మొదటి అడుగు. అదే సమయంలో దేశాన్ని ఒక్క తాటి మీదకు తీసుకురావడానికే తాను పగ్గాలు చేపట్టినట్టు ఫ్రెంచ్ ప్రజానీకానికి ఆయన నచ్చజెప్పగలగాలి. ఏమైనా, ప్రజలు, పార్టీల మధ్య నెలకొన్న తీవ్ర స్థాయి విభేదాలతో ఫ్రెంచ్ రిపబ్లిక్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉంది. అది ఈ ఘన ప్రజాస్వామ్యా నికి పెను ముప్పు. ఆ ప్రమాదాన్ని తప్పించడంతో పాటు ఇంకా అనేక సమస్యలను కొత్త ప్రధాని నేతృత్వంలోని ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంది. ఇప్పటికే పాలన పూర్తిగా అటకెక్కిన ఫ్రాన్స్‌ను ఆ దేశపు అతి పెద్ద వయసు ప్రధాని, అధ్యక్షుడు కలసి ఎలా ముందుకు నడిపిస్తారో వేచి చూడాలి. -
దివ్యమైన రికార్డు
పది రోజుల క్రీడా సంరంభానికి తెర పడింది. ప్యారిస్‌లో వేసవి ఒలింపిక్స్ ముగిసిన వెంటనే కొద్ది రోజులకే ఆరంభమైన పారాలింపిక్స్ ఆదివారం పూర్తయ్యేసరికి భారత బృందం కొత్త చరిత్ర సృష్టించింది. కనివిని ఎరుగని రీతిలో 29 పతకాలు (7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు) సాధించి సత్తా చాటింది. వెంట్రుక వాసిలో తప్పిపోయిన పతకాలను కూడా సాధించి ఉంటే, ఈ స్కోర్ 30 దాటిపోయేది. సాధారణ ఒలింపిక్స్‌లో ఇప్పటికీ రెండంకెల స్కోరును సాధించలేకపోయిన మన దేశం, దివ్యాంగులైన క్రీడాకారులతో సాగే పారాలింపిక్స్‌లో మాత్రం వరుసగా రెండుసార్లు ఆ ఘనత సాధించడం విశేషం. త్రుటిలో తప్పిన పతకాలతో ఈ ఏటి ప్యారిస్ సాధారణ ఒలింపిక్స్ మిశ్రమ ఫలితాలు అందిస్తే, ఈ పారాలింపిక్స్ మాత్రం మరిన్ని పతకాలతో ఉత్సాహం పెంచాయి. పైగా, ఆ ఒలింపిక్స్‌తో పోలిస్తే ఈ క్రీడా మహోత్సవంలో అయిదు రెట్లు ఎక్కువ పతకాలు సాధించడం గమనార్హం. మొత్తం 549 పతకాలకు జరిగే ఈ పోటీల్లో 23 క్రీడాంశాలకు గాను 12 అంశాల్లోనే పాల్గొన్న మన బృందం ఈసారి పతకాల పట్టికలో టాప్ 20లో నిలవడం చిరస్మరణీయం.మూడేళ్ళ క్రితం 2021 టోక్యో పారాలింపిక్స్‌లో మనం 19 పతకాలు గెలిచి చరిత్ర సృష్టిస్తే, ఇప్పుడు అంతకన్నా మరో 10 ఎక్కువ సాధించి, సంచలనం రేపాం. నిజానికి, 1972లో మురళీకాంత్ పేట్కర్ భారత్ పక్షాన తొట్టతొలి పారాలింపిక్ పతక విజేత. 1984లో మాలతీ కృష్ణమూర్తి హొల్లా భారత్ పక్షాన తొలి మహిళా పారాలింపియన్. అయితే, 2016 వరకు మన మహిళలెవ్వరూ పతకాలు సాధించలేదు. అప్పటి నుంచి పారాలింపిక్స్‌లో భారత్ పక్షాన కేవలం ముగ్గురంటే ముగ్గురు మహిళలే (దీపా మాలిక్ – 2016లో రజతం, అవనీ లేఖరా – 2020లో స్వర్ణం – కాంస్యం, భావినా పటేల్ – 2020లో రజతం) విజేతలుగా నిలిచారు. అలాంటిది ఈసారి భారత్ పక్షాన పతకాలు సాధించినవారిలో 10 మంది మహిళలే. తాజాగా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్‌లో స్వర్ణంతో ఇప్పటికి 2 పారాలింపిక్ స్వర్ణాలు గెలిచిన అవని మినహా మిగతా తొమ్మిది మందీ సరికొత్త విజేతలే. మన మహిళా అథ్లెట్లకు పారాలింపిక్స్‌లో ఇది అసాధారణ విజయం. ఎవరికి వారు ఎన్నో సవాళ్ళను అధిగమిస్తూ, అంచనాల ఒత్తిడిని తట్టుకొని ఈ ఘనత సాధించారు. ప్రతి ఒక్కరిదీ ఒక్కో స్ఫూర్తిగాథ. ముఖ్యంగా తెలుగు బిడ్డ దీప్తి జీవాంజి లాంటివారి కథ మనసుకు హత్తుకుంటుంది. దివ్యాంగురాలైన ఆమె ఆటల్లో పైకి వచ్చి, పతకాల కల నెరవేర్చేందుకు తల్లితండ్రులు ఎన్నో త్యాగాలు చేశారు. ఆఖరికి వరంగల్‌లోని తమ భూమి కూడా అమ్మేశారు. దీప్తి తాజా పారాలింపిక్స్‌లోనూ పతకం సాధించడమే కాక, తనను వదిలేయకుండా ఇంత పైకి తీసుకొచ్చిన కన్నవారి కోసం అదే స్థలాన్ని తిరిగి కొని బహూకరించడం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే మానవీయ గాథ. ఇలాంటి కథలు ఇంకా అనేకం. ఇక, పేరున్న క్రీడా తారలైన జావలిన్ త్రోయర్ సుమిత్ ఆంటిల్, హైజంపర్ మారియప్పన్ తంగవేలు లాంటి వారే కాక అంతగా ప్రసిద్ధులు కాని అథ్లెట్లు సైతం ఈసారి పతకాల విజేతలుగా నిలవడం విశేషం. పతకాలు సాధించడమే కాక, పలువురు భారతీయ అథ్లెట్లు సరికొత్త మైలురాళ్ళను చేరుకొని, చరిత్ర సృష్టించడం గమనార్హం. క్రీడాసంఘాలను రాజకీయ పునారావాస కేంద్రాలుగా మార్చి, వాటిని అవినీతి, ఆశ్రిత పక్షపాతాలకు నెలవుగా మారిస్తే జరిగే అనర్థాలు అనేక చోట్ల చూస్తూనే ఉన్నాం. రెజ్లింగ్ సంఘం లాంటి చోట్ల గత రెండేళ్ళలో జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. అలాంటివాటి వల్ల ఒలింపిక్స్ సహా అంతర్జాతీయ వేదికలపై పతకాలు పోగొట్టుకున్నాం. పారాలింపిక్స్‌లో మాత్రం మెరుగైన ప్రదర్శన చూపగలిగామంటే ఆ జాడ్యాలు ఇక్కడ దాకా పాకలేదని సంతోషించాలి. కేంద్రం, కార్పొరేట్ సంస్థలు అందించిన తోడ్పాటు ఈ దివ్యాంగ క్రీడాకారులకు ఊతమైందని విశ్లేషకుల మాట. గడచిన టోక్యో గేమ్స్‌కు రూ. 26 కోట్లు, 45 మంది కోచ్‌లతో సన్నాహాలు సాగించిన ప్రభుత్వం ఈసారి రూ. 74 కోట్లు ఖర్చు చేసి, 77 మంది కోచ్‌లతో తీర్చిదిద్దడం ఫలితాలిచ్చింది. వివిధ దేశాల నుంచి దాదాపు 4400 మందికి పైగా పారా అథ్లెట్లు పాల్గొన్న ఈ క్రీడా సమరంలో మన దేశం నుంచి ఎన్నడూ లేనంతగా ఈసారి 84 మంది పాల్గొన్నారు. ఈ ప్రపంచ పోటీలకు దాదాపు 20 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడవడం, రోజూ ఈ జీవన విజేతల విన్యాసాలు చూసేందుకు స్టేడియమ్ నిండుగా జనం తరలిరావడం చెప్పుకోదగ్గ విషయం. మరి, చెదరని పోరాటపటిమతో శారీరక, సామాజిక అవరోధాలన్నిటినీ అధిగమిస్తున్న దివ్యాంగులకు మన దేశంలో పాలకులు చేయవలసినంత చేస్తున్నారా అన్నది మాత్రం ప్రశ్నార్థకమే. ‘దివ్యాంగుల హక్కుల చట్టం– 2016’ లాంటివి ఉన్నా, ఇవాళ్టికీ మనదేశంలో మహానగరాల్లో సైతం పాఠశాలల్లో, ప్రయాణ సాధనాల్లో, కార్యాలయాల్లో, బహిరంగ ప్రదేశాల్లో వారికి కావాల్సిన కనీస వసతులు మృగ్యం. అయిదేళ్ళలో ఆ పని చేయాలని చట్టపరమైన సంకల్పం చెప్పుకున్నా, ఆచరణలో జరిగింది అతి తక్కువన్నది నిష్ఠురసత్యం. చివరకు చట్టం కింద చేపట్టాల్సిన పథకాలకూ కేంద్ర ప్రభుత్వం నిధుల్లో కోతలు పెట్టడం విషాదం. ఈ పరిస్థితి మారాలి. సమాజంలోనూ, సర్కార్పరంగానూ ఆలోచన తీరూ మారాలి. ఆ రకమైన ప్రోత్సాహంతో దివ్యాంగులు మరింత పురోగమించ గలరు. తాజా విజయాల రీత్యా మనవాళ్ళకు మరింత అండగా నిలిస్తే, విశ్వవేదికపై వారు భారత ఖ్యాతిని ఇనుమడింపజేయగలరు. అలా చూసినప్పుడు ప్యారిస్ పారాలింపిక్స్ విజయాలు ఆరంభం మాత్రమే. వచ్చే 2028 నాటి లాస్ ఏంజెల్స్ గేమ్స్‌కు అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, పారా అథ్లెట్స్ ప్రతిభ తోడై ఇదే దూకుడు కొనసాగిస్తే అద్భుతాలూ జరుగుతాయి. -
2030 యూత్ ఒలింపిక్స్‌కు బిడ్ వేయనున్న భారత్
న్యూఢిల్లీ: 2030 యూత్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా వెల్లడించారు. 2036 ఒలింపిక్స్ నిర్వహణ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని... ఆ క్రమంలో 2030 యూత్ ఒలింపిక్స్‌కు బిడ్ వేయనున్నట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గనిర్దేశకత్వంలో 2030 యూత్ ఒలింపిక్స్ నిర్వహణ కోసం బిడ్ వేయనున్నాం. మా ప్రధాన దృష్టి మాత్రం 2036 ఒలింపిక్స్ నిర్వహణపైనే ఉంది’ అని ఆదివారం ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో మాండవియా పేర్కొన్నారు. కాగా, 2030 యూత్ ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం పెరూ, కొలంబియా, మెక్సికో, థాయ్‌లాండ్, మంగోలియా, రష్యా, ఉక్రెయిన్, బోస్నియా హెర్జెగోవినాలతో భారత్ పోటీ పడాల్సి ఉంటుంది. -
ఎక్కుపెట్టిన బాణాలు.. ఈ'విల్' కారులు!
సాక్షి, సిటీబ్యూరో: దేశంలో హైదరాబాద్‌కు ఒలింపియన్స్ సిటీగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి పీవీ సింధూ, సైనా నెహా్వల్, గుత్తా జ్వాల, నగరంతో అనుబంధమున్న గగన్ నారంగ్ వంటి వారు ఒలింపిక్స్ మెడల్స్ సాధించడమే కారణం. అంతేకాకుండా పుల్లెల గోపీచంద్ ఆధ్వర్యంలో ఒలింపియన్స్ సన్నద్ధమైంది కూడా ఇక్కడే. ఇలా నగరం నుంచి బ్యాడ్మింటన్, టెన్నిస్, క్రికెట్, హాకీ, చెస్, రైఫిల్ షూటింగ్ వంటి పలు అంతర్జాతీయ క్రీడల్లో ప్రాతినిథ్యం వహించి నగర ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేశారు. ఇదే కోవలో ఆర్చరీ క్రీడ కూడా భవిష్యత్‌లో రాణించనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆర్చరీకి ప్రాధాన్యత చాలా పెరుగుతోంది. ఈ సారి ఒలింపిక్స్‌లో తెలుగు క్రీడా కారుడు ధీరజ్ 4వ స్థానంలో నిలిచిన సంగతి విధితమే. భారతీయ క్రీడా చరిత్రలో తమకంటూ ఒక పేజీ రాసుకోవాలనుకునే నగర క్రీడాకారులు విల్లంబులు చేతబట్టి ఒలింపిక్ వేటకు సిద్ధమవుతున్నారు.ఆర్చరీపై భాగ్యనగర వాసుల గురి..జాతీయ స్థాయి టాప్ 2లో నగర అమ్మాయిలు, టాప్ 8లో అబ్బాయిలు..ఏ క్రీడ ఆడాలన్నా, శిక్షణ పొందాలన్నా మరో క్రీడాకారుడు ఉండాల్సిందే. ఇలా కాకుండా ఇండివీడ్యువల్ గేమ్ (వ్యక్తిగత క్రీడ) విభాగంలో ఆర్చరీ ఒకటి. గత కొన్ని ఏళ్లుగా ఈ గ్లామర్ గేమ్‌పై నగర క్రీడా అభిలాషకులు ఫోకస్ పెట్టారు. నగరం నుంచి ఇప్పటికే పలు క్రీడల్లో చాలా మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడంతో తమను తాము నిరూపించుకోవడానికి ఆర్చరీని ఎంచుకుంటున్నారు. అంతేకాకుండా ఇతర క్రీడల్లో కొనసాగుతున్న పోటీని తప్పించుకోవడానికి కూడా ఆర్చరీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మధ్య కాలంలో నేషనల్స్‌లో నగర ఆర్చరీ క్రీడాకారులు రాణిస్తుండటం మరింత ప్రోత్సాహాన్ని అందిస్తోంది. తెలంగాణలో ఆర్చరీ శిక్షణ అందించే ‘సాయ్’ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ సెంటర్, గచి్చబౌలి), హకీం పేట్ స్పోర్ట్స్ స్కూల్ రెండూ నగరానికి అనుబంధమున్నవే. వీటితో పాటు నగరంలో దాదాపు ఎనిమిది ప్రైవేటు శిక్షణా కేంద్రాలున్నాయి. ఈ అంశాల దృష్ట్యా ఇక్కడ ఆర్చరీ క్రీడాకారుల సంఖ్య పెరుగుతోంది. నేషనల్స్‌లో వెయ్యి మంది రాణింపు..జాతీయ స్థాయిలో టాప్ 2లో నా విద్యార్థులు ఉన్నారు. 2000 సంవత్సరంలో ఆర్చరీ ప్రారంభించిన నేను ఏడేళ్ల పాటు 23 విభాగాల్లో నేషనల్స్, ఆల్ ఇండియా యూనివర్సిటీ నేషనల్ ఛాంపియన్స్ ఆడాను. 7 నేషనల్స్‌లో పతకాలు సాధించాను. ఆల్ ఇండియా యూనివర్సిటీ ఛాంపియన్‌గా నిలిచాను. అనంతరం మేటి ఆర్చర్స్‌ను తయారు చేయడమే లక్ష్యంగా 2008 నుంచి శిక్షణ ప్రారంభించాను. ఇప్పటి వరకూ నా శిక్షణలో వెయ్యి మందికి పైగా నేషనల్స్ ఆడారు. కొందరు యూత్ ఒలింపిక్స్ ఇండియా క్యాంపుకు వెళ్లారు.దాదాపు 3 వేల మందికి పైగా శిక్షణ అందించాను. ఫ్రెండ్స్ అండ్ ఆర్చర్స్ ట్రైనింగ్ సెంటర్ పేరుతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, ఖైరతాబాద్, ప్రగతి నగర్, నార్సింగిలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి అథ్లెట్లను తయారు చేస్తున్నాను. 2028 ఒలింపిక్స్ పతకమే లక్ష్యంగా అద్భుతమైన నైపుణ్యాలున్న ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలను సన్నద్ధం చేస్తున్నాను. ఆర్చరీ శిక్షణతో పాటు వీరికి అవసరమైన ఫిట్నెస్, ఫిజియోథెరపీ, సైకాలజీ కౌన్సిలింగ్, స్పెషల్ ట్యూనింగ్ అందిస్తున్నాం. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆర్చరీకి మంచి భవిష్యత్ ఉంది. రీకర్వ్, కాంపౌండ్ విభాగాల్లో మన ఆర్చర్స్ అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రభుత్వం తరపున మంచి భద్రతా ప్రమాణాలతో మరిన్ని ఆర్చరీ గ్రౌండ్స్ నిర్మిస్తే వందల మంది ఆర్చర్స్కు అవకాశం ఉంటుంది. ఎక్విప్మెంట్ అందించగలిగితే ఆర్చరీ మరింత రాణిస్తుంది. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ వంటి ప్రాంతాల్లో అద్భుతమైన కోచ్‌లు ఉన్నారు. నా అకాడమీ తరపున చాలా మంది పేద పిల్లలకు ఆర్చరీలో సహకారం అందిస్తున్నాను. వారిలో రాజ్‌భవన్ స్కూల్‌కు చెందిన వైభవ్ నేషనల్స్ మెడల్ సాధించాడు. మరో అమ్మాయి లలితా రాణి నేషనల్స్ ఆడి సత్తా చాటింది. – రాజు, ఆర్చరీ నేషనల్స్ ఛాంపియన్, ప్రముఖ కోచ్, ఫ్రెండ్స్ అండ్ ఆర్చెర్స్ ఆర్చరీ ట్రైనింగ్ సెంటర్.నగర వేదికగా..నగరం వేదికగా దాదాపు 150 మంది ఆర్చరీ అథ్లెట్స్ ఉన్నారని అంచనా. జాతీయ స్థాయిలో హైదరాబాద్ టీం రెండో స్థానంలో ఉన్నట్లు క్రీడా నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా జాతీయ స్థాయి సీనియర్స్, జూనియర్స్ విభాగంలో నగరానికి చెందిన అమ్మాయిలు ఇద్దరూ సిల్వర్ మెడల్స్ సాధించగా, అబ్బాయిలు ఎనిమిదో స్థానంలో నిలిచారని పేర్కొన్నారు.ఆరు కేటగిరీల్లో..ఆర్చరీకి సంబంధించి నేషనల్స్‌లో అండర్ 10, 13, 15, 17, 19, అబౌ 19 విభాగాలు ఉంటాయి. ఒలింపిక్స్‌కు అయితే ఎలాంటి ప్రమాణాలూ ఉండవు. ఎవరైనా పోటీ పడొచ్చు. ఆరు కేటగిరీల్లో ఈ ఎంపిక కొనసాగుతోంది. మెదటి దశ ఓపెన్ కేటగిరీలో దేశవ్యాప్తంగా ఎవరైనా పోటీ పడొచ్చు. ఇందులోంచి టాప్ 32, టాప్ 16, టాప్ 8, టాప్ 6 ఇలా ఎంపిక చేసి చివరగా ముగ్గురిని ఒలింపిక్స్‌కు పంపిస్తారు.2028 ఒలింపిక్స్ లక్ష్యంగా.. 12 ఏళ్ల వయస్సు నుంచి ఆర్చరీలో రాణిస్తున్నాను. ఇప్పటి వరకూ ఎనిమిది నేషనల్స్ ఆడాను. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన నేషనల్స్‌లో ఒక గోల్డ్, మరో సిల్వర్ మెడల్ సాధించాను. 2028 ఒలింపిక్స్‌లో ఆడి పతకం సాధించడమే లక్ష్యంగా శిక్షణ కొనసాగిస్తున్నాను. ప్రస్తుతం మోయినాబాద్ కాలేజ్‌లో పీజీ చదువుతున్నాను. – హర్షవర్ధన్నాలుగు నేషనల్స్ ఆడాను..కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాను. ఇప్పటి వరకూ గుజరాత్, ఉత్తరాఖండ్, తమిళనాడు వంటి ప్రాంతాల్లో నాలుగు నేషనల్స్ ఆడాను. అసోసియేషన్ నేషనల్స్, ఫుల్ నేషనల్స్‌లో పోటీ పడ్డాను. భారతీయ ఆర్చర్‌గా ఒలింపిక్స్‌లో సత్తా చాటి దేశ ఖ్యాతిని మరింత పెంచడమే లక్ష్యం. – లలితా రాణి -
ఆడుకుందాం రండి
‘ఎప్పుడూ ఆటలేనా... చదువుకోవచ్చు కదా’ అనే తల్లిదండ్రులే ఎక్కువ. ‘ఎప్పుడూ చదువేనా... ఆటలు కూడా ఆడవచ్చు కదా’ అనే తల్లిదండ్రులు అతి తక్కువ. చదువు విషయంలోనే కాదు ఆటల్లో కూడా పిల్లలను ్రపోత్సహిస్తే చారిత్రక అద్భుతాలు జరుగుతాయని చెప్పడానికి బలమైన ఉదాహరణ... స్టార్ షూటర్ మను బాకర్. ‘మీకు డాక్టర్ లేదా ఇంజినీర్ కావాలని లేదా... అయితే ఆటల ప్రపంచంలోకి రండి. అదొక అద్భుత ప్రపంచం’ అంటుంది ఒలింపిక్స్‌లో డబుల్–మెడల్ గెల్చుకున్న మను బాకర్. విద్యార్థుల దృష్టిని ఆటలపై మళ్లించడానికి నేషనల్ టూర్ చేస్తోంది...తన పర్యటనలో భాగంగా చెన్నైలోని వేలమ్మళ్ నెక్సెస్ స్కూల్‌కు వెళ్లిన మను బాకర్ ఆటలకు ఉండే శక్తి ఏమిటో ఆసక్తికరంగా చెప్పింది. ‘ఆటలు అనే దారి వైపు వచ్చి చూడండి. ఆ దారిలో ముందుకు వెళుతున్న కొద్దీ మీలో ఉత్సాహం, శక్తి అంతకంతకూ పెరుగుతూ పోతాయి’ అంటుంది మను.‘టోక్యో ఒలింపిక్స్‌లో నా గురి తప్పింది. ఓటమి పలకరించింది. అలా అని నిరాశలోనే ఉండిపోలేదు. ఆటలో గెలుపు ఎంత సహజమో, ఓటమి అంతే సహజం. గెలుపు ఓటములు ఆటలో శాశ్వతం కాదు. ఆటలో ఉన్న అందం, అద్భుతం ఇదే’ అంటుంది మను.‘డ్రీమ్ బిగ్’ అని మను అన్నప్పుడు పిల్లలు చప్పట్లు కొట్టారు. ‘మనం ఒక లక్ష్యం ఏర్పర్చుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకుంటామా లేదా అనేది పూర్తిగా మన మీదే ఆధారపడి ఉంటుందంటూ తన గత అనుభవాలను విద్యార్థులతో పంచుకుంది.‘ఆర్థికంగా ఉన్నతస్థితిలో ఉన్న కుటుంబాలకు చెందిన పిల్లలకే ఆటలు సరిపోతాయి. పేద, మధ్యతరగతి పిల్లలకు కష్టం’ అనే అపోహను తోసిపుచ్చింది మను. ‘ఆత్మస్థైర్యం నుంచి ఆర్థికసహాయం వరకు క్రీడా ప్రపంచంలో ఏది కష్టం కాదు. మీరు పెద్ద కల కంటే పెద్ద విజయాన్ని సాధిస్తారు. పేదరికం మీకు ఎప్పుడూ అడ్డు కాదు. ఈ విషయాన్ని చరిత్ర ఎన్నోసార్లు నిరూపించింది’ అంటుంది మను బాకర్. ‘మీ ఇన్స్పిరేషన్ ఎవరు?’ అనే ప్రశ్నకు– ‘ఇంకెవరు... మా అమ్మే’ అని చెప్పింది మను. ‘ఎప్పుడూ ఆటలేనా!’ అని ఎప్పుడూ అనేది కాదు ఆమె. ఆటల్లో కూతురు చూపుతున్న ప్రతిభకు సంతోషించేది.‘క్రీడల్లో పిల్లలు రాణించడం, పెద్దస్థాయికి చేరుకోవడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉంది’ అంటుంది మను బాకర్.ఆటలు ఇంకా ఏం చేస్తాయి? మను మాటల్లో చె΄్పాలంటే ప్రపంచాన్ని చూపిస్తాయి. ‘షూటింగ్ కెరీర్ వల్ల ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరిగాను. దీనివల్ల రకరకాల మనుషులు, రకరకాల సంస్కృతులు, చరిత్ర, పోరాటాలు... ఒక్కటా రెండా ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది. నేను ఆటల్లోకి రాకపోయి ఉంటే ఇది సాధ్యమయ్యేది కాదు’ అంటుంది మను.‘మనం ఎక్కడి నుంచి వచ్చామనేది కాదు ఎక్కడికి వెళ్లాలనేది ముఖ్యం’ అంటారు పేదరిక నేపథ్యం నుంచి వచ్చిన విజేతలు. ఇదే విషయాన్ని పిల్లలకు చెబుతుంటుంది మను.‘మేము పేదవాళ్లం, నాకు ఇంగ్లీష్ రాదు, నేను బలహీనంగా ఉంటాను, ఇతరులతో పోటీ పడగలనా... ఇలాంటి ఆలోచనలేవీ పెట్టుకోవద్దు. ఎన్ని పరిమితులు ఉన్నా కష్టపడే తత్వం, అంకితభావం ఉంటే మన ప్రయాణానికి అవేమీ అడ్డు కాదు. ప్రయాణం ఎలా చేస్తున్నాం అనేది ముఖ్యం. నా విషయానికి వస్తే... మొదట్లో నాకూ ఇంగ్లీష్ పెద్దగా రాదు, ఇతరులతో ఎలా మాట్లాడాలో తెలియదు. ఏమీ తెలియదు... అనుకుంటే అక్కడే ఉండిపోతాం. తెలుసుకుంటాను’... అనే పట్టుదల ఉంటే తెలుసుకోగలం. నేను ఎంతోమంది వ్యక్తుల నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. కొత్త విషయాల గురించి తెలుసుకోవడానికి తల్లిదండ్రుల నుంచి ఉపాధ్యాయుల వరకు ఎవరితోనైనా మాట్లాడవచ్చు’ అంటుంది మను.‘మీకు ఎన్నో కెరీర్ ఆప్షన్లు ఉన్నాయి. అవేమీ మీకు ఆసక్తిగా లేకపోతే ఆటల ప్రపంచంలోకి రండి’ అని విద్యార్థులను ఆహ్వానిస్తోంది మను బాకర్. ఆమె మాటల స్ఫూర్తి ఎంతోమందికి విజయ మంత్రం కావాలని ఆశిద్దాం. -
Manpreet Singh: ‘లాస్ట్’ ఏంజెలిస్!
న్యూఢిల్లీ: ఒకవేళ ఫిట్నెస్ సహకరిస్తే...2028లో జరిగే లాస్ ఏంజెలిస్ (ఎల్ఏ) ఒలింపిక్స్‌లోనూ ఆడి కెరీర్‌కు గుడ్‌బై చెబుతానని భారత హాకీ జట్టు స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ తెలిపాడు. 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మూడేళ్ల క్రితం టోక్యో విశ్వక్రీడల్లో కాంస్య పతకాన్ని గెలిచిన భారత జట్టుకు మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వం వహించాడు. తాజా పారిస్ ఒలింపిక్స్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత్ కాంస్య పతకాన్ని నిలబెట్టుకుంది. ఈ విజయంలోనూ కీలకపాత్ర పోషించిన మన్‌ప్రీత్ వరుస ఒలింపిక్స్ పతకాల్లో భాగమయ్యాడు. ఇప్పటివరకు నాలుగు ఒలింపిక్స్ ఆడిన మన్‌ప్రీత్ దిగ్గజాలు ఉధమ్ సింగ్, లెస్లీ క్లాడియస్, ధనరాజ్ పిళ్లై, ఇటీవలే రిటైరైన గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ సరసన నిలిచాడు. భారత హాకీకి శ్రీజేశ్ చేసిన సేవలు అందరికీ తెలుసని అన్నాడు. అతనో గ్రేటెస్ట్ ప్లేయర్ అని కితాబిచ్చాడు. సరిగ్గా ఒలింపిక్స్‌కు ముందు స్విట్జర్లాండ్‌లో మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన శిబిరం జట్టుకు బాగా ఉపకరించిందన్నాడు. ఓ ఇంటర్వ్యూలో 32 ఏళ్ల స్టార్ మిడ్‌ఫీల్డర్ తన భవిష్యత్ లక్ష్యాలతో పాటు వరుస ఒలింపిక్ పతకాలపై తన మనోగతాన్ని వివరించాడు. లక్ష్యం ఎల్ఏ–2028 ‘లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌ను లక్ష్యంగా పెట్టుకున్నాను. అయితే ఇది సాధించాలంటే నేను పూర్తిస్థాయి ఫిట్నెస్తో ఉండాలి. నేను ఇలాగే ఫామ్‌ను కొనసాగిస్తూ... ఫిట్నెస్ను కాపాడుకుంటేనే లక్ష్యం చేరుకోగలను. ఇప్పుడు హాకీలో ఫిట్నెస్ ప్రధాన భూమిక పోషిస్తోంది. మైదానంలో చురుకైన పాత్రకు ఇదే కీలకం. ఆ తర్వాతే మిగతావన్నీ’ అని మన్‌ప్రీత్ చెప్పాడు. అదృష్టవశాత్తూ ఈ వెటరన్ స్టార్ సుదీర్ఘ కెరీర్లో చెప్పుకోదగ్గస్థాయిలో గాయాల బారిన పడలేదు. 378 అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లాడిన అతను 44 గోల్స్ చేశాడు. వరుస ఒలింపిక్ పతకాలు ‘ఏ అథ్లెట్ లక్ష్యమైనా ఒలింపిక్ పతకమే! అది ప్రతిఒక్కరి కల. మేం మూడేళ్ల క్రితం టోక్యోలో... ఇప్పుడేమో పారిస్‌లో ఇలా వరుస ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కొన్ని దశాబ్దాల తర్వాతే భారత్... హాకీలో ఇలా వరుస విశ్వక్రీడల్లో పతకాలు గెలిచింది. నేను ఇప్పటివరకు నాలుగు ఒలింపిక్స్ ఆడాను. తొలి రెండు మెగా ఈవెంట్లలో పతకాల్లేవు. కానీ తర్వాత రెండు ఈవెంట్లలో పతకం కల నెరవేరడంతో నా ఆనందానికి హద్దుల్లేవు’ అని హర్షం వ్యక్తం చేశాడు. జట్టు కోసం ఏ పాత్రకైనా... పారిస్‌లో బ్రిటన్‌తో జరిగిన కా>్వర్టర్ ఫైనల్ పోరులో అమిత్ రోహిదాస్‌కు ‘రెడ్ కార్డ్’ పడటంతో జట్టు పది మందితోనే ఆడాల్సి వచి్చంది. అప్పుడు మన్‌ప్రీత్ డిఫెండర్‌గా రక్షణపంక్తిలో ఉండి జట్టును ఆదుకున్నాడు. ‘నేను దేనికైనా సిద్ధంగా ఉంటాను. జట్టు అవసరాల కోసం నా స్థానం మారినా, ఎక్కడ సర్దుబాటు చేసినా సరే! జట్టు ఏం డిమాండ్ చేస్తే అదే పని నేనూ చేస్తాను. ఇందుకోసం నేను శిక్షణ తీసుకున్నా. ప్రొ లీగ్ హాకీ మ్యాచ్‌ల్లో ఆదే చేశాను. కాబట్టే నా స్థానం మారినా నాకే బెంగ ఉండదు. కష్టమని అనిపించదు. జట్టులో నేను ఎంత కీలకమో... నా బాధ్యతలెంటో నాకు బాగా తెలుసు. మా ప్రణాళికల్ని అమలు చేసేందుకు ఎల్లప్పుడు రెడీగా ఉంటాను’ అని అన్నాడు. మెడలో పతకం... పక్కన భార్యాపిల్లలు! భార్యాపిల్లల సమక్షంలో పతకం గెలుపొందడం చాలా ఆనందాన్నిచి్చందని చెపుకొచ్చాడు. ‘పతకాల ప్రదానోత్సవం ముగిసిన వెంటనే నా భార్య ఇలి నజ్వా సాదిక్ (మలేసియన్), కుమార్తె జాస్మిన్ గ్రౌండ్లోకి రావడం... వారితో నేను సాధించిన పతకం, నా సంతోషం పంచుకోవడం చాలా గొప్ప అనుభూతినిచి్చంది’ అని మన్‌ప్రీత్ చెప్పాడు. మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో తాను సాధించిన కాంస్య పతకాన్ని తల్లి మెడలో వేసిన మన్‌ప్రీత్ ‘పారిస్’ నుంచి తిరిగి వచి్చన వెంటనే అలాగే చేశాడు. -
ఇప్పట్లో రిటైర్ అయ్యే ఆలోచనే లేదు.. ఒలింపిక్స్‌లోనూ: స్మిత్
అంతర్జాతీయ క్రికెట్‌కు ఇప్పట్లో వీడ్కోలు పలికే ఆలోచన తనకు లేదని ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్ స్పష్టం చేశాడు. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్-2028లో ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించాడు. తన బ్యాటింగ్ పవర్ ఇంకా తగ్గలేదని.. పొట్టి ఫార్మాట్లో రాణించగలననే విశ్వాసం వ్యక్తం చేశాడు.పరుగుల వీరుడుఆస్ట్రేలియా తరఫున 2010లో అరంగేట్రం చేసిన స్మిత్.. ఇప్పటి వరకు 109 టెస్టులు, 158 వన్డేలు, 67 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 32 సెంచరీలు, 4 డబుల్ సెంచరీల సాయంతో 9685 పరుగులు చేసిన ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. వన్డేల్లో 12 శతకాలు బాది.. 5446 రన్స్ స్కోరు చేశాడు. అయితే, టీ20లలో మాత్రం స్మిత్ సగుటన 24.86తో కేవలం 1094 పరుగులు మాత్రమే చేయగలిగాడు.యువ ఆటగాళ్ల నుంచి పోటీ నేపథ్యంలో గత కొంతకాలంగా ఆసీస్ టీ20 జట్టులో అరకొర అవకాశాలే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. స్మిత్ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, 35 ఏళ్ల స్మిత్ మాత్రం తన బ్యాటింగ్‌లో పస ఇంకా తగ్గలేదంటున్నాడు. బిగ్‌బాష్ లీగ్ ఫ్రాంఛైజీ సిడ్నీ సిక్సర్‌తో ఇటీవలే మూడేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకున్న ఈ సిడ్నీ క్రికెటర్... మరో నాలుగేళ్ల పాటు టీ20 క్రికెట్ ఆడగలనని తెలిపాడు.ఒలింపిక్స్‌లోనూ భాగమైతే.. ‘‘ప్రపంచంలోని ఫ్రాంఛైజీ క్రికెట్లో.. మిగతా ఆటగాళ్లతో పోలిస్తే నేనే ఎక్కువ లీగ్‌లలో భాగమయ్యాను. మరో నాలుగేళ్ల పాటు టీ20 క్రికెట్ ఆడగల సత్తా నాకుంది. కాబట్టి.. రిటైర్మెంట్ గురించి ఇప్పటి నుంచే ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం... ఆటకు వీడ్కోలు పలకాలనే ఆలోచనే లేదు. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లోనూ భాగమైతే ఇంకా బాగుంటుంది’’ అని స్టీవ్ స్మిత్ చెప్పుకొచ్చాడు.టీమిండియా పటిష్ట జట్టు ఇక భారత్‌తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ గురించి మాట్లాడుతూ.. ‘‘టీమిండియాతో సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇండియా పటిష్టమైన జట్టు. ప్రపంచంలోని రెండు అత్యుత్తమ జట్ల మధ్య పోటీని అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అని స్మిత్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. రానున్న విశ్వ క్రీడల ఎడిషన్‌లో క్రికెట్‌ను తిరిగి ప్రవేశపెట్టేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఫలితంగా 128 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు క్రికెట్ ఒలింపిక్స్‌లో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఇందులో భాగంగా పొట్టి ఫార్మాట్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
ఒలింపిక్స్-2036 ఆతిథ్యానికి భారత్ సన్నద్ధం: ప్రధాని మోదీ
భారత్ వేదికగా విశ్వ క్రీడలు నిర్వహించాలన్న ఆశయానికి చేరువవుతున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఒలింపిక్స్-2036కు ఆతిథ్యం ఇచ్చే దిశగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా.. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో పాల్గొన్న భారత అథ్లెట్లకు ఆయన అభినందనలు తెలిపారు. అదే విధంగా.. ప్యారిస్ పారాలింపిక్స్‌లో పాల్గొనబోతున్న అథ్లెట్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోనే విశ్వ క్రీడలు నిర్వహించాలన్న భారత్ కల సమీప భవిష్యత్తులో నెరవేరనుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.వారికి అభినందనలుఈ మేరకు.. ‘‘ఒలింపిక్స్‌లో భారత జెండాను ఎగురవేసిన యువ అథ్లెట్లు ఈరోజు మనతో ఉన్నారు. 140 కోట్ల మంది భారతీయుల తరఫున వారందరికీ అభినందనలు. మరికొన్ని రోజుల్లో భారత్ నుంచి మరో అతిపెద్ద బృందం ప్యారిస్‌కు వెళ్లబోతోంది. పారాలింపిక్స్‌లో మన అథ్లెట్లు భాగం కాబోతున్నారు. వారందరికీ నా శుభాకాంక్షలు.జీ20 సమావేశం నిర్వహించేందుకు భారత్ సిద్ధమవుతోంది. తద్వారా ప్రపంచస్థాయి ఈవెంట్లను మనం సమర్థవంతంగా పూర్తిచేయగలమని నిరూపించబోతున్నాం. అదే విధంగా.. ఒలింపిక్స్-2036కు ఆతిథ్యం ఇచ్చే దిశగా సన్నాహకాలు మొదలుపెట్టాం’’ అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.ఆరు పతకాలకు పరిమితంకాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో పది పతకాలు లక్ష్యంగా బరిలోకి దిగిన భారత క్రీడా బృందం కేవలం ఆరింటికే పరిమితమైంది. షూటింగ్లో మనూ భాకర్‌కు వ్యక్తిగత కాంస్యంతో పాటు.. సరబ్జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ విభాగంలో మరో కాంస్య పతకం దక్కింది. అదే విధంగా.. త్రీ రైఫిల్ పొజిషన్స్‌లో స్వప్నిల్ కుసాలే కాంస్యం, భారత పురుషుల హాకీ జట్టుకు కాంస్యం, రెజ్లర్ అమన్ సెహ్రావత్‌కు కాంస్యం లభించాయి. ఇక టోక్యో గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఫైనల్లో రెండో స్థానానికి పరిమితమై రజతం సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఆగష్టు 28 నుంచి ప్యారిస్ వేదికగా పారాలింపిక్స్ మొదలుకానున్నాయి. ఇక ఒలింపిక్స్-2028కు అమెరికాలో జరుగనున్నాయి.చదవండి: వినేశ్‌కు చుక్కెదురు -
CSK స్టార్స్ ఒలింపిక్స్‌లో ఈ ఈవెంట్లలో పోటీపడితే?.. (ఫొటోలు)
-
అంతా అబద్ధం
న్యూఢిల్లీ: కేంద్ర క్రీడాశాఖ ఒలింపిక్స్ లక్ష్యంగా ఒక్కో క్రీడాకారుడిపై చేసిన ఖర్చుపై నివేదికను విడుదల చేస్తుంది. అయితే మహిళా డబుల్స్ స్టార్ షట్లర్ అశ్విని పొన్నప్పపై ఆ శాఖ విడుదల చేసిన వ్యయ నివేదికపై ఆమె మండిపడింది. అత్తెసరు, అరకొర సాయం తప్ప అవసరమైన వ్యక్తిగత కోచ్‌నే ఇవ్వలేదని... అలాంటపుడు ఏకంగా రూ. కోటిన్నర తనపై ఖర్చు చేసినట్లు ఎలా చెబుతారని కేంద్ర క్రీడా శాఖ నిర్వాకంపై అసంతృప్తి వెలిబుచ్చింది. ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్’ (టాప్స్) కింద రూ. 4.5 లక్షలు, అలాగే వార్షిక శిక్షణ, టోర్నీల్లో పాల్గొనడం (ఏసీటీసీ) కోసం రూ. 1 కోటి 48.04 లక్షలను అశ్వినిపై ఖర్చు చేసినట్లుగా ‘సాయ్’ వ్యయ నివేదికలో పేర్కొంది. దీనిపై స్పందించిన షట్లర్ ‘ఇది చూసి నేనైతే తేరుకోలేనంత షాక్‌కు గురయ్యాను. నాకు ఆర్థిక సాయం అందలేదనే చింత లేదు కానీ అంత మొత్తం నాకు కేటాయించారనే తప్పుడు నివేదిక ఇవ్వడం ఏంటి. నిజంగా చెబుతున్నా. ‘సాయ్’... క్రీడా శాఖ నివేదికలో వివరించినట్లుగా నేనెలాంటి నిధులు అందుకోలేదు. జాతీయ శిక్షణ విషయానికొస్తే... రూ. కోటిన్నర నిధుల్ని మొత్తం శిబిరంలో పాల్గొన్న క్రీడాకారులపై ఖర్చు పెట్టారు. అంతేతప్ప నా ఒక్కరికే అంత మొత్తం ఇవ్వనేలేదు. ఇంకా చెప్పాలంటే నాకు వ్యక్తిగత కోచే లేడు. క్రీడా శాఖ నియమించనూ లేదు. నా వ్యక్తిగత ట్రెయినర్‌ను సొంతడబ్బులతో నేనే ఏర్పాటు చేసుకున్నా. ఇలా చెబుతున్నది నిజం తెలియాలనే తప్పా నాకు డబ్బులు ఇవ్వాలని కానేకాదు. 2023 నవంబర్ వరకు కూడా నా సొంత ఖర్చులతోనే శిక్షణ తీసుకున్నా, పోటీల్లో పాల్గొన్నా... ఆ తర్వాతే టాప్స్‌కు ఎంపికయ్యా’ అని 34 ఏళ్ల అశ్విని వివరించింది. మేటి డబుల్స్ షట్లర్‌గా ఎదిగిన అశ్విని కామన్వెల్త్ క్రీడల్లో 2010లో స్వర్ణం, 2014లో రజతం, 2018లో కాంస్యం గెలిచింది. 2011 ప్రపంచ చాంపియన్‌షిలో గుత్తా జ్వాలతో కలిసి మహిళల డబుల్స్‌లో కాంస్య పతకాన్ని గెల్చుకుంది. జ్వాలతోనే కలిసి 2012 లండన్ ఒలింపిక్స్, 2016 రియో ఒలింపిక్స్‌లలో డబుల్స్‌లో పోటీపడింది. పారిస్ ఒలింపిక్స్‌లో తనీషాతో కలిసి బరిలోకి దిగిన అశ్విని గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. -
తదుపరి లక్ష్యం స్వర్ణ పతకం: అమన్
న్యూఢిల్లీ: వచ్చే ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే తన లక్ష్యమని ‘పారిస్’ క్రీడల్లో కాంస్యం నెగ్గిన భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ పేర్కొన్నాడు. పురుషుల 57 కేజీల విభాగంలో కాంస్యం గెలవడం ద్వారా భారత్ తరఫున అతి పిన్న వయసులో ఒలింపిక్ మెడల్ సాధించిన అథ్లెట్‌గా రికార్డుల్లోకెక్కిన అమన్... భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించేందుకు కృషి చేస్తానని అన్నాడు. ‘తదుపరి ఒలింపిక్స్‌లో పసిడి పతకం గెలవాలనుకుంటున్నా. దాని కోసం మరింత కఠిన సాధన చేస్తా. పారిస్ క్రీడల్లో కాంస్యం గెలవడం ఆనందంగా ఉంది. పతక పోరుకు ముందు బరువు పెరిగినా... పెద్దగా ఆందోళన చెందలేదు’ అని అమన్ అన్నాడు. మంగళవారం స్వదేశానికి చేరుకున్న అమన్‌ను కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సన్మానించి రూ. 30 లక్షల చెక్ అందజేశారు. -
ఒలింపిక్ క్రీడాకారులకు మెగాస్టార్ అభినందనలు.. వినేశ్ పోగాట్‌పై ప్రశంసలు!
ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులకు మెగాస్టార్ అభినందనలు తెలిపారు. అలాగే ఇండియా తరఫున పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న 117 మంది క్రీడాకారులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మెడల్స్ సాధించిన వారిపై ప్రశంసలు కురిపించారు. మనూభాకర్, సరబ్జీత్ సింగ్, నీరజ్ చోప్రా, స్వప్నిల్ కుశాలే, అమన్ షెరావత్, ఇండియా హాకీం టీమ్‌ను అభినందించారు. వినేశ్ ఫొగాట్ నీవు నిజమైన పోరాట యోధురాలివంటూ కొనియాడారు. ఈ సందర్భంగా వారి ఫోటోలను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్ చూసేందుకు చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. My Heartfelt Congratulations to Our Shooting stars @realManuBhaker 🥉 @SarabjotSingh30 & Manu Bhaker 🥉 #SwapnilKusale 🥉 Our Team #IndianHockey & Legend @16Sreejesh 🥉 Our Javelin champ @Neeraj_Chopra1 🥈 Star wrestler @AmanSehrawat57🥉 To each and every player… pic.twitter.com/VK2hMttDNN— Chiranjeevi Konidela (@KChiruTweets) August 10, 2024 -
వరుసగా రెండో ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన నీరజ్ చోప్రా
-
క్రీడా నైపుణ్యం, మాతృత్వం రెండింటిని ప్రదర్శించిన ఆర్చర్ !
పారిస్ ఒలింపిక్స్‌లో అసమానతలు ధిక్కరించిన అథ్లెట్లలో అజర్బైజాన్ ఆర్చర్ యైలగుల్ రమజనోవా ఒకరు. 35 ఏళ్ల ఈ ఆర్చర్ ఆరు నెలల నిండు గర్భిణి. ప్రతిష్టాత్మకమైన పారిస్ ఒలింపిక్స్ 2024లో పాల్గొని క్రీడా నైపుణ్యాన్ని, మాతృత్వం రెండింటిని ప్రదర్శించి అందరిచే ప్రశంసలందుకుంది. బేబీ బంప్ ఉన్నప్పటికీ ప్రతి షాట్‌ని ఆత్మవిశ్వాసం, సంకల్పబలంతో ప్రదర్శించింది. హృదయాన్ని కదిలించే ఆమె గాథ ఏంటో సవివరంగా చూద్దామా..!చరిత్రలో ఒలింపిక్స్‌లో పాల్గొన్న రెండవ ఆర్చర్ యైలగుల్ రమజనోవా . రియో 2016లో ఓల్కా సెన్యుక్ తర్వాత అజర్‌బైజాన్‌కు తొలిసారిగా ప్రాతినిధ్య వహించిన రెండో ఆర్చర్ ఈ 34 ఏళ్ల రమజనోవా. ఆమె మహిళల వ్యక్తిగత ఆర్చరీ ఈవెంట్లో పాల్గొంది. ఆమె ఎలిమినేషన్ రౌండ్ 1/32లో 28వ ర్యాంక్ చైనీస్ ఆర్చర్ ఆన్ క్విక్సువాన్ను ఓడించింది. అయితే ఆ తర్వాత 1/16 రౌండ్లో జర్మనీకి చెందని మిచెల్ క్రోపెన్ చేతిలో నిష్క్రమించింది. గర్భవతిగా ఉన్న ఒలింపియన్‌గా తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. అందులో పర్ఫెక్ట్ 10 షూట్ చేయడానికి ముందు తన బేబీ కిక్‌ను అనుభవించిన అనుభవాన్ని వివరించింది. "నేను ఈ చివరి బాణాన్ని వేసే ముందు నా బిడ్డ నన్ను తన్నినట్లు నేను భావించాను, ఆపై నేను 10 షూట్స్ ప్రదర్శించాను. అలాగే ఈ ఒలింపిక్స్ కోసం శిక్షణ సమయంలో నా గర్భంతో నేను అసౌకర్యంగా భావించలేదు. బదులుగా, నేను ఒంటరిగా పోరాడడం లేదని, నా బిడ్డతో కలిసి పోరాడుతున్నానని నాకు అనిపించింది… నా పిల్లవాడికి లేదా ఆమెకు ఆసక్తి ఉంటే నేను విలువిద్య నేర్పిస్తాను, ” అని రమజనోవా ఇన్‌స్టాగ్రాంలో రాసింది. 127వ ర్యాంక్‌లో ఉన్న రమజనోవా ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో పాల్లొన్న తొలి గర్భిణీ క్రీడాకారిణి కాదు. ఈజిప్టుకు చెందిన 26 ఏళ్ల ఫెన్సర్ నాడా హఫీజ్ కూడా ఏడు నెలల గర్భవతిగా పోటీ పడింది. మహిళల సాబర్ పోటీలో హఫీజ్ తన మొదటి రౌండ్ మ్యాచ్‌లో యూఎస్ఏకి చెందిన మాజీ ఎన్సీఏఏ ఛాంపియన్ ఎలిజబెత్ టార్టకోవ్స్కీని ఓడించింది. ఇక్కడ ఈ అద్భుతమైన మహిళలు తమ పుట్టబోయే పిల్లలను మోస్తూనే అత్యున్నత స్థాయిలో పోటీ చేసి అంచనాలను ధిక్కరించి, మాతృత్వపు బలాన్ని ప్రదర్శించారు. గర్భవతులుగా ఒలింపిక్స్‌లో పోటీ పడి స్ఫూర్తిగా నిలవడమేగాక ఈ మహిళలు సంకల్పం, సామర్థ్యానికి హద్దులు లేవని ప్రపంచానికి చాటిచెప్పారు.(చదవండి: ఆన్లైన్లో ఆక్యుపంక్చర్ నేర్చుకుని ఏకంగా ఓ వ్యక్తికి చికిత్స చేసింది..కట్ చేస్తే..!) -
వినేశ్ ఫొగట్‌పై వేటు: ప్రధాని మోదీ స్పందన.. కీలక ఆదేశాలు
ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు షాక్ తగిలింది. ఓవర్ వెయిట్ కారణంగా రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు పడింది. ఈ సమయంలో వినేశ్ ఫొగట్‌కు ప్రధాని మోదీ అండగా నిలిచారు.వినేశ్. మీరు ఛాంపియన్లకే ఛాంపియన్. భారత్‌కు గర్వకారణం. ప్రతీ ఒక్క భారతీయుడికి మీరే స్పూర్తి. ఒలింపిక్స్‌లో మీ అనర్హత మమ్మల్ని ఎంతగానో బాధిస్తుంది. మీకు కలిగిన నిరాశను మాటల్లో చెప్పలేకపోతున్నాను. సవాళ్లను ఎదురొడ్డి పోరాడే స్వభావం మీది. మళ్లీ గెలుపు దిశగా ముందుకు సాగాలి‘ అంటూ మోదీ ట్వీట్లో పేర్కొన్నారు. Vinesh, you are a champion among champions! You are India's pride and an inspiration for each and every Indian. Today's setback hurts. I wish words could express the sense of despair that I am experiencing.At the same time, I know that you epitomise resilience. It has always…— Narendra Modi (@narendramodi) August 7, 2024పీటీ ఉషకు మోదీ కీలక ఆదేశాలు మరోవైపు ప్యారిస్ ఒలింపిక్స్-2024లో రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు పడటంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. వినేశ్‌కు సహాయం చేసేందుకు వీలైన అంశాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషను ఆదేశించారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయాలని.. అదే విధంగా అనర్హత వేటు విషయంలో న్యాయబద్ధంగా పోరాటం చేయాలని కూడా ఉషను ఆదేశించారని సన్నిహిత వర్గాలు తెలిపినట్లు వార్తా సంస్థ ANI పేర్కొంది. -
ఒలింపిక్స్‌లో పతకం మిస్.. లక్ష్యసేన్‌పై రణ్వీర్ సింగ్ ప్రశంసలు!
భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్‌పై బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ప్రశంసలు కురిపించారు. తాజాగా పారిస్‌లో జరుగుతన్న ఒలింపిక్స్‌లో కాంస్యపతకం దక్కకపోవడంపై స్పందించారు. పురుషుల బ్యాడ్మింటన్‌లో సెమీఫైనల్ చేరుకున్న తొలి భారత షట్లర్‌గా రికార్డ్ సృష్టించాడని రణ్వీర్ కొనియాడారు. ప్రస్తుతం నీ వయస్సు 22 ఏళ్లేనని.. మరో రోజు నువ్వు పోరాడాలంటూ మద్దతుగా నిలిచారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు.నువ్వు ఓడిపోయినప్పటికీ నీ ప్రయత్నం గొప్పదని రణ్వీర్ సింగ్ ప్రశంసలతో ముంచెత్తారు. ఒలింపిక్స్‌లో నీ చురుకుదనం, ప్రదర్శన, ఏకాగ్రత అద్భుతంగా ఉందన్నారు. నిన్ను చూసి గర్వపడుతున్నానని.. నువ్వు ఒక స్టార్.. నీ కెరీర్ ఇప్పుడే ప్రారంభమైందని పోస్ట్‌లో రాసుకొచ్చారు. భవిష్యత్తులో రాబోయే యువతకు నువ్వు ఒక ఆదర్శమని రణ్వీర్ సింగ్ మద్దతుగా నిలిచారు. కాగా.. ఒలింపిక్స్‌లో జరిగిన కాంస్య పతక పోరులో మలేషియా ప్లేయర్ చేతిలో ఓటమి చెందారు. -
‘ఒలింపిక్’ స్ఫూర్తిని పంచేందుకు..
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచవ్యాప్తంగా క్రీడాస్ఫూర్తిని మేల్కొలిపే ఒలింపిక్స్ వైపు యువత దృష్టిని మరింతగా మళ్లించేందుకు ‘టుగెదర్ ఫర్ టుమారో, ఎనేబ్లింగ్ పీపుల్’ పేరిట ఓ కొత్త కార్యక్రమం రూపుదిద్దుకుంది. దీనిని పారిస్‌లో లాంచ్ చేసినట్టు నిర్వాహక సంస్థ శామ్సంగ్ ఇండియా సంస్థ నగర ప్రతినిధులు తెలిపారు.దీనిలో భాగంగా ఒలింపిక్ క్రీడా స్ఫూర్తిని పంచడంతో పాటు సామాజిక ప్రయోజనాన్ని అందించే విభిన్న కార్యక్రమాలు నిర్వహించనున్నామని, ఈ నేపథ్యంలో విద్యార్థుల కోసం తాము నిర్వహించిన సాల్వ్ ఫర్ టుమారో పోటీ విజేతలను ప్రచార కర్తలుగా వినియోగించుకోనున్నామని అన్నారు. -
మనిక మెరిసె
పారిస్: ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళల టీమ్ ఈవెంట్లో భారత జట్టు శుభారంభం చేసింది. తొలి రౌండ్ మ్యాచ్‌లో భారత్ 3–2తో రొమేనియా జట్టును బోల్తా కొట్టించింది. ఈ గెలుపుతో టీమిండియా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. స్టార్ ప్లేయర్ మనిక బత్రా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి భారత విజయంలో ముఖ్యపాత్ర పోషించింది. తొలి మ్యాచ్‌లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ–అర్చనా కామత్ జోడీ 11–9, 12–10, 11–7తో అదీనా దియకోను–ఎలిజబెటా సమారా (రొమేనియా) జంటను ఓడించి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్‌లో మనిక 11–5, 11–7, 11–7తో బెర్నాడెట్టె జాక్స్‌పై గెలిచింది. దాంతో భారత్ ఆధిక్యం 2–0కు పెరిగింది. మూడో మ్యాచ్‌లో భారత నంబర్‌వన్ శ్రీజ 11–8, 4–11, 11–7, 6–11, 8–11తో ఎలిజబెటా సమారా చేతిలో ఓడిపోయింది. నాలుగో మ్యాచ్‌లో అర్చన 5–11, 11–8, 7–11, 9–11తో బెర్నాడెట్టె జాక్స్ చేతిలో ఓటమి పాలైంది. దాంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో మనిక 11–5, 11–9, 11–8తో అదీనా దియకోనుపై గెలిచి భారత్‌కు 3–2తో విజయాన్ని అందించింది. నేడు అమెరికా, జర్మనీ జట్ల మధ్య మ్యాచ్ విజేతతో బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు ఆడతుంది. -
ప్యారిస్‌లో ‘పంచ్’ సరిపోలేదు.. లవ్లీనాకు నిరాశే! (ఫొటోలు)
-
ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్.. జొకోవిచ్ సుదీర్ఘ నిరీక్షణకు తెర (ఫోటోలు)
-
ఒలింపిక్స్ నేర్పించే పెట్టుబడి పాఠాలు
భారత క్రీడాకారులు పతకాల బోణీ కొట్టడంతో దేశీయంగా క్రీడాభిమానులందరికీ ఒలింపిక్స్‌పై ఆసక్తి మరింత పెరిగింది. వివిధ దేశాల క్రీడాకారులు వేర్వేరు అంశాల్లో పోటీపడుతుండటం చూడటానికి ఎంతో ఉత్సాహకరంగా ఉంటుంది. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు క్రీడాకారులు ఎన్నో ఏళ్లుగా ఎలాగైతే సిద్ధమవుతారో, ఇన్వెస్టర్లు కూడా తమ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవడానికి ఏళ్ల తరబడి ప్లానింగ్ చేసుకోవాలి. పొదుపు చేయాలి. వివేకవంతంగా ఇన్వెస్ట్ చేయాలి. మ్యుచువల్ ఫండ్స్‌లో.. అందునా లార్జ్‌క్యాప్స్‌లో దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్ చేయడానికి సంబంధించి ఒలింపిక్స్ మనకేం నేరి్పస్తాయో ఓసారి చూద్దాం. ఒలింపిక్స్, లార్జ్ క్యాప్ మ్యుచువల్ ఫండ్స్ వేర్వేరు ప్రపంచాలుగా అనిపించినా తరచి చూస్తే వాటి మధ్య చాలా సారూప్యతలు కనిపిస్తాయి. సునాయాసమనేది ఓ అపోహ.. లార్జ్ క్యాప్ మ్యుచువల్ ఫండ్స్ ప్రధానంగా దిగ్గజ సంస్థలపైనా, సుదీర్ఘకాలంగా అన్ని రకాల ఆటుపోట్లను తట్టుకుని నిలబడిన కంపెనీలపైనా దృష్టి పెడతాయి. ఈ కంపెనీలన్నీ అగ్రస్థానానికి చేరుకునే క్రమంలో మార్కెట్లను, ప్రోడక్టులను అర్థం చేసుకోవడానికి ఎంతో సమయం వెచ్చించినవై, ఎంతో శ్రమించినవై ఉంటాయి. అనుభవజు్ఞలైన ఒలింపిక్ టీమ్ సభ్యుల్లాగే లార్జ్ క్యాప్ కంపెనీలు నేడు సునాయాసంగా ఉన్నట్లుగా కనిపించడం వెనుక ఎంతో శ్రమ దాగి ఉంటుంది. వాటి ఆదాయాలు స్థిరంగా వృద్ధి చెందుతుంటాయి. పటిష్టమైన బ్రాండ్ గుర్తింపు ఉంటుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మారేందుకు పుష్కలంగా వనరులు ఉంటాయి. అనేక విజయాలు సాధించి అపార అనుభవం ఆర్జించిన ఒలింపిక్స్ టీమ్ ఎలాగైతే అసాధారణ పరిస్థితుల్లోనూ పట్టు తప్పకుండా నిలదొక్కుకోగలదో ఈ కంపెనీలు కూడా కఠిన పరిస్థితుల్లోనూ తీవ్ర హెచ్చుతగ్గులకు లోను కావు. దృఢసంకల్పంతో విజయానికి బాటలు.. మారథాన్ రేసులో తలెత్తే అలసట, అనూహ్య పరిస్థితులను శారీరకంగా, మానసికంగా ఎలా ఎదుర్కొనాలనేది బాగా తెలిసి, తగు వ్యూహాలను రూపొందించుకున్న మారథానర్ గురించి ఒక్కసారి ఊహించుకోండి. సాధారణంగా అమెచ్యూర్ మారథానర్ ప్రారంభంలో కొన్ని మైళ్లు అలవోకగా పరుగెత్తవచ్చు. కానీ ఆ తర్వాత కూడా అలాగే కొనసాగిస్తే కాళ్లు సహకరించవు. ఊపిరి ఆడదు. సరైన యాటిట్యూడ్, మానసిక శిక్షణ లేకపోతే ఆ దశలో ఆగిపోవాల్సి వస్తుంది. కానీ అనుభవజూ్ఞలైన ఒలింపిక్ క్రీడాకారులు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కఠిన శిక్షణ పొందినందున ముందుకు సాగిపోతారు. లార్జ్ క్యాప్ కంపెనీలు కూడా అచ్చంగా అలాంటివే. అవి గతంలో మార్కెట్లో హెచ్చుతగ్గులు ఎన్నింటినో చూసి ఉంటాయి. మారిపోతున్న వినియోగదారుల డిమాండ్లకు అనుగుణంగా తమను తాము మలుచుకున్నవై ఉంటాయి. తాత్కాలిక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనగలిగే ఆర్థిక సామర్థ్యాలు కలిగి ఉన్నవై ఉంటాయి. తుపానులు ఎదురైతే ఎలా బైటపడాలన్నది ఈ కంపెనీలకు బాగా తెలిసి ఉంటుంది. డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు ప్రపంచం నలుమూలల నుంచి అథ్లెట్లు.. ఒలింపిక్స్‌లో వివిధ విభాగాల్లో పోటీపడతారు. 2024 ఒలింపిక్స్‌లో 39 స్పోర్ట్స్వ్యాప్తంగా 329 ఈవెంట్లు ఉన్నాయి. తొలిసారిగా బ్రేక్డ్యాన్సింగ్కు కూడా చోటు కల్పించారు. లార్జ్ క్యాప్ మ్యుచువల్ ఫండ్స్‌లోను ఇలాంటి వైవిధ్యం ఉంటుంది. వివిధ ఈవెంట్లలో పాల్గొనడం వల్ల పతకాలు గెల్చుకునే అవకాశాలు ఎలాగైతే మెరుగుపడతాయో వివిధ రంగాలవ్యాప్తంగా పలు కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లార్జ్ క్యాప్ ఫండ్స్ రిసు్కలను తగ్గించుకుని మెరుగైన రాబడులు అందించేందుకు ఉపయోగకరంగా ఉంటాయి.సురేశ్ సోని - సీఈవో, బరోడా బీఎన్పీ పారిబా అసెట్ మేనేజ్మెంట్ ఇండియా -
Olympics : ఏకైక జూడో ప్లేయర్ తులికా... తొలి రౌండ్లోనే! (ఫొటోలు)
-
Paris Olympics 2024: నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్..
నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్..ఆర్చరీ..– పురుషుల వ్యక్తిగత (1/32 ఎలిమినేషన్ రౌండ్):ప్రవీణ్ జాధవ్ × వెన్‌చావో (చైనా) (మధ్యాహ్నం గం. 2:31 నుంచి).పురుషుల వ్యక్తిగత (1/16 ఎలిమినేషన్ రౌండ్): (మధ్యాహ్నం గం. 3:10 నుంచి).షూటింగ్..– పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ (ఫైనల్):స్వప్నిల్ కుసాలే (మధ్యాహ్నం గం. 1:00 నుంచి).మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ క్వాలిఫికేషన్ రౌండ్: సిఫ్ట్ కౌర్ సమ్రా, అంజుమ్ (మధ్యాహ్నం గం. 3:30 నుంచి).గోల్ఫ్..– పురుషుల వ్యక్తిగత ఫైనల్స్:గగన్‌జీత్ భుల్లర్, శుభాంకర్ శర్మ (మధ్యాహ్నం గం. 12:30 నుంచి).బాక్సింగ్..– మహిళల 50 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్:నిఖత్ జరీన్ × యూ వూ (చైనా) (మధ్యాహ్నం గం. 2:30 నుంచి).సెయిలింగ్..– పురుషుల డింగీ తొలి రెండు రేసులు:విష్ణు శరవణన్ (మధ్యాహ్నం గం. 3:45 నుంచి).– మహిళల డింగీ తొలి రెండు రేసులు:నేత్రా కుమానన్ (రాత్రి గం. 7:05 నుంచి)హాకీ..భారత్ × బెల్జియం (గ్రూప్ మ్యాచ్) (మధ్యాహ్నం గం. 1:30 నుంచి).బ్యాడ్మింటన్..– పురుషుల సింగిల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్స్:(మధ్యాహ్నం గం. 12:00 నుంచి).– పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్:సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి × చియా ఆరోన్–సోహ్ వూయి యిక్ (మలేసియా) (సాయంత్రం గం. 4:30 నుంచి).మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్ (సాయంత్రం గం. 4:30 నుంచి). -
ఆమె స్థైర్యం ముందు.. విధే చిన్నబోయింది..!
బాల్యమంతా ఆస్తమాతో పోరాడింది. ఆ వ్యాధి చికిత్సలో భాగంగా నేర్చుకున్న స్విమ్మింగ్‌నే కెరీర్‌గా మార్చుకుని అథ్లెటిక్ స్థాయికి చేరి.. ఒలింపిక్‌లో బంగారు పతకాలు సాధించింది. ఇలా ఆమె ఏకంగా ఆరుసార్లు పతకాలను గెలుచుకోవడం విశేషం. శరీరానికే వైద్యపరమైన సమస్య కానీ మనసుకు కాదని నిరూపించింది. హాయిగా జీవితం సాగుతుంది అనుకునేలోపు ఊహించిన ప్రమాదం ఆమె జీవితాన్ని తలకిందులుగా చేసింది. అయినా తగ్గేదేలా అంటూ దూసుకుపోతూ తనలాంటి చిన్నారులను ఛాంపియన్లగా మారేలా స్థైర్యం నింపుతూ ఆదర్శంగా నిలిచింది.ఆమెనే అమీ వాన్ డైకెన్. స్విమ్మింగ్ ఎక్సలెన్స్‌కు పర్యాయపదంగా ఆమె. అమీ బాల్యం అంతా ఆస్తమాతో పోరాడింది. అందుకోసం తీసుకున్న చికిత్సలో భాగంగా ఈత నేర్చుకునేది. చెప్పాలంటే ఈత ద్వారా ఉపశమనం పొందేది. అదే ఆమెకు భవిష్యత్తులో కెరీర్‌గా మారి ఉన్నత శిఖరాలు చేరుకుంటుందని ఎవ్వరూ ఊహించలేదు. ఆమె వైద్యుడు చికిత్సలో భాగంగా సూచించిన స్విమ్మింగ్ తన సమస్యను నివారించడమే కాకుండా అదే ఆమెను స్విమ్మింగ్ ఛాంపియన్‌గా అవతరించేలా చేసింది. 1996లో అట్లాంటా ఒలింపిక్స్‌లో పాల్గొని నాలుగు బంగారు పతకాలను గెలుచుకున్న తొలి అమెరికన్ మహిళగా చరిత్ర సృష్టించింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్ సమయంలో, మరో రెండు బంగారు పతకాలను కైవసం చేసుకుంది. ఇలా ఒలింపిక్స్‌లో మొత్తం ఆరు బంగారు పతకాలను దక్కించుకున్న అథ్లెట్‌గా నిలిచింది. ఇక వ్యక్తిగత జీవితం దగ్గరకు వచ్చేటప్పటికీ..మాజీ-అమెరికన్ ఫుట్‌బాల్ ఆటగాడు టామ్ రూయెన్‌ను వివాహం చేసుకుంది . ఇక స్విమ్మింగ్ నుంచి రిటైర్ అయ్యి, యాంకర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అలా అమె టీవీ, రేడియో ప్రెజెంటర్‌గా మారింది. ఐతే జూన్ 6, 2014న జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వీల్‌చైర్‌కి పరిమితమైపోయింది. అయినా కూడా తగ్గేదే లే..! అంటూ తనలా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులను ఒలింపిక్ ఛాంపియన్లలా రాణించేలా స్ఫూర్తిని నింపుతోంది. ఆమె గాథ జీవితంలో విధి కష్టాల రూపంలో మన గమనానికి బ్రేక్పడేలా చేస్తే.. ఆగిపోకుండా దాన్నే ఆయుధంగా చేసుకుని బతకాలన్న గొప్ప సందేశాన్ని ఇస్తోంది కదూ..!(చదవండి: ఈ కిచెన్వేర్స్ని నిమ్మకాయతో అస్సలు క్లీన్ చేయకూడదు !) -
భారత్ ఖాతాలో రెండో పతకం మనూ భాకర్ పై మోదీ ప్రశంసలు..
-
Olympics: చేరువై... దూరమై!
చిక్కినట్లే చిక్కి చేజారితే కలిగే బాధ వర్ణణాతీతం! ఒలింపిక్స్ వంటి ప్రతిష్ఠాత్మక వేదికపై పతకం పట్టాలని ప్రతి అథ్లెట్ కలలు కంటాడు. ఏళ్ల తరబడి కఠోర సాధన, అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంటారు. మరి అలాంటిది... మెడల్‌కు అత్యంత చేరువైన తర్వాత అందినట్లే అంది ఆ విజయం దూరమైతే కలిగే బాధ అంతా ఇంతా కాదు! ప్రస్తుతం జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో భారత షూటర్ అర్జున్ బబుతాకు ఇలాంటి మనసు వికలమయ్యే అనుభవం ఎదురైంది. అయితే త్రుటిలో పతకాలు చేజార్చుకున్న భారత ప్లేయర్లలో అర్జున్ బబూతా మొదటి క్రీడాకారుడేమీ కాదు... గతంలోనూ పలుమార్లు విశ్వ క్రీడల్లో భారత్‌కు ఎదురైన ఇలాంటి చేదు అనుభవాలను పరిశీలిస్తే... ఫుట్‌బాల్‌తో మొదలు 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. హైదరాబాదీ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ శిక్షణలో రాటుదేలిన మన జట్టు.. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. క్వార్టర్స్‌లో ఆతిథ్య ఆ్రస్టేలియాపై నెవిల్లె డిసౌజా హ్యాట్రిక్ గోల్స్‌తో విజృంభించడంతో సెమీస్‌లో అడుగుపెట్టి పతకం సాధించడం ఖాయమే అనిపించింది. అయితే యుగోస్లో వియాతో జరిగిన సెమీఫైనల్లో భారత్ 1–4తో పరాజయం పాలైంది. కాంస్య పతక పోరులోనూ తడబడ్డ భారత్ 0–3తో బల్గేరియా చేతిలో ఓడి నాలుగో స్థానంతో నిరాశగా వెనుదిరిగింది. మిల్కా సింగ్ వెంట్రుకవాసిలో... 1960 రోమ్ ఒలింపిక్స్‌లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత స్టార్ అథ్లెట్ మిల్కాసింగ్.. నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల 400 మీటర్ల పరుగులో సమీప ప్రత్యరి్థని చూసే క్రమంలో క్షణకాలాన్ని వృథా చేసుకున్న మిల్కా.. దానికి జీవితకాల మూల్యం చెల్లించుకున్నాడు. రోమ్ ఒలింపిక్స్ అనుభవంతో అథ్లెటిక్స్కే వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడు. అతి బలవంతంగా అతడిని తిరిగి ట్రాక్ ఎక్కించగా.. 1962 ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలతో సత్తాచాటాడు. మహిళల హాకీలో ఇలా.. 1980 మాస్కో విశ్వ క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు చక్కటి అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయింది. అఫ్గానిస్తాన్‌పై ఆతిథ్య సోవియట్ యూనియన్ దాడి చేసిన నేపథ్యంలో నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి దేశాలు మాస్కో క్రీడలను బహిష్కరించాయి. దీంతో మన జట్టు పోడియంపై నిలవడం ఖాయమే అనిపించింది. ఆ్రస్టియా, పోలాండ్‌పై ఘనవిజయాలు సాధించిన మన మహిళల జట్టు పతకంపై ఆశలు రేపింది. అయితే ఆ తర్వాత జింబాబ్వేతో మ్యాచ్ ‘డ్రా’ కాగా.. చెకోస్లోవియా, సోవియట్ యూనియన్ చేతిలో ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. పరుగుల రాణికి తీరని వ్యథ! 1984 లాస్ఏంజెలిస్ క్రీడల్లో పరుగుల రాణి పీటీ ఉషకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో సెకనులో వందో వంతు తేడాతో పీటీ ఉష నాలుగో స్థానానికి పరిమితమైంది. అంతర్జాతీయ స్థాయిలో ఏ పోటీలోనైనా ఒక భారత అథ్లెట్ పతకం కోల్పోయిన అత్యల్ప తేడా ఇదే. ఫైనల్లో ఉష 55.42 సెకన్లలో లక్ష్యాన్ని చేరింది. జాయ్దీప్కు నిరాశ 2012 లండన్ ఒలింపిక్స్‌లో జాయ్దీప్ కర్మాకర్‌కు అర్జున్‌లాంటి అనుభవమే ఎదురైంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో బరిలోకి దిగిన కర్మాకర్ క్వాలిఫికేషన్ రౌండ్లో చక్కటి ప్రదర్శన కనబర్చి ఏడో స్థానంతో ఫైనల్‌కు అర్హత సాధించాడు. అయితే తుదిపోరులో కాంస్యం గెలిచిన షూటర్ కంటే.. 1.9 పాయింట్లు వెనుకబడిన కర్మాకర్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. దీపా కర్మాకర్ త్రుటిలో... 2016 రియో ఒలింపిక్స్‌లో భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ త్రుటిలో కాంస్య పతకం చేజార్చుకుంది. వాల్ట్ ఫైనల్లో దీపా కర్మాకర్ 15.066 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. కాంస్యం గెలిచిన జిమ్నాస్ట్‌కు దీపా కర్మాకర్‌కు మధ్య 0.150 పాయింట్ల తేడా మాత్రమే ఉండటం గమనార్హం. ఇదే క్రీడల్లో భారత షూటర్ అభినవ్ బింద్రా నాలుగో స్థానంలో నిలిచి కాంస్య పతకం చేజార్చుకున్నాడు. మహిళల హాకీ జట్టు మరోసారి 2020 టోక్యో ఒలింపిక్స్‌లో మరోసారి భారత మహిళల హాకీ జట్టుకు నిరాశ తప్పలేదు. 1980 మాస్కో క్రీడల్లో త్రుటిలో కాంస్యం చేజార్చుకున్న మహిళల జట్టు.. టోక్యోలోనూ అదే బాటలో నడిచింది. మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్ ఆ్రస్టేలియాను మట్టికరిపించి ఆశలు రేపిన మన అమ్మాయిలు.. సెమీఫైనల్లో అర్జెంటీనా చేతిలో పరాజయం పాలయ్యారు. కాంస్య పతక పోరులోనైనా అద్భుతం చేస్తారనుకుంటే.. ఇంగ్లండ్‌తో పోరులో ఆరంభంలో ఆధిక్యం సాధించినా.. చివర్లో పట్టు విడిచి 3–4తో నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. ఇదే క్రీడల్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన గోల్ఫర్ అదితి అశోక్ నాలుగో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కోల్పోయింది. ఈసారి ఇద్దరు.. 2004 ఎథెన్స్ ఒలింపిక్స్‌లో లియాండర్ పేస్–మహేశ్ భూపతి జంట నాలుగో స్థానంలో నిలిచింది. భారత అత్యుత్తమ ద్వయంగా విశ్వక్రీడల బరిలోకి దిగిన పేస్–భూపతి హోరాహోరీగా సాగిన కాంస్య పతక పోరులో 6–7, 6–4, 14–16తో అన్సిచ్–లుబిసిచ్ (క్రొయేషియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
పారిస్ ఒలింపిక్స్ 2024: ఫ్యామిలీతో రామ్‌చరణ్ సందడి (ఫోటోలు)
-
ఒలింపిక్స్‌లో ఇవాల్టి (జులై 29) భారత షెడ్యూల్
పారిస్ ఒలింపిక్స్‌లో రెండో రోజు (జులై 28) భారత్‌కు అనుకూల ఫలితాలు వచ్చాయి. షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో మనూ భాకర్ భారత్‌కు తొలి పతకం (కాంస్యం) అందించగా.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రమిత జిందాల్, పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అర్జున్ బబుతా ఫైనల్స్‌కు అర్హత సాధించారు. మూడో రోజు (జులై 29) రమిత జిందాల్, అర్జున్ బబుతా పతక రేసులో నిలువనున్నారు. ఒలింపిక్స్‌లో ఇవాల్టి భారత షెడ్యూల్ ఇలా ఉంది.బ్యాడ్మింటన్: పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజీ మ్యాచ్: మధ్యాహ్నం 12 గంటలకు: సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి/చిరగ్ షెట్టి వర్సెస్ మార్క్ లంప్స్ఫస్/మర్విన్ సెయిడెల్ (జర్మనీ)మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజీ మ్యాచ్: మధ్యాహ్నం 12:50 గంటలకు: అశ్విని పొన్నప్ప/తనిష క్రాస్టో వర్సెస్ నమి మత్సుయమా/చిహారు షిదా (జపాన్)పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజీ మ్యాచ్: సాయంత్రం 5: 30 గంటలకు: లక్ష్య సేన్ వర్సెస్ సూలియన్ కర్రెగ్గి (బెల్జియం)షూటింగ్: మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్స్ (రమిత జిందాల్): మధ్యాహ్నం ఒంటి గంటకుపురుషుల ట్రాప్ క్వాలిఫికేషన్ (పృథ్వీరాజ్ తొండైమాన్): మధ్యాహ్నం ఒంటి గంటకు పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్స్ (అర్జున్ బబుతా): మధ్యాహ్నం 3 గంటలకుటెన్నిస్: పురుషుల డబుల్స్ (రోహన్ బోపన్న/ ఎన్ శ్రీరామ్ బాలాజీ): మధ్యాహ్నం 3:30 గంటల నుంచిహాకీ: పురుషుల పూల్-బి మ్యాచ్: భారత్ వర్సెస్ అర్జెంటీనా: సాయంత్రం 4:15 గంటలకుఆర్చరీ: పురుషుల రికర్వ్ టీమ్ క్వార్టర్ ఫైనల్స్: తరుణ్‌దీప్ రాయ్, ధీరజ్ బొమ్మదేవర, ప్రవీణ్ జాదవ్: సాయంత్రం 6:30 గంటలకుటేబుల్ టెన్నిస్: మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్: ఆకుల శ్రీజ వర్సెస్ జియాన్ జెంగ్ (సింగపూర్): రాత్రి 11:30 గంటలకుమహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్: మనిక బత్రా వర్సెస్ ప్రీతిక పవడే (ఫ్రాన్స్): మధ్య రాత్రి 12:30 గంటలకు -
ఒలింపిక్స్‌లో రెండో రోజు (జులై 28) భారత్‌కు అనుకూల ఫలితాలు
పారిస్ ఒలింపిక్స్‌లో రెండో రోజు (జులై 28) భారత్‌కు అనుకూల ఫలితాలు వచ్చాయి. షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో మనూ భాకర్ భారత్‌కు తొలి పతకం (కాంస్యం) అందించగా.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రమిత జిందాల్, పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అర్జున్ బబుతా ఫైనల్స్‌కు అర్హత సాధించారు. అలాగే పురుషుల రోయింగ్ సింగిల్స్ స్కల్స్ రెపిచేజ్ రౌండ్లో బల్రాజ్ పన్వర్ క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు.మహిళల 50 కేజీల బాక్సింగ్ పోటీల్లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ ప్రీ క్వార్టర్స్‌కు చేరింది.మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్ తొలి రౌండ్లో ఆకుల శ్రీజ, మనికా బత్రా విజయం సాధించారు.పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ తొలి రౌండ్లో హెచ్ ఎస్ ప్రణయ్ విజయం సాధించాడు. రెండో రోజు భారత్‌కు వచ్చిన వ్యతిరేక ఫలితాలు..పురుషుల టేబుల్ టెన్నిస్ తొలి రౌండ్లో శరత్ కమల్ స్లొవేనియాకు చెందిన డేనీ కొజుల్ చేతిలో 2-4 తేడాతో (12-10 9-11 6-11 7-11 11-8 10-12) ఓటమిపాలయ్యాడు.పురుషుల టెన్నిస్ సింగిల్స్ తొలి రౌండ్లో సుమిత్ నగాల్ ఫ్రాన్స్‌కు చెందిన కొరెంటిన్ మౌటెట్ చేతిలో 2-6, 6-2, 5-7 తేడాతో ఓటమిపాలయ్యాడు.భారత మహిళల ఆర్చరీ టీమ్ (అంకిత భకత్, భజన్ కౌర్, దీపికా కుమార్) క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ చేతిలో 0-6 తేడాతో భారత్ ఓటమిపాలైంది.టేబుల్ టెన్నిస్‌లో హర్మీత్ దేశాయ్, స్విమ్మింగ్‌లో శ్రీహరి నటరాజ్, ధినిధి దేశింగు ఓటమిపాలయ్యారు. -
Paris Olympics 2024: బోణి కొట్టిన మరో తెలుగమ్మాయి
పారిస్ ఒలింపిక్స్‌లో రెండో రోజు భారత్ వరుస విజయాలతో శుభారంభం చేసింది. తొలుత బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు విజయం సాధించగా.. ఆతర్వాత టేబుల్ టెన్నిస్‌లో ఆకుల శ్రీజ బోణి కొట్టింది. సింధు తొలి రౌండ్ మ్యాచ్‌లో మాల్దీవులకు చెందిన అబ్దుల్ రజాక్‌పై 21-9, 21-6 విజయం సాధించగా.. ఆకుల శ్రీజ.. రౌండ్ ఆఫ్ 64 మ్యాచ్‌లో స్వీడన్‌కు చెందిన క్రిస్టినా కల్బర్గ్పై 11-4, 11-9, 11-7, 11-8 తేడాతో నెగ్గి, రౌండ్ ఆఫ్ 32కు క్వాలఫై అయ్యింది. SREEJA AKULA QUALIFIES INTO ROUND OF 32...!!!! 👌- She won the match without losing a single game, What a fantastic performance in Paris Olympics 🔥 pic.twitter.com/uoSxsD6muX— Johns. (@CricCrazyJohns) July 28, 2024సింధు తొలి రౌండ్లో ప్రత్యర్దిపై 29 నిమిషాల్లో జయకేతనం ఎగురవేయగా.. శ్రీజ 30 నిమిషాల్లో ప్రత్యర్దిని చిత్తు చేసింది. సింధు, శ్రీజ తమతమ ప్రత్యర్దులపై వరుస సెట్లలో విజయం సాధించారు. సింధు, శ్రీజ ఇద్దరూ తెలుగమ్మాయిలే కావడం విశేషం. BALRAJ PAWAR INTO QUARTER-FINAL IN ROWING..!!!! 🇮🇳- India continues to have a great time on Day 2 in the Paris Olympics. pic.twitter.com/3y9q7PLWMV— Johns. (@CricCrazyJohns) July 28, 2024మరోవైపు పురుషుల రోయింగ్ సింగిల్స్ స్కల్స్ రెపిచేజ్ రౌండ్లో భారత్‌కు చెందిన బల్రాజ్ పన్వర్ విజయం సాధించాడు. ఈ విజయంతో బల్రాజ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు.మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రమిత జిందాల్ (631.5) ఫైనల్‌కు చేరింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అర్జున్ బబుతా (630.1) ఫైనల్‌కు చేరాడు. మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్ తొలి రౌండ్లో మనికా బత్రా విజయం సాధించింది. గ్రేట్ బ్రిటన్‌కు చెందిన అన్నా హర్సేపై 11-8, 12-10, 11-9, 9-11, 11-5 తేడాతో గెలుపొందింది. పురుషుల టేబుల్ టెన్నిస్ తొలి రౌండ్లో భారత్‌కు చెందిన శరత్ కమల్ స్లొవేనియాకు చెందిన డేనీ కొజుల్ చేతిలో 2-4 తేడాతో (12-10 9-11 6-11 7-11 11-8 10-12) ఓటమిపాలయ్యాడు.పురుషుల టెన్నిస్ సింగిల్స్ తొలి రౌండ్లో భారత్‌కు చెందిన సుమిత్ నగాల్ ఫ్రాన్స్‌కు చెందిన కొరెంటిన్ మౌటెట్ చేతిలో 2-6, 6-2, 5-7 తేడాతో ఓటమిపాలయ్యాడు.భారత మహిళల ఆర్చరీ టీమ్ (అంకిత భకత్, భజన్ కౌర్, దీపికా కుమార్) క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ చేతిలో 0-6 తేడాతో భారత్ ఓటమిపాలైంది. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ తొలి రౌండ్లో భారత్‌కు చెందిన హెచ్ ఎస్ ప్రణయ్.. జర్మనీకు చెందిన ఫేబియన్ రోథ్పై 21-18, 21-12 తేడాతో గెలుపొందాడు. -
నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్
బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ తొలి లీగ్ మ్యాచ్: పీవీ సింధు x ఫాతిమత్ నభా (మాల్దీవులు) మధ్యాహ్నం గం. 12:50 నుంచి. పురుషుల సింగిల్స్ తొలి లీగ్ మ్యాచ్: హెచ్ఎస్ ప్రణయ్ x ఫాబియన్ రోథ్ (జర్మనీ) రాత్రి గం. 9:00 నుంచిషూటింగ్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్: ఇలవేనిల్ వలారివన్ (మధ్యాహ్నం గం. 12:45 నుంచి). పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్: సందీప్ సింగ్, అర్జున్ బబూతా (మధ్యాహ్నం గం. 2:45 నుంచి). మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్: మనూ భాకర్ (మధ్యాహ్నం గం. 3:30 నుంచి). రోయింగ్ పురుషుల సింగిల్ స్కల్స్ (రెపిచేజ్ 2): బలరాజ్ పన్వర్ (మధ్యాహ్నం గం. 1:18 నుంచి).టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ (రెండో రౌండ్): ఆకుల శ్రీజ x క్రిస్టియానా క్లెబెర్గ్ (స్వీడన్) (మధ్యాహ్నం గం. 12:15 నుంచి). మహిళల సింగిల్స్ (రెండో రౌండ్): మనికా బత్రా x అన్నా హర్సే (ఇంగ్లండ్) (మధ్యాహ్నం 12:15 నుంచి). పురుషుల సింగిల్స్ (రెండో రౌండ్): శరత్ కమల్ x డేనీ కోజుల్ (స్లొవేనియా) (మధ్యాహ్నం గం. 3:00 నుంచి).స్విమ్మింగ్ పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ (హీట్–2): శ్రీహరి నటరాజ్ (మధ్యాహ్నం గం. 3:16 నుంచి). మహిళల 200 మీటర్ల ఫ్రీస్టయిల్ (హీట్–1): ధీనిధి (మధ్యాహ్నం గం. 3.30 నుంచి).ఆర్చరీ మహిళల రికర్వ్ టీమ్ క్వార్టర్ ఫైనల్: భారత్ (దీపిక కుమారి, అంకిత భకత్, భజన్ కౌర్) ్ఠ ఫ్రాన్స్/నెదర్లాండ్స్ (సాయంత్రం గం. 5:45 నుంచి). మహిళల టీమ్ సెమీఫైనల్: (రాత్రి గం. 7:17 నుంచి). మహిళల టీమ్ ఫైనల్: (రాత్రి గం. 8:18 నుంచి). -
నినో... నీకు సలాం!
ఒలింపిక్స్‌కు ఒక్కసారి అర్హత సాధించడమే గొప్ప అనుకుంటుంటే... వరుసగా పదోసారి విశ్వక్రీడల్లో పోటీ పడటాన్ని ఏమనాలి! జార్జియాకు చెందిన 55 ఏళ్ల మహిళా షూటర్ నినో సాలుక్వాద్జె ఇలాంటి అసాధారణ ఘనత సాధించింది. 1988 సియోల్ ఒలింపిక్స్ ద్వారా విశ్వక్రీడల్లో అరంగేట్రం చేసిన నినో... తొలి ప్రయత్నంలో 25 మీటర్ల పిస్టల్‌లో స్వర్ణం, 10 మీటర్ల విభాగంలో రజతం సాధించి అదరగొట్టింది. ఇక అప్పటి నుంచి వరుసగా అన్నీ ఒలింపిక్స్‌లో పాల్గొన్న నినో... తాజాగా పారిస్ క్రీడల ద్వారా వరుసగా పదోసారి గేమ్స్ లో పాల్గొన్న క్రీడాకారిణిగా రికార్డు నెలకొలి్పంది. శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో నినో బరిలోకి దిగి 562 పాయింట్లు స్కోరు చేసి 38వ స్థానంలో నిలిచింది. కెనడాకు చెందిన ఈక్వె్రస్టియాన్ ఇయాన్ మిల్లర్ కూడా 10 ఒలింపిక్స్‌లో పాల్గొన్నా... అతడు 1980 మాస్కో ఒలింపిక్స్‌కు దూరంగా ఉన్నాడు. 2016 రియోలో కుమారుడు సోట్నే మచావరియానితో కలిసి పోటీపడటం ద్వారా.. విశ్వక్రీడల్లో బరిలోకి దిగిన తొలి తల్లీ తనయులుగా నినో రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు మూడు పతకాలు సాధించిన నినో... తండ్రి చివరి కోరిక మేరకే పదో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నట్లు పేర్కొంది. -
ఉచితంగా రూ.1.09 లక్షల విలువైన ఫోన్!
ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారా.. అయితే మీకు రూ.1.09 లక్షల విలువైన ఫోన్ ఉచితంగా లభిస్తుంది. ఎలాగంటారా.. పారిస్ ఒలింపిక్ 2024లో పాల్గొనే క్రీడాకారులకు కార్పొరేట్ కంపెనీలు ఆకర్షణీయ బహుమతులు అందిస్తున్నాయి. ఇందులో మొబైల్ఫోన్లు వంటి విలువైన వస్తువులు కూడా ఉన్నాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శామ్సంగ్ క్రీడాకారులకు ప్రత్యేకంగా కిట్‌ను అందిస్తోంది. అందులో రూ.1.09 లక్షల విలువైన గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 ఒలింపిక్ ఎడిషన్‌ను ఉచితంగా ఇస్తున్నారు.ఈ కిట్‌ను అందుకోవాలంటే నేషనల్ ఒలింపిక్ కమిటీలో నమోదవ్వాలి. అందులో చేరిన వారికి పారిస్‌లోని ‘ఒలింపిక్ విలేజ్ చెఫ్ డి మిషన్’కు చేరిన వెంటనే కిట్ అందిస్తారు. వీటిని ఆగస్టు 11 వరకు ఎప్పుడైనా ‘ఒలింపిక్ విలేజ్ ప్లాజా’లో తీసుకోవచ్చని కంపెనీ తెలిపింది. View this post on Instagram A post shared by Frame Thanakhan Ch. (@frame_thnk)ఇదీ చదవండి: భారత్‌లో ఐప్యాడ్ తయారీ..?కిట్‌లో ఉండే వస్తువులు..1. శామ్సంగ్ ఒలింపిక్ ఫ్లిప్‌సూట్ ఎడిషన్(మార్కెట్ ధర సుమారు రూ.1,09,999)ఇందులో 100జీబీ డేటాలో అపరిమిత కాల్స్ మాట్లాడేలా ఈ-సిమ్ ఉంటుంది. శామ్సంగ్ ప్రత్యేకంగా అందించే అథ్లెట్ 365 యాప్ కూడా ఇన్స్టాల్ చేసి ఇస్తున్నారు. దాంతో వ్యక్తిగత ఒలింపిక్ అప్డేట్లు తెలుసుకోవచ్చు.2. ఐఓసీ వెల్కమ్ గైడ్3. కోకా-కోలా సిగ్గ్ బాటిల్, పారిస్ 2024 పవర్ఏడ్ స్క్వీజ్ బాటిల్4. ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కంపెనీకు చెందిన టాయిలెట్ బ్యాగ్, ఎయిర్ ఫ్రెషనర్, షాంపూ, హ్యాండ్ సోప్, టూత్ బ్రష్, టూత్‌పేస్ట్. -
వినూత్న రీతిలో ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు
-
జీవితంలో ఒక్కసారే వచ్చే అవకాశం: తాప్సీ పన్ను
హీరోయిన్ తాప్సీ పన్ను ప్రస్తుతం ఫీర్ ఆయి హాసిన్ దిల్రుబా చిత్రంలో కనిపంచనుంది. 2021లో హసీన్ దిల్రుబా మూవీకి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే, సన్నీ కె కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 9న నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్ట్‌గా రిలీజ్ కానుంది. అయితే ఈ ఏడాది మార్చిలో తన ప్రియుడు, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోను పెళ్లాడిన సంగతి తెలిసిందే. బ్యాడ్మింటన్ ప్లేయర్ అయినా మథియాస్ ఇండియన్ ఆటగాళ్లు చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డికి 2021 నుంచి కోచ్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరు ఆటగాళ్లు పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.దీంతో తన భర్త కోసం నటి తాప్సీ పన్ను పారిస్ ఒలింపిక్ క్రీడలకు హాజరు కానున్నారు. ఈనెల 29న పారిస్‌కు వెళ్తున్నట్లు తెలిపారు. ప్రత్యక్షంగా ఒలింపిక్స్ చూసే అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుందని పేర్కొన్నారు. తన భర్తతో పాటు.. మనదేశ ఆటగాళ్లను ఉత్సాహపరిచేందుకు పారిస్ వెళ్తున్నట్లు చెప్పుకొచ్చింది. కాగా.. ఇప్పటికే బాడ్మింటన్ క్రీడాకారులు చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్, తాప్సీ భర్త మథియాస్ బో పారిస్ చేరుకున్నారు. మథియోస్ను 2012లో ఒలింపిక్స్ పతకం గెలిచిన తర్వాత తొలిసారి కలుసుకున్నట్లు తాప్సీ వెల్లడించింది.కాగా.. తాస్పీ పన్ను తెలుగులో పలు చిత్రాలు చేసింది. బాలీవుడ్లో సూర్మ (2018), సాంద్ కి ఆంఖ్ (2019), రష్మీ రాకెట్ (2021), లూప్ లాపేట (2022), శభాష్ మిథు (2022) స్పోర్ట్స్ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేసింది. తాను స్క్వాష్ గేమ్ మాత్రమే బాగా ఆడగలనని తాప్సీ తెలిపింది. -
ఒలింపిక్ కమిటీకి ఏకగ్రీవంగా ఎన్నికైన నీతా అంబానీ
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) భారత ప్రతినిధిగా తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రపంచ క్రీడల్లో ఇండియా ప్రభావం పెరుగుతుందని, తనను కమిటీ సభ్యురాలుగా ఎన్నుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు నీతా తెలిపారు.జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు పారిస్‌లో జరగబోయే ఒలింపిక్ క్రీడల్లో భాగంగా వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యులను ఎన్నుకున్నారు. అందులో భారత్ తరఫున నీతా అంబానీ తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘గ్లోబల్ ఒలింపిక్ బాడీ 142వ సెషన్లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యురాలిగా ఎంపికవ్వడం గౌరవంగా ఉంది. కమిటీ నాపై ఉంచిన నమ్మకం, విశ్వాసానికి ధన్యవాదాలు. ప్రపంచ క్రీడా రంగంలో భారత్ ప్రభావం పెరుగుతోంది. భారత్ తరఫున ఒలింపిక్ కమిటీకి సహకరించేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాం’ అని చెప్పారు.2016లో రియో డి జెనీరోలో జరిగిన ఒలింపిక్ క్రీడల సందర్భంగా ఆమె తొలిసారి ఐఓసీ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఐఓసీలో చేరిన మొదటి భారతీయ మహిళగా ఆమె గుర్తింపు పొందారు. భారత్‌లోని ముంబయిలో 30 ఏళ్లకు పైగా ఐఓసీ సెషన్‌ను నిర్వహించడంలో నీతా అంబానీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలాఉండగా, 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధమవుతున్నట్లు తెలిసింది.ఇదీ చదవండి: ఈఎస్ఐ పథకంలోకి భారీగా చేరిన ఉద్యోగులునీతా అంబానీ గురించి కొన్ని ఆసక్తికర అంశాలుఅంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా ఎన్నికైన మొదటి భారతీయ మహిళ.న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ ట్రస్టీ బోర్డులో చేరిన మొదటి భారతీయురాలు.ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్‌కు యజమాని.ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్‌కు నీతా అంబానీ వ్యవస్థాపక చైర్‌పర్సన్‌గా ఉన్నారు.నీతా ‘హర్ సర్కిల్’ అనే డిజిటల్ ప్లాట్‌పామ్‌ను స్థాపించారు. దీని ద్వారా భారత్‌లోని మహిళలకు విభిన్నమైన, ఇంటరాక్టివ్, సామాజిక స్పృహతో కూడిన డిజిటల్ సేవలను అందిస్తున్నారు.ముంబయిలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్‌పర్సన్‌గా నీతా అంబానీ వ్యవహరిస్తున్నారు. -
ఒలింపిక్స్ టార్చ్ బేరర్‌గా దివ్యాంగుడు..పక్షవాతంతో కాళ్లు పడిపోయినా..!
ఫ్రాన్స్‌కు చెందిన కెవిన్ పియెట్ అనే దివ్యాంగ టెన్నిస్ క్రీడాకారుడు పారిస్ ఒలింపిక్స్‌లో టార్చ్ బేరర్‌గా నిలిచాడు. 35 ఏళ్ల కెవిన్ 10 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాళ్ల స్పర్శను కోల్పోయాడు. పక్షవాతం కారణంగా కెవిన్ రెండు కాళ్లు పని చేయడం లేదు. కెవిన్.. తాను సొంతంగా నడవలేకపోయినా రోబిటిక్ యంత్రం (Exoskeleton) సాయంతో నడుస్తూ ఒలింపిక్స్ జ్యోతిని మోసాడు. Kevin Piette, paraplegic since an accident, made history today by carrying the Olympic flame with his exoskeleton! 💪pic.twitter.com/oejQHQRAwG— Kevin W. (@Brink_Thinker) July 23, 2024ఎక్సోస్కెలిటన్ సాయంతో టార్చ్ బేరర్‌గా నిలవడం ఒలింపిక్స్ చరిత్రలో ఇదే మొదటిసారి. కెవిన్ పక్షవాతం బారిన పడ్డాక పారా అథ్లెట్‌గా (వీల్ చైర్ టెన్నిస్) కొనసాగుతున్నాడు. కెవిన్ ఎక్సోస్కెలిటన్ సాయంతో తన రోజువారీ పనులు తానే చేసుకోవడంతో పాటు టెన్నిస్‌లో తన దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. దివ్యాంగ క్రీడాకారులు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఆడే సైబాథ్లాన్ పోటీల్లోనూ కెవిన్ పాల్గొన్నాడు.కాగా, 2024 పారిస్ ఒలింపిక్స్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. జులై 26న జరిగే ఓపెనింగ్ సెర్మనీతో విశ్వ క్రీడలు మొదలవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 206 దేశాల నుంచి 10, 714 క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పాల్గొంటారు. ఆగస్ట్ 10న విశ్వ క్రీడలు ముగుస్తాయి. 32 క్రీడలకు సంబంధించి 329 విభాగాల్లో పోటీలు నిర్వహించబడతాయి. భారత్ నుంచి ఈ సారి ఒలింపిక్స్‌లో 117 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. భారత బృందానికి టార్చ్ బేరర్లుగా పీవీ సింధు, శరత్ కమల్ వ్యవహరించనున్నారు. ఈ ఒలింపిక్స్‌లో భారత ప్రస్తానం రేపటి నుంచి జరుగబోయే ఆర్చరీ పోటీలతో మొదలవుతుంది. జులై 27న బ్యాడ్మింటన్, బాక్సింగ్.. ఆగస్ట్ 1-10 వరకు అథ్లెటిక్స్.. జులై 27- ఆగస్ట్ 8 వరకు హాకీ పోటీలు, జులై 27- ఆగస్ట్ 5 వరకు షూటింగ్ పోటీలు జరుగనున్నాయి. -
బీసీసీఐ ఉదారత.. భారత అథ్లెట్లకు ఆర్థిక సాయం
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉదారత చాటుకుంది. పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్ల బృందానికి ఆర్ధిక సాయం ప్రకటించింది. అథ్లెట్లకు ప్రోత్సాహకంగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌కు 8.5 కోట్ల రూపాయలు అందజేయనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. ఈ విషయాన్ని షా ట్విటర్ ద్వారా తెలిపారు.ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్న అథ్లెట్లకు బీసీసీఐ మద్దతు ఇస్తుందని తెలపడానికి గర్విస్తున్నాను. ఈ ఒలింపిక్స్ కోసం బీసీసీఐ రూ.8.5కోట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అందిస్తుంది. మన అథ్లెట్లందరికీ ఆల్ ది బెస్ట్. భారత్ గర్వించేలా చేయండి. జై హింద్ అని షా తన ట్వీట్లో రాసుకొచ్చాడు.I am proud to announce that the @BCCI will be supporting our incredible athletes representing #India at the 2024 Paris Olympics. We are providing INR 8.5 Crores to the IOA for the campaign.To our entire contingent, we wish you the very best. Make India proud! Jai Hind! 🇮🇳…— Jay Shah (@JayShah) July 21, 2024కాగా, ఈ నెల 26 నుంచి ప్రారంభం కాబోయే పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. భారత బృందంలో 70 మంది పరుషులు, 47 మహిళా సభ్యులు ఉన్నారు. -
Paris Olympics 2024: ‘హ్యాట్రిక్’పై సింధు గురి
బ్యాడ్మింటన్‌ను 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో, ఆ తర్వాత 1988 సియోల్ ఒలింపిక్స్‌లలో ఎగ్జిబిషన్ / డెమాన్‌్రస్టేషన్ స్పోర్ట్‌గా ఆడించారు. అంటే పోటీలు జరిపి విజేతలను ప్రకటించినా...ఆ విజయాలను పతకాల జాబితాలో కలపరు. 1992లో జరిగిన బార్సిలోనా ఒలింపిక్స్‌నుంచి అధికారికంగా బ్యాడ్మింటన్ ఒలింపిక్స్‌లో భాగమైంది. 1992 నుంచి 2008 వరకు భారత షట్లర్లు పోటీల్లో పాల్గొన్నా...ఈ ఐదు ప్రయత్నాల్లోనూ మనకు ఒక్క పతకం కూడా దక్కలేదు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో చెప్పుకోదగ్గ విజయాలతో అప్పటికే తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పుల్లెల గోపీచంద్, విమల్ కుమార్, మధుమిత బిష్త్, పీవీవీ లక్ష్మి, అపర్ణా పొపట్, అనూప్ శ్రీధర్‌లాంటి ఆటగాళ్లు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్ వరకు చేరడమే అప్పటి వరకు భారత అత్యుత్తమ ప్రదర్శన. వరుసగా మూడు సార్లు... 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత్ పరిస్థితి మారింది. అప్పటికే వరుస విజయాలు, సూపర్ సిరీస్ టైటిల్స్‌తో అద్భుత ఫామ్‌లో ఉన్న సైనా నెహా్వల్ భారత్‌కు బ్యాడ్మింటన్‌లో తొలి ఒలింపిక్ పతకాన్ని అందించింది. సెమీ ఫైనల్లో యిహాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓడిన సైనా...ప్లే ఆఫ్ మ్యాచ్‌లో గ్జిన్ వాంగ్ (చైనా)పై విజయం సాధించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మరో వైపు పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్ క్వార్టర్ ఫైనల్ వరకు రాగలిగాడు. నాలుగేళ్ల తిరిగే సరికి షటిల్లో భారత్ పతకం మరింత మెరుగైంది. అంతర్జాతీయ యవనికపై దూసుకొచ్చిన 21 ఏళ్ల యువ తార పూసర్ల వెంకట (పీవీ) సింధు రజత పతకాన్ని గెలుచుకొని భారత అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. పదునైన ఆటతో ఫైనల్ చేరిన సింధు...తుది పోరులో కరోలినా మరీన్ (స్పెయిన్) చేతిలో ఓడింది. ఈ ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్స్ వరకు చేరినా...చైనా దిగ్గజం లిన్ డాన్ చేతిలో ఓడి నిష్క్రమించాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో కాంస్యం చేరింది. ఈ సారి కూడా సింధునే పతకాన్ని గెలుచుకుంది. సెమీస్‌లో తై జు (తైపీ) చేతిలో ఓటమిపాలైన సింధు... ప్లే ఆఫ్ పోరులో బింగ్జియావో (చైనా)పై గెలిచి వరుసగా రెండో ఒలింపిక్ పతకాన్ని తన మెడలో వేసుకుంది. పురుషుల డబుల్స్‌లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీపై ఆ సమయంలో మంచి అంచనాలే ఉన్నా...దురదృష్టవశాత్తూ వాళ్లు గ్రూప్ దశకే పరిమితమయ్యారు. అనుకూలమైన ‘డ్రా’తో... ఒలింపిక్స్‌లో భారత్‌నుంచి వ్యక్తిగత విభాగంలో రెండు పతకాలు గెలుచుకున్న ఆటగాళ్లు ఇద్దరే ఉన్నారు. సుశీల్ కుమార్ (రెజ్లింగ్), సింధు మాత్రమే ఈ ఘనత సాధించారు. ఇప్పుడు వరుసగా మూడో ఒలింపిక్స్‌లోనూ పతకం గెలిచి ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిచే అవకాశం సింధు ముందుంది. ఊహించినట్లుగానే గ్రూప్ దశలో రెండు సునాయాస మ్యాచ్‌లు ఉన్నాయి. ఆ తర్వాత వరుసగా 2020లో కాంస్య పోరులో తాను ఓడించిన బింగ్జియావో, చెన్ యు ఫె, మరీన్‌లను దాటితే ఫైనల్ వరకు వెళ్లగలదు. గత కొంత కాలంగా గొప్ప ఫామ్‌లో లేకపోయినా...కీలక సమయంలో సత్తా చాటగల నైపుణ్యం సింధు సొంతం. అందుకే ఆమె పతకం గెలవడంపై అంచనాలున్నాయి. పురుషుల డబుల్స్‌లో కూడా సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టికి మంచి ‘డ్రా’నే లభించింది. గ్రూప్ ‘సి’లో విజేతగా ముందంజ వేస్తే ఈ జోడీకి నాకౌట్లోనూ తమకంటే బలహీన ప్రత్యర్థులే ఎదరు కావచ్చు. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ ఎంత వరకు వెళతాడనేది ఆసక్తికరం. జొనాథన్ క్రిస్టీలాంటి టాప్ ప్లేయర్‌ను ఓడిస్తే లక్ష్యసేన్ నాకౌట్‌కు వెళ్లే అవకాశం ఉంది. ప్రిక్వార్టర్స్‌లో లక్ష్యసేన్, ప్రణయ్ ఎదురు కావచ్చు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప – తనీషా క్రాస్టో జోడి గ్రూప్ దశను దాటి నాకౌట్‌కు చేరడం కష్టమే. ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో గత మూడు ఒలింపిక్స్‌లలో వరుసగా పతకాలు వచ్చాయి. 2012లో సైనా నెహా్వల్ కాంస్యంతో మెరవగా...2016లో పీవీ సింధు రజతం సాధించింది. 2020లోనూ తన జోరును కొనసాగిస్తూ సింధు కాంస్యాన్ని అందుకుంది. –సాక్షి క్రీడా విభాగం -
Paris Olympics 2024: బుల్లెట్ దిగాలి...
ఇంతింతై వటుడింతై అన్న నానుడి భారత షూటింగ్ క్రీడాంశానికి వర్తిస్తుంది. 1952 హెల్సింకి ఒలింపిక్స్‌లో తొలిసారి భారత్ తరఫున ఇద్దరు షూటర్లు బరిలోకి దిగారు. నాటి నుంచి ప్రతి ఒలింపిక్స్‌లో భారత షూటర్ల ప్రాతినిధ్యం కనిపిస్తోంది. 2016 రియో ఒలింపిక్స్‌లో తొలిసారి రెండంకెల్లో భారత షూటర్లు పోటీపడగా... 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ అది కొనసాగింది... ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్‌లోనూ భారత్ నుంచి మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా 21 మంది షూటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మెడల్ ఈవెంట్స్‌గా ఉన్న 12 విభాగాల్లోనూ భారత షూటర్లు ఉండటంతో ఈసారి రిక్తహస్తాలతో కాకుండా ఒకట్రెండు పతకాలతో తిరిగి వస్తారని భారీ అంచనాలున్నాయి. మన షూటర్లు లక్ష్యంలో బుల్లెట్లు దించి పతకాలను కొల్లగొడుతారా లేక గురితప్పి నిరాశపరుస్తారో వేచి చూడాలి. –సాక్షి క్రీడా విభాగం రెండు దశాబ్దాల క్రితం ఏథెన్స్ ఒలింపిక్స్‌లో భారత సైనికాధికారి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ‘డబుల్ ట్రాప్’ షూటింగ్ ఈవెంట్లో దేశానికి తొలిసారి రజతం రూపంలో పతకాన్ని అందించాడు. నాలుగేళ్ల తర్వాత 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్రా ఎవ్వరూ ఊహించని విధంగా భారత్ ఖాతాలో స్వర్ణ పతకాన్ని జమ చేశాడు. 2000 సిడ్నీ, 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో విఫలమైన అభినవ్ బింద్రా 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో అద్భుత ప్రదర్శనతో అందరి అంచనాలను తారుమారు చేశాడు. స్వతంత్ర భారత్‌కు వ్యక్తిగత క్రీడాంశంలో తొలి బంగారు పతకాన్ని అందించాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో విజయ్ కుమార్ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో రజతం... గగన్ నారంగ్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో కాంస్యం సాధించడంతో భారత్‌కు వరుసగా మూడు ఒలింపిక్స్‌లో షూటింగ్ క్రీడాంశంలో పతకాలు దక్కాయి. 2016 రియో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి తొలిసారి అత్యధికంగా 12 మంది షూటర్లు పోటీపడటంతో వరుసగా నాలుగోసారీ పతకాలు గ్యారంటీ అని అభిమానులు అనుకున్నారు. కానీ 12 మందిలో ఇద్దరు (అభినవ్ బింద్రా, జీతూ రాయ్) మాత్రమే ఫైనల్ చేరుకున్నారు. వరుసగా ఐదో ఒలింపిక్స్‌లో పోటీపడ్డ అభినవ్ బింద్రా నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకాన్ని కోల్పోగా... పిస్టల్ షూటర్ జీతూ రాయ్ ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి ఏకంగా 15 మంది షూటర్లు పాల్గొనగా... ఒత్తిడికి తట్టుకోలేక స్టార్ షూటర్లు కూడా తడబడ్డారు. కేవలం సౌరభ్ చౌధరీ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లోకి ప్రవేశించి ఏడో స్థానంలో నిలిచాడు. అనుభవం పతకం తెస్తుందా... టోక్యో ఒలింపిక్స్ వైఫల్యాన్ని పక్కనబెడితే ఈసారి పారిస్ ఒలింపిక్స్‌కు ఏకంగా 21 మంది భారత షూటర్లు అర్హత సాధించారు. 21 మందిలో నలుగురు మాత్రమే టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడ్డ వాళ్లున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో ఆడిన మనూ భాకర్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల ఎయిర్ పిస్టల్), ఇలవేనిల్ వలారివన్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్), అంజుమ్ మౌద్గిల్ (50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్), ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ (50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్) పారిస్ ఒలింపిక్స్‌లోనూ బరిలోకి దిగనున్నారు. మనూ భాకర్ మాత్రం ఈసారి రెండు ఈవెంట్స్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఈ నలుగురు కాకుండా మిగతా 17 మంది షూటర్లు తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడుతున్నారు. ఒలింపిక్స్‌లాంటి అత్యున్నత వేదికపై మిల్లీమీటర్ల వ్యత్యాసంలో పతకాలు, ఫలితాలు తారుమారవుతాయి. షూటర్లకు చెక్కు చెదరని ఏకాగ్రత, మానసిక దృఢత్వం అత్యవసరం. గత ఒలింపిక్స్ వైఫల్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఒలింపిక్ బెర్త్‌లు సాధించిన షూటర్లకు నేరుగా పారిస్ ఒలింపిక్స్‌కు పంపించకూడదని నిర్ణయించింది. నాలుగు దశల్లో సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహించి ట్రయల్స్‌లో నిలకడగా రాణించిన షూటర్లనే పారిస్‌కు పంపిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రయల్స్‌లో నూ రాణించి ఫామ్‌లో ఉన్న మనూ, అంజుమ్, ఇలవేనిల్, ఐశ్వర్య ప్రతాప్ సింగ్ అసలైన వేదికపై కూడా మెరిపించి పతకాలతో తిరిగి రావాలని ఆశిద్దాం. అరంగేట్రంలోనే మెరిపిస్తారా! తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడుతున్న 17 మంది షూటర్లు ఒత్తిడికి లోనుకాకుండా సంయమనంతో వ్యవహరిస్తేనే పతకాల రేసులో నిలుస్తారు. ముఖ్యంగా అందరి దృష్టి 23 ఏళ్ల పంజాబ్ షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్రాపై ఉంది. 2022 ఆసియా క్రీడల్లో సిఫ్ట్ కౌర్ 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ విభాగంలో ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.తెలంగాణ షూటర్ ఇషా సింగ్ నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. 19 ఏళ్ల ఇషా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, ఆసియా క్రీడల్లో పిస్టల్ టీమ్ ఈవెంట్స్‌లో స్వర్ణ పతకాలు సాధించింది. అదే జోరును ఆమె పారిస్‌లో కొనసాగించాలని ఆశిద్దాం. పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ పోటీలు జూలై 27 నుంచి ఆగస్టు 5 వరకు జరుగుతాయి. ‘పారిస్’లో భారత షూటర్లుపురుషుల విభాగం: సందీప్ సింగ్, అర్జున్ బబూటా (10 మీటర్ల ఎయిర్ రైఫిల్), సరబ్జోత్ సింగ్, అర్జున్ సింగ్ చీమా (10 మీటర్ల ఎయిర్ పిస్టల్), స్వప్నిల్ కుసాలే, ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ (50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్), అనీశ్ భన్వాలా, విజయ్‌వీర్ సిద్ధూ (25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్), పృథ్వీరాజ్ (ట్రాప్), అనంత్‌జీత్ సింగ్ నరూకా (స్కీట్). మహిళల విభాగం: ఇలవేనిల్ వలారివన్, రమితా జిందాల్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్), రిథమ్ సాంగ్వాన్, మనూ భాకర్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్), ఇషా సింగ్, మనూ భాకర్ (25 మీటర్ల పిస్టల్), సిఫ్ట్ కౌర్ సమ్రా, అంజుమ్ మౌద్గిల్ (50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్), రాజేశ్వరి కుమారి, శ్రేయసి సింగ్ (ట్రాప్), రైజా ధిల్లాన్, మహేశ్వరి చౌహాన్ (స్కీట్). -
ఒలింపిక్స్‌లో 14 ఏళ్ల చేపపిల్ల
1952లో జరిగిన ఒలింపిక్స్‌లో భారతదేశం తరఫున 11 ఏళ్ల ఆర్తి సాహా పాల్గొని చరిత్ర సృష్టించింది. ఇన్నాళ్ల తర్వాత బెంగళూరు స్విమ్మర్ ధీనిధి దేశింఘు పారిస్ ఒలింపిక్స్‌లో ఈత పోటీలో పాల్గొనే అవకాశంపొందింది. 9వ తరగతి చదువుతున్న «ధీనిధి ఈతలో దేశీయ రికార్డులు సొంతం చేసుకుంది. కాని పారిస్ కల కోసం ఆమె చేసిన కృషి ఎట్టకేలకు ఆమె కోరుకున్నది సాధించి పెట్టింది‘నేను ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు క్లాసులో చాలా బిడియంగా ఉండేదాన్ని. చురుగ్గా లేనని మా అమ్మానాన్నలు ఈతలో చేర్పించారు. ముందు ఈతకు భయపడ్డాను. తర్వాత స్విమింగ్ పూల్ నా ఫ్రెండ్ అయ్యింది. ఆ తర్వాత ఈత నా ΄్యాషన్ అయ్యింది’ అంటుంది 14 ఏళ్ల «ధీనిధి దెశింఘు. తొమ్మిదవ తరగతి చదువుతున్న ఈ అమ్మాయి మరికొద్ది రోజుల్లో పారిస్‌లో మొదలు కానున్న ఒలింపిక్స్‌లో మన దేశ ప్రతినిధిగా పాల్గొననుంది. దాదాపు 70 ఏళ్ల తర్వాత ఇంత చిన్న వయసు అమ్మాయి మన దేశం నుంచి ఒలింపిక్స్‌లో పాల్గొననుండటం ఒక విశేషం. 1952 ఒలింపిక్స్‌లో 11 ఏళ్ల బాలిక ఆర్తి సాహా మన దేశం నుంచి పాల్గొంది.యూనివర్సాలిటీ కోటాఈసారి మన దేశం నుంచి ఎవరూ ఒలింపిక్స్‌లో ఈత పోటీలకు నేరుగా అర్హతపొందలేదు. ‘ఒలింపిక్ సెలక్షన్ టైమ్’ ప్రదర్శించి ‘ఇంటర్నేషనల్ స్విమింగ్ ఫెడరేషన్’ ద్వారా అయినా ఆహ్వానాన్నిపొందలేదు. ఇలాంటి సమయంలో ఒలింపిక్స్ వారు ఆయా దేశాలకు ‘యూనివర్సాలిటీ ప్లేసెస్’ కింద ఇద్దరిని పంపమని అనుమతి ఇస్తారు. జాతీయంగా ఉత్తమ ప్రతిభ ఉన్న ఇద్దరిని అలా పంపవచ్చు. ఈ ‘కోటా’ను ఉపయోగించుకుని మన దేశం ఉంచి పురుషుల ఈత కోసం శ్రీహరి నటరాజ్‌ను, స్త్రీల ఈత కోసం «ధీనిధిని ఎంపిక చేసి పంపుతున్నారు. ఒలింపిక్స్ కమిటీ వీరు పాల్గొనడాన్ని అనుమతించింది. యూనివర్సాలిటీ ప్లేసెస్ కింద «ధీనిధి ఎంపిక సాగినా అంత చిన్న వయసులో ఆ అవకాశంపొందడం కూడా ఘనతే.స్ట్రయిట్ ఆర్మ్ టెక్నిక్బెంగళూరుకు చెందిన «ధీనిధి అక్కడి డాల్ఫిన్ ఆక్వాటిక్స్‌లో ఈత కోసం చేరినప్పుడు పూల్‌లో చేపపిల్లలా ఈదుతున్న ఆ అమ్మాయిని చూసి కోచ్ మధుకుమార్ ఈ పిట్ట కొంచెం కూత ఘనం అని కనిపెట్టాడు. ఆమెకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. స్ట్రయిట్ ఆర్మ్ టెక్నిక్‌తో ఈత కొట్టే కొద్దిమంది భారతీయ స్విమ్మర్లలో «ధీనిధి నిలిచింది.12 ఏట నుంచే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది. ‘నా కంటే వయసులో రెండింతలు ఎక్కువ ఉన్నవారు నా పక్కన ఉంటే భయం వేసేది. కాని పూల్‌లో దిగాక ఈత మీదే నా దృష్టి’ అంటుంది «ధీనిధి. గోవాలో జరిగిన 2023 నేషనల్ గేమ్స్‌లో ఈతలో కర్నాటక 7 స్వర్ణాలు సాధించడంలో ధినిధి కీలకంగా నిలిచింది. అదే డాల్ఫిన్ ఆక్వాటిక్స్‌లో ద్రోణాచార్య అవార్డీ నిహార్ అమీన్ శిక్షణ మొదలయ్యాక 200 మీటర్ల ఫ్రీ స్టయిల్లో ఆమె మరింత ప్రతిభ కనబరిచి 02:04–24 సెకన్ల రికార్డు సొంతం చేసుకుంది.కఠోర శ్రమ‘ఈ అవకాశం నాకు ఊరికే రాలేదు. ఫ్రెండ్స్, సినిమా, ఫోన్, వేరే ఆటలు అన్నీ పక్కనపెట్టి రోజుకు ఆరు గంటలు సాధన చేశాను. ఇందులో జిమ్ ఉంటుంది, ఈత కూడా ఉంటుంది. అప్పుడప్పుడు బాగా ఒంటరిగా అనిపించేది. కాని ఒలింపిక్స్‌లో పాల్గొనే నా కల కోసం ముందుకు సాగేదాన్ని. ఒలింపిక్స్‌లో 7సార్లు గోల్డ్ సాధించిన లెజెండ్ స్విమ్మర్ కేటీ లెడెకి నాకు స్ఫూర్తి. ఆమెను పారిస్ ఒలింపిక్స్‌లో కలవబోతున్నానన్న ఊహే నాకు చాలా ఎక్సయిటింగ్‌గా ఉంది. ఆమె కోసం కొన్ని కానుకలు కూడా తీసుకెళుతున్నాను’ అంది ధీనిధి. పారిస్ ఒలింపిక్స్‌లో «ధీనిధి ఏ మెడల్ సాధించినా ఆమెపొందబోయే ప్రశంసలు ఒక సముద్రాన్నే తలపించకమానవు. వాటిని ఈదుకుంటూ ఆమె మరింత ముందుకు పోవాల్సి ఉంటుంది. -
సింధు సత్తాకు సవాల్!
కౌలాలంపూర్: ఒలింపిక్స్ చరిత్రలో గతంలో ఏ భారతీయ ప్లేయర్‌కు సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకోవాలంటే... భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ ఈవెంట్ ‘డ్రా’ వివరాలను శుక్రవారం ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) విడుదల చేసింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన సింధు ‘పారిస్’లోనూ పతకం గెలిస్తే... భారత్ నుంచి ఒలింపిక్స్ చరిత్రలో మూడు వ్యక్తిగత పతకాలు నెగ్గిన ఏకైక ప్లేయర్‌గా రికార్డు సృష్టిస్తుంది. ‘డ్రా’ ప్రకారం సింధుకు గ్రూప్ దశలో సునాయాస ప్రత్యర్థులు ఎదురుకానున్నారు. గ్రూప్ ‘ఎం’లో ఉన్న సింధు ప్రపంచ 75వ ర్యాంకర్ క్రిస్టిన్ కుబా (ఎస్తోనియా)తో, ప్రపంచ 111వ ర్యాంకర్ ఫాతిమత్ నభా (మాల్దీవులు)తో ఆడుతుంది. గ్రూప్ విజేత హోదాలో సింధు ప్రిక్వార్టర్ చేరితే ఆరో సీడ్ హి బింగ్జియావో (చైనా)తో తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 9–11తో వెనుకంజలో ఉంది. హి బింగ్జియావోపై నెగ్గితే సింధుకు క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్ చెన్ యు ఫె (చైనా) ఎదురవుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 6–6తో సమంగా ఉంది. చెన్ యు ఫెను కూడా ఓడిస్తే సింధుకు సెమీఫైనల్లో రియో ఒలింపిక్స్ విజేత, మూడుసార్లు వరల్డ్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) సిద్ధంగా ఉండే అవకాశముంది. ముఖాముఖి రికార్డులో సింధు 5–12తో వెనుకంజలో ఉంది. ఒకవేళ మారిన్‌పై ఈసారి సింధు గెలిస్తే పతకం ఖరారవుతుంది. మారిన్ చేతిలో సింధు ఓడిపోతే కాంస్య పతకం కోసం రేసులో నిలుస్తుంది. కాంస్య పతకం కోసం మరో పార్శ్వంలో ఉన్న వరల్డ్ నంబర్‌వన్ అన్ సె యంగ్ (దక్షిణ కొరియా), ప్రపంచ మూడో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ), ప్రపంచ ఐదో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)లలో ఒకరితో సింధు ఆడే చాన్స్ ఉంటుంది. పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి ప్రణయ్, లక్ష్య సేన్ బరిలో ఉన్నారు. గ్రూప్ ‘కె’లో ప్రణయ్... గ్రూప్ ‘ఎల్’లో లక్ష్య సేన్ ఉన్నారు. లక్ష్య సేన్ గ్రూప్‌లోనే ఈ ఏడాది ఆసియా చాంపియన్, ఆల్ ఇంగ్లండ్ చాంపియన్, ప్రపంచ 3వ ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) ఉన్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్ చేరాలంటే లక్ష్య సేన్ తప్పనిసరిగా క్రిస్టీపై గెలవాల్సి ఉంటుంది. స్థాయికి తగ్గట్టు ఆడితే గ్రూప్ ‘కె’ నుంచి ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంటాడు. ‘డ్రా’ ప్రకారం ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్, లక్ష్య సేన్ ముఖాముఖిగా తలపడే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఇద్దరు భారత ఆటగాళ్లలో ఒకరికి మాత్రమే పతకం నెగ్గే అవకాశం ఉంటుంది. మహిళల డబుల్స్‌లో నాలుగు జోడీలు ఉన్న గ్రూప్ ‘సి’లో అశ్విని పొన్నప్ప–తనీషాలకు చోటు లభించింది. క్వార్టర్ ఫైనల్ చేరాలంటే భారత జోడీ రెండు మ్యాచ్‌ల్లో గెలవాలి.మరోవైపు పురుషుల డబుల్స్ ‘డ్రా’లో ఎన్ని జోడీలు ఉండాలనే విషయంపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్‌లో కేసు నడుస్తున్న నేపథ్యంలో ఈ విభాగం ‘డ్రా’ను ప్రకటించలేదు. ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో భారత స్టార్ ద్వయం సాతి్వక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టిపై భారీ అంచనాలు ఉన్నాయి. పారిస్ ఒలింపిక్స్ ఈనెల 26 నుంచి జరగనుండగా... బ్యాడ్మింటన్ ఈవెంట్ 27న మొదలవుతుంది. -
పారిస్ ఒలింపిక్స్.. భారీగా ట్రావెల్ బుకింగ్స్!
పారిస్ ఒలింపిక్స్ 2024 మరికొద్ది వారాల్లో ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ట్రావెల్ బుకింగ్స్ భారీగా పెరినట్లు ఎయిర్ బీఎన్బీ తెలిపింది. తన ఆన్లైన్ ప్లాట్ఫామ్లో దాదాపు 90 శాతం వినియోగదారులు ఒలింపిక్స్ జరిగే ప్రదేశాల చుట్టూ ఉన్న హోటల్స్ కోసం సెర్చ్ చేస్తున్నట్లు పేర్కొంది.జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే ఒలింపిక్స్ క్రీడలకు ఈసారి పారిస్ ఆతిథ్యం ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, అథ్లెట్లు, ఇతరులు ఈ క్రీడల్లో పాల్గొనే అవకాశం ఉంది. దాంతో ఇప్పటికే చాలా మంది ఒలింపిక్స్ జరిగే క్రీడా ప్రాంగణాల పరిసరాల్లోని హోటల్స్‌ను బుక్ చేసుకున్నారు. ఈమేరకు ఆతిథ్య రంగంలో సేవలందిస్తున్న ప్రముఖ ఆన్లైన్ హోటల్ బుకింగ్ ప్లాట్పామ్ ఎయిర్ బీఎన్బీ ప్రకటన విడుదల చేసింది. ఒలింపిక్స్ జరిగే ఆక్వాటిక్స్ సెంటర్, బెర్సీ అరెనా, బార్డాక్స్ స్టేడియం, చాంప్ డే మార్స్ అరెనా, చాటూ డి వెర్సల్లీస్, చాట్రాక్స్ షూటింగ్ సెంటర్, ఈఫిల్ టవర్ స్టేడియం..వంటి క్రీడా ప్రాంగాణాల పరిసరాల్లో హోటల్స్ పూర్తిగా బుక్ అయినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా తమ వినియోగదారుల్లో దాదాపు 90 శాతం మంది ఈ ఒలింపిక్స్ జరిగే ప్రాంతాల్లోని హోటల్స్‌ను సెర్చ్ చేస్తున్నట్లు పేర్కొంది. భారత్, చైనా, హాంకాంగ్, జపాన్ నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఈసారి అత్యధిక పెరుగుదల కనిపిస్తుందని చెప్పింది. భారతీయ ప్రయాణికులు పారిస్‌తోపాటు సమీపంలోని నైస్, ఆబర్‌విల్లియర్స్, కొలంబెస్, సెయింట్-ఓవెన్-సుర్-సీన్ వంటి ఇతర ప్రదేశాలను అన్వేషిస్తున్నారని తెలిపింది.ఈ సందర్భంగా ఎయిర్ బీఎన్బీ జనరల్ మేనేజర్ అమన్‌ప్రీత్ బజాజ్ మాట్లాడుతూ..‘ప్రపంచవ్యాప్తంగా 160 కంటే ఎక్కువ దేశాల నుంచి అభిమానులు, క్రీడాకారులు, అథ్లెట్లు ఒలింపిక్స్‌కు హాజరుకానున్నారు. భారతీయులు ఒలింపిక్స్ ఈవెంట్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలను ప్లాన్ చేస్తున్నారు. గతంలో కంటే 30 శాతం భారత ప్రయాణికుల సంఖ్య పెరుగనుంది. ఈ నేపథ్యంలో మార్చి 31 నాటికి హోటల్స్‌లో బుక్ అయిన ‘స్టేయింగ్ టైం(రాత్రి, పగలు బుక్ చేసుకునే సమయం)’ రెండేళ్ల క్రితం వ్యవధితో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువగా ఉంది’ అన్నారు.ఇదీ చదవండి: ఖతార్‌లో యూపీఐ సేవలు..!పారిస్‌లో జరిగే ఒలింపిక్ క్రీడల పరిసర ప్రాంతాల్లోని దాదాపు రూ.8,300 కోట్లు వ్యాపారం సాగుతుందని అంచనా. దీనివల్ల దాదాపు 7,300 మందికి ఉపాధి లభిస్తుందని సమాచారం. ఇదిలాఉండగా, పారిస్‌లో ఒలింపిక్స్ నిర్వహణ సరైన నిర్ణయం కాదని గతంలో 44 శాతం స్థానికులు అభిప్రాయపడ్డారు. వేదికలు, క్రీడా గ్రామాల ఏర్పాటులో భాగంగా వేలాది మంది నిర్వాసితులను సమీపంలోని భవనాల నుంచి ఖాళీ చేయించడంపైనా విమర్శలు వస్తున్నాయి. -
Paris Olympics 2024: విశ్వ క్రీడల్లో భారత్.. హాకీలో అత్యధికంగా..!
విశ్వ క్రీడల్లో (ఒలింపిక్స్) భారత ప్రస్తానం 1900వ సంవత్సరంలో మొదలైంది. ఆ ఎడిషన్‌లో భారత్ కేవలం ఒకే ఒక అథ్లెట్‌తో పాల్గొంది. భారత్ తరఫున బ్రిటిష్ అథ్లెట్ (అప్పటికి భారత్ బ్రిటిష్ పాలనలో ఉండింది) నార్మన్ ప్రిచార్డ్ పురుషుల 200 మీటర్ల రన్నింగ్ రేస్, 200 మీటర్ల హర్డిల్స్‌లో పాల్గొని రెండు రజత పతకాలు సాధించాడు.భారత్ 1920లో తొలిసారి స్వదేశీ ఆథ్లెట్లతో ఒలింపిక్స్‌లో పాల్గొంది. బెల్జియంలో జరిగిన ఆ ఎడిషన్‌లో భారత్ తరఫున ఐదుగురు అథ్లెట్లు రెండు క్రీడా విభాగాల్లో పాల్గొన్నారు. ఆ ఎడిషన్‌లో భారత్ రిక్త హస్తాలతో వెనుదిరిగింది.అనంతరం 1924 పారిస్ ఒలింపిక్స్‌లో కూడా భారత్‌కు చేదు అనుభవమే ఎదురైంది. ఆ ఎడిషన్‌లో భారత్ 12 మంది అథ్టెట్లను బరిలోకి దించినా ప్రయోజనం లేకుండా పోయింది.భారత్ తొలిసారి స్వతంత్రంగా ఒలింపిక్స్ పతకాన్ని 1928 ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్‌లో సాధించింది. ఆ ఎడిషన్‌లో భారత పురుషుల హాకీ జట్టు ఏకంగా గోల్డ్ మెడల్నే సాధించి చరిత్ర సృష్టించింది.ఆ ఎడిషన్ (1928) నుంచి భారత్ వరుసగా ఐదు ఒలింపిక్స్‌లో (1932, 1936, 1948, 1952, 1956) స్వర్ణ పతకాలకు సాధించి పురుషుల హాకీలో మకుటం లేని మహారాజులా కొనసాగింది.1952 ఫిన్లాండ్ ఒలింపిక్స్‌లో భారత్ తొలిసారి రెజ్లింగ్‌లో పతకం సాధించింది. ఆ ఎడిషన్‌లో పురుషుల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్‌లో ఖషాబా జాదవ్ కాంస్య పతకాన్ని సాధించి, భారత్ తరఫున తొలి పతకం సాధించిన భారతీయ అథ్లెట్‌గా చరిత్రపుటల్లోకెక్కాడు.1960 రోమ్ ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు రజత పతకంతో సరిపెట్టుకుంది. ఈ ఎడిషన్‌లో భారత్‌కు లభించిన ఏకైక పతకం ఇదే.1964 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ తిరిగి పురుషుల హాకీలో స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకుంది.1968 మెక్సికో, 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌కు వచ్చే సరికి భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాలతో సరిపెట్టుకుంది.1976 మాంట్రియాల్ ఒలింపిక్స్‌లో భారత్ రిక్త హస్తాలతో వెనుదిరిగింది. ఆ ఎడిషన్‌లో 26 మంది క్రీడాకారులు 5 విభాగాల్లో పోటీపడినా ఒక్క పతకం కూడా దక్కలేదు.1980 మాస్కో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు తిరిగి మరోసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అనంతరం 1984 లాస్ ఏంజెలెస్, 1988 సియోల్, 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో భారత్ ఖాతా తెరవలేకపోయింది.మూడు ఎడిషన్ల తర్వాత భారత్ మరోసారి ఓ పతకం సాధించింది. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో భారత టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ కాంస్య పతకం సాధించాడు.2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున తొలిసారి ఓ మహిళ పతకం సాధించింది. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్‌లో కరణం మల్లేశ్వరి కాంస్య పతకం సాధించింది.2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో భారత్ షూటింగ్లో రజత పతకం సాధించింది. పురుషుల డబుల్స్ ట్రాప్‌లో రాజ్యవర్దన్‌సింగ్ రాథోడ్ భారత్‌కు ఆ ఎడిషన్‌లో ఏకైక పతకాన్ని అందించాడు.2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత్ తొలిసారి రెండిటి కంటే ఎక్కవ పతకాలు సాధించి. ఆ ఎడిషన్‌లో భారత్ ఓ గోల్డ్ మెడల్‌తో పాటు రెండు కాంస్య పతకాలను సాధించింది. పురుషుల షూటింగ్లో అభినవ్ బింద్రా స్వర్ణ పతకాన్ని.. పురుషుల రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్, పురుషుల బాక్సింగ్‌లో విజేందర్ సింగ్ కాంస్య పతకాలను సాధించారు.2012 లండన్ ఒలింపిక్స్‌లో 83 మంది క్రీడాకారులతో 13 విభాగాల్లో పాల్గొన్న భారత్.. రెండు రజత పతకాలు, నాలుగు కాంస్య పతకాలు సాధించింది. పురుషుల షూటింగ్లో విజయ్‌కుమార్, పురుషుల రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్ రజత పతకాలు సాధించగా.. పురుషుల షూటింగ్లో గగన్ నారంగ్, మహిళల బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్, మహిళల బాక్సింగ్‌లో మేరీ కోమ్, పురుషుల రెజ్లింగ్‌లో యోగేశ్వర్ దత్ కాంస్య పతకాలు సాధించారు.2012 ఒలింపిక్స్‌లో ఆరు పతకాలు గెలిచిన భారత్ 2016 రియో ఒలింపిక్స్‌లో మళ్లీ మొదటికొచ్చింది. ఈ ఎడిషన్‌లో కేవలం రెండు పతకాలతోనే సరిపెట్టుకుంది. మహిళల బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు రజతం, మహిళల రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్ కాంస్య పతకం సాధించారు.120 ఏళ్ల భారత ఒలింపిక్స్ చరిత్రలో భారత్ అత్యధిక పతకాలను 2020 టోక్యో ఒలింపిక్స్‌లో సాధించింది. ఈ ఎడిషన్‌లో భారత్ ఏకంగా ఏడు పతకాలు ఖాతాలో వేసుకుంది. ఇందులో ఓ గోల్డ్, రెండు సిల్వర్, నాలుగు బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి.పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించగా.. మహిళల వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయ్ చాను.. పురుషుల రెజ్లింగ్‌లో రవికుమార్ దాహియా రజత పతకాలను.. మహిళల బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, మహిళల బాక్సింగ్‌లో లవ్లీనా బోర్గోహెయిన్, పురుషుల రెజ్లింగ్‌లో భజరంగ్ పూనియా, పురుషుల హాకీ టీమ్ కాంస్య పతకాలను సాధించాయి.జులై 26 నుంచి ప్రారంభంకాబోయే పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ 113 మంది క్రీడాకారులతో 16 విభాగాల్లో పాల్గొంటుంది. మరి ఈసారి భారత్ ఎన్ని పతకాలు సాధిస్తుందో వేచి చూడాలి. ఓవరాల్‌గా భారత్ ఇప్పటివరకు 35 ఒలింపిక్స్ పతకాలు సాధించగా.. ఒక్క పురుషుల హాకీలోనే 11 పతకాలు రావడం విశేషం. -
పారిస్ ఒలింపిక్స్ 2024: సన్నాహకాలు.. ఓ లుక్కేయండి (ఫొటోలు)
-
Vinesh Phogat: పట్టు వదలని పోరాటం..!
దాదాపు ఏడాదిన్నర క్రితం ఆమె.. జీవితంలో అతి పెద్ద సవాల్‌ను ఎదుర్కొంది. అయితే అది రెజ్లింగ్ మ్యాట్‌పై కాదు.. ఢిల్లీ వీథుల్లో.. కొన్ని రోజుల పాటు ఫుట్‌పాత్‌పై పడుకోవడం.. పోలీసు దెబ్బలు, ఆపై అరెస్ట్, బహిరంగంగా అవమానాలు.. ఆన్లైన్లో చంపేస్తామనే బెదిరింపులు.. ప్రభుత్వ పెద్దల అబద్ధపు హామీలు.. జీవిత కాలపు శ్రమతో సాధించిన ఖేల్రత్నలాంటి అవార్డులు వెనక్కి ఇచ్చేయడం, ఒక దశలో సాధించిన పతకాలన్నింటినీ గంగానదిపాలు చేయాల్సిన స్థితికి చేరడం.. ఇక కెరీర్ ముగిసినట్లే, రిటైర్మెంట్ ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చేసినట్లే అనిపించిన క్షణం.. ఇదంతా ఎందుకు జరిగింది? ఇదంతా తమకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించడం వల్లే!సహచర మహిళా రెజ్లర్లు ఎదుర్కొన్న లైంగిక వేధింపులకు కారణమైన వ్యక్తిని తప్పించి తమకు న్యాయం చేయమని కోరడం వల్లే! కెరీర్‌ను పణంగా పెట్టి చేసిన ఆ పోరాటం వెంటనే సత్ఫలితాన్నివ్వలేదు. పైగా భవిష్యత్తును అనిశ్చితిలో పడేసింది. కానీ ఆమె వెనక్కి తగ్గలేదు. మళ్లీ రెజ్లింగ్‌పై దృష్టి పెట్టింది. తీవ్ర గాయంతో ఆటకు దూరమయ్యే పరిస్థితి వచ్చినా పట్టుదల వీడలేదు. గాయం నుంచి కోలుకొని మళ్లీ పోరాడింది.ఆరు నెలలు ముగిసేలోగా తనేంటో నిరూపిస్తూ వరుస విజయాలు అందుకుంది. దాంతో పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. వరుసగా మూడో ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్న తొలి భారత మహిళా రెజ్లర్‌గా వినేశ్ ఫొగాట్ నిలిచింది. ఇప్పటికే వరల్డ్, ఆసియా, కామన్వెల్త్ పతకాలతో తనకంటూ ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్న వినేశ్.. ఒలింపిక్స్ పతకంతో కెరీర్‌ను పరిపూర్ణం చేసుకునేందుకు సిద్ధమవుతోంది.రియో ఒలింపిక్స్‌లో గాయపడి..‘గాయాలు నాకు కొత్త కాదు. కెరీర్లో ఎన్నోసార్లు వాటితో ఇబ్బంది పడ్డాను. కానీ శస్త్ర చికిత్సలతో కోలుకొని మళ్లీ మ్యాట్‌పై అడుగు పెట్టగలిగాను. ఇప్పుడు తగిలిన గాయం మాత్రం చాలా పెద్దది. నేను కాలు విరిగినప్పుడు కూడా బాగానే ఉన్నాననిపించింది. కానీ ఇప్పుడు నా మనసు విరిగిపోయింది’ అంటూ ఢిల్లీ ఉదంతం తర్వాత కన్నీటితో వినేశ్ ఫొగాట్ చేసిన వ్యాఖ్య ఇది.భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ సహచరులు బజరంగ్ పూనియా, సాక్షి మలిక్‌లతో కలసి వినేశ్ నిరసన చేపట్టింది. అయితే బ్రిజ్‌భూషణ్ అధికార పార్టీ ఎంపీ కావడంతో వారికి ఆశించిన మద్దతు లభించలేదు. దానికి తోడు తీవ్ర విమర్శలు, వ్యంగ్య వ్యాఖ్యలు.ఈ పోరాటం ముగిసిన తర్వాత మళ్లీ ఆటపై అడుగు పెట్టేందుకు చేసిన క్రమంలో విమర్శలు ఇంకా తీవ్రమయ్యాయి. సెలక్షన్ ట్రయల్స్‌కు హాజరు కాకుండా తన సీనియారిటీని ఉపయోగించి అడ్డదారిలో ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తోందంటూ ఆరోపణలు వచ్చాయి. ప్రాక్టీస్ కొనసాగించాల్సిన సమయంలో ఈ మనోవేదన. కానీ వినేశ్ బేలగా మారిపోలేదు. మరింత బలంగా నిలబడింది. గతంలోలాగే రెట్టింపు శ్రమించి మ్యాట్‌పైనే సత్తా చాటింది.2018 ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్ సాధించిన సందర్భం..రెజ్లింగ్ కుటుంబం నుంచి వచ్చి..‘ఫొగాట్ సిస్టర్స్’.. అని వినగానే భారత క్రీడా, సినిమా అభిమానుల దృష్టిలో దంగల్ సినిమా కదలాడుతుంది. మాజీ రెజ్లర్, కోచ్ మహావీర్ సింగ్ ఫొగాట్ జీవిత విశేషాలతో ఆ సినిమా రూపొందింది. సినిమాలో ప్రధాన పాత్రలైన గీత, బబితలతో పాటు రీతూ, సంగీత కూడా మహావీర్ సింగ్ కూతుళ్లే. అతని సోదరుడైన రాజ్‌పాల్ ఫొగాట్ కూతురే వినేశ్. ఆమెకు ప్రియంకా అనే సోదరి కూడా ఉంది. తనకు 9 ఏళ్ల వయసున్నప్పుడు తండ్రి అనూహ్యంగా మరణించారు. ఆ తర్వాత పెదనాన్న వద్దే వినేశ్ కూడా రెజ్లింగ్‌లో ఓనమాలు నేర్చుకుంది. తన కజిన్ గీత కంటే వినేశ్ ఆరేళ్లు చిన్నది. గీత జాతీయ స్థాయిలో విజయాలతో వెలుగులోకి వస్తున్న దశలో వినేశ్ రెజ్లింగ్‌లోకి ప్రవేశించింది. అమ్మాయిలపై వివక్ష చూపించడంలో అగ్రస్థానంలో ఉండే హరియాణా రాష్ట్రంలో అందరిలాగే తాను కూడా ఈ ఆటలో ప్రవేశించే ముందు సూటిపోటి మాటలు ఎదుర్కొంది. కానీ పెదనాన్న అండతో వాటన్నంటినీ వెనక్కి తోసి రెజ్లింగ్‌లో తన పట్టును చూపించింది. జూనియర్, యూత్ స్థాయిలో వరుస విజయాలతో ఆపై వినేశ్ దూసుకుపోయింది. 2013లో దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన యూత్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో రజతపతకం గెలుచుకోవడంతో వినేశ్ అందరి దృష్టిలో పడింది.సీనియర్ స్థాయిలో విజయాలతో..న్యూఢిల్లీలో 2013లో ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్ జరిగింది. 19 ఏళ్ల వినేశ్ మొదటిసారి అంతర్జాతీయ సీనియర్ స్థాయిలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలోకి దిగింది. క్వార్టర్స్ వరకు చేరి అక్కడ ఓడినా.. రెపిచెజ్ రూపంలో మరో అవకాశం దక్కింది. ఇందులో థాయిలండ్ రెజ్లర్ శ్రీప్రపను ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది.లైంగిక వేధింపులను నిరసిస్తూ..ఆమె సాధించిన తొలి అంతర్జాతీయ పతకం ఇదే కావడం విశేషం. ఇది ఆరంభం మాత్రమే. వినేశ్ అంతటితో ఆగిపోలేదు. ఆ తర్వాత ఆసియా చాంపియన్‌షిప్‌లో ఆమె మరో 3 కాంస్యాలు, 3 రజతాలు, ఒక స్వర్ణం గెలుచుకుంది. తన సోదరీమణులను దాటి వారికంటే మరిన్ని పెద్ద విజయాలతో వినేశ్ పైకి దూసుకుపోయింది. ప్రతిష్ఠాత్మక మూడు ఈవెంట్లలో ఆమె పతకాలు గెలుచుకోవడం విశేషం. వరుసగా మూడు కామన్వెల్త్ (2014, 2018, 2022)క్రీడల్లో వినేశ్ స్వర్ణపతకాలు గెలుచుకుంది. ఆపై ఆసియా క్రీడల్లోనూ సత్తా చాటింది. 2014 ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన ఆమె తర్వాతి క్రీడలకు (2018) వచ్చేసరికి స్వర్ణంతో మెరిసింది. ఇక 2019, 2022 వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో వినేశ్ గెలుచుకున్న కాంస్య పతకాలు ఆమె ఘనతను మరింత పెంచాయి.ఒలింపిక్స్ పతకమే లక్ష్యంగా..2016 రియో ఒలింపిక్స్‌లో జరిగిన ఘటన వినేశ్ కెరీర్లో ఒక్కసారిగా విషాదాన్ని తెచ్చింది. ఇస్తాంబుల్‌లో జరిగిన క్వాలిఫయింగ్ ఈవెంట్లో గెలిచి అమిత ఉత్సాహంతో ఆమె ఒలింపిక్స్‌లోకి అడుగు పెట్టింది. చక్కటి ఆటతో క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకుంది. అయితే 21 ఏళ్ల వినేశ్ ఒలింపిక్స్ పతకం కలలు అక్కడే కల్లలయ్యాయి. చైనాకు చెందిన సున్ యానన్‌తో ఆమె ఈ మ్యాచ్‌లో తలపడింది. బౌట్ మధ్యలో ఆమె కుడి మోకాలుకు తీవ్ర గాయమైంది. ఆ బాధను తట్టుకోలేక ఆమె మ్యాట్‌పైనే ఏడ్చేసింది.స్ట్రెచర్‌పై వినేశ్‌ను బయటకు తీసుకుపోవాల్సి వచ్చింది. అయితే ఇది ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేదు. నాటి ఘటనను గుర్తు చేసుకుంటూ మరింత ప్రేరణ పొందింది. శస్త్రచికిత్స, ఆపై రీహాబిలిటేషన్ తర్వాత మళ్లీ బరిలోకి దిగి విజయాలు అందుకుంది. ఈ క్రమంలో 2021 టోక్యో ఒలింపిక్స్‌లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే సమయం వచ్చింది. అప్పుడే అద్భుత ఫామ్‌లో ఉన్న ఆమె టాప్ సీడ్‌గా అడుగు పెట్టింది.పారిస్ ఒలింపిక్స్‌కి అర్హత సాధించి.., సర్జరీ తర్వాత..అయితే మరోసారి నిరాశను కలిగిస్తూ రెండో రౌండ్లో వెనుదిరిగింది. ఈ మెగా ఈవెంట్ వైఫల్యం తర్వాత జరిగిన ఘటనలు ఆమెను మానసికంగా మరింత కుంగిపోయేలా చేశాయి. ఓటమి తర్వాత వినేశ్‌పై క్రమశిక్షణా చర్యలు అంటూ రెజ్లింగ్ ఫెడరేషన్ సస్పెన్షన్ విధించింది. టీమ్‌కి ఇచ్చిన యూనిఫామ్‌ను ధరించకుండా మరో లోగో వాడిందని, గేమ్స్ విలేజ్‌లో కాకుండా బయట ఉందని, భారత జట్టు సహచరులతో కలసి సాధన చేయలేదని ఆరోపణలు వచ్చాయి.అదృష్టవశాత్తు ఫెడరేషన్ కొద్ది రోజులకే సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. గత ఏడాది ఆగస్టులో ఆమె మళ్లీ గాయపడింది. ఎడమ మోకాలుకు యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ (ఏసీఎల్) గాయమైంది. దానికి మళ్లీ శస్త్ర చికిత్స, రీహాబిలిటేషన్.. ఆపై మ్యాట్‌పై పోరుకు సిద్ధమైంది. అన్నింటికి మించి ఒలింపిక్స్ కోసం వెయిట్ కేటగిరీ మారాల్సి రావడం ఆమెకు పెద్ద సవాల్ అయింది. సాధారణంగా రెజ్లింగ్‌లో వెయిట్ కేటగిరీ మారడం అంత సులువు కాదు. పైగా తక్కువకు మారడం మరీ కష్టం.ఆట ఆరంభంనుంచి ఆమె 53 కేజీల విభాగంలోనే పోటీ పడింది. అయితే వేర్వేరు కారణాలు, మరో ప్లేయర్ అదే కేటగిరీలో అర్హత సాధించడంతో తప్పనిసరిగా మారాల్సి వచ్చింది. తాను దేంట్లో అయినా నెగ్గగలననే పట్టుదలే మళ్లీ వినేశ్‌ను నడిపించింది. 50 కేజీల విభాగానికి మారి మరీ ఆమె పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఇన్ని అవరోధాలను దాటి ఇక్కడి వరకు వచ్చిన వినేశ్ తన మూడో ప్రయత్నంలోనైనా ఒలింపిక్స్ పతకం గెలిచి తన కలను సాకారం చేసుకోవాలని ఆశిద్దాం. – మొహమ్మద్ అబ్దుల్ హాది -
చెఫ్ డి మిషన్‌గా వైదొలగిన మేరీకోమ్
న్యూఢిల్లీ: ఆరుసార్లు ప్రపంచ చాంపియన్, భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ పారిస్ ఒలింపిక్స్‌లో చెఫ్ డి మిషన్‌గా వ్యవహరించలేనని తన బాధ్యతల నుంచి వైదొలగింది. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉషకు ఆమె లేఖ రాసింది. ‘దేశానికి సేవ చేయడాన్ని నేనెప్పుడు గౌరవంగా భావిస్తాను. మానసికంగానూ సిద్ధంగా ఉంటా. కానీ... వ్యక్తిగత కారణాల వల్ల ప్రతిష్టాత్మక ఈవెంట్లో గురుతర బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నాను. అందుకే ఆ పదవికి రాజీనామా చేస్తున్నా’ అని 41 ఏళ్ల ఈ మణిపూర్ మహిళా బాక్సర్ లేఖలో వివరించింది. దీనిపై స్పందించిన పీటీ ఉష... మేరీకోమ్ పదవి నుంచి తప్పుకోవడం బాధాకరమే అయినా... ఆమె నిర్ణయాన్ని, వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తామని తెలిపారు. మేరీ స్థానంలో మరొకరిని నియమిస్తామని ఉష చెప్పారు. పారిస్ ఒలింపిక్స్ ఈ ఏడాది జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరుగుతాయి. -
యుద్ధ భయంతో పడవ ఎక్కితే..నడి సంద్రంలో ఇంజన్ ఫెయిల్..!
యుద్ధం సృష్టించే విలయం అంతా ఇంత కాదు. ముఖ్యంగా అభం శుభం తెలియని చిన్నారులు అనాథలుగా మారిపోతారు. ఎన్నో కుటుంబాలు వీధిన పడతాయి. ప్రాణాలు అరచేత పట్టుకుని పరాయి దేశాలకు పారిపోయి శరణార్థులుగా బిక్కుబిక్కుమంటూ గడుపుతారు. ఆలాంటి దుస్థితినే చవిచూసింది ఓ ఒలింపియన్. ఆమె కూడా యుద్ధం వాతావరణం నుంచి తప్పించుకునేందుకు పడవ ఎక్కితే..మృత్యువు నీ వెంటే ఉన్నా అన్నట్లు సడెన్‌గా నడి సంద్రంలో ఇంజెన్ ఫెయిల్. అంతటి దురదృష్టంలోనూ బతకాలన్న ఆశతో.. తనతో ఉన్నవారి ప్రాణాలను కాపాడేలా తపించింది. నాటి సాహస ఫలితమే ఒలింపియన్ క్రీడాకారిణిగా అవతరించేలా చేసింది. ఏం జరిగిందంటే..సిరియా ఎంతలా అంతర్యుద్ధంతో అట్టుడుకిపోయిందో మనకు తెలిసిందే. నిరంతర యుద్ధంతో అక్కడ చిన్నారుల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలవ్వగా, మరి కొందరూ సర్వస్వం కోల్పోయి ఎందుకు బతకాలో తెలియని స్థితిలో ఉన్నారు. అలాంటి స్థితిలోనే ఉంది యుస్రా మర్దిని కుటుంబం. అమె తన చిన్నతనం నుంచి తండ్రి స్విమ్మింగ్‌లో గెలుచుకున్న పతకాలు, సాధించిన విజయాలను గురించి కథలు కథలుగా వింటు పెరిగింది. ఓ పక్క యుద్ధ బీభత్సానికి యుస్రా కుంటుంబ ఇంటిని కోల్పోయి బంధువలు ఇళ్లల్లో తలదాచుకునే స్థితికి వచ్చేసింది. అలా ఓ పక్క రైఫిళ్ల మోత బాంబుల బీభత్సం మధ్య పెరిగింది యుస్రా. చెప్పాలంటే ఆ భయానక వాతావరణానికి అలవాటు పడపోయింది. ఓ రోజు యుద్ధం తమ ప్రాంతంలో సృష్టించిన విలయానికి తల్లడిల్లి యుస్రా కుటుంబం ఇక్కడ నుంచి వెళ్లిపోవాలనుకుని గట్టిగా నిర్ణయించుకుంది. అలా యుస్రా 13వ ఏటన ఆమె కుటుంబం ప్రాణాలు అరచేత పట్టుకుని లెబనాన్ మీదుగా టర్కీకి చేరుకుంది. అక్కడ నుంచి గ్రీసుకి సముద్రం మీదుగా వెళ్లే క్రమంలో పడవ ఎక్కింది యుస్రా కుటుంబం. అక్కడ దురదృష్టం నీడలా వెంటాడిందా..? అన్నట్లు నడి సంద్రంలో ఉండగా ఇంజిన్ ఆగిపోయింది. ఏం చేయాలో తెలియని భయానక స్థితి. అయితే పడవలో చాలామంది ఉన్నారు దీంతో యుస్రా ఆమె అక్క సారా, బోటు నడిపే వ్యక్తి సుమద్రంలోకి దిగి ముగ్గురు గంటల తరబడి బోటును నెట్టుకుంటూ వచ్చారు. అలా 25 రోజులు ప్రయాణించి జర్మనీ చేరుకున్నారు. చెప్పాలంటే యుస్రా, ఆమె అక్క తమ తల్లిదండ్రుల ప్రాణాల తోపాటు బోటులో ఉన్న ఇతర ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. ఇక అక్కడ జర్మనీలో శరణార్థులుగా జీవితాన్ని ప్రారంభించింది యుస్రా కుటుంబం. అయితే యుస్రా చిన్నతనం నుంచి తండ్రి స్విమ్మంగ్ విజయాలను వినడం వల్ల మరేదైన కారణమో గానీ తాను కూడా స్విమ్మర్ అవ్వాలనే అనుకుంది. తానే ఏ దుస్థితిలోనూ ఉన్నప్పటికీ తన కలను వదులోకోలేదు యుస్రా. అలా ఆమె బెర్లిన్‌లోని స్థానిక స్విమ్మింగ్ క్లబ్లో చేరింది. అక్కడ ఆమె అసాధారణమైన ప్రతిభ కోచ్‌లను ఆకర్షించింది. దీంతో వారి ప్రోద్భలంతో 2016లో రియో శరణార్థుల ఒలింపిక్ జట్టులో సభ్యురాలిగా స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంది. అక్కడ 100 మీటర్ల బటర్‌ఫ్లై ఈతలో మంచి ప్రదర్శన కనబర్చి ప్రపంచ వేదికపై విజేతగా నిలిచింది. అంతేగాదు 2020 ఒలింపిక్ క్రీడలలో కూడా పోటీ పడింది. యుస్రా ఆ ఒలింపిక్ స్టేడియంపై నిలబడి మాట్లాడుతూ."నేను నా దేశం జెండాను మోయకపోయినా ప్రపంచానికి ప్రాతినిధ్యం వహించే ఒలింపిక్ జెండాను మోస్తున్నానని సగర్వంగా చెప్పింది". View this post on Instagram A post shared by Yusra Mardini (@yusramardini) ఆ మాటలకు ఆ స్టేడియం కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది. ఒక్కసారిగా మీడియాతో సహా యావత్తు ప్రపంచం దృష్టిని యుస్రా ఆకర్షించింది. ఇక యుస్రా యూఎన్‌హెచ్‌సీఆర్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్న అతి పిన్న వయస్కురాలు ఆమె. అంతేగాదు యుస్రా విజయగాథే 2022లో "ది స్విమ్మర్స్" అనే మూవీ విడుదలయ్యింది. ఇక 2023లో టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఆమె కూడా నిలవడం విశేషం. ఇక్కడ యుస్రా స్విమ్మింగ్ క్రీడాకారిణిగా సత్తా చాటి శరణార్థుల హక్కుల కోసం పోరాడటమే గాక వారి కష్టాలను ప్రపంచానికి తెలియజేసింది. నిజం చెప్పాలంటే పోరాటం అంటే ఎలా ఉండాలనేది అందిరికి తెలియజేసింది. ఆమె వియగాథ ఎందరిలోనో స్థైర్యాన్ని, స్ఫూర్తిని నింపుతుంది. చిన్న కష్టాలకు అమ్మో అనుకునేవాళ్లకు ఆమె విజయగాథ కష్టాల్లో కూడా లక్ష్యాన్ని ఎలా వదలకూడదో చెబుతుంది. View this post on Instagram A post shared by Yusra Mardini (@yusramardini) (చదవండి: 19 ఏళ్లకే బిలియనీర్‌గా స్టూడెంట్..ఆమె ఆస్తి అన్ని కోట్లా?) -
ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లకు దేశీ భోజనం..హయిగా పప్పు, అన్నం..!
క్రీడలు ఏదైనా.. టోర్నీ ఎక్కడ జరిగినా.. స్థానిక ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ వేరే దేశాల్లో జరిగే టోర్నీలో పాల్గొనాలంటే మాత్రం ఆటగాళ్లు పలు సమస్యలు ఎదర్కొవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అక్కడి వాతావరణం తోపాటు ఫుడ్‌కి అలవాటు పడటం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కొందరూ త్వరగా ఆ పరిస్థితులకు సెట్ అయినా మరికొందరు ఆటగాళ్లు నానాపాట్లు పడుతుంటారు. ముఖ్యంగా ఒలింపిక్స్ లాంటి ప్రతిష్టాత్మకమైన క్రీడల్లో ఆ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ మన భారతీయ వంటకాలకు చోటు ఉండదు. అలాంటిది ఈసారి జరగనున్న ఒలింపిక్స్‌లో మాత్రం భారతీయ వంటకాలతో కూడిన మెను పెట్టనున్నారు. చక్కగా పప్పు అన్నం, కోడి కూర, గోబీ, ఆలు వంటి రుచికరమైన వంటకాలను క్రీడకారులకు పెట్టనన్నారు. ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత ఆటగాళ్లు ఈ ఫుడ్ సమస్యను ఎన్నేళ్లుగానో ఎదుర్కొంటున్నారు. అయితే ఆ సమస్యకు చెక్ పెడుతూ..ఈసారి జరగనున్న ఒలింపిక్స్‌లో భారతీయ క్రీడాకారులకు పప్పు, అన్నం వడ్డించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్స్ అసోసియేషన్ అంగీకరించడం విశేషం. ఈ ఏడాది ఒలింపిక్స్ పారిస్‌లో వేదికగా జరగనున్నాయి. ఈసారి ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత ఆటగాళ్లకు ఇక ఫుడ్ సమస్య ఉండదు. చక్కగా అథ్లెట్ల గ్రామంలో మన క్రీడాకారులకు భారతీయ వంటకాలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఎంచక్కా మన ఆటగాళ్లు పప్పు, చపాతీ, ఆలుగడ్డ, గోబీ, కోడి కూర పులుసులను ఆస్వాదించవచ్చు. అంతేగాదు భారత అథ్లెట్లకు ప్రత్యేక ఆహార మెనుకి సంబంధించిన లిస్ట్‌ని ఓలింపిక్స్ నిర్వాహకులకు పంపించామని భారత డిప్యూటీ చెఫ్ డి మిషన్ శివ కేశవన్ తెలిపారు. ఇంతవరకు దక్షిణాసియా వంటకాలే.. భారత వంటకాలతో కూడిన మెనూ ఉండాలని చేసిన ప్రతిపాదనలకే ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ అసోసియేషన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని చెఫ్ శివ తెలిపారు. ఇక ఈ జాబితాను పోషకాహార నిపుణుడి సూచనల మేరకే రూపొందించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో మన అథ్లెట్ల ఆహారం విషయంలోనే పెద్ద సమస్య ఉందన్నారు చెప్పాలంటే..ఒలింపిక్స్‌లో క్రీడాకారుల భోజన మెనులో ప్రపంచవ్యాప్తంగా అన్నిరకాల వంటకాలు ఉంటాయి. కేవలం మనవాళ్లకి మినహా. అందువల్లే మన భారతీయ అథ్లెట్లకు దక్షిణాసియా వంటకాలు ఉండాలని పట్టుబట్టడం జరిందన్నారు శివ. దీంతో అంతర్జాతీయ ఒలింపిక్స్ మండలి అంగీకరించిందని చెప్పారు. కాగా, ఈ అథ్లెట్ల గ్రామంలోనే డాక్టర్ దిన్షా పర్దీవాలా పర్యవేక్షణలో పూర్తిస్థాయి భారత క్రీడా సైన్స్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. అగ్రశ్రేణి రెజ్లర్ వినేశ్ ఫొగాట్, క్రికెటర్ రిషబ్ పంత్‌కు చికిత్స అందించింది దిన్‌షానే. ఈ క్రీజా సైన్స్ కేంద్రంలో అన్ని రకాల మెడిసెన్స్, కోలుకునేందుకు అవసరమైన సామగ్రి ఉంటుంది. ఇప్పటికే ఈ క్రీడా సైన్స్ కేంద్రాన్ని ఏర్పాటు కోసం భారత్ నుంచి చాలా యంత్రాలను అక్కడికి పంపించారు. ఇంకా పారిస్ ఒలింపిక్స్ కోసం రవాణా, పాటించాల్సిన నియమ నిబంధనలు ఇంకా తదితర విషయాలను మన అథ్లెట్లుగా ముందుగానే వివరిస్తామని కూడా శివ తెలిపారు. (చదవండి: బియ్యాన్ని తప్పనిసరిగా కడగాలా? నిపుణులు ఏమంటున్నారంటే..!) -
‘పారిస్’ పతకాల్లో ఈఫిల్ టవర్!
పారిస్: ఈ ఒలింపిక్స్ పతకాలు మిగతా పతకాలకంటే అతి భిన్నమైనవి... అమూల్యమైనవి! ఎందుకంటే ఈ పతకాల్లో బంగారం, వెండి, ఇత్తడి లోహాలే కాదు అంతకుమించి అపురూపమైంది ఇందులో ఇమిడి ఉంది. ఫ్రాన్స్‌కే తలమానికమైన ‘ఈఫిల్ టవర్’ ప్రతి పతకంలోనూ దాగి ఉంది. అదేలా అంటే... ఈ వివరాల్లోకి వెళ్దాం! ఈ ఏడాది జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు పారిస్ నగరంలో విశ్వక్రీడలు జరుగుతాయి. ఈ పోటీల్లో పతక విజేతలకు బహూకరించే పతకాల్ని గురువారం అధికారికంగా ఆవిష్కరించారు. ప్రతి పతకం బరువు 18 గ్రాములైతే... ప్రతి పతకంలోనూ ఈఫిల్ టవర్ లోహం నిక్షిప్తమై ఉంది. పూర్తిగా ఇనుముతో నిర్మించిన ఈఫిల్ టవర్ ప్రపంచంలోనే ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ఈఫిల్ టవర్‌ను కళ్లారా చూసేందుకు యావత్ ప్రపంచ పర్యాటకులు పారిస్‌కు పోటెత్తుతారు. ఇనుముతో తయారైన ఈ టవర్‌ను నవీకరణ చేసిన సందర్భాలెన్నో ఉన్నాయి. అప్పుడు టవర్‌లో అక్కడక్కడ తీసివేసిన తుక్కు ఇనుప ముక్కల్ని ఓ రహస్య గదిలో జాగ్రత్త పరిచారు. ఈసారి ఒలింపిక్స్ పారిస్‌లో జరుగనున్నాయి. కాబట్టి తమ పతకాలతో మరో విశిష్టత కల్పించాలని ఒలింపిక్ నిర్వాహక కమిటీ, ఫ్రాన్స్ ప్రభుత్వం భావించాయి. అందుకే పతకాల తయారీలో అసలైన ఈఫిల్ టవర్ అవశేషాల్ని (భద్రపరిచిన ఇనుప ముక్కలు) వినియోగించారు. ఈసారి విజేతలంతా అదృష్టవంతులే! ఎందుకంటే వాళ్లంతా పతకాల్నే కాదు... ‘సింబల్ ఆఫ్ పారిస్’ గుర్తుల్ని తమతమ దేశాలకు మోసుకెళ్తారు. దీనిపై పారిస్ ఒలింపిక్స్ క్రియేటివ్ డైరెక్టర్ థీయెరి రిబోల్ మాట్లాడుతూ ‘కచ్చితంగా అథ్లెట్లకు ఇది సువర్ణావకాశం. పారిస్ జగది్వఖ్యాత చిహ్నం అవశేషాల్ని ఒలింపిక్స్ విజేతలు తమతో తీసుకెళ్లొచ్చు’ అని అన్నారు. విశ్వక్రీడల చరిత్రలోనే చెరగని ముద్ర వేసేందుకు విశేషమైన వినూత్నమైన ఆలోచనతో ఈ పతకాల్ని డిజైన్ చేశామని చెప్పారు. విజేతలకు అందించేందుకు మొత్తం 5,084 స్వర్ణ, రజత, కాంస్య పతకాలు తయారు చేశారు. -
భారత్‌కు మరో ఒలింపిక్ బెర్త్ ఖరారు.. షూటర్ నంబర్ 17
జకార్తా: పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో భారత్‌నుంచి మరో బెర్త్ ఖాయమైంది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ ఈవెంట్లో విజయ్‌వీర్ సిద్ధూ ఈ కోటాను ఖాయం చేశాడు. దీంతో భారత్ నుంచి పాల్గొనే షూటర్ల సంఖ్య 17కు పెరిగింది. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ టోర్నీలో విజయ్‌వీర్ శనివారం రజత పతకం గెలుచుకున్నాడు. అయితే పతకం గెలుచుకోవడానికి ముందే అతనికి ఒలింపిక్ బెర్త్ ఖాయమైంది. క్వాలిఫయింగ్ దశలో 577 పాయింట్లు సాధించిన విజయ్‌వీర్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఫైనల్‌కు చేరిన ఆరుగురిలో నలుగురికి ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉండగా అతనికి ఈ చాన్స్ లభించింది. చండీగఢ్‌కు చెందిన 21 ఏళ్ల వీర్ గత ఏడాది హాంగ్జూ ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించాడు. మరో వైపు మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు 2 పతకాలు లభించాయి. ఈ ఈవెంట్లో సిఫ్ట్‌కౌర్ రజతం గెలుచుకోగా, ఆషి చౌక్సీకి కాంస్యం దక్కింది. -
ఒలింపిక్ బెర్త్ నంబర్ 16
జకార్తా: ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో ఈసారి భారత్ నుంచి షూటింగ్ క్రీడాంశంలో అత్యధిక మంది పోటీపడనున్నారు. ఈ ఏడాది జూలై–ఆగస్టులలో పారిస్ వేదికగా ఒలింపిక్స్ జరగనున్నాయి. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు భారత్ నుంచి అత్యధికంగా 15 మంది షూటర్లు అర్హత పొందగా... ఈసారి ఆ సంఖ్య 16కు చేరుకుంది. ఇంకా షూటింగ్లో మరో మూడు క్వాలిఫయింగ్ టోర్నీలు మిగిలి ఉండటం, మరో ఎనిమిది బెర్త్‌లు ఖాళీగా ఉండటంతో భారత్ నుంచి మరింత మంది షూటర్లు అర్హత సాధించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో గురువారం భారత్‌కు 16వ బెర్త్ ఖరారైంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో రిథమ్ సాంగ్వాన్ కాంస్య పతకం సాధించింది. ఫైనల్లో హరియాణాకు చెందిన 20 ఏళ్ల రిథమ్ 28 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి భారత్‌కు ఒలింపిక్ బెర్త్‌ను అందించింది. రిథమ్, తెలంగాణ షూటర్ ఇషా సింగ్, సిమ్రన్ప్రీత్ కౌర్‌లతో కూడిన భారత జట్టు 1743 పాయింట్లతో రజత పతకాన్ని సొంతం చేసుకుంది. -
2024 ఆటలు...ఆశలు...
ప్రపంచ క్రీడా పండుగ ఒలింపిక్స్‌లో ఈ సారి భారత్ పతకాల సంఖ్య రెండంకెలకు చేరుతుందా...టి20 ప్రపంచకప్ టైటిల్‌తో టీమిండియా ఈ సారైనా పదిహేడేళ్ల కరువు తీరుస్తుందా...మన మహిళల క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ అందుకునే స్థాయికి ఎదిగిందా...అండర్–19 స్థాయిలో ప్రపంచ కప్ డిఫెండింగ్ చాంపియన్‌గా దిగుతున్న మన కుర్రాళ్లు మళ్లీ సత్తా చాటుతారా... క్రికెట్ ఫ్యాన్స్ మదిలో ఈ ప్రశ్నలకు కొత్త ఏడాదిలో సమాధానం లభిస్తుంది... బ్యాడ్మింటన్ ప్రపంచంలో మరోసారి మన షట్లర్ల హవా సాగుతుందా...ఫార్ములా వన్ 23 రేస్‌లలో ఎవరికి పైచేయి అవుతుంది... హాకీలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి... ఫుట్‌బాల్‌లో ఆసియా ఖండంలో మన బలం పెరిగిందా...ఇవన్నీ చూడాల్సిందే. టెన్నిస్‌లో ఎప్పటిలాగే నాలుగు గ్రాండ్‌స్లామ్‌ల వేట...ప్రతీ ఏటా అలరించేందుకు వచ్చే ఐపీఎల్ ఎలాగూ ఉన్నాయి. వీటికి తోడు ఆర్చరీ, అథ్లెటిక్స్, చెస్, రెజ్లింగ్, షూటింగ్, బాక్సింగ్, టేబుల్ టెన్నిస్‌లాంటి క్రీడల్లో పలు ఆసక్తికర టోర్నీలకు ఈ ఏడాది వేదిక కానుంది. 2024లో క్రీడాభిమానులను అలరించేందుకు సిద్ధమైన ప్రధాన ఈవెంట్ల క్యాలెండర్ మీ కోసం... భారత క్రికెట్ జట్టు షెడ్యూల్ జనవరి 11–17: అఫ్గానిస్తాన్‌తో స్వదేశంలో 3 టి20 మ్యాచ్‌లు జనవరి 25–మార్చి 11: ఇంగ్లండ్‌తో స్వదేశంలో 5 టెస్టులు ఐపీఎల్: మార్చి 22 నుంచి మే 26 వరకు జూలై: శ్రీలంకలో భారత్ పర్యటన (3 వన్డేలు, 3 టి20లు) సెప్టెంబర్: స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సిరీస్ (2 టెస్టులు, 3 టి20లు) అక్టోబర్: స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్ (3 టెస్టులు) నవంబర్–డిసెంబర్: ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన (5 టెస్టులు) పురుషుల టి20 ప్రపంచకప్ టోర్నీ జూన్ 4 నుంచి 30 వరకు వేదిక: వెస్టిండీస్, అమెరికా ఫుట్‌బాల్ ఆసియా కప్ (ఖతర్) జనవరి 12 నుంచి ఫిబ్రవరి 10 వరకు యూరో–2024 (జర్మనీ) జూన్ 14 నుంచి జూలై 14 వరకు కోపా అమెరికా టోర్నీ (అమెరికా) జూన్ 20 నుంచి జూలై 14 వరకు బ్యాడ్మింటన్ జనవరి 9–14: మలేసియా ఓపెన్–1000 టోర్నీ (కౌలాలంపూర్) జనవరి 16–21: ఇండియా ఓపెన్–750 టోర్నీ (న్యూఢిల్లీ) మార్చి 5–10: ఫ్రెంచ్ ఓపెన్–750 టోర్నీ (పారిస్) మార్చి 12–17: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్–1000 టోర్నీ (బర్మింగ్హమ్) ఏప్రిల్ 28–మే 5: థామస్ కప్–ఉబెర్ కప్ ఫైనల్స్ (చెంగ్డూ, చైనా) మే 28–జూన్ 2: సింగపూర్ ఓపెన్–750 టోర్నీ జూన్ 4–9: ఇండోనేసియా ఓపెన్–1000 టోర్నీ (జకార్తా) ఆగస్టు 20–25: జపాన్ ఓపెన్–750 టోర్నీ (టోక్యో) సెప్టెంబర్17–22: చైనా ఓపెన్–1000 టోర్నీ (చాంగ్జౌ) అక్టోబర్ 15–20: డెన్మార్క్ ఓపెన్–750 టోర్నీ (ఒడెన్స్) నవంబర్ 19–24: చైనా మాస్టర్స్–750 టోర్నీ (షెన్జెన్) నవంబర్ 26–డిసెంబర్ 1: సయ్యద్ మోడి ఓపెన్–300 టోర్నీ (లక్నో) డిసెంబర్ 11–15: వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ (హాంగ్జౌ, చైనా) టెన్నిస్ జనవరి 15–28: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ (మెల్బోర్న్) మే 26–జూన్ 9: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ (పారిస్) జూలై 1–14: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ (లండన్) ఆగస్టు 26–సెప్టెంబర్8: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ (న్యూయార్క్) నవంబర్ 10–17: ఏటీపీ ఫైనల్స్ టోర్నీ (టురిన్, ఇటలీ) ఫార్ములావన్ మార్చి 2: బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి మార్చి 9: సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రి మార్చి 24: ఆ్రస్టేలియా గ్రాండ్‌ప్రి ఏప్రిల్ 7: జపాన్ గ్రాండ్‌ప్రి ఏప్రిల్ 21: చైనా గ్రాండ్‌ప్రి మే 5: మయామి గ్రాండ్‌ప్రి మే 19: ఎమీలియా రొమాగ్నా గ్రాండ్‌ప్రి మే 26: మొనాకో గ్రాండ్‌ప్రి జూన్ 9: కెనడా గ్రాండ్‌ప్రి జూన్ 23: స్పానిష్ గ్రాండ్‌ప్రి జూన్ 30: ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి జూలై 7: బ్రిటిష్ గ్రాండ్‌ప్రి జూలై 21: హంగేరి గ్రాండ్‌ప్రి జూలై 28: బెల్జియం గ్రాండ్‌ప్రి ఆగస్టు 25: డచ్ గ్రాండ్‌ప్రి సెప్టెంబర్ 1: ఇటలీ గ్రాండ్‌ప్రి సెప్టెంబర్15: అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి సెప్టెంబర్ 22: సింగపూర్ గ్రాండ్‌ప్రి అక్టోబర్ 20: యూఎస్ గ్రాండ్‌ప్రి అక్టోబర్ 27: మెక్సికో గ్రాండ్‌ప్రి నవంబర్ 3: బ్రెజిల్ గ్రాండ్‌ప్రి నవంబర్ 23: లాస్ వేగస్ గ్రాండ్‌ప్రి డిసెంబర్ 1: ఖతర్ గ్రాండ్‌ప్రి హాకీ జనవరి 13–21: ఒలింపిక్ క్వాలిఫయింగ్ పురుషుల టోర్నీ (వాలెన్సియా, స్పెయిన్) జనవరి 13–21: ఒలింపిక్ క్వాలిఫయింగ్ మహిళల టోర్నీ (వాలెన్సియా, స్పెయిన్) జనవరి 13–19: ఒలింపిక్ క్వాలిఫయింగ్ మహిళల టోర్నీ (రాంచీ, భారత్) జనవరి 15–21: ఒలింపిక్ క్వాలిఫయింగ్ పురుషుల టోర్నీ (మస్కట్, ఒమన్) షూటింగ్ జనవరి 5–18: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ రైఫిల్, పిస్టల్ టోర్నీ (జకార్తా) జనవరి 12–22: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ షాట్‌గన్ టోర్నీ (కువైట్ సిటీ) జనవరి 24–ఫిబ్రవరి 1: ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ టోర్నీ (కైరో, ఈజిప్ట్) ఫిబ్రవరి 4–13: ప్రపంచకప్ షాట్‌గన్ టోర్నీ (రబాట్, మొరాకో) ఏప్రిల్ 11–19: ఫైనల్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ రైఫిల్, పిస్టల్ టోర్నీ (రియో డి జనీరో, బ్రెజిల్) ఏప్రిల్ 22–30: ఫైనల్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ షాట్‌గన్ టోర్నీ (దోహా, ఖతర్) మే 1–12: ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ టోర్నీ (బకూ, అజర్బైజాన్) మే 31–జూన్ 7: ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్ టోర్నీ (మ్యూనిక్, జర్మనీ) జూన్ 10–19: ప్రపంచకప్ షాట్‌గన్ టోర్నీ (లొనాటో, ఇటలీ) అండర్–19 పురుషుల వన్డే ప్రపంచకప్ టోర్నీ జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు వేదిక: దక్షిణాఫ్రికా మహిళల టి20 ప్రపంచకప్ టోర్నీ సెప్టెంబర్–అక్టోబర్ వేదిక: బంగ్లాదేశ్ పారిస్ ఒలింపిక్స్ – 26 జూలై – 11 ఆగస్టు అథ్లెటిక్స్ జనవరి 21: ఆసియా మారథాన్ చాంపియన్‌షిప్ (హాంకాంగ్) ఫిబ్రవరి 21–23: ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ (టెహ్రాన్) మార్చి 1–3: ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ (స్కాట్లాండ్) ఆగస్టు 26–31: ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్ (పెరూ) చెస్ ఏప్రిల్ 3–25: క్యాండిడేట్స్ టోర్నమెంట్ (టొరంటో, కెనడా) జూన్ 1–14: ప్రపంచ జూనియర్ అండర్–20 చాంపియన్‌షిప్ (న్యూఢిల్లీ, భారత్) సెప్టెంబర్10–23: చెస్ ఒలింపియాడ్ (బుడాపెస్ట్, హంగేరి) అక్టోబర్ 22–నవంబర్ 2: ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్ (బ్రెజిల్) రెజ్లింగ్ ఏప్రిల్ 11–16: ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్ (బిష్కెక్, కిర్గిజ్స్తాన్) ఏప్రిల్ 19–21: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ (బిష్కెక్, కిర్గిజ్స్తాన్) మే 9–12: ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ (ఇస్తాంబుల్, తుర్కియే) బాక్సింగ్ ఫిబ్రవరి 29–మార్చి 12: పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీ (ఇటలీ) ఏప్రిల్: ఆసియా చాంపియన్‌షిప్ మే 23–జూన్ 3: పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీ (థాయ్‌లాండ్) అక్టోబర్ 20–నవంబర్ 6: ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్ (క్రొయేషియా) టేబుల్ టెన్నిస్ ఫిబ్రవరి 16–25: ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్ (బుసాన్, కొరియా) డిసెంబర్ 1–8: ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్ (స్వీడన్) ఆర్చరీ ఏప్రిల్ 23–28: ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీ (షాంఘై, చైనా) మే 21–26: ప్రపంచకప్ స్టేజ్–2 టోర్నీ (యెచోన్, కొరియా) జూన్ 18–23: ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీ (అంటాల్యా, తుర్కియే) -
హైదరాబాద్‌కు యునెస్కో గుర్తింపు తెస్తాం
రాయదుర్గం: హైదరాబాద్‌కు యునెస్కో ద్వారా వరల్డ్ హెరిటేజ్ సిటీగా గుర్తింపు తెచ్చేందుకు కృషిచేస్తున్నామని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ చెప్పారు. నగరంలో ఎన్నో చారిత్రక ప్రదేశాలు, నిర్మాణాలు ఉన్నాయని, ఎన్నింటినో గుర్తించి, ఆధునీకరించామని, భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. శనివారం నగరంలోని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో రాయదుర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. నగరంలో క్రీడారంగానికి ప్రాధాన్యత ఇస్తూ 2036 నాటికి ఒలింపిక్స్ హౌజ్ నిర్మిస్తామని, ఇప్పటికే ఉన్న ఉప్పల్, ఎల్బీ స్టేడియాలను మరింత ఆధునీకరించి, కొత్త స్టేడియాలను, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను నిర్మిస్తామన్నారు. నగరంలో తాగునీటి సరఫరాను మెరుగుపరుస్తున్నామని, వచ్చే పదేళ్లలో 24 గంటలపాటు తాగునీరు అందేలా చేయాలని, వచ్చే అయిదేళ్ల కాలంలో రోజువారీగా తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. నగరాన్ని తొమ్మిదిన్నరేళ్లలో భూతల స్వర్గం చేశామని చెప్పమని, కానీ చిత్తశుద్ధితో కష్టపడి ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేశామని చెప్పగలనన్నారు. ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసేలా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు కూడా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీకి మరో ఇద్దరు అదనపు కమిషనర్లు హైదరాబాద్ అభివృద్ధి కోసం జీహెచ్ఎంసీలో మరో ఇద్దరు కమిషనర్లను నియమించాలనే ప్రతిపాదన ఉందని కేటీఆర్ చెప్పారు. చెరువులు పరిరక్షణ, పర్యవేక్షణ, సుందరీకరణకు ఒక ప్రత్యేక కమిషనర్, పార్కులు, హరిత పరిరక్షణకు మరో ప్రత్యేక కమిషనర్‌ను నియమించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలో కాలుష్య రహిత రవాణా కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, మెట్రోను రానున్న కాలంలో 415 కి.మీ.కు విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. లింకురోడ్ల నిర్మాణం చేపట్టి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చేస్తున్నామని, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈ ప్లాన్ చాలా బాగుందని మెచ్చుకున్నారన్నారు. -
ఆర్చరీలో తొలి ఒలింపిక్స్ బెర్తు తెచ్చిన ధీరజ్
ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ ఆర్చరీలో తొలి ఒలింపిక్స్ కోటా బెర్తును తెచ్చి పెట్టాడు. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియా కాంటినెంటల్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్లో ధీరజ్ రజతం సాధించాడు. ఫైనల్లో స్వర్ణ పతకంపై గురిపెట్టిన 22 ఏళ్ల తెలుగు కుర్రాడు 5–6తో జి సియాంగ్ లిన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడి... రజతంతో సరిపెట్టుకున్నాడు. అంతకుముందు క్వార్టర్స్‌లో ధీరజ్ 6–0తో సాదిగ్ అష్రాఫి బవిలి (ఇరాన్)పై, సెమీ ఫైనల్లో 6–0తో మొహమ్మద్ హొస్సేన్ గొల్షాని (ఇరాన్)పై విజయం సాధించాడు. ఈ ఈవెంట్లో ఫైనల్ చేరిన ఇద్దరికి మాత్రమే ఒలింపిక్స్ కోటా బెర్తు లభిస్తుంది. మహిళల విభాగంలో అంకిత భకత్ క్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోవడంతో బెర్తు దక్కలేదు. -
Paris 2024 Olympics: పారిస్ ఒలింపిక్స్ హాకీ క్వాలిఫయింగ్ టోర్నీ: భారత్‌కు కఠిన సవాలు
వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించేందుకు భారత మహిళల హాకీ జట్టు శ్రమించాల్సి ఉంటుంది. జనవరి 13 నుంచి 19 వరకు రాంచీలో జరిగే ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోరీ్న–1కు సంబంధించిన వివరాలను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) సోమవారం విడుదల చేసింది. ప్రపంచ ఆరో ర్యాంకర్ భారత్‌తోపాటు ఈ టోరీ్నలో ప్రపంచ ఐదో ర్యాంకర్ జర్మనీ, న్యూజిలాండ్ (9), జపాన్ (11), చిలీ (14), అమెరికా (15), ఇటలీ (19), చెక్ రిపబ్లిక్ (25) జట్లు బరిలో ఉన్నాయి. ఈ టోర్నీలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు నెగ్గిన మూడు జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి. జనవరి 13 నుంచి 20 వరకు స్పెయిన్‌లోని వాలెన్సియాలో ఎనిమిది జట్ల (బెల్జియం, కెనడా, బ్రిటన్, ఐర్లాండ్, మలేసియా, దక్షిణ కొరియా, స్పెయిన్, ఉక్రెయిన్) మధ్య క్వాలిఫయింగ్–2 టోర్నీ జరుగుతుంది. ఈ టోర్నీ ద్వారా మరో మూడు జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పొందుతాయి. -
శ్రియాంక గురికి 13వ బెర్తు
న్యూఢిల్లీ: భారత షూటర్లు పారిస్ ఒలింపిక్సే లక్ష్యంగా ఆసియా షూ టింగ్ చాంపియన్‌షిప్‌లో రాణిస్తున్నారు. తాజాగా శ్రియాంక సదాంగి ఒలింపిక్స్ బెర్తు సంపాదించింది. కొరియాలోని చాంగ్వాన్లో జరుగుతున్న ఈ పోటీల్లో ఆమె మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రి పొజిషన్లో నాలుగో స్థానంలో నిలిచింది. పతకం చేజారినా... ‘పారిస్’ గురి కుది రింది. ఆమె 440.5 స్కోరుతో నాలుగో స్థానంలో తృప్తిపడింది. ఆమెతో పాటు ఈ ఈవెంట్లో సిఫ్త్ కౌర్ సమ్రా, ఆషి చౌక్సీ, ఆయుషి పొడెర్లు కూడా క్వాలిఫయింగ్ మార్క్ దాటారు. షూటింగ్లో భారత్‌కిది 13వ ఒలింపిక్ బెర్తు కావడం విశేషం. -
భారత్ ‘పారిస్’ ఆశలు ఆవిరి
తాస్కాంట్: వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు అర్హత సాధించే అవకాశాలకు తెరపడింది. ఇక్కడ జరుగుతున్న ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (ఏఎఫ్సీ) ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. తొలి మ్యాచ్‌లో భారత్ 0–7తో ప్రపంచ మాజీ చాంపియన్ జపాన్ చేతిలో ఓడిపోగా...ఆదివారం జరిగిన గ్రూప్ ‘సి’ రెండో లీగ్ మ్యాచ్‌లో టీమిండియాకు 1–3 గోల్స్ తేడాతో వియత్నాం జట్టు చేతిలో పరాజయం ఎదురైంది. లీగ్ దశ తర్వాత మూడు గ్రూప్‌ల్లో అగ్రస్థానంలో నిలిచిన మూడు జట్లతోపాటు రెండో స్థానంలో నిలిచిన ఉత్తమ జట్టు ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. భారత్ తరఫున సంధ్య రంగనాథన్ (80వ ని.లో) ఏకైక గోల్ చేయగా... వియత్నాం తరఫున హున్ ఎన్హు (4వ ని.లో), ట్రాన్ థి హై లిన్ (22వ ని.లో), ఫామ్ హై యెన్ (73వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ ఈ మ్యాచ్‌లో 59 నిమిషాలు ఆడింది. ఆ తర్వాత ఆమె స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా గ్రేస్‌ను బరిలోకి దించారు. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను నవంబర్ 1న ఉజ్బెకిస్తాన్‌తో ఆడుతుంది. -
భారత షూటర్ల జోరు
చాంగ్వాన్ (కొరియా): ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత రైఫిల్ షూటర్లు అర్జున్ బబుతా, తిలోత్తమ సేన్ రజత పతకాలు సాధించారు. ఈ ప్రదర్శనతో భారత్‌కు రెండు ఒలింపిక్స్ కోటా బెర్త్‌లు దక్కాయి. ఇప్పటికే భారత షూటర్లు 8 బెర్తులు పొందారు. దీంతో వచ్చే ఏడాది పారిస్‌కు పయనమయ్యే షూటర్ల సంఖ్య పదికి చేరింది. శుక్రవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో 24 ఏళ్ల అర్జున్ 251.2 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ ఫైనల్లో 15 ఏళ్ల తిలోత్తమ (252.3 పాయింట్లు) త్రుటిలో స్వర్ణం కోల్పోయింది. కొరియన్ షూటర్ కోన్ ఎంజీ (252.4) 0.1 తేడాతో బంగారం గెలుచుకుంది. ఇదే విభాగంలో టీమ్ ఈవెంట్లో అర్జున్, దివ్యాన్‡్ష, హృదయ్ హజారికా (1892.4 పాయింట్లు) త్రయం బంగారు పతకం గెలిచింది. తిలోత్తమ, శ్రీయాంక, రమితలతో కూడిన మహిళల బృందం కాంస్యంతో సంతృప్తి చెందింది. సీనియర్ స్కీట్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో అనంత్‌జీత్ సింగ్, దర్శన రాథోడ్ జోడీ 139 పాయింట్లతో స్వర్ణం గెలిచింది. -
రంగుల ఒలింపిక్స్ స్వప్నం
ఎప్పటి నుంచో వింటున్నదే... తెర వెనుక జోరుగా ప్రయత్నాలు సాగుతున్నదే... ఇప్పుడు అధికారి కంగా ఖరారైంది. 128 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత క్రికెట్ మళ్ళీ విశ్వక్రీడల్లో పునఃప్రవేశం చేయనుంది. మరో అయిదేళ్ళలో రానున్న 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో ఈ ‘జెంటిల్మెన్ క్రీడ’ సహా స్క్వాష్, బేస్‌బాల్/ సాఫ్ట్‌బాల్, లక్రాస్, ఫ్లాగ్ ఫుట్‌బాల్ ఆటలు అయిదింటిని అదనంగా ప్రవేశపెట్టనున్నారు. భారత్‌లో 50 ఓవర్ల ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతున్న వేళ ఈ ప్రకటన రావడం విశేషం. ముంబయ్‌లో 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రారంభ సమావేశంలో మాట్లాడుతూ, భారత్‌లో 2036 నాటి ఒలింపిక్స్ నిర్వహణకు మన ప్రధాని బాహాటంగా ఉత్సుకతను వ్యక్తం చేశారు. ఆ వెంటనే రెండు రోజులకే ఒలింపిక్ కార్యక్రమ సంఘం అధ్యక్షుడు కార్ల్ స్టాస్ క్రికెట్‌కు ఒలింపియాడ్‌లో స్థానాన్ని ప్రకటించడం ఉత్సాహం నింపింది. కాలానికి తగ్గట్టు మారే ఈ ప్రయత్నం అభినందనీయమే. అదే సమయంలో ఇది పలు సవాళ్ళపై చర్చ రేపింది. ఎప్పుడో 1900లోనే తొలిసారిగా ప్యారిస్ ఒలింపిక్స్‌లోనే క్రికెట్ భాగమైంది. తర్వాత ఇన్నేళ్ళకు లాస్ ఏంజెల్స్‌లో మళ్ళీ తెరపైకి వస్తోంది. స్క్వాష్ సహా మిగతా 4 ఆటలకు విశ్వ క్రీడాంగణంలో ఇదే తెరంగేట్రం. ప్రపంచంలోని అతి పెద్ద క్రీడా సంరంభం నుంచి ఇన్నేళ్ళుగా క్రికెట్‌ను దూరంగా ఉంచడం దురదృష్టకరమే! ఇప్పుడు టీ–20 క్రికెట్ విస్తృత ప్రాచుర్యం పొందడమే కాక మును పెన్నడూ లేని విధంగా ప్రపంచంలోని అనేక దేశాలు ఆ ఫార్మట్ పోటీల్లో పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో టీ–20 క్రికెట్‌కు కూడా చోటివ్వడం ప్రజాస్వామ్యబద్ధమైన ఆలోచన. తద్వారా ఒలింపిక్స్ మరింత చేరువవుతుంది. ఫుట్‌బాల్ తర్వాత ప్రపంచంలో అత్యధికులు అనుసరించే క్రీడగా క్రికెట్ ప్రసార, ప్రచార హక్కులతో ఒలింపిక్ సంఘానికి వచ్చే ఆదాయం, అటు నుంచి భారత్‌కు లభించే వాటా సరేసరి. అందుకే, ఐఓసీ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక చాలా లెక్కలే ఉన్నాయి. అయితే చిన్న తిరకాసుంది. క్రికెట్ సహా కొత్తగా చేరే ఆటలన్నీ 2028 ఒలింపిక్స్‌కే పరిమితం. వాటిని తర్వాత కొనసాగించాలా లేదా అన్నది ఆపైన 2032లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చే బ్రిస్బేన్ నిర్ణయిస్తుంది. నిజానికి, కామన్వెల్త్ దేశాలే కాక, ప్రపంచమంతా ఆడే విశ్వక్రీడగా క్రికెట్ విస్తరించాల్సి ఉంది. ఐఓసీ గుర్తింపు పొందిన 206 దేశాల్లో ప్రస్తుతం 50 శాతాని కన్నా తక్కువ చోట్లే క్రికెట్ ఆడుతున్నారు. కనీసం 75 శాతం చోట్ల క్రికెట్ తన ఉనికిని చాటాల్సి ఉంది. అది ఓ సవాలు. కొన్ని ఐఓసీ సభ్యదేశాలు చేస్తున్న ఈ వాదన సబబే. అలాగే, కొత్తగా ఒలింపియాడ్లోకి వస్తున్న అయిదింటిలో నాలుగు... టీమ్ స్పోర్ట్స్. కాబట్టి, క్రీడాగ్రామంలో ఆటగాళ్ళ సంఖ్య అంగీకృత కోటా 10,500 కన్నా 742 మేర పెరుగుతుంది. గేమ్స్ విలేజ్‌పై భారం తగ్గించడానికి ఇతర ఆటల్లో అథ్లెట్ల కోటా తగ్గించడం, కొన్ని మెడల్ ఈవెంట్లను ఈసారికి పక్కనపెట్టడమే మార్గం. అది కొంత నిరాశే! అలాగే, ఒలింపిక్స్‌లోకి క్రికెట్ పునఃప్రవేశం బాగానే ఉంది కానీ, అగ్ర క్రికెటర్లు ఆ క్రీడాసంరంభంలో కాలుమోపుతారా అన్న అనుమానం పీడిస్తోంది. ఇటీవలి ఏషియన్ గేమ్స్ అనుభవమే అందుకు సాక్ష్యం. ఆసియా ఖండంలోని అధిక భాగం అగ్రశ్రేణి జట్లు ప్రధాన ఆటగాళ్ళను అక్కడకు పంపనే లేదు. అదేమంటే, దగ్గరలోనే 50 ఓవర్ల ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఉందన్నాయి. ఇండియా అయితే ఏషియాడ్కి క్రికెట్ జట్టునే పంపకూడదనుకుంది. ఆఖరు క్షణంలో క్రికెట్ బోర్డ్ మనసు మార్చుకుంది. వచ్చే 2028 నాటి అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్ ఇంకా ఖరారు కాలేదు గనక, ఆ ఏడాది జూలైలో 16 రోజుల పాటు సాగే ఒలింపిక్స్‌లో అగ్రతారలు ఆడేందుకు వీలుగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షెడ్యూల్‌ను ఖరారు చేస్తుందని ఒలింపిక్ సంఘం ఆశాభావంలో ఉంది. గతంలో యూ23 అవతారంలో ఒలింపిక్స్‌లో ఫుట్‌బాల్ ప్రయోగం చేశారు. కానీ, ఆదరణ, ఆదాయం అంతంతే! టెన్నిస్, గోల్ఫ్లను చేర్చుకున్నా, ప్రథమశ్రేణి పేర్లు కనపడలేదు. ఇక, వరు ణుడి కరుణపై ఆధారపడడం క్రికెట్‌కు మరో తలనొప్పి. తాజా ఏషియాడ్‌లో వాన వల్ల మ్యాచ్ రద్దయి, టీ20 ర్యాంకింగ్‌ను బట్టి స్వర్ణపతక విజేతను నిర్ణయించిన ప్రహసనం చూశాం. ఇక, 2036 ఒలింపిక్స్‌ను భారత్‌లో నిర్వహించేలా సర్వశక్తులూ ఒడ్డుతామని మోదీ ప్రకటించడం సంతోషమే అయినా, సాధ్యాసాధ్యాలపై అనుమానాలున్నాయి. జీ20 సదస్సు, ఏషియాడ్‌లో పతకాల శతకం తెచ్చిన ఉత్సాహంలో ప్రధాని దీన్ని ‘140 కోట్ల ప్రజల స్వప్నం’గా పేర్కొన్నారు. కానీ, వేల కోట్లతో స్టేడియమ్‌లు నిర్మించేకన్నా సామాన్యులకు కూడుగూడుపై దృష్టి పెట్టాలనే వాదనని విస్మరించలేం. భారీ ఖర్చు రీత్యా 2026 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించడానికి సైతం ఆస్ట్రేలియా చేతులెత్తేసింది. ఇక, 2010లో మన కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది. అప్పట్లో భారత ఒలింపిక్ అసోసియేషన్‌ను 14 నెలలు ఐఓసీ బహిష్కరించింది. అవన్నీ మనం మర్చి పోరాదు. 2035 నాటికి భారత్ 6 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ అవుతుందనీ, 2047కి అగ్రరాజ్యంగా అవతరిస్తామనీ జబ్బలు చరుస్తున్న వేళ ఒలింపిక్స్ స్వప్నం వసతులు పెంచుకోవడానికీ, క్రీడా ప్రతిభను పెంచిపోషించుకోవడానికీ ఉపయుక్తమే! దాని వెంటే ఉన్న సవాళ్ళతోనే సమస్య. తలసరి ఆదాయంలో మనల్ని ఎంతో మించిన లండన్, టోక్యో, ప్యారిస్, సియోల్లకున్న సహజ మైన సానుకూలత మనకుందా? సంబరం ముగిశాక ఏథెన్స్, రియో లాంటి ఆతిథ్య దేశాలకు ఐరావతాలుగా మారి క్రీడాంగణాల్ని వాడుకొనే ప్రణాళిక ఉందా? పేరుప్రతిష్ఠలతో పాటు ప్రజలకూ పనికొచ్చేలా వ్యూహరచన చేస్తేనే ఎంత రంగుల కలకైనా సార్థకత. -
Cricket in Olympics: ఒలింపిక్స్‌లో క్రికెట్
ముంబై: లాంఛనం ముగిసింది. ఎట్టకేలకు క్రికెట్ ఒలింపిక్స్ క్రీడల్లో పునరాగమనం చేయనుంది. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్‌తోపాటు స్క్వా‹Ù, బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్, లాక్రాస్ (సిక్స్–ఎ–సైడ్), ఫ్లాగ్ ఫుట్‌బాల్ క్రీడాంశాలను కొత్తగా చేర్చారు. ఐదు కొత్త క్రీడాంశాలకు లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో అనుమతి ఇవ్వాలని ఎగ్జిక్యూటివ్ బోర్డు చేసిన ప్రతిపాదనలకు సోమవారం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యులు ఓటింగ్ ద్వారా ఆమోదం తెలిపినట్లు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్ ప్రకటించారు. 99 మంది ఐఓసీ సభ్యుల్లో ఇద్దరు మాత్రమే ఈ ఐదు క్రీడాంశాల ప్రతిపాదనను వ్యతిరేకించగా... 97 మంది సమ్మతించారు. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ ఈవెంట్‌ను టి20 ఫార్మాట్లో పురుషుల, మహిళల విభాగాల్లో ఆరు జట్ల మధ్య నిర్వహిస్తారు. ఆతిథ్య దేశం హోదాలో అమెరికా జట్లకు నేరుగా ఎంట్రీ లభిస్తుంది. ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా మిగతా ఐదు జట్లను నిర్ణయించే అవకాశముంది. ► 1877లో క్రికెట్లో తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. 1900 పారిస్ ఒలింపిక్స్‌లో ఒకే ఒకసారి క్రికెట్ మెడల్ ఈవెంట్‌గా ఉంది. పారిస్ గేమ్స్‌లో కేవలం ఫ్రాన్స్, బ్రిటన్ జట్లు మాత్రమే పాల్గొన్నాయి. బ్రిటన్ జట్టుకు స్వర్ణం, ఫ్రాన్స్ జట్టుకు రజతం లభించాయి. ఆ తర్వాత క్రికెట్ విశ్వ క్రీడల జాబితాలో చోటు కోల్పోయింది. టెస్టు, వన్డే ఫార్మాట్ల బదులు మూడు, నాలుగు గంటల్లో ఫలితం వచ్చే టి20 ఫార్మాట్ రాకతో క్రికెట్ స్వరూపమే మారిపోయింది. విశ్వవ్యాప్తంగా జరుగుతున్న టి20 లీగ్‌లు ఎంతోమంది క్రికెటర్లకు కొత్తగా అవకాశాలు కలి్పస్తుండటంతోపాటు ఆరి్థకంగా వారిని ఆదుకుంటున్నాయి. ప్రస్తుతం ఫుట్‌బాల్ తర్వాత ప్రపంచంలో అత్యధిక ఆదరణ కలిగిన క్రీడగా క్రికెట్‌కు గుర్తింపు వచ్చింది. ఫలితంగా 128 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు క్రికెట్ ఒలింపిక్స్‌లో పునరాగమనం చేయనుంది. ► ప్రస్తుతానికి క్రికెట్‌తోపాటు మిగతా నాలుగు కొత్త క్రీడాంశాలు లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ వరకే పరిమితం కానున్నాయి. తదుపరి ఒలింపిక్స్ క్రీడల్లోనూ క్రికెట్ కొనసాగడమనేది ఆయా దేశాల కార్యనిర్వాహక కమిటీల ఆసక్తిపై ఆధారపడి ఉంది. ఐఓసీ నిబంధనల ప్రకారం ఒలింపిక్స్ క్రీడల ఆతిథ్య దేశానికి తమకు నచి్చన కొన్ని క్రీడాంశాలను అదనంగా చేర్చే వెసులుబాటు ఉంది. 2032 ఒలింపిక్స్ ఆ్రస్టేలియాలోని బ్రిస్బేన్ నగరంలో జరుగుతాయి. 2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి భారత్ ఆసక్తి కనబరుస్తోంది. ఆ్రస్టేలియా, భారత్‌లో క్రికెట్‌కు విపరీతమైన ఆదరణ ఉండటంతో 2032, 2036 ఒలింపిక్స్‌ల్లోనూ క్రికెట్ కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ► ‘విశ్వవ్యాప్తంగా 2.5 బిలియన్ అభిమానులు కలిగిన ప్రపంచంలోని రెండో అత్యధిక ఆదరణ కలిగిన క్రికెట్ క్రీడను ఒలింపిక్స్‌లోకి స్వాగతం పలుకుతున్నాం. అమెరికాలోనూ మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీ ద్వారా ఈ ఆటకు ఆదరణ పెరుగుతోంది. వచ్చే ఏడాది అమెరికా–వెస్టిండీస్ సంయుక్తంగా టి20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. నా మిత్రుడు విరాట్ కోహ్లికి సామాజిక మాధ్యమాల్లో ప్రపంచ వ్యాప్తంగా 340 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. బాస్కెట్‌బాల్ దిగ్గజం లేబ్రాన్ జేమ్స్, అమెరికన్ ఫుట్‌బాల్ స్టార్ టామ్ బ్రేడీ, గోల్ఫ్ స్టార్ టైగర్ వుడ్స్కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు కోహ్లికి ఉన్నారు. అందుకే క్రికెట్ కేవలం కొన్ని దేశాలకే పరిమితం కాకుండా విశ్వవ్యాప్తంగా ఆదరణ పొందాలనే ఉద్దేశంతో ఒలింపిక్స్‌లో చోటు కల్పిస్తున్నాం’ అని లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ స్పోర్ట్స్ డైరెక్టర్, ఒలింపిక్ చాంపియన్ షూటర్ నికోలో కాంప్రియాని వ్యాఖ్యానించాడు. ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్‌కు చోటు లభించడంపట్ల ఐఓసీ సభ్యురాలు, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీ హర్షం వ్యక్తం చేశారు. ఒలింపిక్స్‌లో క్రికెట్ శాశ్వతంగా కొనసాగేందుకు తమవంతుగా అన్ని చర్యలు తీసుకుంటామని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ గ్రెగ్ బార్క్లే తెలిపారు. ► రగ్బీ తరహాలో ఆడే ఫ్లాగ్ ఫుట్‌బాల్‌కు... స్వా్వష్కు ఒలింపిక్స్‌లో తొలిసారి స్థానం దక్కింది. బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్‌కు వచ్చే ఏడాది పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో చోటు దక్కకపోయినా... అమెరికాలో ఎంతో ప్రాచుర్యం ఉండటంతో బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్ లాస్ ఏంజెలిస్‌లో మళ్లీ కనిపిస్తాయి. ► హాకీ తరహాలో ఆడే లాక్రాస్ క్రీడాంశం 1904 సెయింట్ లూయిస్ ఒలింపిక్స్‌లో, 1908 లండన్ ఒలింపిక్స్‌లో మెడల్ ఈవెంట్‌గా ఉంది. ఆ తర్వాత 1928 అమ్‌స్టర్‌డామ్, 1932 లాస్ ఏంజెలిస్, 1948 లండన్ ఒలింపిక్స్‌లో ప్రదర్శన క్రీడగా కొనసాగి ఆ తర్వాత చోటు కోల్పోయింది. చదవండి: WC 2023: ఎదుటి వాళ్లను అన్నపుడు నవ్వుకొని.. మనల్ని అంటే ఏడ్చి గగ్గోలు పెట్టడం ఎందుకు? అతడికి స్ట్రాంగ్ కౌంటర్ The proposal from the Organising Committee of the Olympic Games Los Angeles 2028 (@LA28) to include five new sports in the programme has been accepted by the IOC Session. Baseball/softball, cricket (T20), flag football, lacrosse (sixes) and squash will be in the programme at… — IOC MEDIA (@iocmedia) October 16, 2023 -
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంపై భారత్ దృష్టి
ముంబై: విశ్వక్రీడల ఆతిథ్యంపై భారత్ దృష్టి పెట్టినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 2036లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు భారత ప్రభుత్వం ఆసక్తిగా ఉందన్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సెషన్స్ ప్రారం¿ోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మోదీ మాట్లాడుతూ ‘ఒలింపిక్స్ నిర్వహణ కోసం భారతీయులంతా ఎదురుచూస్తున్నారు. 2036లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చే ప్రణాళికల్లో ఉన్నాం. ఇది 140 కోట్ల భారతీయుల కల. దీన్ని ఐఓసీ సహకారంతో సాకారం చేస్తాం. దీనికంటే ముందు 2029లో యూత్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు మేం రెడీగా ఉన్నాం’ అని మోదీ అన్నారు. క్రీడాస్ఫూర్తి అనేది విశ్వవ్యాప్తమని, ఇందులో పరాజితులెవరూ ఉండరని... కేవలం విజేతలు, నేర్చుకునేవారే ఉంటారని మోదీ చెప్పారు. 141వ ఐఓసీ సెషన్స్ శనివారం నుంచి మూడు రోజుల పాటు జరుగుతాయి. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో కొత్త క్రీడాంశాలకు చోటు కలి్పంచడం, ఓటింగ్, ఆమోదం తదితర నిర్ణయాలను ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు తీసుకుంటుంది. -
2028 ఒలింపిక్స్‌లో క్రికెట్!
ముంబై: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఓటింగ్ లాంఛనం పూర్తయితే 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనం చేస్తుంది. మరోవైపు బాక్సింగ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్యపై ఐఓసీ వేటుకు సిద్ధమైన నేపథ్యంలో బాక్సింగ్‌ను ఒలింపిక్స్‌లో కొనసాగించాలనే నిర్ణయాన్ని నిలిపివేసింది. మరోవైపు కొత్తగా కాంపౌండ్ ఆర్చరీ ఈవెంట్‌ను చేర్చాలన్న ప్రతిపాదనను తిరస్కరించింది. 2028లో అమెరికా నిర్వహించనున్న ఈ విశ్వక్రీడల కోసం క్రికెట్ సహా మరో నాలుగు క్రీడలు బేస్‌బాల్–సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోసి (సిక్సెస్), స్క్వాష్ ఆటలు చేర్చే ప్రతిపాదనల్ని ఐఓసీ ఎగ్జిక్యూటీవ్ బోర్డు ఆమోదించింది. ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ నేతృత్వంలోని కమిటీ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. దీంతో కేవలం లాంఛనప్రాయమైన ఓటింగ్ మాత్రమే మిగిలుంది. ముంబైలో ప్రస్తుతం జరుగుతున్న ఐఓసీ సెషన్స్‌లోనే ఆ లాంఛనం కూడా ఆదివారం పూర్తి కానుంది. ఎగ్జిక్యూటివ్ కమిటీ అమోదం లభించడంతో ఓటింగ్‌లో ఏ సమస్య ఎదురవదు. మెజారిటీ ఓట్లు ఖాయమవుతాయి. ‘విశ్వవ్యాప్తంగా క్రికెట్ విశేష ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా టి20 ఫార్మాట్ అందర్ని అలరిస్తుంది. వన్డే ప్రపంచకప్ అయితే ఏళ్ల క్రితమే విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌కు క్రికెట్ దగ్గరైంది’ అని ఐఓసీ చీఫ్ థామస్ బాచ్ అన్నారు. ఆదివారం ఓటింగ్ ప్రక్రియ పూర్తయితే లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో టి20 ఫార్మాట్లో క్రికెట్ నిర్వహిస్తారు. చివరిసారి 1900 పారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఆడించారు. ఆ తర్వాత క్రికెట్‌ను విశ్వ క్రీడల నుంచి తొలగించారు. -
క్రికెట్ ప్రేమికులకు శుభవార్త.. ఇకపై.. ‘ఒలింపిక్స్’లో కూడా.. గ్రీన్ సిగ్నల్
Cricket's Inclusion In 2028 Los Angeles Games: క్రికెట్ ప్రేమికులకు శుభవార్త..! విశ్వ క్రీడల్లో క్రికెటర్లను చూడాలన్న అభిమానుల కల 2028లో తీరనుంది. ఇప్పటికే ఆసియా క్రీడల్లో క్రికెట్‌ను చేర్చిన విషయం తెలిసిందే. తాజాగా.. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్‌ను చేర్చడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి ఐఓసీ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఈ విషయం గురించి ఏఓసీ అధ్యక్షుడు థామస్ బాష్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ చేర్చాలన్న నిర్వాహకుల ప్రతిపాదనకు కమిటీ అంగీకారం తెలిపినట్లు ప్రకటించారు. 2028 ఒలింపిక్స్‌లో కొత్తగా చేర్చనున్న ఐదు క్రీడాంశాల్లో కూడా క్రికెట్ కూడా ఉందని వెల్లడించారు. ఆ ఐదు క్రీడల్లో ఒకటిగా క్రికెట్ కూడా కాగా ఒలింపిక్స్‌లో అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్(నాన్- కాంటాక్ట్ అమెరికన్ ఫుట్‌బాల్), స్క్వాష్, లాక్రోస్‌లతో పాటు క్రికెట్ కూడా చేర్చనున్నారు. కాగా అక్టోబరు 15 నుంచి 17 వరకు ముంబైలో ఐఓసీ సమావేశ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే ఐఓసీ సభ్యులు ముంబైకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో.. ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్ రెండో రోజున థామస్ బాష్ ఈ మేరకు ప్రకటన చేశారు. తొలి అడుగు.. పసిడి పతకాలతో చరిత్ర ఇక ఇటీవల ఆసియా క్రీడలు-2023 సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి తొలిసారి క్రికెట్ జట్లను చైనాకు పంపిన విషయం తెలిసిందే. హోంగ్జూలో టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నమెంట్లో భారత మహిళల, పురుష జట్లు స్వర్ణ పతకాలు సాధించాయి. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో మహిళా జట్టు, రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని టీమిండియా ద్వితీయ శ్రేణి జట్లు ఆసియా క్రీడల్లో అడుగుపెట్టిన ఎడిషన్‌లోనే గోల్డ్ మెడల్స్ గెలిచి చరిత్ర సృష్టించాయి. కాగా క్రికెట్‌కు భారత్‌లో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఒలింపిక్స్‌లో ఈ క్రీడను చేర్చడం ద్వారా నిర్వాహకులు పెద్ద ఎత్తున ప్రసార హక్కుల రూపంలో ఆర్జించే అవకాశం ఉంది. చదవండి: WC 2011లో నేనే కెప్టెన్ అయి ఉంటే అతడిని తప్పక తీసుకునేవాడిని.. కానీ! -
Asian Games 2023: పతకాల శతకం
కోరినది నెరవేరింది. అనుకున్నట్టే... ఆశించినట్టే... ఆసియా క్రీడోత్సవాల్లో మన దేశం పతకాల శతకం పండించింది. చైనాలోని హాంగ్జౌలో జరిగిన 19వ ఏషియన్ గేమ్స్‌లో 655 మంది సభ్యుల భారత బృందం 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలతో మొత్తం 107 పతకాలు గెలిచింది. మునుపు 2018లో జకార్తా ఏషియన్ గేమ్స్‌లో సాధించిన 70 పతకాల రికార్డును తిరగరాసింది. ఆసియా క్రీడల పతకాల వేటలో మూడంకెల స్కోరుకు మన దేశం చేరడం ఇదే ప్రప్రథమం. శతాధిక పతకాల సాధనలో ఎప్పుడూ ముందు వరుసలో ఉండే చైనా, జపాన్, దక్షిణ కొరియాల సరసన అగ్ర శ్రేణి క్రీడాదేశంగా మనం కూడా స్థానం సంపాదించడం గర్వకారణం. ఈ క్రమంలో అతి సామాన్య స్థాయి నుంచొచ్చి అంతర్జాతీయ వేదికపై చెరగని ముద్ర వేసిన మనవాళ్ళ కథలు స్ఫూర్తిదాయకం. ఈ క్రీడోత్సవాల్లో 201 స్వర్ణాలతో సహా మొత్తం 383 పతకాలతో తిరుగులేని ప్రథమ స్థానంలో చైనా నిలిచింది. 188 మెడల్స్‌తో జపాన్, 190తో దక్షిణ కొరియా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. కరోనా వల్ల ఏడాది ఆలస్యంగా 2021లో జరిగిన టోక్యో–2020 వేసవి ఒలింపిక్స్ లోనూ చైనా, జపాన్‌లు ఇలాగే పతకాల సాధనలో రెండు, మూడు స్థానాల్లోనే ఉన్నాయి. ప్రపంచస్థాయి ఒలింపిక్స్‌లోనే అంతటి విజయాలు నమోదు చేసుకున్న ఆ దేశాలు ఇప్పుడు ఆసియా క్రీడోత్సవాల్లోనూ ఇలా ఆధిక్యం కనబరచడం ఆశ్చర్యమేమీ కాదు. అయితే, ఒలింపిక్స్ పతకాల ర్యాంకింగుల్లో ఆసియా దేశాల కన్నా వెనకాల ఎక్కడో 48వ ర్యాంకులో ఉన్న భారత్, తీరా ఏషియాడ్‌లో మాత్రం వాటన్నిటినీ వెనక్కి నెట్టి, నాలుగో ర్యాంకులోకి రావడం గణనీయమైన సాధన. మొత్తం 107 పతకాల్లో అత్యధిక పతకాలు (6 స్వర్ణాలతో సహా 29) మనకు అథ్లెటిక్స్‌లోనే వచ్చాయి. ఆపైన అత్యధికంగా షూటింగ్లో (22 మెడల్స్), ఆర్చరీలో (9), అలాగే బ్యాడ్మింటన్, రెజ్లింగ్, బాక్సింగ్, హాకీల్లో మనవాళ్ళు ప్రపంచ శ్రేణి ప్రతిభ కనబరిచారు. హాంగ్జౌలోని ఈ తాజా ఆసియా క్రీడోత్సవాల్లో మన దేశానికి మరో విశేషం ఉంది. ఈ క్రీడల పోరులో సాంప్రదాయికంగా తనకు బలమున్న హాకీ, రెజ్లింగ్, కబడ్డీ, షూటింగ్ లాంటి వాటిల్లోనే కాదు... అనేక ఇతర అంశాల్లో జమాజెట్టీలైన ఇతర దేశాల జట్లకు ఎదురొడ్డి భారత్ పతకాలు సాధించింది. పట్టున్న హాకీ, కబడ్డీ లాంటి క్రీడల్లో ప్రతిష్ఠ నిలబెట్టుకుంటూనే, ఆటల్లోని ఆసియా అగ్రరాజ్యాలను ఢీ కొని, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి ప్రపంచ శ్రేణి ఆటల్లోనూ పతకాలు గెలుచుకుంది. ఇది గమనార్హం. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఆదివారం ముగిసిన ఈ ఆసియా క్రీడా సంబరంలో మన ఆటగాళ్ళ విజయగీతిక భారత క్రీడారంగంలో అత్యంత కీలక ఘట్టం. కేవలం పతకాల గెలుపు లోనే కాక, క్రీడాజగతిలో మన వర్తమాన, భవిష్యత్ పయనానికీ ఇది స్పష్టమైన సూచిక. క్రీడాంగణంలోనూ మన దేశం వేగంగా దూసుకుపోతూ, రకరకాల ఆటల్లో విశ్వవిజేతల సరసన నిలవాలన్న ఆకాంక్షను బలంగా వ్యక్తం చేస్తున్న తీరుకు ఇది నిలువుటద్దం. 2018 నాటి ఏషియన్ గేమ్స్‌లో పతకాల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచిన భారత్ ఇవాళ నాలుగో స్థానానికి ఎగబాకిందంటే, దాని వెనుక ఎందరు క్రీడాకారుల కఠోరశ్రమ, దృఢసంకల్పం ఉందో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, క్రీడా ప్రాధికార సంస్థలు ఆటలకు అందించిన ప్రోత్సాహమూ మరువలేనిది. ఆతిథ్యదేశమైన చైనా వైఖరి అనేక అంశాల్లో విమర్శల పాలైంది. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఆటగాళ్ళకు తన వీసా విధానంతో అడ్డం కొట్టి, డ్రాగన్ తన దుర్బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. జావెలిన్ త్రో సహా కొన్ని అంశాల్లో చైనా అధికారిక రిఫరీలు భారత ఆటగాళ్ళ అవకాశాల్ని దెబ్బ తీసేలా విచిత్ర నిర్ణయాలు తీసుకోవడమూ వివాదాస్పదమైంది. తొండి ఆటతో బీజింగ్ తన కుత్సితాన్ని బయటపెట్టుకున్నా, స్థానిక ప్రేక్షకులు ఎకసెక్కాలాడుతున్నా భారత ఆటగాళ్ళ బృందం సహనంతో, పట్టుదలతో ఈ విజయాలను మూటగట్టుకు వచ్చింది. ఆ విషయం విస్మరించలేం. అందుకే కొన్ని అంశాల్లో అసంతృప్తి ఉన్నా, కొందరు క్రీడాతారలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఆటతీరులో నిలకడ చూపలేక పోయినా తాజా ఆసియా క్రీడోత్సవాల్లో భారత ప్రదర్శనను అభినందించి తీరాలి. వచ్చే ఏటి ప్యారిస్ ఒలింపిక్స్‌కు దీన్ని ఉత్ప్రేరకంగా చూడాలి. మునుపటితో పోలిస్తే, క్రీడాజగత్తులో మనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం సంతో షకర పరిణామం. అలాగని సాధించినదానితో సంతృప్తి పడిపోతేనే ఇబ్బంది. ఇప్పటికీ జనాభాలో, అనేక ఇతర రంగాల్లో మనతో పోలిస్తే దిగువనున్న దేశాల కన్నా ఆటల్లో మనం వెనుకబడి ఉన్నాం. అది మర్చిపోరాదు. ఆర్థిక, సామాజిక ఇబ్బందులతో పాటు క్రీడావ్యవస్థలోని సవాలక్ష రాజకీయాలు, పెత్తందారీ విధానాలు, క్రీడా సంఘాలను సొంత జాగీర్లుగా మార్చుకున్న నేతలు – గూండాలు మన ఆటకు నేటికీ అవరోధాలు. మహిళా రెజ్లర్లతో దీర్ఘకాలంగా అనుచితంగా వ్యవహరిస్తున్నట్టు అధికార పార్టీ ఎంపీపై అన్ని సాక్ష్యాలూ ఉన్నా ఏమీ చేయని స్వార్థ పాలకుల దేశం మనది. అలాంటి చీకాకులు, చిక్కులు లేకుంటే మన ఆటగాళ్ళు, మరీ ముఖ్యంగా ఇన్ని ఇబ్బందుల్లోనూ పతకాల పంట పండిస్తున్న పడతులు ఇంకెన్ని అద్భుతాలు చేస్తారో! ఏషియాడ్‌లో మనం గెల్చిన 28 స్వర్ణాల్లో 12 మాత్రమే ఒలింపిక్స్ క్రీడాంశాలనేది గుర్తు చేసుకుంటే చేయాల్సిన కృషి, సాధించాల్సిన పురోగతి అవగతమవుతుంది. మహారాష్ట్రలోని దుర్భిక్ష ప్రాంతంలోని రైతు కొడుకు, ముంబయ్‌లో కూరలమ్మే వాళ్ళ కూతురు లాంటి మన ఏషియాడ్ పతకాల వీరుల విజయగాథలెన్నో ఆ లక్ష్యం దిశగా మనకిప్పుడు ఆశాదీపాలు! -
2036 ఒలింపిక్స్‌కు భారత్ బిడ్ వేయాలి: పీటీ ఉష
హాంగ్జౌ: ఆసియా క్రీడల చరిత్రలోనే భారత క్రీడా బృందం ఈసారి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, అత్యధికంగా 107 పతకాలు సాధించడంపట్ల భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు, దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష ఆనందం వ్యక్తం చేసింది. ‘ఆసియా క్రీడల్లో రికార్డుస్థాయి ప్రదర్శన తర్వాత భారత క్రీడాకారులు వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్‌పై దృష్టి సారించాలి. మన క్రీడాకారులు, కోచ్‌లు, జాతీయ క్రీడా సమాఖ్యలు శ్రమిస్తే పారిస్ ఒలింపిక్స్‌లో మన పతకాల సంఖ్య కచ్చితంగా రెండంకెలు దాటుతుంది. ఇక మనం కూడా ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం బిడ్ వేయాల్సిన సమయం ఆసన్నమైంది. 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం భారత్ పోటీపడాలి’ అని 59 ఏళ్ల పీటీ ఉష వ్యాఖ్యానించింది. కేవలం ఒకట్రెండు క్రీడాంశాల్లో కాకుండా వేర్వేరు క్రీడాంశాల్లో భారత్‌కు పతకాలు రావడంపట్ల రాజ్యసభ సభ్యురాలైన ఉష ఆనందాన్ని వ్యక్తం చేసింది. -
పారిస్ ఒలంపిక్స్‌కు శ్రీశంకర్ అర్హత
బ్యాంకాక్: భారత స్టార్ లాంగ్‌జంపర్ మురళీ శ్రీశంకర్ వచ్చే ఏడాది పారిస్‌లో జరిగే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ (2024)కు అర్హత సాధించాడు. తద్వారా ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ఈ ఘనత సాధింన తొలి భారత ఆటగాడిగా అతను ఘనత వహించాడు. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో శనివారం జరిగిన పురుషుల లాంగ్‌జంప్ ఈవెంట్లో అతను రజత పతకం సాధించాడు. 24 ఏళ్ల భారత అథ్లెట్ 8.37 మీటర్ల దూరం దుమికి రెండో స్థానంలో నిలిచాడు. ఈ ప్రదర్శన అతని కెరీర్లోనే రెండో ఉత్తమ ప్రదర్శన కాగా... పారిస్ ఈవెంట్ క్వాలిఫికేషన్ మార్క్ (8.27 మీటర్లు)ను అధిగమించాడు. శ్రీశంకర్‌కు ఇది రెండో ఒలింపిక్స్ కాగా... గత టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధింన అతను క్వాలిఫికేషన్ రౌండ్లోనే వెనుదిరిగాడు. ఈ లాంగ్‌జంప్‌లో యు తంగ్ లిన్ (8.40 మీ.; చైనీస్ తైపీ) స్వరం గెలుపొందాడు. 4్ఠ400 మీటర్ల మిక్స్డ్ రిలే ఈవెంట్లో రాజేశ్ రమేశ్, అమోజ్ జాకబ్, ఐశ్వర్య మిశ్రా, శుభ వెంకటేశన్‌లతో కూడిన భారత బృందం పసిడి పతకంతో మెరిసింది. ఈ రిలే జట్టు పోటీని 3 నిమిషాల 14.70 సెకన్లలో పూర్తిచేసి కొత్త జాతీయ రికార్డును నిలకొల్పింది. గతంలో 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నమోదు చేసిన 3ని.15.77 సె. రికార్డును తిరగరాసింది. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో మూడో స్థానంలో నిలిచిన సంతోష్ కుమార్ (49.09 సె.) కాంస్యంతో తృప్తిపడ్డాడు. పురుషుల హైజంప్‌లో సర్వేశ్ కుశారే 2.26 మీ. ఎత్తు వరకు జంప్ చేసి రజతం గెలిచాడు. మహిళల హెప్టాథ్లాన్‌లో స్వప్న బర్మన్ 5840 పాయింట్లతో రజతం గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యెర్రాజీ 200 మీటర్ల స్ప్రింట్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో ఆమె 23.29 సె. టైమింగ్‌తో ఫైనల్స్‌కు అర్హత పొందింది. శనివారం నాటి పోటీల్లో భారత్ ఒక పసిడి, మూడు రజతాలు, ఒక కాంస్యం గెలుచుకుంది. ఓవరాల్‌గా ఈ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో 14 (6 స్వరాలు, 4 రజతాలు, 4 కాంస్యాలు) పతకాలున్నాయి. చదవండి Wimbledon: మహిళల సింగిల్స్‌లో సంచలనం.. వొండ్రుసోవా సరికొత్త చరిత్ర -
35 ఏళ్ల వయసులో జంప్ సాధ్యమా.. సొంతగడ్డపై తొమ్మిదో స్వర్ణపతకంతో
1996...అట్లాంటా ఒలింపిక్స్‌లో పాల్గొనే అమెరికా అథ్లెటిక్స్ జట్టు కోసం ట్రయల్స్ జరుగుతున్నాయి. లాంగ్‌జంప్‌లో కార్ల్ లూయీస్ రెండు ప్రయత్నాలు అయిపోయాయి. అప్పటికే దిగ్గజంగా గుర్తింపు ఉన్నా, ఈసారి మాత్రం అతనిపై ఎలాంటి అంచనాలు లేవు. 35 ఏళ్ల వయసులో జంప్ సాధ్యమా అనే విమర్శలే ఎక్కువగా వినిపించాయి. కానీ కార్ల్‌కు మాత్రం తనపై చాలా నమ్మకముంది. శక్తినంతా కూడదీసుకొని చివరి ప్రయత్నంలో లంఘించాడు. ఎట్టకేలకు మూడో స్థానంలో నిలిచి అర్హత సాధించాడు. అయితే అతను క్వాలిఫై కావడంతోనే ఆగిపోలేదు. సొంతగడ్డపై జరిగిన ఒలింపిక్స్ అసలు సమరంలో కూడా సత్తా చాటాడు. అన్ని అంచనాలనూ పటాపంచలు చేస్తూ 8.50 మీటర్ల జంప్‌తో అగ్రస్థానం సాధించి ఓవరాల్‌గా తొమ్మిదో స్వర్ణపతకంతో చరిత్ర సృష్టించాడు. ఒకే ఈవెంట్లో వరుసగా నాలుగు ఒలింపిక్స్‌లలోనూ స్వర్ణాలు గెలిచి ఏకైక అథ్లెట్‌గా నిలిచి∙ఆల్‌టైమ్ గ్రేట్ అనిపించుకున్నాడు. పోటీ ముగిసిన రాత్రి తాను జంప్ చేసిన పిట్ వద్దకు వెళ్లి ఒక ప్లాస్టిక్ కవర్లో అక్కడి ఇసుకను తీసుకున్నాడు. దానిని ఎప్పటికీ చెరగని జ్ఞాపకంగా తనతో ఉంచుకున్నాడు. స్వదేశంలో జరిగిన 1984 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాలు గెలిచిన తర్వాత కూడా కార్ల్ లూయీస్‌కు స్టార్ హోదా రాలేదు. నిజానికి అమెరికన్ అథ్లెట్లు అలాంటి ప్రదర్శన చేస్తే కార్పొరేట్ కంపెనీలు, స్పాన్సర్లు వెంటపడతాయి. మున్ముందు మరింత విలువ పెరుగుతుందని భావించి ఒలింపిక్స్‌కు ముందు ఇచ్చిన కోకాకోలా ఆఫర్‌ను అతను తిరస్కరించాడు. ఇది చెడ్డపేరు తీసుకు రాగా, అతనితో పాటు అతని మేనేజర్ వ్యవహారశైలి, నోరు జారిన వ్యాఖ్యలతో లూయీస్‌కు పెద్ద కంపెనీలు దూరమయ్యాయి. అభిప్రాయభేదాల కారణంగా ‘నైకీ’తో కూడా ఒప్పందం రద్దయింది. ఇలా దాదాపు మూడేళ్ల పాటు ఆటలో అద్భుతాలు చేసినా, ఘనమైన ఫలితాలు సాధించినా అవేవీ అతని స్థాయిని పెంచలేదు. ప్రతిష్ఠాత్మక 1987 వరల్డ్ చాంపియన్‌షిప్ 100 మీటర్ల పరుగులో అతను బెన్ జాన్సన్ చేతిలో ఓటమి పాలయ్యాడు (ఆ తర్వాత జాన్సన్ డోపింగ్ కారణంగా స్వర్ణం లూయీస్కే దక్కింది). మానసికంగా దీని వల్ల కొంత దెబ్బతిన్న స్థితిలో విషాదం అతని దరిచేరింది. ఆటలో ఓనమాలు నేర్పించి ప్రపంచాన్ని జయించే వరకు అన్నీ అయి నడిపించిన తండ్రి అనూహ్యంగా మరణించాడు. తాను ఒలింపిక్స్‌లో నాలుగు పతకాలు నెగ్గినా అన్నింటికంటే 100 మీటర్ల పరుగంటేనే తనకు ఇష్టమని తండ్రి చెప్పేవాడు. తండ్రి అంత్యక్రియల సమయంలో ఆయన చేతిలో తన ఒలింపిక్స్ స్వర్ణాన్ని ఉంచి ఖననం చేశాడు. ఇదేమిటని తల్లి వారించగా.. ‘ఫర్వాలేదమ్మా...మరొకటి గెలిచి చూపిస్తాను’ అని మాటిచ్చాడు. నిజంగానే కొద్ది రోజుల తర్వాత జరిగిన 1988 సియోల్ ఒలింపిక్స్‌లో అతను 100 మీటర్ల పరుగులో మళ్లీ స్వర్ణం సాధించి చూపించాడు. ఇదే పోటీల్లో తన ఫేవరెట్ ఈవెంట్ లాంగ్‌జంప్‌లో స్వర్ణంతో పాటు 200 మీటర్ల పరుగులో రజతం కూడా గెలిచి తానేంటో నిరూపించాడు. ఈ పోటీల్లో సాధించిన విజయాలు అతని దిగ్గజ హోదాకు బాటలు వేశాయి. వరుస రికార్డులతో... 17 సంవత్సరాలు... అంతర్జాతీయ స్థాయిలో ఒక అథ్లెట్పరంగా చూస్తే ఇది చాలా పెద్ద కెరీర్. కఠోర శ్రమ, పట్టుదలతో లూయీస్ ఈ స్థాయికి చేరుకున్నాడు. అలబామాలోని బర్మింగ్‌హామ్ అతని స్వస్థలం. హర్డ్లర్ అయిన తల్లితో పాటు తండ్రికి కూడా క్రీడలపై అమితాసక్తి ఉండేది. వారిద్దరూ స్థానికంగా ఒక అథ్లెటిక్స్ క్లబ్ నడిపేవారు. దాంతో సహజంగానే అతడిని పరుగు ఆకర్షించింది. పాఠశాల స్థాయిలోనే అతని సత్తా అందరికీ తెలిసింది. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రకటించిన జూనియర్ లాంగ్జంపర్ల ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన లూయీస్ వరుసగా రికార్డులు నెలకొల్పాడు. కాలేజీ స్థాయిలోనూ ఇదే జోరు కొనసాగిస్తూ 8.13 మీటర్ల జంప్‌తో కొత్త రికార్డు సృష్టించాడు. 1979లో లాంగ్‌జంప్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానం సాధించడంతోనే అతను భవిష్యత్తులో అద్భుతాలు చేయబోతున్నాడని అర్థమైంది. 19 ఏళ్ల వయసులో 1980 మాస్కో ఒలింపిక్స్‌లో పాల్గొనే అమెరికా అథ్లెటిక్స్ జట్టులోనే అతనికి చోటు దక్కింది. అయితే ప్రచ్ఛన్న యుద్ధం కారణంగా అమెరికా ఆ పోటీలను బహిష్కరించడంతో తొలి అవకాశం చేజారింది. 1981లోనే 100 మీట్లర్ల పరుగు, లాంగ్‌జంప్‌లలో అతను ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచాడు. ఆ తర్వాత తొలిసారి బరిలోకి దిగిన 1983 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ అతడిని శిఖరానికి చేర్చింది. హెల్సింకీలో జరిగిన ఈ పోటీల్లో అతను 3 స్వర్ణాలు సాధించి సత్తా చాటాడు. ఆపై ఇక ఒలింపిక్స్‌లో ఘనతలు అందుకోవడమే మిగిలింది. లాస్ ఏంజెలెస్ నుంచి మొదలు పెట్టి అట్లాంటా వరకు పుష్కరకాలం పాటు ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో లూయీస్ శకం సాగింది. ‘నో టు డ్రగ్స్’ అంతర్జాతీయ అథ్లెటిక్స్‌లో ఉత్ప్రేరకాల వాడకాన్ని తీవ్రంగా వ్యతిరేకించి బహిరంగ వేదికలపై బలంగా వాదించిన అగ్రశ్రేణి ఆటగాళ్లలో కార్ల్ లూయీస్ ముందు వరుసలో ఉంటాడు. ఆటలో సాధించిన ఘనతలు మాత్రమే కాకుండా ఈ తరహా ఆలోచనలే అతడిని అందరికంటే భిన్నంగా, ‘ఆల్‌టైమ్ గ్రేట్’గా నిలిపాయి. 1987 వరల్డ్ చాంపియన్ షిప్ సమయంలో తన ప్రత్యర్థి బెన్ జాన్సన్ డ్రగ్స్ వాడాడంటూ లూయీస్ బహిరంగంగా వ్యాఖ్యానించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. తాను ఓడిపోయాడు కాబట్టి అలా అంటున్నాడంటూ వ్యాఖ్యలు వచ్చాయి. అయితే ఏడాది తర్వాత సియోల్ ఒలింపిక్స్‌లో అదే నిజమైంది. 100 మీటర్ల పరుగులో నెగ్గిన జాన్సన్ డ్రగ్స్ వాడాడని తేలడంతో అతనిపై నిషేధం పడింది. ఈ క్రమంలో తనపై కూడా రాళ్ళదాడి తప్పలేదు. లూయీస్ కూడా నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడాడంటూ ఒక నివేదిక బయటకు వచ్చింది. అయితే లూయీస్ ఏమాత్రం బెదరలేదు. సాంకేతికంగా అన్ని అంశాలను ముందుకు తెచ్చి తాను తప్పు చేయలేదని నిరూపించుకున్నాడు. చివరకు డోపింగ్ ఏజెన్సీ కూడా లూయీస్‌ను నిర్దోషిగా ప్రకటించింది. ఆ తర్వాత అతనిపై ఈ విషయంలో ఇంకెప్పుడూ విమర్శలు రాలేదు. రిటైర్మెంట్ తర్వాత పలు సినిమాలు, టీవీ సిరీస్‌లలో లూయీస్ నటించాడు. 2011 అమెరికా పార్లమెంట్లో అడుగుపెట్టేందుకు అతను ప్రయత్నించాడు. డెమోక్రటిక్ తరఫున న్యూజెర్సీ సెనేట్ స్థానం నుంచి బరిలోకి దిగినా, సాంకేతిక కారణాలతో అతని దరఖాస్తు తిరస్కరణకు గురైంది. స్వల్పకాలం పాటు తాను చదివిన హూస్టన్ యూనివర్సిటీలో అథ్లెటిక్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా కూడా అతను వ్యవహరించాడు. ఘనతలివీ... ఒలింపిక్స్‌లో 9 స్వర్ణ పతకాలు, 1 రజతం ►(1984 లాస్ ఏంజెల్స్ – 100 మీ., 200 మీ., లాంగ్‌జంప్, 4*100 మీ. రిలే) ►(1988 సియోల్ – 100 మీ., లాంగ్‌జంప్), 200 మీ.లో రజతం ►(1992 బార్సిలోనా – లాంగ్ జంప్, 4*100 మీ. రిలే) ►(1996 అట్లాంటా – లాంగ్‌జంప్) ►(1988 సియోల్ – 200 మీ.లో రజతం) ►వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో 8 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం (1983, 1987, 1991, 1993లలో కలిపి 8 స్వర్ణాలు), 1991లో ఒక రజతం, 1993లో ఒక కాంస్యం స్పోర్ట్స్‌మన్ ఆఫ్ ద సెంచరీ, ఒలింపియన్ ఆఫ్ ద సెంచరీలతో పాటు పలుమార్లు అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు. ►లాంగ్‌జంప్‌లో పదేళ్ల పాటు ఓటమి లేకుండా వరుసగా 65 పోటీల్లో గెలిచిన రికార్డు. -∙మొహమ్మద్ అబ్దుల్ హాది చదవండి: 'అతడు ఏదో పెద్ద స్టార్ క్రికెటర్లా ఫీలవతున్నాడు.. గిల్‌ను చూసి నేర్చుకో' -
ఒలింపిక్స్‌లో అత్యధిక బంగారు పతకాలు సాధించిన టాప్ 10 క్రీడాకారులు
-
నిఖత్ జరీన్‌కు రూ.2 కోట్లు.. ‘ఒలింపిక్స్’ శిక్షణ కోసం సీఎం కేసీఆర్ సాయం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ రాబోయే ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణపతకాన్ని సాధించి తెలంగాణతోపాటు భారత దేశ ఘనకీర్తిని మరోసారి విశ్వానికి చాటాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. నిఖత్ జరీన్‌కు రాబోయే ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. గురువారం సచివాలయంలో నిఖత్ జరీన్, సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు అవసరమైన శిక్షణ, ప్రయాణ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం ముఖ్యమంత్రి రూ.2 కోట్లను ప్రకటించారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బాల్క సుమన్, విఠల్ రెడ్డి, సీఎంవో కార్యదర్శి భూపాల్ రెడ్డి, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నిఖత్ జరీన్‌ను సందీప్ కుమార్ సుల్తానియా సచివాలయంలోని తన చాంబర్లో నిఖత్‌కు శాలువా కప్పి సత్కరించారు. చదవండి: లకారం ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్ విగ్రహం.. హైకోర్టు స్టే.. కీలక మార్పులు! -
ఆ విశేషణాలకు అసలు అర్థం అతడే! సరదాలు ఎక్కువై.. అప్పుడు దారితప్పినా..
మెరుపు ఎలా ఉంటుందో దగ్గరి నుంచి చూశారా.. అతని పరుగు చూస్తే చాలు తెలిసిపోతుంది! రెప్పపాటు కాలంలో, కళ్లు మూసి తెరిచేలోగా అంటూ విశేషణాలు తరచుగా వాడేస్తుంటామా.. వాటి అసలు అర్థం ఆ వ్యక్తికి మాత్రమే వర్తిస్తుంది! పది క్షణాల్లో ప్రపంచాన్ని జయించడం ఏమిటో చెప్పాలా.. అథ్లెటిక్స్‌లో అతడు సాధించిన ఘనతలు చూస్తే మరెవరికీ అవి సాధ్యం కావని అర్థమవుతుంది! ఒకటి కాదు రెండు కాదు, ట్రాక్ పైకి అడుగు పెట్టగానే అతని కోసమే ఎదురు చూస్తున్నట్లుగా సిద్ధంగా ఉన్న ప్రపంచ రికార్డులు, ఒలింపిక్స్ పతకాలు, లెక్కలేనంత అభిమాన గణం.. ఎంతటి సాధారణ నేపథ్యమైనా సరే విజయానికి దానితో పని లేదని.. ఆటతో, శ్రమతో, పట్టుదలతో శిఖరానికి చేరవచ్చని నిరూపించిన దిగ్గజం! తన ప్రతి పరుగుతో ట్రాక్‌ను శాసించిన ఆ అద్భుతం.. ఉసేన్ బోల్ట్!! మైకేల్ హోల్డింగ్, కోట్నీ వాల్ష్.. ప్రపంచ క్రికెట్‌కు జమైకా అందించిన దిగ్గజ పేస్ బౌలర్లు. ఉసేన్ బోల్ట్ కూడా వారి బాటలోనే ఫాస్ట్ బౌలర్ కావాలనుకున్నాడు. చిన్నతనం నుంచి క్రికెట్‌పైనే దృష్టి పెట్టాడు. అయితే అతని భవిష్యత్తు మరో రూపంలో ఎదురుచూస్తోందని బోల్ట్‌కు తెలీదు. పాఠశాల స్థాయి క్రికెట్ టోర్నీలో బోల్ట్ ఆడుతున్నప్పుడు చూసిన కోచ్ అతనికి మరో మార్గాన్ని నిర్దేశించాడు. నీకున్న మెరుపు పరుగుకు క్రికెట్ కంటే అథ్లెటిక్స్ బెటర్. ఆ రంగమైతే మరింత ‘వేగంగా’ ఎదుగుతావు అని చెప్పాడు. అప్పుడే సీన్ లోకి వచ్చిన అథ్లెటిక్స్ కోచ్ మెక్నీల్ ఆ కుర్రాడిలోని ప్రతిభను సానబెట్టడంతో బంగారు భవిష్యత్తుకు పునాది పడింది. ఆ తర్వాత అతని సహజ ప్రతిభతో స్కూల్ స్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో బోల్ట్‌కు ఎదురు లేకుండా పోయింది. ఆ సమయంలో ఎంతో గుర్తింపు ఉన్న కరీబియన్ స్పోర్ట్స్ (కరిఫ్తా గేమ్స్)లో రెండు రజత పతకాలు సాధించడంతో అతని ఆట గురించి జమైకా బయట కూడా తెలిసింది. కొత్త తారగా దూసుకెళ్లి.. అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య జూనియర్, యూత్ స్థాయిలోనూ అధికారికంగా ప్రపంచ చాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తుంది. ఆ టోర్నీల్లో రాణిస్తే ఇక బంగారు భవిష్యత్తు ఉండటం ఖాయమని ఒక అంచనా. 15 ఏళ్ల వయసులో బోల్ట్ హంగేరీలో జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. ప్రపంచ వేదికపై ఇదే అతనికి తొలి మెగా ఈవెంట్. అయితే 200 మీటర్ల పరుగులో అతను కనీసం ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయాడు. ఇదే కారణం వల్ల కావచ్చు.. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు అతను ఆటపై దృష్టి పెట్టకుండా దూరం జరుగుతూ పోయాడు. అయితే కోచ్‌లు సరైన సమయంలో కల్పించుకోవడంతో మళ్లీ దారిలోకి వచ్చాడు. మరుసటి ఏడాదే కింగ్‌స్టన్‌లో వరల్డ్ జూనియర్ చాంపియన్ షిప్ జరిగింది. సొంతగడ్డ నుంచే అద్భుతం మొదలైందా అన్నట్లుగా ఈ ఈవెంట్లో బోల్ట్ చెలరేగిపోయాడు. 200 మీటర్ల పరుగులో స్వర్ణంతో పాటు మరో రెండు రజతాలు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అప్పుడు మొదలైన ఆ జోరు ఆ తర్వాత వేగంగా కొనసాగింది. ఎక్కడ పరుగెత్తినా, ఎక్కడ పాల్గొన్నా వరుస పతకాలు, రికార్డులు వచ్చి చేరాయి. ఈసారీ మరో ప్రమాద హెచ్చరిక! తాజా విజయాలతో బోల్ట్‌కు సరదాలు ఎక్కువయ్యాయని, క్లబ్‌లలో పార్టీలు, జంక్ ఫుడ్లతో దారి తప్పుతున్న అతడిని జాగ్రత్తగా చూసుకోమని జమైకా ప్రభుత్వమే నేరుగా జమైకా అథ్లెటిక్స్ అసోసియేషన్‌కు చెప్పింది. దాంతో మళ్లీ కొత్తగా దారిలోకి తీసుకు రావాల్సి వచ్చింది. అయితే ఈ సారి ఇదే ఆఖరు! ఆ దిగ్గజం మళ్లీ ట్రాక్ తప్పాల్సిన అవసరం రాలేదు. వరల్డ్ చాంపియన్‌షిప్‌తో మొదలు.. బోల్ట్.. ఒలింపిక్స్ ఎంట్రీ 2004 ఏథెన్స్‌లోనే జరిగింది. అయితే తాను కూడా దానిని ఎంతో తొందరగా మర్చిపోవాల్సి వచ్చింది. 200 మీటర్ల పరుగులో తొలి రౌండ్లోనే అతను వెనుదిరిగాడు. తర్వాతి ఏడాది తొలి ప్రపంచ చాంపియన్ షిప్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఫైనల్స్‌లో అతను చివరి స్థానంలో నిలిచాడు. జూనియర్ స్థాయిలో చూపిన ఘనతలు సీనియర్‌కు వచ్చే సరికి కనిపించకపోవడంతో బోల్ట్‌పై ఆసక్తి తగ్గుతూ వచ్చింది. అయితే ఇది అతనిలో కసిని పెంచింది. దాదాపు రెండేళ్ల పాటు అన్నీ వదిలి అతను ఒకే ఒక లక్ష్యంతో తీవ్ర సాధన చేశాడు. తన స్ప్రింట్స్ నైపుణ్యాన్ని మెరుగుపరచుకొని 200 మీటర్లే కాదు, 100 మీటర్ల పరుగులోనూ పాల్గొంటానంటూ కోచ్‌తో పట్టుబట్టి మరీ తన మాట నెగ్గించుకున్నాడు. 2007 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో గెలిచిన 2 రజతాలు బోల్ట్‌ను కొత్తగా ప్రపంచానికి పరిచయం చేశాయి. ఆ తర్వాత వరుసగా మూడు ఒలింపిక్స్‌లలో, వరల్డ్ చాంపియన్ షిప్లో అతని విజయధ్వానం వినిపించింది. అలా ముగిసింది.. 2017 ఆగస్టు.. లండన్‌లో వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ జరుగుతోంది. అంతకు ముందు ఏడాదే రియో ఒలింపిక్స్‌లో తన అద్భుత ప్రదర్శన తర్వాత బోల్ట్ ఆటకు గుడ్‌బై చెప్పవచ్చని వినిపించింది. అయితే కొన్ని ఒప్పందాలు, ఇతర కారణాల వల్ల అతను మరో మెగా ఈవెంట్‌కు సిద్ధం కావాల్సి వచ్చింది. అయితే పతకాలు సాధించే చాన్సెస్ పట్ల కొన్ని సందేహాలు ఉన్నా.. అతనిపై అభిమానులకున్న క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. అది 100 మీటర్ల రేస్‌లో కనిపించింది. అయితే భయపడినట్లుగానే అనూహ్య ఫలితం వచ్చింది. పదేళ్ల కాలం పాటు ఓటమి లేకుండా ట్రాక్‌ను శాసించిన బోల్ట్ చివరకు మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 200 మీటర్ల పందెంలో పాల్గొనని బోల్ట్.. తన అభిమానుల కోసం దేశం తరఫున 4* 100 మీటర్ రిలేలో పరుగెత్తేందుకు సంకల్పించాడు. అది బోల్ట్ చివరి రేస్‌గా ప్రపంచం అంతా ఆసక్తిగా తిలకించింది. అయితే చివరి లెగ్‌లో జమైకా ఆశలు మోస్తూ పరుగు ప్రారంభించిన బోల్ట్ సగం దూరానికే కుప్పకూలిపోయాడు. కండరాలు పట్టేయడంతో ముందుకు వెళ్లలేక కన్నీళ్లపర్యంతం అయ్యాడు. నిర్వహకులు వీల్‌చైర్ తీసుకు రాగా, వారిని నివారిస్తూ తన సహచరులు తోడుగా రాగా ‘ఫినిషింగ్ లైన్’ను దాటాడు. అథ్లెటిక్స్ ట్రాక్‌పై ఒక అత్యద్భుత ప్రస్థానం చివరకు అలా ముగిసింది. బంగారాల సింగారం.. అథ్లెటిక్స్ చరిత్రలో అనితరసాధ్యమైన రికార్డులు బోల్ట్ పేరిట ఉన్నాయి. మూడు ఈవెంట్లు 100 మీ., 200 మీ., 4* 100 మీ. రిలేలలో మూడేసి చొప్పున వరుసగా మూడు ఒలింపిక్స్‌లలో అతను 9 స్వర్ణాలు గెలుచుకున్నాడు. 2008 బీజింగ్, 2012 లండన్ , 2016 రియో ఒలింపిక్స్‌లలో అతను ఈ ఘనత సాధించాడు. 6 ప్రపంచ చాంపియన్ షిప్‌లతో కలిపి 11 స్వర్ణాలు, 2 రజతాలు, ఒక కాంస్యం అతను సాధించాడు. 2008లో స్వర్ణం సాధించిన జమైకా రిలే జట్టులో సభ్యుడైన నెస్టా కార్టర్ 2017లో డోపింగ్‌లో పట్టుబడటంతో ఆ ఫలితాన్ని రద్దు చేసి పతకం వెనక్కి తీసుకోవడంతో బోల్ట్ ఖాతాలో 8 స్వర్ణాలు మిగిలాయి. అయితే ఇది తన ఘనతను ఏమాత్రం తగ్గించదని అతను చెప్పుకున్నాడు. టు ద వరల్డ్ ఉసేన్ బోల్ట్ అనగానే అందరి మదిలో మెదిలే దృశ్యం విజయానంతరం అతను ఇచ్చే పోజ్! సామాన్యుడి నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగానని చెప్పేలా ‘టు ద వరల్డ్’ అంటూ అది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్ నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక దశలో ప్రపంచ ప్రముఖులు ఎంతో మంది దీనిని అనుకరించి చూపించడం విశేషం. -మొహమ్మద్ అబ్దుల్ హాది చదవండి: IPL 2023: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్!