పారిస్ ఒలింపిక్స్‌లో రెండో రోజు (జులై 28) భారత్‌కు అనుకూల ఫలితాలు వచ్చాయి. షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో మనూ భాకర్ భారత్‌కు తొలి పతకం (కాంస్యం) అందించగా.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రమిత జిందాల్, పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అర్జున్ బబుతా ఫైనల్స్‌కు అర్హత సాధించారు.
మూడో రోజు (జులై 29) రమిత జిందాల్, అర్జున్ బబుతా పతక రేసులో నిలువనున్నారు. ఒలింపిక్స్‌లో ఇవాల్టి భారత షెడ్యూల్ ఇలా ఉంది.
బ్యాడ్మింటన్: పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజీ మ్యాచ్: మధ్యాహ్నం 12 గంటలకు: సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి/చిరగ్ షెట్టి వర్సెస్ మార్క్ లంప్స్‌ఫస్/మర్విన్ సెయిడెల్ (జర్మనీ)
మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజీ మ్యాచ్: మధ్యాహ్నం 12:50 గంటలకు: అశ్విని పొన్నప్ప/తనిష క్రాస్టో వర్సెస్ నమి మత్సుయమా/చిహారు షిదా (జపాన్)
పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజీ మ్యాచ్: సాయంత్రం 5: 30 గంటలకు: లక్ష్య సేన్ వర్సెస్ సూలియన్ కర్రెగ్గి (బెల్జియం)
షూటింగ్: మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్స్ (రమిత జిందాల్): మధ్యాహ్నం ఒంటి గంటకు
పురుషుల ట్రాప్ క్వాలిఫికేషన్ (పృథ్వీరాజ్ తొండైమాన్): మధ్యాహ్నం ఒంటి గంటకు
పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్స్ (అర్జున్ బబుతా): మధ్యాహ్నం 3 గంటలకు
టెన్నిస్: పురుషుల డబుల్స్ (రోహన్ బోపన్న/ ఎన్ శ్రీరామ్ బాలాజీ): మధ్యాహ్నం 3:30 గంటల నుంచి
హాకీ: పురుషుల పూల్-బి మ్యాచ్: భారత్ వర్సెస్ అర్జెంటీనా: సాయంత్రం 4:15 గంటలకు
ఆర్చరీ: పురుషుల రికర్వ్ టీమ్ క్వార్టర్ ఫైనల్స్: తరుణ్‌దీప్ రాయ్, ధీరజ్ బొమ్మదేవర, ప్రవీణ్ జాదవ్: సాయంత్రం 6:30 గంటలకు
టేబుల్ టెన్నిస్: మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్: ఆకుల శ్రీజ వర్సెస్ జియాన్ జెంగ్ (సింగపూర్): రాత్రి 11:30 గంటలకు
మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్: మనిక బత్రా వర్సెస్ ప్రీతిక పవడే (ఫ్రాన్స్): మధ్య రాత్రి 12:30 గంటలకు
Comments
Please login to add a commentAdd a comment