
భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్‌పై బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రశంసలు కురిపించారు. తాజాగా పారిస్‌లో జరుగుతన్న ఒలింపిక్స్‌లో కాంస్యపతకం దక్కకపోవడంపై స్పందించారు. పురుషుల బ్యాడ్మింటన్‌లో సెమీఫైనల్ చేరుకున్న తొలి భారత షట్లర్‌గా రికార్డ్ సృష్టించాడని రణ్‌వీర్ కొనియాడారు. ప్రస్తుతం నీ వయస్సు 22 ఏళ్లేనని.. మరో రోజు నువ్వు పోరాడాలంటూ మద్దతుగా నిలిచారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు.
నువ్వు ఓడిపోయినప్పటికీ నీ ప్రయత్నం గొప్పదని రణ్‌వీర్ సింగ్ ప్రశంసలతో ముంచెత్తారు. ఒలింపిక్స్‌లో నీ చురుకుదనం, ప్రదర్శన, ఏకాగ్రత అద్భుతంగా ఉందన్నారు. నిన్ను చూసి గర్వపడుతున్నానని.. నువ్వు ఒక స్టార్.. నీ కెరీర్ ఇప్పుడే ప్రారంభమైందని పోస్ట్‌లో రాసుకొచ్చారు. భవిష్యత్తులో రాబోయే యువతకు నువ్వు ఒక ఆదర్శమని రణ్‌వీర్ సింగ్ మద్దతుగా నిలిచారు. కాగా.. ఒలింపిక్స్‌లో జరిగిన కాంస్య పతక పోరులో మలేషియా ప్లేయర్ చేతిలో ఓటమి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment