మా ప్రార్థనలకు సమాధానం దువా | Deepika Padukone and Ranveer Singh name their daughter Dua | Sakshi
Sakshi News home page

మా ప్రార్థనలకు సమాధానం దువా

Published Sun, Nov 3 2024 3:38 AM | Last Updated on Sun, Nov 3 2024 3:38 AM

Deepika Padukone and Ranveer Singh name their daughter Dua

బాలీవుడ్‌లోని వన్నాఫ్‌ ది క్రేజీ కపుల్స్‌ రణ్‌వీర్‌ సింగ్‌ – దీపికా పదుకోన్‌ తమ కుమార్తెకు దువా పదుకోన్‌ సింగ్‌ అని నామకరణం చేశారు. ఆ పేరును ఖరారు చేసినట్లుగా వెల్లడించి, దువా కాళ్లు మాత్రమే కనిపించేలా రణ్‌వీర్‌–దీపికలు ఓ ఫొటోను షేర్‌ చేశారు.

‘‘మా కుమార్తెకు దువా పదుకోన్‌ సింగ్‌ అనే పేరు పెట్టాం. దువా అంటే ప్రార్థన. మా ప్రార్థనలకు దువా సమాధానం. అందుకే మా కుమార్తెకు ఆ పేరు పెట్టాం’’ అని పేర్కొన్నారు రణ్‌వీర్‌–దీపిక. 2018లో రణ్‌వీర్‌ సింగ్‌–దీపికా పదుకోన్‌ వివాహం చేసుకున్నారు. 2023 సెప్టెంబరులో దీపిక ఓ పాపకు జన్మనిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement