Daughter Name
-
మా ప్రార్థనలకు సమాధానం దువా
బాలీవుడ్‌లోని వన్నాఫ్ ది క్రేజీ కపుల్స్ రణ్వీర్ సింగ్ – దీపికా పదుకోన్ తమ కుమార్తెకు దువా పదుకోన్ సింగ్ అని నామకరణం చేశారు. ఆ పేరును ఖరారు చేసినట్లుగా వెల్లడించి, దువా కాళ్లు మాత్రమే కనిపించేలా రణ్వీర్–దీపికలు ఓ ఫొటోను షేర్ చేశారు.‘‘మా కుమార్తెకు దువా పదుకోన్ సింగ్ అనే పేరు పెట్టాం. దువా అంటే ప్రార్థన. మా ప్రార్థనలకు దువా సమాధానం. అందుకే మా కుమార్తెకు ఆ పేరు పెట్టాం’’ అని పేర్కొన్నారు రణ్వీర్–దీపిక. 2018లో రణ్వీర్ సింగ్–దీపికా పదుకోన్ వివాహం చేసుకున్నారు. 2023 సెప్టెంబరులో దీపిక ఓ పాపకు జన్మనిచ్చారు. -
అంత పెద్ద పేరా.. కుదరదు
మాడ్రిడ్: స్పెయిన్‌లోని ఓ రాచకుటుంబానికి చెందిన రాకుమారుడు తన కుమార్తెకు ఏకంగా 157 అక్షరాలతో సుదీర్ఘంగా ఉండే వెరైటీ పేరు పెట్టారు. స్పెయిన్‌లోని ఆల్బా రాజ్య వారసుడు, 17వ హ్యూస్కర్ డ్యూక్ ఫెర్నాండో ఫిట్జ్–జేమ్స్ స్టువర్ట్, సోఫియా దంపతులకు ఇటీవల కూతురు జన్మించింది. ఫెర్నాండో ఆమెకు ప్రత్యేకంగా ఉండే ఏకంగా 25 పదాలు, 157 అక్షరాలతో కూడిన.. పొడవాటి పేరు పెట్టారు. అదేమిటంటే.. సోఫియా ఫెర్నాండా డొలొరెస్ కయెటనా టెరెసా ఏంజెలా డీ లా క్రుజ్ మికేలా డెల్ శాంటిసిమో సక్రామెంటో డెల్ పర్పెటువో సొకొర్రో డీ లా శాంటిసిమా ట్రినిడాడ్ వై డీ టొడొస్ లాస్ సాంటోస్’. ఇంతవరకు బాగానే ఉన్నా, ఈ పేరును అధికారికంగా రిజిస్టర్ చేసేందుకు స్పెయిన్ అధికారులు మాత్రం అంగీకరించడంలేదు. నిబంధనలకు లోబడి చిన్నగా ఉండే పేరును కూతురికి పెట్టుకోవాలని, అప్పుడే రికార్డుల్లో నమోదు చేస్తామని రాకుమారుడికి అధికారులు సూచించారు. దీనిపై రాకుమారుడు స్పందించాల్సి ఉంది. -
డిప్యూటీ సీఎం కుమార్తెకు ‘వైఎస్’ పేరు
సాక్షి, విజయనగరం: వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై తమకున్న అభిమానాన్ని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, వైఎస్సార్సీపీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు దంపతులు మరోసారి చాటుకున్నారు. ఆ దంపతులకు తొలి సంతానంగా జన్మించిన పాపకు వైఎస్ అక్షరాలతో పాటు సీఎం జగన్, ఆయన సతీమణి భారతి పేరు కలిసొచ్చేలా ‘యశ్విత శ్రీజగతి’ అని నామకరణం చేశారు. విజయనగరం జిల్లా చినమేరంగిలోని స్వగృహంలో శనివారం నిర్వహించిన నామకరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన, మంత్రి బొత్స తదితరులు హాజరయ్యారు. తమ కుమార్తెకు యశ్వితలో మొదటి అక్షరం వై, శ్రీలో మొదటి అక్షరం ఎస్ కలిపితే వైఎస్ అని, తమ నాయకుడు జగన్, ఆయన సతీమణి భారతి పేరు కలిపి జగతి అని నామకరణం చేశామని పుష్పశ్రీవాణి దంపతులు వివరించారు. -
ఉసేన్ బోల్ట్ కూతురి పేరు తెలుసా!
కింగ్స్టన్: జమైకా దిగ్గజ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ఇటీవల తండ్రైన విషయం తెలిసిందే. బోల్ట్ భాగస్వామి కాసీ బెన్నెట్ జూన్ 14న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇప్పటి వరకు తన కూతురు ఫొటో కానీ, పేరును కానీ ప్రకటించకపోవడం గమనార్హం. బుధవారం తన భార్య కాసీ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో కూతురు ఫొటోను షేర్ చేసి పేరును ప్రకటించాడు. ‘నా ప్రియురాలు కాసీకి పుట్టిన రోజు శుభకాంక్షలు. ఈ ప్రత్యేక రోజున నీతో ఆనందంగా గడపాలని కోరుకుంటున్న. నేను మీ ఆనందాన్ని తప్పా మరేది కోరుకోను. నిన్ను ఎప్పుడు సంతోషంగా, చిరునవ్వుతో ఉంచడం నా బాధ్యత. మేము మా కూతురు ‘ఒలింపియా లైట్నింగ్’తో కొత్త జీవితాన్ని ప్రారంభిచాం’ అంటూ బోల్ట్ తన కూతురి పేరును ప్రకటించాడు. (చదవండి: బోల్ట్ తండ్రయ్యాడు) I want to wish my gf @kasi__b a happy birthday. I get to spend ur special day with u. I want nothing but happiness for u & will continue to doing my best keeping a smile on ur face. We have started a new chapter together with our daughter Olympia Lightning Bolt ⚡️🎉🎊💫 pic.twitter.com/FhlwdaF2Zx — Usain St. Leo Bolt (@usainbolt) July 7, 2020 ఉసేన్ తండ్రైన విషయం వాస్తవమే అంటూ జమైకా ప్రధాన మంత్రి ఆండ్రూ హోల్నెస్ సామాజిక మాధ్యమం ద్వారా స్ఫష్టం చేస్తూ బోల్డ్ దంపతులకు శుభకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. గత మార్చిలోనే బోల్ట్... తమకు ఆడబిడ్డ పుట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో తెలిపాడు. దాదాపు దశాబ్దంపాటు పురుషుల స్ప్రింట్‌లో తన హవాను చాటిన బోల్ట్ 2017లో రిటైర్ అయ్యాడు. 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు నెలకొల్పిన బోల్ట్... 2008, 2012, 2016 ఒలింపిక్స్ క్రీడల్లో 100, 200 మీటర్లలో పసిడి పతకాలు గెల్చి ఈ ఘనత సాధించిన ఏకైక స్ప్రింటర్‌గా చరిత్ర సృష్టించాడు. -
కుమార్తె ‘పేరు’ కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన వైనం
హైదరాబాద్, న్యూస్‌లైన్: తమ కుమార్తెకు పేరు పెట్టే విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన వివాదం చివరికి పోలీసు స్టేషన్‌కు చేరింది. నగరంలోని యూసుఫ్‌గూడ బస్తీలో దీపక్ అనే ప్రైవేటు ఉద్యోగి ఏడాదిన్నర క్రితం సాజిదా అనే ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి రెండు నెలల క్రితం పాప జన్మించింది. దీపక్ తన కుమార్తెకు లాస్య అని పేరు పెట్టాలని వాదిస్తే.. సాజిదా లీనా అని పెట్టాలని పట్టుపట్టారు. ఇదిలా ఉండగా.. గురువారం ఉదయం దీపక్ తన కుమార్తెను తీసుకుని దగ్గర్లోని సాయిబాబా ఆలయానికి వెళ్లి.. లాస్య అని నామకరణం చేయించి, ఇంటికి తీసుకొచ్చారు. దీంతో తనకు తెలియకుండా పేరు ఎందుకు పెట్టావంటూ సాజిదా గొడవకు దిగారు. కోపం పట్టలేక దీపక్ భార్యపై చేయి చేసుకున్నారు. దీంతో ఆమె బట్టలు సర్దుకుని.. సామాన్లతో సహా ఆటోలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు దిగారు. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు. ఇంత చిన్న ఘటనకే భర్తను వదిలి, సామాన్లతో సహా పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సాజిదాను చూసి ఆశ్చర్య పోయిన పోలీసులు. భర్తను పిలిపించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి.. సర్దిచెప్పి పంపించారు.