ఉసేన్‌ బోల్ట్ కూతురి పేరు తెలుసా! | Usain Bolt Reveals His Daughter Photos And Name On His Wife Birthday | Sakshi
Sakshi News home page

కూతురి పేరును ప్రకటించిన ఉసేన్‌ బోల్ట్

Published Wed, Jul 8 2020 5:04 PM | Last Updated on Wed, Jul 8 2020 7:54 PM

Usain Bolt Reveals His Daughter Photos And Name On His Wife Birthday - Sakshi

కింగ్‌స్టన్‌: జమైకా దిగ్గజ స్ప్రింటర్‌ ఉసేన్‌ బోల్ట్‌ ఇటీవల తండ్రైన విషయం తెలిసిందే. బోల్ట్‌ భాగస్వామి కాసీ బెన్నెట్‌ జూన్‌ 14న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇప్పటి వరకు తన కూతురు ఫొటో కానీ, పేరును కానీ ప్రకటించకపోవడం గమనార్హం. బుధవారం తన భార్య కాసీ పుట్టిన రోజు సందర్భంగా సోషల్‌ మీడియాలో కూతురు ఫొటోను షేర్‌ చేసి పేరును ప్రకటించాడు. ‘నా ప్రియురాలు కాసీకి పుట్టిన రోజు శుభకాంక్షలు. ఈ ప్రత్యేక రోజున నీతో ఆనందంగా గడపాలని కోరుకుంటున్న. నేను మీ ఆనందాన్ని తప్పా మరేది కోరుకోను. నిన్ను ఎప్పుడు సంతోషంగా, చిరునవ్వుతో ఉంచడం నా బాధ్యత. మేము మా కూతురు ‘ఒలింపియా లైట్నింగ్’‌తో కొత్త జీవితాన్ని ప్రారంభిచాం’ అంటూ బోల్ట్‌ తన కూతురి పేరును ప్రకటించాడు. (చదవండి: బోల్ట్‌ తండ్రయ్యాడు)

ఉసేన్‌ తండ్రైన విషయం వాస్తవమే అంటూ జమైకా ప్రధాన మంత్రి ఆండ్రూ హోల్నెస్‌ సామాజిక మాధ్యమం ద్వారా స్ఫష్టం చేస్తూ బోల్డ్‌ దంపతులకు శుభకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే.  గత మార్చిలోనే బోల్ట్‌... తమకు ఆడబిడ్డ పుట్టబోతున్నట్లు సోషల్‌ మీడియాలో తెలిపాడు. దాదాపు దశాబ్దంపాటు పురుషుల స్ప్రింట్‌లో తన హవాను చాటిన బోల్ట్‌ 2017లో రిటైర్‌ అయ్యాడు. 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు నెలకొల్పిన బోల్ట్‌... 2008, 2012, 2016 ఒలింపిక్స్‌ క్రీడల్లో 100, 200 మీటర్లలో పసిడి పతకాలు గెల్చి ఈ ఘనత సాధించిన ఏకైక స్ప్రింటర్‌గా చరిత్ర సృష్టించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement