ముంబై : 2019, ఆగస్టు నెలలో భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌తో ట్విటర్ వేదికగా చోటుచేసుకున్న వివాదాన్ని ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ గుర్తు చేసుకున్నాడు. శుక్రవారం ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. గతంలో ట్విటర్‌లో జరిగిన ఆ చిన్న వివాదం వల్ల తమ మధ్య దూరం పెరగలేదని అన్నాడు. ప్రస్తుతం హర్భజన్‌తో సఖ్యతగానే ఉంటున్నానని స్పష్టం చేశాడు. ఆ రోజు జరిగిన గొడవలో భజ్జీనే పై చేయి సాధించాడని, అతడి మాటలకు సమాధానం చెప్పలేకపోయానని పేర్కొన్నాడు. (రిటైర్‌మెంట్ ప్రకటించిన స్టార్ బౌలర్)
గతంలో హర్భజన్ బౌలింగ్ గురించి గిల్‌క్రిస్ట్ మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్‌లో నేను ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన బౌలర్ భజ్జీనే’’నని అన్నాడు. కాగా, 2001లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన రెండో టెస్టులో హర్భజన్ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. వీటిలో గిల్‌క్రిస్ట్ వికెట్ కూడా ఉంది. భజ్జీ తన వికెట్ తీయటంపై గిల్‌క్రిస్ట్ వ్యంగ్యంగా స్పందించటంతో వివాదం మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment