Harbhajan Singh
-
‘ధోనితో నాకు మాటల్లేవు.. పదేళ్లకు పైగానే అయింది.. అయినా అలాంటి వాళ్లకు’
‘‘లేదు.. నేను ధోనితో మాట్లాడటం లేదు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడినపుడు.. అప్పుడప్పుడు ఆట గురించి మాట్లాడుకునేవాళ్లం. అయితే, ధోనితో మనసు విప్పి మాట్లాడి పదేళ్లకు పైగానే అయింది. ఇందుకు నా దగ్గర ప్రత్యేక కారణమంటూ ఏదీ లేదు.ఎప్పుడూ నా గదికి వచ్చేవాడు కాదుబహుశా ధోని దగ్గర రీజన్ ఉండవచ్చు. అయితే, ఆ కారణం ఏమిటో నాకు మాత్రం తెలియదు. సీఎస్కేతో ఉన్నపుడు కూడా మైదానంలో మాత్రం అప్పుడప్పుడు మాట్లాడేవాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత అతడు ఎప్పుడూ నా గదికి వచ్చేవాడు కాదు. నేను కూడా అతడి గదికి వెళ్లేవాడిని కాదు.ధోని పట్ల నాకెలాంటి వ్యతిరేక భావం లేదు. కానీ అతడికి నా మీద ఏదైనా కోపం ఉందేమో! ఒకవేళ అదే నిజమైతే అతడు ఆ విషయం గురించి నాతో మాట్లాడవచ్చు. నేనెప్పుడూ అతడికి కనీసం కాల్ కూడా చేయలేదు. ఎందుకంటే.. నేను ఫోన్ చేసినపుడు లిఫ్ట్ చేసి మాట్లాడితేనే మరోసారి ఫోన్ చేయాలనిపిస్తుంది.అలాంటి వాళ్లతో నేనెందుకు మాట్లాడాలి?లేదంటే.. అటువంటి వాళ్లను నేను అస్సలు పట్టించుకోను. ఎందుకంటే బంధం అనేది రెండువైపులా ఉండాలి. మనం ఎదుటివారికి గౌరవం ఇస్తేనే.. మనకు కూడా గౌరవం దక్కుతుంది. నేను రెండుసార్లు ఫోన్ చేసినా.. అటువైపు నుంచి స్పందన లేకపోతే.. నేనెందుకు అలాంటి వ్యక్తితో మాట్లాడతా!’’ అంటూ టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మూడు ఐసీసీ టైటిళ్లు గెలిచిన మహేంద్ర సింగ్ ధోనితో తన అనుబంధం గురించి మాట్లాడుతూ ఈ మేర వ్యాఖ్యలు చేశాడు. తామిద్దరి మధ్య మాటలులేక దశాబ్దకాలం గడిచిందన్నాడు భజ్జీ. తాను మాట్లాడేందుకు ప్రయత్నించినా ధోని నుంచి స్పందన లేకపోవడంతో తాను కూడా అతడికి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నట్లు భజ్జీ తెలిపాడు.అదంతా నిజమేకాగా ధోని- భజ్జీ మధ్య విభేదాలున్నాయంటూ గతంలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా క్రికెట్నెక్స్ట్తో మాట్లాడిన హర్భజన్ సింగ్ అదంతా నిజమేనని ధ్రువీకరించాడు. కాగా 2007లో ధోని సారథ్యంలో టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో.. అదే విధంగా.. ధోని కెప్టెన్సీలోనే 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన టీమిండియాలోనూ హర్భజన్ సింగ్ సభ్యుడు. అంతేకాదు.. 2018 నుంచి 2020 వరకు ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున భజ్జీ ఆడటం గమనార్హం. అయితే, వీరిద్దరి బంధం బీటలు వారడానికి గల కారణంపై మాత్రం స్పష్టత లేదు. చదవండి: Asia Cup 2024: టీమిండియా ఓపెనర్ల ఊచకోత.. సెమీ ఫైనల్లో భారత్ -
‘గిల్‌ను బెంచ్‌కే పరిమితం చేయండి.. అతడికి మరొక్క ఛాన్స్ ఇవ్వాలి’
టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్టార్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌ను మరికొన్నాళ్లపాటు బెంచ్‌కే పరిమితం చేయాలని భారత జట్టు యాజమాన్యానికి సూచించాడు. యువ ఆటగాడు ధ్రువ్ జురెల్‌కు మరొక్క అవకాశం ఇవ్వాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు.గాయం వల్ల జట్టుకు దూరంకాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో పెర్త్‌లో జరిగిన తొలి మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల దూరంగా ఉండగా.. టెస్టుల్లో వన్‌డౌన్‌లో ఆడుతున్న గిల్ గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు.రిషభ్ పంత్ ఉన్నప్పటికీఈ నేపథ్యంలో రోహిత్ గైర్హాజరీలో యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ భారత ఇన్నింగ్స్ ఆరంభించాడు. మరోవైపు.. గిల్ లేకపోవడంతో.. రిషభ్ పంత్ ఉన్నప్పటికీ మరో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌కు తుదిజట్టులో చోటు దక్కింది. అయితే, రెండో టెస్టుకు రోహిత్ శర్మ, గిల్ అందుబాటులోకి రావడంతో ఎవరిపై వేటు పడుతుందనే చర్చ నడుస్తోంది.ఈ నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇండియా టుడేతో మాట్లాడాడు. ‘‘కేఎల్ రాహుల్- యశస్వి జైస్వాల్‌లను ఓపెనింగ్ జోడీగా కొనసాగించాలి. కెప్టెన్ రోహిత్ శర్మ కోసం శుబ్‌మన్ గిల్ తన మూడోస్థానాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇక విరాట్ కోహ్లి నాలుగో స్థానంలో రాగా.. మిగతా స్థానాల్లో యథావిధిగా అందరూ కొనసాగాలి.గిల్‌ను బెంచ్‌కే పరిమితం చేయండి.. అతడికి మరొక్క ఛాన్స్ ఇవ్వాలిగిల్ మరికొన్నాళ్లు వేచి చూడాలి. నిజానికి జురెల్‌కు తొలి టెస్టులో అవకాశం ఇచ్చారు. కానీ అతడు పరుగులేమీ రాబట్టలేకపోయాడు. కాబట్టి అతడిని బెంచ్‌కే పరిమితం చేసే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ.. గిల్‌ను ఓపెనింగ్ నుంచి ఐదో స్థానం వరకు ఎక్కడా ఆడించలేము కదా!ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురవడం మంచిదే. బెంచ్ ఎంత పటిష్టంగా ఉందో తెలియజేస్తుంది. మేనేజ్మెంట్ గిల్ వైపు మొగ్గు చూపి జురెల్‌ను తప్పించవచ్చు. అయితే, నా అభిప్రాయం ప్రకారం జురెల్‌కు మరొక్క అవకాశం ఇవ్వాలి’’ అని భజ్జీ పేర్కొన్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో గిల్ ఫిఫ్టీకాగా ఆసీస్-‘ఎ’ జట్టుతో రాణించిన జురెల్.. తొలి టెస్టులో మాత్రం నిరాశపరిచారడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 11, 1 పరుగులు చేశాడు. మరోవైపు.. ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో పింక్ బాల్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో గిల్ ఫిఫ్టీ(రిటైర్డ్ హర్ట్) సాధించాడు.ఇక భారత్- ఆసీస్ మధ్య అడిలైడ్ వేదికగా డిసెంబరు 6 నుంచి రెండో టెస్టు జరుగనుంది. దీనిని పింక్ బాల్‌తో నిర్వహించనున్నారు. ఇక పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో టీమిండియా అదరగొట్టింది. ఆస్ట్రేలియాను ఏకంగా 295 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. చదవండి: ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్ బుమ్రా.. నా మనుమలకూ చెబుతా: సన్‌రైజర్స్ విధ్వంసకర వీరుడు -
అశ్విన్ అద్భుత స్పిన్నరే కానీ...
ముంబై: సీనియర్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుత స్పిన్నరే అయినా... భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాషింగ్టన్ సుందర్‌ను సిద్ధం చేయాలని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. టెస్టు క్రికెట్లో 536 వికెట్లు పడగొట్టిన అశ్విన్... భారత్ నుంచి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే (619) తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ తొలి టెస్టులో అశ్విన్‌ను కాదని టీమ్ మేనేజ్మెంట్ సుందర్‌ను తుది జట్టులోకి ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో భజ్జీ మాట్లాడుతూ... ‘అశ్విన్ జాతీయ జట్టు తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అయితే ఇప్పుడతడి వయసు 38. అతడు ఆటకు వీడ్కోలు పలికే సమయానికి జట్టు సుందర్‌ను సిద్ధం చేసుకోవాలనుకుంటుండోచ్చు. అందుకే విదేశీ పిచ్‌లపై అనుభవజు్ఞడైన అశ్విన్ కంటే సుందర్‌కు అవకాశం ఇచ్చారు. పెర్త్‌లో ఆ్రస్టేలియాపై టీమిండియా విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. అక్కడ ఆసీస్ అజేయమైన జట్టుగా కనిపించేది. అలాంటి చోట చక్కటి ఆటతీరుతో భారత జట్టు కంగారూలను కట్టడి చేసింది. ఇదే జోరు కొనసాగిస్తూ టీమిండియా 4–1తో సిరీస్ కైవసం చేసుకుంటుందనుకుంటున్నా’అని అన్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరడం భారత్‌కు కొత్త కాదని... అయితే ఈసారి గెలవడం ముఖ్యమని భజ్జీ వ్యాఖ్యానించాడు. తొలి టెస్టులో రెగ్యులర్ కెపె్టన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకున్నా... జస్ప్రీత్ బుమ్రా జట్టును అద్భుతంగా నడిపించాడని హర్భజన్ కొనియాడాడు. కోహ్లిని చూసి లబుషేన్ నేర్చుకోవాలి: పాంటింగ్ ఫామ్‌లేమితో సతమతమవుతున్న ఆ్రస్టేలియా ఆటగాళ్లు మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్‌కు... మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కీలక సూచనలు చేశాడు. ఈ ఇద్దరూ భారత స్టార్ విరాట్ కోహ్లిని చూసి నేర్చుకోవాలన్నాడు. ‘పెర్త్ టెస్టులో లబుõÙన్ తీవ్రంగా తడబడ్డాడు. విభిన్నమైన వికెట్‌పై నాణ్యమైన బౌలింగ్‌ను ఎదుర్కోవడం ఎప్పుడూ కష్టమే. కానీ పరిస్థితులను మనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించడం ముఖ్యం. పెర్త్ రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి ఇదే చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయిన విరాట్ రెండో ఇన్నింగ్స్‌లో పరిస్థితులపై పైచేయి సాధించాడు. కోహ్లి తన బలాలపై దృష్టి పెడతాడు. లబుషేన్, స్మిత్ అదే చేయాలి. వారి సామర్థ్యాన్ని నమ్మాలి’అని పాంటింగ్ వ్యాఖ్యానించాడు. బుమ్రా వంటి బౌలర్‌ను ఎదుర్కొనేందుకు మెరుగైన ప్రణాళికలతో బరిలోకి దిగాలని... లేకుంటే ఫలితాలు అనుకూలంగా రావని పాంటింగ్ అన్నాడు.మరోవైపు ఆసీస్ మాజీ పేసర్ జాన్సన్ భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ నెల 6 నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టు నుంచి లబుషేన్‌ను తప్పించాలని అన్నాడు. గత కొన్నాళ్లుగా ఫామ్లోలేక ఇబ్బంది పడుతున్న లబుషేన్ దేశవాళీల్లో ఆడితే తిరిగి లయ అందిపుచ్చుకోవచ్చని సూచించాడు. -
శార్దూల్ ఎక్కడ?.. నితీశ్‌ను ఆడిస్తారా? అతడు కూడా గంగూలీలా..
ఆస్ట్రేలియతో టెస్టులకు ఎంపిక చేసిన భారత జట్టుపై టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ వంటి సీనియర్ పేస్ ఆల్రౌండర్లను ఈ సిరీస్‌లో ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించాడు. ఐదు టెస్టులుటీమిండియాకు ఎంతో కీలకమైన ఈ పర్యటనలో యువకుడైన నితీశ్ కుమార్ రెడ్డిపై భారం మోపడం సరైన నిర్ణయం కాదని భజ్జీ అభిప్రాయపడ్డాడు. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైన టీమిండియా.. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా అక్కడ ఐదు టెస్టులు ఆడనుంది. పెర్త్ వేదికగా శుక్రవారం నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20లలో మెరుపులు మెరిపిస్తున్న ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం చేయడం ఖాయమనే సంకేతాలు ఇచ్చాడు.నితీశ్ రెడ్డి ఆట చూడాల్సిందేనితీశ్ గురించి మోర్కెల్ ప్రస్తావిస్తూ.. ‘అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం నితీశ్ సొంతం. ఈ పర్యటనలో అతడి ఆట చూసేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఉన్నారు. నితీశ్ కుమార్ రెడ్డిలో ప్రతిభకు కొదవలేదు. అతడు ఆల్‌రౌండ్ సామర్థ్యం గల ఆటగాడు. అతడి బౌలింగ్‌లో పదును ఉంది.మనం ఊహించిన దానికంటే ఎక్కువ వేగంగా అతడి బంతి బ్యాట్‌ను తాకుతుంది. ఆస్ట్రేలియా పిచ్‌లపై అతడి బౌలింగ్ బాగా ఉపయోగపడుతుంది. స్వింగ్ బౌలింగ్‌కు అనుకూలమైన ఆసీస్ పిచ్‌లపై నితీశ్ మరింత ప్రమాదకారి కాగలడు. సరైన దిశలో వినియోగిస్తే అతడు ఉపయుక్త బౌలర్ అవుతాడు. ప్రతి బంతిని వికెట్ లక్ష్యంగా సంధించడం అతడి నైపుణ్యం.పేస్ ఆల్‌రౌండర్ స్థానాన్ని భర్తీ చేయడానికి నితీశ్‌కు ఇది చక్కటి అవకాశం. ప్రపంచంలోని ఏ జట్టయినా మంచి పేస్ ఆల్‌రౌండర్ ఉండాలని కోరుకుంటుంది. తమ పేసర్లకు మరింత విశ్రాంతి నివ్వగల ఆల్‌రౌండర్ లభిస్తే అంతకుమించి ఇంకేం కావాలి’ అని అన్నాడు.మరి శార్దూల్ ఠాకూర్ ఎక్కడికి వెళ్లాడు?ఈ నేపథ్యంలో మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘టీమిండియాకు ప్రస్తుతం హార్దిక్ పాండ్యా వంటి ఆల్‌రౌండర్ అవసరం ఉంది. కానీ.. అతడిని జట్టులోకి తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి.. నితీశ్ కుమార్ రెడ్డి రూపంలో ఆప్షన్ వెదుక్కున్నారు. మరి శార్దూల్ ఠాకూర్ ఎక్కడికి వెళ్లాడు?హార్దిక్ పాండ్యా ఏమయ్యాడు? వాళ్లిద్దరిని పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితం చేద్దామనుకుంటున్నారు కదా! గత రెండు, మూడేళ్లుగా శార్దూల్‌పై మీరు నమ్మకం ఉంచారు. అతడికి అవకాశాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏమైంది? అకస్మాత్తుగా నితీశ్‌ను బౌలింగ్ చేయమంటూ తెరమీదకు తీసుకువచ్చారు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.నితీశ్ కూడా గంగూలీలాఇక నితీశ్ రెడ్డికి ఇదొక సువర్ణావకాశమన్న భజ్జీ.. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాదిరి పేస్ దళానికి అదనపు బలంగా మారితే బాగుంటుందని సూచించాడు. పేసర్లకు విశ్రాంతినిచ్చేలా బౌలింగ్ చేయడంతో పాటు.. బ్యాటింగ్‌లోనూ సత్తా చాటితే ఉపయుక్తమని పేర్కొన్నాడు. ‘‘గంగూలీ మాదిరి.. కొన్ని ఓవర్లపాటు బౌలింగ్ చేసి.. నితీశ్ 1-2 వికెట్లు తీస్తే.. జట్టుకు అది ఒకరంగా బోనస్‌లా మారుతుంది’’ అని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు.టెస్టు అరంగేట్రం చేయడం ఖాయంకాగా ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి... టీ20ల్లో మెరుపుల ద్వారా టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్న నితీశ్ కుమార్ రెడ్డి... ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌లో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమైంది. షమీ వంటి సీనియర్ పేసర్ లేకపోవడంతో అతడి స్థానంలో సీమ్, బౌన్స్‌ను వినియోగించుకోగలగడంతో పాటు లోయర్ ఆర్డర్లో ధాటిగా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్నా నితీశ్‌ను తుది జట్టులోకి ఎంపిక చేసే చాన్స్ ఉంది. ఇదిలా ఉంటే.. టీమిండియా దిగ్గజ బ్యాటర్ గంగూలీ రైటార్మ్ మీడియం పేసర్ కూడా! తన కెరీర్లో గంగూలీ టెస్టుల్లో 32, వన్డేల్లో 100 వికెట్లు తీశాడు. ఇక హార్దిక్ ఫిట్నెస్ లేమి వల్ల కేవలం వన్డే, టీ20లకు పరిమితం కాగా.. శార్దూల్ ఇటీవలే గాయం నుంచి కోలుకుని రంజీల్లో ముంబై తరఫున ఆడుతున్నాడు.చదవండి: ICC: వరల్డ్ నంబర్ వన్‌గా హార్దిక్ పాండ్యా.. దూసుకువచ్చిన తిలక్ వర్మ.. ఏకంగా.. -
రంజీలు ఆడేవాళ్లు పనికిరారా?.. సెలక్టర్లపై హర్భజన్ సింగ్ ఫైర్!
టీమిండియా సెలక్టర్ల తీరును భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ విమర్శించాడు. రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రదర్శనల ఆధారంగానే జాతీయ జట్టును ఎంపిక చేస్తే ఆటగాళ్లు ఇకపై రంజీలు ఆడాల్సిన అవసరం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.మొట్టమొదటి క్రికెటర్‌గా ఆల్‌టైమ్ రికార్డుకాగా మధ్యప్రదేశ్‌కు చెందిన ఆల్‌రౌండర్ జలజ్ సక్సేనా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో పరుగుల వరద పారించడంతో పాటు వికెట్లు తీయడంలోనూ సత్తా చాటుతున్నాడు. ఇటీవలే అతడు రంజీ ట్రోఫీలో 6000 పరుగులు పూర్తి చేసుకోవడంతో పాటు 400 వికెట్ల మార్కు దాటాడు. తద్వారా రంజీ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి క్రికెటర్‌గా ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాడు.అయితే, 37 ఏళ్ల సక్సేనా ఇంత వరకు ఒక్కసారి కూడా టీమిండియాకు ఆడలేకపోయాడు. 2005లో సొంతరాష్ట్రం మధ్యప్రదేశ్ తరఫు ఫస్ట్‌క్లాస్ కెరీర్ ఆరంభించిన జలజ్.. పదకొండేళ్ల పాటు అదే జట్టుతో కొనసాగాడు. 2016-17 సీజన్ నుంచి కేరళకు ప్రాతినిథ్యం వహిస్తున్న జలజ్ సక్సేనా ఇటీవల ఉత్తరప్రదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు.ఇంకేం చేస్తే అతడి పేరును సెలక్టర్లు పరిశీలిస్తారు?ఈ నేపథ్యంలో ఓ జర్నలిస్టు సోషల్ మీడియా వేదికగా జలజ్ సక్సేనా ఘనతను ప్రస్తావిస్తూ.. ‘‘రంజీ ట్రోఫీలో 400 వికెట్లు, 6000 పరుగులు. భారత్‌లోని జాతీయ టోర్నమెంట్లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి వ్యక్తి. అయినప్పటికీ ఇతడికి టీమిండియా తరఫున ఆడే అవకాశం లేదు.అతడొక చాంపియన్. నిలకడగా ఆడుతున్న ప్లేయర్. ఇంతకంటే.. ఇంకేం చేస్తే అతడి పేరును సెలక్టర్లు పరిశీలిస్తారు?’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సదరు జర్నలిస్టు పోస్టుకు భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ స్పందించాడు.రంజీలు ఆడేవాళ్లు పనికిరారా?‘‘మీ మాటలతో నేను ఏకీభవిస్తున్నాను. కనీసం ఇండియా-‘ఎ’ జట్టుకైనా అతడిని ఎంపిక చేయాల్సింది. ప్రస్తుత కాలంలో రంజీ ఆడటం పనికిరాని విషయంగా మారిపోయిందా?.. ఐపీఎల్ నుంచే ఆటగాళ్లను సెలక్ట్ చేస్తున్నారు’’ అంటూ భజ్జీ టీమిండియా సెలక్టర్ల తీరును ఘాటుగా విమర్శించాడు.కాగా టీమిండియా ఇటీవల స్వదేశంలో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. తద్వారా సొంతగడ్డపై ఇలా మూడు మ్యాచ్‌ల టెస్టుల్లో క్లీన్‌స్వీప్ అయిన తొలి భారత జట్టుగా రోహిత్ సేన నిలిచింది. ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్-‘ఎ’ జట్టు సైతం రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్ దిశగా పయనిస్తోంది. చదవండి: Ind A vs Aus A: ఆసీస్ బౌలర్ల విజృంభణ.. భారత బ్యాటింగ్ ఆర్డర్ కుదేలు -
హర్భజన్ సింగ్,ఓవియా కొత్త సినిమా ప్రకటన.. పోస్టర్ చూశారా..?
భారత క్రికెట్ జట్టు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, నటి ఓవియా నటించిన తమిళ చిత్రం 'సేవియర్' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. వెండితెరపై హర్భజన్ మరోసారి కనిపించనున్నడంతో ఆయన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం విడుదలైన పోస్టర్స్‌ను నెటిజన్లు షేర్ చేస్తున్నారు.ఈ చిత్రంలో నటి ఓవియా క్రికెటర్ హర్భజన్ సింగ్‌కు జోడీగా నటిస్తోంది. వీటీవీ గణేష్, జీబీ ముత్తు తదితరులు నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు జాన్ పాల్ రాజ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సెంటోవా స్టూడియో నిర్మిస్తుంది. తాజాగా చిత్రబృందం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో తల్లి వర్ణ పాత్రలో నటి ఓవియా, డాక్టర్ జేమ్స్ మల్హోత్రాగా హర్భజన్ సింగ్ కనిపిస్తున్నారు. ఈ క్రమంలో జిబి ముత్తు, గణేశన్ పాత్రలను కూడా దర్శకుడు రివీల్ చేశాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ చిత్రం పిల్లి-ఎలుక గేమ్‌ల సాగనుందని ప్రచారం జరుగుతుంది. ఒక రాత్రిలో జరిగే 12 హత్యల చుట్టూ సేవియర్ కథ తిరుగుతుందని తెలుస్తోంది. ఫ్రెండ్షిప్ సినిమా తర్వాత హర్భజన్, జాన్ పాల్ రాజ్‌ల కలయికలో ఇది రెండవ సినిమా కావడం విశేషం.తాజాగా నటి ఓవియా పర్సనల్ వీడియో అంటూ ఒకటి నెట్టింట వైరల్ అయింది. బిగ్‌బాస్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఓవియా కొంత కాలం వరకు భారీగానే సినిమా ఛాన్సులతో బిజీగానే ఉండేది. ఆ తర్వాత పలు వివాదాల వల్ల అవకాశాలు తగ్గాయి. గత కొన్నాళ్లుగా సినిమా ఛాన్సులు లేకుండా ఉన్న ఓవియా ఇప్పుడు సేవియర్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Harbhajan Turbanator Singh (@harbhajan3) -
‘ఆమె’ మగాడే.. సంచలన విషయాలు వెలుగులోకి!.. భజ్జీ రియాక్షన్
ఇమానే ఖలీఫ్(Imane Khelif).. ప్యారిస్ ఒలింపిక్స్-2024 సందర్భంగా ఈ అల్జీరియా బాక్సర్ పేరు చర్చనీయాంశమైంది. తాజాగా తను మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఆమె.. ఆమె కాదు.. మగాడే.. అనే ఆధారాలు ఉన్నాయంటూ జాఫర్ ఐత్ ఔడియా అనే ఫ్రెంచి జర్నలిస్టు ఇమానే గురించి సంచలన విషయాలు బయటపెట్టారు.కౌమార దశలో తాను సంపాదించిన డాక్యుమెంట్లలో ఇమానే 5- ఆల్ఫా రెడక్టేస్ డెఫిషియెన్సీతో బాధపడుతోందని వెల్లడైందని పేర్కొన్నారు. అంతేకాదు... ఈ రిపోర్టులో ఇమానే హార్మోన్ థెరపీ చేయించుకుంటే లింగ నిర్ధారణ సులువవుతుందనే సిఫారసు ఉందని.. తన జెండర్ గుర్తింపునకు ఇది దోహదం చేస్తుందనే వివరాలూ ఉన్నాయన్నారు. కాగా 5- ఆల్ఫా రెడక్టేస్ డెఫిషియెన్సీ అనేది ఓ అరుదైన డిజార్డర్.ఒక వ్యక్తిలో పురుష అవయవాల్లో సరైన ఎదుగుదల లేకపోవడం వల్ల.. పుట్టుకతో బయోలాజికల్‌గా మహిళగా కనిపిస్తారు. అయితే, కౌమార దశలో మాత్రం పురుష అవయవాలు అభివృద్ది చెందుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.అప్పుడు నిషేధంఇదిలా ఉంటే.. 2023లో ఇమానే ఖలీప్ జెండర్‌కు సంబంధించిన కథనం వెలుగులోకి వచ్చింది. ఆమెకు గర్భసంచి లేదని, పురుషులలో ఉండే XY క్రోమోజోమ్‌లు ఉన్నాయని.. ఫలితంగా ఇమానే బయోలాజికల్ మ్యాన్ అనే వార్తలు బయటకువచ్చాయి. ఈ క్రమంలో.. గత ఏడాది ఢిల్లీలో జరిగిన బాక్సింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పరీక్షల తర్వాత.. మహిళల విభాగంలో పాల్గొనకుండా ఆమెపై నిషేధం విధించారు.కానీ.. ప్యారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం నిర్వాహకులు వుమెన్ కేటగిరీలోని 66 కేజీల విభాగంలో పాల్గొనే అవకాశం ఇమానేకు ఇచ్చారు. ఆమె పాస్‌పోర్టులో మహిళ అని ఉందనే కారణంగా.. ఈ మేరకు అనుమతించారనే వార్తలు విమర్శలకు తావిచ్చాయి. 46 సెకన్ల వ్యవధిలోనేఅందుకు తగ్గట్లుగానే.. తన మొదటి బౌట్లో ఇటలీకి చెందిన ఏంజెలా కెరీనీతో తలపడ్డ ఇమానే.. తన పంచ్‌లతో ప్రత్యర్థిని బెంబేలెత్తించింది. ఇమానే పంచ్‌లను తట్టుకోలేక ఏంజెలా కేవలం 46 సెకన్ల వ్యవధిలోనే ఆట నుంచి వైదొలిగింది.ఇలాంటి బాక్సింగ్ తన జీవితంలో చూడలేదంటూ ఏంజెలా ఏడ్చేసింది. ఈ క్రమంలో ఖలీఫ్ పంచ్లలో ఒక మగాడి తరహాలో తీవ్రత ఉండటమే అందుకు కారణమని ఆరోపణలు వచ్చాయి. అయితే, నిర్వాహకులు మాత్రం ఇమానేను ఈవెంట్లో కొనసాగించారు.బంగారు పతకం గెలిచిఈ నేపథ్యంలో ప్రత్యర్థులపై బలమైన పంచ్‌లతో పంజా విసిరిన 25 ఏళ్ల ఇమానే ఖలీఫ్ ఫైనల్ చేరడమే గాక.. బంగారు పతకం గెలిచింది. కానీ ఇమానేను ప్రశంసించేవారి కంటే.. ఆమె జెండర్ ఐడెంటిని ప్రస్తావిస్తూ విమర్శించిన వారే ఎక్కువయ్యారు. తాజాగా ఫ్రెంచి జర్నలిస్టు బయటపెట్టిన విషయాలతో ఆమె మగాడేనని.. మహిళా బాక్సర్లపై పోటీ పడిన ఇమానే పతకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.పతకం వెనక్కి తీసుకోవాలిటీమిండియా దిగ్గజ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ కూడా ఈ జాబితాలో చేరాడు. ‘‘స్వర్ణ పతకాన్ని వెంటనే వెనక్కి తీసుకోండి. ఒలింపిక్స్ నిర్వాహకులు ఇలాంటివి ప్రోత్సహించడం సరికాదు’’ అని భజ్జీ ట్వీట్ చేశాడు. కాగా 1999 నుంచి మహిళా బాక్సర్లకు క్రోమోజోమ్ టెస్టులు నిర్వహించే బదులు.. వారి అధికారిక పత్రాలనే జెండర్ ప్రూఫ్‌లుగా అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం ఆమోదిస్తోంది. ఇమానే ఖలీఫ్ వివాదంతో ఈ విషయం మరోసారి చర్చకు వచ్చింది.చదవండి: భార్యతో విడాకులు.. ‘మిస్టరీ గర్ల్’తో శిఖర్ ధావన్! వీడియో వైరల్Take the Gold back @Olympics This isn’t fair https://t.co/ZO3yJmqdpY— Harbhajan Turbanator (@harbhajan_singh) November 5, 2024 -
ధోని కంటే రోహిత్ బెటర్ కెప్టెన్: భారత స్పిన్ దిగ్గజం
మహేంద్ర సింగ్ ధోని.. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్. అతడి సారథ్యంలో భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ-2013 గెలిచింది. ఇక ఫ్రాంఛైజీ క్రికెట్లోనూ ఈ జార్ఖండ్ డైనమైట్.. 2008లో మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆది నుంచి చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)కు ఆడుతున్నాడు. సారథిగా సీఎస్కేను ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్‌గా నిలిపాడు. మరోవైపు.. రోహిత శర్మ.. టీమిండియా ప్రస్తుత కెప్టెన్. ఇటీవలే టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీ గెలిచాడు. ఇక ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు సుదీర్ఘకాలం పాటు కెప్టెన్‌గా ఉండి.. ధోని కంటే ముందుగానే ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన సారథిగా చరిత్రకెక్కాడు.ధోని కంటే రోహిత్ బెటర్ కెప్టెన్‌కాగా టీమిండియాలో ఇద్దరితో కలిసి, ఐపీఎల్లో ఈ ఇద్దరి కెప్టెన్సీలోనూ ఆడాడు టీమిండియా దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. ఈ నేపథ్యంలో ఇద్దరి నాయకత్వ శైలిని పోలుస్తూ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని కంటే రోహిత్ బెటర్ కెప్టెన్ అని తన మనసులోని మాట బయటపెట్టాడు. అందుకు గల కారణాన్ని వెల్లడిస్తూ..ధోని ఎవరితో మాట్లాడడు‘‘ఇద్దరిలో ఎవరు బెటర్ అంటే.. నేను ధోనిని కాదని రోహిత్ వైపే మొగ్గుచూపుతాను. ఎందుంకటే రోహిత్ ప్లేయర్స్ కెప్టెన్. ప్రతి ఒక్క ఆటగాడి దగ్గరికి వెళ్లి వాళ్లకు ఏం కావాలో అడిగి తెలుసుకుంటాడు. సహచరులతో అతడికి మంచి అనుబంధం ఉంటుంది.అయితే, ధోని కెప్టెన్సీ స్టైల్ వేరుగా ఉంటుంది. అతడు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. తన మౌనం ద్వారానే ఎదుటివారికి తన మనసులోని మాట చేరాలని భావిస్తాడు. ఇతరులతో ధోని సంభాషించే విధానం ఇలాగే ఉంటుంది’’ అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. రోహిత్ శర్మకు స్నేహితులే తప్ప.. అతడికి విరుద్ధంగా మాట్లాడేవారు ఒక్కరూ ఉండరని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. స్పోర్ట్స్ యారీ ఇంటర్వ్యూలో భజ్జీ ఈ వ్యాఖ్యలు చేశాడు.చదవండి: Babar Azam: బాబర్ ఆజం సంచలన నిర్ణయం..Rohit Sharma is a better captain than MS Dhoni says Harbhajan Singh Full podcast at 9pm tonight, only on Sports Yaari YouTube Channel 🇮🇳pic.twitter.com/6tVAdJh6qx— Sushant Mehta (@SushantNMehta) October 2, 2024 -
అందుకు నువ్వే కారణమవుతావని కోహ్లితో చెప్పాను: భజ్జీ
ఆధునిక తరంలో అసాధారణ ప్రతిభతో ఉన్నత శిఖరాలకు చేరుకున్న అతికొద్ది మంది క్రికెటర్లలో విరాట్ కోహ్లి ముందు వరుసలో ఉంటాడు. అంతర్జాతీయ క్రికెట్లో సమకాలీన ఆటగాళ్లకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఎనభై శతకాలు సాధించిన ఘనత ఈ రన్‌మెషీన్ సొంతం. టీమిండియా దిగ్గజం, వంద సెంచరీల ధీరుడు సచిన్ టెండుల్కర్ రికార్డును సమం చేయగల సత్తా ఉన్న ఏకైక బ్యాటర్.అయితే, కెరీర్ ఆరంభంలో అసలు తను జట్టులో స్థానం సుస్థిరం చేసుకోగలనా? లేదా అన్న సందిగ్దంలో కొట్టుమిట్టాడట కోహ్లి. భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. నిరాశలో కూరుకుపోయిన కోహ్లికి తాను చెప్పిన మాటలను తాజాగా గుర్తుచేసుకున్నాడు.తీవ్ర నిరాశకు లోనయ్యాడు‘‘కోహ్లి గురించి చెప్పాలంటే.. ముఖ్యంగా టెస్టుల్లో అతడి ప్రయాణాన్ని ముందుగా తెలుసుకోవాలి. అప్పుడు మేము వెస్టిండీస్ పర్యటనలో ఉన్నాము. ఫిడెల్ ఎడ్వర్డ్స్ తన బౌలింగ్‌తో కోహ్లిని చాలా ఇబ్బంది పెట్టాడు. ప్రతిసారి అతడే తన వికెట్ తీసుకున్నాడు. దీంతో కోహ్లి సహజంగానే తీవ్ర నిరాశకు లోనయ్యాడు.ఆత్మన్యూనతభావంతో కుంగిపోయాడు. అప్పుడు తను నా దగ్గరికి వచ్చి.. ‘నేను బాగానే ఆడుతున్నానా?’ అని అడిగాడు. నేను వెంటనే అందుకు బదులిస్తూ.. ‘ఒకవేళ టెస్టు క్రికెట్లో గనుక నువ్వు 10 వేల పరుగులు చేయకపోతే.. అందుకు నిన్ను నువ్వే నిందించుకోవాల్సి వస్తుంది’ అని చెప్పాను. అది కేవలం నీ తప్పే అవుతుందని చెప్పాను‘నీకు ఆ సత్తా ఉంది. అయినప్పటికీ నువ్వు ఆ మైలురాయి చేరుకోలేకపోయావంటే అందుకు కేవలం నువ్వే కారణం అవుతావు అని గుర్తుపెట్టుకొమ్మని కోహ్లితో అన్నాను’’’ అంటూ భజ్జీ నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. ఆత్మవిశ్వాసంతో ఒక్కోమెట్టు ఎక్కుతూ కోహ్లి తారస్థాయికి చేరుకున్నాడని హర్షం వ్యక్తం చేశాడు.ప్రపంచ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గు ర్తింపుఇక ఫిట్నెస్, డైట్ విషయంలోనూ కోహ్లికి శ్రద్ధ ఎక్కువని.. అందుకే తను గుంపులో గోవిందలా కాకుండా ప్రపంచ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడని భజ్జీ తెలిపాడు. కోహ్లి చాలా మొండివాడని.. అనుకున్న పని పూర్తి చేసేంతవరకు పట్టువదలడని పేర్కొన్నాడు. భారత క్రికెట్‌పై కోహ్లి చెరగని ముద్ర వేశాడంటూ భజ్జీ ప్రశంసలు కురిపించాడు. తరువార్ కోహ్లి పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా 2011లో వెస్టిండీస్‌తో మ్యాచ్ ద్వారా కోహ్లి టెస్టుల్లో అడుగుపెట్టాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 19 పరుగులే చేసి నిరాశపరిచాడు. అయితే, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన కోహ్లి ప్రస్తుతం 8848 పరుగులతో కొనసాగుతున్నాడు. ఇందులో 29 సెంచరీలు ఉన్నాయి.చదవండి: Pak vs Ban: ఆలస్యమైతే అవుటే!.. భయంతో పాక్ క్రికెటర్ పరుగులు -
‘తీవ్ర మనోవేదనకు గురవుతున్నా’.. దీదీకి హర్భజన్ సింగ్ లేఖ
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతా ఆర్జీ కార్ ఆస్పత్రిలో జరిగిన ఉదంతంపై ప్రముఖ భారత మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ ఎంపీ హర్భజన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. రోజులు గడుస్తున్నా బాధితురాలి న్యాయం జరగకపోవడంపై మనోవేదనకు గురవుతున్నానంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి రెండు పేజీల లేఖ రాశారు. ఆర్జీకార్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై ఆగస్టు 9న దారుణం జరిగినా.. విచారణ మాత్రం కొలిక్కి రావడం లేదు. ఈ అంశంపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు, నిరసనలు కొనసాగుతున్నాయి. సీఎం,గవర్నర్‌కు లేఖఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ సీవీ ఆనంద బోస్‌కు లేఖ రాశారు. ఆ లేఖలో ‘మనందరి మనస్సాక్షిని కదిలించిన చెప్పలేని హింస. ఒక వ్యక్తిపై జరిగిన ఘోరమైన నేరం కాదు ఇది. మన సమాజంలోని ప్రతి మహిళ, గౌరవం, భద్రతపై జరిగిన తీవ్రమైన దాడి. ఇది లోతుగా పాతుకుపోయిన సమస్యలకు ప్రతిబింబం. సమాజంలో అధికారులు, వ్యవస్థాగత మార్పులు, చర్యల తక్షణ అవసరాన్ని ఈ దుర్ఘటన గుర్తు చేస్తుందని పేర్కొన్నారు.దిగ్భ్రాంతిని గురి చేసిందిఆస్పత్రిలో వైద్యం అందిస్తూ ప్రాణం పోసే వైద్యుల పట్ల జరిగిన దారుణం దిగ్భ్రాంతిని గురి చేసిందని దీదీ రాసిన రెండు పేజీల లేఖలో ఆప్ ఎంజీ రాసిన లేఖలో తెలిపారు. రోజులు గడుస్తున్నా కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే వైద్యులు, వైద్య సంఘాలు రోడ్లపై నిరసనకు దిగాయని అన్నారు. వారి (వైద్యుల) నిరసనల్ని సమాజం అర్ధం చేసుకుంది. న్యాయం కోసం వారు చేసే పోరాటానికి నేను మద్దతు ఇస్తున్నాను అని చెప్పారు. With deep anguish over delay in justice to the Kolkata rape and murder victim, the incident which had shaken the conscience of all of us, I have penned a heartfelt plea to the Hon'ble Chief Minister of West Bengal , Ms. @MamataOfficial Ji and Hon'ble @BengalGovernor urging them… pic.twitter.com/XU9SuYFhbY— Harbhajan Turbanator (@harbhajan_singh) August 18, 2024 ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుల్ని న్యాయస్థానం ముందుకు తీసుకురావడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, సీబీఐ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.టీవీల్లో సర్వసాధారణమయ్యాయిదేశంలో ఎక్కడో ఒకచోట ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, వార్తాపత్రికలు, టీవీల్లో సర్వసాధారణంగా మారాయని అన్న హర్భజన్ సింగ్..భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు సమగ్ర చర్యలు తీసుకోవాలని అని హర్భజన్ సింగ్ దీదీకి రాసిన లేఖలో డిమాండ్ చేశారు. -
పంజాబ్ జట్టుకు టీమిండియా క్రికెటర్ గుడ్‌బై
టీమిండియా వెటరన్ క్రికెటర్ మన్దీప్ సింగ్ కీలక ప్రకటన చేశాడు. పంజాబ్ జట్టుతో తన పద్నాలుగేళ్ల బంధం ముగిసిందని తెలిపాడు. ఇకపై తాను దేశవాళీ క్రికెట్లో త్రిపురకు ప్రాతినిథ్యం వహించనున్నట్లు వెల్లడించాడు. ఇన్నాళ్లు తనకు అండగా నిలిచిన టీమిండియా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు.పరుగుల వరదపంజాబ్లోని జలంధర్‌లో 1991లో జన్మించిన మన్దీప్ సింగ్‌కు చిన్ననాటి నుంచే క్రికెట్‌పై మక్కువ. ఈ క్రమంలో బ్యాటర్‌గా ఎదిగిన అతడు.. 2010 అండర్ 19 వరల్డ్‌కప్‌లో భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అదే ఏడాది.. పంజాబ్ తరఫున దేశవాళీ క్రికెట్లో అరంగేట్రం చేసిన మన్దీప్ సింగ్.. మూడు ఫార్మాట్లలో కలిపి 14 వేలకు పైగా పరుగులు సాధించాడు.ఇందులో 19 సెంచరీలు, 81 అర్ధ శతకాలు ఉండటం విశేషం. డొమెస్టిక్ క్రికెట్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న క్రమంలో 2016లో టీమిండియా సెలక్టర్ల పిలుపు అందుకున్న మన్దీప్ సింగ్.. జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. పంజాబ్‌కు టైటిల్ అందించిన కెప్టెన్టీమిండియా తరఫున మూడు టీ20 మ్యాచ్‌లు ఆడి 87 పరుగులు చేశాడు. అదే ఏడాది చివరిసారిగా భారత్‌కు ఆడిన ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. పంజాబ్ కెప్టెన్‌గానూ పనిచేశాడు. ఈ క్రమంలో దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2023లో పంజాబ్‌కు టైటిల్ అందించిన 32 ఏళ్ల మన్దీప్ సింగ్.. తన కెరీర్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నట్లు శనివారం ప్రకటించాడు. అందుకే జట్టును వీడుతున్నా కాగా పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌కు యువ ఆటగాళ్లకు పెద్దపీట వేయాలని భావిస్తోందని.. అందుకే జట్టుకు తన సేవలు ఇక అవసరం లేదని మన్దీప్ అన్నాడు. ఈ ఏడాది త్రిపుర జట్టుతో జతకట్టేందుకు సిద్దమైనట్లు తెలిపాడు. కాగా మరో పంజాబీ బ్యాటర్ జీవన్‌జ్యోత్ సింగ్ కూడా ఈసారి త్రిపురకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. -
Ind vs SL: సెంచరీలు చేసినా పట్టించుకోరా?
శ్రీలంకలో పర్యటించనున్న భారత క్రికెట్ జట్టు ఎంపిక తీరుపై మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను ఎందుకు పక్కన పెట్టారో అర్థం కావడం లేదని సెలక్టర్ల విధానాన్ని విమర్శించాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024లో చాంపియన్‌గా నిలిచిన తర్వాత టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీలో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1తో గెలిచింది.ఇక ఈ టూర్ ద్వారానే ఐపీఎల్ వీరులు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ వంటి వాళ్లు అరంగేట్రం చేశారు. తన రెండో అంతర్జాతీయ మ్యాచ్‌లోనే అభిషేక్ సెంచరీతో మెరవగా.. రియాన్ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.ఇదిలా ఉంటే.. జింబాబ్వే పర్యటన తర్వాత టీమిండియా శ్రీలంకతో ద్వైపాక్షిక సిరీస్‌కు సిద్ధమైంది. జూలై 27 నుంచి మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఇక ఈ సిరీస్ ద్వారానే టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.ఈ నేపథ్యంలో గురువారం టీ20, వన్డే జట్లను ప్రకటించారు. ఇందులో అనూహ్యంగా రియాన్ పరాగ్ రెండు జట్లలో చోటు దక్కించుకోగా.. అభిషేక్ శర్మకు మాత్రం స్థానం దక్కలేదు.సెంచరీలు చేసినా పట్టించుకోరా?అదే విధంగా.. సంజూ శాంసన్‌కు వన్డేల్లో చోటివ్వలేదు సెలక్టర్లు. అంతేకాదు మేటి స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ను కూడా పక్కనపెట్టేశారు.ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఎక్స్ వేదికగా స్పందించాడు. ‘‘శ్రీలంకతో సిరీస్‌లకు ఎంపిక చేసిన జట్టులో యుజీ చహల్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఎందుకు భాగం కాలేకపోయారో నాకైతే అర్థం కావడం లేదు’’ అంటూ షాకింగ్ ఎమోజీ జతచేశాడు భజ్జీ.కాగా సంజూ శాంసన్ జింబాబ్వేతో సిరీస్‌లో ఆడగా.. లంకతో టీ20 జట్టులో మాత్రమే చోటు లభించింది. ఇక వన్డేల విషయానికొస్తే చివరగా.. సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆడాడు.ఖేల్ ఖతమేనా?పర్ల్ వేదికగా గతేడాది డిసెంబరులో ఆడిన తన చివరి వన్డేలో సంజూ సెంచరీతో చెలరేగి టీమిండియాకు విజయం అందించాడు. అయినప్పటికీ ఈ కేరళ బ్యాటర్‌కు సెలక్టర్లు మొండిచేయి చూపడం గమనార్హం. దీనిని బట్టి అతడిని చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకి కూడా పరిగణనలోకి తీసుకోరని సంకేతాలు ఇచ్చినట్లే అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్‌పై విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ ఐసీసీ ఈవెంట్‌కు ముందు టీమిండియా లంక, ఇంగ్లండ్‌లతో వన్డే సిరీస్‌లు ఆడనుంది.చదవండి: Ind vs SL: టీమిండియా అసిస్టెంట్ కోచ్‌లుగా వాళ్లిద్దరు.. దిలీప్ రీఎంట్రీ! -
ఇంత చెత్తగా వ్యవహరిస్తారా? యువీ, భజ్జీపై విమర్శలు
భారత ‘దిగ్గజ’ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా తీరుపై పారాలింపిక్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లెజెండ్స్ నుంచి ఇలాంటి అమానుషమైన, చెత్త ప్రవర్తనను ఊహించలేదంటూ ఘాటుగా విమర్శించింది.క్రికెట్ సెలబ్రిటీలుగా సానుకూల దృక్పథాన్ని వ్యాప్తి చేయాల్సింది పోయి.. ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికింది. అనుచితంగా వ్యవహరించిన కారణంగా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ విజేతగా భారత్విషయం ఏమిటంటే.. ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్‌ను నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఇండియా చాంపియన్స్ జట్టుకు యువరాజ్ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరించగా.. హర్భజన్ సింగ్, రాబిన్ ఊతప్ప, సురేశ్ రైనా తదితరులు సభ్యులుగా ఉన్నారు.ఇక ఈ టీ20 టోర్నీలో భారత్- పాకిస్తాన్ చాంపియన్స్ ఫైనల్‌కు చేరగా.. యువీ సేన గెలుపొందింది. వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 అరంగేట్ర టైటిల్ కైవసం చేసుకుంది.ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకునే క్రమంలో యువీ, భజ్జీ, రైనా కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. ‘‘లెజెండ్స్ క్రికెట్లో పదిహేను రోజుల పాటు ఒళ్లు హూనమైంది. శరీరంలోని ప్రతీ అవయవం నొప్పితో విలవిల్లాడుతోంది’’ బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ పాట తౌబ.. తౌబకు తమ స్టెప్పులు ఇలాగే ఉంటాయంటూ కుంటుతూ నడుస్తున్నట్లుగా అభినయించారు.అనుచిత ప్రవర్తనఈ వీడియో వైరల్‌కాగా పారాలింపిక్ ఇండియా కమిటీ తీవ్రంగా స్పందించింది. ‘‘ఏమాత్రం సున్నితత్వం లేని అనుచిత ప్రవర్తన ఇది. క్రికెట్ స్టార్ సెలబ్రిటీలుగా సానుకూల దృక్పథంతో ముందుకు సాగేలా మీ ప్రవర్తన ఉండాలి.కానీ ఇతరుల వైకల్యాన్ని ఎత్తిచూపేలా ఇలా గంతులు వేయడం బాధ్యతారాహిత్యం. ఇదేమైనా జోక్ అనుకుంటున్నారా? దివ్యాంగుల పట్ల వివక్ష చూపడమే ఇది. ఇలాంటి చర్యలకు పాల్పడ్డందుకు వెంటనే క్షమాపణలు చెప్పండి’’ అని పారాలింపిక్ ఇండియా కమిటీ చురకలు అంటించింది.ప్రముఖ పారా అథ్లెట్, బ్యాడ్మింటన్ స్టార్ మానసి జోషీ సైతం యువరాజ్, భజ్జీ, రైనా తీరును తప్పుబట్టారు. అయితే, ఈ ముగ్గురిలో ఎవరూ కూడా తమపై వస్తున్న విమర్శలకు ఇంతవరకు స్పందించలేదు. అయితే, విమర్శల నేపథ్యంలో యువీ ఈ వీడియోను డిలీట్ చేయడం గమనార్హం.చదవండి: T20I Captain: టీమిండియా టీ20 కెప్టెన్‌గా వాళ్లిద్దరి మధ్యే పోటీ View this post on Instagram A post shared by Harbhajan Turbanator Singh (@harbhajan3) -
కోహ్లి, రోహిత్, ధోని కాదు.. ప్రపంచంలో వాళ్లే టాప్ బ్యాటర్స్: భజ్జీ
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీ విజేతగా ఇండియా ఛాంపియన్స్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో భారత క్రికెట్ జట్టు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ది కీలక పాత్ర. టోర్నీ ఆసాంతం తన స్పిన్ మయాజాలం ప్రదర్శించిన భజ్జీ.. ఇండియాకు తొట్ట తొలి టైటిల్‌ను అందించాడు.అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్భజన్కు ఓ మహిళా ప్రేజేంటర్ నుంచి ఓ అనూహ్య ప్రశ్న ఎదురైంది. వరల్డ్ క్రికెట్లో టాప్ త్రీ బ్యాటర్లను ఎంచుకోమని ఆమె భజ్జీని ప్రశ్నించింది. ఈ క్రమంలో హార్భజన్ ప్రస్తుతం తరంలోని ఒక్క క్రికెటర్‌కు కూడా తన టాప్ త్రీలో చోటు ఇవ్వలేదు.భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ గ్రేట్ బ్రియాన్ లారా, దక్షిణాఫ్రికా లెజెండ్ జాక్వెస్ కల్లిస్‌ను తన వరల్డ్ టాప్ త్రీ బ్యాటర్లగా భజ్జీ ఎంచుకున్నాడు. అయితే భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతో పాటు భారత్‌కు రెండు వరల్డ్‌కప్ టైటిల్స్‌ను అందించిన ధోనిని కూడా హార్భజన్ ఎంపిక చేయకపోవడం గమనార్హం.మరో భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప కూడా తన టాప్-3 బ్యాటర్లలో విరాట్ కోహ్లి, రోహిత్ , ధోనిలకు చోటు ఇవ్వలేదు. అతడు కూడా సర్ వివియన్ రిచర్డ్స్, టెండూల్కర్, లారాలను తన టాప్-3 బ్యాటర్లగా ఎంచుకున్నాడు. View this post on Instagram A post shared by Shefali Bagga (@shefalibaggaofficial) -
44వ పడిలోకి అడుగుపెట్టిన భజ్జీ (ఫొటోలు)
-
T20 WC: ఈసారి ఫైనలిస్టులు ఈ జట్లే: భజ్జీ కామెంట్స్ వైరల్
పొట్టి క్రికెట్ తాజా ప్రపంచకప్ సమరం తుది అంకానికి చేరుకుంది. మరో రెండు నాలుగు రోజుల్లో వరల్డ్‌కప్-2024 టోర్నీకి తెరపడనుంది. ఇప్పటికే గ్రూప్-1 నుంచి టీమిండియా, అఫ్గనిస్తాన్.. అదే విధంగా గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సెమీ ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తొలి సెమీస్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా- అఫ్గనిస్తాన్ ట్రినిడాడ్ వేదికగా.. రెండో సెమీ ఫైనల్లో టీమిండియా- ఇంగ్లండ్ గయానా వేదికగా తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం గురువారమే జరుగనున్నాయి.తొలి మ్యాచ్ ఉదయం ఆరు గంటలకు ప్రారంభం కానుండగా.. రిజర్వ్ డే కూడా ఉంది. ఇక రెండో సెమీ ఫైనల్ రాత్రి ఎనిమిది గంటలకు మొదలుకానుంది. ఈ మ్యాచ్‌కు మాత్రం రిజర్వ్ డే లేదు.కాగా చాలా మంది మాజీ క్రికెటర్లు ఊహించినట్లుగానే ఈసారి టీమిండియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా సెమీస్ చేరగా.. అనూహ్య రీతిలో అఫ్గనిస్తాన్ కూడా రేసులోకి దూసుకువచ్చింది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది.ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. టీ20 ప్రపంచకప్-2024 ఫైనలిస్టులను అంచనా వేస్తూ.. ‘‘ఈసారి వాళ్లు కూడా ఫైనల్‌కు వస్తారనే అనిపిస్తోంది.ఏదేమైనా టీమిండియానే ట్రోఫీ గెలుస్తుంది’’ అని పేర్కొన్నాడు. అఫ్గనిస్తాన్ జట్టును ఉద్దేశించి భజ్జీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. తుదిపోరులో భారత్‌తో అఫ్గన్ తలపడే అవకాశం ఉందని.. రోహిత్ సేన ఈ మ్యాచ్‌లో గెలుస్తుందని తన అభిప్రాయం వెల్లడించాడు. కాగా జూన్ 29న వరల్డ్‌కప్-2024 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో గల కెన్సింగ్టన్ ఓవల్ మైదానం ఇందుకు వేదిక. -
పాకిస్తాన్‌ను వీడి.. ఇండియా హెడ్‌కోచ్‌గా వచ్చెయ్: భజ్జీ
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గ్యారీ కిర్‌స్టన్‌కు తొలి మెగా టోర్నీలోనే చేదు అనుభవం ఎదురైంది. టీ20 ప్రపంచకప్-2024లో పాక్ లీగ్ దశలోనే నిష్క్రమించింది.ఆతిథ్య అమెరికా, చిరకాల ప్రత్యర్థి టీమిండియా చేతిలో ఓడి పరాభవాన్ని మూటగట్టుకుంది. గ్రూప్-ఏలో మిగిలిన కెనడా, ఐర్లాండ్‌లపై గెలిచినా సూపర్-8 రేసులో అమెరికాతో పోటీ పడలేక ఇంటిబాట పట్టింది.గత టీ20 వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచిన బాబర్ ఆజం ఈసారి ఇలా పూర్తిగా విఫలం కావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాబర్- షాహిన్ ఆఫ్రిది మధ్య విభేదాలతో జట్టు రెండుగా చీలిందనే ఆరోపణలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో గ్యారీ కిర్‌స్టన్ సైతం జట్టులో ఐక్యత లోపించినందు వల్లే ఇలాంటి చెత్త ఫలితాలు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తాను ఎన్నో జట్లకు మార్గదర్శనం చేశానని.. అయితే, ఇంత చెత్త జట్టును చూడలేదని గ్యారీ మండిపడినట్లు తెలుస్తోంది.టీమిండియా కోచ్‌గా వచ్చెయ్ఈ క్రమంలో టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. పాక్‌ను వదిలేసి కిర్‌స్టన్ ఇండియా హెడ్ కోచ్‌గా రావాలని ఆకాంక్షించాడు. ఈ మేరకు.. ‘‘అనవసరంగా నీ సమయాన్ని అక్కడ వృథా చేసుకోకు గ్యారీ.టీమిండియా కోచ్‌గా వచ్చెయ్. గ్యారీ కిర్‌స్టెన్.. అరుదైన వజ్రం, గొప్ప కోచ్‌లలో ఒకడు. మెంటార్, నిజాయితీ గల వ్యక్తి.. అంతేకాదు 2011 వరల్డ్‌కప్ గెలిపించిన కోచ్.2011 నాటి జట్టులో అందరికీ ప్రియమైన స్నేహితుడు కూడా! గ్యారీ ప్రత్యేకమైన వ్యక్తి’’ అని భజ్జీ ఎక్స్ వేదికగా తన మనసులోని భావాలు పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన ట్వీట్ వైరల్ కాగా.. నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.గౌతం గంభీర్ పేరు ఖరారు!ఇప్పటికే రాహుల్ ద్రవిడ్ స్థానంలో టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ పేరు ఖరారు కాగా.. భజ్జీ ఇలా పోస్ట్ పెట్టడంలో అర్థమేంటని ప్రశ్నిస్తున్నారు. గంభీర్‌ను వ్యతిరేకిస్తూ.. విదేశీ కోచ్ వైపే మొగ్గుచూపాలని బీసీసీఐకి సంకేతాలు ఇస్తున్నాడా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.కాగా సౌతాఫ్రికా మాజీ బ్యాటర్ గ్యారీ కిర్‌స్టన్ గతంలో టీమిండియా ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2011లో భారత్ వన్డే వరల్డ్‌కప్ గెలిచినపుడు అతడే కోచ్‌గా ఉన్నాడు. ఇక భజ్జీతో పాటు గంభీర్ కూడా ఈ జట్టులో సభ్యుడన్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్-2024లో భారత జట్టు సూపర్-8కు చేరింది. ఇందులో భాగంగా అఫ్గనిస్తాన్‌తో గురువారం తమ తొలి మ్యాచ్ఆడనుంది.చదవండి: Suryakumar Yadav: వరల్డ్ నంబర్ వన్‌గా ఉన్నా.. సూర్య కీలక వ్యాఖ్యలు Don’t waste ur time there Gary .. Come back to Coach Team INDIA .. Gary Kirsten One of the rare 💎.. A Great Coach ,Mentor, Honest nd very dear friend to all in the our 2011 Team .. our winning coach of 2011 worldcup . Special man Gary ❤️ @Gary_Kirsten https://t.co/q2vAZQbWC4— Harbhajan Turbanator (@harbhajan_singh) June 17, 2024 -
T20 WC 2024: వరల్డ్‌కప్ తుదిజట్టులో పంత్‌కు నో ఛాన్స్!
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తుదిజట్టు ఎంపికలో అత్యుత్తమ ఫామ్ ఆధారంగానే ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్కు సూచించాడు.కాగా వరల్డ్‌కప్-2024కు అమెరికా- వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. గ్రూపు-ఏలో ఉన్న భారత జట్టు లీగ్ దశలో తమ మ్యాచ్‌లన్నీ అమెరికాలోనే ఆడనుంది. ఇక ఇందుకోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.రోహిత్ శర్మ సారథ్యంలోని ఈ టీమ్‌లో వికెట్ కీపర్ కోటాలో రిషభ్ పంత్, సంజూ శాంసన్ చోటు దక్కించుకోగా.. కేఎల్ రాహుల్‌కు మొండిచేయి ఎదురైంది. ఐపీఎల్-2024లో సంజూ రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్,బ్యాటర్‌గా అత్యుత్తమంగా రాణించి తన బెర్తును ఖరారు చేసుకోగా.. పంత్ ఐపీఎల్ తర్వాత నేరుగా దాదాపు ఏడాదిన్నర తర్వాత టీమిండియా తరఫున బరిలో దిగనున్నాడు.ఈ నేపథ్యంలో ప్రపంచకప్ ఆడే భారత తుదిజట్టులో పంత్‌ను కాదని సంజూ శాంసన్‌కు చోటిచ్చాడు హర్భజన్ సింగ్. స్టార్ స్పోర్ట్స్ షో గేమ్ ప్లాన్‌లో భాగంగా.. తన ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకున్న భజ్జీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.‘‘నా అభిప్రాయం ప్రకారం.. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్‌తో కలిసి ఓపెనింగ్ చేయాలి. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లి రావాలి. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్.అనంతరం సంజూ శాంసన్. అతడు మంచి ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి తననే ఆడించాలి. ఇక ఆరో స్థానంలో హార్దిక్ పాండ్యా.. ఏడో నంబర్లో రవీంద్ర జడేజా. యజువేంద్ర చహల్‌ను కూడా తప్పకుండా ఆడించాలి.అతడితో పాటు ముగ్గురు సీమర్లు అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.. వీళ్లంతా తుదిజట్టులో ఉండాలి’’ అని హర్భజన్ సింగ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.అయితే, పిచ్ గనుక స్పిన్‌కు మరీ అంత అనుకూలంగా లేదని భావిస్తే.. అదనపు స్పిన్నర్‌ను వదిలేసి అతడి స్థానంలో శివం దూబేను ఆడించాలని భజ్జీ సూచించాడు. ఈ పేస్ ఆల్‌రౌండర్ జట్టుతో ఉంటే బ్యాటింగ్ ఆర్డర్ ఇంకాస్త పటిష్టంగా మారుతుందని పేర్కొన్నాడు. తన దృష్టిలో కుల్దీప్ యాదవ్ అదనపు స్పిన్నర్ మాత్రమేనని హర్భజన్ పేర్కొన్నాడు.చదవండి: T20 World Cup 2024: పొట్టి ప్రపంచకప్ విశేషాలు, రికార్డులు -
టీమిండియా చాంపియన్స్ కెప్టెన్‌గా యువరాజ్ సింగ్
ఈ ఏడాది మరో సరికొత్త టీ20 లీగ్ పురుడు పోసుకోనుంది. ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ పేరిట టోర్నీ మొదలుకానుంది. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సినీ, సంగీత సంస్థ ఇంగ్లండ్ క్రికెట్‌బోర్డు సాయంతో ఈ టోర్నమెంట్‌కు శ్రీకారం చుట్టింది.రిటైర్డ్ ప్లేయర్లు, నాన్- కాంట్రాక్ట్ ఆటగాళ్లు ఈ లీగ్‌లో భాగం కానున్నారు. టీమిండియా చాంపియన్స్ సహా ఆరు జట్లు ఇందులో పాల్గొననున్నాయి. జూలై 3 నుంచి 13 వరకు యూకేలో ఈ టీ20 టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.కెప్టెన్‌గా యువరాజ్ సింగ్ఈ క్రమంలో టీమిండియా చాంపియన్స్ తమ జట్టును ప్రకటించింది. సిక్సర్ల కింగ్, 2007(టీ20), 2011(వన్డే) వరల్డ్‌కప్స్ విజేత యువరాజ్ సింగ్ ఈ టీమ్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సురేశ్ రైనా, పఠాన్ బ్రదర్స్, ఆర్పీ సింగ్ తదితరులు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.కాగా టీమిండియాతో పాటు వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్‌లో ఆస్ట్రేలియా చాంపియన్స్, ఇంగ్లండ్ చాంపియన్స్, సౌతాఫ్రికా చాంపియన్స్, పాకిస్తాన్ చాంపియన్స్, వెస్టిండీస్ చాంపియన్స్ ఆడనున్నాయి.టీమిండియా చాంపియన్స్ జట్టు: యువరాజ్ సింగ్ (కెప్టెన్), సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, గురుక్రీత్ మాన్, హర్భజన్ సింగ్, రాహుల్ శర్మ, నమన్ ఓజా, రాహుల్ శుక్లా, ఆర్పీ సింగ్, వినయ్ కుమార్, ధవల్ కులకర్ణి.టీమిండియా చాంపియన్స్ షెడ్యూల్జూలై 2న ఇంగ్లండ్, జూలై 5న వెస్టిండీస్, జూలై 6న పాకిస్తాన్, జూలై 8న ఆస్ట్రేలియా, జూలై 10న సౌతాఫ్రికా చాంపియన్స్‌తో టీమిండియా చాంపియన్స్ తలపడనుంది. జూలై 12న సెమీస్ జరుగనుండగా.. జూలై 13న ఫైనల్‌కు ముహూర్తం ఖరారైంది.చదవండి: WC: పక్కా టీ20 టైప్.. న్యూయార్క్ పిచ్ వెనుక ఇంత కథ ఉందా? ద్రవిడ్‌తో కలిసి -
హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
‘‘ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాళ్లతో కూడిన జట్టు. నేను పదేళ్ల పాటు ఆ జట్టుకు ఆడాను. ముంబై మేనేజ్మెంట్ టీమ్‌ను చాలా బాగా చూసుకుంటుంది. అయితే, ఈసారి వాళ్లు తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టింది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే వారు కెప్టెన్‌ను మార్చారు. కానీ.. వాళ్లు అనుకున్నట్లుగా ఏదీ జరుగలేదు.జట్టు ఏకతాటిపై ఉన్నట్లు కనిపించలేదు. ఎవరికి వారే అన్నట్లు విడివిడిగా ఉన్నట్లు అనిపించింది. ముంబై లాంటి జట్టు ఇలా పేలవంగా ఆడటం నన్ను బాధించింది.కెప్టెన్‌ను మార్చాలనే నిర్ణయం సరైందే అయినా.. అందుకు మరో ఏడాది వేచి చూడాల్సింది. ఇందులో హార్దిక్ పాండ్యా తప్పేం లేదు. గుజరాత్ టైటాన్స్‌లో ఉన్నపుడు అతడి కెప్టెన్సీ అద్భుతంగా ఉంది.నిజానికి.. కెప్టెన్ ఎవరైనా.. సీనియర్లంతా కలిసి జట్టును ఒక్కటిగా ఉంచాల్సింది. కెప్టెన్లు వస్తారూ.. పోతారు. జట్టు మాత్రం ఒక్కతాటిపై ఉండాలి కదా!ఈసారి వాళ్లు జట్టులా ఆడినట్లు ఏ కోశానా కనిపించలేదు’’ అని టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ అన్నాడు. ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ దారుణ వైఫల్యం పట్ల విచారం వ్యక్తం చేశాడు.కాగా ఈ సీజన్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి.. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. దీంతో సొంత జట్టు అభిమానుల నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.అదే విధంగా హార్దిక్ పాండ్యాకు సైతం స్టేడియంలో, సోషల్ మీడియాలో అభిమానుల ఆగ్రహ జ్వాలల సెగ తగిలింది. అందుకు తగ్గట్లుగానే ముంబై వరుస మ్యాచ్‌లలో ఓడిపోవడం.. ఆఖరికి ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలవడంతో ఫ్యాన్స్ మరోసారి రెచ్చిపోయారు.ఇక ఓవరాల్‌గా ఈ ఎడిషన్‌లో ముంబై ఆడిన పద్నాలుగింట కేవలం నాలుగు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ హర్భజన్ సింగ్ వార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ పైవిధంగా స్పందించాడు.జట్టు రెండు వర్గాలుగా విడిపోవడానికి సీనియర్లే కారణమంటూ పరోక్షంగా రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌లను టార్గెట్ చేశాడు. హార్దిక్ పాండ్యాకు మద్దతు తెలిపే క్రమంలో భజ్జీ జట్టు వైఫల్యాలకు సీనియర్లను బాధ్యులుగా చూపే ప్రయత్నం చేశాడు.చదవండి: KKR vs SRH: ప్రమాదకారి.. ఫైనల్ చేరే తొలి జట్టు ఇదే: పాక్ లెజెండ్#WATCH | On Hardik Pandya's captaining Mumbai Indians in IPL 2024, former Indian cricketer Harbhajan Singh says "I have played with Mumbai Indians for 10 years. The team management is great but this decision has backfired them. The management was thinking about the future while… pic.twitter.com/pGNW5gIRF5— ANI (@ANI) May 21, 2024 -
IPL 2024: సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. లీగ్ దశ ముగింపునకు వచ్చినా టాప్-4 బెర్తులపై ఇంత వరకూ స్పష్టత రాలేదు. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరగా.. మిగిలిన రెండు స్థానాల కోసం ఆసక్తికర పోటీ నడుస్తోంది.ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ రేసులో ముందుండగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కూడా ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.చెన్నై ఇప్పటికి 13 మ్యాచ్‌లు ఆడి ఏడింట గెలిచి 14 పాయింట్లు(నెట్ రన్‌రేటు 0.528) సాధించగా.. పన్నెండు ఆడి ఏడింట గెలిచి 14 పాయింట్లతో ఉన్న సన్‌రైజర్స్ నెట్ రన్‌రేటు (0.406) పరంగా కాస్త వెనుకబడి ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది.అతిపెద్ద సానుకూలాంశంఅయితే, రైజర్స్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండటం.. అది కూడా సొంతగడ్డపై జరుగనుండటం అతిపెద్ద సానుకూలాంశం. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లలో ఏదో ఒకటి గెలిచినా 16 పాయింట్లతో కనీసం నాలుగో స్థానం ఖరారు చేసుకుంటుంది.మరోవైపు.. ఆర్సీబీ ఖాతాలో 12 పాయింట్లే ఉన్నాయి. మిగిలింది ఇంకొక్క మ్యాచ్. అది కూడా సీఎస్కే(మే 18)తో! ఈ మ్యాచ్‌లో చెన్నైని కచ్చితంగా ఓడిస్తేనే ఆర్సీబీకి అవకాశం ఉంటుంది. లేదంటే ఇంటికి వెళ్లడమే తరువాయి!చెన్నై పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. ఓడితే ఇంటికే లేదంటే సన్‌రైజర్స్ మ్యాచ్‌ల ఫలితం తేలేవరకు వేచి చూడాలి. ఈ సమీకరణల నేపథ్యంలో ఎలా చూసినా సన్‌రైజర్స్ సీఎస్కే, ఆర్సీబీ కంటే ఓ మెట్టు పైనే ఉన్నట్లు స్పష్టమవుతోంది.రెండు మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఓడిపోతే పరిస్థితి ఏంటి?అయితే, టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి ప్లే ఆఫ్స్ చేరదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకుంటూ.. చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు ఆర్సీబీ టాప్-4లో అడుగుపెడుతుందని జోస్యం చెప్పాడు.‘‘తదుపరి రెండు మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఓడిపోతే పరిస్థితి ఏంటి? ఐపీఎల్లో ఏదైనా జరగొచ్చు కదా! ఒకవేళ హైదరాబాద్ రెండు మ్యాచ్‌లూ ఓడి.. ఆర్సీబీ చెన్నై మీద గెలిస్తే.. అప్పుడు రెండు జట్ల ఖాతాలో 14 పాయింట్లే ఉంటాయి.రన్‌రేటు పరంగా సన్‌రైజర్స్ కంటే ఈ రెండు జట్లు మెరుగ్గానే ఉంటాయి. అందుకే నా టాప్ 4.. కేకేఆర్, రాజస్తాన్, చెన్నై, బెంగళూరు’’ అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.భగ్గుమంటున్న ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్కాగా భజ్జీ వ్యాఖ్యలపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు భగ్గుమంటున్నారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో సొంతగడ్డపై చెలరేగే ప్యాట్ కమిన్స్ బృందాన్ని తక్కువ అంచనా వేయడమే గాకుండా.. అపశకునపు మాటలు మాట్లాడటం సరికాదంటూ ఫైర్ అవుతున్నారు. ఇక సన్‌రైజర్స్ గురువారం నాటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: అతడి కంటే చెత్త కెప్టెన్ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?.. గంభీర్ ఫైర్ Ready to put on a show this evening 🧡💙#PlayWithFire #SRHvGT pic.twitter.com/o07Or5fu12— SunRisers Hyderabad (@SunRisers) May 16, 2024 -
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ కోహ్లినే!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. 2008 నుంచి ఇప్పటి దాకా.. ఇంత వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. అయినప్పటికీ ఆ జట్టుకు ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్సీబీకి ఉన్నంత విశ్వసనీయమైన ఫ్యాన్ బేస్ మరే జట్టుకు లేదంటారు.నాయకుడి స్థానం నుంచి వైదొలిగిఇంతటి క్రేజ్‌కు కారణం టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి అన్న విషయం తెలిసిందే. ఇక్కడే తన ఫ్రాంఛైజీ క్రికెట్ మొదలుపెట్టిన ఈ రన్‌మెషీన్.. ఇప్పటికీ ఆ జట్టుతోనే కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనూ కెప్టెన్‌గానూ బాధ్యతలు చేపట్టిన కోహ్లి పనిఒత్తిడిని తగ్గించుకుని.. కేవలం బ్యాటింగ్‌పై ఫోకస్ చేసే క్రమంలో నాయకుడి స్థానం నుంచి 2021 తర్వాత తప్పుకొన్నాడు.గత రెండు సీజన్లుగా సౌతాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ ఆర్సీబీ కెప్టెన్‌గా కొనసాగుతుండగా.. కోహ్లి ఓపెనింగ్ బ్యాటర్‌గా సేవలు అందిస్తున్నాడు. అయితే, అతడి సారథ్యంలో గతేడాది ఆరో స్థానంతో ముగించిన ఆర్సీబీ.. ఐపీఎల్-2024 ఆరంభంలో వరుస ఓటములు చవిచూసింది.వరుసగా ఐదు విజయాలు సాధించితర్వాత తిరిగి పుంజుకుని వరుసగా ఐదు విజయాలు సాధించి.. ప్రస్తుతానికి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం చేసుకుంది. అయితే, కేజీఎఫ్‌గా ప్రసిద్ధి పొందిన ఆర్సీబీ బ్యాటింగ్ త్రయం కోహ్లి, గ్లెన్ మాక్స్వెల్, ఫాఫ్లలో కేవలం కోహ్లి ఒక్కడే రాణిస్తున్నాడు.ఇప్పటి వరకు ఈ ఎడిషన్‌లో ఆడిన 13 మ్యాచ్‌లలో కలిపి 661 పరుగులు చేసిన కోహ్లి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు. అయితే, జట్టును ప్లే ఆఫ్స్ చేర్చడం మాత్రం కష్టంగా మారింది.ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే సీజన్లో విరాట్ కోహ్లిని మళ్లీ కెప్టెన్‌గా ప్రకటించాలని ఆర్సీబీ మేనేజ్మెంట్కు సూచించాడు.ఆర్సీబీకి కోహ్లి కూడా అలాగేఈ మేరకు.. "ఈసారి వాళ్లు(ఆర్సీబీ గనుక ) ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించకపోతే.. భారత క్రికెటర్‌ను కెప్టెన్‌గా తీసుకురావాలి. అయినా ఎవరో ఎందుకు? మళ్లీ కోహ్లినే కెప్టెన్‌ను చేస్తే సరిపోతుంది కదా! చెన్నై జట్టు మీద ధోని ప్రభావం ఎంత ఉంటుందో.. ఆర్సీబీకి కోహ్లి కూడా అలాగే!బలమైన నాయకుడు. జట్టును ఎలా ముందుకు నడిపించాలో అతడికి తెలుసు. ప్రస్తుతం వాళ్లు దూకుడుగానే ఆడుతున్నారు. కోహ్లి సారథిగా వస్తే మరింత బాగుంటుంది. విరాట్ కోహ్లి తిరిగి ఆర్సీబీ పగ్గాలు చేపడితే చూడాలని ఉంది" అని భజ్జీ స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు.చదవండి: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు: ధోని ఫ్యాన్స్‌పై సంచలన వ్యాఖ్యలు -
ధోని గురించి నిజాలు ఇవే! మాజీ క్రికెటర్లకు కౌంటర్
పంజాబ్ కింగ్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడంపై క్రీడా వర్గాల్లో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు ధోని నిర్ణయాన్ని తప్పుబడుతూ ఘాటు విమర్శలు చేశారు.జట్టుకు అవసరమైనపుడు ధోని బ్యాటింగ్ చేయడానికి సుముఖంగా లేనపుడు తుదిజట్టు నుంచి కూడా తప్పుకోవాలంటూ భజ్జీ వ్యాఖ్యానించాడు. ధోని ఇలాంటి తప్పు చేస్తాడని అసలు ఊహించలేదంటూ కామెంట్ చేశాడు. అతడికి బదులు జట్టులో మరో అదనపు పేసర్‌ను తీసుకోవాలని సూచించాడు.మరోవైపు.. ఇర్ఫాన్ పఠాన్ సైతం.. 42 ఏళ్ల పైబడినా బ్యాటింగ్ చేయగల సత్తా ధోనికి ఉందని.. జట్టు ప్రయోజనాల దృష్ట్యా కనీసం 4-5 ఓవర్ల పాటు తలా క్రీజులో ఉండాలని సలహా ఇచ్చాడు.ఇదిలా ఉంటే.. పంజాబ్‌తో అంతకు ముందు మ్యాచ్‌లోనూ ధోని డారిల్ మిచెల్‌తో కలిసి పరుగు తీసేందుకు వెనుకాడగా.. అదృష్టవశాత్తూ అతడు రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే, ఆ మ్యాచ్‌లో సీఎస్కే ఓడిపోగా.. ధోని తీరుపై విమర్శలు వచ్చాయి.ఈ రెండు సందర్భాల్లోనూ ధోనిని తప్పుబట్టిన వాళ్లకు అతడి అభిమానులు చురకలు అంటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధోని ఇలా చేయడానికి ఇదే కారణమంటూ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది.మోకాలి గాయం కారణంగా ఇబ్బంది పడుతున్న ధోని.. వికెట్ కీపర్‌గా సేవలు అందించే క్రమంలో ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయకుండా ఉండాలని నిర్ణయించుకున్నాడన్నది దాని సారాంశం.ఇందుకు సంబంధించి సీఎస్కే వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘మేము మా ద్వితీయ శ్రేణి జట్టుతోనే ఎక్కువగా ఆడుతున్నాం. ధోనిని విమర్శించే వాళ్లకు అతడు చేస్తున్న త్యాగాల గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు.జట్టు కోసం అతడు ఎంతగానో పరితపిస్తాడు. మోకాలి నొప్పి వేధిస్తున్నా అవసరమైనపుడు బ్యాటింగ్ చేస్తున్నాడు’’ అని పేర్కొన్నాయి. కాగా ఐపీఎల్-2024లో కెప్టెన్సీ పగ్గాలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించిన ధోని.. ఆటగాడిగా కొనసాగుతున్నాడు.ఇప్పటికే అదనపు వికెట్ కీపర్ డెవాన్ కాన్వే జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో ధోనినే కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. అయితే, మోకాలి నొప్పి తీవ్రం కాకుండా చూసుకునేందుకే బ్యాటింగ్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సీజన్లో సీఎస్కే ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌లలో సీఎస్కే ఆరు గెలిచి పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన మూడు మ్యాచ్‌లలో గెలిచి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాలని పట్టుదలగా ఉంది. -
ధోని జట్టులో అవసరమా?: ‘తలా’పై సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని విషయంలో చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. తొమ్మిదో స్థానంలో అతడు బ్యాటింగ్‌కు వచ్చిన నేపథ్యంలో మేనేజ్మెంట్తో పాటు ధోని నిర్ణయాన్ని విశ్లేషకులు తప్పుబడుతున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధోని బ్యాటింగ్ చేయడానికి సుముఖంగా లేనపుడు తుదిజట్టు నుంచి కూడా తప్పుకోవాలంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా తన టీ20 కెరీర్లో ధోని తొలిసారి తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు.పంజాబ్ కింగ్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో బౌలింగ్ ఆల్‌రౌండర్లు మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్ వరుసగా ఏడు, ఎనిమిదో స్థానాల్లో బరిలోకి దిగగా.. వారి తర్వాత వచ్చిన ధోని గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు.తుదిజట్టులో ధోని అవసరమా?పంజాబ్ పేసర్ హర్షల్ పటేల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘ఎంఎస్ ధోని ఒకవేళ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేయాలనుకుంటే.. అతడు అసలు ఆడనేకూడదు.అలాంటపుడు ధోని బదులు తుదిజట్టులో మరో అదనపు ఫాస్ట్ బౌలర్‌ను తీసుకోవడం మంచిది. నిజానికి ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలన్నది ధోని స్వతహాగా తీసుకున్న నిర్ణయమే అయి ఉంటుంది.అలా చేయడం ద్వారా తన జట్టును ప్రమాదంలోకి నెట్టాడు. ధోని కంటే ముందు శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్ రావడం ఏమిటి? ఠాకూర్ ఎప్పుడైనా హిట్టింగ్ ఆడాడా?ధోని కావాలనే చేశాడు.. నాకైతే నచ్చలేదుధోని అనుమతి లేకుండా జట్టులో ఏమీ జరుగదు. కానీ ధోని ఈరోజు ఎందుకు ఇలాంటి తప్పు చేశాడో అర్థం కావడం లేదు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేయాలన్న ధోని నిర్ణయం నాకైతే అస్సలు నచ్చలేదు’’ అని భజ్జీ కుండబద్దలు కొట్టాడు.డెత్ ఓవర్లలో సీఎస్కే ఎక్కువ పరుగులు రాబట్టాలనుకుంటే ధోని కచ్చితంగా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తేనే బాగుంటుందని హర్భజన్ సింగ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.రవీంద్రుడి మాయాజాలం కాగా ధర్మశాల వేదికగా పంజాబ్‌తో ఆదివారం నాటి మ్యాచ్ సీఎస్కే 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(26 బంతుల్లో 43 పరుగులు, 3/20) వల్లే ఈ గెలుపు సాధ్యమైంది. ఇక ఫినిషింగ్ స్టార్ ధోని ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి 110 పరుగులు చేశాడు.చదవండి: అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. వసీం అక్రం కౌంటర్The reactions say it all! #IPLonJioCinema #TATAIPL #PBKSvCSK pic.twitter.com/owCucgYN8d— JioCinema (@JioCinema) May 5, 2024 -
T20: రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్‌గా సంజూ శాంసన్!
‘రోహిత్ శర్మ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యానే.. అంతెందుకు టీ20 వరల్డ్‌కప్-2024లోనూ జట్టును అతడే ముందుకు నడిపిస్తాడు’’.. చాన్నాళ్లుగా విశ్లేషకుల మాట. అయితే, వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత సీన్ కాస్తా మారింది. గాయం కారణంగా మెగా టోర్నీకి దూరమైన ఈ పేస్ ఆల్‌రౌండర్.. ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌కు వచ్చి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేస్తూ ముంబై పగ్గాలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో.. బీసీసీఐ మాత్రం ఈసారి పొట్టి ప్రపంచకప్‌లో రోహిత్ శర్మనే టీమిండియాకు సారథ్యం వహిస్తాడని ప్రకటించింది. ఇక ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ మొదలైన తర్వాత సీన్ పూర్తిగా మారింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వైఫల్యాల కారణంగా ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు ఆడిన ఎనిమిదింట కేవలం మూడు మాత్రమే గెలిచింది. రాజస్తాన్ రాయల్స్ చేతిలో సోమవారం నాటి మ్యాచ్‌తో ఐదో పరాజయం నమోదు చేసింది. ఇదిలా ఉంటే.. రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ మాత్రం తన జట్టును విజయపథంలో ముందుకు నడిపిస్తున్నాడు. సంజూ శాంసన్ (PC: IPL) ఇప్పటి దాకా రాయల్స్ ఎనిమిది మ్యాచ్‌లు ఆడి ఏడు విజయాలతో ప్రస్తుతం పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు.. వికెట్ కీపర్ బ్యాటర్‌గానూ సంజూ అదరగొడుతున్నాడు. ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి అతడు 314 పరుగులు సాధించాడు. ముంబైతో మ్యాచ్‌లో సెంచరీ వీరుడు యశస్వి జైస్వాల్(60 బంతుల్లో 104)తో కలిసి సంజూ(28 బంతుల్లో 38) ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఫామ్ తాత్కాలికం.. క్లాష్ శాశ్వతం అని యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ మరోసారి నిరూపించింది. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ గురించి ప్రత్యేకంగా చర్చ అవసరం లేదు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో భారత జట్టులో నేరుగా అడుగుపెట్టే అర్హత అతడికి ఉంది. అంతేకాదు రోహిత్ శర్మ తర్వాత టీమిండియా తదుపరి కెప్టెన్‌గా సంజూ శాంసన్ ఎదుగుతాడనడంలో మీకేమైనా అనుమానాలున్నాయా?’’ అంటూ కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ పొట్టి ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్ కావాలని ఆకాంక్షించాడు. అసలు జట్టులో చోటు దక్కుతుంతా అన్న సందేహాల నడుమ ఊహించని విధంగా కెప్టెన్ కావాంటూ అంటూ కామెంట్ చేశడు. కాగా వరల్డ్‌కప్-2024 నేపథ్యంలో రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ మధ్య పోటీ నెలకొన్న తరుణంలో భజ్జీ ఇలా సంజూకు ఓటు వేశాడు. మరి మీ ఓటు ఎవరికి?! Yashasvi Jaiswal’s knock is a proof of class is permanent . Form is temporary @ybj_19 and there shouldn’t be any debate about Keepar batsman . @IamSanjuSamson should walks in to the Indian team for T20 worldcup and also groomed as a next T20 captain for india after rohit . koi… — Harbhajan Turbanator (@harbhajan_singh) April 22, 2024 THAT 💯 moment! ☺️ Jaipur is treated with a Jaiswal special! 💗 Scorecard ▶️ https://t.co/Mb1gd0UfgA#TATAIPL | #RRvMI | @ybj_19 pic.twitter.com/i0OvhZKtGI — IndianPremierLeague (@IPL) April 22, 2024