
ICC ODI World Cup 2023: ‘‘మనకు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా లాంటి ఎంతో మంది స్టార్ క్రికెటర్లు ఉన్నారు. అయితే వీరితో పాటు మిగతా ఆటగాళ్లు, మేనేజ్‌మెంట్ కూడా ఒకే లక్ష్యంతో సమష్టిగా ముందుకు సాగాలి. మన జట్టులో లోపమేమిటో నాకైతే అర్థం కావడం లేదు.
2015, 2019 వరల్డ్‌కప్ టోర్నీల్లో సెమీ ఫైనల్స్ వరకు వచ్చాము. కానీ రెండు సందర్భాల్లోనూ ఐసీసీ ట్రోఫీ మాత్రం గెలవలేకపోయాం. ఒకవేళ ఒత్తిడిని జయించలేకే ఇలా చిత్తైపోతున్నామా అనిపిస్తోంది.
ఇలాంటి మెగా ఈవెంట్లలో కీలక ఆటగాళ్లతో పాటు మిగిలిన వాళ్లంతా కూడా కలిసి వస్తేనే ఒత్తిడిని అధిగమించగలుగుతాం. ముగ్గురూ.. నలుగురూ రాణించినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. అనుకున్న ఫలితాలు రాబట్టే వీలు కూడా ఉండదు’’ అని టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు.
దశాబ్ద కాలంగా నో ట్రోఫీ!
కాగా దశాబ్ద కాలంగా ఐసీసీ టైటిల్ గెలవలేదన్న అపఖ్యాతిని మూటగట్టుకున్న టీమిండియాకు.. ఆ అప్రతిష్టను చెరిపివేసుకునేందుకు వన్డే ప్రపంచకప్-2023 రూపంలో మంచి అవకాశం వచ్చింది. సొంతగడ్డపై ఈ మ్యాచ్ జరుగనుండటం రోహిత్ సేనకు మరింత సానుకూలాంశంగా మారింది. అక్టోబరు 5 నుంచి మొదలుకానున్న ఈ మెగా టోర్నీలో భాగంగా తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.
ఆసీస్‌తో తొలి మ్యాచ్
అక్టోబరు 8న చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో భజ్జీ మాట్లాడుతూ.. ఒకరో ఇద్దరో మాత్రమే రాణిస్తే ట్రోఫీ గెలవలేమని.. జట్టు మొత్తం సమష్టిగా రాణిస్తేనే టైటిల్ సాధించగలమని పేర్కొన్నాడు. అదే విధంగా పెద్ద పెద్ద విషయాలపై మాత్రమే దృష్టి సారించకుండా.. చిన్న చిన్న లోపాలు, తప్పిదాలను సరిచేసుకోవడం అత్యంత ముఖ్యమన్నాడు.
సింగిల్ సేవ్ చేయడం కూడా
‘‘సింగిల్ సేవ్ చేయడం, దొరికిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ రనౌట్లు చేయడం వంటివి చిన్న విషయాలుగా అనిపించినా అవే ఒక్కోసారి మ్యాచ్ ఫలితాలను మార్చివేసేంతంగా ప్రభావం చూపుతాయి. జట్టంతా కలిసికట్టుగా ఆడితే అనుకున్న ప్రణాళికలను అమలు చేయవచ్చు’’ అంటూ హర్భజన్ సింగ్ న్యూస్24 స్పోర్ట్స్‌తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
చదవండి: టీమిండియా సెలెక్టర్లకు విషమ పరీక్ష.. ఛాలెంజ్ విసురుతున్న మరో ఓపెనర్!
ఆరోజు రోహిత్ భార్య అన్న మాట జీవితంలో మర్చిపోలేను: తిలక్ వర్మ తండ్రి
దీనస్థితిలో ధోని సొంత అన్న? బయోపిక్‌లో ఎందుకు లేడు? అయినా అతడితో..
Comments
Please login to add a commentAdd a comment