వన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియా ఆరంభ మ్యాచ్‌కు కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. అక్టోబరు 8(ఆదివారం)న ఆస్ట్రేలియాతో మ్యాచ్‌తో చెన్నై వేదికగా రోహిత్ సేన ఈ ఐసీసీ టోర్నీని ఆరంభించనుంది.
ఈ మెగా ఈవెంట్ కోసం రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ తదితర 15 మంది సభ్యులతో బీసీసీఐ జట్టును ఖరారు చేసింది.
ఇందులో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో తుది జట్టు(Playing XI)లో ఎవరు ఉండాలని మీరు భావిస్తున్నారు? అన్న సాక్షి.కామ్ ప్రశ్నకు అభిమానుల నుంచి స్పందన ఇలా..
1.రోహిత్ శర్మ- 91.1%
2.విరాట్ కోహ్లి-90.9%
3.జస్‌ప్రీత్ బుమ్రా-89.3%
4.రవీంద్ర జడేజా-88.3%
5.కేఎల్ రాహుల్--86.7%
6.హార్దిక్ పాండ్యా- 85.2%
7.మహ్మద్ సిరాజ్- 78.6%
8.కుల్దీప్ యాదవ్-71.6%
9.రవిచంద్రన్ అశ్విన్- 69.3%
10.శుబ్‌మన్ గిల్-66.9%
11. శ్రేయస్ అయ్యర్- 66.1%
(Note: This content is neither created nor endorsed by Google)
Comments
Please login to add a commentAdd a comment