ODI WC 2023 Predictions
-
WC 2023: అర్థం చేసుకునే వాళ్లకు ఒక్క సైగ చాలు.. ఇంతకంటే: ధోని
ICC WC 2023- MS Dhoni Comments: టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఘనత మహేంద్ర సింగ్ ధోని సొంతం. టీ20 ఫార్మాట్లో 2007లో తొలిసారిగా ప్రవేశపెట్టిన వరల్డ్‌కప్ ట్రోఫీ గెలచిన ఈ మిస్టర్ కూల్ కెప్టెన్.. 2011లో భారత్‌కు రెండో వన్డే ప్రపంచకప్ అందించాడు. ఆ తర్వాత మళ్లీ చాంపియన్స్ ట్రోఫీ రూపంలో 2013లో మరోసారి ప్రతిష్టాత్మక టైటిల్ సాధించాడు. ధోని శకం ముగిసిన తర్వాత టీమిండియా మళ్లీ ఇంత వరకు ఐసీసీ టోర్నీ గెలిచిన సందర్భాలు లేవు. పదేళ్ల తర్వాత అయితే, పదేళ్ల తర్వాత సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023 రూపంలో మరోసారి టైటిల్ గెలిచే అవకాశం ముంగిట నిలిచింది భారత్. ట్రోఫీ గెలిచే దిశగా ఇప్పటికే అద్భుతమైన విజయాలతో రోహిత్ శర్మ సారథ్యంలోని జట్టు ముందుకు సాగుతోంది. వరుసగా ఐదు విజయాలతో అజేయంగా పూర్తి సమతూకంగా కనిపిస్తున్న భారత జట్టు ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఐదూ గెలిచి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. తొలుత ఆస్ట్రేలియాను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. ఆ తర్వాతి మ్యాచ్‌లలో అఫ్గనిస్తాన్(8 వికెట్లు), పాకిస్తాన్(7 వికెట్లు), బంగ్లాదేశ్(7 వికెట్లు), న్యూజిలాండ్(4 వికెట్లు)పై వరుస విజయాలు సాధించింది. అన్నీ మంచి శకునములే ఈ నేపథ్యంలో హాట్ ఫేవవరెట్గా బరిలోకి దిగిన రోహిత్ సేన ఈసారి కప్పు కొట్టడం ఖాయమనే అభిప్రాయాలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఐసీసీ టైటిళ్ల ధీరుడు, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఈ విషయం గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులుగా.. ‘‘ఈ జట్టు చాలా బాగుంది. సమతూకంగా కనిపిస్తోంది. ప్రతి ఒక్క ఆటగాడు తమ పని తాము సమర్థవంతంగా పూర్తి చేస్తున్నారు. అన్నీ మంచి శకునాలే ఎదురవుతున్నాయి. ఒక్క సైగ చాలు ఇంతకంటే ఎక్కువ నేనేం చెప్పలేను. అర్థం చేసుకునేవాళ్లకు ఒక్క సైగ చాలు కదా!’’ అంటూ టీమిండియా ఈసారి ట్రోఫీని ముద్దాడుతుందని చెప్పకనే చెప్పాడు ధోని. ఈ మేరకు ధోని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్-2023లో టీమిండియా అక్టోబరు 29న ఇంగ్లండ్‌తో తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది. చదవండి: WC 2023: పొరపాటు చేయలేదు.. మా ఓటమికి కారణాలివే! అయినా..: బట్లర్ WC 2023: ఎవరు ఏం చెప్పినా వినాలి.. కెప్టెన్‌గా నేనున్నాంటే: రోహిత్ శర్మ MS Dhoni said, "India has a great balanced team in the World Cup. Everything is looking very good at this stage, I won't say more than this. A nod is as good as a wink". (Rigi). pic.twitter.com/yW8XlOZNVr — Mufaddal Vohra (@mufaddal_vohra) October 27, 2023 Hello Lucknow 👋#TeamIndia are here for their upcoming #CWC23 clash against England 👌👌#MenInBlue | #INDvENG pic.twitter.com/FNF9QNVUmy — BCCI (@BCCI) October 25, 2023 -
ఈ వరల్డ్‌కప్‌లోనే కోహ్లి.. సచిన్ సెంచరీల రికార్డు బ్రేక్ చేస్తాడు!
ICC WC 2023- Kohli Eyes On Big Records: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిని ఉద్దేశించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా రన్‌మెషీన్.. భారత దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ సెంచరీల రికార్డును బ్రేక్ చేయగలడని పేర్కొన్నాడు. ఆరంభ మ్యాచ్‌లో ఆసీస్ మీద కోహ్లి అద్భుతంగా ఆడాడన్న రిక్కీ పాంటింగ్.. సెంచరీ చేజారిన లోటును తదుపరి మ్యాచ్‌లలో తీర్చుకుంటాడని అభిప్రాయపడ్డాడు. ఈ టోర్నీలో కనీసం రెండు శతకాలైనా బాదుతాడని ధీమా వ్యక్తం చేశాడు. కోహ్లి, రాహుల్ పట్టుదలగా నిలబడి కాగా చెన్నైలోని చెపాక్‌లో తొలి మ్యాచ్‌లోనే రోహిత్ సేన కష్టమ్మీద గెలిచిన విషయం తెలిసిందే. టాస్ ఓడి తొలుత ఫీల్డింగ్ చేసిన భారత్ కంగారూ జట్టును 199 పరుగులకే కట్టడి చేసింది. అయితే, స్వల్ప లక్ష్య ఛేదనలో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కోహ్లి(85), కేఎల్ రాహుల్(97- నాటౌట్) పట్టుదలగా నిలబడి అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయం అందించారు. కాగా అంతర్జాతీయ వన్డేల్లో కోహ్లి ఇప్పటి వరకు 47 శతకాలు బాదాడు. మరో మూడు సెంచరీలు చేస్తే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పేరిట ఉన్న రికార్డు(49) బద్దలు కొట్టాలంటే కోహ్లి మరో మూడు సెంచరీలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో.. ది ఐసీసీ రివ్యూ పాడ్‌కాస్ట్‌లో ఇందుకు సంబంధించిన ప్రస్తావన రాగా.. ఆసీస్ లెజెండ్ రిక్కీ పాంటింగ్ స్పందిస్తూ.. ‘‘ఈసారి కోహ్లి కచ్చితంగా కనీసం రెండు సెంచరీలు చేస్తాడు. కనీసం రెండు శతకాలు ఖాయం ఒకవేళ అంతకు మించి రాణిస్తే కథ వేరేలా ఉంటది. కోహ్లికి ఇదే చివరి వన్డే వరల్డ్‌కప్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ అదే మైండ్‌సెట్‌తో గనుక బరిలోకి దిగితే పరుగుల దాహం తీర్చుకోకుండా వెనుదిరగడు. ప్రస్తుతం కోహ్లి మంచి ఫామ్‌లో ఉన్నాడు. సచిన్ రికార్డును సమం చేస్తాడు లేదంటే బ్రేక్ చేసినా చేస్తాడు. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేసి ఈ వరల్డ్‌కప్‌ను చిరస్మరణీయం చేసుకుంటాడు’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: వెళ్లి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుకో పో బాబర్.. పాక్ కెప్టెన్‌పై ఫ్యాన్స్ ట్రోల్స్ -
పాక్, కివీస్‌లకు అంత సీన్ లేదు.. సెమీస్‌లో ఆ 4 జట్లే! ఫైనల్లో: ఆండర్సన్
ICC WC 2023 Winner Prediction: వన్డే వరల్డ్‌కప్-2023లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ టైటిల్ నిలబెట్టుకుంటుందని ఆ జట్టు వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ ధీమా వ్యక్తం చేశాడు. ఐసీసీ ఈవెంట్ ఫైనల్లో ఈసారి టీమిండియాను ఓడించి ట్రోఫీ గెలుస్తుందంటూ అతి విశ్వాసం ప్రదర్శించాడు. కాగా 2019 ప్రపంచకప్ హీరో బెన్ స్టోక్స్ రాకతో ఇంగ్లిష్ జట్టు మరింత పటిష్టంగా మారిన విషయం తెలిసిందే. అయితే, ప్రపంచకప్-2023లో భారత్ వేదికగా ఆడిన తొలి మ్యాచ్‌కే స్టోక్సీ దూరం కావడం ఇంగ్లండ్‌పై ప్రభావం చూపింది. ఆరంభ మ్యాచ్‌లో కివీస్ చేతిలో చిత్తుగా ఓడి ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో ఈవెంట్ ఆరంభ మ్యాచ్‌లో ఏకంగా 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది బట్లర్ బృందం. -2.149 రన్‌రేటుతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం అట్టడుగున పదో స్థానంలో ఉంది. ఈ క్రమంలో మంగళవారం ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు సన్నద్ధమవుతోంది. రెండో మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ టెస్టు క్రికెటర్‌గా కొనసాగుతున్న ఆండర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్‌కప్ 13వ ఎడిషన్‌లో సెమీస్ చేరే జట్లు, టైటిల్ విన్నర్‌పై తన అంచనాను తెలియజేశాడు. ఆండర్సన్(PC: X) సెమీస్‌లో ఆ 4 జట్లే.. ఇక ఫైనల్లో ‘‘ఇంగ్లండ్, ఇండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఈసారి సెమీ ఫైనలిస్టులుగా నిలుస్తాయి. ఆసీస్‌తో ఇటీవలి సిరీస్‌లో సౌతాఫ్రికా(3-2తో గెలుపు) అదరగొట్టింది. నిజానికి ప్రస్తుతం ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లోనూ మంచి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇక.. పాకిస్తాన్, న్యూజిలాండ్ కూడా సెమీస్ దిశగా పయనిస్తాయి. కానీ.. టాప్-4లో నిలవలేవు. నా అంచనా ప్రకారం.. హోరాహోరీ ఫైనల్లో ఇంగ్లండ్ టీమిండియాను ఓడించి టైటిల్ గెలుస్తుంది’’ అని దిగ్గజ బౌలర్ ఆండర్సన్ బీబీసీ టెస్టు మ్యాచ్ స్పెషల్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా నవంబరు 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. చదవండి: నువ్వెందుకు ఉన్నట్లు? అయినా రాహుల్‌ను ఎందుకు ఆడించట్లేదు: యువీ -
'కోహ్లి, రోహిత్ కాదు.. వరల్డ్‌కప్ టాప్ రన్ స్కోరర్ అతడే'
వన్డే ప్రపంచకప్-2023లో తొలి మ్యాచ్ ఆడేందుకు టీమిండియా సిద్దమైంది. ఆదివారం చెన్నై వేదికగా ఐదు సార్లు వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో భారత జట్టు తలపడనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌పై భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా గిల్ నిలుస్తాడని జహీర్ ఖాన్ జోస్యం చెప్పాడు. కాగా గిల్ ప్రస్తుతం వన్డే క్రికెట్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తన గత 20 వన్డేల్లో ఏకంగా 1230 పరుగులు సాధించాడు. వన్డేల్లో అతడి సగటు ఏకంగా 72.35 ఉండటం గమనార్హం. ఈ ఏడాడి అతడు ఏకంగా ఆరు సెంచరీలు సాధించాడు. ఈ నేపథ్యంలో జహీర్ ఇండియా టూడేతో మాట్లాడుతూ.. వన్డే క్రికెట్లో గిల్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు గిల్ అదరగొట్టాడు. అతడు ఈ ఫార్మాట్లో సెంచరీలు, డబుల్ సెంచరీ సాధించాడు. కచ్చితంగా ఈ మెగా టోర్నీలో టాప్ రన్ స్కోరర్‌గా నిలుస్తాడని చెప్పుకొచ్చాడు. తొలి మ్యాచ్‌కు డౌటే.. కాగా గిల్ ప్రస్తుతం డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. తొలి మ్యాచ్‌కు అతడి అందుబాటుపై సందేహం నెలకొంది. అయితే అతడి ఆరోగ్యం కాస్త మెరుగపడినట్లు భారత హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. చదవండి: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా బ్యాటర్.. ఏబీ డివిలియర్స్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బద్దలు -
WC 2023: ఆసీస్‌తో టీమిండియా తుదిజట్టుపై ఫ్యాన్స్ స్పందన ఇలా!
వన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియా ఆరంభ మ్యాచ్‌కు కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. అక్టోబరు 8(ఆదివారం)న ఆస్ట్రేలియాతో మ్యాచ్‌తో చెన్నై వేదికగా రోహిత్ సేన ఈ ఐసీసీ టోర్నీని ఆరంభించనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ తదితర 15 మంది సభ్యులతో బీసీసీఐ జట్టును ఖరారు చేసింది. ఇందులో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో తుది జట్టు(Playing XI)లో ఎవరు ఉండాలని మీరు భావిస్తున్నారు? అన్న సాక్షి.కామ్ ప్రశ్నకు అభిమానుల నుంచి స్పందన ఇలా.. 1.రోహిత్ శర్మ- 91.1% 2.విరాట్ కోహ్లి-90.9% 3.జస్ప్రీత్ బుమ్రా-89.3% 4.రవీంద్ర జడేజా-88.3% 5.కేఎల్ రాహుల్--86.7% 6.హార్దిక్ పాండ్యా- 85.2% 7.మహ్మద్ సిరాజ్- 78.6% 8.కుల్దీప్ యాదవ్-71.6% 9.రవిచంద్రన్ అశ్విన్- 69.3% 10.శుబ్‌మన్ గిల్-66.9% 11. శ్రేయస్ అయ్యర్- 66.1% (Note: This content is neither created nor endorsed by Google) -
పాక్, ప్రోటీస్ కాదు.. వరల్డ్‌కప్ సెమీఫైనల్‌కు చెరే జట్లు ఇవే: సచిన్
క్రికెట్ అభిమానలు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన వన్డే ప్రపంచకప్-2023కు గురువారం(ఆక్టోబర్ 5) తెరలేచింది. అహ్మాదాబాద్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మెగా టోర్నీ సెమీఫైనల్‌కు చెరే నాలుగు జట్లను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కకర్ ఎంచుకున్నాడు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లను సెమీఫైనల్ ఫేవరేట్లగా 'మాస్టర్ బ్లాస్టర్' ఎంపిక చేశాడు. "భారత జట్టు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. అదే విధంగా వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసిన జట్టు కూడా చాలా సమతుల్యంగా ఉంది. కచ్చితంగా టీమిండియా సెమీస్‌కు చేరుతోంది. అదే విధంగా ఆస్ట్రేలియా కూడా అత్యుత్తమంగా ఉంది. కాబట్టి వారు సెమీఫైనల్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇక మూడో జట్టుగా డిఫెండింగ్ చాంపియన్స్ ఇంగ్లండ్ కూడా పటిష్టంగా ఉంది. ఇంగ్లీష్ జట్టు కూడా మరోసారి టైటిల్ బరిలో ఉంటుంది. ఇంగ్లండ్ జట్టులో హ్యారీ బ్రూక్, సామ్ కుర్రాన్ వంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. ఇక నా నాల్గువ జట్టు న్యూజిలాండ్. కివీస్ వరుసగా రెండు సార్లు ఫైనల్‌కు చేరింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో న్యూజిలాండ్ ఎల్లప్పుడూ బాగా రాణిస్తుంది. కివీస్ కూడా కచ్చితంగా టాప్-4లో ఉంటుందని" ఐసీసీ డిజిటిల్ ఇన్‌సైడర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ పేర్కొన్నాడు. చదవండి: World Cup 2023: ఇంగ్లండ్‌కే చుక్కలు చూపించాడు.. ఎవరీ రచిన్ రవీంద్ర? భారత్‌తో సంబంధం ఏంటి? -
టీమిండియాతో తొలి మ్యాచ్.. ఆసీస్ తుది జట్టు ఇదే! స్టార్ ఆల్‌రౌండర్‌కు నో ఛాన్స్
వన్డే ప్రపంచకప్-2023 సమరానికి మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. అహ్మదాబాద్ వేదికగా గురువారం జరగనున్న ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ఈ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కోసం ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్లు తీవ్రంగా శ్రమించాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. భారత్‌తో తొలి పోరు.. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ టోర్నీలో ఐదు సార్లు వరల్డ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 8న చెన్నై వేదికగా తలపడనుంది. ఈ క్రమంలో టీమిండియాతో మ్యాచ్ కోసం ఆసీస్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఆ జట్టు మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఎంపిక చేశాడు. వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసిన జట్టులోని చాలా మంది ఆటగాళ్లు ప్లేయింగ్ ఎలెవన్‌లో తమ స్ధానాలను సుస్ధిరం చేసుకున్నారని ఫించ్ వెల్లడించాడు. అదే విధంగా ఆరో బౌలింగ్ ఆప్షన్ కోసం మార్కస్ స్టోయినిస్, కామెరాన్ గ్రీన్ మధ్య తీవ్రమైన పోటీ ఉందని ఫించ్ అభిప్రాయపడ్డాడు. కాగా ఆస్ట్రేలియాకు చెందిన కోడ్ స్పోర్ట్స్ నివేదిక ప్రకారం.. భారత్‌తో తొలి మ్యాచ్‌కు స్టోయినిష్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. స్టోయినిష్ ప్రస్తుతం చేతివేలి గాయంతో బాధపడుతున్నాడు. ఫించ్ కోడ్ స్పోర్ట్‌తో మాట్లాడుతూ.. "మొదటి మ్యాచ్‌కు ఎవరో ఒక ఆల్‌రౌండర్ కచ్చితంగా దూరం అవుతారు. ఎందుకంటే ఆసీస్ దగ్గర మార్కస్ స్టోయినిస్, కామెరాన్ గ్రీన్ రూపంలో ఇద్దరూ ఫాస్ట్‌బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఉన్నారు. నా వరకు అయితే తుది జట్టులో డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్,స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, అలెక్స్ క్యారీ, గ్రీన్, ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, హాజిల్ వుడ్, జంపా తుది జట్టులో ఉండవచ్చు అని అన్నాడు. కాగా ఫించ్ కూడా స్టోయినిష్కు తన ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఇవ్వలేదు. ఆసీస్ వరల్డ్‌కప్ ప్రిపేరేషన్ గురించి మాట్లాడుతూ.. ఈ మెగా టోర్నీకి ఆస్ట్రేలియా సిద్దంగా ఉందని నేను భావిస్తున్నాను. ఈ ఈవెంట్ కోసం గత ఆరు ఏడు వారాల నుంచి మా బాయ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే జట్టులో కొంతమంది ఆటగాళ్లు గత కొంత కాలంగా తక్కువ క్రికెట్ మాత్రమే ఆడారు. అది కాస్త ఆందోళన కలిగించే ఆంశంమని ఫించ్ చెప్పుకొచ్చాడు. భారత్‌తో మ్యాచ్‌కు ఫించ్ ఎంచుకున్న ఆసీస్ తుది జట్టు: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్,స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, అలెక్స్ క్యారీ, గ్రీన్, ప్యాట్ కమ్మిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, హాజిల్ వుడ్, జంపా చదవండి: Gautam Gambhir: వన్డేల్లో ఇదే చివరి ప్రపంచకప్ టోర్నీ? ఆ బద్దకస్తులంతే! సిరాజ్, బుమ్రా సూపర్.. -
WC 2023: వన్డేల్లో ఇదే చివరి ప్రపంచకప్? ఆ బద్దకస్తులు అంతే! మనోళ్లు మాత్రం..
ICC ODI WC 2023: ‘‘ఒక గొప్ప ఉత్సవానికి సిద్ధమవుతున్న తరుణంలో దానికి పూర్తిగా ముగింపు పలకాలనే వార్తలు కూడా వినిపిస్తుండటం దురదృష్టకరం. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇస్తూ గొప్ప ఘనతల గురించి చెప్పి భావోద్వేగాలకు గురి చేసి ఇక మీ సమయం ముగిసిందని చెప్పడం ఎలాగో ఇదీ అలాగే ఉంది. 50 ఓవర్ల ఫార్మాట్లో ఇదే చివరి ప్రపంచకప్ అంటూ కొందరు చేతకాని, దూరదృష్టి లేని, బద్ధకస్తులైన క్రికెట్ పరిపాలకులు అంటున్నారు. నాకు తెలిసి అన్ని మార్పుల్లాగే ఈతరం వారి కోసం వన్డేలకు కూడా కొన్ని మార్పులతో హంగులు అద్దడం అవసరం. టి20ల్లో ఒక్కసారి దెబ్బ పడితే కోలుకునే అవకాశం ఉండదు. మళ్లీ ప్రతీకారం తీర్చుకోవచ్చు కానీ వన్డేల్లో అలా కాదు. ఒక బౌలర్ ఆరంభంలో భారీగా పరుగులిచ్చినా చివర్లో మళ్లీ ప్రతీకారం తీర్చుకోవచ్చు. వన్డేల్లో కెప్టెన్లు ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో ఈ వరల్డ్‌కప్‌లో మనం చూడబోతున్నాం’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అన్నాడు. వన్డే ఫార్మాట్లో ప్రపంచ టోర్నీకి ముగింపు అంటూ అభిప్రాయపడటం మూర్ఖత్వమే అని విమర్శించాడు. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గంభీర్ వన్డే వరల్డ్‌కప్ ప్రాముఖ్యత, టీమిండియా గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. సిరాజ్, బుమ్రా సూపర్ ఈ మేరకు.. ‘‘గిల్, సిరాజ్, శ్రేయస్లాంటి వారిని అభిమానులకు మరింత చేరువ చేయాల్సి ఉంది. బౌలర్లు బాగా ప్రభావం చూపించడాన్ని మనం గుర్తించాలి. ఇటీవల ఆసియా కప్‌లో సిరాజ్, బుమ్రా కలిసి శ్రీలంకను 50 పరుగులకు కుప్పకూల్చడం చూసి చాలా సంతోషం వేసింది. అలాంటి అద్భుత బౌలింగ్‌నూ చూడాలని అభిమానులు అనుకుంటారు. ఈ తరహాలో బ్యాట్‌కు, బంతికి మధ్య సమతూకం ఉంచేందుకు వరల్డ్ కప్ నిర్వాహకులకు ఇదే సరైన అవకాశం. భారత జట్టు బాగా ఆడటం కూడా దీనికి మేలు చేస్తుంది. నా దృష్టిలో టైటిల్ గెలిచేందుకు భారత్, ఇంగ్లండ్‌లకు మంచి అవకాశం ఉంది. మంచు ప్రభావం ఉన్నప్పుడు బుమ్రా ఎలా బౌలింగ్ చేస్తాడనేది ఆసక్తికరం’’ అని గంభీర్ పేర్కొన్నాడు. అదే విధంగా.. ‘‘వరల్డ్ కప్ జరిగే ఇతర నగరాల్లోనూ ఇలాగే ఉండటం మంచి విషయం. ఆటను ఆస్వాదిస్తూ.. పర్యావరణ హితంగా ప్రపంచకప్ జరిగే సమయంలోనే దసరా, దీపావళి వస్తున్నాయి. ఆ సమయంలో బాణసంచా కాల్చకుండా వన్డే క్రికెట్లో బంతి, బ్యాట్ శబ్దాలు వినగలిగితే చాలు’’ అంటూ ఆటను ఆస్వాదిస్తూనే పర్యావరణ హితాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని అభిమానులకు సూచించాడు. కాగా గంభీర్ 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్లలో గౌతం గంభీర్ కీలక సభ్యుడన్న విషయం తెలిసిందే. చదవండి: ఇంగ్లండ్- న్యూజిలాండ్ తొలి పోరు.. ఎవరి బలాబలాలు ఎంత..? -
1987లో జన్మించిన కెప్టెన్‌దే ఈసారి వరల్డ్‌కప్ ట్రోఫీ! లిస్టులో ఎవరంటే!
ICC World Cup 2023 Winner Prediction: మరో రెండు రోజుల్లో వన్డే ప్రపంచకప్-2023 టోర్నీకి తెరలేవనుంది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్- గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా అక్టోబరు 5న ఈ మెగా క్రికెట్ సమరం మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టాప్-4 జట్లు, విజేతపై విశ్లేషకులు సహా అభిమానులు సైతం తమ అంచనాలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో సైంటిఫిక్ ఆస్ట్రాలజర్ గ్రీన్‌స్టోన్ లోబో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అతడే వరల్డ్‌కప్ గెలుస్తాడు లోబో అంచనా ప్రకారం.. 1987వ సంవత్సరంలో జన్మించి.. ఇప్పుడు ఓ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న వ్యక్తి ఈసారి వరల్డ్‌కప్ ట్రోఫీ గెలుస్తాడట. ఇందుకు ఉదాహరణలు చెబుతూ.. 1986, 1987లో జన్మించిన ప్లేయర్లు, క్రీడా జట్లకు నాయకులుగా ఉన్న వాళ్లు మేజర్ స్పోర్ట్ ఈవెంట్లలో విజేతలుగా నిలుస్తున్నారని లోబో పేర్కొన్నాడు. జొకోవిచ్, మెస్సీ అలాగే.. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. 1987లో పుట్టిన టెన్నిస్ సూపర్ స్టార్ నొవాక్ జొకోవిచ్, 2018 ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్‌ను విజేతగా నిలిపిన కెప్టెన్ హ్యూగో లోరిస్(1986), 2022లో ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీ గెలిచిన అర్జెంటీనా సారథి లియోనల్ మెస్సీ(1987)ల పేర్లను లోబో ఉటంకించాడు. మోర్గాన్ కూడా అంతే ఇక క్రికెట్లో ఇందుకు ఉదాహరణగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ పేరును అతడు ప్రస్తావించాడు. 1986లో జన్మించిన మోర్గాన్ 2019లో ఆ జట్టును జగజ్జేతగా నిలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెంటిమెంట్ ప్రకారం.. ఈసారి 1987లో జన్మించిన వ్యక్తి కప్ గెలుస్తాడంటూ లోబో జోస్యం చెప్పాడు. షకీబ్ 1987లో జన్మించాడు.. అయితే.. ఈ మేరకు.. ‘‘ షకీబ్ అల్ హసన్ 1987లో జన్మించాడు. అయితే, బంగ్లాదేశ్ జట్టు మరీ అంత గొప్పగా ఏమీ లేదు. కాబట్టి 1987లో జన్మించిన మరో కెప్టెన్‌దే ఈసారి వరల్డ్‌కప్ టైటిల్’’ అంటూ టీమిండియా సారథి రోహిత్ శర్మ పేరును చెప్పకనే చెప్పాడు లోబో. కాగా బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ మార్చి 24, 1987లో జన్మించగా.. రోహిత్ శర్మ ఏప్రిల్ 30, 1987లో పుట్టాడు. ఇదిలా ఉంటే.. సొంతగడ్డపై టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న భారత జట్టు 2011 నాటి ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. ఇక అక్టోబరు 8న టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. చదవండి: టీమిండియా స్టార్ భావోద్వేగం.. జాతీయ గీతం ఆలపిస్తూ కంటతడి! -
'పాక్, దక్షిణాఫ్రికా కాదు.. వరల్డ్‌కప్ సెమీఫైనల్‌కు చేరే జట్లు ఇవే'
వన్డే వరల్డ్‌కప్-2023 మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్లో సెమీఫైనల్‌కు చేరే జట్లను భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఎంచుకున్నాడు. భారత్, ఇంగ్లండ్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు చేరుతాయని అతడు అంచనా వేశాడు. "రాబోయే ఏడు వారాలు క్రికెట్ అభిమానులకు అన్ని రకాల వినోదం ఉండబోతుంది. 12 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్ భారత్‌కు తిరిగి వస్తోంది. సుదీర్ఘంగా సాగే ఈ మెగా టోర్నీలో మొత్తం పది జట్లు మిగతా జట్లతో ఒక్కోసారి తలపడతాయి. లీగ్ దశ ముగిశాక ఆతిథ్య భారత్, ఇంగ్లండ్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ జట్లు నాకౌట్ దశ సెమీఫైనల్‌కు చేరుకుంటాయని అంచనా. మాజీ విజేత భారత్, డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ జట్లను కచ్చితమైన టైటిల్ ఫేవరెట్స్‌గా పరిగణిస్తాను. భారత బ్యాటర్లతోపాటు బౌలర్లు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. చివరి నిమిషంలో గాయపడ్డ అక్షర్ పటేల్ స్థానంలో వెటరన్ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ జట్టులోకి రావడం భారత్‌కు మరింత మేలు చేసే విషయం. ఇక ఇంగ్లండ్ దూకుడైన ఆటతో తమకంటూ ప్రత్యేక బ్రాండ్‌ను సృష్టించుకుంది. బెన్ స్టోక్స్ కూడా అందుబాటులోకి రావడంతో ఇంగ్లండ్ మరింత పటిష్టంగా మారింది. బౌలింగ్‌లోనూ కెప్టెన్ జోస్ బట్లర్‌కు ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. పెద్ద టోరీ్నల్లో, కీలక సమయాల్లో పైచేయి సాధించడం ఆస్ట్రేలియా జట్టుకు అలవాటు. అందుకే ఆ జట్టు ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచింది. ఎన్నో సీజన్ల నుంచి ఐపీఎల్ ఆడటంద్వారా చాలా మంది ఆ్రస్టేలియా ఆటగాళ్లకు ఇక్కడి పరిస్థితులపై మంచి అవగాహన ఏర్పడింది. ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ప్రదర్శన ఆస్ట్రేలియాకు కీలకం కానుంది. ప్రపంచకప్‌లో అత్యంత నిలకడమైన జట్లలో ఒకటిగా న్యూజిలాండ్‌కు పేరుంది. కేన్ విలియమ్సన్ రూపంలో ఆ జట్టులో సూపర్‌స్టార్ ఉన్నా... మిగతా ఆటగాళ్లు కూడా చివరి వరకు పోరాడేందుకు వెనుకాడరు. ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్ లేకపోవడం ఆ జట్టుకు లోటుగా ఉన్నా అతడి లేని లోటును భర్తీ చేసే ఆటగాళ్లు న్యూజిలాండ్ జట్టులో చాలా మంది ఉన్నారు అని ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ పేర్కొన్నాడు. చదవండి: ప్రపంచకప్‌కు ముందు అన్ని జట్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన న్యూజిలాండ్ -
WC 2023: మునుపటిలా లేదు.. కానీ ఆ జట్టు సెమీస్ చేరితే ఆపడం కష్టం!
ICC ODI World Cup 2023: 1987, 1999, 2003, 2007, 2015... ఏకంగా ఐదుసార్లు వన్డే ప్రపంచకప్ గెలిచిన ఘనత ఆస్ట్రేలియా సొంతం. పటిష్టమైన కంగారూ జట్టుతో పోటీ అంటే ప్రత్యర్థి జట్లకు ఒకప్పుడు వణుకుపుట్టేది! కానీ గత కొన్నాళ్లుగా ఆసీస్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. 2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో సెమీస్‌లోనే నిష్క్రమించిన ఆస్ట్రేలియా.. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో సెమీ ఫైనల్‌కు కూడా చేరలేకపోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. గతంలో మాదిరి ఆస్ట్రేలియా పటిష్ట జట్టుగా కనిపించడం లేదని పేర్కొన్నాడు. అయితే, వన్డే వరల్డ్‌కప్-2023లో టాప్-4కు చేరితే మాత్రం వారిని ఆపడం కష్టమని ఇతర జట్లకు వార్నింగ్ ఇచ్చాడు. మునుపటిలా లేదు.. కానీ ‘‘ఆస్ట్రేలియా ఇంతకు ముందున్నట్లు లేదు. వాళ్లు ఇంతవరకు మెగా టోర్నీలో ఆడే తమ వికెట్ కీపర్‌ను ఫైనల్ చేయలేదు. జోష్ ఇంగ్లిస్, అలెక్స్ క్యారీ ఇద్దరూ మంచి ఆటగాళ్లే. కానీ ఇద్దరిలో ఒక్కరికే చోటు దక్కుతుంది. మాక్స్వెల్ వికెట్లు తీస్తున్నాడు. కానీ.. జట్టు అతడి నుంచి బ్యాటింగ్ మెరుపులు ఆశిస్తోంది. స్పిన్‌ను ఎదుర్కోవడంలో ఆసీస్ బ్యాటర్లు తడబడటం ఆందోళన కలిగించే అంశం. ఇక కామెరాన్ గ్రీన్, మార్కస్ స్టొయినిస్ పోషించాల్సిన పాత్రలేమిటో కూడా ఇంతవరకు స్పష్టం కాలేదు. నిజానికి గ్రీన్ కంటే స్టొయినిస్ బెటర్. లోయర్ ఆర్డర్లో మెరుగ్గా బ్యాటింగ్ చేయగలడు. నా వరకైతే ఈ జట్టు బాగానే అనిపిస్తోంది. ఫైనల్ ఫోర్ జట్లలో ఆస్ట్రేలియా కూడా ఫేవరెట్ అనడంలో సందేహం లేదు. పరిస్థితులు ఎలా ఉన్నా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్ ఆసీస్‌ను సెమీస్‌కు చేర్చగలరు. ఒక్కసారి సెమీస్ చేరితే ఆపడం కష్టం ఒక్కసారి టాప్-4లో అడుగుపెడితే నాకౌట్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా అత్యంత ప్రమాదకారిగా మారి ప్రత్యర్థి జట్లకు సవాల్ విసరడం ఖాయం’’ అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా గతేడాది సొంతగడ్డపై జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆసీస్ కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది. ఇక తాజా ప్రపంచకప్‌నకు ముందు దక్షిణాఫ్రికాతో 2-3తో.. టీమిండియాతో 2-1తో వన్డే సిరీస్‌ను కోల్పోయింది. కాగా అక్టోబరు 8న రోహిత్ సేనతో మ్యాచ్‌తో ఆస్ట్రేలియా వన్డే వరల్డ్‌కప్-2023 ప్రయాణాన్ని ఆరంభించనుంది. చదవండి: కోహ్లి కాదు! అతడికి బౌలింగ్ చేయడం కష్టం.. మోస్ట్ డేంజరస్: పాక్ వైస్ కెప్టెన్ -
WC2023: అతడి ఆట అద్భుతం.. గేమ్ ఛేంజర్ తనే: యువరాజ్ సింగ్
ICC ODI World Cup 2023: గత పదిహేనేళ్లలో టీమిండియా గెలిచిన రెండు ప్రపంచకప్ టోర్నీల్లో ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పాత్ర మరువలేనిది. పొట్టి ఫార్మాట్లో ప్రవేశపెట్టిన తొలి వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో యువీ సభ్యుడు. 2007 నాటి ఆ ఈవెంట్లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు.. యువీ సృష్టించిన ఈ అరుదైన రికార్డు క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ఇక వన్డే వరల్డ్‌కప్-2011లో యువరాజ్ సింగ్ అద్భుతమైన ఆట తీరుతో టీమిండియా ట్రోఫీ గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. నాడు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ నాటి టోర్నీలో ఈ లెఫ్టాండ్ బ్యాటర్ మొత్తంగా 362 పరుగులు సాధించడంతో పాటు.. 15 వికెట్లు పడగొట్టాడు. గేమ్ ఛేంజర్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు కూడా అందుకున్నాడు. ఇక మరోసారి భారత్ వేదికగా 50 ఓవర్ల ఫార్మాట్లో ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో యువరాజ్ సింగ్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గేమ్ ఛేంజర్ అతడే ఈసారి టీమిండియా యువ సంచలనం శుబ్‌మన్ గిల్ గేమ్ ఛేంజర్ అవుతాడని అభిప్రాయపడ్డాడు. ‘‘అతడు ఇప్పటికే స్టార్ బ్యాటర్‌గా ఎదిగాడు. ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈసారి తనే గేమ్ ఛేంజర్ అవుతాడని నా నమ్మకం. అన్ని అవరోధాలను తప్పక అధిగమిస్తాడు. ఎవరైతే దూకుడుగా ఆడుతూ మంచి ఫామ్‌లో ఉంటారో అలాంటి ఆటగాడు తప్పక టీమిండియాకు విజయాలు అందిస్తాడు. గిల్ నుంచి నేను ఆశిస్తున్నది ఇదే’’ అని టైమ్స్ నౌతో యువీ వ్యాఖ్యానించాడు. చదవండి: సచిన్, కోహ్లి కాదు! అతడికి బౌలింగ్ చేయడం చాలా కష్టం: డేల్ స్టెయిన్ -
'భారత్, ఆసీస్, పాక్ కాదు.. ఆ జట్టే వరల్డ్‌కప్ టైటిల్ ఫేవరేట్'
వన్డే ప్రపంచకప్-2023 మహా సంగ్రామానికి సమయం అసన్నమైంది. ఆక్టోబర్ 5 అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్- ఇంగ్లండ్ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఇప్పటికే భారత గడ్డపై అడుగు పెట్టిన ఆయా జట్లు వామాప్ మ్యాచ్‌ల్లో బీజీబీజీగా ఉన్నాయి. ఇక బారత జట్టు తమ వామాప్ మ్యాచ్‌లో సెప్టెంబర్ 30న గౌహుతి వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌తో తలపడనుంది. అదే విధంగా ఆక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్‌తో టీమిండియా తమ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఇక ఇది ఇలా ఉండగా.. వన్డే ప్రపంచకప్ టైటిల్ ఫేవరేట్‌ను భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఎంచుకున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న ఇంగ్లండ్ మరోసారి టైటిల్‌ను సొంతం చేసుకుందని గవాస్కర్ జోస్యం చెప్పాడు. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన గవాస్కర్ ప్రపంచ కప్ గెలవడానికి ఇంగ్లండ్‌కు అన్నిరకాల అర్హతలున్నాయని సన్నీ చెప్పాడు. కాగా 2019 ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. "నావరకు అయితే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ తమ వద్దే ట్రోఫీని ఉంచుకుంటుంది. ఇంగ్లండ్ బ్యాటింగ్ విభాగంలో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. అదే విధంగా బ్యాట్, బంతితో మ్యాచ్ స్వరూపాన్నే మార్చగల ముగ్గురు వరల్డ్ క్లాస్ ఆల్‌రౌండర్లు ఉన్నారు. అంతేకాకుండా మార్క్ వుడ్, అదిల్ రషీద్ వంటి సీనియర్ బౌలర్లు కూడా ఉన్నారు. కాబట్టి మళ్లీ ఇంగ్లండ్ జట్టే టైటిల్ ఫేవరేట్" అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. చదవండి: World Cup 2023: బ్యాడ్ లక్కు బ్రాండ్ అంబాసిడర్ దక్షిణాఫ్రికా.. ప్రొటీస్‌కు కలిసిరాని వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఇవే! -
ఈసారి వరల్డ్‌కప్‌లో టాప్ స్కోరర్ టీమిండియా యువ బ్యాటర్: ఏబీడీ
ICC Cricket World Cup 2023 Top Scorer Prediction: ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీకి సమయం ఆసన్నమైంది. మరో 9 రోజుల్లో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఆతిథ్య టీమిండియా సహా ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, నెదర్లాండ్స్ తదితర పది జట్లు ఈ టోర్నీలో భాగం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే బంగ్లాదేశ్ మినహా అన్ని దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఇదిలా ఉంటే.. సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ ఆడటం రోహిత్ సేనకు సానుకూలాంశంగా మారింది. 2011 నాటి ఫలితాన్ని పునరావృతం చేసే సువర్ణావకాశం ముగింట నిలిచింది. అన్నీ మంచి శకునములే ఆసియా వన్డే కప్-2023 గెలవడంతో పాటు.. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలతో పాటు గాయాల నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఫామ్‌లోకి రావడం.. మిడిలార్డర్లో ఇషాన్ కిషన్ రాణించడం.. సూర్యకుమార్ యాదవ్ కూడా గాడిలో పడటం.. అన్నికంటే ముఖ్యంగా శుబ్‌మన్ గిల్ వైఫల్యాలకు తెరపడటం మంచి బూస్ట్‌నిచ్చింది. ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేల్లో గిల్ వరుసగా 74, 104 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈసారి టాప్ స్కోరర్ అతడే: ఏబీడీ ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది ప్రపంచకప్‌లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ టాప్ రన్ స్కోరర్‌గా నిలుస్తాడని అంచనా వేశాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ ఈసారి వరల్డ్‌కప్‌లో శుబ్‌మన్ గిల్ అత్యధిక పరుగుల వీరుడిగా నిలుస్తాడు. ప్రస్తుతం అతడు సూపర్‌ఫామ్‌లో ఉన్నాడు. గొప్ప బ్యాటర్. అతడి టెక్నిక్ అద్భుతం. స్వదేశంలో వరల్డ్‌కప్ ఆడబోతున్నాడు. కాబట్టి కొంతమేర ఒత్తిడి కూడా ఉంటుంది. అయినప్పటికీ నా ఎంపిక గిల్ మాత్రమే. ఎందుకంటే.. గిల్ ట్రెడిషినల్ షాట్స్‌కే ప్రాధాన్యం ఇస్తాడు. బౌలర్లపై ఒత్తిడి పెంచగల టెక్నిక్స్ అతడి దగ్గర ఉన్నాయి. ప్రపంచంలోనే గొప్ప బ్యాటర్‌గా.. అనతికాలంలోనే శుబ్‌మన్ మూడు ఫార్మాట్లలో ప్రపంచంలోని గొప్ప బ్యాటర్లలో ఒకడిగా ఎదుగుతాడు. యువ ఆటగాడే అయినా.. ఎంతో అనుభవం ఉన్నవాడిలా ఆడుతున్నాడు’’ అని ఏబీ డివిలియర్స్ గిల్ ఆట తీరును విశ్లేషించాడు. కాగా అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్ జరుగనుంది. చదవండి: తనని చూసేందుకు గోడ దూకి వెళ్లేవాడిని! రెండేళ్లు ఓ మినీ యుద్ధమే.. ఇప్పుడిలా.. -
'వన్డే ప్రపంచకప్ తర్వాత కోహ్లి రిటైర్మెంట్'
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. ప్రస్తుతం వన్డే ప్రపంచకప్ 2023కు సన్నద్దమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో రెండు వన్డేల దూరంగా ఉన్న కోహ్లి.. రాజ్‌కోట్ వేదికగా జరిగే ఆఖరి వన్డేకు మాత్రం అందుబాటులోకి వచ్చాడు. ఆసియాకప్-2023లో పాకిస్తాన్‌పై అద్భుత శతకంతో చెలరేగిన కింగ్ కోహ్లి.. వరల్డ్‌కప్‌లోనూ అదే దూకుడు కొనసాగించాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలో విరాట్‌ను ఉద్దేశించి దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఈ ఏడాది వరల్డ్‌కప్‌ను భారత్ సొంతం చేసుకుంటే కోహ్లి వైట్‌బాల్ క్రికెట్‌కు రిటైర్మెట్ ప్రకటించే ఛాన్స్ ఉందని ఏబీడీ బాంబు పేల్చాడు. వన్డేలు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడనికి కోహ్లికి ఇదే సరైన సమయమని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. "కోహ్లి సౌతాఫ్రికా (2027 వరల్డ్ కప్ కోసం)కు రావడానికి ఇష్టపడతాడని నాకు తెలుసు. కానీ అది చాలా కష్టం. ఎందుకంటే 2027 ప్రపంచకప్‌కు ఇంకా చాలా సమయం ఉంది. ముందు 2023 ప్రపంచకప్‌పై దృష్టిపెడదాం. బహుశా విరాట్ కోహ్లి కూడా అదే చెప్పవచ్చు. ఇక భారత్ వరల్డ్‌కప్ గెలిస్తే.. కోహ్లి పరిమిత ఓవర్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే ఛాన్స్ ఉంది. అందరికి ధన్యవాదాలు. ఇక నుంచి నేను టెస్టు క్రికెట్, ఐపీఎల్ మాత్రమే ఆడతాను. నా కెరీర్ చివరి రోజులను ఎంజాయ్ చేస్తాను. కుటంబంతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నాను. మీ అందరికీ గుడ్ బై చెబుతాను అని కోహ్లి చెప్పొచ్చు. కానీ కోహ్లి ప్రస్తుతం పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. అతడు ఎప్పటికప్పుడు విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి మరి కొన్నాళ్లపాటు ఆడాలని కూడా కోహ్లి భావించవచ్చు" అని యూట్యూబ్ ఛానల్లో డివిలియర్స్ పేర్కొన్నాడు. కాగా కోహ్లి గత కొంత కాలంగా భారత తరపున వన్డేలు, టెస్టులు మాత్రమే ఆడుతున్నాడు. చదవండి: World Cup 2023: భారత్‌ను ఓడించిన జట్టు వరల్డ్‌కప్ గెలుస్తుంది.. మా జట్టుకు దిష్టి పెట్టకు! -
WC 2023: ఈసారి ఆ అవార్డు అతడికే.. ఫైనల్లో కివీస్‌తో: మాజీ పేసర్
ICC World Cup 2023:‘‘అప్పుడు.. యువీ పాజీ జట్టు కోసం ఏం చేశాడో తెలుసుగా.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అతడి సొంతమైంది. ఈసారి అలాంటి ఆల్‌రౌండర్ ఎవరైనా ఉన్నారా అంటే అది హార్దిక్ పాండ్యానే. అతడు ఈసారి ఆ అవార్డు అందుకునే ఛాన్స్ ఉంది. టీమిండియాకు అత్యంత ప్రధానమైన ఆటగాడు’’ అని టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ అన్నాడు. వన్డే వరల్డ్‌కప్-2011లో యువరాజ్ సింగ్ మెరుపుల మాదిరే ఈసారి పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుతం చేయగలడని జోస్యం చెప్పాడు. అదే విధంగా హార్దిక్‌తో పాటు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు కూడా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలిచే అవకాశాలున్నాయని శ్రీశాంత్ పేర్కొన్నాడు. వాళ్లిద్దరు కూడా ఇక అవార్డుకు మూడో పోటీదారు జస్ప్రీత్ బుమ్రా అని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. ‘‘హార్దిక్ ఫాస్టెస్ట్ హండ్రెడ్ మర్చిపోవదు.. అలాగే బుమ్రా రెండు 5- వికెట్ హాల్స్ గుర్తున్నాయి కదా! ఇక మునుపెన్నడూ లేని విధంగా.. కుల్దీప్ యాదవ్ అద్భుత స్పెల్‌తో దూసుకుపోతున్నాడు. ఇవన్నీ గమనిస్తే ఈసారి ఈ ముగ్గురిలో ఒకరికి అవార్డు రావడం ఖాయమని అనిపిస్తోంది’’ అని శ్రీశాంత్ స్పోర్ట్స్‌కీడాతో వ్యాఖ్యానించాడు. అదే విధంగా.. వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో టీమిండియాతో న్యూజిలాండ్‌ను చూస్తామని శ్రీశాంత్ తన అంచనా తెలియజేశాడు. ఈసారి కప్పు మనదే 2019లో సెమీస్‌లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకునేందుకు భారత్.. కివీస్‌ను తప్పక ఓడించాలని ఆకాంక్షించాడు. ఈసారి కప్పు టీమిండియాదే అని ధీమా వ్యక్తం చేశాడు. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023 ఆరంభం కానుంది. ఇక టీమిండియా అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో.. టోర్నీలో తమ ఆరంభ మ్యాచ్ ఆడనుంది. కాగా 2011లో సొంతగడ్డపై ధోని సేన విశ్వవిజేతగా అవతరించిన విషయం తెలిసిందే. ఇందులో కీలక పాత్ర పోషించిన యువీ మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్నాడు. ఇక శ్రీశాంత్ కూడా ఈ జట్టులో సభ్యుడన్న సంగతి తెలిసిందే. చదవండి: Ind vs Aus: తప్పు నీదే.. వరల్డ్‌కప్ జట్టు నుంచి తీసేయడం ఖాయం.. జాగ్రత్త! -
WC 2023: ఈసారి వరల్డ్‌కప్ ఫేవరెట్లు ఆ ఐదు జట్లే! కానీ..
ICC World Cup 2023: వన్డే వరల్డ్‌కప్-2023కి సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య అక్టోబరు 5న ఈ ఐసీసీ ఈవెంట్ 13వ ఎడిషన్ మొదలుకానుంది. పుష్కర కాలం తర్వాత భారత్ ఆతిథ్య ఇస్తున్న ఈ మెగా టోర్నీలో టీమిండియా సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, శ్రీలంక, నెదర్లాండ్స్ తదితర పది జట్లు పాల్గొనబోతున్నాయి. 2011లో.. తర్వాత మళ్లీ ఇప్పుడే ఇక సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో రోహిత్ సేన హాట్ ఫేవరెట్ అనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఆసియా వన్డే కప్-2023 గెలిచి జోరు మీదున్న భారత జట్టు 2011 నాటి ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ బెన్ స్టోక్స్ రాకతో మరింత పటిష్టంగా మారగా.. ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా కూడా బలమైన ప్రత్యర్థిగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(బార్డ్) వరల్డ్‌కప్-2023లో ఫేవరెట్లు ఎవరన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ఈ ఐదు జట్లు ఫేవరెట్.. కానీ ‘‘వన్డే క్రికెట్లో ప్రపంచంలోనే ఇండియా టాప్ ర్యాంకులో ఉంది. అదీగాకుండా ఈసారి స్వదేశంలో టోర్నీ జరుగనుంది. కాబట్టి వాళ్లకు హోం అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఇక ఇంగ్లండ్.. డిఫెండింగ్ చాంపియన్ కూడా పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌తో స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. ఆస్ట్రేలియాకు అపార అనుభవం ఉంది. కాబట్టి ఆసీస్ జట్టు కూడా ఎప్పుడూ బలమైన పోటీదారే. పాకిస్తాన్ కూడా తనదైన రోజున అత్యంత ప్రమాదకారిగా మారుతుంది. పాక్ జట్టులో చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ఇక సౌతాఫ్రికా కూడా గత కొన్నేళ్లుగా మెరుగ్గా ఆడుతోంది. సమతూకమైన జట్టుగానూ ఉంది. న్యూజిలాండ్, శ్రీలంక కూడా సవాల్ విసరగలుగుతాయి. అయితే, ఐసీసీ వరల్డ్‌కప్ విజేత ఎవరన్న అంశంపై అంచనా వేయడం కష్టం. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ప్రస్తుత ఫామ్, ర్యాంకింగ్ దృష్ట్యానే ఈ టీమ్‌లను ఎంచుకోవడం జరిగింది’’ అని బార్డ్ సమాధానమిచ్చింది. చదవండి: Ind vs Aus: తప్పు నీదే.. వరల్డ్‌కప్ జట్టు నుంచి తీసేయడం ఖాయం.. జాగ్రత్త! -
WC 2023: కోహ్లి, రోహిత్ కాదు.. వరల్డ్‌కప్‌లో బాబర్ దుమ్ములేపుతాడు: గంభీర్
ICC ODI WC 2023- Gambhir Comments On Babar Azam: మరో రెండు వారాల్లో క్రికెట్ మెగా సమరానికి తెర లేవనుంది. భారత్ వేదికగా పుష్కర కాలం తర్వాత వన్డే వరల్డ్‌కప్ జరుగనుంది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్- గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో అక్టోబరు 5న ఐసీసీ ఈవెంట్ షురూ కానుంది. ఇక ఈ మెగా టోర్నీలో అక్టోబరు 14న దాయాదులు భారత్- పాకిస్తాన్ ఢీకొట్టనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే చిరకాల ప్రత్యర్థుల పోరుపై ఇరు దేశాల మాజీలు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఫైర్ సెట్ చేసేది అతడే ప్రపంచకప్-2023లో తాను పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఆట కోసమే ఎదురుచూస్తున్నానని గౌతీ పేర్కొన్నాడు. బాబర్ నైపుణ్యాలు అమోఘమని.. వరల్డ్‌కప్‌లో ఫైర్ సెట్ చేసేది అతడే అని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, జో రూట్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నా గానీ.. బాబర్ వేరే లెవల్ అంటూ ఆకాశానికెత్తాడు. బాబర్ ఆజంలోని ప్రత్యేక స్కిల్‌సెట్ అతడిని ఈ స్థాయిలో నిలిపిందంటూ వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌పై గౌతం గంభీర్ ప్రశంసలు కురిపించాడు. మాకు కింగ్, హిట్‌మ్యాన్ మాత్రమే ఫేవరెట్ కాగా గంభీర్ వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. ఆసియా కప్-2023లో బాబర్ ఆజం ప్రదర్శన చూశాక కూడా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు గంభీర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సొంతగడ్డపై కింగ్ కోహ్లి, హిట్‌మ్యాన్ రోహిత్ మాత్రమే తమ ఫేవరెట్లు అంటూ సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేస్తున్నారు. ఇక ఆసియా వన్డే కప్ తాజా ఎడిషన్‌లో నేపాల్‌పై 151 పరుగులతో చెలరేగిన బాబర్ ఆజం.. ఆ తర్వాత స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చతికిలపడ్డాడు. 17 (22), 10 (24) 29 (35) స్కోర్లతో పూర్తిగా నిరాశపరిచాడు. టీమిండియా చేతిలో ఘోర పరాభవం కెప్టెన్‌గానూ జట్టును కనీసం ఫైనల్‌కు కూడా చేర్చలేకపోయాడు. ముఖ్యంగా టీమిండియా చేతిలో సూపర్-4లో 228 పరుగుల తేడాతో ఓటమి పాలు కావడం పాక్ జట్టు వైఫల్యాలను ఎత్తిచూపింది. ఈ నేపథ్యంలో గౌతీ.. బాబర్ పేరును ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించడం విశేషం. అది కూడా గతంలో.. ఒక్క పాక్ క్రికెటర్‌ను కూడా గౌతీ ప్రశంసించిన దాఖలాలు లేకపోవడంతో ఈసారి అతడి ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇక నెదర్లాండ్స్‌తో అక్టోబరు 6 నాటి మ్యాచ్‌తో పాక్ తమ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని ఆరంభించనుంది. చదవండి: Ind vs Aus: తప్పు నీదే.. వరల్డ్‌కప్ జట్టు నుంచి తీసేయడం ఖాయం.. జాగ్రత్త! .@GautamGambhir will eagerly watch out for @babarazam258's performance this #CWC2023. 👀 Will Babar prove to be the BEST against the rest on the BIGGEST stage?#WorldCupOnStar#Cricket pic.twitter.com/CwccE3r5JI — Star Sports (@StarSportsIndia) September 23, 2023 -
WC: కోహ్లి, బట్లర్, బాబర్ కాదు! ఈసారి వరల్డ్‌కప్‌లో టాప్ రన్ స్కోరర్ అతడే!
ICC ODI WC 2023 Top Scorer Prediction: వన్డే వరల్డ్‌కప్-2023 నేపథ్యంలో ఇంగ్లండ్ టెస్టు జట్టు మాజీ కెప్టెన్ జో రూట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఐసీసీ టోర్నీలో అత్యధిక పరుగులు చేసే బ్యాటర్ ఇతడేనంటూ ఎవరూ ఊహించని పేరును చెప్పాడు. టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లి, ఇంగ్లండ్ సారథి జోస్ బట్లర్, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం, భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. వంటి స్టార్లందరినీ కాదని సహచర ఆటగాడికే ఓటువేశాడు. స్టోక్స్ అద్బుత ఇన్నింగ్స్ కారణంగా 2019లో సొంతగడ్డపై తొలిసారిగా విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లండ్ జట్టులో జో రూట్ సభ్యుడన్న విషయం తెలిసిందే. నాటి ఈ మెగా ఈవెంట్లో ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి మోర్గాన్ బృందం జగజ్జేతగా అవతరించింది. ఆనాటి మ్యాచ్‌లో బెన్‌స్టోక్స్ 84 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌ను రేసులో నిలిపి విజయం అందించాడు. ఈ క్రమంలో వరల్డ్‌కప్-2019లో ఇంగ్లండ్ హీరోగా నీరాజనాలు అందుకున్న స్టోక్స్.. మళ్లీ బరిలోకి దిగేందుకు వీలుగా వన్డేల రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కితీసుకున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి మేరకు మెగా టోర్నీలో ఆడేందుకు అంగీకరించాడు. ఆ ‘హీరో’ పేరు చెప్పలేదు! అయితే, ప్రపంచకప్-2023లో టాప్ రన్‌స్కోరర్‌గా రూట్.. స్టోక్స్ పేరు చెప్పాడనుకుంటున్నారా? కానే కాదు... ఆశ్చర్యకరంగా ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోను ఎంచుకున్నాడు. ‘‘తనను తాను నిరూపించుకోవడంలో జానీ ఎల్లప్పుడూ ముందే ఉంటాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్బుతమైన ఆటగాడు. టాపార్డర్‌లో గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. జేసన్రాయ్తో కలిసి గొప్ప భాగస్వామ్యాలు నమోదు చేసిన ఘనత అతడిది. పవర్‌ప్లేలో విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడగలడు. ఈసారి ప్రపంచకప్‌లో మరింత గొప్పగా రాణిస్తాడనుకుంటున్నా. నా ఛాయిస్ జానీ బెర్‌స్టో’’ అని ఐసీసీతో రూట్ వ్యాఖ్యానించాడు. ఇందుకు సంబంధించిన నెట్టింట చక్కర్లు కొడుతోంది. బెయిర్‌స్టో గణాంకాలు ఇలా కాగా 33 ఏళ్ల జానీ బెయిర్‌స్టో ఇంగ్లండ్ తరఫున ఇప్పటి వరకు 95 వన్డేలు ఆడాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ సాధించిన పరుగులు 3634. కాగా అక్టోబరు 5న భారత్ వేదికగా ఇంగ్లండ్- న్యూజిలాండ్ మ్యాచ్‌తో ప్రపంచకప్-2023 ఈవెంట్‌కు తెరలేవనుంది. చదవండి: వరల్డ్‌కప్ తర్వాత ద్రవిడ్ బై.. బై! నాడు అతడు ‘బలిపశువు’.. కొత్త కోచ్‌గా అతడే? సిగ్గుపడు రోహిత్! నువ్వసలు కెప్టెన్వేనా?.. వాళ్లకు ఉన్నపాటి బుద్ధి నీకు లేదు! View this post on Instagram A post shared by ICC (@icc) -
ఈసారి ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక వికెట్ల వీరుడు అతడే: విండీస్ దిగ్గజం
ICC World Cup 2023- Leading Wicket Taker Prediction: క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం వన్డే వరల్డ్‌కప్ ఫీవర్ నడుస్తోంది. మెగా ఈవెంట్‌కు ఇంకా నెలరోజులకు పైగా సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే డిబేట్లు మొదలయ్యాయి. ఐసీసీ టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచేదెవరు? టాప్ వికెట్ టేకర్ అయ్యేదెవరు? తదితర అంశాల గురించి క్రికెట్ దిగ్గజాలు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. కలిస్ ఓటు అతడికి.. సెహ్వాగ్ అంచనా ఇతడిపై ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్వహిస్తున్న షోలో సౌతాఫ్రికా దిగ్గజం జాక్వెస్ కలిస్, టీమిండియా స్టార్ వీరేంద్ర సెహ్వాగ్ టాప్ రన్ స్కోరర్ ఎవరన్న అంశంపై తమ అంచనాలు తెలియజేశారు. ప్రొటిస్ ఆల్‌రౌండర్ కలిస్.. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌ను ఎంపిక చేసుకోగా.. వీరూ భాయ్.. టీమిండియా సారథి రోహిత్ శర్మకు అగ్రస్థానం దక్కుతుందని పేర్కొన్నాడు. పాకిస్తాన్లో ఉన్నపుడు దగ్గరగా చూశాను ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు వివియన్ రిచర్డ్స్ అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచేదెవరో అంచనా వేశాడు. పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిదికి ఆ అర్హత ఉందని రిచర్డ్స్ పేర్కొన్నాడు. ‘‘పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగమైన సమయంలో షాహిన్ ఆఫ్రిది ఎదుగుదలను దగ్గరగా చూశాను. ఈసారి అత్యధిక పరుగుల వీరుడు అతడే ఆట పట్ల అంకితభావం కలవాడు. వరల్డ్‌కప్‌లో షాహిన్ ఆఫ్రిది లీడింగ్ వికెట్ టేకర్ అవుతాడు. అతడినే నేను ఎంపిక చేసుకుంటా’’ అని వివియర్ రిచర్డ్స్ చెప్పుకొచ్చాడు. కాగా మూడు ఫార్మాట్లలోనూ పాకిస్తాన్ ప్రధాన పేసర్‌గా మారాడు 23 ఏళ్ల షాహిన్ ఆఫ్రిది. పాకిస్తాన్ స్టార్ పేసర్.. మూడు ఫార్మాట్లలోనూ ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో 27 టెస్టులు, 39 వన్డేలు, 52 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 105, 76, 64 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల అఫ్గనిస్తాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అత్యధికంగా ఆరు వికెట్లు తీశాడు. ఇక ప్రపంచకప్ కంటే ముందు షాహిన్ ఆఫ్రిది ఆసియా కప్-2023 బరిలో దిగనున్నాడు. ఇదిలా ఉంటే.. ఆగష్టు 30 నుంచి ఈ వన్డే టోర్నీ ఆరంభం కానుండగా.. భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి ప్రపంచకప్ ఈవెంట్ మొదలుకానుంది. ఆసియా కప్-2023కి పాకిస్తాన్ జట్టు: అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (కెప్టెన్), సల్మాన్ అలీ ఆఘా, ఇఫ్తికర్ అహ్మద్, తయ్యబ్ తాహిర్, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ హరీస్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీమ్ అష్రఫ్, హ్యారిస్ రవూఫ్, మహ్మద్ వసీం, నసీమ్ షా, షాహిన్ అఫ్రిది. చదవండి: WC 2023: వరల్డ్‌కప్ జట్టులో సంజూకు ఛాన్స్! వాళ్లిద్దరికీ షాక్.. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
కోహ్లి కాదు! వరల్డ్‌కప్ అంటే అతడికి ఊపొస్తుంది.. టాప్ స్కోరర్ తనే: సెహ్వాగ్
Virender Sehwag Picks WC 2023 Top Run-Getter: ‘‘వరల్డ్‌కప్ అంటే చాలు అతడిలో కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది. అద్బుతమైన ప్రదర్శనలతో చెలరేగుతాడు. ఈసారి కూడా అదరగొడుతాడు. ఈసారి కేవలం ఆటగాడిగా మాత్రమే కాదు.. కెప్టెన్‌గానూ బరిలోకి దిగుతున్నాడు. కాబట్టి ఇంకాస్త జాగ్రత్తగా ఉంటాడు. కచ్చితంగా తనదైన ముద్ర వేస్తాడు. టన్నుల కొద్దీ పరుగులు సాధిస్తాడు’’ అని టీమిండియా విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023 నిర్వహణకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్ పోటీలో పది జట్లు! ఆతిథ్య టీమిండియాతో పాటు శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, నెదర్లాండ్స్ ఈ ఐసీసీ ఈవెంట్లో తలపడనున్నాయి. పది వేదికల్లో నిర్వహించే ప్రపంచకప్ టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సెమీస్ చేరే జట్లు, విజేతపై పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ టాప్ స్కోరర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్‌కప్-2023లో అత్యధిక పరుగులు సాధిస్తాడని అంచనా వేశాడు. అందుకే రోహిత్ శర్మ పేరు చెప్పాను హిట్‌మ్యాన్‌ను ఉద్దేశించి పైవిధంగా స్పందించిన వీరూ భాయ్.. ‘‘ఇండియా పిచ్‌లపై ఓపెనర్లు మంచి స్కోర్లు సాధిస్తారనుకుంటున్నా. ఎవరో ఒకరిని ఎంపిక చేసుకోవాలంటే నేనైతే రోహిత్ శర్మ పేరు చెబుతా. ఇంకో ఇద్దరు ముగ్గురు పేర్లున్నా.. నేను ఇండియన్ కాబట్టే ఇండియన్ పేరే చెప్తాను.. అది మరెవరో కాదు రోహిత్ శర్మనే!’’ అని పేర్కొన్నాడు. కోహ్లి ఫ్యాన్స్ హర్ట్! ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా వైరల్‌గా మారింది. అయితే సెహ్వాగ్ వ్యాఖ్యలపై రోహిత్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తుండగా.. విరాట్ కోహ్లి ఫ్యాన్స్ మాత్రం హర్ట్ అవుతున్నారు. మీరు కింగ్ పేరు కావాలనే మర్చిపోయినట్లున్నారు అని వీరూను ఉద్దేశించి కామెంట్లు పెడుతున్నారు. కాగా ప్రపంచకప్ టోర్నీలో రోహిత్ సేన అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. చదవండి: గంగూలీ కీలక వ్యాఖ్యలు.. కోహ్లినే కరెక్ట్ అన్న ఏబీడీ! ఇష్టం ఉన్నా లేకపోయినా.. WC: కోహ్లి, బాబర్ కాదు.. ఈసారి అతడే టాప్ స్కోరర్: సౌతాఫ్రికా లెజెండ్ Asia Cup: కోహ్లి కాదు.. యో- యో టెస్టులో అతడే టాప్! స్కోరెంతంటే? View this post on Instagram A post shared by ICC (@icc) -
WC: కోహ్లి, బాబర్ కాదు.. ఈసారి అతడే టాప్ స్కోరర్: సౌతాఫ్రికా లెజెండ్
ICC ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్-2023 టోర్నీకి సమయం ఆసన్నమవుతున్న క్రమంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాక్వెస్ కలిస్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి ఐసీసీ ఈవెంట్లో టాప్ స్కోరర్ జోస్ బట్లర్ అని అంచనా వేశాడు. కాగా అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు భారత్ వేదికగా వరల్డ్‌కప్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. తొలి మ్యాచ్ అక్కడే డిపెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్ వేదికగా మెగా క్రికెట్ సమరానికి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సెమీస్ చేరే జట్లపై పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రొటిస్ లెజెండ్ జాక్వెస్ కలిస్ వన్డే వరల్డ్‌కప్-2023లో అత్యధిక పరుగుల వీరుడిగా ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ నిలుస్తాడని జోస్యం చెప్పాడు. ఈ మేరకు ఐసీసీ షోలో మాట్లాడుతూ.. భారత పిచ్‌లపై అతడు ఈసారి మెరుగ్గా రాణిస్తాడని భావిస్తున్నా. ఇక ఇంగ్లండ్ ఈ వరల్డ్‌కప్‌లో కూడా మంచి ప్రదర్శన ఇస్తుందనే నమ్మకం ఉంది. భారత్‌లో వన్డే రికార్డు అంతంత మాత్రమే! ఈసారి బట్లర్ లీడ్ రన్ స్కోరర్‌గా నిలుస్తాడని విశ్వసిస్తున్నా’’ అని జాక్వెస్ కలిస్ చెప్పుకొచ్చాడు. కాగా ఇయాన్ మోర్గాన్ తర్వాత ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా జోస్ బట్లర్ గతేడాది సారథ్య బాధ్యతలు చేపట్టాడు. తన కెరీర్లో ఇప్పటి వరకు అంతర్జాతీయ స్ధాయిలో 165 వన్డేలు ఆడిన బట్లర్ 41.49 సగటుతో 4647 పరుగులు సాధించాడు. ఇందులో 11 సెంచరీలు, 24 అర్ధ శతకాలు ఉన్నాయి. అయితే, భారత్‌లో మాత్రం అతడి వన్డే రికార్డు అంతంతమాత్రంగానే ఉంది. ఇప్పటి వరకు భారత గడ్డపై 8 వన్డే మ్యాచ్‌లు ఆడిన బట్లర్.. కేవలం 83 పరుగులు చేశాడు. బెస్ట్ స్కోరు 31. ఈ నేపథ్యంలో భారత్ వేదికగా జరిగే ఐసీసీ టోర్నీలో జోస్ బట్లర్ టాప్ స్కోరర్‌గా నిలుస్తాడని జాక్వెస్ కలిస్ అంచనా వేయడం విశేషం. టీ20 వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ ఇదిలా ఉంటే.. 2019 వరల్డ్‌కప్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఇటీవల మాట్లాడుతూ.. ‘‘జోస్ బట్లర్ అద్భుతమైన నాయకుడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యుత్తమ ప్లేయర్లలో ఒకడు. బట్లర్ లాంటి ఆటగాడిని కెప్టెన్‌గా కలిగి ఉండటం ఇంగ్లండ్‌కు అదనపు బలం. కూల్ కెప్టెన్సీతో ఒత్తిడిని జయించి వరల్డ్‌కప్‌లో జట్టు రాణించేలా కృషి చేస్తాడనే నమ్మకం ఉంది’’ అని బట్లర్‌పై ప్రశంసలు కురిపించాడు. కాగా బట్లర్ సారథ్యంలో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్‌కప్-2022ను ఇంగ్లండ్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. జోస్ బట్లర్ ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కలిస్ వ్యాఖ్యల నేపథ్యంలో.. మరి వన్డేల్లో అద్భుత రికార్డులు కలిగి ఉన్న టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను బట్లర్ వెనక్కి నెట్టగలడా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు. చదవండి: వారెవ్వా.. నీరజ్! అత్యుత్తమ ప్రదర్శనతో ప్యారిస్ ఒలింపిక్స్‌కు అర్హత -
చంద్రయాన్-3 సక్సెస్.. ఈ సారి వరల్డ్‌కప్ టీమిండియాదే! ఎలా అంటే?
చంద్రయాన్ -3 విజయంతో భారత్.. అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. జాబిలిపై భారత పతాకం రెపాలపలడింది. చంద్రుడి దక్షిణ దృవంలో అడుగు మోపిన తొలి దేశంగా ఘనత సాధించింది. చంద్రయాన్ -3 సూపర్ సక్సెస్‌తో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఈ ఘనత సాధించినందుకు ప్రతీ భారతీయుడు గర్వంగా ఫీలవుతున్నారు. ఇక చంద్రయాన్ -3 విజయంపై ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ చేసిన ట్వీట్ ఆసక్తి కలిగిస్తోంది. ట్విట్లో ఏముందంటే? 2019లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 విఫలమైన సంగతి తెలిసిందే. చివరి క్షణంలో సాంకేతిక సమస్యలు తలతెత్తడంతో చంద్రయాన్-2 చంద్రుడిపై క్రాష్ ల్యాండింగ్ అయింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలతోపాటు దేశ ప్రజలందరూ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే అదే ఏడాది భారత క్రికెట్ జట్టు కూడా 2019 వన్డే ప్రపంచకప్‌లో తీవ్ర నిరాశపరిచింది. ఈ మెగా టోర్నీ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలై ఇంటిముఖం పట్టింది. దీంతో ఒకేడాది భారత్‌కు రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. అయితే యాదృచ్చికంగా చంద్రయాన్-3, వన్డే ప్రపంచకప్ సరిగ్గా మళ్లీ ఒకే ఏడాది షెడ్యూల్ చేయబడ్డాయి. ఈ క్రమంలో చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో.. భారత జట్టు కూడా వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంటుందని ఆర్ధం వచ్చేలా ముంబై ఇండియన్స్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ భారత్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఆక్టోబర్5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ షురూ కానుంది. చదవండి: హార్దిక్, బుమ్రా కాదు.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అతడే! 𝗕𝗘𝗟𝗜𝗘𝗩𝗘 🇮🇳#OneFamily #Chandrayaan_3 #Ch3 #Chandrayaan3 #VikramLander pic.twitter.com/kU9InzTlD4 — Mumbai Indians (@mipaltan) August 23, 2023 -
అప్పుడలా! ఈసారి మాత్రం వరల్డ్‌కప్ ట్రోఫీ మాదే: సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్
అప్పటి దాకా అదరగొట్టడం... అభిమానుల్లో అంచనాలు పెంచేయడం... మేజర్ ఈవెంట్లలో కీలక సమయంలో చేతులెత్తేయడం.. కనీసం ఫైనల్ కూడా చేరలేక చతికిలపడటం.. మీరు ఊహించిన పేరు నిజమే! ఈ ప్రస్తావన సౌతాఫ్రికా గురించే! 1992 నుంచి వరల్డ్‌కప్ టోర్నీలో పోటీపడుతున్న దక్షిణాఫ్రికా ఇంత వరకు ఒక్క వన్డే ట్రోఫీ కూడా గెలవలేదు. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లలో విజయం అంచులదాకా వెళ్లి బోల్తా పడటం.. ‘చోకర్స్’ అనే ‘నామధేయం’ తమకు సరిగ్గా సరిపోతుందని మళ్లీ మళ్లీ నిరూపించుకోవడం ప్రొటిస్‌కు బాగా అలవాటు. ఈసారి ట్రోఫీ గెలుస్తాం అయితే, ఈసారి ఆ అపఖ్యాతిని కచ్చితంగా చెరిపేసుకుంటాం అంటున్నాడు సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ కగిసో రబడ. ప్రపంచకప్ ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా భారత్‌లో బరిలోకి దిగుతామని పేర్కొన్నాడు. ఇప్పటి వరకు జరగనిది.. ఇప్పుడు చేసి చూపిస్తామంటూ ధీమా వ్యక్తం చేశాడు. ప్రొటిస్ పేస్ దళానికి నాయకత్వం వహిస్తున్న 28 ఏళ్ల రబడ ఈ మేరకు మాట్లాడుతూ.. ‘‘సౌతాఫ్రికా క్రికెట్ గురించి బయట నడుస్తున్న డ్రామా, చర్చల గురించి మేము అస్సలు పట్టించుకోము. నిజమే ప్రపంచకప్ టోర్నీల్లో ఆడుతూ.. ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోతే ఎలా ఉంటుందో తెలుసు. ప్రతి క్రికెటర్ కల అదే! తీవ్రమైన నిరాశ కలుగుతుంది కదా! ఈ విషయంలో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఈసారి దానిని సాధ్యం చేసి చూపించాలని నేను... మేమంతా బలంగా కోరుకుంటున్నాం. వరల్డ్‌కప్ ట్రోఫీ గెలవడం ఎవరికైనా ఇష్టమే కదా! ప్రతి ఒక్క క్రికెటర్ కల అదే! ఒక్కసారి జట్టును ప్రకటిస్తే.. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరే చూస్తారు’’ అంటూ ఆత్మవిశ్వాసం ప్రదర్శించాడు. కాగా ఇప్పటి వరకు నాలుగుసార్లు వరల్డ్‌కప్ సెమీస్ వరకు చేరుకున్న సౌతాఫ్రికా ఒక్కసారి కూడా ముందడుగు వేయలేకపోయింది. అప్పుడలా.. ఆఖరిగా.. 2019 వరల్డ్‌కప్‌లో మాంచెస్టర్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 10 పరుగుల తేడాతో గెలిచి.. విజయంతో టోర్నీని ముగించింది. అయితే, ఈసారైనా కప్ గెలుస్తారంటూ.. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు మాత్రం ఫాఫ్ డుప్లెసిస్ బృందం నిరాశనే మిగిల్చింది. ఇదిలా ఉంటే.. భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే! చదవండి: టీమిండియా క్యాప్ అందుకోవడం ఈజీ అయిపోయింది.. అదే జరిగితే బుమ్రా అవుట్! -
తిలక్ వద్దు!? వరల్డ్‌కప్ టోర్నీలో నంబర్ 4లో సూర్య సరైనోడు! అతడిని ఆడిస్తే..
World Cup 2023: మిడిలార్డర్లో కీలక స్థానమైన నాలుగో నంబర్‌పై టీమిండియాలో నెలకొన్న అనిశ్చితి గురించి క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బ్యాటింగ్ ఆర్డర్ నం.4లో సమస్య ఉందని కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా అంగీకరించిన విషయం తెలిసిందే. ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ రిటైర్ అయిన తర్వాత అక్కడ ఎవరూ నిలదొక్కుకోలేకపోయారని పేర్కొన్నాడు. అయ్యర్ గాయాల బారిన పడటం వల్ల ఇక శ్రేయస్ అయ్యర్ ఆ లోటును భర్తీ చేయగల సత్తా ఉన్నవాడే అయినా.. గాయాల బెడద వల్ల అతడు అందుబాటులో లేకపోవడం అనిశ్చితికి కారణమైందని పేర్కొన్నాడు. అయ్యర్ జట్టుకు దూరమైన తరుణంలో వేర్వేరు ఆటగాళ్లతో ప్రయోగాలు చేయాల్సి వస్తుందని పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఆసియా వన్డే కప్-2023, వన్డే వరల్డ్‌కప్-2023 వంటి మెగా ఈవెంట్ల నేపథ్యంలో టీమిండియాను వేధిస్తున్న ఈ ప్రధాన సమస్య గురించి వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్ టోర్నీలో నాలుగో స్థానంలో టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్‌ను ఆడించాలని సూచించాడు. నా ఛాయిస్ సూర్యనే.. ఎందుకంటే ‘‘నేనైతే నం.4లో సూర్యనే ఎంచుకుంటాను. గత కొంతకాలంగా అతడు అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. అనుభవజ్ఞుడు. కాబట్టి నా ఛాయిస్ సూర్యనే’’ అని వ్యాఖ్యానించాడు. కాగా టీ20లలో సుదీర్ఘకాలంగా ప్రపంచ నంబర్ 1 బ్యాటర్‌గా కొనసాగుతున్న ముంబై బ్యాటర్ సూర్యకుమార్ వన్డేల్లో మాత్రం రాణించలేకపోతున్న విషయం తెలిసిందే. వన్డేల్లో సో సోగా.. వెస్టిండీస్‌తో సిరీస్‌లోనూ వచ్చిన అవకావాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మూడు వన్డేల్లో వరుసగా 19, 24, 35 పరుగులు చేయగలిగాడు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు మొత్తంగా 26 వన్డే మ్యాచ్‌లు ఆడిన సూర్య 511 పరుగులు మాత్రమే చేశాడు. తిలక్ గురించి మాట్లాడుతుంటే! ఈ నేపథ్యంలో 50 ఓవర్ ఫార్మాట్లో తన గణాంకాలు చెప్పుకోదగినవిగా లేవని, ఈ విషయం చెప్పేందుకు సిగ్గుపడనని సూర్య వాస్తవాన్ని అంగీకరించాడు కూడా! ఇదిలా ఉంటే.. విండీస్‌తో టీ20 సిరీస్‌తో ఎంట్రీ ఇచ్చిన యువ సంచలనం తిలక్ వర్మ నాలుగో స్థానంలో మెరుగ్గా ఆడుతున్న వేళ అతడిని వన్డేల్లోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే, ధావన్ మాత్రం అనుభవం పేరిట సూర్య పేరును ఎంచుకోవడం విశేషం. ఇక భారత్ వేదికగా అక్టోబరు 5- నవంబరు 19 వరకు వన్డే వరల్డ్‌కప్ టోర్నీ జరుగనుంది. అంతకంటే ముందు టీమిండియా.. ఆగష్టు 30న ఆరంభం కానున్న ఆసియా వన్డే కప్-2023లో పోటీపడనుంది. చదవండి: దూకుడు నేర్పిన దాదా.. భారత క్రికెట్‌కు స్వర్ణయుగం.. అగ్రశ్రేణి జట్లకు వణుకు