ICC Cricket World Cup 2023 Top Scorer Prediction: ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీకి సమయం ఆసన్నమైంది. మరో 9 రోజుల్లో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఆతిథ్య టీమిండియా సహా ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, నెదర్లాండ్స్ తదితర పది జట్లు ఈ టోర్నీలో భాగం కానున్నాయి.
ఈ నేపథ్యంలో ఇప్పటికే బంగ్లాదేశ్ మినహా అన్ని దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఇదిలా ఉంటే.. సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ ఆడటం రోహిత్ సేనకు సానుకూలాంశంగా మారింది. 2011 నాటి ఫలితాన్ని పునరావృతం చేసే సువర్ణావకాశం ముగింట నిలిచింది.
అన్నీ మంచి శకునములే
ఆసియా వన్డే కప్-2023 గెలవడంతో పాటు.. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలతో పాటు గాయాల నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఫామ్‌లోకి రావడం.. మిడిలార్డర్‌లో ఇషాన్ కిషన్ రాణించడం..
సూర్యకుమార్ యాదవ్ కూడా గాడిలో పడటం.. అన్నికంటే ముఖ్యంగా శుబ్‌మన్ గిల్ వైఫల్యాలకు తెరపడటం మంచి బూస్ట్‌నిచ్చింది. ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేల్లో గిల్ వరుసగా 74, 104 పరుగులతో ఆకట్టుకున్నాడు.
ఈసారి టాప్ స్కోరర్ అతడే: ఏబీడీ
ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది ప్రపంచకప్‌లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ టాప్ రన్ స్కోరర్‌గా నిలుస్తాడని అంచనా వేశాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ ఈసారి వరల్డ్‌కప్‌లో శుబ్‌మన్ గిల్ అత్యధిక పరుగుల వీరుడిగా నిలుస్తాడు.
ప్రస్తుతం అతడు సూపర్‌ఫామ్‌లో ఉన్నాడు. గొప్ప బ్యాటర్. అతడి టెక్నిక్ అద్భుతం. స్వదేశంలో వరల్డ్‌కప్ ఆడబోతున్నాడు. కాబట్టి కొంతమేర ఒత్తిడి కూడా ఉంటుంది. అయినప్పటికీ నా ఎంపిక గిల్ మాత్రమే. ఎందుకంటే.. గిల్ ట్రెడిషినల్ షాట్స్‌కే ప్రాధాన్యం ఇస్తాడు. బౌలర్లపై ఒత్తిడి పెంచగల టెక్నిక్స్ అతడి దగ్గర ఉన్నాయి.
ప్రపంచంలోనే గొప్ప బ్యాటర్‌గా..
అనతికాలంలోనే శుబ్‌మన్ మూడు ఫార్మాట్లలో ప్రపంచంలోని గొప్ప బ్యాటర్లలో ఒకడిగా ఎదుగుతాడు. యువ ఆటగాడే అయినా.. ఎంతో అనుభవం ఉన్నవాడిలా ఆడుతున్నాడు’’ అని ఏబీ డివిలియర్స్ గిల్ ఆట తీరును విశ్లేషించాడు. కాగా అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్ జరుగనుంది.
చదవండి: తనని చూసేందుకు గోడ దూకి వెళ్లేవాడిని! రెండేళ్లు ఓ మినీ యుద్ధమే.. ఇప్పుడిలా..
Comments
Please login to add a commentAdd a comment