వన్డే ప్రపంచకప్-2023లో తొలి మ్యాచ్ ఆడేందుకు టీమిండియా సిద్దమైంది. ఆదివారం చెన్నై వేదికగా ఐదు సార్లు వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో భారత జట్టు తలపడనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌పై భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు.
ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా గిల్ నిలుస్తాడని జహీర్ ఖాన్ జోస్యం చెప్పాడు. కాగా గిల్ ప్రస్తుతం వన్డే క్రికెట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తన గత 20 వన్డేల్లో ఏకంగా 1230 పరుగులు సాధించాడు. వన్డేల్లో అతడి సగటు ఏకంగా 72.35 ఉండటం గమనార్హం. ఈ ఏడాడి అతడు ఏకంగా ఆరు సెంచరీలు సాధించాడు.
ఈ నేపథ్యంలో జహీర్ ఇండియా టూడేతో మాట్లాడుతూ.. వన్డే క్రికెట్‌లో గిల్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు గిల్ అదరగొట్టాడు. అతడు ఈ ఫార్మాట్‌లో సెంచరీలు, డబుల్ సెంచరీ సాధించాడు. కచ్చితంగా ఈ మెగా టోర్నీలో టాప్ రన్ స్కోరర్‌గా నిలుస్తాడని చెప్పుకొచ్చాడు.
తొలి మ్యాచ్‌కు డౌటే..
కాగా గిల్ ప్రస్తుతం డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. తొలి మ్యాచ్‌కు అతడి అందుబాటుపై సందేహం నెలకొంది. అయితే అతడి ఆరోగ్యం కాస్త మెరుగపడినట్లు భారత హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు.
చదవండి: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా బ్యాటర్.. ఏబీ డివిలియర్స్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బద్దలు
Comments
Please login to add a commentAdd a comment