World Cup 2023: మిడిలార్డర్‌లో కీలక స్థానమైన నాలుగో నంబర్‌పై టీమిండియాలో నెలకొన్న అనిశ్చితి గురించి క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బ్యాటింగ్ ఆర్డర్ నం.4లో సమస్య ఉందని కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా అంగీకరించిన విషయం తెలిసిందే. ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ రిటైర్ అయిన తర్వాత అక్కడ ఎవరూ నిలదొక్కుకోలేకపోయారని పేర్కొన్నాడు.
అయ్యర్ గాయాల బారిన పడటం వల్ల
ఇక శ్రేయస్ అయ్యర్ ఆ లోటును భర్తీ చేయగల సత్తా ఉన్నవాడే అయినా.. గాయాల బెడద వల్ల అతడు అందుబాటులో లేకపోవడం అనిశ్చితికి కారణమైందని పేర్కొన్నాడు. అయ్యర్ జట్టుకు దూరమైన తరుణంలో వేర్వేరు ఆటగాళ్లతో ప్రయోగాలు చేయాల్సి వస్తుందని పేర్కొన్నాడు.
ఈ క్రమంలో ఆసియా వన్డే కప్-2023, వన్డే వరల్డ్‌కప్-2023 వంటి మెగా ఈవెంట్ల నేపథ్యంలో టీమిండియాను వేధిస్తున్న ఈ ప్రధాన సమస్య గురించి వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్ టోర్నీలో నాలుగో స్థానంలో టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్‌ను ఆడించాలని సూచించాడు.
నా ఛాయిస్ సూర్యనే.. ఎందుకంటే
‘‘నేనైతే నం.4లో సూర్యనే ఎంచుకుంటాను. గత కొంతకాలంగా అతడు అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. అనుభవజ్ఞుడు. కాబట్టి నా ఛాయిస్ సూర్యనే’’ అని వ్యాఖ్యానించాడు. కాగా టీ20లలో సుదీర్ఘకాలంగా ప్రపంచ నంబర్ 1 బ్యాటర్‌గా కొనసాగుతున్న ముంబై బ్యాటర్ సూర్యకుమార్ వన్డేల్లో మాత్రం రాణించలేకపోతున్న విషయం తెలిసిందే.
వన్డేల్లో సో సోగా..
వెస్టిండీస్‌తో సిరీస్‌లోనూ వచ్చిన అవకావాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మూడు వన్డేల్లో వరుసగా 19, 24, 35 పరుగులు చేయగలిగాడు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు మొత్తంగా 26 వన్డే మ్యాచ్‌లు ఆడిన సూర్య 511 పరుగులు మాత్రమే చేశాడు.
తిలక్ గురించి మాట్లాడుతుంటే!
ఈ నేపథ్యంలో 50 ఓవర్ ఫార్మాట్‌లో తన గణాంకాలు చెప్పుకోదగినవిగా లేవని, ఈ విషయం చెప్పేందుకు సిగ్గుపడనని సూర్య వాస్తవాన్ని అంగీకరించాడు కూడా! ఇదిలా ఉంటే.. విండీస్‌తో టీ20 సిరీస్‌తో ఎంట్రీ ఇచ్చిన యువ సంచలనం తిలక్ వర్మ నాలుగో స్థానంలో మెరుగ్గా ఆడుతున్న వేళ అతడిని వన్డేల్లోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
అయితే, ధావన్ మాత్రం అనుభవం పేరిట సూర్య పేరును ఎంచుకోవడం విశేషం. ఇక భారత్ వేదికగా అక్టోబరు 5- నవంబరు 19 వరకు వన్డే వరల్డ్‌కప్ టోర్నీ జరుగనుంది. అంతకంటే ముందు టీమిండియా.. ఆగష్టు 30న ఆరంభం కానున్న ఆసియా వన్డే కప్-2023లో పోటీపడనుంది.
చదవండి: దూకుడు నేర్పిన దాదా.. భారత క్రికెట్‌కు స్వర్ణయుగం.. అగ్రశ్రేణి జట్లకు వణుకు
Comments
Please login to add a commentAdd a comment