సూర్యకుమార్ యాదవ్, ఏబీ డివిలియర్స్, సంజూ శాంసన్
AB de Villiers Lauds Suryakumar Yadav: ‘‘ప్రపంచకప్ జట్టులో స్కై(SKY) పేరును చూడటం నాకెంతో ఊరటగా అనిపించింది. మీకు తెలుసా.. నేను అతడికి వీరాభిమానిని. టీ20 క్రికెట్ ఫార్మాట్‌లో అతడు అచ్చం నాలాగే ఆడతాడు’’ అంటూ సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ హర్షం వ్యక్తం చేశాడు. వన్డే వరల్డ్‌కప్-2023 జట్టులో సూర్యకుమార్ యాదవ్‌కు చోటిచ్చిన టీమిండియా సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థించాడు.
టైటిల్ రేసులో పది జట్లు
కాగా అక్టోబరు 5- నవంబరు 19 వరకు భారత్ వేదికగా ఐసీసీ ఈవెంట్ జరుగనున్న విషయం తెలిసిందే. స్వదేశంలో పన్నెండేళ్ల తర్వాత ప్రపంచకప్ టోర్నీ ఆడుతున్న టీమిండియాతో పాటు ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నెదర్లాండ్స్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్ టైటిల్ రేసులో నిలిచాయి.
సంజూను కాదని సూర్యను ఎలా?
ఈ నేపథ్యంలో సెప్టెంబరు 5న భారత క్రికెట్ నియంత్రణ మండలి 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. వన్డేల్లో మెరుగైన రికార్డులేని.. టీ20 నంబర్ 1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేయడం క్రీడావర్గాల్లో చర్చకు దారితీసింది.
సూర్యపై ఏబీ డివిలియర్స్ నమ్మకం.. ఒంటిచేత్తో
కేరళ బ్యాటర్ సంజూ శాంసన్‌ను కాదని... సూర్యను సెలక్ట్ చేయడం ఎందుకని కొందరు మాజీలు ప్రశ్నించారు. ఇక ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ టామ్ మూడీ.. తిలక్ వర్మ రూపంలో లెఫ్టాండర్, పార్ట్‌టైమ్ స్పిన్నర్ అందుబాటులో ఉండగా సూర్య ఎంపిక ఎందుకో అర్థంకాలేదని వాపోయాడు.
ఈ నేపథ్యంలో ప్రొటిస్ లెజెండ్, మిస్టర్ 360 ప్లేయర్ డివిలియర్స్ మాత్రం భిన్నంగా స్పందించాడు. సూర్య ఇప్పటి వరకు వన్డేల్లో రాణించకపోయినప్పటికీ.. ఒంటిచేత్తో మ్యాచ్‌ను తిప్పేయగల సత్తా కలిగిన వాడని కొనియాడాడు. కచ్చితంగా అతడు ఈసారి వరల్డ్‌కప్ ఆడతాడని.. అతడి బ్యాటింగ్ నైపుణ్యాలపై తనకు నమ్మకం ఉందని పేర్కొన్నాడు.
AB de Villiers on Sanju Samson.. సంజూ అద్భుతం.. కానీ
ఇక సంజూ శాంసన్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘అతడు అన్ని రకాల షాట్లు ఆడగలడు. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీతో మ్యాచ్‌లో సంజూ(45 బంతుల్లో 92 నాటౌట్) ఆట తీరును నాకింకా గుర్తుంది. మైదానం నలుమూలలా అద్భుత షాట్లతో అలరించాడు’’ అని డివిలియర్స్ 2018 నాటి ఇన్నింగ్స్ గుర్తు చేసుకున్నాడు. అయితే, . అయితే, వన్డే క్రికెట్ కాస్త భిన్నంగా ఉంటుందని పేర్కొన్నాడు.
వన్డేల్లో సంజూ వర్సెస్ సూర్య
అంతర్జాతీయ వన్డేల్లో సూర్యకుమార్ యాదవ్ ఇప్పటి వరకు 26 వన్డేలు ఆడి 24.33 సగటుతో 511 పరుగులు చేశాడు. మరోవైపు సంజూ శాంసన్.. టీమిండియా తరఫున 13 వన్డేలు ఆడి 55.71 సగటుతో 390 పరుగులు చేశాడు.
చదవండి: గేల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాలి!.. అస్సలు అనుకోలేదు: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment