వన్డే ప్రపంచకప్-2023కు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టుపై భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వన్డేల్లో వరుసగా విఫలమవుతున్న సూర్యకుమార్ యాదవ్‌కు బదులుగా సంజూ శాంసన్‌ను ఎంపిక చేసి ఉంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
టీ20ల్లో నెం1 బ్యాటర్‌గా ఉన్న సూర్యకుమార్.. వన్డేల్లో మాత్రం తన మార్క్‌ను చూపించడంలో విఫలమవుతున్నాడు. ఈ క్రమంలో సూర్యకుమార్‌కు భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మద్దతుగా నిలిచాడు. ఐదు, ఆరు స్ధానాల్లో బ్యాటింగ్‌కు వచ్చే విధ్వంసం సృష్టించే సత్తా సూర్యకు ఉందని భజ్జీ అభిప్రాయపడ్డాడు.
సంజూ శాంసన్‌కు బదులుగా సూర్యను ఎంపిక చేయడం సరైన నిర్ణయమే. సూర్య పూర్తి స్ధాయి ఆటగాడు. మిడిలార్డర్‌లో అద్భుతంగా ఆడగలడు. సంజూ కంటే సూర్య చాలా బెటర్. ప్రస్తుతం మిడిలార్డర్‌లో సంజూ పెద్దగా రాణించలేకపోతున్నాడు. సూర్య కంటే శాంసనే ఎక్కువ రిస్కీ షాట్లు ఆడుతాడు. సూర్య టీ20ల్లో ఏమి చేశాడో మనకు తెలుసు.
అదే వన్డే ఫార్మాట్‌లో కూడా చేయగలడు. అతడు 35 ఓవర్‌లో బ్యాటింగ్ వస్తే ఫీల్డ్‌లో గ్యాప్‌లను చూసి ఆడగలడు. అ విధంగా ఆడడంలో సూర్య కంటే మించిన వారు ఎవరూ లేరు. మ్యాచ్ స్వరూపాన్ని మార్చడానికి సూర్యకు కేవలం 30 బంతులు చాలు అని స్టార్‌స్పోర్ట్స్ ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో హర్భజన్ పేర్కొన్నాడు.
కాగా వన్డేల్లో సూర్యకుమార్ యాదవ్ గణంకాలు మాత్రం పేలవంగా ఉన్నాయి. ఇప్పటివరకు 26 వన్డేలు ఆడిన సూర్యకుమార్.. 24.33 సగటుతో 511 పరుగులు మాత్రమే చేశాడు.
ప్రపంచ కప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.
చదవండి: సచిన్, గవాస్కర్, కోహ్లి కాదు.. భారత అత్యుత్తమ బ్యాటర్ అతడే: గంభీర్
Comments
Please login to add a commentAdd a comment