harbajan singh
-
ధోని కంటే రోహిత్ చాలా డిఫరెంట్ కెప్టెన్: హర్భజన్
ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ.. ఇద్దరూ భారత క్రికెట్ జట్టుకు వరల్డ్‌కప్‌లు అందించిన కెప్టెన్లు. అయితే రోహిత్ గొప్ప, ధోని గొప్ప అంటే మాత్రం సమాధనం చెప్పలేం. ఎందుకంటే కెప్టెన్సీలో గానీ, ఆటలో గానీ ఎవరికి వారే మేటి. తాజాగా ధోని, రోహిత్ శర్మ కెప్టెన్సీ శైలుల గురించి భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని, రోహిత్ ఇద్దరూ వేర్వేరు కెప్టెన్సీ స్టైల్స్‌ను కలిగి ఉన్నారని భజ్జీ చెప్పుకొచ్చాడు.కెప్టెన్సీలో ధోని, రోహిత్‌లకు ఎటువంటి పోలిక లేదు. ఇద్దరూ వేర్వేరు కెప్టెన్సీ శైలిలను కలిగి ఉన్నారు. ధోని కెప్టెన్సీలో నేను భారత జట్టుతో పాటు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో కేన్ విలియమ్సన్ వరసుగా బౌండరీలు బాది ఒత్తడిలోకి నెట్టాడు. ఆ సమయంలో షార్ట్ ఫైన్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాను. వెంటనే ధోని వద్దకు వెళ్లి ఠాకూర్ తన బౌలింగ్ లెంగ్త్‌ను మార్చుకుంటే బాగుంటుందని సూచించాను. కానీ ధోని మాత్రం పాజీ నేను ఇప్పుడు అతనితో చెబితే, శార్ధూల్ ఎప్పటికీ నేర్చుకోడు. తనంతట తానే నేర్చుకోనివ్వండి అంటూ నాతో అన్నాడు. ఇది ధోని స్టైల్ కెప్టెన్సీ. ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీ మరో రకం. రోహిత్ చాలా డిఫరెంట్. అతను వెళ్లి ప్రతి ప్లేయర్‌తో మాట్లాడతాడు. ఆటగాడి భుజం మీద చేయి వేసి తన నుంచి ఏమి ఆశిస్తున్నాడో చెబుతాడు. మీరు చేయగలరన్న నమ్మకం అతడు కలిగిస్తాడు. టెస్టు క్రికెట్లో కెప్టెన్‌గా వ్యవహరించినప్పటి నుంచి హిట్‌మ్యాన్ మరింత మెరుగయ్యాడు. ఎవరైనా టెస్టుల్లో జట్టును నడిపించినప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటారు. టెస్ట్ క్రికెట్‌కు ఖచ్చితమైన వ్యూహాలు, వాటని అమలు చేయడం చాలా అవసరం. దీంతో ఒక ఉత్తమ నాయకుడిగా నిలుస్తారని "తరువర్ కోహ్లీ పోడ్కాస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో భజ్జీ పేర్కొన్నాడు. -
'బంగ్లాదేశ్‌ను తక్కువగా అంచనా వేయొద్దు.. పాక్‌నే ఓడించారు'
భారత క్రికెట్ జట్టు తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమైంది. సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. అయితే ఈ సిరీస్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మను మాజీ క్రికెటర్లు సున్నితంగా హెచ్చరించారు.బంగ్లాదేశ్‌ను తక్కువగా అంచనా వేయద్దని భారత మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, హర్భజన్ సింగ్‌లు రోహిత్‌ను సూచించారు. కాగా టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా భారత్‌ను బంగ్లాదేశ్ ఓడించలేదు. కానీ బంగ్లా జట్టు మాత్రం ఇటీవల కాలంలో టెస్టుల్లో సంచలన ప్రదర్శన కనబరుస్తోంది. గతేడాది ఆఖరిలో న్యూజిలాండ్‌ను ఓడించిన బంగ్లా టైగర్స్.. తాజాగా పాకిస్తాన్‌ను వారి స్వదేశంలోనే చిత్తు చేశారు. కాబట్టి బంగ్లా జట్టు నుంచి భారత్‌కు పోటీ ఎదురయ్యే ఛాన్స్ ఉంది.టీమిండియా ఐదు నెలల తర్వాత టెస్టుల్లో ఆడనుంది. బంగ్లాతో సిరీస్‌కు భారత టెస్టు జట్టును ఎంపిక చేసే పనిలో సెలక్షన్ కమిటీ పడింది. దులీప్ ట్రోఫీలో భారత టాప్ ప్లేయర్లను భాగం చేయడం బీసీసీఐ తీసుకున్న ఒక మంచి నిర్ణయం.రెడ్‌బాల్ క్రికెట్(టెస్టు) ఆడినప్పుడు ఆటగాళ్లకు చాలా విషయాలు తెలుస్తాయి. బంగ్లాదేశ్‌ను తేలికగా తీసుకోవద్దు. బంగ్లా జట్టులో అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు. అంతేకాకుండా గత కొంత కాలం నుంచి నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఈ సిరీస్ భారత జట్టు మంచి ప్రాక్టీస్‌గా ఉపయోగపడుతోందని ఏఎన్ఐతో రైనా పేర్కొన్నాడు. హర్భజన్ సింగ్ సైతం రైనా వ్యాఖ్యలను సమర్ధించాడు.ఇది గొప్ప సిరీస్ కానుంది. భారత జట్టు చాలా బలంగా ఉంది. కానీ బంగ్లాదేశ్‌ను కూడా తక్కువగా అంచనా వేయలేం. వారు రావల్పండి వేదికగా జరిగిన తొలి టెస్టులో పాక్‌ను ఓడించారు. కొన్ని సార్లు చిన్న జట్లు కూడా అద్భుతాలు సృష్టిస్తాయి అని భజ్జీ చెప్పుకొచ్చాడు. కాగా సిరీస్ సెప్టెంబర్ 19 నుంచి జరగనుంది. -
'కోహ్లితో 19 ఏళ్ల కుర్రాడు కూడా పోటీ పడలేడు.. ఈజీగా ఓడిస్తాడు'
టీ20 వరల్డ్‌కప్-2024 విజయం తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి పొట్టి క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరి క్రికెట్ భవిష్యత్తుపై పలు ఊహగానాలు వినిపించాయి.వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం టెస్టుల్లో మాత్రమే కొనసాగుతారని, మరి కొందరు ఏకంగా త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటారని జోస్యం చెప్పారు. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. విరాట్, రోహిత్ కచ్చితంగా మరో రెండేళ్ల పాటు భారత జట్టు తరపున ఆడుతారని భజ్జీ చెప్పుకొచ్చాడు."రోహిత్ శర్మ ప్రస్తుతం ఫిట్‌గా ఉన్నాడు. అతడు ఈజీగా మరో రెండేళ్లు పాటు భారత తరపున ఆడగలడు. ఇక విరాట్ కోహ్లి ఫిట్నెస్ కోసం అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు మరో ఐదేళ్ల పాటు క్రికెట్ ఆడుతాడని భావిస్తున్నాను. ప్రస్తుత భారత జట్టులో కోహ్లినే అత్యంత ఫిట్‌గా ఉండే క్రికెటర్. ఫిట్నెస్ పరంగా 19 ఏళ్ల యువకుడు కూడా విరాట్‌తో పోటీపడలేడు. కోహ్లి అతడిని ఈజీగా ఓడిస్తాడు. అయితే ఫిట్నెస్ ఉన్నప్పటకి క్రికెట్లో కొనసాగాలా లేదా అన్నది వారి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. నా వరకు అయితే వారు మెరుగ్గా రాణిస్తూ క్రికెట్ మరి కొన్నేళ్లు కొనసాగాలని ఆశిస్తున్నాని" పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ పేర్కొన్నాడు. -
అతడికి ధోనీతో పోలికా? ఏం మాట్లాడుతున్నావ్: భజ్జీ ఫైర్
భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పాకిస్తాన్ జర్నలిస్ట్‌కు అదరి పోయే కౌంటరిచ్చాడు. భారత మాజీ కెప్టెన్, దిగ్గజ కీపర్-బ్యాటర్ ఎంఎస్ ధోనిని పాక్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్‌తో పోల్చినందుకు సదరు జర్నలిస్ట్‌పై హర్భజన్ మండిపడ్డాడు.ఫరీద్ ఖాన్ అనే పాక్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఎంఎస్ ధోని, మహ్మద్ రిజ్వాన్‌లలో ఎవరు బెటర్ అన్న పోల్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. అందుకు స్పందించిన భజ్జీ ఇదేమి చెత్త ప్రశ్న అంటూ ఫైరయ్యాడు. "ఈ రోజుల్లోనూ ఇలాంటి చెత్త ప్రశ్నలు అడగడం దారుణం. భయ్యా అతడికి ఎవరైనా చెప్పండి.ధోనితో రిజ్వాన్‌కు పోలికా? రిజ్వాన్ కంటే ధోని చాలా ముందున్నాడు. మీరు ఇదే విషయం రిజ్వాన్‌ను అడిగినా అతడు నిజాయితీగా సమాధానం చెబుతాడు. రిజ్వాన్ ఆట అంటే నాకు కూడా ఇష్టం. అతడు జట్టు కోసం తీవ్రంగా శ్రమిస్తాడు. కానీ ధోనీతో రిజ్వాన్‌ను పోల్చడం చాలా తప్పు.ప్రపంచ క్రికెట్లో ఇప్పటికీ ధోనినే నంబర్ వన్. వికెట్ల వెనక ధోనిని మించిన వారే లేరు" అంటూ ఎక్స్‌లో భజ్జీ రిప్లే ఇచ్చాడు. ఇక భారత క్రికెట్లో ధోని కంటూ ఒక ప్రత్యేకస్ధానముంది.భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్ ధోనినే. అతడి సారథ్యంలోనే 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకుంది. What r u smoking nowadays ???? What a silly question to ask . Bhaiyo isko batao . DHONI bhut aage hai RIZWAN se Even if u will ask Rizwan he will give u an honest answer for this . I like Rizwan he is good player who always play with intent.. but this comparison is wrong. DHONI… https://t.co/apr9EtQhQ4— Harbhajan Turbanator (@harbhajan_singh) July 19, 2024 -
మమ్మల్ని క్షమించండి.. దయచేసి ఇక్కడితో ఆపేయండి: హర్భజన్
ఇంగ్లండ్ వేదికగా జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) టైటిల్‌ను ఇండియా ఛాంపియన్స్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో పాకిస్తాన్ ఛాంపియన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని భారత్ ముద్దాడింది.అయితే విజయనంతరం భారత మాజీ క్రికెటర్లు, డబ్ల్యూసీఎల్ విన్నింగ్ టీమ్ సభ్యులు హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, యువరాజ్ సింగ్‌లు బాలీవుడ్ సాంగ్ తౌబ.. తౌబకు కుంటుతూ సరదగా డ్యాన్స్ చేశారు.ఇందుకు సంబంధించిన వీడియోను యువరాజ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఈ రీల్‌పై దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పారా బ్యాడ్మింటన్ స్టార్ మానసి జోషి దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీశారని ఈ ముగ్గురి క్రికెటర్లపై మండిపడింది.అదే విధంగా నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్ (NCPEDP) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్మాన్ అలీ కూడా క్రికెటర్లపై పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం వారి చేసిన రీల్ వివాదస్పదం కావడంతో హర్భజన్ సింగ్ స్పందించాడు. దివ్యాంగులకు భజ్జీ క్షమపణలు తెలిపాడు."ఇంగ్లండ్‌లో ఛాంపియన్షిప్ గెలిచిన అనంతరం మేం చేసిన టౌబా టౌబా రీల్‌పై వచ్చిన ఫిర్యాదులపై ఓ క్లారిటీ ఇవ్వాలనకుంటున్నాను. మేము ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోలేదు. ప్రతీ వ్యక్తికి, ప్రతీ కమ్యూనిటీని మేము గౌరవిస్తాము.15 రోజుల పాటు విరామం లేకుండా క్రికెట్ ఆడిన తర్వాత మా ఒళ్లు హూనమైందని తెలియజేసేందుకు ఈ వీడియోను చేశాము. మేము ఎవరినీ కించపరచడానికి ఈ వీడియో చేయలేదు. ఇప్పటికీ మేము ఏదో తప్పు చేశామని ప్రజలు భావిస్తుంటే.. అందరికి నా తరపున క్షమపణలు తెలుపుతున్నాను. దయచేసి దీన్ని ఇక్కడతో ఆపేయండి" అంటూ ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. -
తప్పు విరాట్ కోహ్లిది కాదు.. పిచ్‌ది: హర్భజన్ సింగ్
టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పేలవ ప్రదర్శన కనుబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ గ్రూపు స్టేజిలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విరాట్ దారుణంగా విఫలమయ్యాడు.మొత్తంగా కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్-2024లో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచిన విరాట్.. పొట్టి ప్రపంచకప్‌లో మాత్రం తీవ్ర నిరాశపరుస్తున్నాడు.దీంతో కొంతమంది పాక్ మాజీ ఆటగాళ్లు విరాట్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లికి భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మద్దతుగా నిలిచాడు. కోహ్లిది ఎటువంటి తప్పులేని, న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోని పిచ్ అస్సలు బ్యాటింగ్‌కు అకుకూలించలేదని భజ్జీ చెప్పుకొచ్చాడు."న్యూయార్క్ పిచ్ బ్యాటర్లకు చుక్కలు చూపించింది. ఆ వికెట్‌పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. అక్కడ పరిస్థితులు అలా ఉండటం వల్లే విరాట్ కోహ్లి పరుగులు చేయలేకపోయాడు. కాబట్టి ఇటువంటి కండీషన్స్‌లో ఆటగాళ్లను మనం తప్పుబట్టకూడదు.అయితే పరిస్థితులు ఎలా ఉన్నప్పటకి జట్టు మాత్రం విరాట్ నుంచి మంచి ఇన్నింగ్స్‌లను ఆశిస్తోంది. అంతేకాకుండా ఓపెనర్‌గా వస్తున్నాడు కాబట్టి కోహ్లిపై మరింత బాధ్యత ఉంటుంది. న్యూయార్క్ పిచ్ బ్యాటర్లకు చుక్కలు చూపించింది. ఆ వికెట్‌పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. అక్కడ పరిస్థితులు అలా ఉండటం వల్లే విరాట్ కోహ్లి పరుగులు చేయలేకపోయాడు. కాబట్టి ఇటువంటి కండీషన్స్‌లో ఆటగాళ్లను మనం తప్పుబట్టకూడదు. అయితే పరిస్థితులు ఎలా ఉన్నప్పటకి జట్టు మాత్రం విరాట్ నుంచి మంచి ఇన్నింగ్స్‌లను ఆశిస్తోంది. అంతేకాకుండా ఓపెనర్‌గా వస్తున్నాడు కాబట్టి కోహ్లిపై మరింత బాధ్యత ఉంటుంది. తొలి 6 ఓవర్లలో రోహిత్, విరాట్ మంచి ఆరంభాలను ఇస్తే.. మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే వంటి వారు తమపని తాము చేసుకుపోతారని" స్టార్‌స్పోర్ట్స్‌తో హర్భజన్ పేర్కొన్నాడు. -
టీమిండియా హెడ్ కోచ్ పదవిపై హర్భజన్ ఆసక్తి..?
టీ20 ప్రపంచకప్-2024 ముగిసిన తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెడ్‌కోచ్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను సైతం ఆహ్వానించింది.మే 27 సాయంత్రం ఆరు గంటలలోపు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. టీమిండియా హెడ్‌కోచ్ రేసులో మాజీ క్రికెటర్లు జస్టిన్ లాంగర్, గౌతం గంభీర్, స్టీఫెన్ ఫ్లెమింగ్, పాంటింగ్ వంటి పేర్లు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు అవకాశం లభిస్తే టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు భజ్జీ తెలిపాడు.భారత హెడ్‌కోచ్ పదవికి నేను దరఖాస్తు చేస్తానో లేదో నాకు తెలియదు. కానీ, టీమిండియాకు కోచింగ్ అనేది మ్యాన్ మేనేజ్మెంట్. భారత ఆటగాళ్లకు క్రికెట్ గురించి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదు. క్రికెట్ ఎలా ఆడాలో వారికి బాగా తెలుసు. వారికి మార్గదర్శకత్వంగా ఉంటే చాలు. నాకు క్రికెట్ ఎంతో ఇచ్చింది. కోచ్ రూపంలో ఎంతోకొంత తిరిగి ఇచ్చే అవకాశం వస్తే సంతోషిస్తా" అని ఓ స్పోర్ట్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ పేర్కొన్నాడు. -
T20 వరల్డ్ కప్‌కు భారత జట్టు ఇదే..? ఊహించని ప్లేయర్‌కు చోటు!
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగమయ్యే భారత జట్టును బీసీసీ సెలక్షన్ కమిటీ మరో నాలుగు, ఐదు రోజుల్లో ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ టోర్నీలో భాగమయ్యే ఆ జట్లు తమ వివరాలను మే 1లోపు ఐసీసీకి సమర్పించాల్సి ఉంది. దీంతో భారత జట్టును ఎంపిక చేసే పనిలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ పడింది. ఈ క్రమంలో మాజీ క్రికెటర్లు టీ20 వరల్డ్‌కప్ కోసం బారత జట్టును అంచనా వేస్తున్నారు. ఈ జాబితాలోకి తాజాగా టీమిండియా మాజీ స్సిన్నర్ హార్భజన్ సింగ్ చేరాడు. టీ20 ప్రపంచకప్ కోసం తన 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును భజ్జీ ఎంపిక చేశాడు. ఈ జట్టులో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, ఓపెనర్ శుబ్‌మన్ గిల్, పేసర్ మహ్మద్ సిరాజ్‌లకు భజ్జీ ఛాన్స్ ఇవ్వలేదు.వీరితో పాటు స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్‌ను సైతం హార్భజన్ ఎంపిక చేయలేదు. అయితే అనూహ్యంగా ఈ జట్టులో భజ్జీ పేసర్ అవేష్ ఖాన్‌కు చోటివ్వడం గమనార్హం. ప్రస్తుత ఐపీఎల్లో సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అవేష్ ఖాన్ డెత్ ఓవర్లలో తన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు.ఈ క్రమంలోనే హార్భజన్ అవేష్‌కు చోటిచ్చాడు. ఇక భజ్జీ ఎంపిక చేసిన జట్టులో ఐపీఎల్లో అదరగొడుతున్న మయాంక్ యాదవ్, శివమ్ దూబే, యశస్వీ జైశ్వాల్‌కు చోటు దక్కింది. వికెట్ కీపర్ బ్యాటర్‌గా రిషబ్ పంత్‌ను హార్భజన్ ఎంచుకున్నాడు.అదేవిధంగా స్పెషలిస్టు స్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్‌ను హార్భజన్ ఎంపిక చేశాడు.టీ20 ప్రపంచ కప్ 2024 కోసం హర్భజన్ సింగ్ భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రింకు సింగ్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్ -
'డివిలియర్స్ కంటే అతడు చాలా డేంజరస్.. ఆపడం ఎవరి తరం కాదు'
ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించాడు. ఈ ఏడాది సీజన్లో రెండో మ్యాచ్ ఆడిన సూర్యకుమార్.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్య ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. గ్రౌండ్ నలుమూలల షాట్లు ఆడుతూ బౌలర్లకు చమెటలు పట్టించాడు. ఈ క్రమంలో కేవలం 17 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 19 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్.. 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52 పరుగులు చేశాడు. ఈ క్రమంలో గాయం నుంచి కోలుకుని అద్బుత ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్‌పై భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. సూర్య అతను దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌కు బెటర్ వెర్షన్ భజ్జీ కొనియాడాడు. "సూర్యకుమార్ లాంటి ఆటగాడిని ఇప్పటివరకు నేను చూడలేదు. అతడి బౌలర్లను ఎటాక్ చేసే విధానం నమ్మశక్యం కానిది. అతడికి బౌలర్లకు ఎక్కడ బౌలింగ్ చేయాలో ఆర్ధం కాక తలలపట్టుకుంటున్నారు. ఒకవేళ నేను ఆడిన కూడా సూర్యకి బౌలింగ్ చేసేందుకు భయపడేవాడిని. సూర్య వేరే గ్రహంపై ఆడుతున్నట్లు ఉంది. సూర్యకుమార్ యాదవ్ చెలరేగితే ఆపడం ఎవరి తరం కాదు. ఇంతకముందు అందరూ ఏబీ డివిలియర్స్ గురించి మాట్లాడునుకోవారు. కానీ సూర్య తన ఆటతీరుతో ఏబీడీని మయమరిపిస్తున్నాడు. డివిలియర్స్ కంటే సూర్య డెంజరస్ ఆటగాడని నేను భావిస్తున్నాను. టీ20 ఫార్మాట్లో ప్రస్తుత తరం క్రికెటర్లలో సూర్యనే అత్యుత్తమ ఆటగాడని" స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భజ్జీ పేర్కొన్నాడు. చదవండి: రోహిత్‌ను టీజ్ చేసిన కోహ్లి.. హిట్‌మ్యాన్ రియాక్షన్ వైరల్ -
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. సర్ఫరాజ్‌కు ఛాన్స్! సిరాజ్‌కు నో ప్లేస్
విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2నుంచి ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు టీమిండియా సన్నద్దమవుతోంది. ఇప్పటికే వైజాగ్‌కు చేరుకున్న భారత జట్టు.. ఈ మ్యాచ్ కోసం తమ అస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఎంచుకున్నాడు. వైజాగ్ టెస్టులో భారత జట్టు నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని హర్భజన్ సూచించాడు. అదే విధంగా గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్ స్ధానంలో సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశం ఇవ్వాలని భజ్జీ తెలిపాడు. సర్ఫరాజ్ ఖాన్‌కు దేశీవాళీ క్రికెట్లో అద్బుతమైన రికార్డు ఉందని, ఐదో స్ధానానికి సరిపోతాడని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. ఇక హర్భజన్ తను ఎంపిక చేసిన జట్టులో కేవలం ఒకే పేసర్‌కు ఛాన్స్ ఇచ్చాడు. ఫాస్ట్ బౌలర్ల కోటాలో పేస్ గుర్రం బుమ్రా ఒక్కడికే చోటు దక్కింది. తొలి టెస్టులో పెద్దగా ఆకట్టుకోకపోయిన మహ్మద్ సిరాజ్‌ను వైజాగ్ టెస్టుకు హర్భజన్ పక్కన పెట్టాడు. అతడి స్ధానంలో వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు చోటు ఇచ్చాడు. కుల్దీప్ బంతితో అద్బుతాలు చేయగలడని హర్భజన్ సింగ్ తన యూట్యాబ్ ఛానల్లో పేర్కొన్నాడు. రెండో టెస్టుకు హర్భజన్ ఎంపిక చేసిన భారత జట్టు: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ కేఎస్ భరత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ -
సంజూ కంటే అతడు చాలా బెటర్.. విధ్వంసానికి 30 బంతులు చాలు!
వన్డే ప్రపంచకప్-2023కు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టుపై భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వన్డేల్లో వరుసగా విఫలమవుతున్న సూర్యకుమార్ యాదవ్‌కు బదులుగా సంజూ శాంసన్‌ను ఎంపిక చేసి ఉంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. టీ20ల్లో నెం1 బ్యాటర్‌గా ఉన్న సూర్యకుమార్.. వన్డేల్లో మాత్రం తన మార్క్‌ను చూపించడంలో విఫలమవుతున్నాడు. ఈ క్రమంలో సూర్యకుమార్‌కు భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మద్దతుగా నిలిచాడు. ఐదు, ఆరు స్ధానాల్లో బ్యాటింగ్‌కు వచ్చే విధ్వంసం సృష్టించే సత్తా సూర్యకు ఉందని భజ్జీ అభిప్రాయపడ్డాడు. సంజూ శాంసన్‌కు బదులుగా సూర్యను ఎంపిక చేయడం సరైన నిర్ణయమే. సూర్య పూర్తి స్ధాయి ఆటగాడు. మిడిలార్డర్లో అద్భుతంగా ఆడగలడు. సంజూ కంటే సూర్య చాలా బెటర్. ప్రస్తుతం మిడిలార్డర్లో సంజూ పెద్దగా రాణించలేకపోతున్నాడు. సూర్య కంటే శాంసనే ఎక్కువ రిస్కీ షాట్లు ఆడుతాడు. సూర్య టీ20ల్లో ఏమి చేశాడో మనకు తెలుసు. అదే వన్డే ఫార్మాట్లో కూడా చేయగలడు. అతడు 35 ఓవర్లో బ్యాటింగ్ వస్తే ఫీల్డ్‌లో గ్యాప్‌లను చూసి ఆడగలడు. అ విధంగా ఆడడంలో సూర్య కంటే మించిన వారు ఎవరూ లేరు. మ్యాచ్ స్వరూపాన్ని మార్చడానికి సూర్యకు కేవలం 30 బంతులు చాలు అని స్టార్‌స్పోర్ట్స్ ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో హర్భజన్ పేర్కొన్నాడు. కాగా వన్డేల్లో సూర్యకుమార్ యాదవ్ గణంకాలు మాత్రం పేలవంగా ఉన్నాయి. ఇప్పటివరకు 26 వన్డేలు ఆడిన సూర్యకుమార్.. 24.33 సగటుతో 511 పరుగులు మాత్రమే చేశాడు. ప్రపంచ కప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్. చదవండి: సచిన్, గవాస్కర్, కోహ్లి కాదు.. భారత అత్యుత్తమ బ్యాటర్ అతడే: గంభీర్ -
'అలా జరగనందుకు చాలా బాధగా ఉంది.. అతడు ఇండియన్ క్రికెట్‌ను ఏలుతాడు'
టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. వెస్టిండీస్‌తో తొలి టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన జైశ్వాల్.. తన తొలి మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 382 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్ 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 171 పరుగులు చేశాడు. ఇక డెబ్యూ మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన జైశ్వాల్‌పై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. జైస్వాల్ అద్భుతమైన ఆటగాడని, చాలా కాలం పాటు భారత్ తరఫున ఆడతాడని హర్భజన్ కొనియాడాడు. "యశస్వి జైస్వాల్ తొలి మ్యాచ్‌లోనే తన టాలెంట్ ఎంటో నిరూపించుకున్నాడు. అతడు డబుల్ సెంచరీ చేసే అవకాశం కోల్పోయినందుకు చాలా బాధ అనిపించింది. కానీ జైశ్వాల్ ఇండియన్ క్రికెట్‌ను చాలా కాలం పాటు కచ్చితంగా ఏలుతాడు. జైశ్వాల్‌కు టాలెంట్‌లో కొదవలేదు. అతడికి నేను ఇచ్చే సలహా ఒక్కటే. జైశ్వాల్ ప్రపంచక్రికెట్‌ను శాసించాలంటే మరింత కష్టపడి పనిచేయాలి. అదే విధంగా ఫిట్నెస్ను కూడా కాపాడుకుంటూ రావాలి. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా రోజుల తర్వాత అతడి బ్యాట్ నుంచి వచ్చిన సెంచరీ. కోహ్లి కూడా సెంచరీ మార్క్‌ను అందుకుని ఉంటే బాగుండేది" అని హర్భజన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: AFG vs BAN: ఆఖరి టీ20లో ఆఫ్గానిస్తాన్ చిత్తు.. బంగ్లాదేశ్‌దే సిరీస్ -
వందకు పైగా టెస్టులు ఆడాడు.. మీరు ఇచ్చే గౌరవం ఇదేనా?
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ భారత జట్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సిరీస్‌కు వెటరన్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారాను పక్కన పెట్టడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. అతడి పట్ల సెలక్టర్లు వ్యవహరించిన తీరును చాలా మంది మాజీలు తప్పుబడున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో చాలా మంది ఆటగాళ్లు విఫలమైనప్పటికి.. పుజారా ఒక్కడినే బలిపశువును చేయడం సరికాదు అని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం విమర్శించాడు. తాజాగా భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా పుజారాకు మద్దతుగా నిలిచాడు. పుజారా వంటి అనుభవం ఉన్న ఆటగాడిని పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. "విండీస్‌తో టెస్టులకు ఛతేశ్వర్ పుజారాను ఎంపిక చేయకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. అతడు భారత జట్టుకు వెన్నెముక వంటి వాడు. చాలా మ్యాచ్‌ల్లో భారత జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాడు. అతడిని జట్టు నుంచి తప్పించకుండా కేవలం విశ్రాంతి మాత్రమే ఇచ్చారని నేను ఆశిస్తున్నాను. ప్రస్తుత భారత టెస్టు జట్టులో మిగితా బ్యాటర్లు సగటు కూడా అంతగా బాగోలేదు. అటువంటి అప్పుడు పుజారా ఏం తప్పు చేశాడు. ఎంత పెద్ద ఆటగాడైనా ఆడకపోతే పుజారా లాగే జట్టు నుంచి తప్పించాలి. సెలక్టర్లు అలా చేయగలరా? మీరు పుజారాను కీలక ఆటగాడిగా పరిగణించకపోతే.. మిగితా ఆటగాళ్లు కూడా అంతకన్న తక్కువే. పుజారా కెరీర్ గురించి మనం ఎప్పుడూ ప్రశ్నించకూడదు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి విదేశీ గడ్డలపై భారత జట్టుకు ఎన్నో చారిత్రాత్మక విజయాలు అందించాడు. అతడు 100కు పైగా టెస్టులు ఆడాడు. అటువంటి వ్యక్తి మీరు ఇలా చేయడం సరికాదు. అతడికి సరైన గౌరవం ఇవ్వాలి" అని భజ్జీ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: Sunil Gavaskar: వాళ్లేం సాధించారు.. పూజారాని మాత్రం ఎందుకు బలి చేశారు? -
రెజ్లర్లు వీధుల్లోకి రావడం బాధించింది.. న్యాయం జరగాలి: హర్భజన్
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా రెజర్లు గత ఆరు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. రెజర్లపై బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు. ఇందులో ప్రముఖ రెజ్లర్లు భజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, సహా ఇతర రెజర్లు పాల్గొన్నారు. ఇక ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు పలువురు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా భారత మాజీ క్రికెటర్, పార్లమెంటు సభ్యుడు హర్భజన్ సింగ్ సపోర్ట్‌గా నిలిచాడు. దేశానికి ఎన్నో కీర్తి ప్రతిష్టలను తీసుకువచ్చిన రెజర్లు రోడ్డు రోడ్డుపైకి రావడం చాలా బాధాకరమని భజ్జీ అన్నాడు. "సాక్షి మాలిక్, వినేష్ ఫోగాట్‌లు భారతదేశానికి గర్వకారణం. అటువంటి రెజర్లు మన దేశ వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నందుకు క్రీడాకారిణిగా నేను బాధపడుతున్నారు. వారికి న్యాయం జరగాలని ప్రార్థిస్తున్నాను" అని హర్భజన్ ట్విటర్లో పేర్కొన్నాడు. భజ్జీతో పాటు జావిలిన్ త్రో స్టార్ నిరాజ్ చోప్రా, సానియా మీర్జా కూడా సపోర్ట్‌గా నిలిచారు. Sakshi, Vinesh are India's pride. I am pained as a sportsperson to find pride of our country coming out to protest on the streets. I pray that they get justice.#IStandWithWrestlers pic.twitter.com/hwD9dKSFNv — Harbhajan Turbanator (@harbhajan_singh) April 28, 2023 pic.twitter.com/SzlEhVnjep — Neeraj Chopra (@Neeraj_chopra1) April 28, 2023 చదవండి: Wrestlers Protest: దేశ ప్రతిష్టతను దిగజారుస్తున్నారు.. పీటీ ఉష ఘాటు వ్యాఖ్యలు -
ధావన్ విషయంలో బీసీసీఐ పై హర్భజన్ ఫైర్
-
రోహిత్, కోహ్లి, రాహుల్‌కే ఛాన్స్‌లు ఇస్తారా.. అతడు ఏం పాపం చేశాడు మరి?
టీమిండియా వెటరన్ ఓపెనర్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఐపీఎల్-2023లో దుమ్మురేపుతున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 40 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన గబ్బర్.. అనంతరం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో 56 బంతులు ఎదుర్కొన్న ధావన్ 9 ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 86 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక ఐపీఎల్లో అదరగొడుతున్న ధావన్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హర్భజన్ సింగ్ కీలక వాఖ్యలు చేశాడు. ధావన్‌ను వన్డే జట్టు నుంచి ఎందుకు తప్పించారో కారణం చెప్పాలని భారత సెలక్టర్లను భజ్జీ ప్రశ్నించాడు. కాగా ధావన్ గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. 2018 నుంచి టెస్ట్‌లకు, 2021 నుంచి టీ20లకు దూరంగా ఉంటున్న గబ్బర్.. గతేడాది స్వదేశంలో వెస్టిండీస్, న్యూజిలాండ్, సౌతాఫ్రికాలతో జరిగిన వన్డే సిరీస్‌ల్లో టీమిండియాకు సారధ్యం వహించాడు. ఆ మూడు సిరీస్‌ల్లో గబ్బర్ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో సెలక్టర్లు అతడని పక్కన పెట్టి, యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌కు అవకాశం ఇచ్చారు. ఇదే విషయంపై భజ్జీ హిందుస్థాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.."ధావన్ చాలా సిరీస్‌లలో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సిరీస్‌లో సారథిగా ధావన్ విజయవంతమయ్యాడు. అయితే ధావన్ కెప్టెన్సీ పాత్ర ముగిశాక.. ఇకపై అతడు అవసరం లేనట్లుగా జట్టు నుంచి పక్కన పెట్టడం మనం చూశాం. ఇది నన్ను చాలా బాధించింది. ఎందుకంటే అందరి ఆటగాళ్ల విషయంలోను సెలక్టర్లు ఒకే తీరు కనబరిచాలి. ధావన్ ఒక అద్భుతమైన ఆటగాడు. అతడు భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు.అటువంటి వ్యక్తి పట్ల సెలక్టర్లు వ్యవహరించిన తీరు సరికాదు. ధావన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి స్టార్ ఆటగాళ్లు చాలా మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యారు. అయినప్పటికీ వారికి చాలా అవకాశాలు ఇచ్చారు. కానీ ధావన్ ఒక్కడి విషయంలో పక్షపాతం ఎందుకు. ధావన్‌కు పూర్తిగా భారత జట్టులోనే చోటు లేదు. అతడు ఎప్పుడూ తన వంతు సహకారం జట్టుకు అందించడానికే ప్రయత్నిస్తాడు. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రాజస్తాన్ మ్యాచ్‌లో 86 పరుగులతో కీలక ఇన్నింగ్స్ కూడా ఆడాడు. అటువంటి ధావన్‌కు భారత జట్టులో చోటు ఇవ్వడానికి ఏంటి సమస్య? ఫిట్నెస్ పరంగా గబ్బర్ కూడా కోహ్లిలా 100 శాతం ఫిట్‌గా ఉన్నాడని" పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు.. కార్తీక్కే చుక్కలు! ఎవరీ సుయాష్ శర్మ? -
IND vs AUS: అశ్విన్ అరుదైన రికార్డు.. రెండో భారత బౌలర్‌గా
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో ఆస్ట్రేలియా జట్టుపై అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా అశ్విన్ రికార్డులకెక్కాడు. నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో హ్యండ్స్‌కాంబ్ వికెట్ పడగొట్టిన అశ్విన్.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై 19 టెస్టులు ఆడిన అశ్విన్ 97 వికెట్లు సాధించాడు. ఇక ఇంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ పేరిట ఉండేది.ఆస్ట్రేలియాపై హర్భజన్ 95 టెస్టు వికెట్లు పడగొట్టాడు. ఇక తాజా మ్యాచ్‌తో హర్భజన్ సింగ్ రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో అశ్విన్ ఇప్పటి వరకు 8 వికెట్లు సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లతో రాణించిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు సాధించాడు. విజయం దిశగా భారత్ అయితే తొలి టెస్టులో భారీ విజయం దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఆస్ట్రేలియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 72 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోపడింది. ప్రస్తుతం క్రీజులో స్మిత్(12), పాట్ కమ్మిన్స్ ఉన్నారు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో ఇంకా 151 పరుగులు వెనుకబడి ఉంది. కాగా ఆసీస్ కోల్పోయిన 7 వికెట్లలో ఐదు వికెట్లు కూడా అశ్విన్ పడగొట్టనివే కావడం విశేషం. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులకు ఆలౌటైన భారత్.. ఆసీస్ ముందు 223 పరుగుల ఆధిక్యాన్ని నిలిపింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) The moment Ravi Ashwin Picked his 31st 5-wicket haul in Test cricket - One of the greatest of all time. pic.twitter.com/2LVzWCDOTP — CricketMAN2 (@ImTanujSingh) February 11, 2023 చదవండి: IND vs AUS: సిక్సర్లతో చెలరేగిన షమీ.. ఆసీస్ స్పిన్నర్‌కు చుక్కలు! వీడియో వైరల్ -
'నెహ్రాను టీమిండియా కోచ్ చేయండి..! కెప్టెన్‌గా అతడే సరైనోడు'
సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైన టీమిండియా.. టీ20 ప్రపంచకప్-2022 నుంచి ఇంటిముఖం పట్టింది. ఈ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ క్రమంలో టీమిండియాతో పాటు జట్టు మేనేజేమెంట్‌పై కూడా విమర్శల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై మాజీలు, అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రోహిత్‌ను వెంటనే కెప్టెన్సీ తప్పించాలని భారత అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ ఏడాది ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ పేలవమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నీలో 6 మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. కేవలం 116 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో జట్టుతో పాటు, కోచింగ్ స్టాఫ్‌లో కూడా మార్పులు చేసే సమయం ఆసన్నమైంది భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఇండియా టుడేతో హర్భజన్ మాట్లాడుతూ.. "రాహుల్ ద్రవిడ్ చాలా తెలివైనవాడు. మేమిద్దరం కలిసి చాలా కాలం క్రికెట్ ఆడాము. కానీ పొట్టి ఫార్మాట్లో భారత జట్టుకు ఇటీవలే టీ20 క్రికెట్ నుంచి రిటైరైన వ్యక్తి కోచ్‌గా కావాలి. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌ను అర్ధం చేసుకోనే వ్యక్తిని తీసుకురావాలి. ద్రవిడ్‌ను భారత జట్టు కోచ్‌గా తొలగించకూడదనుకుంటే.. ఇటీవల రిటైర్ అయిన వారిని అతడికి అసిస్టెంట్‌గా అయినా ఎంపికచేయండి. ఆశిష్ నెహ్రా లాంటి మాజీ ఆటగాడిని కోచింగ్ స్టాఫ్‌లో భాగం చేయండి. నెహ్రాది గొప్ప క్రికెట్ మైండ్. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ విషయంలో అతడు ఏం చేశాడో మనం చూశాం. అతడు జట్టుతో కలిస్తే యువ ఆటగాళ్లను ఎక్కువగా ప్రోత్సహిస్తాడు" అని పేర్కొన్నాడు. ఇక టీ20 కెప్టెన్సీ గురించి భజ్జీ మాట్లాడుతూ.. "నా అభిప్రాయం ప్రాకారం అయితే హార్దిక్ పాండ్యాను భారత జట్టు కెప్టెన్ చేస్తే బాగుటుంది. అతడు ప్రస్తుత జట్టులో అత్యుత్తమ ఆటగాడు. అతడి లాంటి ఆటగాళ్లు భారత జట్టుకు మరింత మంది అవసరం" అని తెలిపాడు. చదవండి: Wasim Akram: "ఐపీఎల్ ప్రారంభమైంది.. భారత్ పని అయిపోయింది" -
Abu Dhabi T10 League: టీ10 లీగ్‌లో ఆడనున్న హర్భజన్, రైనా
అబుదాబి టీ10 లీగ్-2022లో టీమిండియా మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, సురేష్ రైనా భాగం కానున్నారు. ఈ లీగ్‌లో ఢిల్లీ బుల్స్‌తో హర్భజన్ సింగ్ ఒప్పందం కుదుర్చుకోగా.. డిఫెండింగ్ ఛాంపియన్ డెక్కన్ గ్లాడియేటర్స్‌కు రైనా ప్రాతినిధ్యం వహించనున్నాడు. డక్కన్ గ్లాడియేటర్స్ జట్టుకు వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా గ్లాడియేటర్స్ జట్టులో టిమ్ డేవిడ్, రహ్మానుల్లా గుర్బాజ్, విల్ జాక్స్, డొమినిక్ డ్రేక్స్, ఫజల్హాక్ ఫరూకీ వంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. ఈ జట్టుకు జింబాబ్వే మాజీ ఆటగాడు అండీ ఫ్లవర్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. అబుదాబి టీ10 లీగ్ నవంబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. Indian legend Harbhajan Singh has signed for @DelhiBullsT10 and will be joining us in #Season6 of the #AbuDhabiT10 🔒#InAbuDhabi #CricketsFastestFormat pic.twitter.com/d4A8N7DJr2 — T10 League (@T10League) September 29, 2022 ఇక సురేష్ రైనా ప్రస్తుతం రోడ్ సెప్టీ లీగ్‌లో ఇండియా లెజెండ్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. అదే విధంగా హర్భజన్ సింగ్ లెజెండ్స్ లీగ్ క్రికెట్లో మణిపాల్ టైగర్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. హార్భజన్ సింగ్ 2021లో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకోగా.. రైనా ఇటీవలే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. చదవండి: T20 WC 2022: 'బుమ్రా స్థానంలో అతడికి అవకాశమివ్వండి' -
'పంత్‌ను కాదని కార్తీక్‌ను ఆడించడం సరైన నిర్ణయం'
ఆసియా కప్ 2022ను భారత్ విజయంతో ప్రారంభించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం దాయాది జట్టు పాకిస్తాన్‌పై భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయ భేరి మోగించింది. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు జట్టు మేనేజేమెంట్ తీసుకున్న ఓ నిర్ణయం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ మ్యాచ్‌కు తుది జట్టులో ఫామ్‌లో ఉన్న పంత్‌ను కాదని ఆనూహ్యంగా దినేష్ కార్తీక్ వైపు జట్టు మేనేజేమెంట్ మొగ్గు చూపింది. అయితే ఈ నిర్ణయంపై ప్రస్తుతం భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది ఈ నిర్ణయాన్ని సమర్ధిస్తుంటే.. మరి కొంతమంది తప్పుబడుతున్నారు. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ స్పిన్నర్ హార్భజన్ సింగ్ స్పందించాడు. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు పంత్‌ను కాదని దినేష్ కార్తీక్‌ను ఆడించడం సరైన నిర్ణయమని హర్భజన్ తెలిపాడు. డీకే సరైనోడు.. "రిషబ్ పంత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అతడు కేవలం టెస్టులు, వన్డేల్లో మాత్రమే రాణిస్తున్నాడు. టీ20 ఫార్మాట్లో మాత్రం పంత్ అంతగా ఆకట్టు కోలేకపోయాడు. మరోవైపు దినేష్ కార్తీక్ ఈ పొట్టి ఫార్మాట్లో గత కొంత కాలంగా అద్భుతంగా రాణిస్తున్నాడు. అటువంటి ఆటగాడిని బెంచ్‌కే పరిమితం చేయకూడదు. కాబట్టి పంత్‌ను కాదని కార్తీక్‌కు తుది జట్టులో చోటు ఇవ్వడం సరైన నిర్ణయం. రిషబ్ పంత్ యువ ఆటగాడు. అతడికి ఇంకా చాలా సమయం ఉంది. కార్తీక్ మరో ఒకటి రెండేళ్లు మాత్రమే క్రికెట్ ఆడే అవకాశం ఉంది. కాబట్టి జట్టులో ఉన్నప్పడే అతడిని సద్వినియోగం చేసుకోవాలి. అతడు టీ20ల్లో అత్యుత్తమ ఫినిషర్‌గా పేరొందాడు. లోయర్ ఆర్డర్లో కూడా అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ వంటి ఫినిషర్లు క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్లకు వెన్నులో వణుకు పుడుతోంది" అని హార్భజన్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో కేవలం ఒక్క బంతి మాత్రమే ఆడిన కార్తీక్ హార్దిక్ స్ట్రైక్ ఇచ్చాడు.. అయితే ఫీల్డింగ్‌లో మాత్రం వికెట్ల వెనుక మూడు అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్నాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: Harbhajan Singh explains why Dinesh Karthik played ahead of Rishabh Pant vs Pak -
గిల్ అద్భుతమైన ఆటగాడు.. భావి భారత కెప్టెన్ అతడే: హర్భజన్
టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యున్నత ఫామ్‌లో ఉన్నాడు. గత నెలలో విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అదరగొట్టిన గిల్.. తాజాగా జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ సత్తా చాటాడు. సోమవారం జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో గిల్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. తద్వారా తన అంతర్జాతీయ కెరీర్లో తొలి శతకాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలో సెంచరీతో చేలరేగిన గిల్‌పై భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ గిల్ అని అతడు కొనియాడాడు. అదే విధంగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వంటి స్టార్ ఆటగాళ్ల శైలిలో గిల్ ఆడుతున్నాడని భజ్జీ అభిప్రాయపడ్డాడు. గిల్ భావి భారత కెప్టెన్ "గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడు బ్యాటింగ్ టెక్నిక్ గానీ షాట్ సెలక్షన్ గానీ అద్భుతంగా ఉంటాయి. గిల్‌ను బ్యాటింగ్ శైలీ పరంగా ప్రస్తుతం భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రాహుల్ వంటి కీలక ఆటగాళ్లతో పోల్చవచ్చు. నాకైతే అతడు భావి భారత కెప్టెన్ అవుతాడని అనిపిస్తోంది. అతడికి కెప్టెన్‌గా అనుభవం లేనప్పటకీ రాబోయే రోజుల్లో అతడు నేర్చుకోనే అవకాశం ఉంది" అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. సచిన్ రికార్డు బద్దలు! జింబాబ్వేతో మూడో వన్డేలో 130 పరుగులు సాధించిన గిల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. జింబాబ్వే గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత ఆటగాడిగా గిల్ నిలిచాడు. అంతకుమందు ఈ రికార్డు టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. 1998లో బులవాయో వేదికగా జింబాబ్వేతో జరిగిన వన్డేలో 127 పరుగులు సాధించి సచిన్ అజేయంగా నిలిచాడు. తాజా మ్యాచ్‌లో సచిన్ 24 ఏళ్ల రికార్డును గిల్ అధిగమించాడు. మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్, సిరీస్ సొంతం! ఇక మూడో వన్డేతో పాటు ఓవరాల్ సిరీస్‌లో అదరగొట్టిన గిల్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌తో పాటు సిరీస్ అవార్డులు వరించాయి. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన గిల్ 245 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఒక సెంచరీ, అర్ధశతకం ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు భారత్ తరపున 9 వన్డేలు ఆడిన గిల్ 499 పరుగులు సాధించాడు. వన్డేల్లోఅతడి వ్యక్తిగత స్కోర్ 130 పరుగులు. 👏🏏 𝐈𝐓'𝐒 𝐇𝐄𝐑𝐄! Shubman Gill registers his first international 💯 with a beautiful knock. 🤩 This is just the beginning. More to come in the future! 💪 📸 Getty • #INDvZIM #ZIMvIND #ShubmanGill #TeamIndia #BharatArmy pic.twitter.com/FLESqcAiJW — The Bharat Army (@thebharatarmy) August 22, 2022 చదవండి: ICC ODI Rankings: క్లీన్‌స్వీప్‌లు.. టీమిండియా, పాకిస్తాన్ ఏ స్థానాల్లో ఉన్నాయంటే! -
'ఇంగ్లండ్ పిచ్‌లపై అతడి కంటే ఎవరూ మెరుగ్గా రాణించలేరు'
టీమిండియా వెటరన్ ఆటగాడు చతేశ్వర్ పుజారాపై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు చాలా సార్లు భారత జట్టును గెలిపించాడని, అయినప్పటికీ అతడి ఇన్నింగ్స్‌లకు తగిన గుర్తింపు రాలేదని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా అందరూ ఐపీఎల్లో ఆడుతున్నప్పడు.. పుజారా మాత్రం ఇంగ్లండ్ కౌంటీల్లో అడి తన ఫామ్‌ను తిరిగి పొందాడని అతడు కొనియాడాడు. ఇక శుక్రవారం ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదో టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో టీమిండియా ఇన్నింగ్స్‌ను పుజారా ఆరంభించే అవకాశం ఉంది. "పుజారాకు ఇంగ్లండ్ పరిస్థితుల్లో ఎక్కువగా ఆడిన అనుభవం ఉంది. కౌంటీ క్రికెట్లో బౌలర్ల కంటే అంతర్జాతీయ క్రికెట్లో బౌలర్లు మెరుగ్గా ఉండవచ్చని మీరు భావించవచ్చు. కానీ కౌంటీ క్రికెట్లో కూడా ఒకరిద్దరు అంతర్జాతీయ బౌలర్లు ఉంటారు. కౌంటీ క్రికెట్లో ఆడి పుజారా తన ఫామ్‌ను తిరిగి పొందాడు. అతడు ఎప్పడూ భారత జట్టుకు తనవంతు సహకారం అందిస్తాడు. ఇక మేము ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు పుజారా అంతగా రాణిస్తాడని ఎవరూ ఊహించలేదు. విదేశాల్లో పర్యటించేటప్పుడు భారత తరపున పుజారా అద్భుతంగా ఆడుతాడు. ఇంగ్లండ్ వంటి బౌన్సీ పిచ్‌లపై పుజారాకు పరుగులు సాధించే సత్తా ఉంది. ఇంగ్లండ్‌లో పుజారా కంటే ఎవరూ మెరుగ్గా రాణించలేరు" అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. ఇక ఈ ఏడాది కౌంటీల్లో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడిన పుజారా 700 పరుగులు సాధించాడు. చదవండి: SL vs Aus1st Test: శ్రీలంకతో తొలి టెస్టు.. ఆస్ట్రేలియా స్కోర్: 313/8 -
'ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు.. ఆ ఆల్‌రౌండర్ భారత జట్టులో ఉండాల్సింది'
ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్ చేసిన 5వ టెస్టుకు టీమిండియా జట్టులోకి ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసి ఉండాల్సిందని భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. టెస్టు జట్టులో శార్దూల్ ఠాకూర్ బాగా రాణిస్తున్నప్పటికీ.. హార్దిక్ లాంటి ఆల్ రౌండర్ జట్టులో ఉంటే మరింత బలం చేకూరుతుందని హర్భజన్ తెలిపాడు. ఇక పాండ్యా గత కొన్ని నెలలుగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ అదరగొట్టిన పాండ్యా.. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌లోనూ రాణించాడు. ఐపీఎల్లో 15 మ్యాచ్‌లు ఆడిన పాండ్యా.. 487 పరుగులు సాధించాడు. "ఇంగ్లండ్‌తో టెస్టుకు భారత జట్టులో హార్దిక్ పాండ్యా ఉండాల్సింది. ఇంగ్లండ్ వంటి పిచ్‌లపై పేసర్లు బాగా రాణిస్తారని తెలుసు. శార్దూల్ ఠాకూర్ గత కొంత కాలంగా బాల్‌తో పాటు బ్యాట్‌తో కూడా రాణిస్తున్నాడు. కానీ హార్దిక్ పాండ్యా వంటి ఆల్ రౌండర్ ఉంటే జట్టు బ్యాటింగ్ పరంగా దృఢంగా ఉంటుంది. అదే విధంగా అతడు పార్ట్ టైమ్ బౌలర్‌గా కూడా ఉపయోగపడతాడు" అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. ఇక హార్ధిక్ పాండ్యా తన చివరి టెస్టు మ్యాచ్ 2018లో ఇంగ్లండ్‌పై ఆడాడు. అనంతరం కేవలం వైట్ బాల్ సిరీస్‌లకే హార్దిక్ పరిమితమయ్యాడు. చదవండి: ENG Vs IND 5th Test: "అతడు అద్భుతమైన ఆటగాడు.. అటువంటి వ్యక్తిని ఇంతవరకూ చూడలేదు" -
'వారిద్దరూ అద్భుతమైన స్పిన్నర్లు.. టీ20 ప్రపంచకప్ జట్టులో ఉండాలి'
ఐపీఎల్-2022లో టీమిండియా వెటరన్ స్పిన్నర్లు యజువేంద్ర చహల్, కుల్ధీప్ యాదవ్ అదరగొడుతున్నారు. రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న చహల్ 10 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న కుల్ధీప్ యాదవ్ 18 వికెట్లు సాధించి పర్పుల్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టుకు యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లను ఎంపిక చేయాలని భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ సూచించాడు. కొన్నాళ్ల పాటు భారత తరుపున చాహల్, అత్యత్తుమంగా రాణించారు. కాగా 2019 ప్రపంచ కప్ తర్వాత వీరిద్దరూ ఫామ్‌ను కోల్పోయారు. తరువాత కొన్ని మ్యాచ్‌లకు జట్టుకు దూరమయ్యారు. అదే విధంగా టీ20 ప్రపంచకప్-2021 కు కూడా వీరిద్దకి చోటు దక్కలేదు. అయితే 'కుల్-చా' ద్వయం మళ్లీ తిరిగి ఫామ్‌లోకి రావడం భారత జట్టుకు కలిసొచ్చే అంశం. "టీమిండియా తరపున అద్భతంగా రాణించిన కుల్ధీప్,చహల్ భాగస్వామ్యాన్ని సెలక్టర్లు ఎందుకు విడగొట్టారో నాకు తెలియదు. అయితే ప్రస్తుతం 'కుల్-చా' ద్వయాన్ని ఖచ్చితంగా మళ్లీ జట్టులోకి తీసుకురావాలి. వారిద్దరూ కలిసి భారత్ తరపున ఆడినప్పుడు.. మిడిల్ ఓవర్లలో వికెట్లు పడగొట్టేవారు. టీ20, వన్డేల్లో భారత జట్టుకు చాలా విజయాలు అందించారు. కాబట్టి వీరిద్దరూ టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టులో భాగం కావాలి" అని "డ్రీమ్ సెట్ గో" ప్రారంభోత్సవ కార్యక్రమంలో హర్భజన్ పేర్కొన్నాడు. ఇక టీ20 ప్రపంచకప్ జరగనున్న ఆస్ట్రేలియాలో పిచ్‌లు పెద్దగా స్పిన్నర్లకు పెద్దగా అనుకూలించవు. అంతేకాకుండా రవీంద్ర జడేజా వంటి స్పిన్-బౌలింగ్ ఆల్ రౌండర్ కూడా జట్టులో ఉన్నాడు. దీంతో వీరిద్దరికి భారత జట్టులో మరి చోటు దక్కుతుందో లేదో వేచి చూడాలి. చదవండి: IPL 2022: 'కోల్‌కతా మ్యాచ్‌లో విలన్.. ఇప్పుడు హీరో.. శభాష్ సామ్స్' -
'అతడిని భారత జట్టుకు ఎంపిక చేయండి.. బుమ్రాకు సరైన జోడి'
ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా రాణిస్తున్నాడు. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. మాలిక్ తన అద్భుత ప్రదర్శనతో అందరినీ అకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో ఉమ్రాన్ మాలిక్‌ను వీలైనంత త్వరగా భారత జట్టుకు ఎంపికచేయాలని మాజీలు, క్రికెట్ నిపుణులు కోరుకుంటున్నారు. ఈ కోవలో బారత మాజీ క్రికెటర్ హార్భజన్ సింగ్ చేరాడు. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ 20 ప్రపంచకప్‌కు ఉమ్రాన్ మాలిక్‌ను భారత జట్టుకు ఎంపిక చేయాలని హార్భజన్ సింగ్ ఆకాక్షించాడు. "ఉమ్రాన్ మాలిక్ నా ఫేవరేట్ బౌలర్. నేను అతడిని భారత జట్టులో చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే అద్భుతమైన పేస్ బౌలర్. అతడు 150 కి.మీ కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. అంత స్పీడ్‌తో బౌలింగ్ చేసే ఏ బౌలర్ కూడా జాతీయ జట్టుకు ఆడకుండా లేడు. అతడు తన ప్రదర్శనతో చాలా మంది యువ ఆటగాళ్లకు ఆదర్శవంతంగా నిలుస్తున్నాడు. కాగా అతడు టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక అవుతాడో లేదో నాకు తెలియదు. కానీ నేను సెలక్షన్ కమిటీలో భాగమైతే, ఖచ్చితంగా అతడిని ఎంపిక చేస్తాను. టి20 ప్రపంచకప్‌లో జస్ప్రీత్ బుమ్రాకు మాలిక్ సరైన జోడి' అని హార్భజన్ సింగ్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: 'కోల్‌కతా మ్యాచ్‌లో విలన్.. ఇప్పుడు హీరో.. శభాష్ సామ్స్' var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });