టీ20 ప్రపంచకప్-2024 ముగిసిన తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెడ్‌కోచ్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను సైతం ఆహ్వానించింది.
మే 27 సాయంత్రం ఆరు గంటలలోపు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. టీమిండియా హెడ్‌కోచ్ రేసులో మాజీ క్రికెటర్లు జస్టిన్ లాంగర్, గౌతం గంభీర్, స్టీఫెన్ ఫ్లెమింగ్, పాంటింగ్ వంటి పేర్లు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు అవకాశం లభిస్తే టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు భజ్జీ తెలిపాడు.
భారత హెడ్‌కోచ్ పదవికి నేను దరఖాస్తు చేస్తానో లేదో నాకు తెలియదు. కానీ, టీమిండియాకు కోచింగ్ అనేది మ్యాన్ మేనేజ్‌మెంట్. భారత ఆటగాళ్లకు క్రికెట్ గురించి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదు.
క్రికెట్ ఎలా ఆడాలో వారికి బాగా తెలుసు. వారికి మార్గదర్శకత్వంగా ఉంటే చాలు. నాకు క్రికెట్ ఎంతో ఇచ్చింది. కోచ్ రూపంలో ఎంతోకొంత తిరిగి ఇచ్చే అవకాశం వస్తే సంతోషిస్తా" అని ఓ స్పోర్ట్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment