ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కు సమయం అసన్నమవుతోంది. పాకిస్తాన్, యూఏఈ అతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్‌లో కేవలం భారత్ ఆడే మ్యాచ్‌లు మాత్రమే దుబాయ్ వేదికగా జరగనుండగా.. మిగితా మ్యాచ్‌లన్నీ పాక్‌లోనే జరగనున్నాయి.
ఈ టోర్నీ కోసం ఆతిథ్య పాక్ తప్ప మిగితా ఏడు దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్ల వివరాలను ప్రకటించాయి. అయితే ఈ ఐసీసీ ఈవెంట్‌కు సమయం దగ్గర పడుతుండడంతో మాజీ క్రికెటర్లు సెమీస్, ఫైనల్‌కు చేరే జట్లను అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh) సైతం ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ చేరే జట్లను అంచనా వేశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా, భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్ నాలుగు జట్లు సెమీఫైనల్‌కు చేరుతాయని క్రిక్‌ట్రాకర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ పేర్కొన్నాడు. అయితే ఇక్కడే భజ్జీ పప్పులో కాలేశాడు. ఎందుకంటే భజ్జీ ఎంచుకున్న జట్లలో మూడు టీమ్స్ ఒకే గ్రూపులో ఉన్నవి కావడం గమనార్హం.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో మొత్తం 8 జట్లు పాల్గోంటున్నాయి. వాటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు-ఎలో బంగ్లాదేశ్, భారత్, పాకిస్తాన్ న్యూజిలాండ్.. గ్రూపు-బిలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్ ఉన్నాయి. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు జట్లు మాత్రమే సెమీ-ఫైనల్‌కు చేరుకుంటాయి.
కానీ భజ్జీ మాత్రం గ్రూపు-ఎ నుంచే మూడు జట్లు సెమీస్‌కు చేరుకుంటాయని అంచనావేశాడు. మ్యాథమెటికల్‌గా ఒకే గ్రూపు నుంచి మూడు జట్లు సెమీస్‌కు చేరడం సాధ్యం కాదు. దీంతో నెటిజన్లు హార్బజన్‌ను ట్రోలు చేస్తున్నారు. ఈ మెగా ఈవెంటలో భారత్ తమ తొలి మ్యాచ్‌లో దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న అదే స్టేడియంలో దాయాది పాకిస్తాన్‌తో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.
ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి
చదవండి: #RavindraJadeja: 12 వికెట్లతో చెలరేగిన జడేజా.. పంత్ టీమ్ చిత్తు
Comments
Please login to add a commentAdd a comment