
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం(Babar Azam) మరోసారి తన మార్క్‌ను చూపించడంలో విఫలమయ్యాడు. ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై హాఫ్ సెంచరీతో పర్వాలేదన్పించిన బాబర్.. టీమిండియాతో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో మాత్రం నామమాత్రపు స్కోర్‌కే పరిమితమయ్యాడు.
ఓపెనర్‌గా బరిలోకి దిగిన బాబర్.. 26 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 23 పరుగులు చేసి ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఆజం ఔటయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో బాబర్ పెద్ద ఇన్నింగ్స్ ఆడకపోయినప్పటికి.. ఓ అరుదైన రికార్డును మాత్రం తన పేరిట లిఖించుకున్నాడు.
మూడో పాక్ బ్యాటర్‌గా..
ఐసీసీ వన్డే టోర్నమెంట్‌లలో 1000 పరుగుల మైలు రాయిని అందుకున్న మూడో పాకిస్తాన్ బ్యాటర్‌గా బాబర్ ఆజం రికార్డులకెక్కాడు. హర్షిత్ రాణా బౌలింగ్‌లో కవర్ డ్రైవ్ షాట్‌తో బాబర్ ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఈ ఘనత సాధించడానికి ఆజంకు 24 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.
ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో పాకిస్తాన్ దిగ్గజ ఓపెనర్ సయీద్ అన్వర్(1204) అగ్రస్ధానంలో ఉండగా.. రెండో స్ధానంలో జావేద్ మియాందాద్(1083) ఉన్నారు. కాగా బాబర్ ఆజం గత కొంత కాలంగా తన స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతడి చివరి సెంచరీ ఆగస్టు 2023లో నేపాల్‌పై సాధించాడు.
అప్పటి నుంచి మూడెంకెల స్కోర్‌ను ఈ మాజీ అందుకోలేకపోతున్నాడు. ఓవరాల్‌గా తన కెరీర్‌లో ఇప్పటివరకు 128 వన్డేలు ఆడిన ఆజం.. 55.51 సగటుతో 6106 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 19 సెంచరీలు ఉన్నాయి.
చదవండి: Ind vs Pak: పాక్‌తో మ్యాచ్‌లో అతడిని ఆడించాల్సింది.. కానీ: గావస్కర్