టీమిండియా చెత్త రికార్డు.. ప్ర‌పంచంలోనే తొలి జ‌ట్టుగా | India creates unwanted record during Champions Trophy match vs Pakistan | Sakshi
Sakshi News home page

IND vs PAK: టీమిండియా చెత్త రికార్డు.. ప్ర‌పంచంలోనే తొలి జ‌ట్టుగా

Published Sun, Feb 23 2025 4:10 PM | Last Updated on Sun, Feb 23 2025 5:12 PM

India creates unwanted record during Champions Trophy match vs Pakistan

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్‌-భారత్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ షురూ అయింది. దుబాయ్ అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక‌గా చిర‌కాల ప్ర‌త్య‌ర్ధులు తాడోపేడో తెల్చుకుంటున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ మ‌హ్మ‌ద్ రిజ్వాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఈ బ్లాక్ బ్లాస్ట‌ర్ మ్యాచ్‌లో పాక్ ఓ మార్పుతో బ‌రిలోకి దిగింది. గాయప‌డిన ఫ‌ఖార్ జ‌మాన్ స్దానంలో ఇమామ్ ఉల్ హాక్ తుది జ‌ట్టులోకి వ‌చ్చాడు. భార‌త్ మాత్రం త‌మ తుది జ‌ట్టులో ఎటువంటి మార్పులు చేయ‌లేదు.

టీమిండియా చెత్త రికార్డు..
కాగా ఈ మ్యాచ్ ప్రారంభం కాక‌ముందే టీమిండియా ఓ చెత్త రికార్డును త‌మ పేరిట లిఖించుకుంది. వన్డే క్రికెట్‌ చరిత్రలో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిన జ‌ట్టుగా భార‌త్ చెత్త రికార్డును నెల‌కొల్పింది. వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2023 నుంచి భార‌త్ ఇప్ప‌టివ‌ర‌కు వ‌న్డేల్లో వ‌రుస‌గా 12 సార్లు టాస్ ఓడిపోయింది.

ఇంత‌కుముందు ఈ రికార్డు నెద‌ర్లాండ్స్ క్రికెట్ జ‌ట్టు పేరిట ఉండేది. డ‌చ్ జ‌ట్టు 2011-2013 కాలంలో వ‌రుస‌గా 11 సార్లు టాస్ ఓడిపోయింది. తాజా మ్యాచ్‌తో నెదర్లాండ్స్‌ను భార‌త్ అధిగ‌మించింది. అదేవిధంగా వ‌న్డేల్లో వ‌రుసగా అత్య‌ధిక సార్లు టాస్ ఓడిన మూడో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ నిలిచాడు.

రోహిత్ ఇప్ప‌టివ‌ర‌కు వ‌రుస‌గా 9 సార్లు టాస్ ఓడిపోయాడు. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో వెస్టిండీస్ దిగ్గ‌జం బ్రియాన్ లారా అగ్ర‌స్ధానం ఉన్నాడు. లారా వన్డేల్లో వ‌రుస‌గా 12 సార్లు టాస్ ఓడిపోయాడు.

తుది జట్లు..
పాకిస్తాన్‌: సౌద్‌ షకీల్‌, బాబర్‌ ఆజమ్‌, ఇమామ్‌ ఉల్‌ హక్‌, రిజ్వాన్‌ (కెప్టెన్‌, సల్మాన్‌ అఘా, తయ్యబ్‌ తాహిర్‌, ఖుష్దిల్‌ షా, షాహీన్‌ అఫ్రిది, నసీం షా, హరీస్‌ రౌఫ్‌, అబ్రార్‌ అహ్మద్‌

భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, అక్షర్‌ పటేల్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్‌ రాణా, షమీ, కుల్దీప్‌ యాదవ్‌
చదవండి: షమీ చెత్త రికార్డు.. చాంపియన్స్‌ ట్రోఫీ చరిత్రలోనే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement