
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా భారత జట్టు అవతరించింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను తిరిగి ముద్దాడింది. ఈ విజయంతో 25 ఏళ్ల కిందట కివీస్ చేతిలో ఎదురైన పరాభావానికి భారత జట్టు బదులు తీర్చుకుంది. ఈ మెగా టోర్నీలో అద్వితీయమైన ప్రదర్శన కనబరిచిన రోహిత్ సేన.. మరోసారి 140 కోట్లమంది భారతీయులను సగర్వంగా తలెత్తుకునేలా చేసింది.
ఈ విజయంలో జట్టులోని ప్రతీ ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించారు. తొలుత బౌలర్లు అదరగొట్టగా.. అనంతరం బ్యాటర్లు తమ పని తాము చేసుకుపోయారు. కివీస్ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్యాన్ని భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది.
రోహిత్ మాస్.. రాహుల్ క్లాస్
లక్ష్య చేధనలో కెప్టెన్ రోహిత్ శర్మ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఓవర్ నుంచే కివీస్ బౌలర్లను హిట్‌మ్యాన్ టార్గెట్ చేశాడు. పవర్ ప్లేలో బౌండరీల వర్షం కురిపించాడు. 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. అయితే సెంచరీ చేరువలో ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి స్టంపౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు.
ఆ తర్వాత మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మరోసారి వెన్నముకగా నిలిచారు. శ్రేయస్ అయ్యర్ (62 బంతుల్లో 48, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (33 బంతుల్లో 34 నాటౌట్, 1 ఫోర్, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 7 వికెట్లకు 251 పరుగులు చేసింది.
కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(101 బంతుల్లో 3 ఫోర్లతో 63), మైఖేల్ బ్రేస్‌వెల్(40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు సాధించగా.. మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు.
టీమిండియా వరల్డ్ రికార్డు..
కాగాభారత్‌కు ఇది మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్. ఈ క్రమంలో టీమిండియా ఓ ప్రపంచరికార్డును తమ పేరిట లిఖించుకుంది. మూడు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను గెలుచుకున్న మొదటి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. 2002లో శ్రీలంకతో కలిసి సంయుక్తంగా ట్రోఫీని గెలుచుకున్న టీమిండియా.. ఆ తర్వాత 2013, 2025లో ఈ మెగా టోర్నీ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా, భారత్ పేరిట సంయుక్తంగా ఉండేది.
కానీ ఈ విజయంతో ఆసీస్‌ను మెన్ బ్లూ అధిగమించింది. అదేవిధంగా వరుసగా రెండు ఐసీసీ టోర్నీల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఛాంపియన్స్‌గా నిలిచిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. టీ20 ప్రపంచకప్-2024లో ఆజేయంగా విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు.. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఒక్క మ్యాచ్‌లో కూడా టీమిండియా ఓడిపోలేదు.
చదవండి: #Rohit Sharma: రిటైర్మెంట్‌పై రోహిత్ శర్మ కీలక ప్రకటన..
Comments
Please login to add a commentAdd a comment