భారత క్రికెట్ జట్టు తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమైంది. సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. అయితే ఈ సిరీస్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మను మాజీ క్రికెటర్లు సున్నితంగా హెచ్చరించారు.
బంగ్లాదేశ్‌ను తక్కువగా అంచనా వేయద్దని భారత మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, హర్భజన్ సింగ్‌లు రోహిత్‌ను సూచించారు. కాగా టెస్టు క్రికెట్‌లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా భారత్‌ను బంగ్లాదేశ్ ఓడించలేదు.
కానీ బంగ్లా జట్టు మాత్రం ఇటీవల కాలంలో టెస్టుల్లో సంచలన ప్రదర్శన కనబరుస్తోంది. గతేడాది ఆఖరిలో న్యూజిలాండ్‌ను ఓడించిన బంగ్లా టైగర్స్.. తాజాగా పాకిస్తాన్‌ను వారి స్వదేశంలోనే చిత్తు చేశారు. కాబట్టి బంగ్లా జట్టు నుంచి భారత్‌కు పోటీ ఎదురయ్యే ఛాన్స్ ఉంది.
టీమిండియా ఐదు నెలల తర్వాత టెస్టుల్లో ఆడనుంది. బంగ్లాతో సిరీస్‌కు భారత టెస్టు జట్టును ఎంపిక చేసే పనిలో సెలక్షన్ కమిటీ పడింది. దులీప్ ట్రోఫీలో భారత టాప్ ప్లేయర్లను భాగం చేయడం బీసీసీఐ తీసుకున్న ఒక మంచి నిర్ణయం.
రెడ్‌బాల్ క్రికెట్(టెస్టు) ఆడినప్పుడు ఆటగాళ్లకు చాలా విషయాలు తెలుస్తాయి. బంగ్లాదేశ్‌ను తేలికగా తీసుకోవద్దు. బంగ్లా జట్టులో అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు. అంతేకాకుండా గత కొంత కాలం నుంచి నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లు కూడా ఉన్నారు.
ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఈ సిరీస్ భారత జట్టు మంచి ప్రాక్టీస్‌గా ఉపయోగపడుతోందని ఏఎన్ఐతో రైనా పేర్కొన్నాడు. హర్భజన్ సింగ్ సైతం రైనా వ్యాఖ్యలను సమర్ధించాడు.
ఇది గొప్ప సిరీస్ కానుంది. భారత జట్టు చాలా బలంగా ఉంది. కానీ బంగ్లాదేశ్‌ను కూడా తక్కువగా అంచనా వేయలేం. వారు రావల్పండి వేదికగా జరిగిన తొలి టెస్టులో పాక్‌ను ఓడించారు. కొన్ని సార్లు చిన్న జట్లు కూడా అద్భుతాలు సృష్టిస్తాయి అని భజ్జీ చెప్పుకొచ్చాడు. కాగా సిరీస్ సెప్టెంబర్ 19 నుంచి జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment