స్వదేశంలో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. పుణే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో భారత్ కోల్పోయింది.
359 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 245 పరుగులకే ఆలౌటైంది. మరోసారి కివీస్ స్పిన్నర్లు భారత్‌కు చుక్కలు చూపించారు. ముఖ్యంగా మిచెల్ శాంట్నర్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా 6 వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాసించాడు.
అతడితో పాటు అజాజ్ పటేల్ 2 వికెట్లు, ఫిలిప్స్ ఒక్క వికెట్ సాధించాడు. భారత బ్యాటర్లలో యశస్వీ జైశ్వాల్ 77 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు కివీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 232 పరుగులకు ఆలౌటైంది. కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ టామ్ లాథమ్(86) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 103 పరుగుల ఆధిక్యాన్ని జోడించి భారత్ ముందు 359 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ఉంచింది. ఈ భారీ టార్గెట్ చేధించడంలో రోహిత్ సేన చతికలపడింది. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్ల దారుణ ప్రదర్శన కనబరిచారు.
మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్ స్పిన్నర్ల దాటికి టీమిండియా కేవలం 156 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో శాంట్నర్ 7 వికెట్లతో సత్తాచాటాడు. ఓవరాల్‌గా పుణే టెస్టులో 13 వికెట్లు పడగొట్టిన శాంట్నర్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడో టెస్టు నవంబర్ 1 నుంచి వాంఖడే వేదికగా జరగనుంది.
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ రెండో టెస్టు(అక్టోబరు 24- 28)
వేదిక: మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పుణె
టాస్: న్యూజిలాండ్.. తొలుత బ్యాటింగ్
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 259
టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 156
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 255
భారత్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 245
ఫలితం: 113 పరుగుల తేడాతో భారత్ ఓటమి
Comments
Please login to add a commentAdd a comment