pune test
-
కివీస్ సరికొత్త చరిత్ర.. రోహిత్ చెత్త రికార్డు
సొంతగడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ విజయపరంపరకు కళ్లెం పడింది. న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో రోహిత్ సేన 113 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. ఫలితంగా గత 18 టెస్టు సిరీస్‌లలో టీమిండియా సాగించిన జైత్రయాత్రకు బ్రేక్ పడింది. కివీస్ సరికొత్త చరిత్రఅంతేకాదు.. పుణె టెస్టు ఓటమితో రోహిత్ సేన ఖాతాలో మరో చెత్త రికార్డు కూడా నమోదైంది. స్వదేశంలో కివీస్ జట్టు చేతిలో భారత్‌కు ఇదే తొలి పరాజయం. పన్నెండేళ్ల తర్వాత సొంతగడ్డపై ఇదే తొలి టెస్టు సిరీస్ ఓటమి కూడా!.. ఇక ఈ విజయంతో న్యూజిలాండ్ భారత్‌లో మొట్టమొదటి సిరీస్ గెలిచి.. సరికొత్త చరిత్ర సృష్టించింది.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా కివీస్ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడేందుకు భారత్‌కు వచ్చింది. ఈ క్రమంలో బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో రోహిత్ సేనపై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందిన కివీస్.. తాజాగా పుణె టెస్టులో 113 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పదమూడు వికెట్లు కూల్చి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించిన న్యూజిలాండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండో టెస్టు విశేషాలుభారత్లో పర్యాటక జట్ల టెస్టు సిరీస్ విజయాలు👉ఇంగ్లండ్- ఐదుసార్లు👉వెస్టిండీస్- ఐదుసార్లు👉ఆస్ట్రేలియా- నాలుగుసార్లు👉పాకిస్తాన్- ఒకసారి(1986/87)👉సౌతాఫ్రికా- ఒకసారి(1999/00)👉న్యూజిలాండ్- ఒకసారి(2024/25)ఒక క్యాలెండర్ ఇయర్లో టీమిండియా ఓడిన అత్యధిక మ్యాచ్‌లు👉1969- నాలుగు(ఆస్ట్రేలియా చేతిలో మూడు, న్యూజిలాండ్ చేతిలో ఒకటి)👉1983- మూడు(వెస్టిండీస్ చేతిలో మూడు)👉2024- మూడు(న్యూజిలాండ్ చేతిలో రెండు, ఇంగ్లండ్ చేతిలో ఒకటి).కపిల్ దేవ్, అజారుద్దీన్‌తో పాటు రోహిత్రోహిత్ శర్మ ఇప్పటి వరకు సొంతగడ్డపై 15 టెస్టుల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. కివీస్ చేతిలో ఓటమితో తాజాగా అతడి ఖాతాలో నాలుగో పరాజయం నమోదైంది. అంతకు ముందు కపిల్ దేవ్, మహ్మద్ అజారుద్దీన్ సంయుక్తంగా ఇరవై టెస్టుల్లో సారథ్యం వహించి నాలుగేసి మ్యాచ్‌లు ఓడిపోయారు. ఈ జాబితాలో అత్యధికంగా 9 టెస్టు పరాజయాల(ఇరవై ఏడింట)తో మన్సూర్ అలీ పటౌడీ ఖాన్ ముందు వరుసలో ఉన్నాడు. చదవండి: అస్సలు ఊహించలేదు.. ఇది సమిష్టి వైఫల్యం: రోహిత్ శర్మ -
అస్సలు ఊహించలేదు.. ఓటమికి ఏ ఒక్కరినో నిందించను: రోహిత్
న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ పరాభవంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ ఓటమి తాము అస్సలు ఊహించలేదని విచారం వ్యక్తం చేశాడు. కివీస్ జట్టు విసిరిన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయామని.. అందుకే పరాజయం పాలయ్యామని పేర్కొన్నాడు. న్యూజిలాండ్ తమ కంటే మెరుగ్గా ఆడిందని.. వాళ్లు విజయానికి అర్హులేనన్నాడు.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగంగా భారత్ సొంతగడ్డపై కివీస్‌తో మూడు మ్యాచ్‌లు ఆడుతోంది. ఈ క్రమంలో బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో రోహిత్ సేన 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇందుకు ప్రతీకారం తీర్చుకునే క్రమంలో పుణె వేదికగా గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది.భారత బౌలర్లు రాణించినాఅయితే, ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు రాణించినా బ్యాటర్లు విఫలమయ్యారు. ఫలితంగా మరోసారి టీమిండియాకు కివీస్ చేతిలో ఓటమి తప్పలేదు. పుణెలో శనివారం నాటి మూడో రోజు ఆటలో టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేయడంతో 113 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది.ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ... ‘‘ఈ ఓటమి తీవ్రంగా నిరాశపరిచింది. మేము ఇది అస్సలు ఊహించలేదు. మా కంటే న్యూజిలాండ్ బాగా ఆడింది. మాకు గెలిచే అవకాశం వచ్చినా.. దానిని ఒడిసిపట్టలేకపోయాం. సవాళ్లకు ఎదురీదలేకపోయాం.అందుకే ఈరోజు ఇక్కడ ఇలాంటి విపత్కరపరిస్థితిలో ఉండాల్సి వచ్చింది. మా బ్యాటింగ్ బాగాలేదని అనుకోవడం లేదు. నిజానికి 20 వికెట్లు తీస్తే గెలిచే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. అయితే, బ్యాటింగ్ సమయంలోనూ మేము పట్టుదలగా పోరాడాము.ఓటమికి ఏ ఒక్కరినో నిందించనుకానీ గెలిచేందుకు ఆ పోరాటం సరిపోలేదు. ఇందులో పిచ్‌ను నిందించడానికి ఏమీ లేదు. ఇది సమిష్టి వైఫల్యం. బ్యాటర్లు లేదంటే బౌలర్లలో ఎవరో ఒకరిని మాత్రమే తప్పుబట్టి.. ఓటమికి వారినే బాధ్యులను చేసే రకం కాదు నేను! కచ్చితంగా మరింత స్ట్రాంగ్‌గా తిరిగివస్తాం. వాంఖడేలో గెలిచేందుకు ప్రయత్నిస్తాం’’ అని పేర్కొన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో కాస్త పోరాడి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని రోహిత్ శర్మ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండో టెస్టు(అక్టోబరు 24- 28)వేదిక: మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పుణెటాస్: న్యూజిలాండ్.. మొదట బ్యాటింగ్న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 259టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 156న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 255టీమిండియా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 245ఫలితం: 113 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపుచదవండి: IND vs NZ: పుణె టెస్టులో ఓటమి.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే..? -
IND vs NZ: టీమిండియా ఘోర ఓటమి.. సిరీస్ కివీస్ సొంతం
స్వదేశంలో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. పుణే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో భారత్ కోల్పోయింది.359 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 245 పరుగులకే ఆలౌటైంది. మరోసారి కివీస్ స్పిన్నర్లు భారత్‌కు చుక్కలు చూపించారు. ముఖ్యంగా మిచెల్ శాంట్నర్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా 6 వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాసించాడు.అతడితో పాటు అజాజ్ పటేల్ 2 వికెట్లు, ఫిలిప్స్ ఒక్క వికెట్ సాధించాడు. భారత బ్యాటర్లలో యశస్వీ జైశ్వాల్ 77 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు కివీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 232 పరుగులకు ఆలౌటైంది. కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ టామ్ లాథమ్(86) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 103 పరుగుల ఆధిక్యాన్ని జోడించి భారత్ ముందు 359 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ఉంచింది. ఈ భారీ టార్గెట్ చేధించడంలో రోహిత్ సేన చతికలపడింది. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్ల దారుణ ప్రదర్శన కనబరిచారు. మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్ స్పిన్నర్ల దాటికి టీమిండియా కేవలం 156 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో శాంట్నర్ 7 వికెట్లతో సత్తాచాటాడు. ఓవరాల్‌గా పుణే టెస్టులో 13 వికెట్లు పడగొట్టిన శాంట్నర్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడో టెస్టు నవంబర్ 1 నుంచి వాంఖడే వేదికగా జరగనుంది.భారత్ వర్సెస్ న్యూజిలాండ్ రెండో టెస్టు(అక్టోబరు 24- 28)వేదిక: మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పుణెటాస్: న్యూజిలాండ్.. తొలుత బ్యాటింగ్న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 259టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 156న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 255భారత్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 245ఫలితం: 113 పరుగుల తేడాతో భారత్ ఓటమి -
Ind vs NZ: రోహిత్ శర్మ మరోసారి ఫెయిల్.. నీకేమైంది ’హిట్‌మ్యాన్’?!
న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో టీమిండియా తడ‘బ్యాటు’ కొనసాగుతోంది. పుణెలో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ రూపంలో ఆదిలోనే భారీ షాక్ తగిలింది. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. తాజాగా రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమయ్యాడు.కివీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో బంతిని తప్పుగా అంచనా వేసి రోహిత్ వికెట్ సమర్పించుకున్నాడు. ఎనిమిది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. అయితే, రోహిత్ అవుటైన తీరుపై టీమిండియా అభిమానులు సైతం ఫైర్ అవుతున్నారు.లంచ్ బ్రేక్ సమయానికిస్కోరు ఎంతంటే?భారత రెండో ఇన్నింగ్స్‌లో ఆరో ఓవర్‌ను సాంట్నర్ వేశాడు. అతడి బౌలింగ్‌లో నాలుగో బంతి అవుట్‌సైడ్ ఆఫ్ దిశగా వచ్చి.. బౌన్స్ అయింది. ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుని బ్యాట్‌ను తాకి ఫీల్డర్ విల్ యంగ్ చేతిలో పడింది. దీంతో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఇక శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా భోజన విరామ సమయానికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది.క్యాచ్‌లు కూడా వదిలేశాడు! ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ ఈ టెస్టు మ్యాచ్‌లో పలు క్యాచ్‌లు డ్రాప్ చేసిన విషయం తెలిసిందే. అశ్విన్ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్(48*), రవీంద్ర జడేజా బౌలింగ్‌లో టామ్ బ్లండెల్(41) ఇచ్చిన ఇచ్చిన ఈజీ క్యాచ్‌లను హిట్‌మ్యాన్ వదిలేశాడు. కాగా పుణె టెస్టులో న్యూజిలాండ్ భారత్‌కు 359 పరుగుల భారీ లక్ష్యం విధించింది. ఇక తొలుత బెంగళూరులో జరిగిన టెస్టులో కివీస్ గెలిచి ఇప్పటికే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. బెంగళూరు టెస్టులోనూ రోహిత్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. తొలి ఇన్నింగ్స్‌లో రెండు పరుగులే చేసిన ఈ ఓపెనర్.. రెండో ఇన్నింగ్స్‌లో అర్ద శతకం(52)తో ఫర్వాలేదనిపించాడు.భారత్ వర్సెస్ న్యూజిలాండ్ రెండో టెస్టు(అక్టోబరు 24- 28)వేదిక: మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పుణెటాస్: న్యూజిలాండ్.. తొలుత బ్యాటింగ్న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 259టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 156న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 255టీమిండియా లక్ష్యం: 359.చదవండి: IND vs NZ Day 3 Lunch: రోహిత్ ఔటైనా దూకుడుగా ఆడుతున్న భారత్~ Can't Bat~ Can't Bowl~ Can't Run~ Can't Field~ Can't Captain ~ Can't Remain Fit~ Can't Take Review That's Captain Rohit Sharma for you!!🤡🤡 #INDvNZpic.twitter.com/EShOy7K6sO— ` (@krish_hu_yaar) October 26, 2024 -
ఇదేం కెప్టెన్సీ రోహిత్?.. మాజీ హెడ్‌కోచ్ ఘాటు విమర్శలు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి విమర్శలు గుప్పించాడు. న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో ఈ ముంబైకర్ కెప్టెన్సీ అస్సలు బాగాలేదంటూ పెదవి విరిచాడు. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపిస్తున్నా ఫీల్డింగ్ సెట్ చేయడంలో రోహిత్ విఫలమయ్యాడని విమర్శించాడు.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా భారత్ స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌లు ఆడుతోంది. ఈ క్రమంలో బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో కివీస్ గెలిచి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ నేపథ్యంలో పుణె వేదికగా గురువారం మొదలైన రెండో టెస్టులోనూ రోహిత్ సేన తడబడుతోంది.బ్యాటింగ్‌లో మాత్రం మరోసారి విఫలంటాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా కివీస్‌ను 259 పరుగులకు కట్టడి చేయగలిగింది. అయితే, బ్యాటింగ్‌లో మాత్రం మరోసారి విఫలమైంది. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో న్యూజిలాండ్‌కు 103 పరుగుల ఆధిక్యం లభించింది.ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కివీస్‌కు ఓపెనర్, కెప్టెన్ టామ్ లాథమ్ హాఫ్ సెంచరీ(86)తో శుభారంభం అందించాడు. ఇతర బ్యాటర్లు కూడా తమ వంతు సహకారం అందించడంతో మూడు వందలకు పైగా ఆధిక్యంతో న్యూజిలాండ్ పటిష్ట స్థితిలోకి వెళ్లింది.ఈ నేపథ్యంలో రవిశాస్త్రి తోటి కామెంటేటర్ మురళీ కార్తిక్‌తో మాట్లాడుతూ.. ‘‘కాస్త వ్యూహాత్మకంగా ముందుడుగు వేయాలి కదా! న్యూజిలాండ్‌ను 120 పరుగులకే ఆలౌట్ చేయాలని భావిస్తున్నట్లయితే.. అందుకు తగ్గట్లుగానే ఆడాలి. వికెట్లు కావాలనుకుంటే అటాకింగ్ పొజిషన్లలో ఫీల్డింగ్ సెట్ చేయాలి.మూస పద్ధతిలో వెళ్తే ఎలా? ఒకవేళ ప్రత్యర్థి వికెట్ నష్టపోకుండానే 60 పరుగులు చేసినపుడు కూడా భిన్నంగా గాకుండా మూస పద్ధతిలో వెళ్తే ఎలా? ఫీల్డింగ్ ఇలా సెట్ చేయడం వల్ల మాత్రం మీకు ఎంతమాత్రం వికెట్లు లభించవు’’ అంటూ రోహిత్ శర్మ కెప్టెన్సీని విమర్శించాడు. కాగా ఈ మ్యాచ్‌లో బ్యాటర్‌గానూ రోహిత్ విఫలమయ్యాడు. తొమ్మిది బంతులు ఎదుర్కొని టిమ్ సౌతీ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇదిలా ఉంటే.. రెండో రోజు ఆట ముగిసే సరికి కివీస్ 53 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. టీమిండియా కంటే 301 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.చదవండి: ఒక్క పరుగు.. 8 వికెట్లు.. 53 పరుగులకే కుప్పకూలిన డిఫెండింగ్ చాంపియన్ -
Ind vs NZ: వాషీకి సలహా.. బెడిసికొట్టగానే పంత్ రియాక్షన్ వైరల్
టీమిండియా స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌కు వికెట్ కీపర్ బ్యాటర్ క్రికెటర్ రిషభ్ పంత్ ఇచ్చిన సలహా బెడిసికొట్టింది. ఫలితంగా.. వికెట్ తీయాలనుకున్న వాషీకి.. బ్యాటర్ బౌండరీ బాది షాకిచ్చాడు. దీంతో మాట మార్చిన పంత్.. తనదేమీ తప్పులేదన్నట్లుగా సమర్థించుకోవడంతో వాషీ బిక్కముఖం వేశాడు. ఇంతకీ సంగతి ఏమిటంటే..!న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో ఓడిన టీమిండియా.. పుణె వేదికగా గురువారం రెండో టెస్టు మొదలుపెట్టింది. టాస్ గెలిచిన కివీస్ తొలుత బ్యాటింగ్ చేయగా.. రోహిత్ సేన బౌలింగ్‌కు దిగింది.ఈ క్రమంలో రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్ ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. ఈ ఇద్దరు చెన్నై బౌలర్లు కలిసి కివీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌట్ చేశారు. ఇదిలా ఉంటే.. గురువారం నాటి తొలి రోజు ఆటలో భాగంగా కివీస్ ఇన్నింగ్స్‌లో 78వ ఓవర్ వాషీ వేశాడు.పంత్ సలహాను పాటించిన వాషీఅప్పుడు.. న్యూజిలాండ్ టెయిలెండర్ అజాజ్ పటేల్ క్రీజులో ఉన్నాడు. ఈ క్రమంలో అతడి కాళ్ల ముందు కాస్త ఎడంగా బాల్ వేయాలని వికెట్ కీపర్ రిషభ్ పంత్ వాషింగ్టన్కు సూచించాడు. అందుకు సానుకూలంగా స్పందించిన వాషీ.. పంత్ సలహాను పాటించాడు.PC: Jio Cinema Xఫోర్ కొట్టిన అజాజ్ పటేల్అయితే, వీరి సంభాషణను అర్థం చేసుకున్న అజాజ్ పటేల్ కాస్త ముందుకు వచ్చి ఆడి బంతిని బౌండరీకి తరలించాడు. దీంతో వాషీ నిరాశకు గురికాగా.. పంత్ మాత్రం.. ‘‘అతడికి హిందీ వచ్చని నాకేం తెలుసు?’’ అంటూ తన సలహాను సమర్థించుకున్నాడు.ఇక పంత్ కామెంట్స్ స్టంప్ మైక్‌లో రికార్డయ్యాయి. కాగా భారత సంతతికి చెందిన అజాజ్ పటేల్ ముంబైలో జన్మించాడు. తనకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నపుడు అజాజ్ కుటుంబం న్యూజిలాండ్‌కు వెళ్లింది. మరి పంత్ హిందీలో వాషీతో మాట్లాడుతుంటే అజాజ్ పటేల్‌కు అర్థం కాకుండా ఉంటుందా?! అదీ సంగతి!156 పరుగులకే ఆలౌట్‌కాగా శుక్రవారం 16-1తో రెండో రోజు బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా 156 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ స్పిన్నర్లు మిచెల్ సాంట్నర్ ఏడు, గ్లెన్ ఫిలిప్స్ రెండు వికెట్లు తీయగా.. పేసర్ టిమ్ సౌతీ ఒక వికెట్ పడగొట్టాడు.చదవండి: ఒక్క పరుగు.. 8 వికెట్లు.. 53 పరుగులకే కుప్పకూలిన డిఫెండింగ్ చాంపియన్In today's episode of 𝘒𝘦𝘦𝘱𝘪𝘯𝘨 𝘸𝘪𝘵𝘩 𝘙𝘪𝘴𝘩𝘢𝘣𝘩 𝘗𝘢𝘯𝘵! 👀😂#INDvNZ #IDFCFirstBankTestTrophy #JioCinemaSports #TeamIndia pic.twitter.com/LoUC31wADr— JioCinema (@JioCinema) October 24, 2024 -
గ్లెన్ ఫిలిప్స్ మాయాజాలం: పంత్ బౌల్డ్.. పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. పుణె వేదికగా రెండో రోజు ఆటలో భాగంగా శుక్రవారం 16-1 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ మొదలుపెట్టిన రోహిత్ సేనకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కివీస్ బౌలర్ మిచెల్ సాంట్నర్ తన స్పిన్ మాయాజాలంతో వరుస విరామాల్లో కీలక వికెట్లు పడగొట్టాడు.తొలుత కోహ్లిభారత ఇన్నింగ్స్ 22వ ఓవర్ మూడో బంతికి శుబ్‌మన్ గిల్(30)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న సాంట్నర్.. 24వ ఓవర్ నాలుగో బంతికి విరాట్ కోహ్లి(1)ని బౌల్డ్ చేశాడు. అయితే, సాంట్నర్ వేసిన లో ఫుల్‌టాస్‌ను ఆడలేక వికెట్ పారేసుకోవడం గమనార్హం. ఈ క్రమంలో 60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడ్డవేళ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు రిషభ్ పంత్ తోడయ్యాడు.పంత్- సర్ఫరాజ్ జోడీపై ఆశలువీరిద్దరు కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దుతారని అభిమానులు భావించగా.. కాసేపటికే ఆ ఆశలపై గ్లెన్ ఫిలిప్స్ నీళ్లు చల్లాడు. ఈ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్ 26వ ఓవర్ నాలుగో బంతికి జైస్వాల్(30)ను నాలుగో వికెట్‌గా వెనక్కి పంపాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్ క్రీజులోకి వచ్చాడు. దీంతో వీళ్లిద్దరు కలిసి బెంగళూరు టెస్టు తరహాలో భారీ భాగస్వామ్యం(నాలుగో వికెట్‌కు 177) నెలకొల్పుతారని అభిమానులు ఆశించారు. గ్లెన్ ఫిలిప్స్ మాయాజాలంఅయితే, గ్లెన్ ఫిలిప్స్ మరోసారి స్పిన్ మంత్రం వేసి.. రిషభ్ పంత్‌ను బౌల్డ్ చేశాడు. 31వ ఓవర్ రెండో బంతికి 18 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద పంత్ నిష్క్రమించాడు. దీంతో 85 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో మునిగింది. ఈసారి రంగంలోకి దిగిన సాంట్నర్ సర్ఫరాజ్ ఖాన్ రూపంలో మరో కీలక వికెట్ పడగొట్టాడు. 34వ ఓవర్ ఆరో బంతికి సాంట్నర్ బౌలింఘ్ సర్ఫరాజ్ విలియం రూర్కీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 34 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా కేవలం 95 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. లంచ్@ 107/7ఇక అశ్విన్(4) సాంట్నర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ కాగా.. 103 పరుగుల స్కోరు వద్ద భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. కివీస్ తొలి ఇన్నింగ్స్ కంటే ఇంకా 152 పరుగులు వెనుకబడి ఉంది. లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు- 107/7 (38). కివీస్ తొలి ఇన్నింగ్స్ కంటే ఇంకా 152 పరుగులు వెనుకబడి ఉంది.చదవండి: పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ఓవరాల్‌గా రెండోసారి..! -
Ind vs NZ: అతడి ఆట తీరు బాగుంది.. అయినా..: గంభీర్
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్‌కు హెడ్‌కోచ్ గౌతం గంభీర్ అండగా నిలిచాడు. ఈ కర్ణాటక బ్యాటర్ ఆటతీరు పట్ల తాము సంతృప్తిగానే ఉన్నామని తెలిపాడు. బయటవాళ్లు ఏమనుకుంటున్నారో అన్న అంశాలతో తమకు సంబంధం లేదని.. జట్టులోని ఆటగాళ్లకు అన్ని వేళలా మద్దతుగా ఉంటామని స్పష్టం చేశాడు. అద్భుత శతకంకాగా భారత టెస్టు జట్టు మిడిలార్డర్లో చోటు కోసం తీవ్రమైన పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఓపెనర్‌గా ఉన్న శుబ్‌మన్ గిల్ వన్‌డౌన్‌లో ఆడుతుండగా.. నాలుగో స్థానంలో విరాట్ కోహ్లి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఐదోస్థానం కోసం కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి సీనియర్లతో సర్ఫరాజ్ ఖాన్ సైతం రేసులో ఉన్నాడు. అయితే, ఇప్పటికే అయ్యర్ జట్టుకు దూరం కాగా.. రాహుల్, సర్ఫరాజ్ పేర్లు తరచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. ఇటీవల బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టుకు గిల్ దూరం కావడంతో.. కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఇద్దరికీ తుదిజట్టులో చోటు దక్కింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో వీరిద్దరు డకౌట్ అయ్యారు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ అద్భుత శతకం(150)తో కదం తొక్కగా.. రాహుల్ కేవలం 12 పరుగులకే పరిమితయ్యాడు.ఈ నేపథ్యంలో పుణె వేదికగా గురువారం కివీస్‌తో మొదలుకానున్న రెండో టెస్టుకు జట్టు ఎంపిక గురించి సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేఎల్ రాహుల్‌ను విమర్శిస్తూ.. సర్ఫరాజ్ ఖాన్ వైపు మొగ్గుచూపుతున్నారు చాలా మంది విశ్లేషకులు. ఈ విషయంపై టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ తాజాగా స్పందించాడు.ప్లేయింగ్ ఎలెవన్ విషయంలో..‘‘ప్లేయింగ్ ఎలెవన్‌ను సోషల్ మీడియా నిర్ణయించలేదు. విశ్లేషకులు, నిపుణులు ఏమనుకుంటున్నారోనన్న విషయాలతోనూ మాకు సంబంధం లేదు. టీమ్ మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తున్నదే ముఖ్యం. ఇటీవల బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కాన్పూర్ పిచ్‌పై పరుగులు రాబట్టడం కష్టమైనా కేఎల్ రాహుల్ మెరుగ్గా రాణించాడు.యాజమాన్యం అతడికి అండగానే ఉందితన ఇన్నింగ్స్‌ను భారీ స్కోర్లుగా మార్చుకోవాల్సి ఉన్న మాట వాస్తవమే. అయినప్పటికీ జట్టు యాజమాన్యం అతడికి అండగానే ఉంది’’ ప్రి మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో గౌతీ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు గిల్ తిరిగి వస్తున్నాడు కాబట్టి.. రాహుల్‌కు ఛాన్స్ ఇచ్చి, సర్ఫరాజ్‌ను తప్పిస్తారనే వాదనలు బలపడుతున్నాయి.ఇంతకు ముందు భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే సైతం మాట్లాడుతూ.. కేఎల్ రాహుల్‌కు గంభీర్ మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలిపాడు. ఇదిలా ఉంటే.. కివీస్‌తో తొలి టెస్టు తర్వాత సర్ఫరాజ్ ఖాన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి శుభవార్త పంచుకున్న విషయం తెలిసిందే.తండ్రిగా ప్రమోషన్తాను తండ్రినయ్యానని.. తన భార్య మగబిడ్డను ప్రసవించిందని ఈ ముంబైకర్ తెలిపాడు. ఈ నేపథ్యంలో కుటుంబానికి సమయం కేటాయించాలనుకుంటే సర్ఫరాజ్ ఖాన్ కేఎల్ రాహుల్‌కు లైన్‌క్లియర్ చేసినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పర్యాటక న్యూజిలాండ్ జట్టు ఆతిథ్య టీమిండియాపై మొదటి మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే.చదవండి: న్యూజిలాండ్ టీమ్‌కు కొత్త కెప్టెన్ -
Ind Vs NZ: రెండో టెస్టులో సర్ఫరాజ్‌కు నో ఛాన్స్!?
న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ కచ్చితంగా ఆడతాడని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. కరుణ్ నాయర్ మాదిరి అతడిని దురదృష్టం వెంటాడబోదని జోస్యం చెప్పాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ముంబైకర్ తుదిజట్టులో ఉండటం అత్యవసరమని పేర్కొన్నాడు.కాగా కివీస్‌తో స్వదేశంలో మూడు టెస్టుల సిరీస్‌ను టీమిండియా పరాజయంతో ఆరంభించింది. బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో రోహిత్ సేన ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌటై దారుణంగా విఫలమైనప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులు భారీ స్కోరు సాధించింది.ఇందుకు ప్రధాన కారణం సర్ఫరాజ్ ఖాన్. తన కెరీర్లో నాలుగో టెస్టు ఆడిన ఈ ముంబై బ్యాటర్ జట్టు కష్టాల్లో ఉన్న వేళ 150 పరుగులతో అద్బుత ప్రదర్శన కనబరిచాడు. అదే సమయంలో మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఈ కర్ణాటక బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 12 పరుగులకే నిష్క్రమించాడు.ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్‌కు తుదిజట్టులో చోటు దక్కడానికి కారణం శుబ్‌మన్ గిల్ గైర్హాజరీ. ఫిట్నెస్ లేమి కారణంగా గిల్ దూరం కావడంతో విరాట్ కోహ్లి మూడో స్థానంలో రాగా.. సర్ఫరాజ్ నాలుగో నంబర్ బ్యాటర్‌గా కోహ్లి స్థానాన్ని భర్తీ చేశాడు. అయితే, మిడిలార్డర్లో కేఎల్ రాహుల్‌తో సర్ఫరాజ్ పోటీపడుతున్న విషయం తెలిసిందే.గిల్ తిరిగి వస్తే ఈ ఇద్దరిలో ఒకరిపై వేటుపడకతప్పదు. తాజా ప్రదర్శన నేపథ్యంలో మేనేజ్మెంట్ సర్ఫరాజ్వైపే మొగ్గుచూపి.. రాహుల్‌ను బెంచ్‌కే పరిమితం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కరుణ్ నాయర్ సంగతిని గుర్తుచేస్తూ సర్ఫరాజ్‌ను కూడా బ్యాడ్‌లక్ వెంటాడవచ్చునని పేర్కొన్నాడు.ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘అవును.. కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ(300) చేసిన తర్వాత కూడా తదుపరి మ్యాచ్‌లోనే అతడిని తప్పించారు. అజింక్య రహానే తిరిగి రావడంతో కరుణ్‌ను డ్రాప్ చేశారు. టెస్టు కెరీర్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే, కరుణ్ నిలకడలేమి ఫామ్ వల్లే అలా జరిగి ఉండవచ్చు.ఒకవేళ కేఎల్ రాహుల్ కోసం సర్ఫరాజ్‌ను బెంచ్‌కే పరిమితం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే, నాకు మాత్రం అతడు పుణె మ్యాచ్‌లో కచ్చితంగా ఆడతాడనే అనిపిస్తోంది. రాహుల్ రెండు ఇన్నింగ్స్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు. అంతేకాదు.. ప్రస్తుతం టీమిండియా పరిస్థితి, డ్రెసింగ్ రూం వాతావరణం చూస్తుంటే సర్ఫరాజ్ పుణె టెస్టు తుదిజట్టులో చోటు దక్కించుకుంటాడనే అనిపిస్తోంది’’ అని పేర్కొన్నాడు. స్పోర్ట్స్18తో మాట్లాడుతూ ఆకాశ్ చోప్రా ఈ మేర వ్యాఖ్యలు చేశాడు. కాగా కరుణ్ నాయర్ 2017లో ఇంగ్లండ్‌తో టెస్టులో త్రిశతకం బాదినా.. ఆ మరుసటి మ్యాచ్‌లో అతడికి చోటు దక్కలేదు. -
వీవీఎస్ లక్ష్మణ్ అద్భుతమైన క్యాచ్..!!
పుణె : టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ ఒంటిచేత్తో అద్భుతమైన క్యాచ్ పట్టాడు. కామెంటేటర్‌గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లక్ష్మణ్.. తోటి కామెంటటేటర్లతో కలిసి గల్లీ క్రికెట్ ఆడాడు. పుణె టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమవడానికి ముందు వీరి గల్లీ క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఆకాశ్‌చోప్రా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేసిన ఈ సొగసరి బ్యాట్స్‌మన్ కొద్దిపాటి డైవ్ చేసి వన్బౌన్స్ క్యాచ్ అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం.. ‘నేను పట్టిన అత్యద్భుతమైన క్యాచ్లలో ఇదొకటి. అయితే, ఫుల్ సూట్లో ఉన్న సమయంలో ఈ మ్యాచ్ జరిగింది. తెల్ల దుస్తుల్లో ఉన్నప్పుడు కాదు’అని సరదాగా ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ వైరల్ అయింది. ఇక పుణెలో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 137 పరుగుల భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో మూడు టెస్టుల సిరిస్‌ను భారత్ 2-0తో సొంతం చేసుకుంది. మూడో టెస్టు రాంచీలో ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. Never knew one of my finest close in catches would come in a full suit and not whites 😅.. Sunday morning cricket coming up on #Cricketlive 11.30am @StarSportsIndia Hindi pic.twitter.com/8YUBfWAZeh — VVS Laxman (@VVSLaxman281) October 13, 2019 -
మెరుగైన స్థితిలో భారత్; సౌతాఫ్రికా 275 ఆలౌట్
పుణె : మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో మూడోరోజు టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌ను 601/5 వద్ద డిక్లేర్ చేసిన కోహ్లి సేన ప్రత్యర్థిని 275 పరుగులకు ఆలౌట్ చేసింది. ఫలితంగా పుణే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 326 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. 36/3 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన సఫారీ జట్టును భారత బౌలర్లు కుదురుకోనివ్వలేదు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లతో రాణించాడు. ఉమేష్ యాదవ్ మూడు, మహ్మద్ షమీ రెండు, జడేజా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇదిలాఉండగా.. సౌతాఫ్రికాపై అత్యధిక టెస్ట్ వికెట్లను తీసుకున్న నాలుగో భారత ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు. అనిల్ కుంబ్లే (84), జవగళ్ శ్రీనాథ్ (64, హర్భజన్ సింగ్ (60) తర్వాతి స్థానంలో అశ్విన్ (50) ఉన్నాడు. (చదవండి : రోహిత్‌ను ముద్దాడేందుకు... మైదానంలోకి..) ఇక భారత బౌలర్ల ధాటికి సఫారీ జట్టు కెప్టెన్ డుప్లెసిస్ (64), డికాక్ (31), బ్రూయెన్ (30) మినహా మిగతా అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అయితే, 162 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిన సఫారీ జట్టును టెయిలెండర్లు కేశవ్ మహరాజ్, ఫిలాండర్ ఆదుకునే ప్రయత్నం చేశారు. కేశవ్ మహరాజ్ (132 బంతుల్లో 72; 12 ఫోర్లు), ఫిలాండర్ (164 బంతుల్లో 44 నాటౌట్; 5 ఫోర్లు) పోరాటంతో సఫారీ జట్టు ఈ మాత్రమైనా స్కోరు సాధించగలిగింది. నిర్ణీత సమయం ముగియడంతో మూడోరోజు ఆటకు విరామం ఇచ్చారు. ఇంకా రెండు రోజులు ఆట మిగిలి ఉంది. ఇక ప్రత్యర్థి జట్టును ఫాలో ఆన్ ఆడించాలా..? లేక రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేపట్టాలా అనే విషయంపై కోహ్లి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. (చదవండి : ద్విశతక కోహ్లినూర్...) తలో చేయి వేశారు.. మార్నింగ్ సెషన్ మొదలైన కొద్దిసేపటికే మహ్మద్ షమీ నూర్జే (3)ని ఔట్ చేశాడు. దీంతో 41 పరుగుల వద్ద పర్యాటక జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. ఓపెనర్లను వెంటవెంటనే పెవిలియన్ చేర్చి హడలెత్తించిన పేసర్ ఉమేష్ యాదవ్ క్రీజులో కుదురుకున్న బ్రూయెన్ (30 పరుగులు, 58 బంతులు, 6 ఫోర్లు)ను ఔట్ చేశాడు. ఇక ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యతను తలకెత్తుకున్న క్వింటన్ డికాక్, కెప్టెన్ డుప్లెసిస్ జోడీని అశ్విన్ విడగొట్టాడు. అశ్విన్ బౌలింగ్‌లో డికాక్ (48 బంతుల్లో 31; 7 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో డుప్లెసిస్-డికాక్ హాఫ్ సెంచరీ భాగస్వామానికి తెరపడింది. అప్పటికీ జట్టు స్కోరు 128/6. ఇక ఏడో వికెట్‌గా ముత్తుసామి (20 బంతుల్లో 7 పరుగులు)ని జడేజా ఎల్బీగా వెనక్కు పంపాడు. కెప్టెన్ డుప్లెసిస్ (117 బంతుల్లో 64; 9 ఫోర్లు, 1 సిక్స్) నిదానంగా ఆడుతూ పరుగులు రాబడుతున్న క్రమంలో అశ్విన్ వేసిన చక్కని బంతికి అతను కూడా పెవిలియన్ చేరక తప్పలేదు. కేశవ్ మహరాజ్ తొమ్మిదో వికెట్‌గా, రబడ పదో వికెట్‌గా పెవిలియన్ చేరారు. -
సచిన్, సెహ్వాగ్‌ను వెనక్కి నెట్టిన కోహ్లి
పుణె : దక్షిణాఫ్రికాతో మహారాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లి (254 నాటౌట్) పరుగుల వరద పారించాడు. అతనికి తోడు మయాంక్ అగర్వాల్ 108, చతేశ్వర్ పుజారా 58, అజింక్య రహానే 59, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 91 పరుగులు సాధించారు. దీంతో 601 పరుగుల భారీ స్కోరు వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో కెప్టెన్ కోహ్లి పలు రికార్డులను అధిగమించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా అత్యధిక డబుల్ సెంచరీలు (7) సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా 7 డబుల్ సెంచరీలు సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. కోహ్లి కంటే ముందు లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్ (12), కుమార సంగక్కర (11), బ్రియన్ లారా (9) ఉన్నారు. వీరేంద్ర సెహ్వాగ్ (6), సచిన్ (6) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. (చదవండి : కోహ్లి డబుల్, ఉమేష్ దెబ్బకు ఢమాల్..!) ఇక టీమిండియా కెప్టెన్‌గా 19 టెస్టు సెంచరీలు సాధించిన రికార్డును కోహ్లి తన పేర లిఖించుకున్నాడు. దీంతో పాటు తక్కువ ఇన్నింగ్స్‌లలో 7 వేల పరుగులు సాధించిన జాబితాలో గ్యారీ సోబర్స్, కుమార సంగక్కరతో కలిసి కోహ్లి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ ముగ్గురూ 138 ఇన్నింగ్స్‌లలో 7 పరుగులు సాధించారు. ఇక వాలీ హామండ్ (131 ఇన్నింగ్స్‌లు), వీరేంద్ర సెహ్వాగ్ (134 ఇన్నింగ్స్‌లు), సచిన్ టెండూల్కర్ (136 ఇన్నింగ్స్‌లు) కోహ్లి కంటే ముందున్నారు. ఇదిలాఉండగా.. పుణె టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగుల మార్క్‌ను చేరుకున్న కోహ్లి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 150 పైచిలుకు పరుగులు సాధించిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. అతనికంటే ముందుగా డాన్ బ్రాడ్‌మన్ 8 సార్లు 150 పైగా పరుగులు సాధించాడు. కెప్టెన్‌గా 19 సెంచరీలు సాధించిన కోహ్లి.. ఆ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌తో సమానంగా నిలిచాడు. (చదవండి : నోరు పారేసుకున్న రబడ.. సర్దిచెప్పిన కెప్టెన్..!) -
నోరు పారేసుకున్న రబడ.. సర్దిచెప్పిన కెప్టెన్..!
పుణె : మహారాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ స్టేడియంలో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆటగాళ్లు పరుగుల వరద పారించారు. 273/3 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన కోహ్లి సేన సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించింది. రెండోరోజు (అజింక్య రహానే 59, రవీంద్ర జడేజా 91) వికెట్లను మాత్రమే కోల్పోయిన టీమిండియా 328 పరుగులు జతచేసి 601 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కెప్టెన్ కోహ్లి 254 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక తొలిరోజు మూడు వికెట్లు ఖాతాలో వేసుకుని సత్తా చాటిన రబడ రెండో రోజు వికెట్లేమీ తీయలేకపోయాడు. ఫ్లాట్ పిచ్‌పై భారత ఆటగాళ్లు చెలరేగుతుంటే చేష్టలుడిగిపోయాడు. తన బౌలింగ్‌లో అలవోకగా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులెత్తిస్తన్న కోహ్లి, రహానేలను చూసి అతనిలో అసహనం పెరిగింది. ఇదే క్రమంలో బౌలర్‌ను మార్చితే బాగుంటుందని కీపర్ క్వింటన్ డీకాక్ కెప్టెన్ డుప్లెసిస్‌కు సూచించడంతో.. రబడలో అసహనం తీవ్రస్థాయికి చేరింది. దీంతో డీకాక్‌తో అతను వాగ్వివాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటమాట పెరగడంతో అక్కడే ఉన్న డుప్లెసిస్ కలగజేసుకున్నాడు. రబడను అతను అక్కడ నుంచి దూరంగా తీసుకెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘టీమిండియా ఆటగాళ్ల దెబ్బకు రబడకు దిమ్మతిరిగింది. అతనేం చేస్తున్నాడో తెలియడం లేదు’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రహానేను మహరాజ్, రవీంద్ర జడేజాను ముత్తుసామి ఔట్ చేశారు. -
పుణే పిచ్ వివాదం: ఐసీసీ ఏమంటోంది!
న్యూఢిల్లీ: ఇటీవల ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరిగిన పుణే టెస్టుపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) స్పందించింది. కేవలం మూడు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ ముగియడం వివాదాస్పద అంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ టెస్ట్ జరిగిన మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం(ఎంసీఏ) పిచ్‌ను చాలా 'పూర్' అంటూ ఐసీసీ మంగళవారం వ్యాఖ్యానించింది. దీనిపై 14 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని బీసీసీఐని ఐసీసీ ఆదేశించింది. ఆసీస్, భారత్ మధ్య జరిగిన ఈ టెస్టుకు మ్యాచ్ రిఫరీగా వ్యవహరించిన క్రిస్ బ్రాడ్ ఈ విషయాలను వెల్లడించాడు. ఐసీసీ జనరల్ మేనేజర్ క్రికెట్, జెఫ్ అల్లార్డిస్, ఎమిరైట్స్ ఎలైట్ ప్యానెల్ నుంచి రంజన్ మదుగులేలు బీసీసీఐ నివేదికను సమీక్షించనున్నారు. క్లాజ్-3 ప్రకారం ఎంసీఏ పిచ్ నాణ్యతపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నట్లు క్రిస్ బ్రాడ్ తెలిపాడు. భారత్‌లో పిచ్ లపై ఇలాంటి విమర్శలు, ఆరోపణలు ఇదే ప్రథమం కాదన్నాడు. 2015, డిసెంబర్ లో దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య నాగ్‌పూర్‌లో జరిగిన టెస్టు పిచ్‌పై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేవలం మూడు రోజుల్లోనే ఆ మ్యాచ్ ముగిసింది. సఫారీలపై 124 పరుగులతో భారత్ నెగ్గిన విషయం తెలసిందే. పుణేలో ఆసీస్‌ను ఓడించి దెబ్బతీయాలని భావించి రూపొందించిన పిచ్‌పై బంతి విపరీతంగా టర్న్ అయింది. ఆసీస్ స్పిన్నర్ ఓకీఫ్ రికార్డు స్థాయిలో 12 వికెట్లు తీసి భారత్ ఓటమిని శాసించాడు. తొలి ఇన్నింగ్స్‌లోనైతే భారత్ తన చివరి ఏడు వికెట్లను 11 పరుగుల వ్యవధిలో కోల్పోవడం గమనార్హం. -
‘రామ’ బాణం పని చేసింది!
శ్రీరామ్ సలహాలతో చెలరేగిన ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన భారత మాజీ ఆటగాడు పుణే: అంతర్జాతీయ క్రికెటర్‌గా శ్రీధరన్ శ్రీరామ్‌కు పెద్దగా గుర్తింపేమీ లేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో దాదాపు పది వేల పరుగులు చేసినా... భారత్ తరఫున నాలుగేళ్ల వ్యవధిలో ఆడింది కేవలం 8 వన్డేలు. వీటిలో 81 పరుగులే చేయగలిగాడు. స్పిన్నర్‌గా కూడా అతనేమీ మురళీధరన్, షేన్ వార్న్‌ల తరహాలో వందల కొద్దీ వికెట్లు తీసిన బౌలర్ కాదు. తీసింది కేవలం 9 వికెట్లే. కానీ తనకున్న పరిజ్ఞానానికి తోడు భారత దేశవాళీలో సాధించిన అపార అనుభవాన్ని అతను కలబోసి ఆస్ట్రేలియాకు అద్భుతాన్ని అందించాడు. పుణే టెస్టు విజయంలో శ్రీరామ్ పోషించిన పాత్ర ఎంతో కీలకం. టీమ్ స్పిన్ కన్సల్టెంట్‌గా చాలా కాలంగా పని చేస్తున్న శ్రీరామ్ సామర్థ్యం ఆసీస్‌కు ఇప్పుడు పనికొచ్చింది. ముఖ్యంగా ఈ టెస్టులో 12 వికెట్లు తీసిన ఒకీఫ్ తన ప్రదర్శనకు శ్రీరామ్ కారణంగా వెల్లడించాడు. ‘ఒకీఫ్ చేసిన సన్నాహాలే అతడికి ఈ ఫలితాన్ని అందించాయి. టెస్టు జరుగుతున్న సమయంలో అతని బౌలింగ్‌లో నేను ఒక్కసారిగా ఏమీ మార్పు చేయలేదు. ఆ రోజు పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్‌ను మార్చుకోవడమే ఒకీఫ్ విజయ రహస్యం. భారత్‌లాంటి చోట ఒక వ్యూహం పని చేయకపోతే మరో వ్యూహంతో సిద్ధంగా ఉండాలి. భిన్నంగా ప్రయత్నించడానికి కూడా అతను సిద్ధమయ్యే ఇక్కడికి వచ్చాడు. మాకు రెండేళ్లుగా పరిచయం ఉంది. బౌలింగ్ విషయంలో తన పరిమితులు ఏమిటో అతనికి బాగా తెలుసు’ అని శ్రీరామ్ విశ్లేషించాడు. మంచి గుర్తింపు... ఇటీవలి కాలంలో ప్రముఖ మాజీ ఆటగాళ్లే ఎక్కు వగా వివిధ జట్లకు కోచ్‌లు, సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు. ఫలితాలు ఎలా ఉన్నా వారి మాటల్లో బలం, వారికి ఆటగాళ్లు ఇచ్చే గౌరవం సహజంగానే ప్రత్యేకంగా ఉంటాయి. ఇలాంటి స్థితిలో వ్యక్తిగతంగా పెద్దగా పేరు ప్రతిష్టలు లేని వ్యక్తి ఆస్ట్రేలియాలాంటి అగ్రశ్రేణి టీమ్‌తో కలిసి పని చేయడం అంత సులువు కాదు. పైగా ఆసీస్ ఆటగాళ్లు సహజంగానే దురుసుగా ఉంటారు. అయితే వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొనే తాను పని చేస్తానని శ్రీరామ్ చెప్పాడు. ‘మనల్ని గౌరవించేందుకు పేరు ప్రఖ్యాతులే ముఖ్యమని నేను భావించడం లేదు. నేను ఏదైనా అర్థవంతంగా మాట్లాడితే వారు దానిని జాగ్రత్తగా విని స్వీకరిస్తారు. అనవసరపు చెత్త మాట్లాడితే ఆటగాళ్లు పట్టించుకోరు. వారితో కలిసిపోయేందుకు నాకు కాస్త సమయం పట్టిన మాట వాస్తవం. నేను చేసిన సూచనలను వారు మెల్లగా నెట్స్‌లో పాటించడం, దాని ఫలి తాలు కనిపించడంతో అంతా సర్దుకుంది. సమస్య ఏదైనా నేను ఆయా ఆటగాడి దగ్గరికి వెళ్లి విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. కేవలం స్పిన్నర్లతోనే కాకుండా జట్టు మొత్తంతో మా ట్లాడే స్వేచ్ఛను నాకు ప్రధాన కోచ్ ఇచ్చారు’ అని శ్రీరామ్ చెప్పుకున్నాడు. కఠోర సాధన... భారత్‌లో సిరీస్ అంటే ఏ విదేశీ జట్టుకైనా అంత సులువు కాదని, అందుకే దుబాయ్‌లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు శ్రీరామ్ వెల్లడించాడు. తొలి టెస్టు విజయం వెనక చాలా శ్రమ ఉందని ఆయన చెప్పాడు. ‘ఎలాంటి వ్యతిరేక ఫలితం కోసమైనా మానసికంగా సిద్ధంగా ఉంటే పరాజయాన్ని కూడా స్వీకరించే ధైర్యం వస్తుంది. ఏదైనా చిన్న అవకాశం కలిసొచ్చినా దానిని అందుకోవడం అవసరం. దుబాయ్‌లో మేం వేర్వేరు పిచ్‌లపై ప్రాక్టీస్ చేశాం. టర్నింగ్, స్లో, లో పిచ్‌లపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాం. ఎలాంటి వికెట్ ఎదురైనా ఆడేందుకు సిద్ధంగా ఉండాలని భావించాం. అయితే పుణేకంటే చెత్త పిచ్‌లను గతంలోనూ నేను చూశాను’ అని శ్రీరామ్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతానికైతే నంబర్‌వన్ టీమ్పైతో ఘన విజయం సాధించి ఆధిక్యం ప్రదర్శించడంలో శ్రీరామ్ సూచనలు అద్భుతంగా పని చేశాయనడంలో సందేహం లేదు. ఇదే జోరు సిరీస్‌లోని మిగతా టెస్టులలో కూడా కొనసాగుతుందా లేదా అనేది ఆసక్తికరం. ఆటగాడి నుంచి కోచ్‌గా... తమిళనాడు తరఫున సుదీర్ఘ కాలం రంజీల్లో ఆడిన శ్రీరామ్ ఆ తర్వాత అస్సాం, మహారాష్ట్ర, గోవాలాంటి జట్లకు కూడా ప్రాతినిధ్యం వహిం చాడు. ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)లో చేరి నిషేధం ఎదుర్కొని, ఆ తర్వాత బయటకు వచ్చాక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ తరఫున కూడా కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. కెరీర్ ఆరంభంలో శ్రీరామ్ అడిలైడ్‌లోని ఆస్ట్రేలియన్ క్రికెట్ అకాడమీలో శివ్‌సుందర్ దాస్, మొహమ్మద్ కైఫ్‌లతో కలిసి ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. స్టార్క్, హారిట్జ్లాంటి ఆసీస్ ఆటగాళ్లతో అతను కలిసి ఆడాడు. ప్రతిభకు ప్రోత్సాహంగా ‘బోర్డర్ గావస్కర్ స్కాలర్షిప్’ను అందుకున్న తొలి ఆటగాడు శ్రీరామ్ కావడం విశేషం. నాటి ఆసీస్ అనుబంధం కోచ్ రూపంలో ఇప్పటికీ కొనసాగుతోంది. రెండేళ్ల క్రితం తొలిసారి ఆసీస్ ‘ఎ’ జట్టుతో కలసి పనిచేసిన అతను ఆ తర్వాత సీనియర్ జట్టుతో చేరాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీరామ్ అనుభవాన్ని గుర్తించిన క్రికెట్ ఆస్ట్రేలియా తమ కన్సల్టెంట్‌గా అతడిని ఎంచుకుంది. ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా కూడా అత ను పని చేశాడు. -
భారత టెస్టు చరిత్రలో దారుణమైన ఓటమి: గవాస్కర్
ముంబై: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఘోరంగా ఓడిపోవడం భారత్టెస్టు చరిత్రలోనే అత్యంత దారుణమైన ఓటమిగా సునీల్ గవాస్కర్ అభివర్ణించారు. పూణే టెస్టు మ్యాచ్‌లో ఒకిఫ్ స్పిన్ మాయాజలానికి భారత్ 333 పరుగుల తేడాతో పరాజయం పొందింది. ఈ ఓటమిపై గవాస్కర్ తీవ్రంగా స్పందించారు. భారత్ రెండున్నర రోజుల్లో ఆటముగించడం నమ్మలేకపోతున్నానని తెలిపారు. ఆసీస్ స్పిన్నర్ల అటాకింగ్ తనను ఆశ్చర్యానికి గురిచేసిందని, ఇది భారత క్రికెట్‌కు బ్లాక్ డేగా పేర్కొన్నారు. భారత్ బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌లను 75 ఓవర్లకు ముగించడం అసంతృప్తికి గురిచేసిందని గవాస్కర్ తెలిపారు. భారత ఆటగాళ్లు అత్యంత పేలవమైన ప్రదర్శన కనబర్చారని చెప్పారు. ట్రీ బ్రెక్ తర్వాత అరగంట సమయంలో భారత ఇన్నింగ్స్ ముగించడం నమ్మలేకపోతున్నానని తెలిపారు. ఆటగాళ్లు కేర్లెస్గా ఆడారని , ఏ ఒక్కరు క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించలేదన్నారు. ఇప్పటికైనా చేసిన తప్పులు గ్రహించి మిగతా మ్యాచ్‌లకు సిద్దం కావాలని గవాస్కర్ ఆటగాళ్లకు సూచించారు. -
ఇండియా బౌలింగ్
పుణే: భారత్ తో గురువారమిక్కడ ప్రారంభమైన తొలి టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. పిచ్ బాగా డ్రైగా ఉందని, బౌన్స్ కు అవకాశం ఉండదన్న ఉద్దేశంతో బ్యాటింగ్ తీసుకున్నామని స్మిత్ తెలిపాడు. టీ20 మ్యాచ్ లకు, టెస్టులకు చాలా తేడా ఉందని, ఈ సిరీస్ కు బాగా ప్రాక్టీస్ చేశామన్నాడు. ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఆల్ రౌండర్లతో బరిలోకి దిగుతున్నట్టు చెప్పాడు. ఎటువంటి అంచనాలు లేకుండానే టాస్ కు వచ్చానని టీమిండియా కెప్టెన్ కోహ్లి తెలిపాడు. భువనేశ్వర్ కుమార్ స్థానంలో జయంత్ యాదవ్ ను తీసుకున్నట్టు వెల్లడించాడు. ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జయంత్, అశ్విన్, జడేశాలతో తమ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉందన్నాడు.