పుణె : టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ ఒంటిచేత్తో అద్భుతమైన క్యాచ్ పట్టాడు. కామెంటేటర్‌గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లక్ష్మణ్.. తోటి కామెంటటేటర్లతో కలిసి గల్లీ క్రికెట్ ఆడాడు. పుణె టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమవడానికి ముందు వీరి గల్లీ క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఆకాశ్‌చోప్రా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేసిన ఈ సొగసరి బ్యాట్స్‌మన్ కొద్దిపాటి డైవ్ చేసి వన్‌బౌన్స్ క్యాచ్ అందుకున్నాడు.
మ్యాచ్ అనంతరం.. ‘నేను పట్టిన అత్యద్భుతమైన క్యాచ్‌లలో ఇదొకటి. అయితే, ఫుల్ సూట్‌లో ఉన్న సమయంలో ఈ మ్యాచ్ జరిగింది. తెల్ల దుస్తుల్లో ఉన్నప్పుడు కాదు’అని సరదాగా ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ వైరల్ అయింది. ఇక పుణెలో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 137 పరుగుల భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో మూడు టెస్టుల సిరిస్‌ను భారత్ 2-0తో సొంతం చేసుకుంది. మూడో టెస్టు రాంచీలో ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది.
Never knew one of my finest close in catches would come in a full suit and not whites 😅.. Sunday morning cricket coming up on #Cricketlive 11.30am @StarSportsIndia Hindi pic.twitter.com/8YUBfWAZeh
— VVS Laxman (@VVSLaxman281) October 13, 2019
Comments
Please login to add a commentAdd a comment