VVS Laxman
-
టీమిండియా తదుపరి హెడ్‌కోచ్ అతడే: పాక్ మాజీ క్రికెటర్
టీమిండియా మాజీ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గౌతం గంభీర్ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్‌గా లక్ష్మణ్ ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో భారత జట్టు అద్భుత ప్రదర్శనే అతడి శిక్షణా నైపుణ్యాలకు నిదర్శనమని కొనియాడాడు.శుభారంభమే అయినాటీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్‌గా అవతరించిన తర్వాత రాహుల్ ద్రవిడ్ హెడ్‌కోచ్ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2007, 2011 వరల్డ్‌కప్ హీరో గౌతం గంభీర్ ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేశాడు. శ్రీలంక పర్యటనతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి టీ20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్ విజయం అందుకున్నాడు.అయితే, లంకతో వన్డే సిరీస్‌లో చారిత్రక ఓటమి తర్వాత.. మళ్లీ సొంతగడ్డపై గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా మరో వైట్‌వాష్ విజయం అందుకుంది. బంగ్లాదేశ్‌ను టెస్టుల్లో 2-0తో ఓడించింది. అయితే, ఆ తర్వాత మరో ఘోర ఓటమిని చవిచూసింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురై.. చెత్త రికార్డులు మూటగట్టుకుంది.ఆస్ట్రేలియా పర్యటన రూపంలో గంభీర్‌కు అసలైన సవాలుఇక ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటన రూపంలో గంభీర్‌కు అసలైన సవాలు ఎదురుకానుంది. అక్కడ బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియా పాసైతేనే గంభీర్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. లేదంటే.. విమర్శలతో పాటు కోచ్ పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లూ వచ్చినా ఆశ్చర్యం లేదు.వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ మాత్రంమరోవైపు.. ప్రధాన కోచ్‌ల గైర్హాజరీలో టీమిండియా హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్న వీవీఎస్ లక్ష్మణ్ మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. టీ20 వరల్డ్‌కప్ తర్వాత జింబాబ్వే టూర్లో లక్ష్మణ్ సారథ్యంలో యువ జట్టు 4-1తో టీ20 సిరీస్ గెలిచింది. తాజాగా సౌతాఫ్రికా గడ్డపై పటిష్ట ప్రొటిస్ జట్టుపై కూడా సూర్యకుమార్ సేన సత్తా చాటుతోంది.సెంచూరియన్‌లో జరిగిన మూడో టీ20లో భారీ స్కోరు సాధించడమే గాక.. లక్ష్యాన్ని కాపాడుకుని గెలుపు జెండా ఎగురవేసింది. ఈ క్రమంలో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ముందంజలో నిలిచింది.ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ లక్ష్మణ్‌పై ప్రశంసలు కురిపించాడు.టీమిండియా హెడ్‌కోచ్‌గా అతడే హాట్, హాట్, హాట్ కేకు‘‘ఈరోజు వీవీఎస్ వ్యూహాలను చూసిన తర్వాత.. టీమిండియా హెడ్‌కోచ్‌గా అతడే హాట్, హాట్, హాట్ కేకు అనిపించింది. సూర్యకుమార్ యాదవ్‌ను మూడో నంబర్లో బ్యాటింగ్‌కు పంపకుండా కొత్త ప్రణాళికను అమలు చేశాడు.ఒకవేళ ఆస్ట్రేలియా పర్యటనలో గంభీర్ గనుక విఫలమైతే.. వీవీఎస్ తదుపరి కోచ్‌గా.. రేసులో ముందుకు దూసుకువస్తాడు. మూడో టీ20లో సూర్యను మూడో నంబర్లో పంపకుండా.. ఉండటం వల్లే సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో టీమిండియాకు అనుకూల ఫలితం వచ్చింది’’ అని బసిత్ అలీ పేర్కొన్నాడు.11 పరుగుల తేడాతో టీమిండియా విజయంకాగా సెంచూరియన్‌లో బుధవారం జరిగిన మూడో టీ20లో కెప్టెన్ సూర్యకుమార్‌కు బదులు తిలక్ వర్మ మూడో నంబర్లో బ్యాటింగ్ చేశాడు. కేవలం 56 బంతుల్లోనే 107 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ హైదరాబాదీ.. జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 219 పరుగులు చేసిన టీమిండియా.. 11 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై విజయం సాధించింది.చదవండి: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా ఘనత -
రంజీ క్రికెట్ కింగ్ రషీద్
గుంటూరు వెస్ట్: విజయాలకు అడ్డదారులుండవు. కఠోర సాధనతోపాటు క్రమశిక్షణ ఎంతటి వారినైనా విజయతీరాల వైపు నడిపిస్తాయని గుంటూరుకు చెందిన షేక్ రషీద్ నిరూపిస్తున్నాడు. ఇంతై వటుడింతై అన్నట్లు అండర్–14 చిన్నారుల క్రికెట్ నుంచి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలాంటి వారితో క్రికెట్ ఆడే అవకాశాల్ని దక్కించుకున్నాడు. ఇప్పుడు ఆంధ్ర రంజీ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కేవలం 21 సంవత్సరాల వయస్సులోనే ఈ బాధ్యతలు చేపట్టే అవకాశం దక్కడం మరో విశేషం. దాదాపు 20 ఏళ్ల తర్వాత గుంటూరు జిల్లాకు రంజీ సారథ్యం లభించడం విశేషం. ఎంఎస్కే ప్రసాద్ తర్వాత రషీదే కావడం గమనార్హం. గల్లీ క్రికెట్ నుంచి ఢిల్లీ క్రికెట్ వరకు లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతోపాటు ఆడే ప్రతి జట్టుకు నమ్మదగిన బ్యాటర్‌గా చక్కని సేవలందిస్తున్నాడు. రెండేళ్ల నుంచి చైన్నె సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతి సాధారణ కుటుంబంలో పుట్టిన ఈ యువకుడు స్థానిక ఎన్జీఓ కాలనీలో కుటుంబంతో జీవిస్తున్నాడు.జీవితాన్ని మార్చేసిన అండర్–19 భారత జట్టు స్థానం2021లో అండర్–19 భారత జట్టులో రషీద్ స్థానం సంపాదించడంతోపాటు వైస్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టాడు. 2022లో భారత జట్టు ప్రపంచ కప్ సాధించడంలో కీలక భూమిక పోషించాడు. దీంతోపాటు చాలెంజర్స్ ట్రోఫీకి ఎంపికవ్వడమే కాకుండా ఇండియా –డి జట్టుకు సారథ్యం వహించి తన జట్టును చాంపియన్‌గా నిలబెట్టాడు. ఈ ట్రోఫీలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తోపాటు 274 పరుగులు సాధించాడు. 2022లో కోల్కొత్తాలో జరిగిన ట్రయాంగిల్ సిరీస్, ఏషియన్ పోటీలోనూ చక్కగా రాణించాడు. ఈ ఏడాది దులీప్ ట్రోఫీలో మ్యాచ్‌లు ఆడుతున్నాడు.కొహ్లి ఆటంటే ఎంతో ఇష్టంరషీద్ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్. మైదానంలో సొగసైన డ్రైవ్స్‌తో అందరినీ ఆకట్టుకుంటాడు. తడబాటుకు తావులేకుండా ఆడడమే తన విజయ రహస్యమంటాడు. ప్రతి మ్యాచ్‌లోనూ ఔటైన విధానాన్ని నెట్ ప్రాక్టీస్‌లో సరి చేసుకుంటాడు. దీని కోసం బౌలర్లకు కఠిన పరీక్షలు పెడతాడని సహచర క్రికెటర్లు సరదాగా అంటుంటారు. ముఖ్యంగా రషీద్‌కు విరాట్ కోహ్లి ఆరాధ్య క్రికెటర్. కోహ్లి ఆడే విధానం, అతడి దృఢ చిత్తం గొప్పవరమని రషీద్ అంటాడు. కోహ్లి ఆటతోపాటు ఫిట్‌నెస్‌పై తీసుకునే జాగ్రత్తలు ప్రతి క్రికెటర్‌కు మార్గదర్శకాలని కితాబునిస్తాడు. -
టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
సౌతాఫ్రికాతో జరుగబోయే నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ ఎంపికయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. రెగ్యులర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లనుండగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సౌతాఫ్రికా సిరీస్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్లు క్లాష్ కానున్న నేపథ్యంలో టీమిండియాకు ఇద్దరు హెడ్ కోచ్‌లు అవసరమయ్యారు. తొలుత టీమిండియా షెడ్యూల్లో సౌతాఫ్రికా టీ20 సిరీస్ లేదు. ఈ మధ్యలో క్రికెట్ సౌతాఫ్రికా విన్నపం మేరకు బీసీసీఐ ఈ సిరీస్‌కు ఒప్పుకుంది. సౌతాఫ్రికా టీ20 సిరీస్ నవంబర్ 8, 10, 13, 15 తేదీల్లో జరుగనుండగా.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టు నవంబర్ 10 లేదా 11 తేదీల్లో ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. సౌతాఫ్రికా టీ20 సిరీస్‌లో లక్ష్మణ్ సపోర్టింగ్ స్టాఫ్‌గా ఎన్సీఏ సభ్యులు సాయిరాజ్ బహుతులే, హృషికేశ్ కనిత్కర్, సుబదీప్ ఘోష్ ఉండే అవకాశం ఉంది. ఈ ముగ్గురు ఆసియా కప్ ఎమర్జింగ్ టోర్నీలో టీమిండియా కోచింగ్ సభ్యులుగా వ్యవహరించారు.కాగా, సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యుల భారత బృందాన్ని అక్టోబర్ 25న ప్రకటించారు. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు. భారత టెస్ట్ జట్టులోకి సభ్యులెవరికీ ఈ జట్టులో చోటు దక్కలేదు. సౌతాఫ్రికా పర్యటన కోసం భారత జట్టు నవంబర్ 4న బయల్దేరి వెళ్లనుంది.సౌతాఫ్రికా టీ20 సిరీస్ కోసం భారత జట్టు..సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్‌కీపర్), రింకు సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్‌కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వైషాక్, అవేష్ ఖాన్ , యష్ దయాళ్ -
వీవీఎస్ లక్ష్మణ్ క్యాచ్ డ్రాప్ చేశా.. నా కెరీర్ అంతటితో ఖతం!
ఆడమ్ గిల్‌క్రిస్ట్.. ప్రపంచ క్రికెట్‌ను ఏలిన గొప్ప వికెట్ కీపర్ బ్యాటర్లలో ఒకడు. ఆస్ట్రేలియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తన ఆటతో, వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆస్ట్రేలియాకు ఓంటి చేత్తో ఎన్నో విజయాలను అందించిన ఘనత అతడిది.ఆసీస్ తరపున మూడు వన్డే వరల్డ్‌కప్ టైటిల్స్ అతడి ఖాతాలో ఉన్నాయి. 2007 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో శ్రీలంకపై గిల్లీ ఆడిన ఇన్నింగ్స్ ఇప్పటికి సగటు క్రికెట్ అభిమానికి గుర్తుండే ఉంటుంది. అయితే ఈ ఆసీస్ లెజెండ్ ఆ మరుసటి ఏడాదే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరిని షాక్‌కు గురిచేశాడు. 2008లో భారత్‌తో జరిగిన అడిలైడ్ టెస్టు మధ్యలో తన రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడించాడు. తన కెరీర్లో 100 టెస్టుల మైలు రాయిని అందుకోవడానికి కేవలం 4 మ్యాచ్‌ల దూరంలో ఉన్న సమయంలో గిల్లీ రిటైర్మెంట్ ప్రకటించడం అప్పటిలో తీవ్ర చర్చనీయాంశమైంది.అయితే తాజాగా గిల్‌క్రిస్ట్ తన సడన్ రిటైర్మెంట్కు గల కారణాన్ని వెల్లడించాడు. భారత దిగ్గజ బ్యాటర్ వీవీయస్ లక్ష్మణ్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను విడిచిపెట్టిన కారణంగానే తను రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు గిల్లీ తెలిపాడు. వెంటనే తన నిర్ణయాన్ని మరో ఆసీస్ లెజెండ్ మాథ్యూ హేడెన్‌కి చెప్పినట్లు ఓ ఇంటర్వ్యూలో గిల్‌క్రిస్ట్ అన్నాడు."నేను చివరగా నా కెరీర్లో భారత్‌పై ఆడాను. ఆడిలైడ్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో ఓ ఫన్నీ సంఘటన జరిగింది. బ్రెట్ లీ బౌలింగ్‌లో క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించాను. కానీ బంతిని సరిగ్గా అందుకోలేకపోయాను. ఆ రోజు రాత్రి నా భార్యకు ఫోన్ చేసి మాట్లాడాను. మేము భారత్‌తో సిరీస్ తర్వాత వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్నాం. అందుకు సంబంధించిన విషయాలను ఆమెతో చర్చించాను.విండీస్ పర్యటనలో మొత్తం మూడు మ్యాచ్‌లతో కలిపి నా 99వ టెస్టు మ్యాచ్ మార్క్‌ను అందుకోనున్నాను. ఆ తర్వాత మేము ఇండియా టూర్‌కు వెళ్లనున్నాం. భారత్‌లో నా 100వ టెస్టు ఆడతాను అని ఆమెతో చెప్పాను. 100 టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా ప్లేయర్ల లిస్టులో చేరుతానని భావించాను. ఆ అరుదైన గౌరవం దక్కుతుందని నేను అనుకున్నాను. కానీ ఆ మరుసటి రోజు నా కథ మొత్తం మారిపోయింది.ఆ తర్వాతి రోజు ఆటలో భారత బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఇచ్చిన సునయాస క్యాచ్‌ను నేను జారవిడిచాను. లక్ష్మణ్ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న వచ్చిన బంతి నా గ్లవ్స్‌లో పడి నేలకు తాకింది. దీంతో ఈజీ క్యాచ్‌ను అందుకోలేకపోయాను. ఎలా మిస్స్ అయ్యిందో అని బిగ్ స్క్రీన్ మీద రిప్లే చూశాను. పదే పదే అదే చూపించారు. ఏకంగా 32 సార్లు దాన్ని ప్లే చేస్తూనే వచ్చారు. ఇక చాలు, విడ్కోలు పలకాల్సిన సమయం వచ్చిందని నేను అప్పుడే నిర్ణయించుకున్నాను. వెంటనే స్లిప్‌లో ఉన్న మాథ్యూ హేడెన్ వైపు చూస్తూ నా పని అయిపోయింది, నేను రిటైర్మెంట్ అవ్వాల్సిన సమయం అసన్నమైంది చెప్పాను. వెస్టిండీస్ పర్యటను గురించి ఆలోచించకండి, భారత్‌లో 100వ టెస్టు గురించి కూడా ఆలోచించవద్దు చెప్పా. బంతి, నా గ్లవ్స్‌ని తాకి పిచ్‌పైన పడ్డప్పుడే రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను అని హెడన్తో అన్నాను. కానీ హెడన్ మాత్రం నేను అటువంటి సంచలన నిర్ణయం తీసుకోకుండా ఒప్పించే ప్రయత్నం చేశాడని క్లబ్ ప్రైరీ ఫైర్ పోడ్కాస్ట్లో పేర్కొన్నాడు. కాగ గిల్లీ ఆసీస్ తరపున 96 టెస్టుల్లో 47.6 సగటుతో 5570 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు ఉన్నాయి.చదవండి: 'టాటా, బై బై.. నీ పని అయిపోయింది'.. పాక్ హెడ్ కోచ్‌పై సంచలన వ్యాఖ్యలు -
లక్నో మెంటార్‌గా జహీర్ ఖాన్!
న్యూఢిల్లీ: భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్‌ను మెంటార్‌గా నియమించుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ప్రయత్నాలు చేస్తోంది. మెగా వేలం ప్రారంభానికి ముందే జహీర్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని లక్నో జట్టు యాజమాన్యం భావిస్తోంది. ముంబై ఇండియన్స్ గ్లోబల్ డెవలప్మెంట్ హెడ్‌గా పనిచేస్తున్న జహీర్ ఖాన్.. ఐపీఎల్లో 10 సీజన్లపాటు మూడు జట్ల తరఫున 100 మ్యాచ్‌లు ఆడి 102 వికెట్లు పడగొట్టాడు.2017లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన జహీర్... అప్పటి నుంచి ముంబై ఇండియన్స్‌తో కొనసాగుతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్ 2023 సీజన్ అనంతరం లక్నోను వీడి కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) జట్టుకు మారాడు. ఈ సీజన్లో గంభీర్ మార్గదర్శకత్వంలో కోల్‌కతా జట్టు అద్వితీయ ప్రదర్శన కనబర్చి మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ కైవసం చేసుకుంది. ‘టీమ్ మెంటార్‌గా జహీర్ ఖాన్‌ను నియమించేందుకు లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం ప్రయత్నిస్తోంది.గంభీర్ నిష్క్రమణతో అతడి స్థానాన్ని జహీర్‌తో భర్తీ చేయాలని అనుకుంటున్నారు’ అని పలు కథనాలు వెలుగులోకి వచ్చాయి. గంభీర్ మెంటార్షిప్లో 2022, 2023లో ప్లేఆఫ్స్‌కు చేరిన లక్నో... ఈ ఏడాది అంతగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా లక్నో బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా ఆ జట్టును వీడి... భారత జాతీయ జట్టు బౌలింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. దీంతో లక్నో జట్టు ఐపీఎల్ మెగా వేలానికి ముందు సహాయక సిబ్బంది ఎంపిక పూర్తి చేయాలని భావిస్తోంది.మరోవైపు పంజాబ్ కింగ్స్ జట్టు కూడా కోచ్ కోసం అన్వేషణ కొనసాగిస్తోంది. హెడ్ కోచ్ ట్రేవర్ బేలిస్ స్థానంలో భారత ఆటగాడికే ఈ బాధ్యతలు అప్పగించాలని పంజాబ్ యాజమాన్యం భావిస్తోంది. అయితే ఈ జాబితాలో వీవీఎస్ లక్ష్మణ్ పేరు బలంగా వినిపిస్తోంది. ఆటపై అపార అనుభవం ఉన్న లక్ష్మణ్ ప్రధాన కోచ్ పదవికి సరైన ప్రత్యామ్నాయం అని పంజాబ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.అయితే గత కొన్నాళ్లుగా బీసీసీఐతో కొనసాగుతున్న వీవీఎస్.. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్‌గా వ్యవహరిస్తున్నాడు. మరో ఏడాది కాలం లక్ష్మణ్ ఎన్సీఏ హెడ్‌గా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రయత్నాలు ఫలిస్తాయా చూడాలి! -
గంభీర్‌కు చెప్పడానికి నేనెవరిని?: జై షా
ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కోచ్ ఉండాల్సిన అవసరం లేదని తాము భావిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కార్యదర్శి జై షా అన్నాడు. టీమిండియాలోని ఆటగాళ్లలో ఎక్కువ మంది మూడు ఫార్మాట్లలో ఆడుతున్నారని.. అలాంటపుడు ఒకే కోచ్ ఉంటే ఇంకాస్త మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని పేర్కొన్నాడు. ఒక్కసారి ప్రధాన శిక్షకుడిగా ఓ వ్యక్తిని నియమించిన తర్వాత అతడి నిర్ణయానుసారమే అంతా జరుగుతుందని తెలిపాడు.టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా హెడ్‌కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ వైదొలిన విషయం తెలిసిందే. అతడి స్థానంలో మాజీ ఓపెనర్ గౌతం గంభీర్‌ను నియమించింది బీసీసీఐ. అయితే, ఇందుకు సంబంధించిన ప్రకటనకు ముందు.. టీమిండియాకు ముగ్గురు కోచ్‌లు ఉండబోతున్నారనే వార్తలు వచ్చాయి. టెస్టు, వన్డే, టీ20లకు వేర్వేరు వ్యక్తులు శిక్షణ ఇవ్వనున్నట్లు వదంతులు వ్యాపించాయి.గంభీర్‌కు చెప్పడానికి నేనెవరిని?ఈ విషయంపై జై షా తాజాగా స్పందించాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ... ‘‘కోచ్‌ను నియమించుకున్న తర్వాత.. అతడి అభిప్రాయాన్ని మేము గౌరవించాల్సి ఉంటుంది. అతడు చెప్పిందే వినాలి కూడా!.. గౌతం గంభీర్‌ను హెడ్‌కోచ్‌గా సెలక్ట్ చేసుకున్న తర్వాత.. అతడి దగ్గరికి వెళ్లి.. ‘నువ్వు ఈ ఫార్మాట్‌కు సరిగ్గా కోచింగ్ ఇవ్వలేవు’ అని చెప్పడానికి నేనెవరిని?ఒకవేళ తను మూడు ఫార్మాట్లకు కోచ్‌గా ఉండాలని భావిస్తే.. మేమెందుకు అడ్డుచెప్తాం? అయినా భారత జట్టులో 70 శాతం మంది ఆటగాళ్లు మూడు ఫార్మాట్లలో ఆడుతూనే ఉన్నారు. కాబట్టి వేర్వేరు కోచ్‌లు అవసరం లేదనే భావిస్తున్నాం.ఎన్సీఏ కోచ్‌లు ఉన్నారు కదా!అంతేకాదు.. ఒకవేళ హెడ్‌కోచ్ విరామం తీసుకున్నా మాకు బ్యాకప్ కోచ్‌లు ఉండనే ఉన్నారు. జాతీయ క్రికెట్ అకాడమీ కోచ్(ఎన్సీఏ)లు మాకు సేవలు అందిస్తారు. ఉదాహరణకు.. రాహుల్ ద్రవిడ్ బ్రేక్ తీసుకున్నపుడు వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించాడు కదా! ఇప్పుడు కూడా అంతే!’’ అని జై షా చెప్పుకొచ్చాడు.కాగా శ్రీలంక పర్యటనతో టీమిండియా హెడ్‌కోచ్‌గా ప్రస్థానం మొదలుపెట్టిన గౌతం గంభీర్.. టీ20 సిరీస్ 3-0తో క్లీన్‌స్వీప్ విజయం అందుకున్నాడు. అయితే, వన్డే సిరీస్‌లో మాత్రం ఘోర పరాభవం ఎదురైంది. ఇరవై ఏడేళ్ల తర్వాత టీమిండియా లంకు వన్డే సిరీస్(0-2)ను కోల్పోయింది. తదుపరి రోహిత్ సేన బంగ్లాదేశ్ స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడనుంది. చదవండి: ’టీ20 ఫార్మాట్ క్రికెట్‌ను నాశనం చేస్తోంది.. ఇండియా మాత్రం లక్కీ’ -
వీవీఎస్ లక్ష్మణ్ పదవీకాలం మరో ఏడాది పొడిగింపు
జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్‌గా వ్యవహరిస్తున్న భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ పదవిలో కొనసాగనున్నాడు. లక్ష్మణ్ మూడేళ్ల కాంట్రాక్ట్ సెప్టెంబరుతో ముగియనుంది. అయితే ఎన్సీఏ హెడ్‌గా మరో ఏడాది కాలం పాటు అతడి పదవీకాలాన్ని పొడిగించాలని బీసీసీఐ నిర్ణయించింది. బెంగళూరు శివార్లలో బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిరి్మస్తున్న కొత్త ఎన్సీఏ 2025లో ప్రారంభం కానున్న నేపథ్యంలో లక్ష్మణ్ కొనసాగితే బాగుంటుందని బోర్డు భావించింది. కొన్నాళ్ల క్రితం వరకు వ్యక్తిగతంగా కొంత అనాసక్తి ప్రదర్శిస్తూ లక్ష్మణ్ ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు బోర్డు జోక్యంతో అతను కొనసాగనున్నాడు. ఎన్సీఏ హెడ్‌గా ఉన్న సమయంలో ఇంజ్యూరీ మేనేజ్మెంట్, ప్లేయర్ రీహాబిలిటేషన్, కోచింగ్ కార్యక్రమాలు, వివిధ వయో విభాగాల క్రికెట్ టోరీ్నల ప్లానింగ్ వంటి అంశాల్లో లక్ష్మణ్ సమర్థంగా పని చేశాడు. ఎన్సీఏ కోచ్‌లు హృషికేశ్ కనిత్కర్, సాయిరాజ్ బహుతులే, షితాన్షు కొటక్ కూడా కొనసాగే అవకాశం ఉంది. -
లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా వీవీఎస్ లక్ష్మణ్!?
భారత మాజీ క్రికెటర్, హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ ఐపీఎల్‌లోకి తిరిగి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ కోచింగ్ స్టాప్‌లో లక్ష్మణ్ భాగం కానున్నట్లు సమాచారం. లక్నో ఫ్రాంచైజీ తమ కోచింగ్ స్టాప్‌లోకి భారత దిగ్గజ ఆటగాళ్లను తీసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే లక్ష్మణ్‌పై కన్నేసినట్లు వినికిడి. అతడిని తమ జట్టు మెంటార్‌గా నియమించాలని లక్నో యోచిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇప్పటికే లక్ష్మణ్‌తో లక్నో ఫ్రాంచైజీ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.కాగా లక్ష్మణ్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ( (NCA) ఛీప్‌గా ఉన్నాడు. లక్ష్మణ్ పదవీకాలం త్వరలోనే ముగియనుంది. తన కాంట్రాక్ట్‌ను పొడగించే అవకాశం బీసీసీఐ ఇచ్చినా.. వీవీయస్ మాత్రం అందుకు సుముఖంగా లేనట్లు సమాచారం.లక్ష్మణ్ తన నిర్ణయాన్ని బీసీసీఐ ఇప్పటికే తెలియజేసినట్లు తెలుస్తోంది. ఇక మెంటార్‌గా లక్ష్మణ్‌కు అపారమైన అనుభవం ఉంది. 2013 నుంచి 2021 వరకు ఎస్ఆర్హెచ్ జట్టుకు లక్ష్మణ్ పనిచేశాడు. ఆ తర్వాత ఏన్సీఏ హెడ్‌గా బాధ్యతలు చేపట్టడంతో మెంటార్ పదవి నుంచి ఈ ఈ సొగసరి బ్యాటర్ తప్పుకున్నాడు. ఇక లక్ష్మణ్ తర్వాత ఎన్సీఏ ఛీప్‌గా మాజీ భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ బాధ్యతలు చేపట్టే అవకాశముంది. -
NCAకు వీవీఎస్ లక్ష్మణ్ గుడ్‌బై.. కొత్త హెడ్ అతడే!
బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) హెడ్‌గా మేటి క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పదవీకాలం త్వరలోనే ముగియనుంది. అయితే, తన కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించుకునేందుకు బీసీసీఐ అవకాశం ఇచ్చినా.. ఈ సొగసరి బ్యాటర్ అందుకు సుముఖంగా లేనట్లు సమాచారం.ఈ నేపథ్యంలో లక్ష్మణ్ స్థానంలో టీమిండియా బ్యాటింగ్ మాజీ కోచ్ విక్రం రాథోడ్ ఎన్సీఏ హెడ్‌గా రానున్నట్లు సమాచారం. బీసీసీఐ సన్నిహిత వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించినట్లు స్పోర్ట్స్‌తక్ పేర్కొంది.సంజయ్ బంగర్ స్థానాన్ని భర్తీ చేస్తూ 2019లో భారత బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు విక్రం రాథోడ్. రవి శాస్త్రి, రాహుల్ ద్రవిడ్ హయాంలో ఈ టీమిండియా బ్యాటర్ సహాయక సిబ్బందిలో ఒకడిగా కొనసాగాడు.ఇక ఇటీవల టీ20 ప్రపంచకప్-2024 తర్వాత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు విక్రం రాథోడ్ పదవీ కాలం కూడా ముగిసింది. ఈ ఐసీసీ టోర్నీలో భారత్ చాంపియన్‌గా నిలవడంతో వీరిద్దరు శిక్షకులుగా ఘనంగా తమ కెరీర్‌ను ముగించారు.ఎన్సీఏ హెడ్‌గా విక్రం రాథోడ్}మరోవైపు.. 2021లో ఎన్సీఏ హెడ్‌గా వచ్చిన వీవీఎస్ లక్ష్మణ్ తన బాధ్యతల నుంచి ఇక తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘వీవీఎస్ లక్ష్మణ్ తన కాంట్రాక్ట్‌ను రెన్యువల్ చేసుకునేందుకు సిద్ధంగా లేడు.అతడి స్థానంలో ఎన్సీఏ హెడ్‌గా విక్రం రాథోడ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఐసీసీ వార్షిక సమావేశం ముగించుకుని బీసీసీఐ కార్యదర్శి జై షా తిరిగి వచ్చిన తర్వాత వీవీఎస్ లక్ష్మణ్‌తో మరోసారి మాట్లాడనున్నారు.అయినప్పటికీ అతడు సుముఖంగా లేకపోతే విక్రం రాథోడ్‌కే అవకాశం దక్కనుంది’’ అని పేర్కొన్నాయి. సెప్టెంబరులో ఇందుకు సంబంధించిన ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.ఐపీఎల్ మెంటార్‌గా రీ ఎంట్రీ?కాగా ఎన్సీఏ హెడ్‌గా రాకముందు వీవీఎస్ లక్ష్మణ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మెంటార్‌గా పనిచేశాడు. కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్లీ ఐపీఎల్ ఫ్రాంఛైజీలలో ఏదో ఒకదానితో అతడు జట్టు కట్టే అవకాశం లేకపోలేదు.ఇదిలా ఉంటే.. టీమిండియా కొత్త హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్ నియమితుడైన సంగతి తెలిసిందే. అతడికి సహాయకుడిగా మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ బ్యాటింగ్ కోచ్‌గా విక్రం రాథోడ్ స్థానంలో వచ్చే అవకాశం ఉంది.చదవండి: Olympics: హృదయం ముక్కలైన వేళ!.. ఎనిమిది సార్లు ఇలాగే.. -
శ్రీలంక సిరీస్ నుంచి టీమిండియాకు కొత్త కోచ్.. రేసులో ఇద్దరు..!
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు ఖరారైందని గత కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరిగిన విషయం విధితమే. అయితే ఈ ప్రచారంలో వాస్తవం కొంతమాత్రమే ఉందని బీసీసీఐ కార్యదర్శి జై షా తాజా స్టేట్మెంట్ను బట్టి తెలుస్తుంది. భారత్ హెడ్ కోచ్ రేసులో ఇద్దరు ఉన్నట్లు షా పేర్కొన్నాడు. షా చెప్పిన మాటల ప్రకారం గంభీర్‌తో పాటు మరో వ్యక్తి (డబ్ల్యూవీ రామన్) భారత హెడ్ కోచ్ పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తుంది.కొత్త హెడ్ కోచ్ అంశంపై మాట్లాడుతూ షా మరిన్ని విషయాలను కూడా రివీల్ చేశాడు. కొత్తగా ఎంపిక కాబోయే కోచ్ ఈ నెల (జులై) చివర్లో ప్రారంభమయ్యే శ్రీలంక సిరీస్ నుంచి బాధ్యతలు చేపడతాడని తెలిపాడు. అలాగే ఈనెల (జులై) 6 నుంచి ప్రారంభం కాబోయే జింబాబ్వే టీ20 సిరీస్‌కు టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తాడని షా పేర్కొన్నాడు.కాగా, ప్రస్తుత టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్‌తో ముగిసిన విషయం తెలిసిందే. ద్రవిడ్‌కు హెడ్ కోచ్ పదవిలో కొనసాగే ఇష్టం లేకపోవడంతో బీసీసీఐ కొత్త అభ్యర్దుల వేటలో పడింది. ఐపీఎల్ పెర్పార్మెన్స్ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ పదవి రేసులో గంభీర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. క్రికెట్ అడ్వైజరీ కమిటీ (CAC) కూడా గంభీర్వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాను ఓడించి రెండోసారి పొట్టి ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ ముగిసిన అనంతరం భారత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.మరోవైపు ఈ నెల 6వ తేదీ నుంచి టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత్.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియాను ఇదివరకే ఎంపిక చేశారు. జింబాబ్వే పర్యటన అనంతరం భారత జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. జులై 27 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో 3 టీ20లు, 3 వన్డేలు జరుగనున్నాయి. -
NCA: వీవీఎస్ లక్ష్మణ్ సైతం గుడ్‌బై!.. కారణం?
భారత క్రికెట్ మేనేజ్మెంట్లో మరో కీలక మార్పు చోటు చేసుకోనున్నట్లు సమాచారం. జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ తన పదవి నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా హెడ్‌కోచ్ బాధ్యతల నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకోనున్న సంగతి తెలిసిందే. నిజానికి వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత అతడి పదవీ కాలం ముగిసినప్పటికీ బీసీసీఐ అభ్యర్థన మేరకు ఈ టీ20 మెగా టోర్నీ పూర్తయ్యే వరకు అందుబాటులో ఉండేందుకు ద్రవిడ్ అంగీకరించాడు.ఈ క్రమంలో అతడి స్థానంలో బాధ్యతలు చేపట్టాల్సిందిగా వీవీఎస్ లక్ష్మణ్‌ను బోర్డు కోరగా అందుకు అతడు నిరాకరించాడనే వార్తలు వినిపించాయి. అనంతరం రేసులోకి దూసుకొచ్చిన మరో మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ప్రధాన కోచ్‌గా నియమితుడు కావడం దాదాపుగా ఖరారైపోయింది.కాగా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ బాస్‌గా ఉన్న సమయంలో 2021లో రాహుల్ ద్రవిడ్ టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టగా.. ఎన్సీఏ హెడ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ నియమితుడయ్యాడు.లక్ష్మణ్ పదవీకాలం ఈ ఏడాదితో ముగిసిపోనున్నట్లు సమాచారం. అయితే, కుటుంబానికి సమయం కేటాయించే క్రమంలో అతడు తన కాంట్రాక్టును పునరుద్ధరించుకునేందుకు సిద్ధంగా లేడని తెలుస్తోంది.ఎన్సీఏ హెడ్‌గా తప్పుకొన్న తర్వాత కామెంట్రీ చేయడంతో పాటు ఐపీఎల్ మెంటార్‌గా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా 2013- 2021 వరకు వీవీఎస్ లక్ష్మణ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మెంటార్‌గా ఉన్న విషయం తెలిసిందే.కాగా ఎన్సీఏ చైర్మన్‌గా తన పదవీకాలంలో వీవీఎస్ లక్ష్మణ్ అబ్బాయిలు, అమ్మాయిల క్రికెట్లోని అన్ని కేటగిరీలపై దృష్టి సారించి జూనియర్ నుంచి సీనియర్ లెవల్ వరకు రాటుదేలేలా శిక్షణ ఇవ్వడంలో సఫలీకృతమయ్యాడని చెప్పవచ్చు. అదే విధంగా.. గాయపడిన ఆటగాళ్ల పునరావాసం, త్వరగా వాళ్లు కోలుకునేలా సహాయక సిబ్బందిని సరైన మార్గంలో నడిపించాడు. ఈ మేరకు ది టెలిగ్రాఫ్ తన కథనంలో పేర్కొంది.ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్-2024లో సెమీస్ బెర్తు లక్ష్యంగా ముందుకు సాగుతున్న రోహిత్ సేన.. సోమవారం నాటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. సెయింట్ లూసియాలోని డారెన్ సామీ జాతీయ క్రికెట్ స్టేడియం ఇందుకు వేదిక. చదవండి: కోహ్లి, రోహిత్‌లకు అదే ఆఖరి ఛాన్స్.. పట్టుబట్టిన గంభీర్! -
టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్..?
టీ20 వరల్డ్‌కప్ 2024 తర్వాత భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ పర్యటనలో భారత్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినిచ్చి ఐపీఎల్ స్టార్లకు (అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, నితీశ్ రెడ్డి, విజయ్‌కుమార్ వైశాఖ్, యశ్ దయాల్) అవకాశం ఇస్తారని తెలుస్తుంది. సీనియర్లు రోహిత్, విరాట్, బుమ్రా తదితరులు ఈ సిరీస్‌కు దూరంగా ఉంటారని సమాచారం. రోహిత్ గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా లేదా సూర్యకుమార్ యాదవ్‌లలో ఎవరో ఒకరు టీమిండియా సారథ్య బాధ్యతలు చేపట్టవచ్చు. జింబాబ్వే పర్యటన కోసం భారత జట్టును వచ్చే వారంలో ప్రకటిస్తారని సమాచారం. టీ20 వరల్డ్‌కప్ ట్రావెలింగ్ రిజర్వ్‌లు గిల్, ఆవేశ్ ఖాన్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ కూడా జింబాబ్వే సిరీస్‌కు ఎంపికవుతారని తెలుస్తుంది.మరోవైపు టీ20 ప్రపంచకప్ 2024తో టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనున్న విషయం తెలిసిందే. భారత తదుపరి హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైందని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ మధ్యలో బీసీసీఐ అత్యున్నత వర్గాల నుంచి ఓ సమాచారం లీకైంది. కోచ్‌గా ద్రవిడ్ పదవీకాలం ముగిశాక భారత తాత్కాలిక హెడ్ కోచ్‌గా ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపడతాడని సమాచారం. లక్ష్మణ్ ఎన్సీఏలో ఉన్న తన బృందంతో జింబాబ్వే పర్యటనకు వెళ్తాడని తెలుస్తుంది. పూర్తి స్థాయి హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు గంభీర్ కాస్త సమయం అడిగినందుకు లక్ష్మణ్‌ను జింబాబ్వే పర్యటనకు హెడ్‌కోచ్‌గా ఎంపిక చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. -
ముగిసిన డెడ్ లైన్.. భారత కొత్త హెడ్ కోచ్ ఎవరో?
టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం టీ20 ప్రపంచకప్-2024తో ముగియున్న సంగతి తెలిసిందే. దీంతో కొత్త కోచ్‌ను భర్తీ చేసే పనిలో బీసీసీఐ పడింది. అయితే భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి ధరఖాస్తు చేసుకునేందుకు గడువు సోమవారం(మే 27) సాయంత్రం ఆరు గంటలతో ముగిసింది.కాగా ధరఖాస్తులను బీసీసీఐ స్వీకరించినప్పటకి..కొత్త హెడ్ కోచ్‌ను ఎంపిక చేసేందుకు మరింత సమయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే టీమిండియా హెడ్‌కోచ్ పదవికి విదేశీయులెవరూ దరఖాస్తు చేసుకోలేదని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. తొలుత ఆస్ట్రేలియా దిగ్గజాలు జస్టిన్ లాంగర్, రికీ పాంటింగ్ పేర్లు వినిపించినప్పటికి.. వారవ్వరూ హెడ్‌కోచ్ పదవికి ఆప్లై చేసేందుకు ఆసక్తి చూపలేదని బీసీసీఐ మాలాలు వెల్లడించాయి. నో చెప్పిన వీవీఎస్ లక్ష్మణ్..!కాగా భారత హెడ్ కోచ్ రేసులోప్రధానంగా దిగ్గజ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, గౌతమ్ గంభీర్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీవీఎస్ లక్ష్మణ్ మాత్రం హెడ్‌కోచ్ పోస్ట్ కోసం దరఖాస్తు చేయలేదంట. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) డైరెక్టర్‌గా ఉన్న లక్ష్మణ్‌కు పూర్తి స్ధాయి హెడ్‌కోచ్ పదవిపై ఆసక్తి లేనిట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. టీమిండియా హెడ్ కోచ్ ఎంపికైతే జట్టుతో పాటు 10 నెలల పాటు కలిసి ప్రయాణం చేయాలి. ఈ క్రమంలోనే లక్ష్మణ్ ప్రధాన కోచ్ పదవి వైపు మొగ్గు చూపకపోయినట్లు తెలుస్తోంది. గంభీర్ కోచ్ అవుతాడా? ఇక వీవీఎస్ లక్ష్మణ్ హెడ్‌కోచ్ బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించడంతో ద్రవిడ్ వారుసుడుగా టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే బీసీసీఐ పెద్దలు గంభీర్‌తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా ఒక క్లారిటీ రాలేదు. గంభీర్ ప్రస్తుతం ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మెంటార్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్నాడు. ఐపీఎల్-2024లో అతడి నేతృత్వంలోనే కేకేఆర్ ఛాంపియన్స్‌గా నిలిచింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టును వీడి గౌతీ వస్తాడా అనే విషయం సందిగ్ధంగా ఉంది. -
BCCI: టీమిండియా హెడ్‌కోచ్‌గా వాళ్లిద్దరిలో ఒకరు?
భారత పురుషుల సీనియర్ క్రికెట్ జట్టుకు కొత్త హెడ్ కోచ్‌ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ అత్యున్నత పదవి కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆసక్తిగలవారు ఈనెల 27వ తేదీలోపు తమ దరఖాస్తులు పంపించాలి.ఎంపికైన కొత్త హెడ్ కోచ్ పదవీకాలం మూడేన్నరేళ్లపాటు (1 జూలై 2024 నుంచి 31 డిసెంబర్ 2027 వరకు) ఉంటుంది. ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం గత ఏడాది నవంబర్‌లో వన్డే వరల్డ్‌కప్ అనంతరం ముగిసింది.అయితే టి20 ప్రపంచకప్ నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్ ముగిసేవరకు టీమిండియాకు తాత్కాలిక కోచ్‌గా కొనసాగాలని బీసీసీఐ కోరడంతో ద్రవిడ్ అంగీకరించాడు. ఈ నేపథ్యంలో కొత్త హెడ్ కోచ్ పదవి కోసం ద్రవిడ్ కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. నో చెప్పిన ద్రవిడ్అయితే, ఇందుకు ద్రవిడ్ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. మరికొంత కాలం పాటు అతడిని కోచ్‌గా కొనసాగాలని టీమిండియా ప్రధాన ఆటగాళ్లలో కొందరు అభ్యర్థించినట్లు సమాచారం. కనీసం టెస్టు జట్టుకైనా ద్రవిడ్ మార్గదర్శకుడిగా ఉంటే బాగుంటుందని వారు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.కానీ వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్‌ల నియామకంపై క్రికెట్ అడ్వైజరీ కమిటీదే తుది నిర్ణయం అని.. ఏదేమైనా ఇలాంటి ప్రతిపాదనలు ఆమోదం పొందకపోవచ్చని జై షా ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. మరోవైపు.. రాహుల్ ద్రవిడ్ సైతం హెడ్ కోచ్ పదవికి గుడ్‌బై చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.లక్ష్మణ్‌కు ఆ ఛాన్స్ లేదుమరోవైపు.. ద్రవిడ్ గైర్హాజరీలో టీమిండియా కోచ్‌గా వ్యవహరించిన వీవీఎస్ లక్ష్మణ్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ పనులతో బిజీగా ఉన్నాడు. అయితే, బీసీసీఐ అతడిని అక్కడి నుంచి కదిలించేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.ఫ్లెమింగ్ లేదంటే రిక్కీ పాంటింగ్?ఈ నేపథ్యంలో.. ఈసారి విదేశీ కోచ్‌ను రంగంలోకి తీసుకువచ్చేందుకు బీసీసీఐ సుముఖంగానే ఉన్నట్లు జై షా హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరును బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు వార్తలు రాగా.. మరో పేరు కూడా తెర మీదకు వచ్చింది.ఆస్ట్రేలియా దిగ్గజ సారథి రిక్కీ పాంటింగ్ కూడా టీమిండియా హెడ్‌కోచ్ పదవి రేసులో ఉన్నాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా వీరిద్దరు ప్రస్తుతం ఐపీఎల్ జట్లకు హెడ్కోచ్లుగా ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆ జట్టును ఐదుసార్లు విజేతగా నిలపడంలో కృషి చేయగా.. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్(ప్రస్తుతం) జట్లకు కోచ్‌గా పనిచేసిన అనుభవం పాంటింగ్‌కు ఉంది.అది సాధ్యం కాదన్న పాంటింగ్అయితే, వీళ్లిద్దరు కూడా టీమిండియా హెడ్‌కోచ్ పదవి చేపట్టేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఎందుకంటే వరుస సిరీస్‌లతో బిజీగా ఉండే టీమిండియా కోసం కోచ్ ఏడాదిలో దాదాపు 10 నెలల పాటు అంకితం కావాల్సి ఉంటుంది.కాబట్టి కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే వీలుండదు. అందుకే భారత జట్టు హెడ్‌కోచ్ పదవి ఆఫర్ వచ్చినా తాను చేపట్టలేదని రిక్కీ పాంటింగ్ గతం(2021)లో వెల్లడించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా కొత్త కోచ్‌గా ఎవరు వస్తారో? అంటూ క్రికెట్ వర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది.చదవండి: సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్ -
IPL 2024: గంభీర్ గుడ్‌బై.. లక్నో మెంటార్‌గా రాహుల్ ద్రవిడ్?
టీమిండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ కొనసాగుతాడా లేదా అన్న అంశంపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. వన్డే వరల్డ్‌కప్-2023 ముగిసిన తర్వాత అతడి భవితవ్యంపై ఓ స్పష్టత వస్తుందనుకుంటే బీసీసీఐ నుంచి ఇందుకు సంబంధించి ఎటువంటి ప్రకటనా రాలేదు. కాగా టీ20 వరల్డ్‌కప్-2021 తర్వాత రవిశాస్త్రి టీమిండియా హెడ్‌కోచ్‌గా వైదొలగగా.. ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ ఆ బాధ్యతలు చేపట్టాడు. నాటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా ద్రవిడ్‌ను ఒప్పించి మరీ ఈ పదవిని కట్టబెట్టారు. ఈ క్రమంలో రాహుల్ మార్గదర్శనం, రోహిత్ శర్మ కెప్టెన్సీలో ద్వైపాక్షిక సిరీస్‌లలో అద్భుత విజయాలు సాధించిన టీమిండియా ఐసీసీ టోర్నీల్లో మాత్రం చేతులెత్తేసింది. టీ20 వరల్డ్‌కప్-2022లో సెమీస్‌లోనే నిష్క్రమించిన భారత జట్టు.. సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023లో ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఇక ఈ ఐసీసీ ఈవెంట్ తర్వాత రాహుల్ ద్రవిడ్ పదవీకాలం అధికారికంగా ముగింపు దశకు వచ్చింది. ఈ నేపథ్యంలో ద్రవిడ్ హెడ్‌కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, బీసీసీఐ మాత్రం అతడి సేవలను మరోమారు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అతడు గనుక సుముఖంగా లేకపోతే వీవీఎస్ లక్ష్మణ్ హెడ్‌కోచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. రాహుల్ ద్రవిడ్‌ను తమ మెంటార్‌గా నియమించుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. దైనిక్ జాగరణ్ కథనం ప్రకారం.. మెంటార్‌గా గౌతం గంభీర్ స్థానంలో ద్రవిడ్ అయితే బాగుంటుందని ఎల్ఎస్జీ యాజమాన్యం ఆలోచిస్తోందట. కాగా లక్నో మెంటార్‌గా సేవలు అందించిన మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ తిరిగి కోల్‌కతా నైట్‌రైడర్స్ గూటికి చేరుకున్నాడు. ఇక ఐపీఎల్-2024 వేలానికి ముందు ఆవేశ్ ఖాన్ వదులుకున్న లక్నో ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్‌తో డైరెక్ట్ స్వాప్ ద్వారా దేవ్‌దత్ పడిక్కల్‌ను దక్కించుకుంది. కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ హెడ్‌కోచ్ జస్టిన్ లాంగర్‌ను నియమించుకుంది. -
కాంట్రాక్ట్ పొడిగింపునకు నో చెప్పిన ద్రవిడ్.. టీమిండియా కొత్త హెడ్ కోచ్ అతడే..?
టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం వరల్డ్‌కప్ 2023 ఫైనల్‌తో ముగిసింది. 2021 నవంబర్‌లో బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్ రెండేళ్ల పాటు పదవిలో కొనసాగాడు. వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి నేపథ్యంలో ద్రవిడ్ భారత జట్టు కోచింగ్ పదవికి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై ద్రవిడ్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, సన్నిహితులతో స్పష్టం చేశాడని సమాచారం. వరల్డ్‌కప్ ఫైనల్ ముగిసిన అనంతరం కోచ్‌గా కొనసాగడంపై ఇంకా తేల్చుకోలేదని చెప్పిన ద్రవిడ్ తాజాగా బీసీసీఐ పెద్దల వద్ద నో చెప్పాడని తెలుస్తుంది. ద్రవిడ్ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చిన వెంటనే భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ప్రస్తుత ఎన్సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్‌ను నియమిస్తారని సమాచారం. ఈ విషయంపై బీసీసీఐ పెద్దలు పూర్తి క్లారిటీగా ఉన్నారని తెలుస్తుంది. లక్ష్మణ్‌కు పట్టం కట్టేందుకు బీసీసీఐ ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నట్లు వినికిడి. ప్రస్తుతం లక్ష్మణ్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్ తాత్కాలిక హెడ్ కోచ్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఒకటి రెండు రోజుల్లో బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గత రెండేళ్ల కాలంలో ద్రవిడ్ గైర్హాజరీలో లక్ష్మణ్ పలు సిరీస్‌ల్లో టీమిండియా కోచ్‌గా వ్యవహరించాడు. లక్ష్మణ్ టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ద్రవిడ్ ఎన్సీఏ చీఫ్‌గా ట్రాన్స్ఫర్ అవుతాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ద్రవిడ్ ఓ ఐపీఎల్ జట్టుతో జత కట్టనున్నాడని టాక్ కూడా నడుస్తుంది. మొత్తానికి ద్రవిడ్ దిగిపోతే టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌కు పట్టం కట్టేందుకు సర్వం సిద్దమైందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా వైజాగ్‌లోని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా ఇవాళ భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. -
లక్ష్మణ్ హెడ్‌కోచ్‌గా సూర్య కెప్టెన్సీలో! షెడ్యూల్, జట్లు.. పూర్తి వివరాలు
వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో ఓటమి బాధను మర్చిపోకముందే.. భారత జట్టు తిరిగి మైదానంలో దిగేందుకు సిద్ధమైంది. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ను మొదలుపెట్టనుంది. వైజాగ్ వేదికగా గురువారం ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే ఇరుజట్లు అక్కడి చేరుకుని ప్రాక్టీస్‌లో తలమునకలయ్యాయి. కాగా ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు ఎప్పటిమాదిరే రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దూరంగా ఉండనున్నారు. ఇక వీరితో పాటు వన్డే వరల్డ్‌కప్ ఆడిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, సిరాజ్, బుమ్రా, షమీ తదితరులు కూడా విశ్రాంతి తీసుకోనున్నారు. మరోవైపు హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరంగా.. సూర్యకుమార్ యాదవ్ తొలిసారి టీమిండియా సారథిగా ఈ సిరీస్‌తో పగ్గాలు చేపట్టనున్నాడు. ఇక హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ గైర్హాజరీలో వీవీఎస్ లక్ష్మణ్ మరోసారి టీమిండియాకు మార్గదర్శనం చేయనున్నాడు. ఈ దిగ్గజ బ్యాటర్ నేతృత్వంలో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 సిరీస్ షెడ్యూల్ ►తొలి టీ20- నవంబరు 23- గురువారం- వైజాగ్ ►రెండో టీ20- నవంబరు 26- ఆదివారం- తిరువనంతపురం ►మూడో టీ20- నవంబరు 28- మంగళవారం- గువాహటి ►నాలుగో టీ20- డిసెంబరు 1- శుక్రవారం- రాయ్‌పూర్ ►ఐదో టీ20- డిసెంబరు 3- ఆదివారం- బెంగళూరు ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 సిరీస్ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు ఆరంభం కానున్నాయి. టీవీలో.. స్పోర్ట్స్ 18, కలర్స్ సినీప్లెక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అదే విధంగా డిజిటల్ మీడియాలో జియో సినిమాలో లైవ్ స్ట్రీమింగ్ జరుగనుంది. ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్ ), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్. ఆస్ట్రేలియా జట్టు మాథ్యూ వేడ్ (కెప్టెన్), ఆరోన్ హార్డీ, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, సీన్ అబాట్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, కేన్ రిచర్డ్సన్, ఆడం జంపా. చదవండి: అందుకే దాన్ని ఫైనల్ అంటారు: కైఫ్ విమర్శలపై వార్నర్ స్పందన -
విశాఖలో భారత్ VS ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ (ఫొటోలు)
-
ద్రవిడ్‌ను కొనసాగిస్తారా? సాగనంపితే... టీమిండియా కొత్త కోచ్ ఎవరు..?
టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల పదవీకాలం వరల్డ్‌కప్ 2023 ఫైనల్‌తో ముగిసింది. దీంతో భారత జట్టు కొత్త హెడ్ కోచ్ ఎవరనే అంశంపై చర్చ మొదలైంది. మరో దఫా కొనసాగాలా లేదా అనే దానిపై ఇంకా తేల్చుకోలేదని ద్రవిడ్ వరల్డ్‌కప్ అనంతరం మీడియా సమావేశంలో తెలిపాడు. మరి బీసీసీఐ రవిశాస్త్రిలా ద్రవిడ్‌ను రెండో దఫా కొనసాగిస్తుందో లేదో వేచి చూడాలి. ప్రస్తుతానికి అయితే ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు స్టాండ్ ఇన్ కోచ్‌గా ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఒకవేళ ద్రవిడ్ రెండో దఫా కోచ్‌గా పని చేసేందుకు నిరాకరిస్తే లక్ష్మణ్ భారత జట్టు హెడ్ కోచ్ పదవి రేసులో ముందువరుసలో ఉంటాడు. ఈ పదవి కోసం లక్ష్మణ్‌తో పాటు మరో ఇద్దరు టీమిండియా దిగ్గజాలు పోటీలో ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇటీవలే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్‌గా ప్రకటించబడ్డ వీరేంద్ర సెహ్వాగ్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే లక్ష్మణ్‌తో పాటు ప్రధాన పోటీదారులుగా నిలిచే ఛాన్స్ ఉంది. వీరిలో కుంబ్లేకు గతంలో భారత జట్టు హెడ్ కోచ్‌గా పని చేసిన అనుభవం ఉంది. ధోనిని ఒప్పించి అప్పచెబితే.. టీమిండియా హెడ్ కోచ్ పదవి ఖాళీ అయిన నేపథ్యంలో ఈ అంశంపై నెట్టింట జోరుగా చర్చలు సాగుతున్నాయి. కొందరు ద్రవిడ్‌నే కొనసాగించాలని అంటుంటే, మరికొందరు అతడిని సాగనంపాలని వాధిస్తున్నారు. ఒకవేళ హెడ్ కోచ్ పదవిలో కొనసాగేందుకు ద్రవిడ్ ఆసక్తి కనబర్చకపోతే లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, సెహ్వాగ్‌లు రేసులో ఉంటారని ప్రచారం జరుగుతుంది. కొత్తగా కొందరు టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరును తెరపైకి తెస్తున్నారు. ధోనికి ఇష్టం లేకపోయినా అతన్ని ఒప్పించి మరీ భారత క్రికెట్ జట్టు కోచింగ్ బాధ్యతలు అప్పజెప్పాలని వారు పట్టుబడుతున్నారు. మరి భారత జట్టుకు కోచింగ్ ఇచ్చేందుకు ధోని ముందుకు వస్తాడో లేదో వేచి చూడాలి. -
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్!
వన్డే వరల్డ్‌కప్-2023 ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. నవంబర్ 23న విశాఖపట్నం వేదికగా ఇరు జట్ల మధ్య జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చే ఛాన్స్ ఉంది. టీమిండియా హెడ్ కోచ్‌గా లక్ష్మణ్.. మరోవైపు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో భారత జట్టు హెడ్ కోచ్‌గా దిగ్గజ ఆటగాడు, ఏన్సీఏ హెడ్ వీవీయస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీమిండియా హెడ్‌కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ఈ వరల్డ్‌కప్‌తో ముగియనుంది. ఈ క్రమంలో అతడి స్ధానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ ధరఖాస్తులను అహ్హనించనుంది. కొత్త కోచ్ వచ్చేటప్పటికి సమయం పట్టే అవకాశమున్నందన లక్ష్మణ్ తాత్కాలిక హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. లక్ష్మణ్ ఇప్పటికే ద్రవిడ్ గైర్హజరీలో ఐర్లాండ్, జింబాబ్వే టూర్లకు, స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. కాగా లక్ష్మణ్ ఇప్పటికే చాలా సిరీస్‌లలో భారత జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఐర్లాండ్, జింబాబ్వే టూర్లకు, స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. గతంలో భారత అండర్-19 క్రికెట్ జట్టుకు కూడా లక్ష్మణ్ హెడ్‌కోచ్‌గా పనిచేశాడు.అతడి పర్యవేక్షణలోనే అండర్ 19 ప్రపంచకప్-2021ను యువ భారత జట్టు సొంతం చేసుకుంది. చదవండి: WC 2023: పాండ్యా లేని లోటు తీర్చేందుకు రంగంలోకి కోహ్లి.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ -
శ్రీవారి ఆలయ అలంకరణకు వీవీఎస్ లక్ష్మణ్ విరాళం
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారిని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి మాజీ క్రికెటర్ వివిఎస్.లక్ష్మణ్ స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీవారి ఆలయంకు ఒక్క రోజు అలంకరణకు అయ్యే ఖర్చును వీవీఎస్ లక్ష్మణ్ విరాళంగా అందించారు. దాదాపు రూ.14 లక్షలు విరాళంగా ఇచ్చిన ఆయన, శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభం మొదలుకుని శ్రీవారి గర్భాలయం వరకూ టీటీడీ ఉద్యానవనం సిబ్బంది వివిధ రకాల కట్ ప్లవర్స్ అలంకరణను ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రద్ధగా గమనించారు. చదవండి: ‘గగన్‌యాన్’ TV-D1 ప్రయోగం సక్సెస్ -
ఓటు వేసిన VVS లక్ష్మణ్, మిథాలీ రాజ్
-
800 మూవీ విజయ్ సేతుపతి చేయాల్సింది, కుటుంబాన్ని బెదిరించడంతో..
టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా '800'. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ మూవీలో మురళీధరన్ పాత్రలో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' ఫేమ్ మధుర్ మిట్టల్, మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 6న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది. నాకు బ్రదర్ కంటే ఎక్కువ: లక్ష్మణ్ సోమవారం నాడు హైదరాబాద్‌లో '800' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీవీఎస్ లక్ష్మణ్ చేతుల మీదుగా బిగ్ టికెట్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ''మైదానంలో మురళీధరన్ సాధించినది మాత్రమే కాదు, అతని జీవితం అంతా ఇన్స్పిరేషన్. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి మురళీధరన్ మెంటార్ కూడా! అతనితో పాటు క్రికెట్ ఆడాను. అతనికి అపోజిట్ టీంలో ఆడాను. మురళీధరన్ గొప్ప క్రికెటర్ అని అందరికీ తెలుసు. అంత కంటే గొప్ప మనసు ఉన్న వ్యక్తి, నిగర్వి. ఈతరం యువతకు రోల్ మోడల్. నాకు బ్రదర్ కంటే ఎక్కువ. అతనిలాంటి ఫ్రెండ్ ఉండటం లక్కీ. మురళీధరన్ కి క్రికెట్టే జీవితం'' అని అన్నారు. లక్ష్మణ్‌తో అలాంటి అనుబంధం: ముత్తయ్య ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ ''1998లో ఫస్ట్ టైమ్ లక్ష్మణ్‌ను చూశా. ఒరిస్సాలోని కటక్‌లో మ్యాచ్ ఆడాం. నా కంటే వయసులో లక్ష్మణ్ చిన్న. అప్పుడు టీనేజర్ అనుకుంట! అప్పుడే తన ఆటతో లక్ష్మణ్ అందరికి షాక్ ఇచ్చాడు. ఈ అబ్బాయి ఇండియన్ టీంలో ఎందుకు లేడని అనుకున్నా. ఆ తర్వాత చాలాసార్లు కలిశాం. స్పిన్ ఆడటంలో లక్ష్మణ్ మేటి. మేం మైదానంలో వేర్వేరు దేశాలకు ఆడినప్పటికీ... మైదానం బయట సచిన్, అనిల్ కుంబ్లే, గంగూలీ అంతా స్నేహితులుగా ఉన్నాం. క్రికెట్ అంటే రికార్డులు కాదు... స్నేహితుల్ని చేసుకోవడం! వెంకటేశ్‌ను కెప్టెన్ చేయాలి హైదరాబాద్ నాకు స్పెషల్... నేను ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యాక సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి పని చేయమని అడిగారు. ఒకసారి టీం అంతా హైదరాబాద్ నుంచి వేరే సిటీకి వెళుతున్నాం. సరదాగా బిర్యానీ అడిగా. అరగంటలో విమానంలో చాలా బిర్యానీలు ఉన్నాయి. లక్ష్మణ్ అంటే అది'' అని చెప్పారు. ఇండియన్ సెలబ్రిటీలతో క్రికెట్ టీం ఏర్పాటు చేయాల్సి వస్తే... ఎవరెవరిని ఎంపిక చేస్తారని అడగ్గా ''వెంకటేష్ ను కెప్టెన్ చేయాలి. ఆయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆయన ఎప్పుడూ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ మిస్ కారు'' అని మురళీధరన్ చెప్పారు. నానితో ఒకసారి మాట్లాడానని ఆయన తెలిపారు. విజయ్ సేతుపతిని బెదిరించారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ముత్తయ్య మురళీధరన్ కీలక విషయాన్ని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 'విజయ్ సేతుపతితో '800' తీయాలని అనుకున్నాం. ఆయన కూడా అందుకు ఒప్పుకున్నారు. కానీ ఇది ఇష్టం లేని కొందరు నాయకులు ఆయన మీద ఒత్తిడి తెచ్చారు. తన కుటుంబాన్ని బెదిరించారు. దీంతో ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు' అని చెప్పుకొచ్చాడు. చదవండి: రెండుసార్లు బ్రేకప్, డిప్రెషన్లో.. కాంట్రాక్టు మీద సంతకం పెట్టాక రాత్రికి రమ్మనేవాళ్లు! -
టీమిండియా హెడ్‌కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్.. అతడు కూడా
చైనా వేదికగా జరగనున్న ఆసియా క్రీడలు 2023లో భారత పురుష, మహిళ క్రికెట్ జట్లు తొలిసారి పాల్గోనున్నాయి. ఇప్పటికే ఈ మెగా ఈవెంట్ కోసం భారత జట్లను బీసీసీఐ ప్రకటించింది. ఈ క్రీడలు సెప్టెంబర్ 23 నుంచి ఆక్టోబర్ 8 హాంగ్జౌలో జరగనున్నాయి. కాగా ఈవెంట్ కోసం భారత పురుషల ద్వితీయ శ్రేణి జట్టును బీసీసఘై ఎంపిక చేసింది. ఆక్టోబర్‌లో వన్డే ప్రపంచకప్ జరగనుండడంతో.. ఆసియాకప్‌లో యువ భారత జట్టు పాల్గొనుంది. ఈ జట్టులో ఐపీఎల్ హీరోలు యశస్వీ జైశ్వాల్,రింకూ సింగ్, జితేష్ శర్మకు చోటు దక్కింది. ఇక ఈవెంట్లో భారత పురుషల జట్టు కెప్టెన్‌గా యువ ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్ వ్యవహరించనుండగా.. మహిళల జట్టును హర్మన్ ప్రీత్ కౌర్ నడపించనుంది. హెడ్ కోచ్‌లుగా వీవీఎస్ లక్ష్మణ్, హృషికేష్ కనిట్కర్ కాగా ఈ ఆసియా క్రీడలకు సీనియర్ ఆటగాళ్లతో పాటు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కూడా బీసీసీఐ రెస్టు ఇచ్చింది. అతడి స్ధానంలో టీమిండియా మాజీ క్రికెటర్, నేషనల్ క్రికెట్ అకాడమీ ఛీప్ వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. లక్ష్మణ్ ప్రస్తుతం ఆసియాకప్-2023 కోసం ఆలూర్‌లో ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రైనింగ్ క్యాంప్‌లో భారత ఆటగాళ్లతో పాటు ఉన్నాడు. ఇక లక్ష్మణ్‌తో పాటు చైనాకు సాయిరాజ్ బహుతులే(బౌలింగ్‌కోచ్),మునీష్ బాలి (ఫీల్డింగ్ కోచ్) కూడా వెళ్లనున్నారు. లక్ష్మణ్‌తో పాటు, ఆసియాడ్ కోసం భారత పురుషుల జట్టు సహాయక సిబ్బందిలో బౌలింగ్ కోచ్‌గా భారత మాజీ లెగ్ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులే మరియు ఫీల్డింగ్ కోచ్‌గా మునీష్ బాలి ఉన్నారు. లక్ష్మణ్ ఇప్పటికే ద్రవిడ్ గైర్హజరీలో ఐర్లాండ్, జింబాబ్వే టూర్లకు, స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. గతంలో భారత అండర్-19 క్రికెట్ జట్టుకు కూడా లక్ష్మణ్ హెడ్‌కోచ్‌గా వ్యవహరించారు. లక్ష్మణ్ పర్యవేక్షణలోనే అండర్ 19 ప్రపంచకప్-2021ను యువ భారత జట్టు సొంతం చేసుకుంది. మరోవైపు ఈ ఆసియాటోర్నీలో భారత మహిళల జట్టు హెడ్‌కోచ్‌గా మాజీ ఆటగాడు హృషికేష్ కనిట్కర్ వ్యవహరించనున్నాడు. కాగా గత డిసెంబర్ నుంచి భారత మహిళల జట్టు రెగ్యూలర్ హెడ్‌కోచ్ లేకుండానే ఆడుతోంది. చదవండి: నా కూతురు ఫీజు కూడా కట్టలేకపోయా.. కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ క్రికెటర్ -
హ్యాపీ బర్త్‌డే మచ్చా.. నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నావు: పంత్ భావోద్వేగం
Rishabh Pant Shares Video: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. ఘోర రోడ్డు ప్రమాదం నుంచి అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ అతడు.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఫిట్‌నెస్‌పై దృష్టి సారించి జిమ్‌లో కసరత్తులు మొదలుపెట్టాడు. నెట్స్‌లో బ్యాటింగ్ చేయడం ఆరంభించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా రిషభ్ పంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఎన్సీఏ బ్యాటింగ్ కోచ్ సితాంశు కొటక్ పుట్టినరోజును పురస్కరించుకుని శుక్రవారం అతడితో కేక్ కట్ చేయించాడు ఈ ఉత్తరాఖండ్ బ్యాటర్. ఎన్సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ సమక్షంలో సితాంశు బర్త్‌డే సెలబ్రేట్ చేశాడు. హ్యాపీ బర్త్‌డే మచ్చా.. థాంక్యూ ‘‘కొంచెం బ్లర్‌గా ఉంది గానీ! పుట్టినరోజు శుభాకాంక్షలు మచ్చా. గత కొన్ని నెలలుగా నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు ధన్యవాదాలు’’ అని ఎమోషనల్ అయ్యాడు. కాగా గతేడాది డిసెంబరులో రిషభ్ పంత్ యాక్సిడెంట్‌కు గురయ్యాడు. కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొనేందుకు వెళ్తున్న క్రమంలో రూర్కీ వద్ద అతడి కారుకు ప్రమాదం జరిగింది. ఘోర ప్రమాదం నుంచి బయటపడి ఆ సమయంలో ఒక్కడే ఉన్న పంత్‌ను స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా.. కాస్త కోలుకున్న తర్వాత బీసీసీఐ అతడిని ముంబైకి ఎయిర్‌లిఫ్ట్ చేసింది. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించారు. నడవగలిగే స్థితికి చేరుకున్న తర్వాత బెంగళూరులోని ఎన్సీఏకు పంత్‌ను పంపగా.. అక్కడ పునరావాసం పొందుతున్నాడు. కాగా ఇప్పటికే ఐపీఎల్‌తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్-2023 వంటి మెగా మ్యాచ్ మిస్ అయిన రిషభ్ పంత్ వన్డే వరల్డ్‌కప్ నాటికైనా అందుబాటులోకి వస్తే బాగుండని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. చదవండి: తిలక్, యశస్వి బౌలింగ్ చేస్తారు.. ఇకపై: టీమిండియా కోచ్ కీలక వ్యాఖ్యలు View this post on Instagram A post shared by Rishabh Pant (@rishabpant) -
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. హెడ్‌కోచ్ లేకుండానే! టీమిండియా ఎలా మరి?
జస్ప్రీత్ బుమ్రా సారధ్యంలోని యువ భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు సిద్దమవుతోంది. ఈ టూర్లో భాగంగా అతిథ్య ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టు రెండు బ్యాచ్‌లగా ఐర్లాండ్‌కు చేరుకోనుంది. మంగళవారం(ఆగస్టు 15)న జస్ప్రీత్ బుమ్రా, రుత్‌రాజ్ గైక్వాడ్‌తో కూడిన బృందం మొదటి బ్యాచ్‌గా ఐర్లాండ్‌కు పయనం కానుంది. మరోవైపు విండీస్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా ఉన్న తిలక్ వర్మ, జైశ్వాల్, సంజూ శాంసన్ నేరుగా యూఎస్ నుంచి ఐర్లాండ్‌కు బయలదేరునున్నారు. ఆగస్టు 18న డబ్లిన్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. హెడ్‌కోచ్ లేకుండానే.. ఇక ఐర్లాండ్ పర్యటనకు హెడ్‌కోచ్ లేకుండా భారత జట్టు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్ టూర్ తర్వాత రెగ్యులర్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు ఇతర కోచింగ్ స్టాప్‌కు బీసీసీఐ విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఐర్లాండ్ టూర్‌కు టీమిండియా హెడ్‌కోచ్‌గా ఏన్సీఏ ఛీప్ వీవీయస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నట్లు వార్తలు వినిపించాయి. గతంలో చాలాసార్లు ద్రవిడ్ గైర్హజరీలో ఈ హైదరాబాదీనే భారత జట్టు కోచ్‌గా పనిచేశాడు. కానీ ఈ సారి మాత్రం ఐరీష్ టూర్‌కు లక్ష్మణ్ కూడా వెళ్లడం లేదు. క్రిక్‌బజ్ రిపోర్టు ప్రకారం.. ఇండియా-ఏ జట్టు కోచ్‌లు సితాన్షు కోటక్ , సాయిరాజ్ బహుతులే నేతృత్వంలో భారత్ ఈ సిరీస్ ఆడనుంది. ఐర్లాండ్ సిరీస్‌కు భారత జట్టు: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ , యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్, జితేష్ శర్మ, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్ , ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్ చదవండి: The Hundred 2023: సన్‌రైజర్స్ ఆటగాడు ఊచకోత.. కేవలం 22 బంతుల్లోనే! -
చిక్కుల్లో టీమిండియా కెప్టెన్! అప్పీలుకు వెళ్లేది లేదన్న బీసీసీఐ..
ICC- Harmanpreet Kaur- BCCI: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా వరుస విజయాలు అందుకున్న హర్మన్‌ప్రీత్‌కౌర్ బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా అపఖ్యాతి మూటగట్టుకుంది. బంగ్లాతో ఆఖరి మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ పెవిలియన్‌కు చేరే క్రమంలో బ్యాట్‌తో వికెట్లను కొట్టింది. అంతేకాదు.. సిరీస్ 1-1తో సమానమైన నేపథ్యంలో ట్రోఫీ పంచుకునేటపుడు కూడా కాస్త దురుసుగా ప్రవర్తించింది. బంగ్లాదేశ్ కెప్టెన్ దగ్గరికి రాగానే.. ఈ మ్యాచ్ టై అవడానికి అంపైర్లు కూడా కారణం.. వాళ్లను కూడా పిలువు అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించింది. హర్మన్ నుంచి ఊహించని కామెంట్ల నేపథ్యంలో ఆమె తమ జట్టును తీసుకుని డ్రెసింగ్‌రూంకి వెళ్లిపోయింది. ఈ వరుస సంఘటనల నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ కౌర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు టీమిండియా మాజీ క్రికెటర్లు సైతం హర్మన్ వ్యవహారశైలిని తప్పుబట్టారు. ఐసీసీ సైతం ఆమెపై కఠిన చర్యలు చేపట్టింది. నిబంధనలు ఉల్లంఘించిందని పేర్కొంటూ.. రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించింది. ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎలా స్పందిస్తున్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో బీసీసీఐ కార్యదర్శి జై షా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, వీవీఎస్ లక్ష్మణ్ అనుచిత ప్రవర్తన గురించి హర్మన్‌తో మాట్లాడతారు. మేమైతే ఆమె సస్పెన్షన్ గురించి ఐసీసీని సవాలు చేయబోము. ఇప్పటికే ఆ సమయం కూడా మించిపోయింది’’ అని జై షా పేర్కొన్నాడు. కాగా హర్మన్ ప్రవర్తన ఆమె పట్ల గౌరవాన్ని తగ్గించిందనే కామెంట్లు వినిపిస్తుండగా.. అభిమానులు మాత్రం ఇంతకంటే ఓవరాక్షన్ చేసిన వాళ్లు మాత్రం మీకు కనబడరా అంటూ అండగా నిలుస్తున్నారు. కాగా ఐసీసీ నిషేధం నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ కౌర్ ఆసియా క్రీడలు-2023లో రెండు మ్యాచ్‌లకు దూరం కానుంది. చదవండి: సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగింపు.. భువనేశ్వర్ కుమార్ కీలక నిర్ణయం! టీమిండియా క్రికెటర్లలో ప్రభుత్వ ఉద్యోగులు వీరే! లిస్టులో ఊహించని పేర్లు.. Harmanpreet Kaur was not happy with the decision 👀#HarmanpreetKaur #IndWvsBangW #INDvWI pic.twitter.com/ZyoQ3R3Thb — Ajay Ahire (@Ajayahire_cric) July 22, 2023 -
టీమిండియా హెడ్‌కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
చైనా వేదికగా జరగనున్న ఆసియాగేమ్స్‌లో భారత క్రికెట్ జట్లు తొలిసారి పాల్గొనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మెగా ఈవెంట్లో భాగమయ్యే మెన్స్, ఉమెన్స్ జట్లను బీసీసీఐ ప్రకటించింది. భారత పురుషుల జట్టుకు యువ ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్ సారధ్యం వహించనుండగా.. మహిళల జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వం వహించనుంది. ఇక ఐపీఎల్లో అదరగొట్టిన రింకూ సింగ్, ప్రభుసిమ్రాన్ సింగ్,తిలక్ వర్మ వంటి యువ ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు దక్కింది. ఆసియా క్రీడలకు భారత సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చారు. అయితే ఈ జట్టులో వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు చోటు దక్కకపోవడం గమానార్హం. హెడ్‌కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్.. ఇక ఈ క్రీడలకు సీనియర్ ఆటగాళ్లతో పాటు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కూడా బీసీసీఐ రెస్టు ఇచ్చింది. అతడి స్ధానంలో టీమిండియా మాజీ క్రికెటర్, నేషనల్ క్రికెట్ అకాడమీ ఛీప్ వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. లక్ష్మణ్ ఇప్పటికే ద్రవిడ్ గైర్హజరీలో ఐర్లాండ్, జింబాబ్వే టూర్లకు, స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. గతంలో భారత అండర్-19 క్రికెట్ జట్టుకు కూడా లక్ష్మణ్ హెడ్‌కోచ్‌గా వ్యవహరించారు. లక్ష్మణ్ పర్యవేక్షణలోనే అండర్ 19 ప్రపంచకప్-2021ను యువ భారత జట్టు సొంతం చేసుకుంది.మరోసారి జట్టును తన నేతృత్వంలో జట్టును నడిపించేందుకు హైదరాబాదీ సిద్దమయ్యాడు. ఈ ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19 నుంచి ఆక్టోబర్ 7 వరకు జరగనున్నాయి. చదవండి: Ind Vs Pak: సూర్యకుమార్‌కు 32, నాకింకా 22 ఏళ్లే.. అతడితో పోలిక ఎందుకు: పాక్ బ్యాటర్ ఓవరాక్షన్ -
IND VS WI 2nd Test: రాహుల్ ద్రవిడ్‌కు విశ్రాంతి
వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లు ముగిసాక టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, అతని సహాయక సిబ్బందికి కొన్ని రోజుల పాటు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం విండీస్ సిరీస్ ముగిసాక టీమిండియా.. ఐర్లాండ్‌తో వారి స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్‌కు వెళ్లకుండా స్వదేశంలో రెస్ట్ తీసుకునేందుకే ద్రవిడ్ బృందానికి బీసీసీఐ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. విండీస్‌తో ఆఖరి రెండు టీ20ల తర్వాత ద్రవిడ్ అండ్ కో యునైటెడ్ స్టేట్స్ (ఆఖరి 2 టీ20లు విండీస్‌లో కాకుండా యుఎస్ఏలో జరుగనున్నాయి) నుంచి నేరుగా భారత్‌కు పయనమవుతుంది. ద్రవిడ్ టీమ్‌లో బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేతో పాటు మరికొంత మంది సభ్యులు ఉన్నారు. సమీప భవిష్యత్తులో టీమిండియాకు ఉన్న బిజీ షెడ్యూల్ దృష్ట్యా వీరికి విశ్రాంతి ఇస్తున్నట్లు తెలుస్తోంది. ద్రవిడ్ టీమ్ గైర్హాజరీలో వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలోని జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) సిబ్బంది ఐర్లాండ్ పర్యటనను నిర్వహిస్తారు. లక్ష్మణ్ టీమ్‌లో బ్యాటింగ్ కోచ్‌గా హృషికేశ్ కనిత్కర్, బౌలింగ్ కోచ్‌గా సాయిరాజ్ బహుతులే ఉన్నారు. కాగా, గతంలోనూ పలు సందర్భాల్లో ద్రవిడ్ గైర్హాజరీలో వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియా కోచింగ్ బాధ్యతలను నిర్వర్తించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్న భారత్ డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారీ విజయం సాధించి, మరో విజయం కోసం తహతహలాడుతుంది. ఈ సిరీస్‌లో భారత్ తదుపరి మరో టెస్ట్ మ్యాచ్, 3 వన్డేలు, 5 టీ20లు ఆడుతుంది. తొలి టెస్ట్‌లో యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ శతకాలు సాధించి, టీమిండియా భారీ స్కోర్‌కు దోహదపడగా.. అశ్విన్ 12 వికెట్లు పడగొట్టి, భారత గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు. -
VVS Laxman Rare Photos: టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అరుదైన (ఫోటోలు)
-
IPL 2023: కెప్టెన్ అయ్యానన్న ఆనందం అంతలోనే ఆవిరి! లక్ష్మణ్ తర్వాత..
IPL 2023 LSG Vs CSK- Krunal Pandya: కేఎల్ రాహుల్ గాయపడిన కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తొలిసారి కెప్టెన్ అయ్యాడు టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా. ఐపీఎల్-2023లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ సారథిగా పగ్గాలు చేపట్టాడు. అయితే, కెప్టెన్ అయ్యానన్న ఆనందం కృనాల్‌కు ఎంతో సేపు నిలవలేదు. అంతలోనే ఆనందం ఆవిరి లక్నో బ్యాటింగ్ ఆరంభించిన కొద్దిసేపటికే అతడి సంతోషం ఆవిరైపోయింది. కృనాల్ పేరిట ఓ చెత్త రికార్డు నమోదైంది. అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో సీఎస్కేతో మ్యాచ్‌లో టాస్ ఓడిన లక్నో తొలుత బ్యాటింగ్‌కు దిగింది. చెత్త రికార్డు మూటగట్టుకుని ఈ క్రమంలో చెన్నై బౌలర్ మొయిన్ అలీ.. ఓపెనర్ కైల్ మేయర్స్(14)ను పెవిలియన్‌కు పంపగా.. మహీశ్ తీక్షణ మరో ఓపెనర్ మనన్ వోహ్రా(10) వికెట్ కూల్చాడు. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన కరణ్ శర్మ 9 పరుగులు చేయగా.. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన కృనాల్ పాండ్యా డకౌట్ అయ్యాడు. లక్నో ఇన్నింగ్స్ ఆరో ఓవర్ చివరి బంతికి మహీశ్ తీక్షణ బౌలింగ్‌లో అజింక్య రహానేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రహానే అద్భుత రీతిలో క్యాచ్ అందుకోవడంతో పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. తద్వారా ఐపీఎల్లో కెప్టెన్‌గా డెబ్యూ మ్యాచ్‌లోనే డకౌట్ అయిన మూడో క్రికెటర్‌గా అప్రదిష్ట మూటగట్టుకున్నాడు. ఐపీఎల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి మ్యాచ్‌లో డకౌట్ అయింది వీరే! ►2008లో కేకేఆర్‌తో కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో దెక్కన్ చార్జర్స్ కెప్టెన్ వీవీఎస్ లక్ష్మణ్ ►2023లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ నాయకుడు ఎయిడెన్ మార్కరమ్ ►2023లో లక్నోలో చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ సారథి కృనాల్ పాండ్యా చదవండి: 'నేను ఔటయ్యానా?'.. జడ్డూ దెబ్బకు షాక్‌లో స్టోయినిస్ Virat Kohli: ఐపీఎల్ ఆడేందుకే వచ్చా! ఎవరెవరితోనూ తిట్టించుకోవడానికి కాదు! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చరిత్ర సృష్టించిన విలియమ్సన్, హెన్రీ నికోల్స్... ద్రవిడ్- లక్ష్మణ్‌తో పాటు..
New Zealand vs Sri Lanka, 2nd Test: న్యూజిలాండ్ బ్యాటర్లు కేన్ విలియమ్సన్, హెన్రీ నికోల్స్ చరిత్ర సృష్టించారు. కివీస్ టెస్టు చరిత్రలో అధికసార్లు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన తొలి జోడీగా నిలిచారు. అదే విధంగా.. ఓవరాల్‌గా రెండు లేదంటే ఎక్కువసార్లు ఈ ఫీట్ నమోదు చేసిన ఎనిమిదో జోడీగా ఘనత సాధించారు. ద్రవిడ్- లక్ష్మణ్‌లతో పాటు స్వదేశంలో శ్రీలంకతో రెండో టెస్టు రెండో రోజు సందర్భంగా 300 పైచిలుకు భాగస్వామ్యంతో ఈ రికార్డు అందుకున్నారు. వీరు ఈ ఫీట్ నమోదు చేయడం ఇది రెండోసారి. తద్వారా మహేళ జయవర్ధనే- కుమార సంగక్కర, డాన్ బ్రాడ్‌మన్- విల్ పోన్స్‌ఫోర్డ్, మైకేల్ క్లార్క్- రిక్కీ పాంటింగ్, మహ్మద్ యూసఫ్- యూనిస్ ఖాన్, రాహుల్ ద్రవిడ్- వీవీఎస్ లక్ష్మణ్‌ల తర్వాత ఈ ఘనత సాధించిన ఆరో జోడీగా నిలిచారు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా న్యూజిలాండ్ శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో తొలి టెస్టులో ఆఖరి బంతికి విజయం అందుకున్న కివీస్.. రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సరికి పటిష్ట స్థితిలో నిలిచింది. వన్‌డౌన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్(215), నాలుగో స్థానంలో వచ్చిన హెన్రీ నికోల్స్(200 నాటౌట్) డబుల్ సెంచరీలతో రాణించారు. పటిష్ట స్థితిలో వెల్లింగ్టన్లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో ఇద్దరూ కలిసి 363 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ క్రమంలో 4 వికెట్ల నష్టానికి 580 పరుగుల భారీ స్కోరు వద్ద న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో రెండో రోజు ఆట ముగిసే సరికి లంక రెండు వికెట్లు నష్టపోయి 26 పరుగులు చేసింది. దీంతో ఆతిథ్య కివీస్‌కు 554 పరుగుల ఆధిక్యం లభించింది. చదవండి: IPL 2023: కేకేఆర్‌కు మరో బిగ్‌షాక్.. స్టార్ ఆటగాళ్లు దూరం! IND vs AUS: హార్దిక్‌పై కోపంతో ఊగిపోయిన కోహ్లి.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్ -
సౌరవ్ గంగూలీకి కీలక బాధ్యతలు..
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తిరిగి మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు క్రికెట్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. గతేడాది ఆక్టోబర్‌లో బీసీసీఐ అధ్యక్ష పదవి నుండి వైదొలిగిన దాదా.. ఇప్పటికే యూఏఈ టీ20 లీగ్‌లో దుబాయ్ క్యాపిటల్స్, దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టు క్రికెట్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు. కాగా దుబాయ్ క్యాపిటల్స్, ప్రిటోరియా క్యాపిటల్స్ ఫ్రాంచైజీలను ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్‌గా సౌరవ్ తిరిగి బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇప్పటికే అతడితో ఢిల్లీ ఫ్రాంచైజీతో చర్చలు కూడా జరిగింది. గతంలో క్రికెట్ డైరెక్టర్‌గా పనిచేసిన దాదాకు ఢిల్లీ యాజమాన్యంతో మంచి సంబంధం ఉంది. కాబట్టి మళ్లీ అతడు తన బాధ్యతలను తిరిగి చేపట్టునున్నాడు అని ఐపీఎల్ వర్గాలు పీటీఐతో వెల్లడించాయి. ఇక టీమిండియా స్టార్ ఆటగాడు, ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యూలర్ కెప్టెన్ రిషబ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. అతడు పూర్తిగా కోలుకోవడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు ఐపీఎల్‌కు దూరం కావడం దాదాపు ఖాయంగానే కన్పిస్తోంది. ఒక వేళ పంత్ దూరమైతే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. చదవండి: టీమిండియా హెడ్ కోచ్‌గా లక్ష్మణ్.. ద్రవిడ్‌కు త్వరలోనే గుడ్‌బై! -
టీమిండియా హెడ్ కోచ్‌గా లక్ష్మణ్.. ద్రవిడ్‌కు త్వరలోనే గుడ్‌బై!
స్వదేశంలో ఈ ఏడాది జరగనున్న వన్డే వరల్డ్‌కప్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో టీమిండియా దిగ్గజ ఆటగాడు వీవీయస్ లక్ష్మణ్‌ను నిమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది నవంబర్‌తో హెడ్ కోచ్‌గా ద్రవిడ్ రెండేళ్ల పదవీ కాలం ముగియనుంది. ఈ క్రమంలో ద్రవిడ్ పదవీ కాలన్ని పెంచే ఆలోచనలో బీసీసీఐ లేనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా గతేడాది జరిగిన ఆసియాకప్, టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు వైఫల్యం తర్వాత ద్రవిడ్‌ను హెడ్ కోచ్ నుంచి తప్పించాలన్న డిమాండ్లు వినిపించిన సంగతి తెలిసిందే. ఇక గతంలో భారత- ఏ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించిన లక్ష్మణ్ అత్యంత విజయవంతమయ్యాడు. అదే విధంగా రాహుల్ ద్రవిడ్ స్థానంలో భారత సీనియర్ జట్టుకు తాత్కాలిక హెడ్ కోచ్‌గా కూడా వీవీయస్ బాధ్యతలు నిర్వర్తించాడు. గతేడాది జరిగిన ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో లక్ష్మణ్ తొలి భారత హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అనంతరం జింబాబ్వేతో వన్డే సిరీస్, న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లో కూడా భారత జట్టు ప్రధాన కోచ్‌గా లక్ష్మణ్ పనిచేశాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ మినహా.. మిగితా అన్ని సిరీస్‌లో భారత్ విజయం సాధించింది. ఇక లక్ష్మణ్ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ ఆకాడమీ డైరెక్టర్‌గా ఉన్నాడు. చదవండి: IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్.. జట్టులోకి బుమ్రా.. బీసీసీఐ ప్రకటన -
సుశీల్ జీ మీకు రుణపడిపోయాం.. హ్యాట్సాఫ్: లక్ష్మణ్ ట్వీట్ వైరల్
Rishabh Pant Accident- VVS Laxman Hails Bus Driver: ‘‘మంటల్లో కాలిపోతున్న కారులో నుంచి రిషభ్ పంత్‌ను బయటకు తీసి.. బెడ్‌షీట్ చుట్టి.. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి.. తనను కాపాడిన హర్యానా డ్రైవర్ సుశీల్ కుమార్‌కు ధన్యవాదాలు. మీరు చేసిన సేవకు కృతజ్ఞులం. సుశీల్ జీ మీకు రుణపడిపోయాం’’ అంటూ టీమిండియా దిగ్గజం, జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ఉద్వేగపూరిత ట్వీట్ చేశాడు. టీమిండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్ ప్రాణాలతో బయటపడటానికి కారణమైన బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్‌ను రియల్ హీరోగా అభివర్ణించాడు. అదే విధంగా.. కండక్టర్ పరంజిత్‌కు కూడా లక్ష్మణ్ ధన్యవాదాలు తెలియజేశాడు. పెద్ద మనసు రిషభ్‌ను కాపాడే క్రమంలో పరంజిత్.. సుశీల్‌కు సాయం చేశాడన్న లక్ష్మణ్.. వీరి సమయస్ఫూర్తికి సలాం కొట్టాడు. పంత్‌ను ప్రాణాలతో రక్షించిన సుశీల్, పరంజిత్లది పెద్ద మనసు అంటూ హ్యాట్సాఫ్ చెప్పాడు. కాగా టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ యువ వికెట్ కీపర్ స్వయంగా కారు నడుపుకొంటూ స్వస్థలం ఉత్తరాఖండ్‌కు వెళ్తుండగా.. డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో కారులో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన సుశీల్ వెంటనే తమ బస్సు నిలిపివేసి.. అప్పటికే కారు నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న పంత్‌ను మరికొంత మంది సాయంతో బయటకు తీశాడు. ఈ నేపథ్యంలో గాయాలతో బయటపడ్డ పంత్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స జరుగుతోంది. కాగా భయంకరమైన యాక్సిడెంట్ నుంచి 25 ఏళ్ల పంత్ ప్రాణాలతో బయటపడటంలో సుశీల్ పాత్ర కీలకం. ఈ నేపథ్యంలో అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వాళ్లకు ప్రోత్సాహకం టీమిండియా బ్యాటర్ రిషభ్ పంత్‌ను ప్రమాదం నుంచి కాపాడిన వారందరికీ సముచిత గౌరవం దక్కనుంది. ఈ విషయం గురించి ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ మాట్లాడుతూ.. ‘‘ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత బాధితులకు మొదటి గంట సమయం అత్యంత కీలకం. గోల్డెన్ పీరియడ్. ఆ సమయంలో సరైన చికిత్స అందితే ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి బాధితుడిని కాపాడిన వాళ్లను ప్రోత్సహించేందుకే కేంద్రం ది గుడ్ సామరిటన్ స్కీమ్ ప్రవేశపెట్టింది’’ అని తెలిపారు. కాగా రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి సకాలంలో వైద్య సేవ అందేలా చేసిన వారికి రూ. 5 వేల నగదు ప్రోత్సాహకం ఇస్తారు. చదవండి: Pele: అటకెక్కిన అంతర్యుద్దం.. అట్లుంటది పీలేతోని! కానీ.. ఎంత ఎదిగినా... ఆయనకూ తప్పలేదు! ఘనంగా షాహిద్ ఆఫ్రిది కుమార్తె వివాహం.. హాజరైన షాహిన్ ఆఫ్రిది Gratitude to #SushilKumar ,a Haryana Roadways driver who took #RishabhPant away from the burning car, wrapped him with a bedsheet and called the ambulance. We are very indebted to you for your selfless service, Sushil ji 🙏 #RealHero pic.twitter.com/1TBjjuwh8d — VVS Laxman (@VVSLaxman281) December 30, 2022 -
Rishabh Pant: ఉదయమే పంత్ గురించి ఆలోచించా.. ఇంతలో ఇలా
Rishabh Pant- Car Accident- Pray For Speedy Recovery: టీమిండియా యువ బ్యాటర్ రిషభ్ పంత్ త్వరగా కోలుకోవాలని దిగ్గజ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ ప్రార్థించాడు. పంత్‌కు ప్రాణాపాయం తప్పిందన్న లక్ష్మణ్ త్వరగా కోలుకో చాంపియన్ అంటూ 25 ఏళ్ల ఈ వికెట్ కీపర్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. కాగా శుక్రవారం ఉదయం రిషభ్ పంత్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్‌కి నుంచి ఢిల్లీ నుంచి వస్తున్న సమయంలో రూర్కీ సమీపంలో ఈ ఘటన చేసుకుంది. డివైడర్‌ను ఢీకొట్టిన కారు పూర్తిగా కాలిపోయింది. అయితే, పంత్ ముందే కారు నుంచి దూకేయడంతో ప్రాణాలతో బయటపడగలిగాడు. కానీ, ఈ క్రమంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో పంత్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలంటూ పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తుండటంతో #RishabhPant ట్రెండ్ అవుతోంది. లక్ష్మణ్ ట్వీట్ ద్వారా.. ఈ క్రమంలో జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ మేరకు బిగ్ అప్డేట్ అందించాడు. ‘‘పంత్ కోసం ప్రార్థిస్తున్నా. దేవుడి దయ వల్ల అతడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు’’ అని లక్ష్మణ్ ట్విటర్లో పేర్కొన్నాడు. Praying for Rishabh Pant. Thankfully he is out of danger. Wishing @RishabhPant17 a very speedy recovery. Get well soon Champ. — VVS Laxman (@VVSLaxman281) December 30, 2022 స్పందించిన క్రీడా వర్గాలు రిషభ్ పంత్ కారు ప్రమాదం గురించి తెలుసుకున్న క్రికెట్ వర్గాల ప్రముఖులు అతడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ‘‘వీలైనంత త్వరగా కోలుకో డియర్ పంత్’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. Wishing dear @RishabhPant17 a super speedy recovery. Bahut hi Jald swasth ho jaao. — Virender Sehwag (@virendersehwag) December 30, 2022 ఉదయమే తన గురించి ఆలోచించా ఇక.. ‘‘ఈరోజు ఉదయమే రిషభ్ పంత్ గురించి ఆలోచనలు చుట్టుముట్టాయి. ఇంతలోనే ఇలా.. తను బాగుండాలి. త్వరగా కోలుకోవాలి’’ అని క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే ట్వీట్ చేశాడు. ఇక ఇంగ్లండ్ ప్లేయర్ సామ్ బిల్లింగ్స్ సైతం.. రిషభ్ పంత్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశాడు. కాగా పంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. Thinking about Rishabh Pant this morning and desperately hoping he is fine and recovers soon. — Harsha Bhogle (@bhogleharsha) December 30, 2022 ఉత్తరాఖండ్ సీఎం ఆదేశాలు రిషభ్ పంత్ కారు ప్రమాద ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తూ పంత్ ప్రమాదానికి గురయ్యాడన్న ఆయన.. వైద్య సహాయం అందించి, ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. కాగా ఈ ఏడాది పంత్‌ను తమ రాష్ట్ర అంబాసిడర్‌గా నియమిస్తూ పుష్కర్ సింగ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Rest in Power- ‘King’ Pele: అల్విదా కింగ్.. పీలే రాకముందు అసలు ఫుట్‌బాల్ అంటే కేవలం.. Rashid Khan: వద్దనుకున్నోడే మళ్లీ దిక్కయ్యాడు.. టి20 కెప్టెన్‌గా -
బంగ్లా చేతిలో ఓటమిని ఊహించలేదు.. బీసీసీఐ ఆగ్రహం! తిరిగి రాగానే
India tour of Bangladesh, 2022 - ODI Series Loss : బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా ఓటమి నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. పటిష్ట జట్టుగా పేరొందిన రోహిత్ సేన.. బంగ్లా పర్యటనలో విఫలం కావడంపై మేనేజ్మెంట్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లలో సత్తా చాటుతున్న టీమిండియా అసలైన సమయంలో మాత్రం చేతులెత్తేస్తున్న సంగతి తెలిసిందే. కీలక సమయాల్లో చేతులెత్తేసి! రోహిత్ సారథ్యంలోని మాజీ చాంపియన్ ఆసియా టీ20 టోర్నీ-2022లో సూపర్-4 దశలోనే నిష్క్రమించడం సహా టీ20 ప్రపంచకప్-2022లో సెమీస్‌లోనే ఇంటిబాట పట్టింది. ఇక ఆ తర్వాత న్యూజిలాండ్ పర్యటనలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో టీ20 సిరీస్ గెలిచినా.. శిఖర్ ధావన్ నేతృత్వంలో వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ పర్యటనకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తదితర కీలక ఆటగాళ్లు అందుబాటులోకి వచ్చారు. దీంతో సులువుగానే వన్డే సిరీస్ గెలుస్తుందని భావించగా మొదటి మ్యాచ్‌లో బ్యాటర్లు, రెండో మ్యాచ్‌లో బౌలర్లు వైఫల్యం చెందడంతో బంగ్లా చేతిలో చిత్తైంది టీమిండియా. స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరచలేక సిరీస్‌ను 0-2తో ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది. బంగ్లా చేతిలో ఓటమిని ఊహించలేదు.. రాగానే రోహిత్ ఇంకా ఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ.. జట్టు ఆట తీరుపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. టీమిండియా వైఫల్యాలపై సమీక్ష చేపట్టి తగిన చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం. అదే విధంగా ఆటగాళ్ల ఫిట్నెస్ ప్రమాణాలపైనా ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి విరాట్ కోహ్లి సహా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్, జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ తదితరులతో బీసీసీఐ అధికారులు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ కీలక అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘కొంతమంది ఆఫీస్ బేరర్లు బిజీగా ఉన్న కారణంగా బంగ్లాదేశ్ పర్యటనకు ముందు ఆటగాళ్లతో సమావేశం కాలేకపోయాం. ఈ టూర్లో టీమిండియా ప్రదర్శన ఘోరంగా ఉంది. బంగ్లాదేశ్ చేతిలో జట్టు ఓడిపోతుందని మేము అస్సలు ఊహించలేదు. వాళ్లంతా తిరిగి రాగానే మీటింగ్‌కు ఏర్పాటు చేస్తాం. నిజానికి ప్రపంచకప్ ముగిసిన తర్వాతే ఈ సమావేశం జరగాల్సింది’’ అని పేర్కొన్నారు. చదవండి: BAN vs IND: బంగ్లాదేశ్‌తో మూడో వన్డే.. టీమిండియాకు భారీ షాక్! రోహిత్‌తో పాటు Team India Schedule: స్వదేశంలో టీమిండియా వరుస సిరీస్‌లు.. షెడ్యూల్ విడుదల -
పంత్ సెంచరీ చేసి ఎన్నాళ్లైందని! అతడికి కచ్చితంగా అండగా ఉంటాం: కోచ్
India Vs New Zealand- Rishabh Pant- Sanju Samson- BCCI: ‘‘విఫలమవుతున్నా రిషభ్ పంత్‌కు ఎందుకు వరుస అవకాశాలు ఇస్తున్నారు? ప్రతిభ ఉన్నా మరో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు ఎందుకు అన్యాయం చేస్తున్నారు? ఆటగాళ్ల విషయంలో ఈ వివక్ష ఎందుకు ప్రదర్శిస్తున్నారు?’’.. గత కొన్నాళ్లుగా భారత తుది జట్టు కూర్పుపై అసహనం వ్యక్తం చేస్తూ అభిమానులు అంటున్న మాటలివి. పాపం సంజూ ప్రపంచకప్-2022 టోర్నీలో విఫలమైన టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ న్యూజిలాండ్ టూర్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టీ20 సిరీస్‌లో విఫలమైన అతడు.. వన్డే సిరీస్‌లోనూ దారుణ ప్రదర్శన కనబరిచాడు. మరోవైపు.. తనను తాను నిరూపించుకున్నప్పటికీ.. ఎప్పుడో ఓసారి మాత్రమే టీమిండియాకు ఎంపికయ్యే మరో వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు మాత్రం తుది జట్టులో చోటు దక్కలేదు. టీ20 సిరీస్‌కు పూర్తిగా అతడిని పక్కనపెట్టిన యాజమాన్యం.. మొదటి వన్డేలో మాత్రమే ఆడించింది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పంత్, సంజూల పేర్లు ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా కివీస్‌తో మూడో వన్డేలో విఫలమైన పంత్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంత్‌ను ట్రోల్ చేస్తూ.. సంజూను సమర్థిస్తూ బీసీసీఐ తీరును ఎండగడుతున్నారు ఫ్యాన్స్. పంత్ అద్భుతం.. అండగా నిలబడతాం ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో మూడో వన్డేకు ముందు తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ పంత్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ‘‘పంత్ నాలుగో స్థానంలో అద్భుతంగా ఆడుతున్నాడు. ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో అతడు విలువైన సెంచరీ చేసి మరీ ఎక్కువ రోజులేం కావడం లేదు కదా! తనకు కచ్చితంగా మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. టీ20 క్రికెట్లో మెరవడం ద్వారా బ్యాటర్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మైదానాలు పెద్దగా ఉన్నాయా, చిన్నగా ఉన్నాయా అన్న అంశంతో సంబంధం లేకుండా హిట్టింగ్ ఆడే అవకాశం దొరుకుతుంది. నిజానికి ఒక ఆటగాడికి ఎందుకు వరుసగా చాన్స్ ఇస్తున్నామో.. ఒక్కోసారి వాళ్లను ఎందుకు జట్టు నుంచి తప్పిస్తున్నామో వాళ్లకు సమాచారం ఇస్తూనే ఉంటాం’’ అని లక్ష్మణ్ వ్యాఖ్యానించాడు. నాడు జట్టును గెలిపించిన పంత్ ఈ ఏడాది జూలైలో మాంచెసర్ట్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో పంత్ సెంచరీ బాదాడు. 113 బంతులు ఎదుర్కొన్న అతడు 16 సిక్స్‌లు, 2 ఫోర్ల సాయంతో 125 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఇలా పంత్ అద్భుత ఇన్నింగ్స్‌తో 5 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత జట్టు.. ట్రోఫీ గెలిచింది. ఈ మ్యాచ్‌లో పంత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ లక్ష్మణ్.. పంత్‌కు మద్దతుగా నిలవడం గమనార్హం. ఇక తాజాగా కివీస్‌తో మూడో వన్డేలోనూ పంత్ 10 పరుగులకే పెవిలియన్ చేరాడు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కాగా ఆతిథ్య జట్టు 1-0తో ట్రోఫీ గెలిచింది. చదవండి: టీమిండియాకు వెలకట్టలేని ఆస్తి దొరికింది! జడ్డూ నువ్వు రాజకీయాలు చూసుకో! ఇక నీ అవసరం ఉండకపోవచ్చు! ICC ODI Rankings: అదరగొట్టిన కేన్ మామ..లాథమ్! దిగజారిన కోహ్లి, రోహిత్ ర్యాంక్‌లు -
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్.. భారత-ఏ జట్టు హెడ్ కోచ్‌గా సితాన్షు కోటక్
అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలోని భారత-ఏ జట్టు రెండు నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ పర్యటన వెళ్లనుంది. ఈ సిరీస్‌కు భారత-ఏ జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ పర్యటనకు భారత-ఏ జట్టు హెడ్‌కోచ్ వివియస్ లక్ష్మణ్ దూరమయ్యాడు. వివియస్ లక్ష్మణ్ ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో భారత సీనియర్ జట్టుకు హెడ్‌కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అదే విధంగా లక్ష్మణ్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ హృషికేశ్ కనిట్కర్, బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతాలే కూడా న్యూజిలాండ్ పర్యటనలో కూడా ఉన్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు గుజరాత్ మాజీ బ్యాటర్, నేషనల్ క్రికెట్ ఆకాడమీ బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్‌ను భారత-ఏ జట్టు హెడ్ కోచ్‌గా బీసీసీఐ నియమించింది. అతడితో పాటు బౌలింగ్ కోచ్ ట్రాయ్ కూలీ, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ కూడా ఈ సిరీస్‌లో బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కాగా నవంబర్ 29న ఇరుజట్ల మధ్య తొలి నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇక రెండు మ్యాచ్‌ల అనంతరం భారత సీనియర్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 4న జరగనున్న తొలి వన్డేతో భారత పర్యటన ప్రారంభం కానుంది. తొలి నాలుగు రోజుల మ్యాచ్‌కు భారత-ఏ జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), రోహన్ కున్నుమ్మల్, యశస్వి జైస్వాల్, యశ్ ధుల్, సర్ఫరాజ్ ఖాన్, తిలక్ వర్మ, ఉపేంద్ర యాదవ్ (వికెట్ కీపర్), సౌరభ్ కుమార్, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, అతిత్ షెత్ రెండో నాలుగు రోజుల మ్యాచ్‌కు భారత-ఏ జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), రోహన్ కున్నుమ్మల్, యశస్వి జైస్వాల్, యష్ ధుల్, సర్ఫరాజ్ ఖాన్, ఉపేంద్ర యాదవ్ (వికెట్ కీపర్), సౌరభ్ కుమార్, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, అతిత్ శేథ్, ఛెతేశ్వర్ పుజారా, ఉమేష్ యాదవ్, కేఎస్ భరత్! చదవండి: Ban Vs Ind 2022: టీమిండియా బంగ్లాదేశ్ పర్యటన.. పూర్తి షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, ఇతర వివరాలు -
'వాళ్లు కూడా మనుషులే కదా.. అందుకే విశ్రాంతి'
టి20 ప్రపంచకప్‌లో టీమిండియా వైఫల్యం తర్వాత జట్టులోని సీనియర్ ఆటగాళ్లు సహా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా విశ్రాంతి తీసుకున్నాడు. అయితే ఈ విశ్రాంతి వ్యవహారంపై పెద్ద దుమారం నడుస్తోంది. టి20 ప్రపంచకప్‌లో ఎందుకు విఫలమయ్యామన్న విషయాలు ఆలోచించకుండా కోచ్ ద్రవిడ్ పదే పదే విరామం తీసుకోవడం ఏంటని మాజీ క్రికెటర్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌తో వన్డే, టి20 సిరీస్‌కు కోచ్ ద్రవిడ్ సహా సపోర్ట్ స్టాఫ్ దూరంగా ఉండడంతో అతని స్థానంలో ఎన్సీఏ హెడ్.. వీవీఎస్ లక్ష్మణ్‌తో పాటు అతని సిబ్బంది బాధ్యతలు తీసుకున్నాడు. తాజాగా కోచ్ ద్రవిడ్ విశ్రాంతి తీసుకోవడంపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ''ద్రవిడ్‌కు విశ్రాంతినివ్వడం.. లక్ష్మణ్ ఆ బాధ్యతలను భుజాలకెత్తుకోవడం వంటి అంశాలను ఇక్కడ మరో విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకే దీనిపై నేను స్పందించాల్సి వస్తోంది.క్రికెట్లో ఒక ఆటగాడికైనా.. కోచ్‌కైనా, సహాయక సిబ్బందికైనా మానసిక ప్రశాంతత కోసం రెస్ట్ తప్పనిసరి. ఆటగాళ్లకు మాత్రమే విశ్రాంతి ఇస్తే సరిపోదు.. మనతో పాటు ఉండే కోచ్, సహాయక సిబ్బంది కూడా మనుషులే.. యంత్రాలు కాదు. అందుకే విశ్రాంతి అవసరం. ప్లానింగ్ నుంచి మొదలుకొని టి20 ప్రపంచకప్ పూర్తయ్యేవరకు ద్రవిడ్ అతడి బృందం తీవ్రంగా శ్రమించింది. అది నేను కళ్లారా చూశాను. ప్రతి ఒక్క మ్యాచ్‌కు వారికి నిర్దిష్టమైన ప్రణాళికలు ఉంటాయి. అది శారీరకంగానే కాక మానసికంగా కూడా వారి శక్తిని హరిస్తుంది,. కాబట్టి కచ్చితంగా ప్రతి ఒక్కరికి విశ్రాంతి అవసరం. కివీస్ సిరీస్ అయిపోగానే బంగ్లా పర్యటన ఉంది. అందుకే లక్ష్మణ్ నేతృత్వంలో కొత్త టీం కివీస్‌తో సిరీస్‌కు పనిచేస్తోంది. భారత్ క్రికెట్లో ఎంతో మంది ప్రతిభగలవారు ఉన్నారు. ఆటగాళ్లగానే కాకుండా కోచింగ్ పరంగా కూడా కొత్త వారికి ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయనడానికి ఇదే నిదర్శనం'' అంటూ అశ్విన్ పేర్కొన్నాడు. చదవండి: BCCI: కొత్త చీఫ్ సెలక్టర్ ఎవరంటే..? -
రాహుల్ ద్రవిడ్‌కు విశ్రాంతి.. టీమిండియా కోచ్ ఎవరంటే..?
న్యూజిలాండ్‌లో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం పర్యటించే భారత జట్టుకు మాజీ ఆటగాడు, జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ టి20 వరల్డ్ కప్ తర్వాత విశ్రాంతి కోరడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 18నుంచి జరిగే ఈ పర్యటనలో భారత్, కివీస్ మధ్య 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. లక్ష్మణ్‌తో పాటు హృషికేశ్ కనిత్కర్, సాయిరాజ్ బహుతులే కూడా కోచింగ్ బృందంలో భాగంగా ఉంటారు. ఈ ఏడాది ఆరంభంలో ఐర్లాండ్, జింబాబ్వే టూర్లలో కూడా భారత జట్టు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించిన వీవీఎస్, అండర్–19 ప్రపంచ కప్‌లో కూడా భారత యువ జట్టుకు మార్గనిర్దేశనం చేశాడు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కూడా విశ్రాంతి తీసుకోవడంతో వన్డేలకు శిఖర్ ధావన్, టి20లకు హార్దిక్ పాండ్యా కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. న్యూజిలాండ్ పర్యటనలో భారత్ తొలుత టీ20లు ఆడనుంది. నవంబర్ 18, 20, 22 తేదీల్లో టీ20లు, ఆతర్వాత నవంబర్ 25, 27, 30 తేదీల్లో వన్డేలు ఆడనుంది. న్యూజిలాండ్ పర్యటనకు భారత టీ20 జట్టు.. హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ న్యూజిలాండ్ పర్యటనకు భారత వన్డే జట్టు.. శిఖర్ ధవన్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్‌కీపర్), శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్ -
IND vs NZ: టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్!
టీ20 ప్రపంచకప్-2022 నుంచి ఇంటిముఖం పట్టిన టీమిండియా.. ఇప్పుడు మరో పర్యటనకు సిద్దమవుతోంది. మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు సీనియర్ ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, మహ్మద్ షమీకి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో టీ20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యా.. వన్డే సిరీస్‌కు శిఖర్ ధావన్ సారథ్యం వహించనున్నారు. నవంబర్ 18న వెల్లింగ్టన్ వేదికగా జరగనున్న తొలి టీ20తో భారత పర్యటన షూరూ కానుంది. కాగా ఈ పర్యటనకు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు విశ్రాంతి ఇవ్వాలి అని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ మరో సారి భారత తాత్కాలిక హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్ పర్యటనకు భారత టీ20 జట్టు.. హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ న్యూజిలాండ్ పర్యటనకు భారత వన్డే జట్టు.. శిఖర్ ధవన్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్‌కీపర్), శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్ చదవండి: T20 WC 2022: "అతడొక అద్భుతం.. ఒంటి చెత్తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఉంది' -
మాజీ రాష్ట్రపతితో బంధుత్వం.. ఆసీస్‌తో మ్యాచ్ అంటే ఆకాశమే హద్దు!
Happy Birthday VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్.. క్రీడా ప్రపంచానికి పరిచయం అక్కరలేని పేరు... కుదురైన ఆట.. తనదైన శైలితో క్రికెట్ ప్రేమికుల ప్రశంసలు పొంది.. టీమిండియా అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా ఎదిగిన వీవీఎస్ లక్ష్మణ్ పుట్టిన రోజు నేడు. 48వ వసంతంలో అడుగుపెడుతున్న ఈ సొగసరి బ్యాటర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా టెస్టు స్పెషలిస్టు లక్ష్మణ్ బర్త్‌డే సందర్భంగా అతడి గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం! వెరీ వెరీ స్పెషల్ వెరీ వెరీ స్పెషల్ బ్యాట్స్‌మన్‌గా పేరొందిన వీవీఎస్ లక్ష్మణ్.. పూర్తి పేరు వంగిపురపు వెంకట సాయి లక్ష్మణ్. 1974, నవంబరు 1న హైదరాబాద్‌లో జన్మించారు. ఆరడుగులకు పైగా ఎత్తుండే ఈ కుడిచేతి వాటం గల బ్యాటర్.. మిడిలార్డర్లో రాణించాడు. దేశవాళీ క్రికెట్లో హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన లక్ష్మణ్.. 1994లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో అండర్-19 జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి.. 88 పరుగులు సాధించాడు. కాగా ఆసీస్ మేటి క్రికెటర్లుగా ఎదిగిన బ్రెట్ లీ కూడా ఈ మ్యాచ్‌తోనే అరంగేట్రం చేయడం విశేషం. అహ్మదాబాద్‌లో సౌతాఫ్రికాతో 1996లో జరిగిన టెస్టు సిరీస్‌తో లక్ష్మణ్ అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌లో అర్ధ శతకం బాది సత్తా చాటాడు. ఈడెన్ గార్డెన్స్‌లో హీరోచిత ఇన్నింగ్స్ కోల్‌కతాలో ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్ష్మణ్ ఆడిన ఇన్నింగ్స్ తన టెస్టు క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భాగంగా రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 59 పరుగులు చేసిన వీవీఎస్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి 452 బంతులు ఎదుర్కొని 44 ఫోర్ల సాయంతో 281 పరుగులు సాధించాడు. లక్ష్మణ్ హీరోచిత ఇన్నింగ్స్‌కు తోడు రాహుల్ ద్రవిడ్ 180 పరుగులతో రాణించడంతో నాటి మ్యాచ్‌లో భారత్ 171 పరుగుల తేడాతో ఆసీస్‌ను మట్టికరిపించింది. ఇదే జోష్‌లో ఆఖరిదైన మూడో టెస్టులోనూ విజయం సాధించి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఆసీస్ అంటే పూనకాలే తన 15 ఏళ్ల కెరీర్లో 134 టెస్టుల్లో 8781 పరుగులు సాధించాడు. 86 వన్డేలు ఆడి 2338 పరుగులు చేశాడు. తన కెరీర్లో మొత్తంగా 17 సెంచరీలు, 56 అర్ధ శతకాలు సాధించాడు వీవీఎస్ లక్ష్మణ్. కాగా టెస్టు కెరీర్‌లోని 17 సెంచరీల్లో ఆరు ఆస్ట్రేలియాపైనే సాధించడం విశేషం. ప్రతిష్టాత్మక అవార్డులు క్రీడా రంగంలో సేవలకు గానూ లక్ష్మణ్‌ను భారత ప్రభుత్వం 2011లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. కాగా 2001లో వీవీఎస్ అర్జున పురస్కారం కూడా అందుకున్నాడు. కాగా లక్ష్మణ్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్‌గా ఉన్నాడు. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ గైర్హాజరీలో టీమిండియా కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లే వీవీఎస్ లక్ష్మణ్ తల్లిదండ్రులు డాక్టర్ శాంతారాం- డాక్టర్ సత్యభామ. లక్ష్మణ్ కుటుంబానికి భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌తో బంధుత్వం ఉంది. కాగా తొలుత వైద్య రంగంలో అడుగుపెట్టాలనుకున్న లక్ష్మణ్.. మనసు మాట విని క్రికెట్‌నే తన కెరీర్‌గా ఎంచుకున్నట్లు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇక లక్ష్మణ్ భార్య పేరు రాఘవా శైలజ.2004లో వీరి వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు సంతానం. అమ్మాయి పేరు అచింత్య, అబ్బాయి పేరు సర్వజిత్. చదవండి: T20 WC 2022: బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్.. టీమిండియాలో మూడు మార్పులు! IND v sNZ: భారత జట్టులో నో ఛాన్స్.. 'అంతా సాయిబాబా చూస్తున్నారు' As we celebrate @VVSLaxman281's birthday today, let's relive one of his most memorable knocks - his 2⃣8⃣1⃣ against Australia. 🙌 🙌 #TeamIndia Watch 🎥 🔽 https://t.co/GHgv0Ufw7o — BCCI (@BCCI) November 1, 2022 -
టీమిండియా ఎంపికపై వీవీఎస్ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇటీవలి కాలంలో టీమిండియా రిజర్వ్ బెంచ్ ఎంత పటిష్టంగా తయారైందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత రెగ్యులర్ జట్టు ఓ పక్క అద్భుత విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంటే.. మరో పక్క శిఖర్ ధవన్ సారధ్యంలోని ఇండియా-బి టీమ్ సైతం అదే స్థాయి ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో పరాజయం మినహాయించి భారత జట్టు పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అద్భుతంగా రాణిస్తుందనే చెప్పాలి. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ప్రతి టీమిండియా ఆటగాడు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సెలక్టర్లకు సవాలు విసురుతున్నాడు. ఈ నేపథ్యంలో జట్టు ఎంపిక సెలెక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. అక్కడికీ రొటేషన్ పేరుతో సీనియర్లకు అప్పుడప్పుడూ విశ్రాంతినిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ జట్టు ఎంపిక సెలెక్టర్లకు కత్తిమీద సాము లాగే మారింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరుగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు టీమిండియా ఎంపికపై ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియాను సెలెక్ట్ చేయడం పెద్ద తలనొప్పిగా మారుతుందని జోస్యం చెప్పాడు. ప్రతి ఆటగాడు అందివచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకోవడం అద్భుతమని కొనియాడాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో సంజూ శాంసన్ కనబర్చిన పోరాటపటిమ అద్భుతమని ఆకాశానికెత్తాడు. ఈ మ్యాచ్‌లో శాంసన్, శ్రేయస్ అయ్యర్ చూపించిన పరిణితి అభినందనీయమని పేర్కొన్నాడు. ఇలా ఆటగాళ్లు పోటీపడి రాణిస్తే జట్టు ఎంపిక చాలా కష్టమవుతుందని అభిప్రాయపడ్డాడు. -
Asia Cup 2022: టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
ముంబై: జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు మరో సిరీస్ బాధ్యతలు అప్పజెప్పారు. ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో పాల్గొనే టీమిండియా తాత్కాలిక కోచ్‌గా నియమించారు. రెగ్యులర్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కరోనా సోకడంతో ఇక్కడే ఉండిపోయారు. దీంతో ఇటీవల జింబాబ్వేలో కోచ్ పాత్రను విజయవంతంగా పోషించిన లక్ష్మణ్‌కు ఆసియా కప్ బాధ్యతలు అప్పగించారు. మరింత సమయం లేకపోవడంతో ఆయన హరారే (జింబాబ్వే) నుంచి నేరుగా దుబాయ్‌కి వెళ్లారు. దీనికి సంబంధించిన వీసా ప్రక్రియను బోర్డు పూర్తి చేసింది. అందువల్లే లక్ష్మణ్ బుధవారం జట్టుతో కలిసేందుకు మార్గం సుగమమైందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వర్గాలు తెలిపాయి. మరోవైపు బోర్డు వైద్యబృందం ద్రవిడ్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని, వైరస్ నుంచి బయటపడగానే యూఏఈకి వెళ్లే అకాశముందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రత్యక్షంగా జట్టుతో లేకపోయినప్పటికీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ద్రవిడ్... ఇన్చార్జ్ కోచ్ లక్ష్మణ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌లకు అందుబాటులో ఉన్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. బుధవారం సాయంత్రం టీమిండియా ప్రాక్లీస్ సెషన్లో పాల్గొంది. ఆసియా కప్‌కు భారత జట్టు రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, దీపక్ హుడా, దినేశ్ కార్తిక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, రవి బిష్ణోయి, భువనేశ్వర్‌కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్ స్టాండ్‌బై ప్లేయర్లు: శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చహర్ చదవండి: NZ-A vs IND-A: న్యూజిలాండ్- 'ఎ'తో సిరీస్.. భారత జట్టులోకి హైదరాబాద్ ఆటగాడు! -
వీవీఎస్ లక్ష్మణ్ కు బంపర్ ఆఫర్
-
తాత్కాలిక హెడ్‌కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్!
కీలకమైన ఆసియాకప్‌కు ముందు టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కోవిడ్-19 పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. దీంతో ఆసియాకప్ వరకు ద్రవిడ్ స్థానంలో తాత్కాలిక హెడ్‌కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడని సమాచారం. ప్రస్తుతానికి సహాయక కోచ్ పారస్ మాంబ్రే ఇన్చార్జి కోచ్‌గా వ్యవహరిస్తారు. ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను హరారే నుంచి నేరుగా అక్కడికి పంపే విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కేఎల్ రాహుల్ నేతృత్వంలో టీమిండియా జింబాబ్వేతో ఆడిన వన్డే సిరీస్‌కు లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఆ సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఎన్సీఏ డైరెక్టర్‌గా ఉన్న లక్ష్మణ్ అంతకముందు శ్రీలంక పర్యటనలోనూ కోచ్‌గా సక్సెస్ అయ్యాడు. అందుకే ఆసియాకప్ వరకు ద్రవిడ్ స్థానంలో అతని ఎంపికే సరైనదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇక ఆసియా కప్‌కు ఎంపికైన రోహిత్ శర్మ బృందంలో ముగ్గురు మినహా మెజారిటీ సభ్యులంతా మంగళవారం ఉదయం దుబాయ్‌కి పయనమయ్యారు. జింబాబ్వేలో ఉన్న వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, దీపక్ హుడా, రిజర్వ్ ప్లేయర్ అక్షర్ పటేల్‌లు హరారే నుంచే అక్కడికి బయల్దేరతారు. ఆసియా కప్ ప్రధాన టోర్నీ యూఏఈలో ఈనెల 27 నుంచి జరుగుతుంది. 28న జరిగే తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో భారత్ తలపడుతుంది. చదవండి: ద్రవిడ్‌కు కరోనా.. -
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కరోనా
-
Asia Cup 2022: పాక్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్!
Asia Cup 2022- India Vs Pakistan- Rahul Dravid: ఆసియా కప్-2022 టోర్నీకి ముందు టీమిండియాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మరో ఫాస్ట్‌బౌలర్ హర్షల్ పటేల్ గాయం కారణంగా ఈ మెగా ఈవెంట్‌కు దూరమైన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం జట్టుకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. టీమిండియా జింబాబ్వే పర్యటన నేపథ్యంలో ద్రవిడ్‌కు బీసీసీఐ విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ బ్యాటర్, జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ వన్డే సిరీస్‌లో భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. ఆసియా కప్ టోర్నీ ఆరంభానికి ముందు తక్కువ సమయం ఉండటంతో ఈ మేరకు ద్రవిడ్‌కు రెస్ట్ ఇచ్చినట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. అయితే, రాహుల్ ద్రవిడ్ కరోనా బారిన పడినట్లు తాజాగా వార్తలు వెలువడుతున్నాయి. యూఏఈకి బయల్దేరే ముందు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయిన కారణంగా హెడ్‌కోచ్ ఈ మెగా టోర్నీకి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. ఇక ద్రవిడ్ గైర్హాజరీ నేపథ్యంలో లక్ష్మణ్ మరోసారి టీమిండియా కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు తెలుస్తోంది. కాగా జింబాబ్వే టూర్లో కేఎల్ రాహుల్ సారథ్యంలోని భారత జట్టు వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. నామమాత్రపు ఆఖరి వన్డేలో ఆతిథ్య జింబాబ్వే గట్టిగానే ప్రతిఘటించినా ఆఖరికి 13 పరుగుల తేడాతో విజయం టీమిండియా సొంతమైంది. దీంతో కెప్టెన్‌గా రాహుల్ ఖాతాలో చిరస్మరణీయ గెలుపు నమోదైంది. ఇక ఆగష్టు 27న యూఏఈ వేదికగా ఆసియా కప్ మొదలు కానుండగా ఆ మరుసటి రోజు భారత్.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో టోర్నీలో తమ ప్రయాణాన్ని ఆరంభించనుంది. ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ కరోనా బారిన పడి దూరం కావడంతో జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. రాహుల్ ద్రవిడ్ కోవిడ్ బారిన పడిన విషయాన్ని తాజాగా బీసీసీఐ ధ్రువీకరించింది. NEWS - Head Coach Rahul Dravid tests positive for COVID-19. More details here - https://t.co/T7qUP4QTQk #TeamIndia — BCCI (@BCCI) August 23, 2022 చదవండి: IND vs ZIM: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. సచిన్ 24 ఏళ్ల రికార్డు బద్దలు! Babar Azam: చిన్న జట్టంటే అంత చులకన.. ఏ దేశంతో ఆడుతున్నారో తెలియదా! -
Ind Vs Zim: జింబాబ్వేకు పయనమైన టీమిండియా ఆటగాళ్లు..
Ind Vs Zim ODI Series: వరుస సిరీస్‌లతో బిజీ బిజీగా గడుపుతున్న భారత క్రికెట్ జట్టు మరో పోరుకు సిద్ధమైంది. ఈనెల 18 నుంచి జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఇందుకోసం టీమిండియా ఆటగాళ్లు శనివారం జింబాబ్వేకు పయనమయ్యారు. శిఖర్ ధావన్, దీపక్ చహర్, ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్ తదితరులు విమానంలో బయల్దేరారు. వీరితో పాటు కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ సైతం పయనమయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను భారత క్రికెట్ నియంత్రణ మండలి సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా వెస్టిండీస్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌లో టీమిండియాను విజేతగా నిలిపిన శిఖర్ ధావన్‌ను తొలుతు జింబాబ్వే టూర్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అయితే, గాయం కారణంగా జట్టుకు దూరమైన పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కోలుకోవడంతో.. గబ్బర్ను తప్పించి అతడికి సారథ్య బాధ్యతలు అప్పజెప్పారు. ఇక ఈ పర్యటనలో హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు బదులు వీవీఎస్ లక్ష్మణ్ భారత జట్టుకు మార్గరదర్శనం చేయనున్నాడు. జింబాబ్వే సిరీస్‌కు, ఆగష్టు 27 నుంచి ఆరంభం కానున్న ఆసియా కప్-2022 టోర్నీకి మధ్య తక్కువ వ్యవధి ఉండటమే ఇందుకు కారణం. ఇక హరారే వేదికగా టీమిండియా- జింబాబ్వే జట్ల మధ్య ఆగష్టు 18న మొదటి వన్డే, ఆగష్టు 20న రెండో వన్డే, ఆగష్టు 22న మూడో వన్డే జరుగనున్నాయి. కాగా ఇటీవల స్వదేశంలో జింబాబ్వే మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. తమ దేశంలో పర్యటించిన బంగ్లాదేశ్‌కు షాకిస్తూ టీ20, వన్డే సిరీస్‌లను 2-1తో కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు సైతం గట్టి పోటీనిస్తామంటూ జింబాబ్వే కోచ్ డేవిడ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. చదవండి: IND vs ZIM: జింబాబ్వేతో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.. జట్టు ఇదే -
Ind Vs Zim: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్: జై షా
India tour of Zimbabwe, 2022- న్యూఢిల్లీ: మూడు వన్డేల సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటించే భారత జట్టుకు మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించనున్నాడు. బీసీసీఐ కార్యదర్శి జై షా ఈ విషయాన్ని నిర్ధారించారు. జింబాబ్వే సిరీస్‌కు, ఆసియా కప్‌కు మధ్య తక్కువ వ్యవధి ఉండటమే అందుకు కారణం. ‘టీమిండియాకు హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ జింబాబ్వేకు వెళతారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ విరామమేమీ తీసుకోవడం లేదు. అయితే జింబాబ్వేతో చివరి వన్డే ఈ నెల 22న ఉంటే ఆసియా కప్ కోసం భారత జట్టు ఈ నెల 23న యూఏఈలో ఉండాలి. ఆసియా కప్ వెళ్లే జట్టుతో రాహుల్ ద్రవిడ్ వెళతాడు. అందుకే ఈ తాత్కాలిక ఏర్పాటు’ అని జై షా స్పష్టం చేశారు. రెండు టీమ్‌లలోనూ ఉన్న ఇద్దరు ఆటగాళ్లు కేఎల్ రాహుల్, దీపక్ హుడా హరారే నుంచి నేరుగా దుబాయ్ వెళతారు. కొన్నాళ్ల క్రితం ఇదే తరహాలో ఐర్లాండ్‌కు వెళ్లిన భారత జట్టుకు కూడా లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించాడు. కాగా ఆగష్టు 18న జింబాబ్వేతో మొదలు కానున్న సిరీస్‌కు కేఎల్ రాహుల్ సారథిగా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. చదవండి: IND vs PAK: అప్పుడే జోస్యం చెప్పిన పాంటింగ్ Rohit Sharma: రోహిత్ శర్మ సాధించిన ఈ 3 రికార్డులు బద్దలు కొట్టడం కోహ్లికి సాధ్యం కాకపోవచ్చు! -
వీవీఎస్ లక్ష్మణ్ కు ఐసీసీలో కీలక పదవి
-
ఐసీసీలో వివిఎస్ లక్ష్మణ్‌కు కీలక పదవి
టీమిండియా మాజీ క్రికెటర్.. ఎన్సీఏ హెడ్ వివిఎస్ లక్ష్మణ్ ఐసీసీలో కీలక పదవి చేపట్టాడు. మెన్స్ క్రికెట్ కమిటీలో భాగంగా ఆటగాళ్ల ప్రతినిధిగా ఎంపిక చేసినట్లు మంగళవారం ఐసీసీ పేర్కొంది. లక్ష్మణ్‌తో పాటు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెటోరిని కూడా ప్రతినిధిగా ఎంపిక చేశామని బర్మింగ్హమ్ వేదికగా జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఎన్సీఏ అకాడమీ హెడ్‌గా ఉన్న లక్ష్మణ్ ఐర్లాండ్ పర్యటనలో టీమిండియాకు హెడ్‌కోచ్‌గా వ్యహరించిన సంగతి తెలిసిందే. ఆ సిరీస్‌ను టీమిండియా 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇక మరో మాజీ క్రికెటర్ రోజర్ హార్పర్‌ను కూడా ప్రతినిధిగా అవకాశం ఇచ్చింది. అయితే రోజర్ హార్పర్ పాస్ట్ ప్లేయర్స్ రెండో ప్రతినిధిగా వ్యవహరించనున్నాడు. శ్రీలంక మాజీ క్రికెటర్ మహేళ జయవర్దనే ఇది వరకే ఐసీసీ మెన్స్ క్రికెట్లో పాస్ట్ ప్లేయర్ ప్రతినిధిగా కొనసాగుతున్నాడు. ఇక ఇదే సమావేశంలో 2025లో మహిళల వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుందని ఐసీసీ పేర్కొంది. వచ్చే ఏడాది ఇక్కడ పురుషుల వన్డే వరల్డ్‌కప్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఇది ముగిసే రెండేళ్లలోనే... 2025లో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌కూ భారతే వేదిక కానుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ) 2023–2027లో భాగంగా అమ్మాయిల మెగా ఈవెంట్లను ఖరారు చేశారు.ముందుగా 2024లో బంగ్లాదేశ్ టి20 వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిస్తుంది. భారత్ మెగా ఈవెంట్ అనంతరం 2026లో మరో టి20 ప్రపంచకప్ ఇంగ్లండ్‌లో జరుగుతుంది. చదవండి: భారత్‌లో 2025 మహిళల వన్డే ప్రపంచకప్ -
IND VS ENG: తొలి టీ20కి కోచ్‌గా లక్ష్మణ్.. ద్రవిడ్‌కు ఏమైంది..?
సౌతాంప్టన్ వేదికగా జులై 7న ఇంగ్లండ్‌తో జరుగబోయే తొలి టీ20కు టీమిండియా హెడ్ కోచ్‌గా ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడని తెలుస్తోంది. రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ ముగిసిన (జులై 5) రోజు గ్యాప్‌లోనే తొలి టీ20 జరుగనుండటంతో రెగ్యులర్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ డిసైడ్ చేసినట్లు సమాచారం. దీంతో భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టీ20కు లక్ష్మణ్ కోచింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. లక్ష్మణ్.. ఇటీవల ముగిసిన ఐర్లాండ్ పర్యటనలో తొలిసారి టీమిండియా (హార్ధిక్ సేన) హెడ్ కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరుగబోయే తొలి టీ20కు కోచ్‌తో పాటు సీనియర్ సభ్యులు విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా కూడా జట్టుకు దూరంగా ఉంటున్నారు. ద్రవిడ్‌తో పాటు రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్‌లో భాగమైన వీరందరికి కూడా విశ్రాంతినిచ్చేందకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీసీసీఐ ఇదివరకే జట్లను కూడా ప్రకటించింది. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా జట్టులో చేరితే రుతురాజ్, సంజూ శాంసన్, అర్షదీప్ సింగ్, రాహుల్ త్రిపాఠి, వెంకటేశ్ అయ్యర్ జట్టు నుంచి తప్పుకోనున్నారు. తొలి మ్యాచ్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్ (వికెట్‌కీపర్), హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, చహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ 2, 3 టీ20లకు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్ (వికెట్‌కీపర్), రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, రవి జడేజా, చహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్ మూడు టీ20లకు ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, హ్యారీ బ్రూక్, సామ్ కర్రన్, రిచర్డ్ గ్లీసన్, క్రిస్ జోర్డాన్, లియమ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలాన్, టైమాల్ మిల్స్, మాథ్యూ పార్కిన్సన్, జేసన్ రాయ్, రీస్ టాప్లే, డేవిడ్ విల్లే, ఫిల్ సాల్ట్ చదవండి: IND vs ENG: ఒక్కరోజులో అంతా ఉల్టా పల్టా! భారత్ అద్భుతం చేయగలదా? -
99 పరుగుల వద్ద స్టంపౌటైన వార్నర్.. వన్డే క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు
కొలొంబో: సొంతగడ్డపై శ్రీలంక 30 ఏళ్ల చరిత్రను తిరగరాసింది. 1992 తర్వాత తొలిసారి ఆ జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. మంగళవారం (జూన్ 21) జరిగిన నాలుగో వన్డేలో ఆసీస్‌ను 4 పరుగుల తేడాతో చిత్తు చేయడం ద్వారా 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 49 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో ఆసీస్ 50 ఓవర్లలో 254 పరుగులకు ఆలౌటై లక్ష్యానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. Sri Lanka won a ODI Series against australia for the first time in the last 30 years. What a historic win for Sri Lanka. pic.twitter.com/vT6yMV4rgN — CricketMAN2 (@ImTanujSingh) June 21, 2022 లంక జట్టులో చరిత్ అసలంక (106 బంతుల్లో 110; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో సత్తా చాటగా, ధనంజయ డిసిల్వ (61 బంతుల్లో 60; 7 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ (112 బంతుల్లో 99; 12 ఫోర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా, చివర్లో ప్యాట్ కమిన్స్ (43 బంతుల్లో 35; 2 ఫోర్లు), కునెర్మన్ (12 బంతుల్లో 15; 3 ఫోర్లు) పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. Heartbreak for David Warner. He gone for 99 runs. But nevertheless he played a brilliant Innings in this difficult condition in this run chase against Sri Lanka. Well played, David Warner. pic.twitter.com/YBOFSx6sgq — CricketMAN2 (@ImTanujSingh) June 21, 2022 వీవీఎస్ లక్ష్మణ్ సరసన వార్నర్ లంకతో జరిగిన నాలుగో వన్డేలో ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఒక్క పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి బాధ్యతాయుతంగా ఆడిన వార్నర్ 99 పరుగుల వద్ద ధనంజయ డిసిల్వ బౌలింగ్‌లో స్టంప్ ఔటయ్యాడు. తద్వారా వన్డే క్రికెట్ చరిత్రలో 99 పరుగుల వద్ద స్టంప్ ఔట్ అయిన రెండో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 2002లో నాగ్‌పూర్ వేదికగా విండీస్‌తో జరిగిన వన్డేలో టీమిండియా ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ ఇలానే 99 పరుగుల వద్ద స్టంప్ ఔటయ్యాడు. చదవండి: ఆసీస్‌కు షాకిచ్చిన శ్రీలంక.. 30 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై సిరీస్ గెలుపు -
శ్రీలంకతో సిరీస్.. భారత జట్టుతో సమావేశమైన లక్ష్మణ్
భారత మహిళల జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనకు ముందు నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ భారత జట్టుతో సమావేశమయ్యారు. ఇందుకు సంబంధిచిన ఫోటోలను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ఈ పర్యటనలో భాగంగా భారత్ మూడు వన్డేలు,మూడు టీ20లు ఆడనుంది. తొలి టీ20 దంబుల్లా వేదికగా జూన్23న జరగనుంది. కాగా న్యూజిలాండ్ వేదికగా జరిగిన మహిళల ప్రపంచకప్ తర్వాత భారత్‌కు ఇదే తొలి సిరీస్. ఇక భారత సీనియర్ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో భారత వన్డే కెప్టెన్‌గా హార్మన్ ప్రీత్ కౌర్ ఎంపికైంది. అదే విధంగా శ్రీలంకతో సిరీస్‌కు భారత వెటరన్ పేసర్ జూలన్ గోస్వామి వ్యక్తిగత కారణాలతో దూరమైంది. శ్రీలంకతో వన్డే సిరీస్‌కి భారత మహిళా జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యషికా భాటియా, మేఘనా, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, సిమ్రాన్ బహదూర్, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్, తానియా భాటియా, హర్లీన్ డియోల్ టి20 సిరీస్‌కి భారత మహిళా జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యషికా భాటియా, మేఘనా, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, సిమ్రాన్ బహదూర్, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్, జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్ చదవండి: T20 World Cup2022: 'భారత్ ప్రపంచకప్ గెలవాలంటే అతడు ఖచ్చితంగా జట్టులో ఉండాలి' 📸 📸: Mr @VVSLaxman281 - Head Cricket, NCA - interacts with the Sri Lanka-bound #TeamIndia, led by @ImHarmanpreet. 👍 👍 pic.twitter.com/yVQNGjHaD8 — BCCI Women (@BCCIWomen) June 18, 2022 -
టీమిండియా టి20 తాత్కాలిక కోచ్‌గా లక్ష్మణ్
జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా కోచ్‌గా వ్యవహరిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. ప్రధాన కోచ్ ద్రవిడ్ టెస్టు జట్టుతో ఇంగ్లండ్‌కు వెళ్లనుండటంతో తాత్కాలిక కోచ్‌గా లక్ష్మణ్‌ను నియమించారు. వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో ఐదు టి20ల సిరీస్ ఆడిన తర్వాత జూన్ 19న భారత్ ఐర్లాండ్‌కు పయనమవుతుంది. అక్కడ జూన్ 26, 28 తేదీల్లో డబ్లిన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. చదవండి: Rashid Khan: 4 రోజులు సెలవు దొరికింది.. ఏం చేయాలో? చక్కగా నిద్రపో! -
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్..!
ఐపీఎల్-2022 ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్‌కు బీసీసీఐ జూనియర్ జట్టును ఎంపిక చేసే ఆలోచనలో ఉంది. ఈ జట్టుకు శిఖర్ ధావన్ లేదా హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. మరో వైపు జూలై 1న ఇంగ్లాండ్‌తో జరిగే నిర్ణయాత్మక ఐదో టెస్టు కోసం జూన్ మధ్యలోనే భారత్ లండన్‌కి బయలుదేరనుంది. ఈ క్రమంలో సౌతాఫ్రికాతో సిరీస్‌కు టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ స్ధానంలో భారత మాజీ టెస్టు స్పెషలిస్ట్ వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఐర్లాండ్ పర్యటనకు కూడా వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక హెడ్ కోచ్‌గా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. ఇక భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 ఢిల్లీ వేదికగా జూన్9న జరగనుంది. చదవండి: Kane Williamson: సన్‌రైజర్స్‌కు భారీ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన కెప్టెన్ -
కేకేఆర్ కమలేశ్‌కు బంపరాఫర్.. ఏకంగా టీమిండియాతో! కీలక బాధ్యత!
Indian Cricket Team: ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రధాన సిబ్బందిలో ఒకరైన కమలేశ్ జైన్ బంపరాఫర్ కొట్టేశారు. టీమిండియా హెడ్ ఫిజియోగా ఆయన ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బీసీసీఐ కార్యదర్శి, ఎన్సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌లను ఆయన మెప్పించినట్లు సమాచారం. ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టు ఫిజియోగా కమలేశ్ నియామకం దాదాపు ఖరారైనట్లేనని జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించి ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. కాగా మాజీ ఫిజియో నితిన్ పటేల్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ హెడ్‌గా వెళ్లిన తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఇక 2012 నుంచి కేకేఆర్‌తో ఉన్న కమలేశ్.. 2022లో ప్రధాన ఫిజియోగా ప్రమోట్ అయ్యారు. ఇక ఇప్పుడు టీమిండియాలో భాగమయ్యే అవకాశాన్ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. దక్షిణాఫ్రికాతో భారత్ టీ20 సిరీస్ నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.కాగా కమలేశ్ జైన్ చెన్నైకి చెందినవారు. చదవండి👉🏾Kane Williamson: సన్‌రైజర్స్‌కు భారీ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన కెప్టెన్ -
VVS Laxman: క్రీడలపై మక్కువతోనే క్రికెటర్‌నయ్యా..
అబిడ్స్:చిన్నప్పటి నుంచే అభిరుచికి అనుగుణంగా రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నారు. అబిడ్స్ లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఆదివారం నూతనంగా ఏర్పాటు చేసిన బౌలింగ్ మిషిన్‌ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై పాఠశాల ప్రిన్సిపల్ రేవ్ బ్రదర్ షజాన్ అంటోనితో కలిసి ప్రారంభించారు. అనంతరం వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. లిటిల్ ఫ్లవర్ స్కూల్లో చదవడం తన అదృష్టమన్నారు. చిన్నప్పుడే స్కూల్లో విద్యతో పాటు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నందుకే అంతర్జాతీయ స్థాయిలో క్రికెటర్‌గా ఎదిగానన్నారు. తన తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లు అయినా చిన్ననాటి నుంచి క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని, అందుకే క్రికెట్ వైపు దృష్టి పెట్టినట్లు చెప్పారు. అనంతరం ప్రిన్సిపల్ రేవ్ బ్రదర్ షజాన్ ఆంటోని మాట్లాడుతూ.. తమ పాఠశాలలో విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక, ఇతర రంగాల్లో రాణించేలా తాము ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. వైస్ ప్రిన్సిపల్ రేవ్ బ్రదర్ జాకబ్, అజిత్, రమేష్, బ్రిజ్ మోహన్, పుణ్యవతి, సంపత్, అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. -
అతనొచ్చాడు.. టీమిండియా ఆటగాళ్ల తలరాతలు మార్చాడు..!
అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి, రికార్డు స్థాయిలో ఐదో టైటిల్ గెలిచిన యువ భారత జట్టుపై నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా కుర్రాళ్లు గెలిచిన ఈ టైటిల్ చాలా ప్రత్యేకమని కొనియాడాడు. టోర్నీ మధ్యలో కీలక ఆటగాళ్లు కరోనా బారిన పడినా, యువ భారత జట్టు ఏమాత్రం వెరవకుండా, మొక్కవోని ధైర్యంతో అద్భుత విజయాలతో టోర్నీని ముగించిందని ఆకాశానికెత్తాడు. ఆసియా కప్ టైటిల్ గెలిచిన నెలరోజుల్లోపే ప్రపంచకప్ టైటిల్ కూడా చేజిక్కించుకోవడం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని సంబురపడిపోయాడు. ఈ సందర్భంగా హెడ్ కోచ్ హృషికేశ్ కనిత్కర్, ఇతర సహాయక సిబ్బందిని అభినందించాడు. కాగా, రాహుల్ ద్రవిడ్ అనంతరం ఎన్సీఏ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న వీవీఎస్(వెరి వెరి స్పెషల్) లక్ష్మణ్.. పగ్గాలు చేపట్టిన తొలి నాటి నుంచే యువ ఆటగాళ్లపై తనదైన ముద్రను వేశాడు. అతని పర్యవేక్షనలో యంగ్ ఇండియా ఆటగాళ్లు రాటుదేలారు. యువ భారత జట్టు ఎక్కడికి వెళ్లినా లక్ష్మణ్ కూడా జట్టుతో పాటే ఉండి, ఆటగాళ్లను దగ్గరుండి మరీ ప్రోత్సహించాడు. ప్రస్తుత ప్రపంచకప్ వేదిక అయిన కరీబియన్ దీవులకు సైతం లక్ష్మణ్ వెళ్లి యువ జట్టులో ధైర్యం నింపాడు. ఫలితంగా అతని పర్యవేక్షణలో యువ భారత జట్టు నెల వ్యవధిలో వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే, దాదాపు 16 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగిన లక్ష్మణ్.. ఒక్క వరల్డ్‌కప్ మ్యాచ్ కూడా ఆడకుండానే యువ జట్టు మార్గనిర్దేశకుడిగా అద్బుతాలు చేస్తున్నాడు. చదవండి: మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఇంట్లో తీవ్ర విషాదం -
అండర్–19 జట్టుపై ఎన్సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలు
ఆసియా కప్‌లో విజేతగా నిలువడం ద్వారా అండర్–19 ప్రపంచకప్‌కు ముందు యువ భారత జట్టుకు కావాల్సినంత విశ్వాసం లభించిందని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. ప్రతికూల వాతావరణం కారణంగా ఆసియా కప్‌కు సరైన సన్నాహాలు లేకుండానే యువ భారత్ వెళ్లిందని... నిలకడగా రాణించి విజేతగా అవతరించదని లక్ష్మణ్ కొనియాడాడు. అండర్–19 ప్రపంచకప్ ఈనెల 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు వెస్టిండీస్‌లో జరుగుతుంది. కాగా, శ్రీలంక అండర్–19 జట్టుతో శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫైనల్లో యువ భారత్ 9 వికెట్ల తేడాతో శ్రీలంక జట్టును చిత్తు చేసి టైటిల్ చేజిక్కించుకుంది. భారత అండర్–19 టీమ్ ఆసియా కప్‌ను గెలుచుకోవడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. (చదవండి: భారత యువ ఆటగాళ్లకిది ఎనిమిదోసారి...) -
బిగ్ హింట్ ఇచ్చిన దాదా... త్వరలోనే సచిన్ ‘రీ ఎంట్రీ’ ఖాయం.. అయితే..
Sourav Ganguly: టీమిండియా మాజీ సారథులు సౌరవ్ గంగూలీ, సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్ జట్టు కోసం కలిసి ఆడటం చూశాం. మరి.. భారత క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకువెళ్లే క్రమంలో ఈ దిగ్గజ త్రయం ముగ్గురూ కలిసి ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే ఎంత బావుంటుందో కదా! టీమిండియా సగటు కలగనే ఆ రోజు తొందర్లోనే వస్తుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి బాస్ గంగూలీ హింట్ ఇచ్చాడు. ఇప్పటికే ద్రవిడ్‌ను హెడ్‌కోచ్‌గా నియమించడంలో కీలక పాత్ర పోషించిన దాదా.. సచిన్‌ను కూడా బీసీసీఐలో భాగం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. ఈ మేరకు... ‘‘సచిన్ నిజంగా చాలా భిన్నమైన వ్యక్తి. తనకు ఇలాంటి అంశాల్లో భాగం కావడంపై పెద్దగా ఆసక్తి ఉండదు. అయితే, భారత క్రికెట్లో సచిన్ జోక్యం అనేది నిజంగా చాలా పెద్ద వార్తే అవుతుంది కదా! ఈ విషయమై పెద్ద కసరత్తే చేయాల్సి ఉంటుంది. ప్రతిభను సరిగా వినియోగించుకుంటే అద్భుతాలు చూడవచ్చు కదా’’ అని గంగూలీ పేర్కొన్నాడు. అయితే, ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, వాటిని అధిగమించి.. ఏదో ఒకరోజు సచిన్‌ను భారత క్రికెట్లో మరోసారి భాగం చేయడం ఖాయమని స్పష్టం చేశాడు. జర్నలిస్టు బోరియా మజుందార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇక భారత హెడ్‌కోచ్‌గా ఉండేందుకు తొలుత నిరాకరించిన ద్రవిడ్.. గంగూలీ జోక్యంతో ఆ పదవి స్వీకరించిన సంగతి తెలిసిందే. అదే విధంగా టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్‌గా నియమించడంలోనూ తన వంతు పాత్ర పోషించాడు. చదవండి: IPL 2022 Auction: అవి 12 వేల కోట్లు.. ఇవి 40 వేల కోట్లు.. మొత్తంగా 50: గంగూలీ -
కొత్త బాధ్యతల్లో మణికట్టు మాంత్రికుడు.. కేటీఆర్ అభినందనలు
VVS Laxman As NCA Director: టీమిండియా మాజీ ఆటగాడు, హైదరాబాదీ సొగసరి బ్యాటర్, మణికట్టు మాంత్రికుడు వంగివరపు వెంకటసాయి లక్ష్మణ్(వీవీఎస్ లక్ష్మణ్) కొత్త బాధ్యతలను చేపట్టాడు. భారత క్రికెట్‌కు అనుసంధాన సంస్థ అయిన జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) చీఫ్‌గా సోమవారం ఛార్జ్ తీసుకున్న లక్ష్మణ్.. బెంగళూరులోని ఎన్సీఏ ప్రధాన కార్యాలయంలో తొలి రోజు విధులను నిర్వర్తించాడు. దీనికి సంబంధించిన ఫోటోలను అతనే స్వయంగా సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. కాగా, లక్ష్మణ్‌కు ముందు ఎన్సీఏ చీఫ్ పదవిని ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నిర్వర్తించేవాడన్న విషయం తెలిసిందే. ద్రవిడ్‌కు ప్రమోషన్ రావడంతో లక్ష్మణ్ ఎన్సీఏ బాధ్యతలను చేపట్టాడు. ద్రవిడ్‌ను టీమిండియా హెడ్‌కోచ్‌గా నియమించడంలో కీలకపాత్ర పోషించిన బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీనే.. లక్ష్మణ్‌ను సైతం ఒప్పించి మరీ బాధ్యతలు చేపట్టేలా చేశాడు. కొత్త బాధ్యతల్లో లక్ష్మణ్.. భారత యువ ఆటగాళ్లకు దిశానిర్ధేశం చేయడంతో పాటు ఆటగాళ్లను సానబెట్టే పనిలో ఉంటాడు. కంగ్రాట్స్ బ్రదర్.. :కేటీఆర్ ఎన్సీఏ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ‘కొత్త బాధ్యతలు చేపట్టిన సోదరుడు లక్ష్మణ్‌కు అభినందనలంటూ ట్వీట్ చేశారు. మీరు, రాహుల్ ద్రవిడ్ కలిసి భారత క్రికెట్‌ను అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్తారనే నమ్మకం నాకుంది’ అంటూ కేటీఆర్ ట్వీటారు. Congratulations on the new responsibility brother @VVSLaxman281 👏 I am sure with gentlemen like you and #RahulDravid at the helm of affairs, future Indian cricket will scale newer/greater heights https://t.co/92nxVA6Rz1 — KTR (@KTRTRS) December 14, 2021 చదవండి: క్రేజీ బౌన్సర్.. తృటిలో తప్పించుకున్న రూట్ -
Ind Vs Sa: చేసిన తప్పులే మళ్లీ మళ్లీ.. ఇకనైనా గుణపాఠం నేర్చుకోండి!
Ind Vs Sa: VVS Laxman On Important Not Repeat Same Mistakes Rahane Pujara: తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోకుండా పదే పదే.. ఒకే తరహాలో వికెట్ పారేసుకోవడం సరికాదని టీమిండియా బ్యాటర్లకు వీవీఎస్ లక్ష్మణ్ చురకలు అంటించాడు. తప్పిదాలను గమనించి వాటిని పునరావృతం చేయకుండా ఉండాలని హితవు పలికాడు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారా పూర్తిగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. తొలి టెస్టుకు సారథిగా వ్యవహరించిన రహానే తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో రెండో టెస్టులో ఆడే అవకాశం కోల్పోయాడు. మరోవైపు.. పుజారాకు ముంబై టెస్టులో ఛాన్స్ వచ్చినా పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ముఖ్యంగా వీరు అవుటైన విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. రహానే, పుజారా ఆట తీరుపై పెదవి విరిచాడు. ‘‘ఒకే తప్పును మళ్లీ మళ్లీ చేయకూడదు. కాన్పూర్ టెస్టులో అజింక్య రహానే అవుటైన విధానం.. పుజారా కాన్పూర్, ముంబై టెస్టులో పెవిలియన్ చేరిన తీరును గమనిస్తే విషయం అర్థమవుతుంది. ఒకే తరహాలో వారు వికెట్ పారేసుకున్నారు’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ గురించి మాట్లాడుతూ.. ‘‘గిల్ కూడా అంతే... కాస్త కుదురుకున్నాడు అనుకునే సమయానికి అవుట్ అవుతాడు. శుభారంభాలను భారీ స్కోరుగా మార్చడం చాలా చాలా కష్టం. కాబట్టి జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది’’ అని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో ఈ లోపాలు సరిదిద్దుకుని... కసిగా ఆడితేనే సిరీస్ గెలిచే అవకాశం ఉంటుందని తెలిపారు. కాగా న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్ గెలిచిన టీమిండియా సౌతాఫ్రికాకు పయనం కానుంది. ఇందుకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. చదవండి: Virat Kohli- Ajinkya Rahane: రహానే ఫామ్.. నేను ఆ పని చేయలేను.. ఇంకెవరు కూడా.. కోహ్లి కౌంటర్! -
Virat Kohli: టీమిండియా అత్యుత్తమ టెస్టు కెప్టెన్ అతడే!
Ind Vs Nz 2nd Test: Virat Kohli Best Test Captain India Have Ever Had Irfan Pathan: న్యూజిలాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆల్‌రౌండ్ ప్రతిభతో విజయం సాధించిన కోహ్లి సేనను భారత మాజీ ఆటగాళ్లు అభినందిస్తున్నారు. ఈ క్రమంలో టెస్టు స్పెషలిస్టు వీవీఎస్ లక్ష్మణ్... ‘‘సొంతగడ్డ మీద భారత్ విజయం.. సౌండ్ దద్దరిల్లిపోయింది. అవుట్‌క్లాస్ న్యూజిలాండ్‌పై అద్బుత విజయం. మయాంక్.. అశ్విన్ ముందుండి నడిపించగా... సమష్టి కృషితో గెలుపొందింది’’ అని భారత జట్టును ఆకాశానికెత్తేశాడు. అయితే, చరిత్ర సృష్టించిన అజాజ్ పటేల్‌కు మాత్రం ఈ ఓటమి చేదు అనుభవమని పేర్కొన్నాడు. ఇక భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ..‘‘పూర్తిస్థాయి ఆధిపత్య విజయాలు మరింత మధురంగా ఉంటాయి. శభాష్ టీమిండియా’’ అని హర్షం వ్యక్తం చేశాడు. అదే విధంగా టీమిండియా టెస్టు కెప్టెన్లలో అత్యుత్తమ కెప్టెన్ విరాట్ కోహ్లి అని పునరుద్ఘాటించాడు. ఈ మేరకు.. ‘‘ఇంతకు ముందు చెప్పినట్లుగానే మరోసారి చెబుతున్నా... ఇప్పటి వరకు భారత టెస్టు కెప్టెన్లలో గొప్ప సారథి విరాట్ కోహ్లి! తన విజయాల శాతం 59.09తో టాప్‌లో ఉన్నాడు’’ అని ప్రశంసించాడు. ఇక వీరేంద్ర సెహ్వాగ్, వసీం జాఫర్ తదితరులు టీమిండియా విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాగా ఈ విజయంతో భారత జట్టు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ప్రథమ స్థానానికి ఎగబాకింది. చదవండి: Virat Kohli- Ajinkya Rahane: రహానే ఫామ్.. నేను ఆ పని చేయలేను.. ఇంకెవరు కూడా.. కోహ్లి కౌంటర్! CHAMPIONS 👏👏 This is #TeamIndia's 14th consecutive Test series win at home.#INDvNZ @Paytm pic.twitter.com/FtKIKVCzt8 — BCCI (@BCCI) December 6, 2021 As I have said earlier and saying it again @imVkohli is the best Test Captain India have ever had! He's at the top with the win percentage of 59.09% and the second spot is at 45%. — Irfan Pathan (@IrfanPathan) December 6, 2021 Resounding win for India in their own backyard, comprehensively outclassed New Zealand on a track with turn and bounce. Complete all-round effort with Mayank and Ashwin leading the way, one does feel for history-maker Ajaz. #INDvNZ pic.twitter.com/FFeRu6ZPUC — VVS Laxman (@VVSLaxman281) December 6, 2021 Well done Team India. Another comprehensive win at home. Many positives in the test match , but the best was to see Mayank Agarwal back at his best. pic.twitter.com/KrHlRhXngr — Virender Sehwag (@virendersehwag) December 6, 2021 -
ఎన్సీఏ హెడ్‌గా వివిఎస్ లక్ష్మణ్!
VVS Laxman May Take Charge As NCA Head.. టీమిండియా మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ త్వరలో నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సిఏ) చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు ఎన్సిఏ హెడ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ .. టీమ్ ఇండియా కోచ్‌గా బిసీసీఐ నియమించడంతో.. ఖాళీ అయిన ఆ స్థానానికి వివిఎస్ లక్ష్మణ్‌ను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆదివారం ధ్రువీకరించారు. తొలుత ఈ బాధ్యతలు చేపట్టేందుకు లక్ష్మణ్ నిరాకరించాడని సమాచారం. అయితే గంగూలీ, బీసీసీఐ సెక్రటరీ జైషా చర్చలు జరిపిన తర్వాత లక్ష్మణ్ అంగీకరించారని సమాచారం. మరో వైపు రాహుల్ ద్రవిడ్ విషయంలోనూ ఇదే జరిగింది. టీమ్ ఇండియా కోచ్ బాధ్యతలను తీసుకునేందుకు రాహుల్ తిరస్కరించగా.. గంగూలీ ఒప్పించారని వార్తలు వచ్చాయి. రాబోయే రెండు, మూడేళ్లలో టీమిండియా టి20 ప్రపంచకప్ 2022తో పాటు టెస్టు చాంపియన్ షిప్, వన్డే ప్రపంచకప్ టోర్నీలు ఆడనుంది. క్రికెట్ దిగ్గజాలు ఉన్నత పదవులను ఇవ్వడంతో క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: T20 WC 2021 Final: ఎడమ పక్కన నిల్చున్న కెప్టెన్‌దే టైటిల్) -
ఎన్సీఏ డైరెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్..!
VVS Laxman To Replace Rahul Dravid As Next NCA Head: నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) డైరెక్టర్‌గా టీమిండియా మాజీ క్రికెటర్, హైదరాబాదీ స్టయిలిష్ ప్లేయర్ వీవీఎస్ లక్ష్మణ్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఎన్సీఏ హెడ్ రాహుల్ ద్రవిడ్.. టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనుండడంతో ఆ స్థానాన్ని లక్షణ్‌తో భర్తీ చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు లక్షణ్‌ను ఒప్పించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షాలే నేరుగా రంగప్రవేశం చేశారని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. లక్ష్మణ్ ఎన్సీఏ హెడ్ పదవిని చేపట్టేందుకు అంగీకరిస్తే, భారత క్రికెట్ భవిష్యత్తుకు ఢోకా ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో లక్ష్మణ్ సమాధానంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా, భారత క్రికెట్ మరింత వైభవాన్ని సంతరించుకోవాలంటే.. మాజీలు తమ అనుభవాల్ని పంచుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ బాస్ ఇటీవలే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. చదవండి: మైఖేల్ వాన్‌పై నిషేధం..! -
'రహానేను పక్కన పెట్టాల్సిన సమయం వచ్చేసింది'
లండన్: టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానేపై భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రహానేను పక్కన పెట్టాల్సిన సమయం వచ్చేసిందని.. అతని స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని లక్ష్మణ్ పేర్కొన్నాడు. ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్య్వూలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. '' రహానేకు ఇది బ్రేక్ ఇవ్వాల్సిన సమయం. ప్రస్తుతం అతని ఫామ్ ఆందోళనకరంగా ఉంది. భవిష్యుత్తులో ఇలాగే ఉంటే జట్టులో చోటు కోల్పోవాల్సి వస్తుంది. కోహ్లి రహానేపై నమ్మకంతో అతనికి అవకాశాలు ఇస్తూ వచ్చాడు. రహానే వాస్తవానికి మంచి టెక్నిక్ ఉన్న ఆటగాడు. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది. అయితే అతను ఇప్పుడు ఫామ్ కోల్పోయాడు.. లయను తిరిగి అందుకోవాలంటే కొంతకాలం బ్రేక్ ఇవ్వాలి. నాలుగో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో రహానే క్రీజులో ఉన్నంతసేపు ఇబ్బంది పడుతూనే కనిపించాడు. రహానే ఎదుర్కొన్న 8 బంతుల్లో ఒకసారి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కానీ మరోసారి అలాంటి బంతే పడినప్పటికీ కనీసం అంచనా వేయలేకపోయాడు. డకౌట్‌గా వెనుదిరిగి ఫ్యాన్స్‌ను నిరాశపరిచాడు. రహానే స్థానంలో కొన్నాళ్లు కొత్త ఆటగాళ్లైన శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లకు అవకాశం ఇవ్వాలి'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Ajinkya Rahane: రహానే ఎందుకిలా.. అభిమానుల ఆగ్రహం ఇక నాలుగో టెస్టులో డకౌట్‌గా వెనుదిరిగిన రహానే మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. గతేడాది మెల్బోర్న్ టెస్టులో చివరిసారి సెంచరీ చేసిన రహానే ఆ తర్వాత ఆడిన 11 టెస్టుల్లో అతని యావరేజ్ 20 దాటలేదంటే ఆటతీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో అర్థశతకంతో మెరిసినప్పటికీ అదే ఫామ్‌ను కొనసాగించలేకపోయాడు. ఇక నాలుగో టెస్టు మరింత ఆసక్తికరంగా మారింది. 368 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. టీమిండియా విజయానికి పది వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లండ్ గెలుపుకు 291 పరుగుల దూరంలో ఉంది. చదవండి: కోహ్లి విషయంలో మొయిన్ అలీ చరిత్ర; డకౌట్లలో రహానే చెత్త రికార్డు -
మహ్మద్ సిరాజ్ చిన్ననాటి ఫోటో షేర్ చేసిన వీవీఎస్ లక్ష్మణ్
సాక్షి,హైదరాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన మహ్మద్ సిరాజ్ చిన్ననాటి ఫోటోను భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ షేర్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో సిరాజ్ ప్రదర్శను చూసి గర్వపడుతున్నానని లక్ష్మణ్ అన్నాడు. సిరాజ్ క్రీడా ప్రయాణం స్ఫూర్తిదాయకంగా ఉందని.. తన కేరీర్లో మరింత రాణించాలని ఆకాక్షించాడు. లార్డ్స్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఏకంగా 8 వికెట్లు పడగొట్టి అద్భుతమే చేసాడు సిరాజ్. మొదటి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు, రెండవ ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీశాడు. దీంతో భారత్ ఇంగ్లాండ్ పై ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. మొదటి మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో తన స్థానాన్ని సిరాజ్ ఎంతగానో మెరుగుపరుచుకున్నాడు. ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 38వ స్థానానికి చేరుకున్నాడు. Met him for the first time at frmr Hyderabad great Abdul Azeem’s residence. And I feel so proud to see the rapid progress #Siraj has already made in intern’al cricket. His life is another testament of what one can achieve through hardwork & will-power.More power to you young man pic.twitter.com/MHjezzlzxz — VVS Laxman (@VVSLaxman281) August 17, 2021 -
పరిస్థితులతో సంబంధం లేదు.. రెండో టెస్ట్‌కు అతన్ని తీసుకోవాల్సిందే..!
లండన్: ఇంగ్లండ్‌తో జరిగే రెండో టెస్ట్‌కు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తుది జట్టులోకి కచ్చితంగా తీసుకోవాలని దిగ్గజ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రతిపాదించాడు. పరిస్థితులను పట్టించుకోకుండా అతనికి అవకాశమివ్వాలని జట్టు యాజమాన్యానికి సూచించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో అశ్విన్ అద్భుత ప్రదర్శన చేసినా.. కౌంటీ క్రికెట్లో రాణించినా.. ఇంగ్లండ్‌తో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో అతనికి తుది జట్టులో చోటు దక్కని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లక్ష్మణ్ పై విధంగా స్పందించాడు. ఇదిలా ఉంటే, పిచ్ పేసర్లకు సహకరిస్తుందని తొలి టెస్ట్‌లో కోహ్లీ సేన నలుగురు పేసర్లు, ఓ స్పిన్నర్ ఫార్ములాతో బరిలోకి దిగింది. దాంతో అశ్విన్ స్థానంలో నాలుగో పేసర్ కోటాలో శార్దూల్ ఠాకూర్‌కు తుది జట్టులో చోటు దక్కింది. ఈ ఫార్ములా సెక్సెస్ కావడంతో సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌ల్లోనూ ఇదే ఫార్ములాను కొనసాగిస్తామని మ్యాచ్ అనంతరం కోహ్లీ చెప్పడంతో లక్ష్మణ్ స్పందించాడు. అశ్విన్ జట్టులోకి వస్తే బౌలింగ్ డెప్త్ పెరుగుతుందని, తానైతే పరిస్థితులతో సంబంధం లేకుండా అశ్విన్‌ను జట్టులోకి తీసుకునేవాడినని క్రిక్ ఇన్ఫోతో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు. పరిస్థితులు, వాతావరణం ఎలా ఉన్నా అశ్విన్ మేటి బౌలర్ అని, అద్భుతమైన ప్రదర్శనతో మ్యాచ్ విన్నర్‌గా నిలిచి ఇంగ్లండ్‌పై ఒత్తిడి తీసుకురాగల సమర్థుడని కొనియాడాడు. ఇక తొలి టెస్టులో బౌలింగ్‌లో రాణించిన శార్ధూల్‌పై కూడా లక్ష్మణ్ స్పందించాడు. శార్ధూల్ బ్యాట్‌తో రాణించకపోయినా బంతితో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడని కితాబునిచ్చాడు. అశ్విన్, శార్దూల్ ఇద్దరూ సమర్థవంతులే అయినప్పటికీ.. తన ఓటు మాత్రం అశ్విన్‌కే ఉంటుందని చెప్పుకొచ్చాడు. కాగా, ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా గెలుపుకు వరుణుడు ఆటంకంగా నిలిచిన సంగతి తెలిసిందే. చివరి రోజు తొమ్మిది వికెట్లు చేతిలో ఉండి, కేవలం 157 పరుగులు చేయాల్సిన సందర్భంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురువడంతో అంపైర్లు మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. -
క్రికెట్ ఫీల్డ్‌లో ఇలాంటి గుడ్ క్యాచ్‌ను ఎప్పటికీ చూడలేం!
నార్తాంప్టన్: ఇంగ్లండ్ వుమెన్ క్రికెట్ టీంతో శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత మహిళా జట్టు బ్యాటింగ్ ఆల్‌రౌండర్ హర్లిన్ డియోల్ అద్భుతమైన క్యాచ్‌తో ఆకట్టుకుంది. పందొమ్మిదవ ఓవర్లో భారత బౌలర్ శిఖా పాండే, జోన్స్‌కు బంతిని సంధించగా.. ఆమె షాట్ ఆడింది. దీంతో గాల్లోకి లేచిన బంతి బౌండరీ మీదుగా దూసుకుపోతుండగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న హర్లిన్ పాదరసంలా కదిలి బాల్‌ను ఒడిసిపట్టింది. అయితే, బ్యాలెన్స్ చేసుకోవడం కష్ట కావడంతో.. వెంటనే అప్రమత్తమై ఆమె.. బంతిని గాల్లోకి విసిరి.. మళ్లీ బౌండరీ లోపలికి వచ్చి క్యాచ్ పట్టింది. ఇక సూపర్బ్ రివర్స్ కప్డ్ క్యాచ్‌కు సంబంధించిన ఈ వీడియోను ఈసీబీ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఇప్పటికే మిలియన్ వ్యూస్ సాధించిన ఈ వీడియోను రీట్వీట్ చేసిన టీమిండియా టెస్టు స్పెషలిస్టు వీవీఎస్ లక్ష్మణ్... ‘‘క్రికెట్ ఫీల్డ్‌లో ఇలాంటి గుడ్ క్యాచ్‌ను మనం ఎప్పటికీ చూడలేం. హర్లిన్ డియోల్ ఫీల్డింగ్.. నిజంగా టాప్ క్లాస్’’ అంటూ హర్లిన్పై ప్రశంసలు కురిపించాడు. కాగా భారత మహిళల జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొదటి టీ20కి వర్షం అంతరాయం కలిగించింది. ఈ క్రమంలో డీఎల్ఎస్ విధానం ప్రకారం ఇంగ్లండ్ మహిళా జట్టు భారత్‌పై 18 పరుగుల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ స్కోర్లు: ►ఇంగ్లండ్ మహిళా జట్టు- 177/7 (20 ఓవర్లలో) ►భారత మహిళా జట్టు- 54/3 (8.4 ఓవర్లలో) ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్- నటాలీ సీవర్ As good a catch one will ever see on a cricket field, from Harleen Deol. Absolutely top class. https://t.co/CKmB3uZ7OH — VVS Laxman (@VVSLaxman281) July 10, 2021 -
గంగూలీ అలా చేసి ఉండకపోతేనా..
ఫుట్‌బాల్ మీద మమకారం ఉన్నప్పటికీ.. అన్నతో పడ్డ పోటీలో చివరికి అతనే పైచేయి సాధించాడు. అగ్రెస్సివ్ బ్యాట్స్‌మ్యాన్‌గా, యువ జట్టును సమర్థవంతంగా నడిపించిన సారథిగా దశాబ్దంపైగా టీమిండియాకు మరిచిపోలేని విజయాలెన్నింటినో అందించాడు సౌరవ్ ఛండీదాస్ గంగూలీ అలియాస్ దాదా. ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న గంగూలీకి ఇవాళ 49వ పుట్టినరోజు.. వెబ్‌డెస్క్: పరిమిత ఓవర్లలోనే కాదు.. టెస్ట్‌ల్లోనూ రికార్డ్ స్ట్రయిక్ రేటుతో పరుగుల వరద పారించాడు సౌరవ్ గంగూలీ. హీరో హోండా బ్యాట్(చాలా మ్యాచ్‌లు ఈ బ్యాట్‌తోనే ఆడాడు)తో ముందుకొచ్చి స్పిన్నర్ల బంతిని బౌండరీ అవతల పడేయడం, స్క్వేర్, ఫ్రంట్ ఫుట్, కవర్ షాట్లతో క్రీడాభిమానులందరినీ ఉర్రూతలూగించేవాడు. ఆయనది ఎడమ చేతి వాటం. అయితేనేం ఆఫ్ సైడ్‌లో అదిరిపోయే షాట్లతో ‘గాఢ్ ఆఫ్ ది ఆఫ్‌సైడ్ క్రికెట్’ ట్యాగ్‌లైన్ దక్కించుకున్నాడు సౌరవ్ గంగూలీ. ఫియర్లెస్ బ్యాట్స్‌మన్‌గా.. దేశీవాళీ టోర్నీల్లో రాణించిన దాదా కెరీర్.. 1992లో విండీస్ మ్యాచ్‌తో మొదలైంది. కానీ, టీం కోసం కూల్ డ్రింక్స్ బాటిళ్లు మోయలేనంటూ వాదించి వేటుకు గురయ్యాడనే ఒక ప్రచారం ఇప్పటికీ వినిపిస్తుంటుంది(ఆ ప్రచారాన్ని దాదా కొట్టిపడేస్తుంటాడు). 1993-94, 94-95, 95-96 సీజన్లలో రంజీ, దులీప్ ట్రోఫీల్లో రాణించాడు గంగూలీ. ఆ పర్ఫార్మెన్స్ అతన్ని ఇంగ్లండ్ టూర్‌కి ఎంపిక చేయించింది. ఆ టూర్లో ఒకే ఒక్క వన్డే ఆడి.. డ్రెస్సింగ్ రూంకే పరిమితమయ్యాడు. అయితే సిద్ధూ వివాదాస్పద నిషష్క్రమణ తర్వాత ఆ ప్లేస్‌లో గంగూలీ టెస్ట్ మ్యాచ్‌లకు ఆడాడు. లార్డ్స్‌లో డెబ్యూలోనే గంగూలీ బాదిన శతకం ఒక తీపి గుర్తుగా ఉండిపోయింది. ఆ తర్వాత ఫియర్లెస్ బ్యాట్స్‌మ్యాన్‌గా గంగూలీ శకం నిర్విరామంగా కొనసాగింది. సచిన్, ద్రవిడ్, లక్క్ష్మణ్లాంటి సీనియర్లతో భాగస్వామిగా పరుగులు రాబట్టాడు గంగూలీ. కెప్టెన్‌గా భేష్, ఆటగాడిగా.. ఆటగాడిగా అద్భుత ప్రదర్శన గంగూలీకి పగ్గాలు అప్పజెప్పేలా చేసింది. అయితే కెప్టెన్‌గా సమర్థతను నిరూపించుకున్న గంగూలీ.. ఆటగాడిగా మాత్రం మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. ఇక కోచ్‌గా గ్రెగ్ ఛాపెల్ ఎంట్రీ.. వివాదాలతో దాదా ఆట తీరు దాదాపుగా మసకబారిపోయింది. చివరికి.. పూర్ ప్లేయర్‌గా కెప్టెన్సీకి.. ఆపై ఆటకు దూరం కావాల్సి వచ్చింది. అయితే కెప్టెన్‌గా గంగూలీ తీసుకున్న కొన్ని సొంత నిర్ణయాలు మాత్రం.. టీమిండియా స్థితిగతుల్ని మలుపు తిప్పాయనే చెప్పొచ్చు. ద్రవిడ్ ప్లేస్‌లో లక్క్ష్మణ్.. అయితే 2001 ఈడెన్ గార్డెన్ టెస్ట్‌లో ఫాలో ఆన్‌తో గడ్డు స్థితి ఉన్న టైంలో ద్రవిడ్‌కు బదులు లక్క్ష్మణ్ను నెంబర్ 3 పొజిషన్లో పంపడంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ, ఆ నిర్ణయం ఎలాంటి క్లాసిక్ విక్టరీని అందించిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. 281 పరుగులతో లక్క్ష్మణ్ రాణించగా. చివరిరోజు బంతితో మ్యాచ్‌ను మలుపు తిప్పి అద్భుత విజయాన్ని అందించాడు హర్భజన్. తద్వారా కంగారుల పదహారు వరుస టెస్ట్ విజయాల పరంపరకు బ్రేక్ వేసింది గంగూలీ నేతృత్వంలోని టీమిండియా. ఈ విజయమే ఒకరకంగా తన కెరీర్‌ను నిలబెట్టిందని చాలాసార్లు గుర్తు చేసుకుంటాడు దాదా. ఇక వీరేంద్ర సెహ్వాగ్‌కు విధ్వంసకర బ్యాట్స్‌మ్యాన్‌గా గుర్తింపు ఉందన్నది తెలిసిందే. కానీ, తొలినాళ్లలో ఆరో నెంబర్ పొజిషన్లో బ్యాటింగ్ చేసేవాడు వీరూ. అంతెందుకు సౌతాఫ్రికా టెస్ట్ డెబ్యూలోనూ ఆరో నెంబర్ పొజిషన్లో బ్యాటింగ్సెంచరీ బాదాడు. అయితే డ్యాషింగ్ ఓపెనర్ అవసరమన్న ఉద్దేశంతో అప్పటి నుంచి వీరూని ఓపెనింగ్‌లో దించడం స్టార్ట్ చేశాడు గంగూలీ. ద్రవిడ్ వికెట్ కీపర్‌గా.. గంగూలీ బ్యాట్స్‌మ్యాన్ మాత్రమే కాదు.. అప్పుడప్పుడు మీడియం పేస్ బౌలింగ్‌తో అలరించేవాడు కూడా. ఇక నయన్ మోంగియా శకం ముగిశాక.. టీమిండియాకు ఫిక్స్డ్ వికెట్ కీపర్ సమస్య ఎదురైంది. ఆ టైంలో ఎందరినో కీపర్లుగా మార్చాడు గంగూలీ. కానీ, చివరాఖరికి ద్రవిడ్‌ను ఒప్పించి.. వికెట్ల వెనుకాల కూడా వాల్‌గా నిలబెట్టాడు. అంతేకాదు 2002-2004 మధ్య ద్రవిడ్‌ను 5 నెంబర్ పొజిషన్లో పంపి.. వన్డేలోనూ మంచి ఫలితాలను రాబట్టాడు గంగూలీ. చివరికి ధోనీని 3 స్థానంలో పంపడం, ఆ స్థానంలోనే వైజాగ్ వన్డేలో 148 పరుగులు బాదడం ఎవరూ మరచిపోలేరు. పెద్దన్నగా.. యువ టీంలో విజయపు కాంక్ష 2000 సంవత్సరం నుంచి మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు క్రికెట్‌ను కమ్మేశాయి. అలాంటి కష్ట కాలంలో టీమిండియాను బలోపేతం చేసి.. జట్టుకు వైభవం తెచ్చింది దాదానే. ముఖ్యంగా యువ ఆటగాళ్లను ప్రోత్సహించి విజయ కాంక్షను రగిలించి ‘పెద్దన్నయ్య’(దాదా)గా నిలిచాడు. వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, ఎంఎస్ ధోనీ.. ఇలా దాదా నాయకత్వంలో పేరు తెచ్చుకున్న వాళ్లే. అంతేకాదు యువ టీంలో విదేశీ గడ్డ ఓటమి అనే భయాన్ని పొగొట్టి.. సమర్థవంతంగా జట్టును నడిపించిన ఘనత కూడా దాదాదే. -
'దాదా అభిరుచి, ఉద్దేశం కొందరికే అర్థమవుతాయి'
ముంబై: టీమిండియా మాజీ ఆటగాడు, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేడు 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్లతో పాటు క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్‌లు తమదైన శైలిలో దాదాకు శుభాకాంక్షలు చెప్పడం వైరల్‌గా మారింది. '' గంగూలీ బాయి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. నీ జీవితంలో ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని.. ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. రాబోయే రోజులు అంతా మంచే జరగాలి. హ్యాపీ బర్త్‌డే దాదా'' అంటూ ట్వీట్ చేశాడు. కాగా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గంగూలీకి విషెస్ చెబుతూ.. ''దాదాకున్న అభిరుచిని, ఉద్దేశాలను కొద్ది మంది మాత్రమే అర్థం చేసుకోగలరు. అలాంటి వారిలో నేను ఒకడిని.. హ్యాపీ బర్త్‌డే దాదా.. '' అంటూ ట్వీట్ చేశాడు. ఇక సౌరవ్ గంగూలీ క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. 1992లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే మొదట్లో కొంచెం అగ్రెసివ్‌గా కనిపించిన గంగూలీ ఎక్కువకాలం జట్టులో ఉండలేకపోయాడు. ఆ తర్వాత 1996లో టీమిండియా ఇంగ్లండ్ పర్యటన గంగూలీ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆ సిరీస్‌లో టీమిండియా విఫలమైనా గంగూలీ మాత్రం సక్సెస్ అయ్యాడు. అప్పటి మూడు టెస్టుల సిరీస్‌లో రెండు వరుస టెస్టుల్లో సెంచరీలతో మెరిశాడు. కాగా లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో అరంగేట్రం చేసిన గంగూలీ 131 పరుగులు చేసి టీమిండియా నుంచి లార్డ్స్‌లో డెబ్యూలోనే అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్‌గా డెబ్యూ మ్యాచ్‌లోనే సెంచరీ అందుకున్న మూడో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. కాగా 1999 ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో దాదా సుడిగాలి ఇన్నింగ్స్‌ను ఎవరు మర్చిపోలేరు. 158 బంతుల్లో 183 పరుగులు చేసిన గంగూలీ ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి. రాహుల్ ద్రవిడ్‌తో కలిసి రెండో వికెట్‌కు 315 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం ఇప్పటికి రికార్డుగా ఉంది. ఒక వరల్డ్‌కప్‌లో ఒక వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు కావడం ఒక విశేషం అయితే.. ఓవరాల్‌గా వన్డే చరిత్రలో రెండో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్య పరుగుల రికార్డు జాబితాలో రెండో స్థానంలో ఉంది. 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం అనంతరం సౌరవ్ గంగూలీ టీమిండియాకు కెప్టెన్ అయ్యాడు. గంగూలీ కెప్టెన్‌గా వచ్చిన తర్వాత టీమిండియాలో దూకుడు పెరిగింది. 2001లో ఆసీస్ భారత పర్యటన నేపథ్యంలో గంగూలీ నేతృత్వంలోని టీమిండియా టెస్టు సిరీస్‌ను ఓటమితో ప్రారంభించినా ఆ తర్వాత ద్రవిడ్, లక్ష్మణ్, హర్బజన్‌ల రాణింపుతో అనూహ్యంగా 2-1 తేడాతో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకొని ఆసీస్ వరుస 16 టెస్టు విజయాల రికార్డుకు బ్రేక్ వేసింది. ఆ తర్వాత 2002 నాట్‌వెస్ట్ సిరీస్ సందర్భంగా లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో యువరాజ్, కైఫ్‌ల అద్భుత ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌పై చారిత్రక విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో లార్డ్స్ బాల్కనీలో ఉన్న గంగూలీ తన చొక్కా విప్పి గిరాగిరా తిప్పడం ఇప్పటికి అభిమానుల గుండెల్లో పదిలంగా ఉంది. ఇక దక్షిణాఫ్రికాలో జరిగిన 2003 ప్రపంచకప్‌లో గంగూలీ సేన ఎవరు ఊహించని రీతిలో ఫైనల్‌కు చేరింది. కానీ ఆసీస్‌తో జరిగిన తుది పోరులో ఆఖరిమెట్టుపై బోల్తా కొట్టింది. టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియాకు టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిపెట్టిన ఘనత అందుకున్న గంగూలీ ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆశిద్దాం. కాగా టీమిండియా తరపున గంగూలీ 311 వన్డేల్లో 11,363 పరుగులు, 113 టెస్టుల్లో 7,212 పరుగులు చేయగా.. ఇందులో వన్డేల్లో 22 సెంచరీలు, టెస్టుల్లో 16 సెంచరీలు ఉన్నాయి. Dada ko Janamdin ki bahut badhai. The only time he blinked his eye was when dancing down the track while hitting spinners for a 6, varna never. Eternally grateful for his support in initial days. #HappyBirthdayDada pic.twitter.com/U7k0Q9paJI — Virender Sehwag (@virendersehwag) July 8, 2020 Many more happy returns of the day @SGanguly99 . May you be gifted with life’s biggest joys and never-ending bliss. Wishing you a great year ahead. #HappyBirthdayDada pic.twitter.com/O2SXZjHaMp — VVS Laxman (@VVSLaxman281) July 8, 2021 -
ఈ హైదరాబాదీ భవిష్యత్తులో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తాడు..
హైదరాబాద్: టీమిండియా యువ పేసర్, హైదరాబాద్ స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ భవిష్యత్తులో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తాడని భారత దిగ్గజ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ జోస్యం చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో రాణించడానికి కావాల్సిన రెండు లక్షణాలు అతనిలో పుష్కలంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంగ్లండ్ పర్యటనలో జట్టులో సీనియర్ పేసర్లు ఉండడంతో న్యూజిలాండ్‌తో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్‌లో ఆడే అవకాశం అతనికి వస్తుందో లేదోనని అనుమానాన్ని వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్లో సిరాజ్ అద్భుతంగా రాణిస్తున్నాడని.. దీంతో ప్రపంచవ్యాప్తంగా అతని పేరు కచ్చితంగా మార్మోగుతుందని జోస్యం చెప్పాడు. బంతిని స్వింగ్ చేయడం, సుదీర్ఘంగా బౌలింగ్ చేయడం ఫాస్ట్ బౌలర్‌కు ఉండాల్సిన రెండు లక్షణాలని, ఆ రెండూ సిరాజ్‌లో పుష్కలంగా ఉన్నాయని కితాబునిచ్చాడు. టెస్ట్‌ల్లో ఒకే రోజు మూడు స్పెల్‌లు వేయగల సత్తా సైతం సిరాజ్‌కు ఉందని, అన్ని వేళలా వేగం, కచ్చితత్వంతో బంతులను సంధించడంలో అతను నేర్పరి అని కొనియాడాడు. ప్రస్తతం టీమిండియాలో అద్భుతమైన ఫాస్ట్ బౌలర్లు ఉన్నారని, వారి సహచర్యంలో సిరాజ్ మరింత రాటుదేలుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే అతను ఫిట్‌నెస్‌పై దృష్టి సారించి గాయాల బారిన పడకుండా జాగ్రత్త పడాలని సూచించాడు. కాగా, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు జూన్ 2న ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. చదవండి: ధోని సలహాల వల్ల చాలా మెరుగయ్యాను.. -
టీమిండియా టాపార్డర్‌పై వీవీఎస్ ఘాటు వ్యాఖ్యలు!
పుణే: ఇంగ్లండ్‌తో జరిగిన చివరి వన్డేలో భారత్ కాస్త తడబడినప్పటికీ ఎట్టకేలకు గెలుపొంది, సిరీస్ గెల్చుకున్న విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఆటగాళ్లను ఇంగ్లండ్ స్పినర్లు పెవిలియన్‌కు చేర్చారు. ఈ నేపథ్యంలో స్పినర్లను ఎదుర్కోవడంలో టీమిండియా ఆటగాళ్లు ఇబ్బంది పడటం స్పష్టంగా కనిపించిందని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నారు. ఇది ఒకింతా విస్మయాన్ని గురిచేసిందని తెలిపాడు. సాధారణంగా భారత బ్యాట్స్మెన్లకు స్పిన్నర్లను ఎదుర్కొవడం సులువైన పని అని గుర్తుచేశాడు. స్వదేశంలో స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై భారత ఆటగాళ్ల ఆట తీరును పునః సమీక్షించుకోవాలని వ్యాఖ్యనించాడు. ఈ ధోరణి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించాడు. ఈ మూస పద్ధతికి స్వస్తి పలకాలని వీవీఎస్ హితవు పలికాడు. కాగా, భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, కెప్టెన్ విరాట్ కోహ్లి ఇంగ్లండ్‌తో జరిగిన చివరి వన్డేలో తమ వికెట్లను ఇంగ్లండ్ స్పిన్నర్లు మొయిన్ ఆలీ , అదిల్ రషీద్‌లకు సమర్పించుకున్న విషయం తెలిసిందే. చివరి వన్డేలో ఇంగ్లండ్ బౌలర్లు భారత్‌ను 48.2 ఓవర్లకే కుప్పకుల్చారు. ఇంగ్లండ్ స్పిన్ బౌలర్లు మొయిన్ ఆలీ(1/31), అదిల్ రషీద్(2/81), లివింగ్ స్టోన్(1/20) వికెట్లు తీశారు. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లిని అత్యధికసార్లు ఔట్ చేసిన జాబితాలో మొయిన్ అలీ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ఇక గ్రేమ్ స్వాన్, జేమ్స్ అండర్సన్, బెన్ స్టోక్స్‌లు కోహ్లిని ఎనిమిదిసార్లు ఔట్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లిని అత్యధిక సార్లు ఔట్ చేసింది టిమ్ సౌతీ. చదవండి: ఆ నిర్ణయం చూసి షాక్‌కు గురైన విరాట్ కోహ్లి ! -
నా టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో వీరిద్దరు కచ్చితంగా ఉంటారు!
న్యూఢిల్లీ: మహ్మద్ సిరాజ్.. నటరాజన్.. నవదీప్ సైనీ.. వాషింగ్టన్ సుందర్.. శుభ్‌మన్ గిల్.. ఆస్టేలియా పర్యటన ద్వారా టీమిండియాకు దొరికిన మంచి ఆటగాళ్లు. అరంగేట్రంలోనే అదరగొట్టి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇక ఇప్పుడు ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న సిరీస్ ద్వారా పలువురు భారత క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ రెండో మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేశారు. ఇక వన్డేల విషయానికొస్తే కృనాల్ పాండ్యా(అంతకు ముందే టీ20 ఫార్మాట్లో అడుగుపెట్టాడు), ప్రసిద్ద్ కృష్ణ కూడా తొలి వన్డేతో అరంగేట్రం చేసి పలు రికార్డులు నమోదు చేశారు. విదేశమైనా, స్వదేశమైనా ఆడిన తొలి మ్యాచ్‌లలోనే తమ ప్రభావం చూపిన ఈ ఆటగాళ్లపై మాజీలు నేటికీ ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది చివరలో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్ జట్టు కూర్పు గురించి టీమిండియా టెస్టు స్పెషలిస్టు వీవీఎస్ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘గత కొన్ని రోజులుగా యువ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ సిరీస్‌లో అందివచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ఇషాన్ కిషన్ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ ఆట తీరు కూడా అద్భుతం. టీ20 ప్రపంచకప్‌నకు సంబంధించి నా పదిహేను మంది స్వ్యాడ్‌లో వీరిద్దరికి కచ్చితంగా స్థానం ఉంటుంది. వరల్డ్ కప్ తుదిజట్టులో ఆడేందుకు వారిద్దరికి పూర్తి అర్హత ఉందని భావిస్తున్నాను’’ అని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో ఆడిన తొలి మ్యాచ్‌లో తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన సూర్యకుమార్ మైండ్‌సెట్ తనను ఆశ్చర్యపరిచిందని లక్ష్మణ్ పేర్కొన్నాడు. కాగా రెండో టీ20 ద్వారా అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్, ఆ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకుని ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక నాలుగో టీ20లో 28 బంతుల్లోనే అర్థసెంచరీ పూర్తి చేసి సూర్యకుమార్ అందరిచేతా ప్రశంసలు అందుకున్నాడు. చదవండి: టీ20 వరల్డ్ కప్ విజేత ఆ జట్టే: మైకేల్ వాన్ ఆసీస్ టూర్: సిరాజ్ నుంచి సుందర్ దాకా! -
అందుకు పృథ్వీ షా అర్హుడే.. అయినా వెయిట్ చేయక తప్పదు
హైదరాబాద్: విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారించి, సరికొత్త రికార్డులను సృష్టించిన యువ ఓపెనర్ పృథ్వీషాపై భారత లెజెండరీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. దేశవాళీ వన్డే టోర్నీలో 8 మ్యాచ్‌ల్లో 165.40 సగటుతో 827 పరుగులు సాధించి, తన జట్టును చాంపియన్‌గా నిలిపిన షా నిజమైన మ్యాచ్ విన్నర్ అని.. టీమిండియాలో చోటుకు అతను అర్హుడని ఆకాశానికెత్తాడు. 8 మ్యాచ్‌ల్లో నాలుగు భారీ శతకాలు బాది సెలెక్టర్లకు సవాలు విసిరిన అతను.. జాతీయ జట్టులో స్థానం ఆశించడం సహజమేనని, అయితే అందుకు షా మరికొంతకాలం నిరీక్షించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు. టీమిండియా రిజర్వ్ బెంచ్ బలంగా ఉందని, అందులోనూ ఓపెనింగ్ స్థానం కోసం నలుగురు పోటీలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో షా విఫలం కావడం ప్రతికూలాంశంగా మారిందని, అతని స్థానంలో వచ్చిన శుభ్‌మన్ గిల్ అందివచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకోవడంతో షా క్యూలో వేచిచూడాల్సి వస్తోందని తెలిపారు. షా ప్రస్తుతం గిల్ తర్వాత స్థానంలో ఉన్నాడని, అతనికి కర్ణాటక ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ రూపంలో మరో ముప్పు పొంచి ఉందని అభిప్రాయపడ్డాడు. విజయ్ హజారే టోర్నీలో షాతో పాటు పడిక్కల్ సైతం వరుస శతకాలతో పరుగుల వరద పారించాడని గర్తు చేశాడు. పడిక్కల్.. గత ఐపీఎల్ సీజన్లో సైతం 4 అర్ధశతకాలను సాధించి, సెలక్టర్ల దృష్టిలో పడ్డాడని పేర్కొన్నాడు. ముంబయిని విజేతగా నిలిపిన షా నిజమైన మ్యాచ్ విన్నర్ అని, భారత జట్టులో ఆడే అవకాశం త్వరలోనే అతడి తలుపు తడుతుందని ఆయన జోస్యం చెప్పాడు. చదవండి: నాన్నకు ప్రేమతో.. కృనాల్, హార్ధిక్ ఏం చేశారో తెలుసా..? -
పంత్ వీరవిహారం గిల్‌క్రిస్ట్ విధ్వంసాలను గుర్తు చేసింది..
అహ్మదాబాద్: తనదైన రోజున ప్రత్యర్ధి బౌలర్ల పాలిట సింహస్వప్నంలా నిలిచే టీమిండియా డాషింగ్ వికెట్‌కీపర్ రిషబ్ పంత్‌పై ట్విటర్ వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఫైటింగ్ సెంచరీతో అదరగొట్టిన పంత్.. 116 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో టెస్టుల్లో మూడో సెంచరీని నమోదు చేశాడు. రూట్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి మరీ సెంచరీ పూర్తి చేసిన పంత్.. ఆ వెంటనే (101 పరుగుల వద్ద) అండర్సన్ బౌలింగలో ఔటయ్యాడు. క్లిష్ట సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన పంత్.. మొదట్లో వికెట్ కాపాడుకునే ఉద్దేశంతో నెమ్మదిగా ఆడి హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఆతరువాతే పంత్ విధ్వంసం మొదలైంది. ఇంగ్లండ్ కొత్త బంతిని తీసుకున్న తర్వాత వరుస ఫోర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో టీమిండియా కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. పంత్‌కు వాషింగ్టన్ సుందర్ నుంచి పూర్తి సహకారం లభించింది. సుందర్(117 బంతుల్లో 60 నాటౌట్, 8 ఫోర్లు), పంత్‌లు కలిసి ఏడో వికెట్‌కు 113 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాకు 89 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందించారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. కాగా, పంత్, సుందర్‌ల జోడీ ఇన్నింగ్స్‌ను నిర్మించిన తీరుపై ప్రముఖ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పంత్ దూకుడును, సుందర్ సంయమన్నాని వారు ఆకాశానికెత్తారు. ఒత్తిడిలో నమ్మశక్యంకాని రీతితో బౌలర్లపై విరుచుకుపడి అద్భుతమైన శతకం సాధించిన టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు అభినందనలు. నీ విధ్వంసం మొదటిది కాదు.. అలాగని ఆఖరిది కూడా కాకూడదు.. భవిష్యత్తులో నీ బ్యాటింగ్ ఊచకోత కొనసాగించాలని ఆశిస్తున్నా.. అన్ని ఫార్మాట్లలో ఆల్ టైమ్ బెస్ట్ నువ్వే.. నువ్వు నిజమైన మ్యాచ్ విన్నర్ అంటూ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పంత్‌ను ఆకాశానికెత్తాడు. జట్టుకు అవసరమైనప్పుడు అద్భుతమైన శతకాన్ని సాధించావు.. గతంలో గిల్‌క్రిస్ట్ చేసిన విధ్వంసాలను గుర్తు చేశావంటూ టీమిండియా మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసించారు. యువ క్రికెటర్లు జట్టు బాధ్యతలను భుజానికెత్తుకోవడం సంతోషాన్ని కలిగిస్తోంది.. పంత్ ఊచకోత, సుందర్ నిలకడ ప్రదర్శనకు అభినందనలు.. సుందర్ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావు.. యువ క్రికెటర్లు భవిష్యత్తులో మరింత నిలకడగా ఆడాలని ఆశిస్తున్నా... వీవీఎస్ లక్ష్మణ్ ఆండర్సన్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ చేసి ఫోర్ కొట్టడం, సిక్సర్‌తో శతకాన్ని చేరుకోవడం అత్యద్భుతం..నువ్వే నా నిజమైన వారసుడివి.. సెహ్వాగ్ అసాధారణ ప్రతిభ కలిగిన పంత్.. అసాధారణ శతకాన్ని పూర్తి చేశాడు.. అభినందనలు.. టామ్ మూడీ -
శుభ్‌మన్ గిల్‌కు వీవీఎస్ లక్ష్మణ్ వార్నింగ్!
అహ్మదాబాద్: టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్ గురువారం నుంచి మొదలైన నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఆసీస్ పర్యటనలో అర్థసెంచరీలతో అలరించిన గిల్ స్వదేశీ గడ్డపై మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. సిరీస్ మొత్తంలో మొదటి టెస్టులో హాఫ్ సెంచరీ సాధించిన గిల్.. ఆ తర్వాత ఒక్క ఇన్నింగ్స్‌లోనూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్(0, 14, 11,15*,0) ఆడలేదు. ఇందులో రెండు సార్లు సున్నా పరుగులకే వెనుదిరిగాడు. తాజాగా గిల్ ప్రదర్శనపై టీమిండియా మాజీ ఆటగాడు వివిఎస్ లక్క్ష్మణ్ గిల్ ఆటతీరుపై స్పందించాడు. ''గిల్ ఆటతీరులో ఏదో టెక్నికల్ సమస్య ఉంది. ఆసీస్ పర్యటనలో అర్థ సెంచరీలతో ఆకట్టుకున్న అతను స్వదేశంలో మాత్రం వరుసగా విఫలమవుతున్నాడు. మొదటి రెండు టెస్టులు జరిగిన చెన్నై వేదికతో పోలిస్తే అహ్మదాబాద్ పిచ్ ఫ్లాట్‌గా ఉంది. కొద్దిసేపు ఓపికను ప్రదర్శిస్తే మంచి స్కోరు నమోదు చేసే అవకాశం ఉంది. గిల్ ఇన్నింగ్స్‌లను మంచి దృక్పథంతో ఆరంభిస్తున్నా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. ఈ సమస్యను అధిగమించకుంటే గిల్‌కు తర్వాతి మ్యాచ్‌ల్లో కష్టమవుతుంది. ఎందుకంటే గిల్ విఫలమైతే మాత్రం అతని స్థానంలో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లు జట్టులోకి వచ్చే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.'' అంటూ తెలిపారు. కాగా నాలుగో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌట్ కాగా.. అక్షర్ పటేల్ 4 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లతో సత్తా చాటగా.. సిరాజ్ రెండు వికెట్లు తీశాడు. ప్రస్తుతం టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది. చదవండి: పంత్ ట్రోలింగ్.. వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ కోహ్లి ప్రవర్తన నాకు చిన్న పిల్లాడిలా అనిపించింది -
'అతనొక రాక్‌స్టార్.. బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్'
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై భారత మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, ఆకాశ్ చోప్రాలు ప్రశంసల వర్షం కురిపించారు. అశ్విన్ అత్యుత్తమ ఆటగాడని, రాక్ స్టార్ అని, బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నరని కొనియాడాడు. టీమిండియా సొగసరి బ్యాట్స్‌మెన్‌గా ప్రఖ్యాతి గాంచిన వీవీఎస్ లక్ష్మణ్.. అశ్విన్ ప్రదర్శనను ఆకాశానికెత్తాడు. అశ్విన్ చాలా తెలివైన ఆటగాడని, నైపుణ్యంతో పాటు సరైన ప్రణాళిక కలిగి ఉంటాడని మెచ్చుకున్నాడు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఆటగాళ్లు కేవలం నైపుణ్యంపైనే ఆధారపడకుండా సరైన ప్రణాళికలు కలిగి ఉండాలని.. అది అశ్విన్‌కు బాగా తెలుసునని కితాబునిచ్చాడు. అశ్విన్ బ్యాట్స్‌మెన్ బలహీనతలను కనిపెట్టి, వాటిపై సుదీర్ఘ సాధన చేస్తాడన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో స్టీవ్‌స్మిత్‌ను ఈ ప్లాన్ ప్రకారమే బోల్తా కొట్టించాడని గర్తు చేశారు. మరో భారత మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. అశ్విన్ రాక్‌స్టార్ అని, అతను టీమిండియా బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నరని కొనియాడాడు. టీమిండియా ఆల్‌టైమ్ గ్రేట్ స్పిన్నర్ కుంబ్లేనే అయినప్పటికీ.. అశ్విన్ అతనికి ఏమాత్రం తీసిపోడని, ఇందుకు అతని గణాంకాలే( 77 టెస్టుల్లోనే 400 వికెట్లు) నిదర్శనమన్నాడు. అతనిపై వచ్చిన విమర్శలకు బంతితో బదులిస్తున్న విధానం చూస్తే అతనో రాక్ స్టార్లా కనిపిస్తాడన్నాడు. ఇటీవల కాలంలో అతని ప్రదర్శనలు చూస్తే.. బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్ అనక తప్పదన్నారు. -
'ముందు మీ కమిట్మెంట్ చూపించండి'
చెన్నై: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓపెనర్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ అజింక్య రహానేలు విఫలమైన సంగతి తెలిసిందే. రోహిత్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 6,12 పరుగులు చేయగా.. రహానే 1, 0 పరుగులతో పూర్తిగా తేలిపోయాడు. ఈ నేపథ్యంలో వారిద్దరు ఆటతీరు తనను తీవ్రంగా నిరాశపరిచిందని టీమిండియా మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. లక్ష్మణ్ మాట్లాడుతూ..' ఫిబ్రవరి 13 నుంచి జరగనున్న రెండో టెస్టులోనైనా రోహిత్ శర్మ, అజింక్య రహానేల నుంచి మంచి కమిట్మెంట్ను చూడాలనుకుంటున్నా. ఈ ఇద్దరూ మ్యాచ్‌ని గెలిపించాలి లేదా కాపాడాలని కోరుకుంటున్నా. తొలి టెస్టులో రహానెలో నాకు ఏమాత్రం పోరాట పటిమ కనబర్చలేదు. అండర్సన్ బంతి నుంచి రివర్స్ స్వింగ్ రాబడుతున్నాడని తెలిసినా.. ఏమాత్రం ఫుట్‌వర్క్ లేకుండా బంతిని ఎదుర్కొని రహానే బౌల్డయ్యాడు. స్పిన్నర్ జాక్ లీచ్ బౌలింగ్‌ను అంచనా వేయలేక రోహిత్ శర్మ ఆఫ్ స్టంప్‌ని వదిలేయడంతో క్లీన్‌బౌల్డయ్యాడు. రెండో టెస్టులో ఇద్దరూ జాగ్రత్తగా ఆడాలని' లక్ష్మణ్ సూచించాడు. ఇక తొలి టెస్టులో టీమిండియా 227 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. కాగా రెండో టెస్టులో షాబాజ్ నదీమ్ స్థానంలో అక్షర్ పటేల్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. చదవండి: రెండో టెస్టుకు ఇంగ్లండ్ కీలక బౌలర్ దూరం 'కోహ్లి కెప్టెన్సీ అంటే చాలా ఇష్టం' -
కన్నీళ్లు ఆగలేదు: వీవీఎస్ లక్ష్మణ్
హైదరాబాద్: ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన ఆఖరి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించగానే అభిమానుల గుండెలు సంతోషంతో ఉప్పొంగిపోయాయి. డ్రా చేయడం కూడా అసాధ్యమే అనుకున్న గబ్బా మైదానంలో భారత జట్టు విజయఢంకా మోగించడంతో సామాన్యులు మొదలు రాజకీయ, సినీ, వ్యాపార రంగ ప్రముఖుల ట్వీట్లతో సోషల్ మీడియా మోత మోగింది. దేశం మొత్తం భావోద్వేగానికి లోనైన చిరస్మరణీయ విజయం అది. అందరిలాగే తాను కూడా బ్రిస్బేన్ టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించగానే ఉద్వేగానికి గురయ్యాయని తెలిపాడు టెస్టు స్పెషలిస్టు వీవీఎస్ లక్ష్మణ్. శుభవార్త తెలియగానే తన కళ్లల్లో నీళ్లు తిరిగాయని పేర్కొన్నాడు.(చదవండి: ఇంగ్లండ్ ఒక్క టెస్ట్ కూడా గెలువలేదు: గంభీర్) తాజాగా స్పోర్ట్స్ టుడేతో మాట్లాడిన లక్ష్మణ్.. ‘‘బ్రిస్బేన్ టెస్టు ఆఖరి రోజు మ్యాచ్‌ను కుటుంబంతో కలిసి వీక్షించాను. రిషభ్, వాషింగ్టన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో టెన్షన్ తారస్థాయికి చేరింది. ఎలాగైనా సరే ఇండియా ఆసీస్‌తో టెస్టు సిరీస్ గెలవాలని బలంగా కోరుకున్నా. ముఖ్యంగా అడిలైడ్ పరాభవానికి బదులు తీర్చుకోవాలని భావించా. అంతేకాదు గబ్బా టెస్టుకు ముందు, బ్రిస్బేన్‌లో ఆడేందుకు ఇండియన్స్ భయపడతారంటూ కామెంట్లు వినిపించాయి. అయితే ఎక్కడైతే ఆసీస్‌కు మంచి రికార్డు ఉందో అక్కడే టీమిండియా అద్భుత విజయం సొంతం చేసుకుంది. అప్పుడు నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. సంతోషంతో కన్నీళ్లు వచ్చాయి’’ అని గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.(చదవండి: ఆసీస్ టూర్: అరంగేట్రంలోనే అదరగొట్టేశారు!) ఇక ఆసీస్ టూర్లో లభించిన అవకాశం సద్వినియోగం చేసుకున్న తమిళనాడు బౌలర్ నటరాజన్‌పై వీవీఎస్ ప్రశంసలు కురిపించాడు. ‘‘మంచివాళ్లకు మంచే జరుగుతుంది. నటరాజన్ అన్ని రకాల ప్రశంసలకు అర్హుడు. అవకాశం కోసం నట్టూ ఎంతో ఓపికగా ఎదురుచూశాడు. మానసిక స్థైర్యంతో ముందుకు సాగాడు. బలమైన ప్రత్యర్థి జట్టుపై విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించి తానేంటో నిరూపించుకున్నాడు’’ అని కొనియాడాడు. కాగా నెట్‌బౌలర్‌గా ఆస్ట్రేలియాకు వెళ్లిన నటరాజన్.. మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేశాడు. మొత్తంగా 11(వన్డేలు-2, టీ20-6, టెస్టు-3) వికెట్లు తీశాడు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో లక్ష్మణ్ మెంటార్‌గా వ్యవహరిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున నటరాజన్ మైదానంలో దిగిన సంగతి తెలిసిందే. -
'కోహ్లి వేగం మధ్యలోనే ఆగిపోతుందనుకున్నా'
ముంబై : ఆసీస్‌తో జరిగిన మూడో వన్డే ద్వారా వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు మాజీ క్రికెటర్లు కోహ్లిపై ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు.. టెస్ట్ స్పెషలిస్ట్ వివిఎస్ లక్ష్మణ్ కోహ్లి సాధించిన రికార్డుపై శుభాకాంక్షలు తెలుపుతూ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. 'నాకు తెలిసినంతవరకు ఒక ఆటగాడు ఇన్నేళ్ల కెరీర్లో ఒకే ఇంటన్సిటీతో పరుగులు సాధించడమనేది ఇప్పుడే చూస్తున్నా. అది విరాట్ కోహ్లి కావడం ఇక్కడ గర్వించదగ్గాల్సిన విషయం. కోహ్లి కెరీర్ మొదట్లో తాను ఆడిన తీరు గమనిస్తే.. వేగంగా పరుగులు చేయడానికే బరిలోకి దిగినట్లు కనిపించేవాడు. కెరీర్ ఆరంభం కాబట్టి అలా ఉండడం సహజం... కెరీర్ సాగుతున్న అతని వేగం ఆగిపోతుందని భావించా... కానీ అలా జరగలేదు. ఇన్నేళ్ల కెరీర్లో ఒక్కసారి కూడా అతని ఎనర్జీ లెవెల్స్‌లో డ్రాప్ కనిపించకపోవడం విశేషం.(చదవండి : పాపం కోహ్లి.. మూడు సార్లు అతని బౌలింగ్‌లోనే) అది బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా ఏదైనా సరే పాదరసంలా కదులుతుంటాడు. కోహ్లి చేసిన 42 సెంచరీల్లో 26 సెంచరీలు చేజింగ్‌లో రావడం గొప్ప విషయంగా చెప్పవచ్చు. సాధారణంగా చేజింగ్‌లో పెద్ద స్కోరు ఉంటే బ్యాట్స్‌మెన్ ఒత్తిడికి లోనవుతుంటాడు. కోహ్లి విషయంలో మాత్రం ఇది వర్తించదు. ఎంత ఎక్కువ ఒత్తిడి ఉంటే అంత బాగా ఆడడం కోహ్లికున్న ప్రత్యేకం అని చెప్పొచ్చు. 'అని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. కాగా కోహ్లి ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో 23 పరుగుల వద్ద ఉన్నప్పుడు 12వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ నేపథ్యంలోనే సచిన్ రికార్డును బద్దలుకొట్టాడు. సచిన్ 12వేల పరుగుల మైలురాయిని చేరుకోవడానికి 309 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. కోహ్లి మాత్రం 242 ఇన్నింగ్స్‌లు మాత్రమే తీసుకున్నాడు. కాగా ఓవరాల్‌గా కోహ్లి కెరీర్లో 251 మ్యాచ్‌ల్లో 12040, 86 టెస్టుల్లో 7240, 82 టీ20ల్లో 2794 పరుగులు సాధించాడు. -
మనీశ్ పాండే ఎంతో కీలకం
దుబాయ్: ఐపీఎల్ గత సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మెరుగైన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ చేరింది. అయితే ఎక్కువ భాగం విజయాలు ఓపెనర్లు వార్నర్, బెయిర్ స్టో జోరు కారణంగానే వచ్చాయి. వీరిద్దరి దూకుడుతో తర్వాతి బ్యాట్స్‌మెన్‌ను ఎక్కువగా అవకాశం రాలేదు. దాంతో కీలక సమయంలో ఒత్తిడికి గురై జట్టు విఫలమైంది. అయితే ఈ సారి లీగ్‌లో ఆ లోపాన్ని అధిగమిస్తామని టీమ్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్. అన్నాడు. సీనియర్లు, కుర్రాళ్లతో జట్టు సమతూకంగా ఉందని చెప్పాడు. వివిధ అంశాలపై లక్ష్మణ్ చెప్పిన సమాధానాలు అతని మాటల్లోనే... కోవిడ్–19 నేపథ్యంలోని పరిస్థితులపై... బీసీసీఐతో పాటు మా ఫ్రాంచైజీ కూడా రూపొందించిన బయో సెక్యూర్ బబుల్ నిబంధనలు సరైన దిశలో ఉన్నాయి. వాటిని మేమందరం కచ్చితంగా పాటిస్తున్నాం. రిసార్ట్ ఉద్యోగులు, డ్రైవర్ కూడా బబుల్‌లో భాగమే. ఏం చేయాలో, ఏం చేయకూడదో ఆటగాళ్లకు స్పష్టత ఉంది. ఐదు రోజులకు ఒకసారి కరోనా పరీక్షలకు హాజరవుతున్నాం. ట్రాకర్ కూడా అందరం ధరిస్తున్నాం. అంతకు ముందు భారత్‌నుంచి కూడా చార్టెట్ ఫ్లయిట్లోనే భారత ఆటగాళ్లంతా కలిసి వచ్చారు. నిబంధనల ప్రకారమే పరీక్షలకు హాజరయ్యాం. ఇక్కడకి వచ్చాక భోజనం కోసం గానీ ఇతర పనుల కోసం కానీ ఎవరూ ఎవరినీ కలవలేదు. అందరూ నెగిటివ్‌గా తేలిన తర్వాత కూడా అన్ని జాగ్రత్తల మధ్య ప్రాక్టీస్ సెషన్లు మొదలయ్యాయి. ఎల్లకాలం బబుల్‌లోనే ఉండటం కొంత కష్టమే అయినా తప్పదు. (చదవండి: వామ్మో రోహిత్.. ఇంత కసి ఉందా!) సన్‌రైజర్స్ జట్టు లోపాలపై... గత ఏడాది టాప్–4లో నిలిచాం. వార్నర్, బెయిర్ స్టో చాలా బాగా ఆడారు. అయితే అదే చివరకు మిడిలార్డర్‌కు తగినంత అవకాశం రాకుండా చేసింది. వారు తిరిగి వెళ్లిపోగానే జట్టు బలహీనంగా కనిపించింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే వేలానికి వెళ్లాం. దేశవాళీ క్రికెట్లో ప్రతిభావంతులైన కుర్రాళ్లను ఎంపిక చేసుకున్నాం. ప్రియమ్ గార్గ్, సమద్, విరాట్ సింగ్, సందీప్, సంజయ్ యాదవ్‌లు సత్తా చాటుతారనే నమ్మకం ఉంది. ఈ సారి సీనియర్ మనీశ్ పాండేపై బాధ్యత మరింత పెరిగింది. అతనూ ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. పాండేకు తోడుగా విజయ్ శంకర్ మిడిలార్డర్లో ఉన్నాడు. అలాగే విదేశీయుల్లో నబీ, ఫాబియాన్, మార్‡్ష తమ స్థాయికి తగినట్లు ఆడితే మాకు తిరుగుండదు. అన్నింటికి మించి కేన్ విలియమ్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. తన నాయకత్వ లక్షణాలతో అతను టీమ్‌కు అదనపు బలం. ఈ సారి కూడా కేన్ కీలక పాత్ర పోషిస్తాడు. మొత్తంగా సీనియర్లు, జూనియర్ల కలయికతో టీమ్ చాలా బాగుంది. కొత్త కోచింగ్ బృందంపై... ఈ ఏడాది ట్రెవర్ బెలిస్ కోచ్‌గా వచ్చారు. ఆయనతో కలిసి పని చేయడం చాలా బాగుంది. ఐపీఎల్లో కోల్‌కతాకు టైటిల్ అందించిన ఆయన ఇంగ్లండ్‌కు విశ్వ విజేతగా నిలిపారు. ఆటగాళ్లను బెలిస్ సన్నద్ధం చేస్తున్న తీరు అభినందనీయం. అసిస్టెంట్ కోచ్ బ్రాడ్ హాడిన్‌తో కూడా మంచి అనుబంధం ఉంది. సుదీర్ఘ కాలంగా హాడిన్ నాకు తెలుసు. వీరంతా జట్టును గొప్పగా తీర్చి దిద్దుతుండటం చూస్తే సంతోషంగా అనిపిస్తోంది. ప్రేక్షకులు లేకపోవడం... బయటి అంశాల అవసరం లేకుండా తమంతట తాము స్ఫూర్తి పొందడం అగ్రశ్రేణి ఆటగాళ్ల లక్షణం. స్టేడియంలో ప్రేక్షకుల వల్ల ఉత్సాహం పెరుగుతుందనేది వాస్తవమే అయినా...గొప్ప ఆటగాళ్లు పరిస్థితులకు తొందరగా అలవాటు పడతారు కూడా. ఇంగ్లండ్‌లో కూడా ఆటగాళ్లంతా ఇటీవలి సిరీస్‌లలో అభిమానులు లేకుండానే బాగా ఆడగలమని నిరూపించారు. ఎదురుగా కనిపించకపోయినా తమను లక్షలాది మంది వీక్షిస్తున్నారనే విషయం వారికి కూడా తెలుసు. ప్రేక్షకులు లేరనే కారణంగా ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీ స్థాయి, నాణ్యత తగ్గవు. అయినా ఇంత సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలోకి దిగడమే ఆటగాళ్లకు ఎంతో ఆనందంగా అనిపిస్తోంది. వారంతా ఎప్పుడెప్పుడు ఆడదామా అని ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. -
ప్రేక్షకులు లేకున్నా... ఆట నాణ్యత మారదు
దుబాయ్: ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ జరిగినంత మాత్రాన క్రికెట్ నాణ్యత తగ్గిపోదని భారత దిగ్గజ బ్యాట్స్‌మన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) బ్యాటింగ్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. ‘నేను అభిమానులందరికీ హామీ ఇస్తున్నా. మైదానంలో ప్రేక్షకులు లేనప్పటికీ క్రికెట్ నాణ్యతలో ఎలాంటి మార్పూ ఉండబోదు. ముందులాగే ఈ ఐపీఎల్ కూడా మీ అందర్నీ అలరిస్తుందనే నమ్మకముంది’ అని లక్ష్మణ్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. కరోనా కారణంగా యూఏఈకి తరలిపోయిన ఐపీఎల్ దుబాయ్, షార్జా, అబుదాబి వేదికల్లో సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు జరుగనుంది. ఈ నేపథ్యంలో అక్కడి పిచ్‌ల స్వభావంపై లక్ష్మణ్ కాస్త ఆందోళన వ్యక్తం చేశాడు. ఎస్ఆర్హెచ్కు కొత్తగా నియమితులైన హెడ్ కోచ్ ట్రెవర్ బేలిస్, అసిస్టెంట్ కోచ్ బ్రాడ్ హాడిన్‌ల ఆధ్వర్యంలో జట్టు మరింత ఉన్నతి సాధిస్తుందని లక్ష్మణ్ అన్నాడు. -
‘4 వేల ఓవర్లు వేసిన నేనే బిత్తరపోయాను’
సౌతాంప్టన్: దాదాపు 19 ఏళ్ల నాటి ఈడెన్ గార్డెన్ టెస్టు మ్యాచ్‌ను ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ మరోసారి గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌ల ఊచకోతకు తాము ఎంతలా గురయ్యామో వివరించాడు. ఆ మ్యాచ్ తమ చేతుల్లో ఉందనే భావిస్తే, దాన్ని ద్రవిడ్, లక్ష్మణ్‌లు తమ బ్యాటింగ్‌తో వారి చేతుల్లోకి తీసుకుపోవడం ఇప్పటికీ ఒక కలగానే ఉందన్నాడు. వారిద్దరి దెబ్బకు అంతర్జాతీయ క్రికెట్లో అప్పటికే నాలుగు వేల ఓవర్లు పూర్తి చేసిన తనకు మతిభ్రమించిందన్నాడు. సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లండ్-పాకిస్తాన్ల జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు సందర్భంగా వార్న్.. 2001 కోల్‌కతా టెస్టును నెమరువేసుకున్నాడు. (చదవండి: ఫ్రీబాల్‌కు పట్టుబడుతున్న అశ్విన్!) ‘నాకు బాగా గుర్తు. నేను స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్నా. ద్రవిడ్, లక్ష్మణ్‌ల దాటికి చేసేది లేక నా పక్కనే ఉన్న ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో మూవీస్ గురించి చర్చించడం మొదలుపెట్టా. మేము క్యాప్‌లు కూడా మార్చుకున్నాం. ఏమి చేయాలో తెలియక ప్రతీది యత్నించాం. వారి గురించి ఆలోచన పక్కకు పెట్టడానికి నా ఫేవరెట్ సాంగ్‌లు కూడా పాడా. మొత్తంగా మాకు ఒక మతిభ్రమించినట్లు చేశారు ద్రవిడ్, లక్ష్మణ్‌లు. వారు చాలా అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడారు. నేను ఆడుతున్న సమయంలో వారిద్దరూ ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికీ చిరస్మరణీయమే. ఇక్కడ లక్ష్మణ్ ఇన్నింగ్స్ చాలా స్పెషల్. ద్రవిడ్ కూడా అసాధారణ ఆటను కనబరిచాడు. కొన్నిసార్లు మీరు దేవుడనే చెప్పాలి’ అని వార్న్ తెలిపాడు. ఆసీస్‌తో జరిగిన ఆ టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో లక్ష్మణ్ 281 పరుగుల సాధిస్తే, ద్రవిడ్ 180 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి 376 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్సి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేయగా, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకు ఆలౌటైంది. దాంతో భారత్ ఫాలో ఆన్ ఆడింది. భారత్ ఫాలో ఆన్ ఆడుతూనే ద్రవిడ్-లక్ష్మణ్‌ల అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆసీస్‌కు సవాల్ విసిరింది. భారత్ నిర్దేశించిన 384 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ 212 పరుగులకే ఆలౌటైంది. దాంతో భారత్ 171 పరుగుల తేడాతో విజయం చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు చేసింది. ఆ మ్యాచ్‌లో ఆసీస్ ఇన్నింగ్స్ తేడాతో గెలుస్తుందనుకుంటే లక్ష్మణ్-ద్రవిడ్‌ల దెబ్బకు ఘోర ఓటమి చవిచూడాల్సి వచ్చింది. (చదవండి: ‘తప్పు చేశాం.. వరల్డ్‌కప్ చేజార్చుకున్నాం’) -
ధోని కంటతడి పెట్టాడు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న భారత మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనితో తన ప్రత్యేక అనుబంధాన్ని సహచరుడు, ఆఫ్ స్పిన్నర్ భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గుర్తు చేసుకున్నాడు. తన యూట్యూబ్ చానల్ ‘రెమినిస్ విత్ యాష్’ ద్వారా మాట్లాడిన అశ్విన్... ధోని టెస్టులనుంచి తప్పుకున్న నాటి జ్ఞాపకాలను పంచుకున్నాడు. టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోజు ధోని రాత్రంతా టీమిండియా జెర్సీ వేసుకునే ఉన్నాడని, బాధతో కంటతడి పెట్టుకున్నాడని తెలిపాడు. ‘2014లో ధోని టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం నాకు గుర్తుంది. నాడు మెల్బోర్న్ టెస్టులో జట్టును గెలిపించేందుకు నేను, ధోని చాలా కష్టపడ్డాం. కానీ ఓటమి పాలయ్యాం. అప్పుడే ధోని స్టంప్ తీసుకుంటూ ఇక నేను ముగించేస్తున్నా అని అన్నాడు.(చదవండి: నాకు సమాధానం తెలుసు.. కానీ: కుంబ్లే) అదో భావోద్వేగ క్షణం. ఆనాటి సాయంత్రం ఇషాంత్, రైనా, నేను ధోని గదిలోనే కూర్చున్నాం. రాత్రంతా టెస్టు జెర్సీలోనే ఉన్న మహీ కంటతడి పెట్టుకున్నాడు’ అని అశ్విన్ గుర్తు చేసుకున్నాడు. నెట్ బౌలర్‌గా తొలిసారి మాహిని కలుసుకున్నాన్న అశ్విన్, చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరిన తర్వాత అతని నాయకత్వ లక్షణాలు అర్థమయ్యాయని చెప్పాడు. ‘2010 చాంపియన్స్ లీగ్ సందర్భంగా ధోని నాకో గొప్ప పాఠం నేర్పాడు. విక్టోరియా బుష్రేంజర్స్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ వేశాను. అప్పుడు ధోని నా దగ్గరకు వచ్చి ఒత్తిడిలో నీ అత్యుత్తమ బంతిని వేయడం మరిచిపోయావు. క్యారమ్ బాల్ ఉపయోగించు అని చెప్పాడు. ఇప్పుడు కూడా నేను ఇదే మంత్రాన్ని వాడుతున్నా’ అని అశ్విన్ వివరించాడు. అదే ధోని విజయ రహస్యం మ్యాచ్ ఫలితంపై ఆందోళన చెందకుండా చివరివరకు నిజాయతీగా ప్రయత్నించడమే ధోని విజయాలకు కారణమని భారత దిగ్గజ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. కెప్టెన్‌గా ఎవరికీ సాధ్యం కానీ మూడు ఐసీసీ టైటిళ్లను ధోని తన ప్రశాంత చిత్తంతో గెలుచుకున్నాడని కితాబిచ్చాడు. భారత క్రికెట్‌కే కాకుండా ప్రపంచ క్రికెట్‌పై కూడా మిస్టర్ కూల్ ప్రభావితం చూపించాడని వ్యాఖ్యానించాడు. ‘టీమిండియాకు సారథ్యం వహించడం నా దృష్టిలో అతి కష్టమైన పని. ప్రపంచవ్యాప్తంగా అందరికీ భారత్‌పై అంచనాలు ఉంటాయి. ఈ భారాన్ని మోయలేం. కానీ ధోని ఎప్పుడూ ఫలితాన్ని ఆశించకుండా పనిచేశాడు. కోట్లాది భారతీయుల్ని ప్రభావితం చేశాడు. దేశానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎలా ఉండాలో, సమాజంలో మనం ఎలా ప్రవర్తించాలో చేసి చూపించాడు. అందుకే ధోనిని క్రీడాలోకమే కాకుండా సామాన్య ప్రజానీకం గౌరవిస్తుంది. తరచి చూస్తే ధోని రిటైర్మెంట్ ప్రకటించాక సామాజిక మాధ్యమాల్లో సినీ తారలు, సామాజిక వేత్తలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయనాయకులు నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రపంచ క్రికెట్‌కు అతను చేసిన సేవలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు కొనియాడుతున్నారు’ అని లక్ష్మణ్ వివరించాడు. మమ్మల్ని షోలేలో ‘జై, వీరూ’ల్లా భావిస్తారు ఎవరూ ఊహించని విధంగా ధోని వెంటే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు భారత స్టార్ ప్లేయర్ సురేశ్ రైనా. ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం సిద్ధమవుతోన్న అతను చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) అభిమానులపై, కెప్టెన్ ధోనిపై తన ప్రేమను కురిపించాడు. 2003–04 నుంచే ధోని గురించి తనకు తెలుసని, బెంగళూరులో తరచుగా క్యాంపుల్లో కలిసేవారమని చెప్పాడు. కష్టకాలంలో ధోని తనకు అండగా నిలిచాడని పేర్కొన్నాడు. ఆటతో పాటు చుట్టూ ఉన్న వారి వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసే వ్యక్తుల్లో ధోని ఒకడని ప్రశంసించాడు. ‘2007లో శస్త్రచికిత్సతో ఆటకు దూరమయ్యా. ఆ కష్టకాలంలో ధోని నన్ను నడిపించాడు. అప్పటినుంచే మానసికంగా దృఢంగా మారాను’ అని భారత్ తరఫున టెస్టు, వన్డే, టి20ల్లో సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచిన రైనా చెప్పాడు. చెన్నై అభిమానులు కురిపిస్తోన్న ప్రేమకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నాడు. ‘వారి స్వచ్ఛమైన ప్రేమ మాకు ఆశీర్వాదం. ధోనిని నన్ను వారు షోలే చిత్రంలోని జై, వీరూల్లా భావిస్తారు. ఆటతో పాటు మమ్మల్ని ప్రేమిస్తారు. ‘చిన్న తలా’ అని వారు పిలుస్తుంటే ఆనందంగా ఉంటుంది. అభిమానుల ప్రేమే మమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుంది’ అని రైనా వ్యాఖ్యానించాడు. -
‘సచిన్‌లానే.. ధోనికి వీడ్కోలు ఉంటుంది’
న్యూఢిల్లీ : టీమీండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటినుంచి ధోనికి గొప్పగా వీడ్కోలు పలికేందుకు ఫేర్వెల్ మ్యాచ్ ఎక్కడ నిర్వహిస్తారన్న దానిపై పలు ఊహాగాహానాలు తెరమీదకి వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందించారు. ‘వాంఖడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ ఎలా అయితే చివరి మ్యాచ్ ముగించాడో ధోని కూడా చెపాక్ స్టేడియంలో చివరి మ్యాచ్ ఆడతాడని నేను నమ్ముతున్నాను’ అని అన్నారు. 'ధోనికి సీఎస్కే ( చెన్నై సూపర్ కింగ్స్ ) పట్ల అమితమైన ప్రేమ, మక్కువ ఉన్నాయని మనమందరం గుర్తించాలి. సీఎస్కే జట్టుకు ట్రోఫీ అందించడానికి సాధ్యమైనవన్నీ ధోని చేశాడు. ధోని లాంటి గొప్ప నాయకత్వం వల్లే సీఎస్కె అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీగా మన్ననలు అందుకుంది. (ధోని అధ్యాయం ఎన్నటికీ చెరిగిపోనిది) చెన్నైలోని చెపాక్ స్టేడియంలోనే ధోని తన చివరి మ్యాచ్ ఆడతారని భావిస్తున్నాను. క్రికెట్ స్టేడియంలో ధోనీ గడిపే ప్రతీ క్షణాన్ని ఆనందించేందుకు ప్రపంచమంతా ఎదురుచూస్తుంది. సచిన్ హోమ్ గ్రౌండ్ అయిన వాంఖడే స్టేడియంలో అతని చివరి మ్యాచ్ ఎలా జరిగిందో, ధోని కూడా చెపాక్‌లో ఫేర్వెల్ మ్యాచ్ ఉండే అవకాశం ఉంది' అని వీవీఎస్ లక్ష్మణ్ జోస్యం చెప్పాడు. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్ మ్యాచ్ తర్వాత ధోని మళ్లీ క్లబ్ స్థాయి క్రికెట్ కూడా ఆడలేదు. కోట్లాది అభిమానుల్ని నిరాశకు గురిచేస్తూ టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు నిర్ణయం తీసుకున్నాడు.16 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ తప్పుకుంటున్నట్లు స్వయంగా ధోని ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. దీంతో ధోనికి గొప్పగా వీడ్కోలు పలికేందుకు అతని స్వస్థలం రాంచీలో ఓ ఫేర్వెల్ మ్యాచ్ నిర్వహించాలంటూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ బీసీసీఐని కోరిన సంగతి తెలిసిందే. (‘ధోని ఆడకపోతే నేనూ మ్యాచ్‌లు చూడను’) -
ఏది ఏమైనా వదలడు.. కుంబ్లేపై లక్ష్మణ్ ప్రశంసలు
హైదరాబాద్ : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేలపై మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించారు. అటువంటి గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడటం తన అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే లక్ష్మణ్.. తనను బాగా ప్రభావితం చేసిన సహచరుల గురించి అభిప్రాయాలు పంచుకుంటానని చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వారి దగ్గరి నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. ఈ క్రమంలోనే సచిన్, కుంబ్లేల గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా చేసే పనిని వదలకపోవడం కుంబ్లే లక్షణమని పేర్కొన్నారు. 2002లో వెస్టీండిస్‌తో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా కుంబ్లే గాయపడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా కుంబ్లే దవడకు గాయం కాగా, దానిని లెక్క చేయకుండా కుంబ్లే ఆటను కొనసాగించారు. ఆ తర్వాత నొప్పి ఉన్నప్పటికీ.. బౌలింగ్ కూడా చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేసిన లక్ష్మణ్.. కుంబ్లేకు ఉన్న ధైర్యం, తెగువ ఈ ఫొటోలో కనిపిస్తోందన్నారు. ప్రతి అంశంలో కుంబ్లే అసాధారణ శక్తిని ప్రదర్శించేవారని కొనియాడారు. A giant in every sense, he rose above and beyond the call of duty. The grit, drive and bravery displayed through this picture is quintessential @anilkumble1074 .Never giving up, no matter what, was a trait which made Anil the cricketer he became. pic.twitter.com/pEPNgVRcPA — VVS Laxman (@VVSLaxman281) June 1, 2020 అంతకు ముందు క్రికెట్ దిగ్గజం సచిన్‌పై కూడా లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్ని ప్రశంసలు అందుకున్నప్పటికీ.. ఒదిగి ఉండటం సచిన్ గొప్ప లక్షణాల్లో ఒకటని కొనియాడారు. ఆటపై సచిన్ నిబద్ధత, అభిరుచి, గౌరవం.. అతనంటే ఎంటో తెలియజేస్తుందన్నారు. -
రోహిత్ విజయ రహస్యమదే: లక్ష్మణ్
న్యూఢిల్లీ: ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండే లక్షణమే ఐపీఎల్లో రోహిత్ శర్మను విజయవంతమైన కెప్టెన్‌గా నిలుపుతోందని భారత దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. దక్కన్ చార్జర్స్ తరఫున తొలిసారి ఐపీఎల్లో అరంగేట్రం చేసిన రోహిత్ విజయవంతమైన కెప్టెన్‌గా ఎదిగిన తీరును లక్ష్మణ్ గుర్తు చేసుకున్నాడు. ‘చార్జర్స్‌కు ఆడినప్పుడు రోహిత్ యువ ఆటగాడు. మ్యాచ్ మ్యాచ్‌కూ, ప్రతీ విజయానికి అతని ఆత్మవిశ్వాసం స్థాయి పెరిగిపోయేది. యువకులకు మార్గనిర్దేశం చేస్తూ రోహిత్ ప్రధాన ఆటగాళ్ల గ్రూపులోకి చేరిపోయాడు. ఒత్తిడిని అధిగమి స్తూ బ్యాటింగ్ చేసిన ప్రతి సారీ అతను ఆటగాడిగా ఎదిగాడు. అందుకే రోహిత్ విజయవంతమైన కెప్టెన్ అయ్యాడు’ అని లక్ష్మణ్ వివరించాడు. కెప్టెన్‌గా రోహిత్ ముంబై ఇండియన్స్‌కు 4 టైటిళ్లు అందించాడు. -
‘అదే రోహిత్‌ను సక్సెస్ఫుల్ కెప్టెన్ చేసింది’
హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ శర్మ ఎదిగిన తీరును ప్రధానంగా కొనియాడాడు. రోహిత్ శర్మకు ఒత్తిడిలో మ్యాచ్‌లు ఆడటం బాగా తెలుసంటూ కితాబిచ్చాడు. పరిస్థితుల్ని అంచనా వేసుకుంటూ ఆడటంలో రోహిత్ దిట్ట అని ప్రశంసించాడు. దీనిలో భాగంగా ఐపీఎల్ అరంగేట్రం సీజన్లో రోహిత్ డెక్కన్ చార్జర్స్‌కు ఆడటాన్ని ఇక్కడ ప్రస్తావించాడు. యువకుడిగా ఉన్నప్పట్నుంచీ రోహిత్ ఒత్తిడిలో మ్యాచ్‌లను సమర్ధవంతంగా ఆడాడన్నాడు. ‘2008లో డెక్కన్ చార్జర్స్ విజయాల్లో రోహిత్ ముఖ్య భూమిక పోషించాడు. (సౌరవ్ గంగూలీ రేసులో లేడు..కానీ) ఆ సమయంలోనే జట్టుకు సారథ్యం వహించే లక్షణాలు అలవర్చుకున్నాడు. అప్పుడు రోహిత్ ఒక యువ క్రికెటర్. కేవలం టీ20 వరల్డ్‌కప్ ఆడిన అనుభవం మాత్రమే ఉంది. ఆ సీజన్లో రోహిత్ మిడిల్ ఆర్డర్లో తీవ్ర ఒత్తిడిలో ఆడాడు. మా జట్టులోని మిగతా ఆటగాళ్లు పెద్దగా ఆడకపోయినా రోహిత్ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అప్పుడు మేము ఆడిన ప్రతీ సక్సెస్‌లోనూ రోహిత్ పాత్ర ఉంది. తన ఆత్మవిశ్వాసం లెవల్స్‌ను క్రమేపి పెంచుకుంటూ కీలక పాత్ర పోషించాడు. దాంతో జట్టు ప్రయోజనాల కోసం తన వాయిస్‌ను కూడా వినిపించేవాడు. జట్టు ఎప్పుడు కష్టాల్లో పడ్డా నేనున్నాంటూ ఆదుకునేవాడు. అప్పుడే రోహిత్లో బ్యాటింగ్ పరిమళించింది. ప్రధానంగా ఐపీఎల్లో ఒక సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా రోహిత్ ఉన్నాడంటే అందుకు కారణంగా ఒత్తిడిని జయించే లక్షణాలు రోహిత్లో పుష్కలంగా ఉండటమే’ అని లక్ష్మణ్ పేర్కొన్నాడు.(రిస్క్ చేద్దామా.. వద్దా?) -
కొన్ని వేదికల్లో... ప్రేక్షకులు లేకుండా...
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జరుగుతుందని భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే, బ్యాటింగ్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్‌లు ఆశాభావం వ్యక్తం చేశారు. ‘టోర్నీపై నమ్మకంతోనే ఉన్నాం. షెడ్యూలును కుదించి అయినా, మూడు లేదా నాలుగు వేదికలకే పరిమితం చేసైనా ఈ సీజన్ జరగాలని ఆశిస్తున్నాం. ప్రేక్షకుల్లేకుండానే పోటీలు జరగొచ్చు’ అని కుంబ్లే తెలిపాడు. లక్ష్మణ్ మాట్లాడుతూ అన్ని ఫ్రాంచైజీ నగరాల్లో కాకపోయినా కొన్ని వేదికల్లో ఐపీఎల్ జరిగి తీరుతుందనే ఆశాభావంతో ఉన్నామని చెప్పాడు. ‘ప్రయాణ బడలికలు తగ్గించే ఉద్దేశంతో ఎంపిక చేసిన కొన్ని వేదికల్లో పోటీలు జరుగుతాయి’ అని అన్నాడు. ఫ్రాంచైజీలు, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆ దిశగా ఆలోచన చేస్తాయన్నాడు. -
మానవుని శక్తికి, సహనానికి సెల్యూట్
-
స్పూర్తిని రగిలించే వీడియో ఇది
క్రికెట్ ఆడాలన్న గట్టి సంకల్పం ముందు అతడికున్న వైకల్యం ఓడిపోయింది. అకుంటిత దీక్ష, పట్టుదల, ధైర్యంతో మైదానంలోకి దిగాడు.. అనుకున్నది సాదించాడు.. అందరిలోనూ స్పూర్తి రగిలించాడు. రెండు చేతుల సరిగా లేక అంగవైకల్యం గల ఓ పిల్లాడు బౌలింగ్ చేయడం టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్‌ను ఆకట్టుకుంది. దీంతో వెంటనే ఆ వీడియోను తన అధికారిక ట్విటర్లో షేర్ చేశాడు. ‘మానవునికున్న ఆత్మ స్తైర్యం, పట్టుదల, ధైర్యాన్ని ఎవరూ దొంగలించలేరు. మానవుని శక్తికి, సహనానికి సెల్యూట్’ అంటూ లక్ష్మణ్ కామెంట్ జతచేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. చదవండి: మా ఇద్దరిదీ ఒకే స్వభావం.. ఎందుకంటే ‘అవే గంభీర్ కొంప ముంచాయి’ -
‘గంగూలీ కోసం లక్ష్మణ్‌ను తప్పించాను’
మెల్బోర్న్: ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర చర్చను తెరదీశాడు. తను క్రికెట్ ఆడిన కాలంలోని 11 మంది ఆటగాళ్లతో కూడిన అత్యుత్తమ భారత జట్టును షేన్ వార్న్ ప్రకటించాడు. ఈ జట్టుకు ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సారథిగా వ్యవహరిస్తాడని తెలిపాడు. అయితే ఆస్ట్రేలియాపై మెరుగైన రికార్డు కలిగిన సొగసరి బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్‌కు వార్న్ తన జట్టులో అవకాశం ఇవ్వకపోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే దీనిపై వివరణ ఇచ్చిన వార్న్ జట్టు కూర్పులో భాగంగానే లక్ష్మణ్‌కు చోటు ఇవ్వలేదని తెలిపాడు. అంతేకాకుండా సారథి గంగూలీ కోసమే లక్ష్మణ్ తన స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చిందని సరదాగా పేర్కొన్నాడు. తను ఎంపిక చేసిన 11 మందిలో సారథిగా ఎవరిని ఎంపిక చేయాలో తెలియక లక్ష్మణ్‌ను తప్పించి గంగూలీని జట్టులోకి తీసుకొని సారథ్య బాధ్యతలు అప్పగించినట్లు తెలిపాడు. అయితే కపిల్ దేవ్, అజహరుద్దీన్లను ఎంపిక చేసినప్పటికీ వారికి కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వడానికి వార్న్ అనాసక్తి కనబర్చడం విశేషం. ఇక ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లిలతో తను అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోవడంతో వారిని ఎంపిక చేయలేదని వివరణ ఇచ్చాడు. ఓపెనర్లుగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ, వీరేంద్ర సెహ్వాగ్లవైపే వార్న్ మొగ్గు చూపాడు. స్పిన్ బౌలింగ్‌లో ముఖ్యంగా తన బౌలింగ్‌లో ఏమాత్రం ఇబ్బంది పడని సిద్దూను ఓపెనర్‌గా ఎంపిక చేసినట్లు తెలిపిన అతడు.. సచిన్, ద్రవిడ్‌లు లేకుండా అత్యుత్తమ భారత జట్టును ఎంపిక చేయడం కష్టం అని పేర్కొన్నాడు. ఇక తన స్పిన్‌తో ప్రత్యర్థి జట్లను ముప్పుతిప్పలు పెట్టే వార్న్‌కు భారత్‌పై మాత్రం మెరుగైన రికార్డు లేకపోవడం విడ్డూరం. టీమిండియాతో జరిగిన 24 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 43 వికెట్లను మాత్రమే పడగొట్టాడు. వార్న్ అత్యుత్తమ భారత జట్టు: సౌరవ్ గంగూలీ(కెప్టెన్), నవజ్యోత్ సింగ్ సిద్దూ, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, మహ్మద్ అజహరుద్దీన్, నయాన్ మోంగియా, కపిల్ దేవ్, హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్ చదవండి: ఆసీస్ బెదిరిపోయిన వేళ.. సిలిండర్ పేలి క్రికెటర్ భార్యకు గాయాలు -
ఇది స్లో వికెట్.. మరి కోహ్లి అలా ఆడితే ఎలా?
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు కోల్పోవడానికి టాపార్డరే ప్రధాన కారణమని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ విమర్శించాడు. పిచ్ పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఆడటంతోనే మ్యాచ్‌పై పట్టుకోల్పోయామన్నాడు. ప్రధానంగా టీమిండియా కీలక ఆటగాడైన విరాట్ కోహ్లి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆడిన తీరును సుతిమెత్తగా లక్ష్మణ్ వేలెత్తిచూపాడు. అసలు రెండు ఇన్నింగ్స్‌ల్లో కోహ్లి ఎందుకు విఫలమయ్యాడో విశ్లేషించాడు. ‘ ఇది చాలా స్లో వికెట్. అనుకున్నంతగా బంతి స్వింగ్ కావడం లేదు. దాంతో కాస్త భిన్నంగా ఆడాల్సి ఉంటుంది. న్యూజిలాండ్ పేసర్లకు స్వింగ్ దొరకపోవడంతో ఎక్కువగా షార్ట్ పిచ్ బంతులనే సంధించారు. బాడీ లైన్ బంతులతో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టారు. ఆ సమయంలో కాస్త సంయమనంతో ఆడాలి. ఇక్కడ ఓపిక అవసరం. క్రీజ్‌లో పాతుకుపోవడానికే యత్నించాలి. స్టైక్ రొటేట్ చేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలి. కోహ్లి ఔటైన తీరు నిరాశను మిగిల్చింది. ఊరించే షార్ట్ పిచ్ బంతికి కోహ్లి దొరికేశాడు. (ఇక్కడ చదవండి: భారమంతా హనుమ, అజింక్యాలపైనే!) ఇక్కడ కోహ్లిలో ఓపిక లోపించినట్లే కనబడింది. అనవసరపు షాట్‌కు పోయి వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఒక స్ట్రోక్ ప్లేయర్ అత్యల్ప స్కోర్లు చేస్తున్నప్పుడు ఆత్మవిశ్వాసం అనేది లోపిస్తుంది. అటువంటప్పుడు ఎక్కువ పరుగులు చేయాలని ఆత్రం ఉంటుంది. ఎటాక్ చేయడానికి సిద్ధ పడతాం. ప్రత్యర్థి బౌలింగ్‌పై విరుచుకుపడటానికే యత్నిస్తాం. ఆ ప్రయత్నంలోనే కోహ్లి తన వికెట్‌ను చేజార్చుకున్నాడు. ఉపఖండం పిచ్‌ల్లో విరాట్ ఈ తరహాలో ఔట్ కావడం చాలా అరుదు. న్యూజిలాండ్ పిచ్‌లు కాస్త భిన్నమైనవి. బంతుల్ని ఆచితూచి ఆడాల్సి ఉంటుంది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఓపికతో ఆడి సక్సెస్ అయ్యాడు’ అని లక్ష్మణ్ పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 2 పరుగులకు ఔటైన కోహ్లి.. రెండో ఇన్నింగ్స్‌లో 19 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.(ఇక్కడ చదవండి: అదే అతి పెద్ద టర్నింగ్ పాయింట్: సౌతీ) -
చివరి వన్డే : రాహుల్ రికార్డుల మోత..!
మౌంట్ మాంగనీ: న్యూజిలాండ్‌తో జరిగిన చివరి మూడో వన్డేలో వికెట్ కీపర్ లోకేష్ రాహుల్ సెంచరీ (113 బంతుల్లో 112; ఫోర్లు 9, సిక్స్ 2)తో మెరిశాడు. ఈక్రమంలో 21 ఏళ్ల తర్వాత ఆసియా బయట వన్డేల్లో సెంచరీ చేసిన భారత వికెట్ కీపర్‌గా చరిత్ర సృష్టించాడు. 1999లో ఇంగ్లండ్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ది గ్రేట్ వాల్ రాహుల్ ద్రావిడ్ సెంచరీ సాధించాడు. దీంతోపాటు లోకేష్ రాహుల్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐదు లేక ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించిన వికెట్ కీపర్‌గా ధోని పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. 2017లో కటక్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని 134 పరుగులు చేశాడు. ధావన్ తర్వాత రాహులే.. భారత్ తరపున తక్కువ ఇన్నింగ్స్‌లలో నాలుగు సెంచరీలు చేసిన రికార్డునూ రాహుల్ నమోదు చేశాడు.శిఖర్ ధావన్ 24 ఇన్నింగ్స్‌లలో ఆ ఘనత సాధించగా.. వరుసగా లోకేశ్ రాహుల్ 31, విరాట్ కోహ్లి 36, గౌతం గంభీర్ 44, వీరేంద్ర సెహ్వాగ్ 50 ఇన్నింగ్స్‌లలో నాలుగు సెంచరీలు సాధించారు. మంచి ఫామ్‌లో ఉన్న రాహుల్ తాజా టీ20 సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు. తొలి వన్డేలో సైతం 88 పరుగులతో రాణించాడు. రాహుల్‌పై వీవీఎస్ ప్రశంసలు.. అద్భుత ఫామ్‌తో అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు వికెట్ కీపింగ్‌లోనూ రాణిస్తున్న లోకేష్ రాహుల్‌పై టీమిండియా దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలు కురిపించారు. తన క్లాస్ ఇన్నింగ్స్‌తో మరో గొప్ప ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడారు. రాహుల్ గత 11 వన్డే ఇన్నింగ్స్‌లలో 6 హాఫ్ సెంచరీలు చేశాడని, న్యూజిలాండ్‌తో చివరి వన్డేలో దానిని సెంచరీగా మలిచాడని ట్విటర్లో పేర్కొన్నారు. శ్రేయాస్ అయ్యర్, పృథ్వీ షా, మనీష్ పాండే చక్కని సమన్వయంతో జట్టుకు మంచి స్కోరు అందించారని తెలిపారు. ఇక ఆఖరి వన్డేలో టీమిండియా భవితవ్యం బౌలర్ల ప్రదర్శనపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. -
మోదీకి కుంబ్లే కృతజ్ఞతలు..
న్యూఢిల్లీ: తనను ప్రేరణగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే కృతజ్ఞతలు తెలిపారు. పరిక్షా పే చర్చా కార్యక్రమంలో తన గురించి ప్రస్తావించిన మోదీకి కుంబ్లే ధ్యనవాదాలు తెలియజేశారు. అలాగే పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వివరాల్లోకి వెళితే..గత రెండు సంవత్సరాలుగా పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, ఒత్తిడికి గురికాకుండా మోదీ పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 2020 సంవత్సరం పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని న్యూఢిల్లీలోని తాల్కోట్రా స్టేడియంలో నిర్వహించారు. దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని..టీమిండియా క్రికెటర్లు సాధించిన గొప్ప ప్రదర్శనలను తెలియజేసి విద్యార్థులకు మోదీ ప్రేరణ కలిగించారు. మెదీ మాట్లాడుతూ..2001 సంవత్సరంలో కోల్‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌ను గుర్తు చేశారు. ఫాలో ఆన్‌ను ఎదుర్కొంటు, ఓటమి దాదాపు ఖాయమనుకున్న స్థితిని నుంచి టీమిండియా బ్యాట్స్మెన్లు వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ అద్వితీయ ఆటతీరును కనబరిచి చరిత్రాత్మక విజయాన్ని అందించారని అన్నారు. తీవ్ర ఒత్తిడిలోను రాహుల్, లక్ష్మణ్ ప్రదర్శించిన తీరును విద్యార్థులు ప్రేరణగా తీసుకొని.. ఒత్తిడికి గురికాకుండా పరీక్షలను విజయవంతంగా రాయాలని మోదీ ఆకాంక్షించారు. పరీక్షలలో అద్భుతమైన ప్రదర్శనను కనబర్చచడానికి విద్యార్థలకు ఈ రెండు సంఘటనలు ప్రేరణ కలిగిస్తాయని మోదీ అభిప్రాయపడ్డారు. చదవండి: 'ధోని ఉంటాడో లేదో ఐపీఎల్‌తో తేలిపోనుంది' Honoured to have been mentioned in #ParikshaPeCharcha2020 Thankyou Hon. PM @narendramodi ji. Best wishes to everyone writing their exams. pic.twitter.com/BwsMXDgemD — Anil Kumble (@anilkumble1074) January 22, 2020 -
లక్ష్మణ్ ఓటు పంత్‌కే.. ధోనికి కాదు!
న్యూఢిల్లీ: మొన్నటి వరకూ తమ దశాబ్దపు అత్యుత్తమ జట్లను మాజీలు ఎంపిక చేస్తే, ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్‌కు తమ జట్లను ప్రకటిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా తన టీమిండియా టీ20 వరల్డ్‌ప్ జట్టును మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రకటించాడు. ఇందులో ఎంఎస్ ధోనికి చోటు ఇవ్వలేదు లక్ష్మణ్. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా రిషభ్ పంత్‌కే ఓటేసిన లక్ష్మణ్.. ధోనిని పక్కన పెట్టాడు. రాబోవు టీ20 వరల్డ్‌కప్ నాటికి ధోని ఆడతాడా.. లేదా అనే సందిగ్థంలో ఉండగా లక్ష్మణ్ తన జట్టు ఇదేనంటూ ప్రకటించాడు. ఈ తన జట్టులో ఓపెనర్‌గా శిఖర్ ధావన్‌ను కూడా లక్ష్మణ్ ఎంపిక చేయకపోవడం గమనార్హం. ఇక్కడ రోహిత్ శర్మకు జతగా ఓపెనింగ్ బాధ్యతలను కేఎల్ రాహుల్‌కు ఇచ్చాడు. దాంతో ధావన్‌ను పక్కనపెట్టాడు. ఈ మేరకు 15 మందితో కూడిన జట్టును లక్ష్మణ్ ప్రకటించాడు. (ఇక్కడ చదవండి: ‘నేనైతే ధావన్‌ను ఎంపిక చేయను’) లక్ష్మణ్ వరల్డ్‌టీ20 టీమిండియా జట్టు ఇదే.. విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, బుమ్రా, చహల్, కుల్దీప్ యాదవ్, మనీష్ పాండే, శివం దూబే, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్. -
అయ్యర్‌కు పీటర్సన్ చిన్న సలహా!
ముంబై : టీమిండియా యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌కు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్స్‌న్ పలు సూచనలిచ్చాడు. టీమిండియాకు గత కొంత కాలంగా బ్యాటింగ్‌లో నాలుగో స్థానం ఇబ్బందులకు గురిచేస్తోందని, ఇప్పటికే పలువురు ఆటగాళ్లకు అవకాశం ఇచ్చినా ఫలితం దక్కలేదన్నాడు. అయితే నాలుగో స్థానానికి అయ్యర్ సరిగ్గా ఒదిగిపోతాడని పీటరన్స్ అభిప్రాయపడ్డాడు. అయితే అయ్యర్ బ్యాటింగ్ టెక్నిక్‌లో కొన్ని లోపాలున్నాయని వాటిని సరిదిద్దుకోవాలని సూచించాడు. ఈ యువ క్రికెటర్ ముఖ్యంగా ఆఫ్ సైడ్ బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలన్నాడు. దీనికోసం నెట్స్‌లో ఎక్కువసేపు శ్రమించాలన్నాడు. నెట్స్‌లో ప్రత్యేకంగా ఓ బౌలర్‌చే ఆఫ్ స్టంప్ బంతులు వేయించుకొని ప్రాక్టీస్ చేయాలన్నాడు. అదేవిధంగా ఎక్స్ట్రా కవర్ షాట్లపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని పీటర్సన్ పేర్కొన్నాడు. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి టీ20లో అయ్యర్(33 బంతుల్లో 62) అద్భుతంగా ఆడాడని టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్యణ్ కొనియాడాడు. ఆ మ్యాచ్‌లో ఈ యంగ్ క్రికెటర్ రాణించడంతోనే టీమిండియా సులువుగా గెలిచిందని అభిప్రాయపడ్డాడు. అయ్యర్ ఎంతో ప్రతిభావంతుడని, భవిష్యత్‌లో టీమిండియాకు ఎన్నో మరుపురాని విజయాలను అందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక వెస్టిండీస్‌తో జరిగిని రెండు టీ20ల్లో అయ్యర్ అంతగా రాణించనప్పటికీ ముంబై వేదికగా జరిగే నిర్ణయాత్మకమైన మ్యాచ్‌లో తప్పక రాణిస్తాడని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశాడు. ఇక తిరువనంతపురం వేదికగా విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ తీవ్రంగా నిరుత్సాహపరిచిన విషయం తెలిసిందే. ఇక టీమిండియా-వెస్టిండీస్ జట్ల మధ్య నిర్ణయాత్మకమైన మూడో టీ20 బుధవారం ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది. -
సీఏసీలోకి మళ్లీ సచిన్, లక్ష్మణ్!
కోల్‌కతా: గతంలో రద్దయిన క్రికెట్ సలహాదారుల కమిటీ (సీఏఏ)ని శనివారం మళ్లీ ఏర్పాటు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూ ల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ మరోసారి ఇందులో సభ్యులుగా పునరాగమనం చేసే అవకాశం ఉందని సమాచారం. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ కారణంగా ఈ కమిటీ నుంచి సచిన్, వీవీఎస్ ఇంతకు ముందు తప్పుకున్నారు. అయితే గంగూలీ బోర్డు అధ్యక్షుడైన నేపథ్యంలో సీఏసీ మళ్లీ సిద్ధమవుతోంది. ఆదివారం జరిగే బీసీసీఐ ఏజీఎంలో కొత్త సెలక్షన్ కమిటీని కూడా ప్రకటించనున్నారు. -
పంత్‌కు వీవీఎస్ వార్నింగ్!
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో తరచు విఫలమవుతున్నప్పటికీ టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ఎంఎస్ ధోనికి వారసుడిగా జట్టులోకి వచ్చిన కొద్ది కాలంలోనే తనలోని ప్రతిభను చాటుకున్నప్పటికీ, కొంతకాలంగా ఘోరంగా విఫలమవుతున్నాడు రిషభ్. ఆ క్రమంలోనే మరో యువ వికెట్ కీపర్ సంజూ సాంసన్ దేశవాళీ మ్యాచ్‌ల్లో సత్తాచాటడంతో పంత్ స్థానంపై డైలమా ఏర్పడింది. సాంసన్‌కు తగినన్ని అవకాశాలు ఇచ్చి పంత్‌ను కొన్నాళ్లు పక్కన పెట్టాలంటూ పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిలో భాగంగా వెస్టిండీస్‌తో ద్వైపాక్షిక పరిమిత ఓవర్ల సిరీస్‌కు సాంసన్‌ను ఎంపిక చేసినా పంత్‌ను జట్టులో కొనసాగించేందుకు టీమిండియా సెలక్టర్లు మొగ్గుచూపారు. దాంతో పంత్‌కు సాంసన్‌ల మధ్య పోటీ ఒకే సిరీస్‌లో మనకు కనిపించే అవకాశం ఉంది. ఈ తరుణంలో పంత్‌కు ఒక మెస్సేజ్‌తో కూడిన వార్నింగ్ ఇచ్చాడు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్. ‘ పంత్ నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సెలక్టర్ల పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాడా.. ఇంకా వేరే ఏమైనా జరగుతుందో చూడాలి. ఇప్పుడు సంజూ సాంసన్ ఎంపికతో పంత్ ప్రదర్శన షురూ చేయాల్సిన అవసరం ఏర్పడింది. సంజూ సాంసన్ ఉన్నాడంటూ టీమ్ మేనేజ్మెంట్, సెలక్షన్ కమిటీ ఒక స్ట్రాంగ్ మెస్సేజ్‌ను పంత్‌కు పంపినట్లే కనబడుతోంది. ఇప్పటికే పంత్‌కు చాలా అవకాశాలు ఇచ్చారు. దాంతో సాంసన్‌తో పోటీ ఎదుర్కోనున్నాడు పంత్. ఇప్పుడు పంత్ ఆత్మ రక్షణలో పడబోతున్నాడు. పంత్ నిరూపించుకోవాల్సిన అవసరం మరొకసారి వచ్చింది. సెలక్టర్ల నమ్మకాన్ని గెలవాలి. ఒకవేళ దురదృష్టవశాత్తూ పంత్ రాణించలేకపోతే అతనికి ప్రత్యామ్నాయం కోసం అన్వేషణ మొదలువుతుంది. పంత్‌పై నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది. అతనొక విధ్వంసకర ఆటగాడు. మ్యాచ్‌ను మార్చగల సత్తా పంత్‌లో ఉంది. మంచి బంతుల్ని సైతం బౌండరీలు దాటించే నైపుణ్యం అతని సొంతం. కానీ విండీస్‌తో సిరీస్‌లో పంత్ ఆడితేనే అతను కొనసాగే అవకాశం ఉంది’ అని లక్ష్మణ్ పేర్కొన్నాడు. -
గంభీర్ ఎన్నాళ్లకెన్నాళ్లకు..
ఇండోర్: ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే గౌతమ్ గంభీర్‌ను అతడి మాజీ సహచరుడు వీవీఎస్ లక్ష్మణ్ నవ్వుల్లో ముంచెత్తాడు. భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్ట్ రెండోరోజు ఆట సందర్భంగా ఈ ఉదంతం చోటుచేసుకుంది. గంభీర్, లక్ష్మణ్‌తోపాటు స్టార్‌స్పోర్ట్స్ కామెంటేటర్ జతిన్ సప్రు శుక్రవారం ఇండోర్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేశారు. అక్కడ వారు ఓ చాట్ భండార్‌లో జిలేబీ తింటూ ఆహ్లాదంగా గడిపారు. దీనికి సంబంధించి ఫోటోను వీవీఎస్ తన ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. ‘అటుకుల వంటకంతో కారంకారంగా.. జిలేబీతో తియ్యని బ్రేక్‌ఫాస్ట్‌తో ఇండోర్‌లో ఈరోజు అద్భుతంగా మొదలైంది’ అని లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. దీనిపై నెటిజన్లు సరదాగా స్పందించారు. ఎప్పుడూ సీరియస్‌గా ఉండే గౌతం గంభీర్ నవ్వడమా.. అది కూడా పెద్దగా నవ్వడమంటే ‘ మిషన్ ఇంపాసిబుల్’ పాసిబుల్ అయ్యింది అంటూ ఒక నెటిజన్ ట్వీట్ చేయగా, గంభీర్ ఇలా నవ్వడం మొదటిసారి చూశానని మరొకరు ట్వీట్ చేశారు. ‘అసలు గంభీర్ నవ్వి ఎంతకాలమైందో’ అని ఒకరు ట్వీట్ చేయగా, ‘గంభీర్ ఇలానే నవ్వుతూ ఉండు’ అని మరొకరు పేర్కొన్నారు.(ఇక్కడ చదవండి: వారికి అదే సమాధానం చెబుతుంది: గంభీర్) -
ఛాయ్‌వాలా కాదు.. బడా దిల్వాలా!
‘మహ్మద్ మెహబూబ్ మాలిక్... కాన్పూర్‌కు చెందిన ఛాయ్‌వాలా. ఓ చిన్న షాపు కలిగిన అతడు 40 మంది పిల్లలకు చదువు చెప్పిస్తున్నాడు. తన ఆదాయంలో 80 శాతం మేర వారి విద్య కోసమే ఖర్చు చేస్తున్నాడు. ఇదే నిజంగా ఎంతో స్పూర్తిదాయకం కదా’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన టీ షాపు యజమానిపై ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు లక్ష్మణ్ చేసిన ట్వీట్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో అతడికి సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఇతను ఛాయ్‌వాలా కాదు.. బడా దిల్వాలా’ అంటూ అతడిని అభినందిస్తున్నారు. ఇక లక్ష్మణ్ ట్వీట్‌కు స్పందించి టీ వాలా మహ్మద్... హృదయపూర్వక ధన్యవాదాలు సార్ అంటూ బదులిచ్చాడు. కాగా కాన్పూర్‌కు చెందిన మహ్మద్ మెహబూబ్ మాలిక్‌కు సామాజిక సేవ చేయడంలో ముందుంటాడు. టీ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్న అతడు దాదాపు 40 మంది చిన్నారులను చదివిస్తున్నాడు. మా తుజే సలాం పేరిట ఫౌండేషన్ నెలకొల్పి అభాగ్యులకు అండగా నిలుస్తున్నాడు. అంతేకాదు ఎన్నికల సమయంలోనూ మరక మంచిదే అంటూ ఓటు విలువను తెలియజేస్తూ ఓటర్లను చైతన్యవంతం చేయడం వంటి పలు కార్యక్రమాలు చేపట్టాడు. Mohammad Mahboob Malik, a tea seller from Kanpur takes care of education for 40 children. He has a small tea shop and spends 80% of his income on the education of these children. What an inspiration ! pic.twitter.com/H1FTxeYuz7 — VVS Laxman (@VVSLaxman281) November 6, 2019 -
టీమిండియాను ఓడించడానికి ఇదే చాన్స్: వీవీఎస్
న్యూఢిల్లీ: వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత క్రికెట్ జట్టును ఓడించడానికి బంగ్లాదేశ్‌కు ఇదే మంచి అవకాశమని మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నాడు. బంగ్లాదేశ్ బ్యాటింగ్ బలాన్ని నిరూపించుకోవడానికి మూడు టీ20ల సిరీస్ ఒక చాన్స్‌ని, భారత్‌ను ఓడించాలంటే ఇంతకంటే మంచి అవకాశం రాదన్నాడు. ‘ ఆతిథ్య జట్టును ఓడించాలంటే పర్యాటక జట్టు బంగ్లాదేశ్‌కు ఇదే మంచి అవకాశం. భారత్‌ను భారత గడ్డపై ఓడించే చక్కటి చాన్స్. బంగ్లాదేశ్ బ్యాటింగ్ బలంగా ఉంది. బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో రాణిస్తే భారత్‌కు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. ఇక బంగ్లాదేశ్‌కు బలహీనం ఏదైనా ఉందంటే అది బౌలింగ్ యూనిటే. ముస్తాఫిజుర్ రహ్మన్‌తో పాటు కొద్దిపాటు బౌలింగ్ మాత్రమే వారికి ఉంది. స్పిన్ విభాగంలో ఆ జట్టు బలంగా లేదు. టీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్ తరఫున ముస్తాఫిజుర్ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. భారత జట్టులో విరాట్ కోహ్లి లేడు. దాంతోపాటు మిడిల్ ఆర్డర్లో కూడా భారత్ జట్టు అనుభవ లేమి కనబడుతోంది. ఇక భారత్ విజయాల్లో ముఖ్య భూమిక పోషించడానికి యువ క్రికెటర్లు సిద్ధం కావాలి. వాషింగ్టన్ సుందర్, చహల్‌లు భారత బౌలింగ్ యూనిట్లో కీలకం కానున్నారు. టీ20 సిరీస్‌కు సన్నద్ధమైన వేదికలు స్పిన్‌కు ఎక్కువ అనుకూలించే అవకాశాలున్నాయి. చహల్ మూడు మ్యాచ్‌లు కచ్చితంగా ఆడే అవకాశం ఉంది. కొంతమందికి విశ్రాంతి ఇవ్వడం వల్ల చహల్ మూడు టీ20ల సిరీస్‌లో అన్ని మ్యాచ్‌ల్లో ఆడతాడనే ఆశిస్తున్నా. కృనాల్ పాండ్యా వంటి యువ క్రికెటర్లకు ఇదొక మంచి అవకాశం. భారత్ 2-1 తేడాతో గెలుస్తుందనే అనుకుంటున్నా’ అని లక్ష్మణ్ పేర్కొన్నాడు. మూడు టీ20ల సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్‌లు తప్పిస్తే మిగతా వారంతా దాదాపు యువ క్రికెటర్లే. ఈ సిరీస్‌కు సీనియర్లకు విశ్రాంతినిచ్చిన టీమిండియా.. యువ క్రికెటర్లను పరీక్షించాలనే క్రమంలో అందకు తగినట్టే ఎంపిక చేసింది. -
‘గంగూలీ రూమ్‌లోకి వెళ్లి షాకయ్యా’
కోల్‌కతా: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) నూతన అధ్యక్షుడిగా ఎంపికైన సౌరవ్ గంగూలీని క్రికెట్ అసోషియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) సన్మానించిన కార్యక్రమానికి హాజరైన మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తన గత అనుభవాల్ని నెమరువేసుకున్నాడు. 2014లో క్యాబ్ జాయింట్ సెక్రటరీగా గంగూలీ పనిచేస్తున్న సమయంలో లక్ష్మణ్.. బెంగాల్ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా సేవలందించాడు. దీనిలో భాగంగా గంగూలీని కలవడానికి వెళ్లిన లక్ష్మణ్‌కు ఊహించని పరిణామం ఎదురైందట. క్రికెట్లో ఒక వెలుగు వెలిగి, భారత క్రికెట్‌ను ఒక ఉన్నత స్థాయిలో నిలిపిన కెప్టెనే కాకుండా, వరల్డ్ క్రికెట్లో ఒక లెజెండ్ అయినటువంటి గంగూలీని ఆ రూమ్‌లో చూసి లక్ష్మణ్ షాక్ తిన్నాడట. ‘ నేను బెంగాల్ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా గంగూలీని కలవడానికి వెళ్లా. ఆ సమయంలో రాష్ట్ర అసోసియేషన్‌లోని ఒక చిన్నగదిలో గంగూలీ కూర్చొని ఉన్నాడు. ఆ రూమ్ నన్ను కచ్చితంగా షాక్‌కు గురి చేసింది. అది చాలా చిన్నరూమ్. అందులో క్రికెట్ అడ్మినిస్ట్రేటర్‌గా గంగూలీ సేవలందిస్తున్నాడు. ఇది నాకు ఊహించని విషయం. దాంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యా. కానీ అది నాలో స్ఫూర్తిని నింపింది’ అని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. ఈ కార్యక్రమానికి లక్ష్మణ్‌తో పాటు అజహరుద్దీన్ కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. -
డేనైట్ టెస్టులకు కోహ్లి ఓకే అన్నాడు
కోల్‌కతా: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నూతన అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ టీమిండియాతో డేనైట్ టెస్టులను ఆడించే పనిలో పడ్డాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ డేనైట్ టెస్టులు ఆడేందుకు సుముఖత వ్యక్తం చేశాడని దాదా చెప్పాడు. గురువారం తమ భేటీలో ఈ అంశం చర్చకు వచి్చందని అన్నాడు. ఈడెన్ గార్డెన్స్‌లో శుక్రవారం గంగూలీని బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ డేనైట్ టెస్టులతో ప్రేక్షకాదరణ పెరుగుతుందని అన్నాడు. భారత క్రికెట్‌ను మరో దశకు తీసుకెళ్లేందుకు లక్ష్మణ్, అజహరుద్దీన్, సచిన్, ద్రవిడ్, కపిల్‌దేవ్, గావస్కర్‌ల సేవలి్న, సూచనల్ని స్వీకరిస్తామని చెప్పాడు. ‘డేనైట్ టెస్టులు ప్రాచుర్యం పొందుతాయని నేను బలంగా విశ్వసిస్తున్నా. ఎప్పుడు జరుగుతాయో చెప్పలేను కానీ... నా ఆధ్వర్యంలో ఈ మ్యాచ్‌లు జరిగేందుకు కృషిచేస్తా’నని అన్నాడు. ఏదేమైనా సౌరవ్ వచ్చే జూలైలో ని్రష్కమించే సమయానికి భారత్‌లో డేనైట్ టెస్టులు జరిగే అవకాశం లేదు. ఈ సీజన్లో స్వదేశంలో బంగ్లాతో జరిగే టెస్టు సిరీసే ఆఖరి సిరీస్. టెక్నికల్ కమిటీ చైర్మన్‌గా ఉన్నప్పుడే గంగూలీ దులీప్ ట్రోఫీని డేనైట్ మ్యాచ్‌లుగా పింక్ బాల్‌తో నిర్వహించాలని సిఫార్సు చేశాడు. కానీ దేశవాళీ బౌలర్ల అభ్యంతరంతో అది కార్యరూపం దాల్చలేదు. గత మూడేళ్లుగా భారత జట్టు అద్భుతంగా రాణిస్తోందని ‘దాదా’ అన్నాడు. ప్రపంచంలోనే ఐపీఎల్ ప్రముఖ లీగ్‌గా ఘనతకెక్కిందని పేర్కొన్నాడు. ఎన్సీఏకు ప్రాధాన్యత ఇవ్వాలని... క్యాబ్ ప్రాజెక్ట్ ‘విజన్ 2020’ సలహాదారుడైన వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ ‘భారత్ ఇంతలా రాణించేందుకు ప్రధాన కారణం రిజర్వ్ బెంచే. ఈ నేపథ్యంలో ‘దాదా’ ఇప్పుడు ఎన్సీఏకు మరింత ప్రాధాన్యమిస్తాడని ఆశిస్తున్నా. 1999–2000 సీజన్లో భారత్... ఆసీస్, దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది. అలాంటి గడ్డు పరిస్థితుల్లో గంగూలీ జట్టులో ఆశావహ దృక్పథాన్ని పెంచాడు. కుర్రాళ్లు రాణించేందుకు ప్రేరణగా నిలిచాడు. ఇప్పుడు బోర్డు పరిపాలకుడిగా కూడా అతను విజయవంతం అవుతాడు’ అని చెప్పాడు. ఈ కార్యక్రమంలో వీవీఎస్‌తో పాటు మాజీ కెపె్టన్, ప్రస్తుత హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ హాజరయ్యాడు. అజ్జూ మాట్లాడుతూ ‘గంగూలీ బోర్డు అధ్యక్షుడు కావడం చాలా సంతోషంగా ఉంది. అతని సారథ్యంలో భారత్ ఎన్నో టోరీ్నలు గెలిచింది. అలాంటి నిబద్ధత కలిగిన వ్యక్తి బోర్డును కూడా సమర్థంగా నడిపిస్తాడు’ అని అన్నాడు. -
‘దాదా’ నేతృత్వంలో భారత క్రికెట్ ముందుకెళ్తుంది
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా ఖాయమైన దిగ్గజ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి బ్యాటింగ్ లెజెండ్ వీవీఎస్ లక్ష్మణ్ శుభాకాంక్షలు తెలిపాడు. గంగూలీ సారథ్యంలో ఇకపై భారత క్రికెట్ ముందడుగు వేస్తుందని వీవీఎస్ ట్వీట్ చేశాడు. అధ్యక్ష స్థానానికి ‘దాదా’ ఒక్కడే నామినేషన్ వేయడంతో ఈ నెల 23న జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో 47 ఏళ్ల సౌరవ్ ఎన్నిక లాంఛనమే కానుంది. ‘త్వరలో నూతన అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్న సౌరవ్ గూంగూలీకి అభినందనలు. నీ సమర్థ సారథ్యంలో భారత క్రికెట్ సుసంపన్నమవుతుంది. ఇందులో నాకెలాంటి సందేహం లేదు. నాడు భారత కెపె్టన్‌గా విజయవంతమైనట్లే ఇప్పుడీ పాత్రలోనూ దాదా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా’ అని లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. దీనిపై గంగూలీ స్పందిస్తూ ‘థ్యాంక్యూ వీవీఎస్. నా ప్రయాణంలో నీ సేవలు, అమూల్యమైన సూచనలు నాకు అవసరం’ అని ట్విట్టర్ వేదికగా అన్నాడు. -
వీవీఎస్ లక్ష్మణ్ అద్భుతమైన క్యాచ్..!!
పుణె : టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ ఒంటిచేత్తో అద్భుతమైన క్యాచ్ పట్టాడు. కామెంటేటర్‌గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లక్ష్మణ్.. తోటి కామెంటటేటర్లతో కలిసి గల్లీ క్రికెట్ ఆడాడు. పుణె టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమవడానికి ముందు వీరి గల్లీ క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఆకాశ్‌చోప్రా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేసిన ఈ సొగసరి బ్యాట్స్‌మన్ కొద్దిపాటి డైవ్ చేసి వన్బౌన్స్ క్యాచ్ అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం.. ‘నేను పట్టిన అత్యద్భుతమైన క్యాచ్లలో ఇదొకటి. అయితే, ఫుల్ సూట్లో ఉన్న సమయంలో ఈ మ్యాచ్ జరిగింది. తెల్ల దుస్తుల్లో ఉన్నప్పుడు కాదు’అని సరదాగా ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ వైరల్ అయింది. ఇక పుణెలో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 137 పరుగుల భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో మూడు టెస్టుల సిరిస్‌ను భారత్ 2-0తో సొంతం చేసుకుంది. మూడో టెస్టు రాంచీలో ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. Never knew one of my finest close in catches would come in a full suit and not whites 😅.. Sunday morning cricket coming up on #Cricketlive 11.30am @StarSportsIndia Hindi pic.twitter.com/8YUBfWAZeh — VVS Laxman (@VVSLaxman281) October 13, 2019 -
మయాంక్.. నువ్వు కూడా అచ్చం అలాగే!
విశాఖ: టీమిండియా యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్‌పై మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలు కురిపించాడు. ఏ మాత్రం తడబాటు లేకుండా ఆడటానికి అతని మానసిక బలమే కారణమన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన మయాంక్ ఒక అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా లక్ష్మణ్ కొనియాడాడు. అదే సమయంలో సెహ్వాగ్ తరహా భయంలేని క్రికెట్ ఆడుతున్నాడంటూ లక్ష్మణ్ ప్రశంసించాడు. ‘అతని ఆరాధ్య క్రికెటరైన సెహ్వాగ్‌లానే మయాంక్ ఆడుతున్నాడు. మానసికంగా ఎంతో ధృడంగా ఉన్న కారణంగానే సునాయాసంగా షాట్లు కొడుతున్నాడు. అతను మెరుగైన క్రికెటర్’ అని లక్ష్మణ్ పేర్కొన్నాడు. ఇక హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. ‘ మయాంక్‌కు సాధ్యమైనన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. అతను ఆట తీరు చాలా మెరుగ్గా ఉంది. మయాంక్ ఫుట్‌వర్క్ చాలా బాగుంది. ప్రత్యేకంగా అతను కొట్టే రివర్స్ స్వీప్ షాట్లు అతనిలోని ప్రతిభను చాటుతున్నాయి. దేశవాళీ క్రికెట్లో సత్తాచాటుకుని అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టేవారు ఎక్కువగా నేర్చుకుంటున్నారు. వారు జాతీయ జట్టులో రావడానికి ఆలస్యం అవుతుంది.. కానీ మంచి నైపుణ్యాన్ని మాత్రం సాధిస్తున్నారు. మయాంక్ ఇలానే కష్టపడి జట్టులోకి వచ్చాడు’ అని భజ్జీ పేర్కొన్నాడు. -
రోహిత్ నాలా కాకూడదు: లక్ష్మణ్
హైదరాబాద్: తన క్రికెట్ కెరీర్లో చేసిన తప్పిదాలను రోహిత్ శర్మ చేయకూడదని దిగ్గజ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ సూచించాడు. తనకు టెస్టుల్లో పెద్దగా ఓపెనింగ్ అనుభవం లేకపోయినా, ఓపెనింగ్‌కు వెళ్లి విఫలమైన సంగతిని లక్ష్మణ్ గుర్తు చేసుకున్నాడు. కేవలం నాలుగు టెస్టులు మాత్రమే ఆడిన తర్వాత తనను ఓపెనర్‌గా ప్రయోగం చేశారన్నాడు. అది మంచి ఫలితాన్ని ఇవ్వలేదన్నాడు. ‘ఓపెనింగ్‌లో రోహిత్ శర్మ నేనే చేసినట్లుగా పొరపాట్లు చేయకూడదు. ఇప్పుడైతే అతడికి అనుభవమే అతిపెద్ద సానుకూలత. మంచి ఫామ్‌లో ఉన్నాడు. అప్పట్లో (1996–98 సీజన్) నాకు అనుభవమే లేదు. అంతకుముందు మిడిలార్డర్లో నాలుగు టెస్టులే ఆడా. అంతలోనే ఓపెనింగ్‌కు పంపారు. టెక్నిక్ మార్చి బ్యాటింగ్ చేసి విఫలమయ్యా. రోహిత్... ఆర్డర్ మారినా, బ్యాటింగ్ సూత్రాలు, క్రీజులో నిలిచే దిశను మార్చుకోవద్దు. ఫ్రంట్ ఫుట్, బ్యాక్ ఫుట్‌పై కచ్చితమైన మైండ్‌సెట్‌తో ఆడాలి’ అని లక్ష్మణ్ పేర్కొన్నాడు. -
‘పంత్‌ను పంపండం సరైనది కాదు’
బెంగళూరు : కీలక నాలుగో స్థానంలో యువ ఆటగాడు రిషభ్ పంత్‌ను బ్యాటింగ్‌కు పంపండం సరైన నిర్ణయం కాదని టీమిండియా దిగ్గజ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పంత్ మరోసారి విపలమైన విషయం తెలిసిందే. దీంతో అతడిపై అన్ని వైపులా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పంత్‌కు లక్ష్మణ్ అండగా నిలిచాడు. ఎంఎస్ ధోని ప్రత్యామ్నాయంగా జట్టులోకి వచ్చిన పంత్‌పై అధిక ఒత్తిడి ఉందని.. టీమ్ మేనేజ్మెంట్ అతడిలో స్థైర్యాన్ని నింపాలన్నాడు. పంత్‌లో అపార ప్రతిభ దాగుందన్నాడు. మైదానం అన్నివైపులా షాట్లు కొట్టగల నైపుణ్యం ఉందని.. దూకుడు అతడి సొంతమని ప్రశంసించాడు. అయితే ఆటలో లోపం లేదని.. షాట్ల ఎంపికలోనే లోపం ఉందని అభిప్రాయపడ్డాడు. పంత్ బ్యాటింగ్ సహజ లక్షణం దూకుడని అలాంటి ఆటగాడిని నాలుగో స్థానంలో కాకుండా ఐదు లేక ఆరు స్థానాల్లో బ్యాటింగ్‌కు పంపాలని సూచించాడు. అయితే ఐపీఎల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ఢిల్లీ క్యాపిటల్స్‌కు అనేక విజయాలు అందించిన పంత్ అంతర్జాతీయ క్రికెట్లో రాణించకపోవడం నిజంగా దురదృష్టకరమని పేర్కొన్నాడు. ఈ 21ఏళ్ల యువ క్రికెటర్‌కు కుదురుకునే అవకాశం ఇవ్వాలన్నాడు. అప్పటివరకు నాలుగో స్థానంలో కాకుండా ఐదు లేక ఆరు స్థానాంలో బ్యాటింగ్‌కు పంపాలన్నాడు. ఇక నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ లేక హార్దిక్ పాండ్యాలను పంపించాలని సూచించాడు. ఇక ఆదివారం జరిగిన నిర్ణయాత్మకమైన మూడో టీ20లో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. -
వాళ్లందరికీ థాంక్స్: అంబటి రాయుడు
న్యూఢిల్లీ: తాను గడ్డు సమయాన్ని ఎదుర్కొన్నప్పడు అండగా నిలిచిన వారికి తెలుగు తేజం అంబటి రాయుడు ధన్యవాదాలు తెలియజేశాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న రాయుడు.. మళ్లీ అన్ని ఫార్మాట్లకు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. ఈ క్రమంలోనే తనకు మద్దతుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) మేనేజ్మెంట్తో పాటు వీవీఎస్ లక్ష్మణ్, నోయల్ డేవిడ్‌లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశాడు. దీనిలో భాగంగా హెచ్‌సీఏకు లేఖ రాసిన రాయుడు.. తన రిటైర్మెంట్ నిర్ణయం అనేది ఆవేశంలో తీసుకున్నదేనని స్పష్టం చేశాడు. తాను మళ్లీ క్రికెట్ ఆడాలనుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. తనవరకూ చూస్తే ఆడాల్సిన క్రికెట్ చాలా ఉందంటూ తెలిపాడు. గత రెండేళ్లుగా భారత వన్డే ప్రపంచకప్ జట్టు ప్రణాళికల్లో ఉండి కూడా ప్రపంచకప్ ఆడలేకపోవడంతో రాయుడు ఆకస్మికంగా రిటైర్మెంట్ను ప్రకటించాడు. తాజాగా ఇప్పుడు అతను మనసు మార్చుకొని బ్యాట్ పట్టేందుకు సిద్ధమయ్యాడు. హెచ్‌సీఏ నిర్వహించే వన్డే, టి20 క్రికెట్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటానని అతను చెప్పాడు. -
గచ్చిబౌలిలో సన్‌షైన్ ఆస్పత్రిలో పల్మొనరీ ల్యాబ్ ప్రారంభించిన వివిఎస్ లక్ష్మణ్
-
‘ఆ రెండు జట్లే ఫైనల్‌కు వెళ్లేవి’
బర్మింగ్‌హామ్: వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు కచ్చితంగా ఫైనల్‌కు చేరుతుందని అంటున్నాడు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్. వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా తుది పోరుకు అర్హత సాధిస్తుందనడంలో తనకు ఎటువంటి సందేహం లేదన్నాడు. ఈ మెగా టోర్నీలో భారత సక్సెస్ వెనుక బౌలింగ్ యూనిట్ ప్రధాన పాత్ర పోషిస్తుందన్నాడు. భారత్ బౌలింగ్ బలంగా ఉన్న కారణంగానే స్వల్ప లక్ష్యాలను సైతం కాపాడుకుని విజయాలు నమోదు చేయడం శుభ పరిణామని లక్ష్మణ్ అన్నాడు. పేస్ బౌలింగ్ ఎటాక్‌లో బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్‌లు కీలక పాత్ర పోషిస్తుంటే, స్పిన్ ద్వయం కుల్దీప్ యాదవ్, చహల్‌లు కూడా మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారన్నాడు. బ్యాటింగ్ విభాగంలో మిడిల్ ఆర్డర్లో కాస్త వైఫల్యం కనబడుతుందన్నాడు. ఎంఎస్ ధోని అసాదారణ ఆటగాడని కొనియాడుతూనే.. స్టైక్ రోటేట్‌ను మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. ఇక వరల్డ్‌కప్‌లో ఎవరు ఫైనల్‌కు చేరతారనే ప్రశ్నకు సంబంధించి లక్ష్మణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరతాయని జోస్యం చెప్పాడు. తన వరకూ ఫైనల్ పరంగా చూస్తే 2003 వరల్డ్‌కప్ పునరావృతం అవుతుందన్నాడు. -
‘క్రికెట్లో ఒక శకం ముగిసింది’
న్యూఢిల్లీ: తన పోరాట పటిమ, ఆత్మస్థైర్యంతో ఎంతో మందికి యువరాజ్ సింగ్ స్ఫూర్తిగా నిలిచాడని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన యువీపై వీరూ ప్రశంసలు కురిపించాడు. ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని పోరాట యోధుడిగా అందరి హృదయాలు గెలిచాడని మెచ్చుకున్నాడు. ‘ఆటగాళ్లు వస్తారు, వెళతారు కానీ యువీ లాంటి ఆటగాళ్లు అరుదుగా ఉంటార’ని ట్వీట్ చేశాడు. అతడి భవిష్యత్ జీవితం సాఫీగా సాగిపోవాలని శుభాకాంక్షలు తెలిపాడు. యువరాజ్ సింగ్‌తో కలిసి ఆడటం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నాడు. క్రికెట్లో గొప్ప ఆటగాళ్లలో అతడు ఒకడని ప్రశంసించాడు. ఆట పట్ల అతడు చూపించే ప్రేమ, అంకితభావం, ఉత్సాహం తమకు ప్రేరణగా నిలిచిందని లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ మ్యాచ్ విన్నర్లతో యువీ ఒకడని మహ్మద్ కైఫ్ అన్నాడు. ఎంతో కిష్లమైన సవాళ్లను ఎదుర్కొని అత్యుత్తమ క్రీడా జీవితాన్ని నిర్మించికున్న యోధుడని కీర్తించాడు. దేశానికి అతడు అందించిన సేవలకు గర్వపడుతున్నామని పేర్కొన్నాడు. క్రికెట్లో ఒక శకం ముగిసిందని వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అన్నాడు. యువీ రిటైర్మెంట్ అభిమానులకు కచ్చితంగా నిరాశ కలిగిస్తుందని, అతడి జీవితం స్ఫూర్తిదాయకమని ప్రశంసించాడు. యువరాజ్ సింగ్ ప్రస్థానం అసామాన్యమైనదని, అద్భుతమైన క్రీడాజీవితం సాగించాడని ప్రజ్ఞాన్ ఓజా పేర్కొన్నాడు. యువీ సాధించిన విజయాలను, దేశానికి అతడు అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ఎంతో మంది సోషల్ మీడియాలో సందేశాలు, ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. (చదవండి: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన యువరాజ్ సింగ్) -
సచిన్, లక్ష్మణ్‌లు కూడా ధోని కనుసన్నల్లోనే
-
ధోని కనుసన్నల్లో.. సచిన్, లక్ష్మణ్ ప్రాక్టీస్
హైదరాబాద్: ఎంఎస్ ధోని సారథ్యంలో టీమిండియా ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందుకుంది. 28ఏళ్ల సుదీర్గ నిరీక్షణ తర్వాత టీమిండియా రెండో సారి ప్రపంచకప్‌ను ముద్దాడింది ఈ లెజెండ్ కెప్టెన్సీలోనే. ఇక ప్రపంచకప్‌తో పాటు మూడు ఐసీసీ టోర్నీలను ధోని నాయకత్వంలోనే టీమిండియా గెలుచుకుంది. అయితే మైదానంలో తనకు కావాల్సిన ప్రదర్శనను ఆటగాళ్లను నుంచి రాబట్టుకోవడంలో ధోని దిట్ట. అయితే మ్యాచ్‌లనే కాకుండా ప్రాక్టీస్‌లోనూ ఆటగాళ్ల ప్రదర్శనను పరిశీలిస్తునే వారి ప్రతిభను గుర్తించి వెలికితీస్తుంటాడు. అంతేకాకుండా వారి లోపాలను గుర్తిస్తూ తగు సూచనలిస్తాడు. అది ఎంత పెద్ద సీనియరైనా సారథిగా తన బాధ్యతను నిర్వర్తించడంలో ధోని ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. అయితే ప్రస్తుతం టీమిండియా మాజీ మానసిక నిపుణుడు ప్యాడీ ఆప్టన్ షేర్ చేసిన వీడియో తెగహల్‌చల్ చేస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. సచిన్, లక్ష్మణ్‌లు ప్రాక్టీస్ చేస్తుంటే ధోని వారిని నిశితంగా పరిశీలిస్తున్నాడు. 2008లో ఇంగ్లండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా మూడు ఇన్నింగ్స్‌ల్లో లక్ష్మణ్ పూర్తిగా విఫలమవుతాడు. అయితే ఆ ఇన్నింగ్స్‌లో బౌన్సర్లకు ఇబ్బందులు పడిన లక్ష్మణ్.. సచిన్‌తో ప్రత్యేకంగా బౌన్సర్లను వేపించుకుని ప్రాక్టీస్ చేస్తాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో లక్ష్మణ్, సచిన్‌లు చేస్తున్న ప్రాక్టీస్‌ను ధోని పరిశీలించడం ఆ వీడియోలో రికార్డయింది. అయితే ఆప్టన్ తాజాగా దానికి సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు తమకు నచ్చిన కామెంట్లతో హడావుడి చేస్తున్నారు. క్రికెట్ దిగ్గజాలు సచిన్, లక్ష్మణ్‌లు కూడా ధోని కనుసన్నల్లోనే ప్రాక్టీస్ చేస్తున్నారని కొందరు కామెంట్ చేస్తున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : సచిన్, లక్ష్మణ్‌లు కూడా ధోని కనుసన్నల్లోనే -
అంబుడ్స్‌మన్ ఎదుట హాజరైన సచిన్, లక్ష్మణ్
న్యూఢిల్లీ: పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంలో వివరణ ఇచ్చేందుకు భారత దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ మంగళవారం బీసీసీఐ అంబుడ్స్‌మన్–నైతిక విలువల అధికారి జస్టిస్ డీకే జైన్ ఎదుట హాజరయ్యారు. మూడు గంటలకు పైగా వీరిద్దరూ తమ వాదన వినిపించారు. ఈ అంశం లేవనెత్తిన మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం సభ్యుడు సంజీవ్ గుప్తా సైతం విడిగా జస్టిస్ జైన్‌ను కలిసి వివరణ ఇచ్చాడు. వాదనలన్నిటినీ లిఖితపూర్వంగా సమర్పించాలని జస్జిస్ జైన్ వీరిని ఆదేశించారు. బీసీసీఐ నియమిత క్రికెట్ సలహా మండలి సభ్యులుగా ఉన్న సచిన్, లక్ష్మణ్... ఐపీఎల్ ఫ్రాంచైజీలు ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లకు మెంటార్లుగా వ్యవహరిస్తున్నారు. తాము స్వచ్ఛందంగానే ఈ సేవలు అందిస్తున్నామని ఇద్దరూ చెబుతున్నారు. గతంలో తాను సమర్పించిన వివరణలోనూ బీసీసీఐ ఇదే విషయం స్పష్టం చేసింది. కాగా, ఇదే అంశంపై సచిన్, లక్ష్మణ్ మే 20న మరోసారి అంబుడ్స్‌మన్‌ను కలవనున్నారు. -
వార్నర్ మాట నిలబెట్టుకున్నాడు!
హైదరాబాద్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాట్స్‌మెన్, ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ మాట నిలబెట్టుకున్నాడని ఆ జట్టు మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్ తెలిపాడు. వార్నర్ ఈ సీజన్లో 500 పరుగులు చేస్తానని మాటిచ్చాడని, అన్నట్లుగానే 12 మ్యాచ్‌ల్లో 692 పరుగులు చేసాడని పేర్కొన్నాడు. ఓ ఆంగ్లపత్రికకు రాసిన కథనంలో లక్ష్మణ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘హైదరాబాద్‌లో మేమంతా ఓ షూటింగ్ మధ్యలో ఉండగా.. హెడ్ కోచ్ టామ్ మూడికి డేవీ(వార్నర్) ఓ సందేశాన్ని పంపించాడు. ఈ సీజన్లో 500 పరుగులు చేస్తానని ప్రామిస్ చేస్తున్నట్లు ఆ మెసేజ్‌లో పేర్కొన్నాడు. అతను అన్నట్లుగా తన లక్ష్యాన్ని చేరుకుంటూ ఆడిన తీరు అద్భుతం. వాస్తవానికి సీజన్ ప్రారంభంలో మేం కొంత ఆందోళనకు గురయ్యాం. గడ్డుకాలాన్ని ఎదుర్కొని వార్నర్ అప్పుడే క్రికెట్లోకి పునరాగమనం చేయడం.. పైగా మోచేతి గాయంతో బాధపడుతుండటంతో అతనిపై అంతగా అంచనాలు పెట్టుకోలేదు. కానీ అతను అద్భుతంగా ఆడాడు. అతని విపరీతమైన మానసిక ఆందోళనను అధిగమించాడు. అతని భార్య క్యాండీ అతని బలం.’ లక్ష్మణ్ పేర్కొన్నాడు. బాల్‌ట్యాంపరింగ్ ఉదంతంతో గత సీజన్ ఐపీఎల్‌కు దూరమైన వార్నర్.. ఈ సీజన్లో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. 12 మ్యాచ్‌ల్లో 8 హాఫ్ సెంచరీలు 1 సెంచరీతో 692 పరుగులు చేసి టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఇక ప్రపంచకప్ సన్నాహకంలో భాగంగా వార్నర్ స్వదేశానికి పయనమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం వార్నర్ తర్వాత కింగ్స్ పంజాబ్ ఆటగాడు కేఎల్ రాహుల్ 520 పరుగులతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. -
వీవీఎస్ లక్ష్మణ్ చర్యపై సెటైర్లు..!
సాక్షి, హైదరాబాద్ : భారత క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ చర్యపై అభిమానులు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. పంటినొప్పితో బాధపడుతున్న లక్ష్మణ్ తన చిరకాల మిత్రుడు, డెంటిస్ట్ పార్థ సాల్వేకర్ వద్ద మంగళవారం చికిత్స చేయించుకున్నాడు. పాడైపోయిన దవడ పన్ను తీయించుకున్నాడు. అనంతరం.. ‘నొప్పి అనేది రెండు రకాలు. ఒకటి శారీరమైనది. రెండోది మానసికమైనది. కానీ, పంటి సమస్య ఈ రెండు సమస్యల్ని తట్టిలేపుతుంది’ అంటూ ట్వీట్ చేశాడు. ఆస్పత్రిలో ఉన్న ఫొటోతోపాటు.. తొలగించిన పన్ను ఫొటో కూడా పోస్టు చేశాడు. (చదవండి :అంబుడ్స్‌మన్ ముందుకు సచిన్, లక్ష్మణ్! ) అయితే, అభిమానులు కొందరు లక్ష్మణ్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేయగా.. మరికొందరు మాత్రం.. యాక్ ఛీ..! రక్తంతో కూడిన మీ పన్ను చూపిస్తున్నారేంటి అని చీదరించుకుంటున్నారు. ఈ ఫొటో అవసరమా అని కామెంట్ చేస్తున్నారు. మరొక అభిమాని.. ‘మీరు ఇలాగే మరిన్ని పళ్లు పీకించుకునేందుకు మీ ఫ్రెండ్‌ను తలచూ కలవాలి’ అని సెటైర్ వేశారు. ‘పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందావంటూ నోటీసులు వచ్చాయి. కదా.. బీసీసీఐకి ఈ ఎర్రటి ‘పన్ను’ పంపించు. లెక్క సరిపోతుంది’ అంటూ సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. క్రికెట్ అడ్వయిజరీ కమిటీ (సీఏసీ)లో సభ్యుడిగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మెంటార్‌గా పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో వీవీఎస్ లక్ష్మణ్ వ్యక్తిగతంగా హాజరు కావాలని అంబుడ్స్‌మన్ సమన్లు పంపిన సంగతి తెలిసిందే. ‘సీఏసీ సభ్యులుగా మా బాధ్యతలేమిటి, పరిధేంటి, ఇంతకీ మా సభ్యుల పదవీ కాలమెంతో చెప్పాలని మేం గతేడాది డిసెంబర్ 7న సీఓఏ చీఫ్ వినోద్ రాయ్‌కి లేఖ రాశాం. అయితే ఇప్పటివరకు దీనిపై స్పందనే లేదు. కేవలం సీఏసీ అనేదొకటి ఉందని, అది పనిచేస్తుందిలే అనే విధంగానే వ్యవహారం నడుస్తోంది. దురదృష్టమేంటంటే అది ఎంతవరకు కొనసాగుతుందో ఎవరికీ తెలియదు’ అని అంబుడ్స్‌మన్‌కు లక్ష్మణ్ సంజాయిషీ లేఖ రాశాడు. Some pains are physical, some are mental, the one that is both is dental. Was having severe tooth pain & had to get my wisdom tooth extracted by my childhood friend @ParthSatwalekar who was my school & college captain and now is a successful dentist in Hyderabad. Blessed 🙏🏼 pic.twitter.com/BVBAGs2r6z — VVS Laxman (@VVSLaxman281) April 30, 2019 -
అంబుడ్స్‌మన్ ముందుకు సచిన్, లక్ష్మణ్!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అంబుడ్స్‌మన్ ముందుకు అవసరమైతే బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్, లక్ష్మణ్‌లు హాజరయ్యే అవకాశాలున్నాయి. పరస్పర విరుద్ధ ప్రయోజనాల కేసు విచారణలో అంబుడ్స్‌మన్ కమ్ ఎథిక్స్ ఆఫీసర్ రిటైర్డ్ జస్టిస్ డీకే జైన్ వారిద్దరినీ వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరుతూ సమన్లు పంపితే... అప్పుడు బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రి, లీగల్ టీమ్ కూడా హాజరవుతుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే అంబుడ్స్‌మన్ నోటీసులకు భారత విఖ్యాత క్రికెటర్లిద్దరూ లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సభ్యులుగా ప్రతిఫలం ఆశించకుండా పనిచేస్తున్నామని, అలాంటపుడు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు సలహాదారులుగా ఉంటే పరస్పర విరుద్ధ ప్రయోజనాలను ఎలా ఆపాదిస్తారని ముంబై ఇండియన్స్ మెంటార్ సచిన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మెంటార్ లక్ష్మణ్ తమ సంజాయిషీ లేఖలో తెలిపారు. సహజ న్యాయసూత్రాల ప్రకారం గంగూలీ అంబుడ్స్‌మన్ ముందుకు వచ్చినట్లే వాళ్లిద్దరు రావాల్సిన అవసరముంటుందని బీసీసీఐ భావిస్తోంది. అప్పుడు బోర్డు సీఈఓ కూడా విచారణకు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. వివాదాస్పద పేసర్ శ్రీశాంత్ విచారణలోనూ సీఈఓ హాజరయ్యారని ఆ అధికారి తెలిపారు. -
మాకే తెలియదు మా పాత్రేమిటో!
న్యూఢిల్లీ: భారత బ్యాటింగ్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ హైదరాబాదీ సొగసరి బ్యాట్స్‌మన్‌గానే సుపరిచితుడు. మైదానంలో, వెలుపల ఎక్కడా ఆగ్రహించిన దాఖలాలు లేవు. సహనం కోల్పోయిన సందర్భాలు లేవు. అలాంటి లక్ష్మణ్ బీసీసీఐ అంబుడ్స్‌మన్‌కు రాసిన సంజాయిషీ లేఖలో పరిపాలక కమిటీ (సీఓఏ) వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ)లో తమ బాధ్యతలేంటో ఇప్పటికీ తమకే తెలియదని వెల్లడించాడు. అంబుడ్స్‌మన్, ఎథిక్స్ అధికారి రిటైర్డ్ జస్టిస్ జైన్ పంపిన నోటీసుకు స్పందనగా రాసిన లేఖలో ఈ విషయాలన్నీ పేర్కొన్నాడు. అసలు పరిధి, పదవీకాలం తెలియని సీఏసీ సభ్యుడిని అవడం, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ సలహాదారుగా ఉండటం ఏ రకంగా పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందో చెప్పాలన్నాడు. ఇందులో అసలు ప్రయోజనాలే ఉంటే ఏ సవాలుకైనా సిద్ధమన్నాడు. ‘సీఏసీ సభ్యులుగా మా బాధ్యతలేమిటి, పరిధేంటి, ఇంతకీ మా సభ్యుల పదవీ కాలమెంతో చెప్పాలని మేం గతేడాది డిసెంబర్ 7న సీఓఏ చీఫ్ వినోద్ రాయ్‌కి లేఖ రాశాం. అయితే ఇప్పటివరకు దీనిపై స్పందనే లేదు. కేవలం సీఏసీ అనేదొకటి ఉందని, అది పనిచేస్తుందిలే అనే విధంగానే వ్యవహారం నడుస్తోంది. దురదృష్టమేంటంటే అది ఎంతవరకు కొనసాగుతుందో ఎవరికీ తెలియదు’ అని లేఖలో తీవ్రస్థాయిలో లక్ష్మణ్ ప్రస్తావించాడు. తన అనుభవం, ఆలోచనలతో భారత క్రికెట్‌కు అర్థవంతమైన మేలుచేయగలననే నమ్మకంతో కమిటీ సభ్యుడయ్యేందుకు అంగీకరించానని... భారత క్రికెట్ సూపర్‌పవర్‌గా వెలుగొందాలనే లక్ష్యంతోనే బాధ్యతలు స్వీకరిస్తూ ప్రతిఫలాన్ని నిరాకరించానని వివరించాడు. నోటీసులపై ముందుగా సచిన్ ఆదివారం సంజాయిషీ లేఖ పంపాడు. ముంబై ఇండియన్స్ సలహాదారుగా తాను ఎలాంటి లబ్ధి పొందనపుడు విరుద్ధ ప్రయోజనాలెలా అవుతాయన్నాడు. తమపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని, అసంబద్ధమైనవని చెప్పాడు. నిజానికి సీఓఏ మహిళా జట్టు కోచ్ ఎంపిక క్రతువులో తమ ముగ్గురు సభ్యులకు అసలు సమయమే ఇవ్వలేదని లక్ష్మణ్ అన్నాడు. -
కోహ్లి లోపాల్ని పసిగట్టేశారు..!
హైదరాబాద్: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ టెక్నిక్‌లో లోపాల్ని స్పిన్నర్లు పసిగట్టడం వల్లే అతను తరుచు స్పిన్ బౌలింగ్‌కు చిక్కుతున్నాడని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. తాజా ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకూ ఆర్సీబీ నాలుగు మ్యాచ్‌లు ఆడగా, అందులో ఆ జట్టు కెప్టెన్ రెండుసార్లు స్పిన్నర్లకు ఔట్ కావడాన్ని ఇక్కడ ప్రస్తావించాడు. అందుకు కారణం విరాట్ బ్యాటింగ్ టెక్నిక్‌ను స్పిన్నర్లు దొరకబుచ్చుకోవడమేనని లక్ష్మణ్ పేర్కొన్నాడు. (ఇక్కడ చదవండి: అమ్మా.. ధోనికే మన్కడింగా?) ఇలా స్పిన్నర్లకు కోహ్లి పదే పదే ఔట్ కావడం తొలిసారి కాదని, గతంలో కూడా చాలాసార్లు స్పిన్ బౌలింగ్‌లోనే అతను ఔట్ కావడాన్ని చూశామన్నాడు. ప్రధానంగా స్పిన్నర్ల నుంచి వచ్చే గుగ్లీలకు కోహ్లి ఔట్ అవుతున్నాడని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మెంటార్‌గా ఉన్న లక్ష్మణ్ స్పష్టం చేశాడు. ‘గతేడాది ముజీబ్ ఉర్ రహ్మాన్, ఆడమ్ జంపా, మయాంక్ మార్కండేలకు విరాట్ కోహ్లి ఔటయ్యాడు. ప్రస్తుత సీజన్లో కూడా కోహ్లి రెండు సందర్భాల్లో స్పిన్‌కు చిక్కాడు. అందులో కోహ్లిని రాజస్తాన్ స్పిన్నర్ శ్రేయస్ గోపాల్ ఔట్ చేసిన విధానం అద్వితీయం. దీనిపై విరాట్ కోహ్లి సీరియస్‌గా దృష్టి సారించాల్సి ఉంది. కోహ్లి కచ్చితంగా అసాధారణ ఆటగాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ స్పిన్ బౌలింగ్‌లో కోహ్లి వికెట్ సమర్పించుకోవడం అతని బ్యాటింగ్ టెక్నిక్‌లో లోపమే. దీన్ని కోహ్లి అధిగమిస్తాడనే అనుకుంటున్నా’ అని లక్ష్మణ్ పేర్కొన్నాడు. -
వార్నర్‌కు సరితూగలేరెవ్వరూ...
సాక్షి, హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్, ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆటగాడిగానే కాకుండా అతని సారథ్య నైపుణ్యాల ముందు వేరే వారెవరూ సాటిరాలేరని కితాబిచ్చాడు. బాల్ ట్యాంపరింగ్ ఉదంతం తర్వాత ఏడాది పాటు నిషేధాన్ని ఎదుర్కొన్న వార్నర్... ఐపీఎల్ ఆడేందుకు భారత్ వచ్చాడు. మరోవైపు జట్టులో కొత్తగా చేరిన సభ్యుల పరిచయ కార్యక్రమాన్ని బుధవారం సన్‌రైజర్స్ యాజమాన్యం నిర్వహించింది. మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్), జానీ బెయిర్‌స్టో (ఇంగ్లండ్), విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, షాబాజ్ నదీమ్ (భారత్)లు ఈ సీజన్ నుంచి సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పరిచయ కార్యక్రమంలో జట్టు ఆటగాళ్లతో పాటు కోచ్ టామ్ మూడీ, మెంటార్ లక్ష్మణ్, బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ పాల్గొన్నారు. వార్నర్ రాకతో జట్టు పటిష్టమైందని, అతనో ప్రపంచ స్థాయి క్రీడాకారుడని లక్ష్మణ్ అన్నాడు. ‘ప్రస్తుత సారథి కేన్ విలియమ్సన్కు వార్నర్ తోడవ్వడంతో సన్‌రైజర్స్ ఇంకా పటిష్టంగా మారింది. గతంలో సారథిగా వార్నర్ జట్టును నడిపించిన తీరుపట్ల ఫ్రాంచైజీ గర్విస్తోంది. మ్యాచ్ విన్నర్‌గానే కాకుండా కెప్టెన్‌గా అతని ప్రతిభకు సాటి లేదు. బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా వార్నర్ యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తాడు’ అని లక్ష్మణ్ వివరించాడు. ఏడాది పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నప్పటికీ... దాని ప్రభావం వార్నర్‌పై ఉండబోదని కోచ్ టామ్ మూడీ అభిప్రాయ పడ్డాడు. ‘వార్నర్ సానుకూలంగా ఆలోచించే వ్యక్తి. అతనో దిగ్గజ ఆటగాడు. ఎప్పుడూ ఏదో సాధించాలనే జిజ్ఞాసతో ఉంటాడు. కొంతకాలం అతని నుంచి క్రికెట్‌ను దూరం చేసినంత మాత్రాన... అతని దృక్పథంలో ఎలాంటి మార్పు ఉండదు’ అని మూడీ విశ్లేషించాడు. కేన్ విలియమ్సన్ ప్రపంచమంతా గౌరవించదగిన అత్యుత్తమ ఆటగాడు, గొప్ప లీడర్ అని మూడీ పేర్కొన్నాడు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ అండర్–19 ప్లేయర్ అభిషేక్ శర్మ, ఇండియా ‘ఎ’ లెఫ్టార్మ్ స్పిన్పర్ షాబాజ్ నదీమ్ చేరికతో సన్‌రైజర్స్ బౌలింగ్ దళం పటిష్టమైందని అన్నాడు. గతేడాదితో పోలిస్తే ఈసారి స్పిన్నర్లు, పేసర్లతో జట్టు సమతూకంగా ఉందని తెలిపాడు. -
ప్రపంచకప్‌కు పంత్ వద్దు!
న్యూఢిల్లీ : ప్రపంచకప్‌కు యువ సంచలనం, వికెట్ కీపర్ రిషభ్ పంత్ అవసరం లేదని టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. ఈ మెగా టోర్నీకి సీనియర్ వికెట్ కీపర్ ధోని, బ్యాకప్ కీపర్‌గా దినేశ్ కార్తీక్‌లు సరిపోతారని చెప్పుకొచ్చాడు. స్టార్ స్పోర్ట్స్‌తో లక్ష్మణ్ మాట్లాడుతూ.. లిమిటెడ్ ఫార్మాట్లో పంత్ ఫామ్‌లో లేడని, గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 4, 40 నాటౌట్, 28,3,1 పరుగులే అతని ప్రదర్శనను తెలియజేస్తున్నాయని తెలిపాడు. ప్రపంచకప్ టోర్నీ చాలా ప్రధానమైనదని, ఇలాంటి టోర్నీలకు యువ ఆటగాళ్ల కన్నా.. అనుభవం ఉన్న సీనియర్ ఆటగాళ్లకే ప్రాధాన్యత ఇవ్వాలన్నాడు. సెలక్టర్లు పంత్‌ను పక్కనబెట్టి కార్తీక్‌ను ఎంపిక చేయాలని చెప్పుకొచ్చాడు. ఇక బౌలింగ్ విభాగంలో నలుగురు పేసర్లు మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ ఖలీల్ అహ్మద్, ఇద్దరు స్పిన్నర్లు చహల్, కుల్దీప్లతో భారత్ బరిలోకి దిగాలన్నాడు. లక్ష్మణ్ ప్రకటించిన ప్రపంచకప్ జట్టు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని, కేదార్‌జాదవ్, హార్ధిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యుజవేంద్ర చహల్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్, షమీ, రాహుల్ , దినేష్ కార్తీక్, ఖలీల్ -
కోచ్‌గా కుంబ్లేనే కొనసాగించాలనుకున్నాం..
సాక్షి, విశాఖపట్నం: టీమిండియా కోచ్‌గా అనిల్ కుంబ్లేనే కొనసాగించాలని తమ క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) భావించిందని... అయితే కుంబ్లే మాత్రం వైదొలగేందుకే నిర్ణయం తీసుకున్నాడని సీఏసీ సభ్యుడైన వీవీఎస్ లక్ష్మణ్ వెల్లడించాడు. అతనితో పాటు మిగతా సభ్యులు సచిన్, సౌరవ్ గంగూలీ 2016లో కోచ్‌గా కుంబ్లేను ఎంపిక చేశారు. అయితే గతేడాది కెప్టెన్ కోహ్లితో తలెత్తిన విభేదాల కారణంగా కోచ్ పదవి నుంచి కుంబ్లే తప్పుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత కోచ్‌గా కొనసాగేందుకు సుముఖత చూపలేదు. వెస్టిండీస్ పర్యటన దాకా అతని పదవీ కాలం ఉన్నప్పటికీ రాజీనామా చేశాడు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన లక్ష్మణ్ ఈ ఉదంతం తమ కమిటీకి చేదు గుళికను మిగిల్చిందని అభిప్రాయపడ్డాడు. ‘కోహ్లి హద్దు దాటాడని నేను భావించడం లేదు. అయితే మా కమిటీ మాత్రం కుంబ్లేను కొనసాగించాలనుకుంది. కానీ తను మాత్రం వైదొలగడమే సరైన నిర్ణయమని చెప్పేశాడు. ఏదేమైనా సీఏసీకిది చేదు అనుభవం. మా కమిటీ ఓ మ్యారేజ్ కౌన్సెలింగ్ సంస్థ కాదని చాలా మందికి చెప్పాను. మా పని కోచ్ పదవికి అర్హతలున్న వారిలో మెరుగైన వ్యక్తిని ఎంపిక చేయడమే. దురదృష్టం కొద్దీ కోహ్లి–కుంబ్లేల జోడీ కుదరలేదు’ అని బ్యాటింగ్ దిగ్గజం అన్నాడు. ‘281’ భారత క్రికెటర్ అద్భుత ఇన్నింగ్స్ బెంగళూరు: ఈడెన్ గార్డెన్స్‌లో 2001లో ఆస్ట్రేలియాపై ‘వెరీ వెరీ స్పెషల్’ బ్యాట్స్‌మన్ లక్ష్మణ్ చేసిన 281 పరుగుల వీరోచిత పోరాటం ఓ భారతీయుడి అద్భుత ఇన్నింగ్స్ అని మాజీ కెప్టెన్ ద్రవిడ్ కితాబిచ్చాడు. లక్ష్మణ్ ఆత్మకథ ‘281 అండ్ బియాండ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ద్రవిడ్ మాట్లాడుతూ ‘ఇందులో సందేహమే లేదు. అప్పటి పరిస్థితులు, మేటి జట్టుతో పోటీ దృష్ట్యా లక్ష్మణ్ చేసిన 281 స్కోరు ఓ భారత క్రికెటర్ ఆడిన అద్భుత, అసాధారణ ఇన్నింగ్స్. ఆ సందర్భంలో అతనితో పాటు క్రీజులో ఉన్న నాకు ఘనచరిత్రలో భాగమయ్యే అదృష్టం దక్కింది. ఇప్పటికీ ఆ ఇన్నింగ్స్ నా మదిలో మెదులుతుంది. అతని పోరాటం గుర్తుకొస్తుంది. గింగిరాలు తిరిగే కంగారూ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ బంతుల్ని ఆడిన నేర్పు... క్రీజులో ఎంతసేపున్నా అలసిపోని ఓర్పు చాలా గ్రేట్! మెక్‌గ్రాత్, గిలేస్పి సీమ్ బౌలింగ్‌లో అతని డ్రైవ్‌లు అద్భుతం. ఇదంతా అతి సమీపం నుంచి చూసిన అదృష్టం నాది’ అని చెప్పుకొచ్చాడు. అదేపనిగా ఇంట్లో కూర్చొని టీవీలో క్రికెట్ చూడటం తనకు ఇష్టం వుండదని, కానీ లక్ష్మణ్ ఇన్నింగ్స్ వస్తే మాత్రం చూడకుండా వుండలేనని ద్రవిడ్ తెలిపాడు. ఈ కార్యక్రమంలో భారత క్రికెట్ దిగ్గజాలు గుండప్ప విశ్వనాథ్, కుంబ్లే, ప్రసన్నలతో పాటు రోజర్ బిన్నీ, కిర్మాణి, జవగళ్ శ్రీనాథ్, దొడ్డ గణేష్, రాబిన్ ఉతప్ప పాల్గొన్నారు. -
‘నా కెరీర్‌ను కాపాడింది లక్ష్మణ్ ఇన్నింగ్సే’
కోల్‌కతా: దాదాపు 17 ఏళ్ల క్రితం ఆసీస్‌తో జరిగిన టెస్టులో వీవీఎస్ లక్ష్మణ్ సాధించిన 281 పరుగుల్ని ఆనాటి టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి గుర్తు చేసుకున్నాడు. కోల్‌కతాలో జరిగిన ఆ టెస్టులో లక్ష్మణ్ వీరోచిత ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను గెలిపించకపోతే ఆ సిరీస్‌లో టైటిల్‌ను సాధించలేకపోయేవాళ్లమన్నాడు. ఒకవేళ ఆ టెస్టు మ్యాచ్‌ను కోల్పోతే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉండేవన్నాడు. ఆసీస్‌తో మ్యాచ్‌ను కోల్పోయిన పక్షంలో తాను మళ్లీ కెప్టెన్ అయ్యేవాడిని కాదంటూ లక్ష్మణ్ ఇన్నింగ్స్‌పై ప్రశంసలు కురిపించాడు. అదొక అసాధారణ ఇన్నింగ్స్ అంటూ గంగూలీ కొనియాడాడు. అప్పటి లక్ష్మణ్ ఇన్నింగ్స్ కచ్చితంగా తన కెరీర్‌ను కాపాడిందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. అయితే టెస్టుల్లో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న వీవీఎస్ లక్ష్మణ్‌ను.. 2003 వరల్డ్‌కప్ నుంచి తప్పించడం తాము చేసిన పొరపాటు కావొచ్చన్నాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన ఆ వరల్డ్‌కప్‌లో లక్ష్మణ్‌ను తప్పించిన గంగూలీ.. దినేశ్ మోంగియాకు అవకాశం కల్పించాడు. ఆ మెగా టోర్నీలో ఫైనల్‌కు చేరిన భారత్.. ఆసీస్ చేతిలో ఓటమి పాలైంది. ఆ కీలక మ్యాచ్‌లో దినేశ్ మోంగియా ఫెయిల్ కావడంతో గంగూలీపై విమర్శలు వచ్చాయి. తాజాగా దీనిపై మాట్లాడిన గంగూలీ.. ఆసీస్‌పై మంచి రికార్డు ఉన్న లక్ష్మణ్‌ను తప్పించడం తప్పిదం కావొచ్చనే అభిప్రాయన్ని వ్యక్తం చేశాడు. కాకపోతే ఒక కెప్టెన్‌గా తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు సరైనవిగా ఉంటే, మరికొన్ని సార్లు తప్పిదాలుగా మారుతాయన్నాడు. అప్పటి పరిస్థితుల్ని బట్టి జట్టు ఎంపిక జరిగిందన్నాడు. 2001లో భారత్ పర్యటనకు వచ్చిన ఆసీస్.. తొలి టెస్టులో గెలిచి మంచి జోరు మీద ఉంది. అయితే రెండో టెస్టులో టీమిండియా విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో లక్ష్మణ్ 281 పరుగులు నమోదు చేయగా ద్రావిడ్ 180 పరుగులతో మెరిశాడు. వీరి ఇన్నింగ్స్‌లు భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఆపై మూడో టెస్టులో భారత్ విజయం నమోదు చేయడంతో సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. -
విరాట్ కోహ్లి మరో రికార్డు
అడిలైడ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో రికార్డు సాధించాడు. ఆసీస్ గడ్డపై వెయ్యి పరుగుల్ని వేగవంతంగా సాధించిన భారత ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. తాజాగా అడిలైడ్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. భారత రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా ఆస్ట్రేలియాలో వెయ్యి టెస్టు పరుగుల మార్కును చేరాడు. ఆస్ట్రేలియాలో 18 ఇన్నింగ్స్‌ల్లోనే కోహ్లి వెయ్యి పరుగులు సాధించి భారత ఆటగాళ్ల జాబితాలో తొలి స్థానంలో నిలిచాడు. ఫలితంగా ఇప్పటివరకూ వీవీఎస్ లక్ష్మణ్ పేరిట ఉన్న రికార్డును కోహ్లి బద్ధలు కొట్టాడు. ఆసీస్ గడ్డపై లక్ష్మణ్ వెయ్యి పరుగులు సాధించడానికి 19 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా, కోహ్లి 18 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ ఫీట్‌ను అందుకున్నాడు. ఆస్ట్రేలియాలో వెయ్యి టెస్టు పరుగుల్ని వేగవంతంగా అందుకున్న టీమిండియా క్రికెటర్ల జాబితాలో కోహ్లి, లక్ష్మణ్ తర్వాత స్థానాల్లో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్‌లు ఉన్నారు. ఇక్కడ సచిన్, సెహ్వాగ్‌లు 22 ఇన్నింగ్స్‌ల్లో, ద్రవిడ్ 25 ఇన్నింగ్స్‌ల్లో ఆస్ట్రేలియాలో వెయ్యి పరుగుల్ని సాధించారు. ఆసీస్‌తో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి 34 పరుగులు చేసి ఔటయ్యాడు. టీమిండియా నిలకడగా.. మేము కోహ్లిలా మొరటోళ్లం కాదు! -
పోలీసులకు.. క్రికెట్ దిగ్గజం సెల్యూట్
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సమయస్పూర్తిని టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలతో ముంచెత్తారు. హైదరాబాద్‌లో గుండెపోటుతో చావు అంచుల వరకు వెళ్లిన ఓ వ్యక్తిని ఇద్దరు కానిస్టేబుళ్లు మానవత్వంతో కాపాడారు. బహదూర్‌పుర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుళ్లు కే చందన్, ఇన్నయతుల్లాలు సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిసస్సీటేషన్) ప్రక్రియ ద్వారా కుప్పకూలిన మనిషికి తిరిగి ప్రాణం పోశారు. నిజంగా ఇతరులకు సేవ చేయాలనే కోరిక మానవునికున్న అన్నిలక్షణాల్లోకెల్లా గొప్పది అని వారికి సెల్యూట్ అంటూ వీడియోతో పాటూ లక్ష్మణ్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సమయస్పూర్తితో వ్యవహరించి ఓ వ్యక్తి ప్రాణాలు పోలీసులిద్దరూ కాపాడారంటూ నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సంఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. అయితే వారు అనుసరించిన సీపీఆర్ ప్రక్రియ సరైన పద్దతిలో లేదని అయినా వారు చూపించిన చొరవ చాలా గొప్పదని ఓ నెటిజన్ పెట్టిన కామెంట్‌కు వీవీఎస్ లక్ష్మణ్ బదులిచ్చారు. అవును అయినా వారిద్దరు స్పూర్తినిచ్చే పని చేశారని కొనియాడారు. సీపీఆర్ ఎలా చేయాలి : మనదేశంలో సంభవిస్తున్న గుండెపోటు మరణాల్లో సగం కేవలం ప్రథమచికిత్స అందకే సంభవిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గుండెపోటును గుర్తించగానే తక్షణ ప్రథమచికిత్సగా సీపీఆర్ చేయాలి. సీపీఆర్ కేవలం వైద్యులు లేక పారామెడికల్ సిబ్బంది మాత్రమే కాకుండా కొద్దిపాటి శిక్షణ పొందిన ఎవరైనా చేయొచ్చు. సీపీఆర్ వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి, అది మెదడుకు చేరి అవయవాలకు తగిన సంకేతాలనివ్వటంతో బాధితుడు వేగంగా ప్రమాదం నుంచి బయటపడతాడు. ముందుగా గుండెపోటుతో పడిపోయిన బాధితుడిని పడుకోబెట్టాలి. అతని పక్కనే ఎవరైనా మోకాళ్ల మీద కూర్చుని.. రెండుచేతులనూ కలిపి.. బలంగా బాధితుడి ఛాతీ ఎముక మీద లయబద్ధంగా నొక్కుతుండాలి. ఇలా నొక్కినప్పుడు గుండె పంపింగ్ జరిగి.. రక్తప్రసారం మెరుగవుతుంది. ఒకవైపు ఇలా చేస్తూనే మరో వైపు నోటి ద్వారా శ్వాస అందించాలి. ఒకరి కంటే ఇద్దరు సీపీఆర్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. జాగ్రత్తలు ► సీపీఆర్ కు ముందు బాధితుడు సృహలో ఉన్నాడా లేదా అని గమనించాలి. ఆ వ్యక్తి స్పందించకపోతే పెద్దగా అరవాలి. ► సీపీఆర్ చేసేటప్పుడు భుజాన్ని అటూ ఇటూ కదిలిస్తూ అతనికి ధైర్యం చెప్పాలి. ప్రమాదం లేదని హామీ ఇవ్వాలి. ► బాధితుడికి గాలి ఆడకుండా చుట్టూ జనాలు మూగితే వారిని పక్కకు వెళ్లేలా చూడాలి. ► ఒకవేళ అప్పటికే బాధితుడు సృహ కోల్పోయి స్పందించకపోతే వెంటనే అంబులెన్స్‌కి సమాచారం ఇవ్వాలి. అవసరం మేరకు 'ఎఇడి' సీపీఆర్ తో చెప్పుకోదగ్గ ఫలితం లేని కేసుల్లో ఎఇడి (ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిల్లేటర్) తప్పనిసరి. ఎఇడి పరికరంలో రెండు ప్యాడ్లను బాధితుడి ఛాతి మీద పెట్టి విద్యుత్ షాక్ ఇస్తారు. ‘షాక్ ఇవ్వండి, ఆపండి’ అంటూ పరికరం చేసే సూచనలను పాటిస్తూ చేయాలి. పెద్ద పెద్ద కార్యాలయాలు, అపార్టుమెంట్లు, సమావేశ మందిరాల వద్ద తప్పనిసరిగా వీటిని అందుబాటులో ఉంచగలిగితే ఇప్పుడు సంభవించే మరణాల్లో 30 నుంచి 50శాతం వరకు తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
అది ధోనిపై వేసిన జోక్ మాత్రమే: లక్ష్మణ్
హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్లో సాగిన 16 ఏళ్ల కెరీర్లో స్టయిలిష్ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ ఎప్పుడూ వివాదాల జోలికి పోలేదు. జెంటిల్మన్ క్రికెటర్‌గానే ఆటను ముగించాడు. వీవీఎస్ లక్ష్మణ్ అనగానే అందరికీ కోల్‌కతా 281 ఇన్నింగ్స్ గుర్తుకు వస్తుంది కాబట్టి దానిని టైటిల్‌గా పెట్టి ఒక పుస్తకాన్ని తీసుకొచ్చాడు లక్ష్మణ్. ఇందులో గతంలో ఎంఎస్ ధోనితో ఏర్పడిన వివాదాల గురించి స్పష్టతనిచ్చాడు. తనకు ధోనితో ఎటువంటి విభేదాలు లేవని పుస్తకంలో పేర్కొన్నాడు. తన ఆకస్మిక రిటైర్మెంట్ వెనుకు ధోని పాత్ర ఎంతమాత్రం లేదన్నాడు. దీనికి సంబంధించి ‘281 అండ్ బియాండ్’ పుస్తకంలో ఆనాటి విషయాలను పేర్కొన్నాడు. ‘నా రిటైర్మెంట్ నిర్ణయంపై ముందుగా మీడియాకు తెలిపా. ఆ క్రమంలో మీడియా నుంచి కొన్ని ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. టీమ్ సభ్యులకు సమాచారం ఇచ్చారా. ప్రధానంగా జట్టు కెప్టెన్‌గా ఉన్న ధోనికి తెలిపారా?’ అని మీడియా మిత్రులు అడిగారు. ఆ సమయంలో జట్టు సభ్యులకు తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని చెప్పినా, ధోనికి చెప్పలేదని పరోక్షంగా వారికి తెలియజేశా. ఆ క్రమంలోనే ధోనిని చేరుకోవడం ఎవరికైనా చాలా కష్టం అని వ్యాఖ్యానించా. అది ధోనిపై వేసిన జోక్ మాత్రమే. దానికి ధోనితో వివాదం అని ముడిపెట్టారు. నా రిటైర్మెంట్ సంబంధించి ధోనిని ఎప్పుడూ విమర్శించలేదు. నా క్రికెట్ కెరీర్లో వివాదం ఏదైనా ఉందంటే అదే మొదటిది.. చివరిది కూడా’ అని పుస్తకంలో లక్ష్మణ్ పేర్కొన్నాడు. -
వీవీఎస్ లక్ష్మణ్ ఆత్మకథ పుస్కకావిష్కరణ
-
కావాలని వివాదాలు చేర్చలేదు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్లో సాగిన 16 ఏళ్ల కెరీర్లో స్టయిలిష్ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ ఎప్పుడూ వివాదాల జోలికి పోలేదు. జెంటిల్మన్ క్రికెటర్‌గానే ఆటను ముగించాడు. ఇప్పుడు లక్ష్మణ్ కెరీర్, విజయాలు, వైఫల్యాలు, వ్యక్తిగత అంశాలతో అతని ఆత్మ కథ అందుబాటులోకి వస్తోంది. ‘281 అండ్ బియాండ్’ పేరుతో వస్తున్న ఈ పుస్తకం ఈ నెల 15న విడుదల కానుంది. సీనియర్ క్రీడా పాత్రికేయుడు ఆర్. కౌశిక్ సహ రచయితగా ఉన్న ఈ పుస్తకాన్ని వెస్ట్‌లాండ్ పబ్లికేషన్స్ ప్రచురిస్తోంది. ఈ నేపథ్యంలో తన పుస్తకం విశేషాల గురించి లక్ష్మణ్ మాట్లాడాడు. పుస్తకాన్ని సంచలనంగా మార్చేందుకు ఎలాంటి మసాలాలు దట్టించలేదని అతను అన్నాడు. చాలా ఆత్మ కథల తరహాలో పనిగట్టుకొని వివాదాలు సృష్టించే ప్రయత్నం చేయలేదని వీవీఎస్ చెప్పాడు. ‘నా పుస్తకంలో కావాలని చొప్పించిన వివాదాస్పద అంశాలు ఏవీ ఉండవు. అయితే ఇందులో ప్రతీ అక్షరం నిజాయితీగా రాశానని చెప్పగలను. అయితే నాడు స్పందించలేకపోయిన కొన్ని సందర్భాల గురించి మాత్రమే స్పష్టంగా ప్రస్తావించాను. 2000లో ముంబైలో దక్షిణాఫ్రికాతో టెస్టు తర్వాత నన్ను అనూహ్యంగా జట్టు నుంచి తప్పించడం, ఇకపై ఓపెనర్‌గా ఆడనంటూ కచ్చితంగా చెప్పేసిన విషయం, 2003 ప్రపంచకప్‌కు ఎంపిక కాకపోవడంపై నేను పడిన వేదనలాంటివి ఇందులో ఉన్నాయి. వివాదం అనే మాటను వాడను కానీ నా మనసులో అనుకున్న విషయాలు మాత్రం నిజాయితీగా వెల్లడిస్తున్నాను’ అని ఈ హైదరాబాదీ వ్యాఖ్యానించాడు. చిన్నప్పుడు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవడం నుంచి రిటైర్మెంట్ వరకు అనేక ఆసక్తికర అంశాలతో పాటు రిటైర్మెంట్ తర్వాతి జీవితం, కుటుంబం తదితర విశేషాలు ఇందులో ఉన్నాయని అతను వెల్లడించాడు. కేవలం క్రికెటర్లకే కాకుండా... చిన్నారులను క్రీడల్లో ప్రోత్సహించే విషయంలో తల్లిదండ్రులకు కూడా తన అనుభవాలు ఉపయోగపడతాయని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. వీవీఎస్ లక్ష్మణ్ అనగానే అందరికీ కోల్‌కతా 281 ఇన్నింగ్స్ గుర్తుకు వస్తుంది కాబట్టి దానిని టైటిల్‌గా పెట్టామని వీవీఎస్ స్పష్టం చేశాడు. -
వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్లో ఆంతర్యమేమిటో?
హైదరాబాద్: వీవీఎస్ లక్ష్మణ్.. క్రికెట్ ప్రపంచానికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తన క్రికెట్ కెరీర్లో ‘వెరీ వెరీ స్పెషల్’గా గుర్తింపు పొందిన వీవీఎస్ తాజాగా చేసిన ట్వీట్ ఆసక్తిని రేపుతోంది. త్వరలోనే వెరీ వెరీ స్పెషల్ స్టోరీ రాబోతుందంటూ లక్ష్మన్ తన ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. అయితే వెరీ వెరీ స్పెషల్‌గా రాబోతున్నది ఏంటాని క్రికెట్ ప్రేమికుల్లో చర్చ సాగుతోంది. అతని జీవిత కథ ఆధారంగా ఒక పుస్తకాన్ని వీవీఎస్ లక్ష్మణ్ తీసుకు రాబోతున్నాడా? లేక ఈ పేరుతో ఏమైనా సినిమా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడా? అనేది ఆసక్తికరం. ఈ వెరీ వెరీ స్పెషల్ స్టోరీ అంటూ లక్ష్మణ్ చేసిన ట్వీట్లో ఉన్న ఆంతర్యమేమిటో అతనే చెప్పాలి. రక్త మూలకణ దాతగా వీవీఎస్ లక్ష్మణ్ బ్లడ్ స్టెమ్‌సెల్ డోనర్ (రక్త మూలకణ దాత)గా పేరును నమోదు చేయించుకున్నాడు. స్వచ్ఛంద సంస్థ దాత్రి నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన లక్ష్మణ్ ప్రతి ఒక్కరు బ్లడ్ స్టెమ్‌సెల్ దానం చేయవచ్చని, మరొకరి జీవితం పొడిగింపునకు అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నాడు. లాభాపేక్ష లేకుండా రక్తదానం చేసి మరొకరి ప్రాణం కాపాడాలని పిలుపునిచ్చాడు.మంచి పనికి ప్రతి ఒక్కరూ కదిలిరావాలని, ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని లక్ష్మణ్ కోరాడు. A very very special announcement - coming soon ! pic.twitter.com/ReuOdfI08l — VVS Laxman (@VVSLaxman281) 30 October 2018 -
భళారే అఫ్గాన్ భళా !
దుబాయ్ : ఆసియాకప్‌లో అఫ్గానిస్తాన్ ప్రదర్శన ఔరా అనిపించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బలమైన భారత్‌ను ఓడించినంత పనిచేసింది. ఓటమి అంచుల్లో ఉన్న ఏమాత్రం స్థైర్యం కోల్పోకుండా చివరి వరకు పోరాడి మ్యాచ్‌ను కాపాడుకుంది. భారత్‌తోనే కాకుండా టోర్నీ అద్యాంతం తమ ప్రదర్శనతో యావత్ క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. తమ ఆటతో తమది పసికూన జట్టు కాదని క్రికెట్‌ను శాసించే దేశాలను హెచ్చిరించింది. అఫ్గాన్ ఆటగాళ్ల ప్రదర్శనకు మాజీ క్రికెటర్లు, అభిమానులు సలాం కొడుతున్నారు. ట్విటర్ వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. భారత్‌తో డ్రా అంటే గెలిచినట్టేనని, భారత అభిమానులే కొనియాడుతున్నారు. (చదవండి: నేను రివ్యూకు వెళ్లాల్సింది కాదు) ‘క్రికెట్లోనే ఇదో గొప్ప మ్యాచ్. వరల్డ్ క్లాస్ జట్టు అయిన భారత్‌పై అఫ్గానిస్తాన్ ప్రదర్శన అత్యద్భుతం. మహ్మద్ షజాద్ శతకానికి అర్హుడే. అఫ్గాన్ ఆటగాళ్ల పురోగతి అద్భుతం. యావత్ క్రికెట్ ప్రపంచం చూడాల్సిన మ్యాచే’- షాహిద్ అఫ్రిదీ (పాకిస్తాన్ మాజీ క్రికెటర్) ‘అఫ్గాన్‌కు ఇదో ప్రత్యేకమైన రోజు. భారత్‌పై డ్రా సాధించడం.. ప్రతి ఆఫ్గాన్ ఆటగాడికి ఓ మైలురాయి కాకుండా గర్వకారణం కూడా. అఫ్గాన్ జట్టులో ఎదో ప్రత్యేకత ఉంది’-వీవీఎస్ లక్ష్మణ్ ‘దీనికి అఫ్గాన్ ఆటగాళ్లు అర్హులే. మ్యాచ్ డ్రా అయింది కానీ వారి ప్రదర్శనను చూసి నమ్మలేకపోతున్నా. అఫ్గాన్ గర్వించాల్సిందే. వారు నిజమైన విన్నర్స్’- కైఫ్ This must be a special day for @ACBofficials . Securing a tie against Team India is a monumental achievement and every Afghanistan player can be very proud of their grit and fight. There is something special in this Afghanistan team, have been most impressivein Asia Cup #INDvAFG — VVS Laxman (@VVSLaxman281) September 25, 2018 Afghanistan captain Asghar Afghan "When you tie a match against a team like India, it means you won" #INDvAFG #Asiacup2018 — Saj Sadiq (@Saj_PakPassion) September 25, 2018 Such a great game of cricket 🏏 !! An outstanding performance by team Afghanistan 🇦🇫 @ACBofficials against the world class indian team !! @MShahzad077 a well deserved 💯 !! https://t.co/CEIZ1MHJuz — Shahid Afridi (@SAfridiOfficial) September 25, 2018 (చదవండి: ఊరించి... ఉత్కం‘టై’) -
టీమిండియాకు అతడితోనే ఇబ్బందులు
సాక్షి, స్పోర్ట్స్: ఇంగ్లండ్‌తో టీమిండియా టెస్టు సిరీస్ ముగిసింది. ఇక యూఏఈ వేదికగా జరుగనున్న ఆసియా కప్‌పై అందరి చూపు పడింది. ప్రత్యేకంగా ఈ నెల 19న జరగబోయే భారత్-పాకిస్తాన్ల మ్యాచ్‌పైనే అందరీ దృష్టి కేంద్రీకరించింది. చాంపియన్ ట్రోఫీ అనంతరం దాయాదుల పోరును అభిమానులు ఆసియాకప్‌లో చూడనున్నారు. అయితే రోహిత్ సేనకు షోయాబ్ మాలిక్ రూపంలో ఇబ్బందులు తప్పవంటున్నాడు టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టులో అత్యంత సీనియర్, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ మాలిక్ ఆ జట్టుకు కీలకం కానున్నాడని ఈ దిగ్గజ ఆటగాడు అభిప్రాయపడ్డాడు. ‘మిడిల్ ఓవర్లలో రోహిత్ శర్మ ఖచ్చితంగా స్పిన్నర్లతో అటాకింగ్ చేపిస్తాడు. కానీ స్ట్రైక్ రోటేట్ చేయడం, స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం మాలిక్‌కు కొట్టినపిండి. ప్రత్యేకంగా టీమిండియా అంటే అతడు చెలరేగి ఆడుతాడని గత రికార్డులే పేర్కొంటున్నాయి. కుల్దీప్, చహల్ వంటి మణికట్టు స్పిన్నర్లు ఉన్నప్పటికీ.. మాలిక్ కోసం ప్రత్యేక వ్యూహాలు రచించాలి. ఫఖర్ జామన్, బాబర్ అజామ్ వండి విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఉండటం పాక్‌కు బలం’ అంటూ సొగసరి బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మన్ పేర్కొన్నాడు. -
వీవీఎస్ అత్యుత్తమ జట్టు ఇదే..
న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తన అత్యుత్తమ టెస్టు జట్టును ప్రకటించాడు. గత 25 ఏళ్లకు గాను భారత అత్యుత్తమ టెస్టు జట్టును లక్ష్మణ్ తాజాగా ఎంపిక చేశాడు. ఇందులో సౌరవ్ గంగులీకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పిన లక్ష్మణ్.. ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లిలకు చోటు కల్పించాడు. తన కలల టెస్టు జట్టులో వీరేంద్ర సెహ్వాగ్, మురళీ విజయ్‌లను ఓపెనర్లుగా ఎన్నుకున్నాడు. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో అత్యధిక కాలం క్రికెట్ ఆడిన లక్ష్మణ్..మూడో స్థానాన్ని రాహుల్ ద్రవిడ్‌కు కట్టబెట్టాడు. వీవీఎస్ అత్యుత్తమ భారత టెస్టు జట్టు ఇదే.. వీరేంద్ర సెహ్వాగ్, మురళీ విజయ్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, సౌరవ్ గంగూలీ(కెప్టెన్), ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), అనిల్ కుంబ్లే, భువనేశ్వర్ కుమార్, జవగళ్ శ్రీనాథ్, జహీర్ ఖాన్ -
ఏటీఎం గార్డ్‌కు క్రికెటర్ సెల్యూట్!
హైదరాబాద్ : ఓ ఏటీఎం సెక్యూరిటీ గార్డ్ చేసే మంచి పనికి టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ముగ్ధుడయ్యాడు. అతని సేవను ప్రశంసిస్తూ ట్విటర్ వేదికగా సెల్యూట్ కొట్టాడు. డెహ్రాడూన్‌లో ఓ ఏటీఎంకు సెక్యూరిటీగా విధులు నిర్వర్తిసున్న రిటైర్డ్ సైనికుడు బ్రిజేందర్ సింగ్ దేశం కోసం తన సేవను కొనసాగిస్తున్నాడు. ఆ ప్రాంతంలోని నిరూపేద పిల్లలను చేరదీసి చదువుచెబుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మణ్.. అతని సేవను కొనియాడుతూ వారికి చదువు చెబుతున్న ఫొటోలను ట్వీట్ చేశాడు. ‘రియల్ హీరో బ్రిజేంద్రను కలవండి.. ఏటీఎం సెక్యూరిటీ గార్డ్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఈ మాజీ సైనికుడు దేశం కోసం తన సేవను ఇంకా కొనసాగిస్తున్నాడు. సాయంకాలంవేల ఏటీఎం వెలుగుల్లో అక్కడి మురికివాడలకు చెందిన పిల్లలకు చదువు చెబుతున్నాడు. ఈ మహోన్నత వ్యక్తికి నా సెల్యూట్’ అని ట్వీట్ చేశాడు. ఆ సెక్యూరిటీ గార్డ్ సేవలను కొనియాడుతూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో ఈ ఫొటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. Meet a true hero Brijendra , who works as a security guard at an ATM in Dehradun. Having retired from the army, he still continues to serve the nation, he teaches children from nearby slums in the evenings under the ATM lights. Salute to an incredible man 🙏🏼 pic.twitter.com/vNobfOvBzH — VVS Laxman (@VVSLaxman281) August 24, 2018 -
‘భారత్‌ను సూపర్ పవర్‌గా మార్చిన వ్యక్తి’
భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి మరణం పట్ల పలువురు క్రికెటర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. భారత్‌దేశానికి ఓ గొప్ప నాయకుడిని కోల్పోయింది. భరత జాతికి అటల్ జీ చేసిన సేవలు మరువలేనివి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. - సచిన్ టెండూల్కర్ భారతదేశానికి అత్యంత ప్రియమైన ప్రధాని, గొప్ప కవి, నాయకుడు. భరత జాతి అటల్ జీని మిస్సవుతోంది. ఆయన మరణం పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నా. - వీవీఎస్ లక్ష్మణ్ దేశానికి ఈరోజు దుర్దినం. ఒక గొప్ప నాయకుడిని కోల్పోయాం. దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. అటల్ జీ ఆత్మకు శాంతి చేకూరాలి. - అనిల్ కుంబ్లే భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మరణం నన్నెంతగానో కలచివేసింది. నేను అభిమానించే రాజకీయ నాయకుల్లో ఆయనకు గొప్ప స్థానం ఉంది. నిజాయితీ, నిస్వార్థ వ్యక్తిత్వం కలిగిన అటల్ జీ దేశ సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. - శిఖర్ ధావన్ ఈ వారమంతా భారత్‌కు బాగా లేనట్టుంది. మరో గొప్ప నేతను కోల్పోయాం. అటల్ జీ ఆత్మకు శాంతి కలగాలి. - రోహిత్ శర్మ ప్రజల జీవితాలను ప్రభావితం చేసే నాయకులు కొందరే ఉంటారు. వారిలో అటల్ జీకి ప్రత్యేక స్థానం ఉంది. దేశాన్ని సూపర్ పవర్‌గా మార్చిన గొప్ప వ్యక్తి. ఆయన మరణంతో ఓ మహా శకం ముగిసింది. - సురేశ్ రైనా భారతదేశం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయింది. దేశమంతా శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన అస్తమయం ఎంతో మంది గుండెలను ద్రవింపజేసింది. - రవిచంద్రన్ అశ్విన్ -
ఉపాధ్యాయుల సాహసానికి మాజీ క్రికెటర్ ఫిదా!
డెహ్రాడూన్ : తాడుసహాయంతో నదిని దాటి మరీ విద్యార్థులకు చదువు చెప్పాలనుకున్న ఉపాధ్యాయుల ఉక్కు సంకల్పాన్ని చూసి భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఫిదా అయ్యారు. ఉత్తరాఖండ్‌లో కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తడంతో పితోర్‌ఘర్‌లోని బ్రిడ్జ్ కూలిపోయింది. పాఠశాలకు, కొందరు టీచర్లు నివాసముంటున్న ప్రాంతానికి మధ్యలో ఈ బ్రిడ్జ్ ఉంది. అయితే ఎలాగైనా విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి వెళ్లాలని జోధ్ సింగ్ కున్వర్‌తో పాటూ మరో టీచర్ భావించారు. దీంతో స్థానిక వ్యక్తి సహాయంతో నదికి రెండు వైపులా ఓ తాడును బిగించారు. పొంగిపొర్లుతున్న నదిపై నుంచి దాదాపు 30 మీటర్ల దూరం తాడు సహాయంతో దాటారు. జూలై చివర్లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్‌ఇంట్లో వైరల్ అవుతోంది. అసాధారణమైన ఉపాధ్యాయులకు హ్యాట్సాఫ్ అంటూ మంగళవారం వీవీఎస్ లక్ష్మణ్ ట్విట్ చేశారు. Jodh Singh Kunwar, a school teacher in Uttarakhand’s Pithoragarh along with few other teachers took the route of rappelling on a 30mtr long zip line to work after a bridge that links two banks fell apart,to reach their students.Hats off to such extraordinarily committed teachers pic.twitter.com/eX3Yyvcq5R — VVS Laxman (@VVSLaxman281) August 14, 2018 కాగా, గత 20 రోజులుగా ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం కొనసాగుతోంది. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు 48 గంటల్లో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. -
విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి..
-
సమంతకు సవాల్ విసిరిన పీవీ సింధూ..!
హీరోయిన్ సమంతకు బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సిందూ చాలెంజ్ విసిరారు. తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతోన్న హరితహారం కార్యక్రమంలో భాగంగా సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు ‘గ్రీన్ చాలెంజ్’ పేరిట మొక్కలను నాటుతూ ఒకిరికొకరు సవాల్ చేసుకుంటున్నారు. తాజాగా క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ నుంచి గ్రీన్ చాలెంజ్‌ను స్వీకరించిన సింధూ శనివారం మూడు మొక్కలు నాటి హరిత సవాల్‌ని బాక్సింగ్ స్టార్ మేరీ కోమ్, హీరో సూర్య, సమంతకు పాస్ చేశారు. గ్రీన్ చాలెంజ్‌కు తనను నామినేట్ చేసిన లక్ష్మణ్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. భూమిని పచ్చగా ఉంచేందుకు అందరూ హరితహారం కార్యక్రమంలో పాల్గొనాలని ఆశిస్తున్నట్టు ఆమె ట్వీట్ చేశారు. కాగా, ఇటీవల చైనాలో జరిగిన బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో సింధూ సిల్వర్ మెడల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వంశీ పైడిపల్లి విసిరిన గ్రీన్ చాలెంజ్‌ను సినిమాలతో బిజీగా ఉండడం వల్ల సమంత స్వీకరించలేకపోయింది. యూటర్న్ చిత్రంతో పాటు, శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న సినిమాల్లో నటిస్తున్న సమంత సింధూ విసిరిన ఈ సవాల్‌నైనా స్వీకరిస్తుందో లేదో చూడాలి..! -
ధావన్పైనే వేటు ఎందుకు?: లక్ష్మణ్
లండన్: ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా ఆరంభమైన రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్‌పై వేటు వేయడాన్ని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశ్నించాడు. తొలి టెస్టులో కోహ్లి మినహా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ అందరూ విఫలమైనా.. రెండో టెస్టుకి ధావన్‌ని మాత్రమే తుది జట్టు నుంచి తప్పించడం భావ్యం కాదని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. ‘బర్మింగ్‌హామ్ టెస్టులో కోహ్లి మినహా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ అందరూ విఫలమయ్యారు. ఆ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్, మురళీ విజయ్‌తో పోలిస్తే శిఖర్ ధావన్ కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. అతని ఫుట్‌వర్క్‌ని గమనిస్తే ఆ విషయం తెలుస్తుంది. కానీ.. లార్డ్స్ టెస్టులో అతనిపై వేటు వేశారు. దానికి కారణంగా.. అతను ఔటైన తీరుని చూపిస్తున్నారు. ఒక స్ట్రోక్ ప్లేయర్ స్లిప్‌లో బంతిని తరలించే ప్రయత్నంలో కొన్ని సార్లు వికెట్‌ను చేజార్చుకోవచ్చు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఇలానే ఆడేవాడు. కానీ.. వారికి ఆ షాట్లే బలం. విదేశీ గడ్డపై ధావన్‌తో పాటు టాప్ ఆర్డర్‌లోని కొంత మంది బ్యాట్స్మెన్లు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా 2015 నుంచి టాప్-4లో ఉన్న ఆటగాళ్లు విదేశాల్లో తడబడటం చూస్తునే ఉన్నాం. ఇక్కడ పుజారా కూడా విఫలమైన వారిలో ఒకడు. కానీ.. ఎందుకో ప్రతిసారీ ధావన్పైనే వేటు పడుతోంది’ అని వీవీఎస్ లక్ష్మణ్ పెదవి విరిచాడు. -
శెభాష్ కామేగౌడ : వి.వి.ఎస్. లక్ష్మణ్
కర్ణాటక, మండ్య: ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూస్తూ కాలం వృథా చేయకుండా ఆ సన్నకారు రైతు నడుంబిగించి జల సిరులను సృష్టించారు. సొంత డబ్బులతో నీటి నిల్వ కోసం సుమారు 14 చెరువులను తవ్వించిన మండ్య జిల్లాలోని మళవళ్లి తాలుకాలో ఉన్నదాసనగొడ్డి గ్రామానికి చెందిన రైతు కామేగౌడ సేవను తెలుసుకున్న బారత మాజీ క్రికెట్ దిగ్గజం వి.వి.ఎస్. లక్ష్మణ్ అభినందిస్తు ట్వీట్ చేశారు. రైతు కామేగౌడ వేసవి కాలంలోప్రజలకు, జంతువులకు తాగునీటి కొరత ఉండకూడదనే ఆశయంతో దాసనదొడ్డి గ్రామంలో సుమారు 14 నీటి కుంటలను తవ్వించాడు. దాంతో ఎప్పడు ఈ నీటి చెరువుల్లో నీరు నిల్వ ఉంటుంది. వీటిని తవ్వడానికి ఈ రైతు సుమారు 15 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఈ విషయం ఆనోటా ఈనోటా తెలుసుకున్న లక్ష్మణ్... కామేగౌడను ట్విట్టర్లో ప్రశంసించారు. వి.వి.ఎస్. లక్ష్మణ్ చేసిన ట్వీట్ -
కేటీఆర్ చాలెంజ్‌ను స్వీకరించిన సచిన్
ఇటీవల దేశ వ్యాప్తంగా ఫిట్నెస్ చాలెంజ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యింది. రాజకీయ నాయకులతో పాటు సినీతారలు కూడా ఈ ఫిట్నెస్ చాలెంజ్‌ను స్వీకరించి తమ వర్క్ అవుట్ వీడియోలను పోస్ట్ చేశారు. అయితే తాజాగా తెలంగాణ నేతలు మాత్రం పర్యావరణానికి సంబంధించిన మరో ఆసక్తికర చాలెంజ్‌కు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) విసిరిన చాలెంజ్‌ను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్వీకరించారు. కేటీఆర్ విసిరిన హరితహారం చాలెంజ్ స్వీకరించిన సచిన్ కొన్ని మొక్కలు నాటారు. అనంతరం నాటిన మొక్కలకు నీళ్లు పోశారు. తనను ఇలాంటి చాలెంజ్‌కు ఆహ్వానించినందుకు కేటీఆర్‌కు సచిన్ కృతజ్ఞతలు తెలిపారు. భూమిని పచ్చనిచెట్లతో ఉండేలా చేయడం మన చేతుల్లోను ఉందని సచిన్ ట్వీట్ చేశారు. సచిన్ ట్వీట్‌పై కేటీఆర్ స్పందిస్తూ.. థ్యాంక్యూ మాస్టర్.. మీరు కూడా మరో ఐదుగురిని హరితహారం చాలెంజ్‌కు నామినేట్ చేయండి అని సచిన్‌కు సూచించారు. హరితహారంలో లక్ష్మణ్ సైతం.. వెరీవెరీ స్పెషల్ బ్యాట్స్‌మెన్, టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా కేటీఆర్ విసిరిన హరితహారం చాలెంజ్‌ను స్వీకరించారు. గార్డెనింగ్ అంటే నాకు చాలా ఇష్టమని పేర్కొంటూ మొక్కలు నాటుతున్న ఫొటోలను పోస్ట్ చేశారు. కేటీఆర్ చాలా గొప్ప చాలెంజ్‌ను మొదలుపెట్టారు. నేను కూడా వీరేంద్ర సెహ్వాగ్, మిథాలీరాజ్, పీవీ సింధులను హరితహారం చాలెంజ్‌కు ఆహ్వానించారు. మూడు మొక్కలు నాటాలని తన ట్వీట్లో లక్ష్మణ్ చాలెంజ్ చేశారు. లక్ష్మణ్‌కు ధన్యవాదాలు తెలుపుతూ కేటీఆర్ రీట్వీట్ చేశారు. Thank you, @KTRTRS, for nominating me for the green challenge #HarithaHaram. I accept the challenge and hope all of you do too. The key to a greener planet is in our hands. pic.twitter.com/vMzifaGjlm — Sachin Tendulkar (@sachin_rt) 28 July 2018 Thanks Master 🙏🙏 You also have to nominate five more to take the challenge further #HarithaHaram https://t.co/G0wyHxrnrq — KTR (@KTRTRS) 28 July 2018 Many thanks Laxman 👍 https://t.co/lSd0ia9dJI — KTR (@KTRTRS) 28 July 2018 కవిత చాలెంజ్ స్వీకరించిన రాజమౌళి -
లక్ష్మణ్ వద్దన్నా చేసా: గంగూలీ
హైదరాబాద్ : నాట్‌వెస్ట్ సిరీస్ విజయానంతరం అప్పటి కెప్టెన్, టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ షర్ట్ విప్పి గ్యాలరీలో సందడి చేయడం ప్రతీ క్రికెట్ అభిమానికి ఓ మధురానుభూతి. ఆ సమయంలో షర్ట్ విప్పొద్దని మాజీ క్రికెటర్, హైదారాబాదీ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ ఎంత చెప్పినా వినలేదని గంగూలీ బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్ షోలో పేర్కొన్నాడు. నాటి రోజులను గుర్తు చేసుకుంటూ.. పలు ఆసక్తికర విషయాలని పంచుకున్నాడు. ‘ఆ సమయంలో నా వెనక హర్భజన్, ఎడమ వైపు లక్ష్మణ్ ఉన్నారు. విజయానంతరం సంతోషంతో నేను నా టీషర్ట్‌ను విప్పుతున్నాను. ఈ సమయంలో లక్ష్మణ్ వద్దు.. వద్దు అని సూచించాడు. అయిన వినకుండా నేను నాషర్ట్ తీసేసాను. అప్పుడు లక్ష్మణ్ నేనేం చేయాలి ఇప్పుడు అని అడిగాడు. దానికి నువ్వు కూడా షర్ట్ తీసేయని చెప్పాను’ అని గంగూలీ నాటి మధుర క్షణాలను గుర్తుచేసుకున్నాడు. ఫ్లింటాఫ్ను చూసే.. అయితే ఇలా షర్ట్ విప్పి సెలెబ్రేషన్ చేయాలనుకున్నది మాత్రం ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్ను చూసేనని గంగూలీ తెలిపాడు. ఓ వన్డే సిరీస్ డ్రా అయిన సందర్భంగా ఫ్లింటాఫ్ వాంఖడే స్టేడియంలో షర్ట్ తీసేసీ హల్చల్ చేశాడు. లార్డ్స్‌లో గెలిస్తే తను కూడా ఇలా చేయాలని అప్పుడే అనుకున్నట్లు చెప్పుకొచ్చాడు. కానీ ఈ ఘటనపై నా కూతురు సనా..‘షర్ట్ విప్పడం క్రికెట్లో తప్పని సరా? నీవు ఎందుకు అలా చేశావు’ అని అడిగిన ప్రశ్నకు చాలా ఇబ్బందికి గురయ్యానన్నాడు. అలా ఒకసారి తప్పు జరిగిపోయిందని, జీవితంలో కొన్నిసార్లు మన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేమని ఆమెకు తెలిపినట్లు పేర్కొన్నాడు. 311 వన్డేలాడిన గంగూలీ 11363 పరుగులు చేశాడు. -
‘వార్నర్ లేడని నా పిల్లలు ఏడ్చారు’
హైదరాబాద్ : బాల్ ట్యాంపరింగ్ ఉదంతం ప్రపంచ క్రికెట్‌ను కలవరపాటుకు గురిచేసింది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటనతో ఆస్ట్రేలియా అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, డెవిడ్ వార్నర్, యువ ఆటగాడు బాన్ క్రాఫ్ట్‌లపై ఆ దేశ క్రికెట్ బోర్డు నిషేదం విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిషేదంతో క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌కు సైతం స్మిత్, వార్నర్‌లు దూరమయ్యారు. వీరి గైర్హాజరితో భారత అభిమానులు చాలా బాధపడ్డారు. ముఖ్యంగా హైదరాబాదీలు వార్నర్ జట్టులో లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అభిమానులే కాదు తన పిల్లులు సైతం కంటతడి పెట్టారని టీమిండియా మాజీ క్రికెటర్, సన్‌రైజర్స్ మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. ప్రముఖ హోస్ట్ గౌరవ్ కపూర్ ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్’ షోలో పాల్గొన్న లక్ష్మణ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘వార్నర్ ఈ సీజన్ ఐపీఎల్ ఆడటం లేదనే విషయం తెలుసుకొని నా పిల్లలు సర్వజిత్, అచింత్యాలు చాలా బాధపడ్డారు. వారు వార్నర్‌ను అభిమానిస్తారు. సన్‌రైజర్స్‌కు ఆడటానికి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు వారికి వార్నర్‌తో గట్టి బంధం ఏర్పడింది. అతను జట్టులో ఎంత కీలకమో వారికి తెలుసు. ట్యాంపరింగ్ వివాదాన్ని టీవీల్లో చూసి.. తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమికి కూడా వారు చాలా బాధపడ్డారు.’ అని చెప్పుకొచ్చారు. వార్నర్ స్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టు పగ్గాలు చేపట్టి.. ఫైనల్‌కు చేర్చిన విషయం తెలిసిందే. ఇక వార్నర్ 2016 ఐపీఎల్ సీజన్లో బ్యాటింగ్‌లో, కెప్టెన్‌గా రాణించి సన్‌రైజర్స్‌కు టైటిల్ అందించాడు. -
నలుగురు ప్రపూర్ణులు!
ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): ఈసారి నలుగురికి కళా ప్రపూర్ణ, క్రీడా ప్రపూర్ణలతో గౌరవించాలని ఆంధ్రి విశ్వవిద్యాలయం నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 31న జరగనున్న వర్సిటీ 85వ స్నాతకోత్సవ నిర్వహణపై శుక్రవారం సాయంత్రం జరిగిన పాలకమండలి సమావేశంలో చర్చించారు. కళాప్రపూర్ణకు ముగ్గురి పేర్లు, క్రీడా ప్రపూర్ణకు ఒకరి పేరును సభ్యులు ప్రతిపాదించారు. వీటిని గవర్నర్ ఆమోదానికి పంపనున్నారు. కళాప్రపూర్ణకు మ్యాజిక్ మాయిస్ట్రో ఇళయరాజా, ప్రఖ్యాత గాయని రావు బాలసరస్వతి, సినీ గేయ రచయిత చంద్రబోస్.. క్రీడా ప్రపూర్ణకు క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ల పేర్లను ఖరారుచేసినట్లు తెలుస్తోంది. వీటితోపాటు సాహిత్యంలోనూ ఈసారి కళాప్రపూర్ణ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కన్వెన్షన్ సెంటర్లో నిర్వహణపైఅభ్యంతరాలు కొత్తగా నిర్మంచిన కన్వెన్షన్ సెంటర్లో స్నాతకోత్సవం నిర్వహించాలనే నిర్ణయాన్ని పలువురు సభ్యులు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. చారిత్రక ప్రాధాన్యత కలిగిన పాత భవనంలో నిర్వహిస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పాత భవనానికి మరమ్మతులు అవసరమని, వర్షం వస్తే ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ఈ మార్పు చేసినట్లు వర్సిటీ అధికారులు పాలక మండలి సభ్యులకు సర్దిచెప్పారని తెలిసింది. స్నాతకోత్సవ మందిరం మరమ్మతులు నెల రోజుల్లో పూర్తిచేయించాలని సభ్యులు సూచించారు. ఇటీవల నిర్వహించిన పరిశోధన ప్రవేశాలు, త్వరలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పరిశోధన ప్రవేశాల సెట్(ఏపిఆర్‌సెట్)పై చర్చ జరిగింది.. గతంలో తాత్కాలికంగా నిలిపివేసిన ఎగ్జిక్యూటివ్ పీహెచ్డీలలో అర్హత కలిగిన వారిని కొనసాగించాలని, అర్హత లేకుండా ప్రవేశం పొందిన వారిని తొలగించాలని ప్రభుత్వం ఇచ్చిన జివోను వర్సిటీ ఆమోదించినట్లు సమాచారం. వీటితో పాటు వర్సిటీలో జరిగిన ధర్మపోరాట దీక్షకు ఏయూ మైదానం కేటాయించడం తదనంతర అంశాలపై సైతం పాలక మండలి సభ్యులు చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. స్పష్టత లేని గవర్నర్ పర్యటన స్నాతకోత్సవానికి గవర్నర్ రాక ఇంకా ఖరారు కాలేదు. ఈ నెల 29 నాటికి దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. గవర్నర్ వచ్చి.. అన్నీ సజావుగా సాగితే సుదీర్ఘ కాలం తర్వాత పూర్తిస్థాయి స్నాతకోత్సవం జరుగుతుంది. ఈ స్నాతకోత్సవంలో 318 మందికి పీహెచ్‌డీలు, అవార్డులు ఇవ్వడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సమావేశంలో వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు, రెక్టార్ ఆచార్య కె.గాయత్రీదేవి, రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వర రావు, సభ్యులు ఆచార్య ఎం.ప్రసాద రావు, జి.శశి భూషణ రావు, సురేష్ చిట్టినేని, డాక్టర్ ఎస్.విజయ రవీంద్ర, డాక్టర్ పి.సోమనాధ రావు, ఆచార్య ఎన్.బాబయ్య, ఆచార్య కె.రామమోహన రావు తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్మణ్‌పై అరిస్తే మా అన్న తిట్టాడు: సచిన్
ముంబై: ఓ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ స్టార్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినందుకు తన సోదరుడితో తిట్లుతిన్నానని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆ నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు. మంగళవారం వాంఖేడే వేదికగా ముంబై-సన్‌రైజర్స్ మ్యాచ్‌కు హాజరైన ఈ దిగ్గజ క్రికెటర్లు సరదాగా చిట్‌చాట్ చేశారు. ఐపీఎల్లో ముంబైకి సచిన్, సన్‌రైజర్స్‌కు లక్ష్మణ్ మెంటర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. చిట్‌చాట్‌లో ఈ దిగ్గజ క్రికెటర్లు కోకకోలా కప్-1998లో భాగంగా షార్జా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ విషయాలను ప్రస్తావించారు. ఈ సందర్బంగా సచిన్ మ్యాచ్ మధ్యలో లక్ష్మణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిపాడు. దీంతో ఇంటికెళ్లాక తన సోదరుడితో తిట్లు తిన్నానని.. ‘అతను నీ సహచర ఆటగాడు. అతను నీకు మద్దతునిస్తే.. నువ్వు అతనిపై అరిచావు.’ అని తన సోదరుడు మందలించినట్లు సచిన్ ఆనాటి విషయాలను వెల్లడించాడు. అయితే ఈ ఘటనపై లక్ష్మణ్‌కు అప్పుడే క్షమాపణలు చెప్పానని, మళ్లీ మైదానంలో ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదని మాస్టర్ చెప్పుకొచ్చాడు. ఇక నాన్ స్ట్రైకర్‌గా సచిన్ సూపర్ ఇన్నింగ్స్ చూడటం తన అదృష్టమని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. ఇది క్రికెట్లోనే ఓ అద్భుతమైన ఇన్నింగ్స్ అని తెలిపాడు. ఇక ఈ మ్యాచ్‌లో సచిన్(143) సెంచరీ చేసిన భారత్ 16 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇక కోకకోలా కప్ ఫైనల్లో ఇదే ఆస్ట్రేలియాపై మరో సెంచరీతో చెలరేగి సచిన్ భారత్‌కు విజయాన్నందించాడు. వాంఖేడే ప్రత్యేకం.. ముంబై వాంఖేడే మైదానం తనకు ప్రత్యేకమని సచిన్ చెప్పుకొచ్చాడు. ‘ఈ మైదానం నాకు ప్రత్యేకం. నేనిక్కడి నుంచే నా ఆటను ప్రారంభించా. ఫ్టస్ట్ క్లాస్ క్రికెట్లోకి ఇక్కడే అరంగేట్రం చేశా. 2011 ప్రపంచకప్ ఇక్కడే గెలిచాం. నా వీడ్కోలు మ్యాచ్ సైతం ఈ మైదానంలోనే జరిగింది. అందుకే వాంఖేడే నా జీవితంలో ప్రత్యేకమైన మైదానం.’’ అని సచిన్ తెలిపాడు.