New Zealand vs Sri Lanka, 2nd Test: న్యూజిలాండ్ బ్యాటర్లు కేన్ విలియమ్సన్, హెన్రీ నికోల్స్ చరిత్ర సృష్టించారు. కివీస్ టెస్టు చరిత్రలో అధికసార్లు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన తొలి జోడీగా నిలిచారు. అదే విధంగా.. ఓవరాల్‌గా రెండు లేదంటే ఎక్కువసార్లు ఈ ఫీట్ నమోదు చేసిన ఎనిమిదో జోడీగా ఘనత సాధించారు.
ద్రవిడ్- లక్ష్మణ్‌లతో పాటు
స్వదేశంలో శ్రీలంకతో రెండో టెస్టు రెండో రోజు సందర్భంగా 300 పైచిలుకు భాగస్వామ్యంతో ఈ రికార్డు అందుకున్నారు. వీరు ఈ ఫీట్ నమోదు చేయడం ఇది రెండోసారి. తద్వారా మహేళ జయవర్ధనే- కుమార సంగక్కర, డాన్ బ్రాడ్‌మన్- విల్ పోన్స్‌ఫోర్డ్, మైకేల్ క్లార్క్- రిక్కీ పాంటింగ్, మహ్మద్ యూసఫ్- యూనిస్ ఖాన్, రాహుల్ ద్రవిడ్- వీవీఎస్ లక్ష్మణ్‌ల తర్వాత ఈ ఘనత సాధించిన ఆరో జోడీగా నిలిచారు.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా న్యూజిలాండ్ శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో తొలి టెస్టులో ఆఖరి బంతికి విజయం అందుకున్న కివీస్.. రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సరికి పటిష్ట స్థితిలో నిలిచింది. వన్‌డౌన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్(215), నాలుగో స్థానంలో వచ్చిన హెన్రీ నికోల్స్(200 నాటౌట్) డబుల్ సెంచరీలతో రాణించారు.
పటిష్ట స్థితిలో
వెల్లింగ్‌టన్‌లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో ఇద్దరూ కలిసి 363 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ క్రమంలో 4 వికెట్ల నష్టానికి 580 పరుగుల భారీ స్కోరు వద్ద న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో రెండో రోజు ఆట ముగిసే సరికి లంక రెండు వికెట్లు నష్టపోయి 26 పరుగులు చేసింది. దీంతో ఆతిథ్య కివీస్‌కు 554 పరుగుల ఆధిక్యం లభించింది.
చదవండి: IPL 2023: కేకేఆర్‌కు మరో బిగ్‌షాక్.. స్టార్ ఆటగాళ్లు దూరం!
IND vs AUS: హార్దిక్‌పై కోపంతో ఊగిపోయిన కోహ్లి.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment