Henry Nicholls
-
NZ Vs Aus: న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ
Australia tour of New Zealand, 2024: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే జట్టుకు దూరమయ్యాడు. గాయం నుంచి ఇంకా కోలుకోని కారణంగా ఈ ఓపెనర్ తొలి టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. కాన్వే స్థానంలో అతడు జట్టులోకి ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ ధ్రువీకరించింది. ‘‘కీలక మ్యాచ్‌కు ముందు డెవాన్ జట్టుకు దూరం కావడం మమ్మల్ని నిరాశకు గురిచేసింది. టాపార్డర్‌లో ఇలాంటి క్లాస్ ప్లేయర్ సేవలను కోల్పోవడం కష్టంగా ఉంది. పూర్తిగా కోలుకుని అతడు తిరిగి జట్టుతో చేరతాడని నమ్మకం ఉంది’’ అని కివీస్ జట్టు హెడ్‌కోచ్ గ్యారీ స్టెడ్ పేర్కొన్నాడు. కాన్వే స్థానంలో హెన్రీ నికోల్స్‌ను ఎంపిక చేసినట్లు తెలిపాడు. కాగా మూడు టీ20లు, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడే నిమిత్తం ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన ఆసీస్.. తదుపరి టెస్టు సిరీస్‌పై కన్నేసింది. రచిన్, మిచెల్ వచ్చేస్తున్నారు మరోవైపు.. సొంతగడ్డపై పొట్టి ఫార్మాట్లో కంగారూ జట్టు చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని కివీస్ పట్టుదలగా ఉంది. ఇరు జట్ల మధ్య వెల్లింగ్టన్ వేదికగా గురువారం నుంచి తొలి టెస్టు మొదలుకానుంది. ఈ మ్యాచ్‌కు యువ సంచలనం రచిన్ రవీంద్ర, ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్ అందుబాటులోకి రానున్నారు. ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో రెండో టీ20 సందర్భంగా డెవాన్ కాన్వే ఎడమచేతి బొటనవేలికి గాయమైంది. దీంతో మూడో టీ20కి దూరంగా ఉన్న అతడు.. తొలి టెస్టుకు కూడా ఆడలేకపోతున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు న్యూజిలాండ్ టెస్టు జట్టు: టిమ్ సౌథీ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), మ్యాట్ హెన్రీ, స్కాట్ కుగెలిజిన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, నీల్ వాగ్నర్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్, హెన్రీ నికోల్స్. చదవండి: Ind vs Eng: లండన్‌కు పయనమైన కేఎల్ రాహుల్.. కారణం ఇదే! -
న్యూజిలాండ్ ఆటగాడిపై బ్యాల్ టాంపరింగ్ ఆరోపణలు
న్యూజిలాండ్ బ్యాటర్ హెన్రీ నికోల్స్ బాల్ టాంపరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కొద్ది రోజుల కిందట జరిగిన దేశవాలీ క్రికెట్ మ్యాచ్‌లో నికోల్స్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడినట్లు ఆ మ్యాచ్ ఫీల్డ్ అంపైర్లు ఆరోపించారు. నికోల్స్ న్యూజిలాండ్ క్రికెట్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు వారు అభియోగాలు మోపారు. ఈ విషయంపై నికోల్స్ విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో నివేదిక ప్రకారం.. న్యూజిలాండ్ దేశవాలీ టోర్నీ అయిన ప్లంకెట్ షీల్డ్ టోర్నీలో భాగంగా క్యాంటర్బరీ, ఆక్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా నికోల్స్ హెల్మెట్‌తో బంతిని రుద్దినట్లు అంపైర్లు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అంపైర్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఒకవేళ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నికోల్స్‌ను దోషిగా తేలిస్తే, అతను కొంతకాలం పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా నిషేధం ఎదుర్కోవచ్చు. ఈ నెలాఖరులో జరిగే బంగ్లాదేశ్ పర్యటనలో నికోల్స్ న్యూజిలాండ్ టెస్టు జట్టులో చేరనున్న నేపథ్యంలో బాల్ టాంపరింగ్ ఆరోపణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా, 31 ఏళ్ల నికోల్స్ న్యూజిలాండ్ టెస్ట్ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్నాడు. అతను ఇప్పటివరకు 54 టెస్టులతో పాటు 72 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. తన కెరీర్లో నికోల్స్ ఓవరాల్‌గా 5000 పైచిలుకు పరుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారీ కుదుపు.. నంబర్ 1 స్థానం కోసం కొత్త ఛాలెంజర్
ఐసీసీ తాజాగా (మార్చి 22) విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారీ కుదుపు ఏర్పడింది. నంబర్ వన్ స్థానం కోసం కొత్త ఛాలెంజర్ రేసులోకి వచ్చాడు. శ్రీలంకతో జరిగిన 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో సెంచరీ (121 నాటౌట్), డబుల్ సెంచరీ (215) బాదిన న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ఏకంగా 4 స్థానాలు ఎగబాకి సెకెండ్ ప్లేస్‌కు చేరుకున్నాడు. A worthy contender has broken into the top five of @MRFWorldwide ICC Men’s Test Player Rankings for batters 📈 More 👇https://t.co/xXuUqaiAWy — ICC (@ICC) March 22, 2023 ఈ సిరీస్‌లో హ్యాట్రిక్ అర్ధసెంచరీలతో (50, 89, 51) రాణించిన లంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే 2 స్థానాలు ఎగబాకి తొలిసారి టాప్-10లోకి (10వ ర్యాంక్) చేరాడు. విలియమ్సన్ ఒక్కసారిగా నాలుగు స్థానాలు ఎగబాకడంతో స్టీవ్ స్మిత్ (3వ ర్యాంక్), జో రూట్ (4), బాబర్ ఆజమ్ (5), ట్రవిస్ హెడ్ (6) తలో స్థానం కోల్పోయారు. ఈ జాబితాలో ఆసీస్ స్టార్ ఆటగాడు మార్నస్ లబూషేన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ 9వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. గత వారం ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తాజా ర్యాంకింగ్స్‌లో 2 స్థానాలు కోల్పోయి 12వ స్థానానికి పడిపోగా.. రన్‌మెషీన్ విరాట్ కోహ్లి 13వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. శ్రీలంక ఆటగాడు దినేశ్ చండీమాల్, ఇంగ్లండ్ యువ సంచలనం హ్యారీ బ్రూక్ తలో 2 స్థానాలు మెరుగుపర్చుకుని 17, 18 స్థానాలకు ఎగబాకగా.. న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే 3 స్థానాలు మెరుగుపర్చుకుని 20వ స్థానానికి చేరుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో కివీస్ మిడిలార్డర్ ఆటగాడు హెన్రీ నికోల్స్ అత్యధికంగా 20 స్థానాలు మెరుగుపర్చుకుని 27వ స్థానానికి చేరుకున్నాడు. లంకతో రెండో టెస్ట్‌లో విలియమ్సన్తో పాటు డబుల్ సెంచరీ (200 నాటౌట్) చేయడంతో నికోల్స్ ఒక్కసారిగా 20 స్థానాలు ఎగబాకాడు. -
డబ్ల్యూటీసీ ఫైనల్ అన్నారు.. ఇప్పుడేమో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేని పరిస్థితి..!
NZ VS SL 2nd Test: వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పర్యాటక శ్రీలంక జట్టు ఓటమి దిశగా పయనిస్తుంది. తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే కుప్పకూలి ఫాలో ఆన్ ఆడుతున్న లంకేయులు మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేశారు. శ్రీలంక.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు (580/4) ఇంకా 303 పరుగులు వెనుకపడి ఉంది. ఓవర్‌నైట్ స్కోర్ 26/2 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. మైఖేల్ బ్రేస్‌వెల్ (3/50), మ్యాట్ హెన్రీ (3/44), సౌథీ (1/22), డౌగ్ బ్రేస్‌వెల్ (1/19), టిక్నర్ (1/21) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే చాపచుట్టేసింది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో కెప్టెన్ దిముత్ కరుణరత్నే (89) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ పిలుపు మేరకు ఫాలో ఆన్ ఆడుతున్న శ్రీలంక.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసి ఇన్నింగ్స్ పరాభవాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ కరుణరత్నే (51) హాఫ్ సెంచరీతో రాణించగా.. కుశాల్ మెండిస్ పోరాడుతున్నాడు. సౌథీ, డౌగ్ బ్రేస్‌వెల్‌లకు తలో వికెట్ దక్కింది. అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 580 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కేన్ విలియమ్సన్ (215), హెన్రీ నికోల్స్(200 నాటౌట్) డబుల్ సెంచరీలతో చెలరేగగా.. కాన్వే 78 పరుగులు చేశాడు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి, భారత్‌ను వెనక్కునెట్టి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేరాలని కలలు కన్న శ్రీలంక ప్రసుత్తం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేని స్థితిలో ఉంది. తొలి టెస్ట్‌లో సూపర్ సెంచరీతో శ్రీలంక విజయావకాశాలను దెబ్బకొట్టిన విలియమ్సన్ ఈ మ్యాచ్‌లోనూ ఆ జట్టును గెలవకుండా చేశాడు. -
New Zealand vs Sri Lanka 2nd Test: విలియమ్సన్, నికోల్స్ ‘డబుల్’ సెంచరీలు
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ క్రికెటర్లు కేన్ విలియమ్సన్, హెన్రీ నికోల్స్ ఆ దేశం తరఫున అరుదైన ఘనత సాధించారు. ఒకే ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీలు సాధించిన తొలి కివీస్ ద్వయంగా గుర్తింపు పొందారు. వీరిద్దరి జోరుతో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 4 వికెట్ల నష్టానికి 580 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కేన్ విలియమ్సన్ (296 బంతుల్లో 215; 23 ఫోర్లు, 2 సిక్స్‌లు), హెన్రీ నికోల్స్ (240 బంతుల్లో 200 నాటౌట్; 15 ఫోర్లు, 4 సిక్స్‌లు) ద్విశతకాలతో చెలరేగారు. మూడో వికెట్‌కు 363 పరుగులు జోడించిన వీరిద్దరు ఈ క్రమంలో పలు కొత్త రికార్డులు నమోదు చేశారు. టెస్టుల్లో 8 వేల పరుగులు పూర్తి చేసుకున్న విలియమ్సన్... ఈ మైలురాయిని దాటిన తొలి కివీస్ బ్యాటర్‌గా నిలవడంతో పాటు అన్ని ఫార్మాట్లలో కలిపి ఆ దేశం తరఫున అత్యధిక సెంచరీలు (41) సాధించిన ఆటగాడిగా కూడా నిలిచాడు. అనంతరం శ్రీలంక రెండో రోజు ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది. -
చరిత్ర సృష్టించిన విలియమ్సన్, హెన్రీ నికోల్స్... ద్రవిడ్- లక్ష్మణ్‌తో పాటు..
New Zealand vs Sri Lanka, 2nd Test: న్యూజిలాండ్ బ్యాటర్లు కేన్ విలియమ్సన్, హెన్రీ నికోల్స్ చరిత్ర సృష్టించారు. కివీస్ టెస్టు చరిత్రలో అధికసార్లు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన తొలి జోడీగా నిలిచారు. అదే విధంగా.. ఓవరాల్‌గా రెండు లేదంటే ఎక్కువసార్లు ఈ ఫీట్ నమోదు చేసిన ఎనిమిదో జోడీగా ఘనత సాధించారు. ద్రవిడ్- లక్ష్మణ్‌లతో పాటు స్వదేశంలో శ్రీలంకతో రెండో టెస్టు రెండో రోజు సందర్భంగా 300 పైచిలుకు భాగస్వామ్యంతో ఈ రికార్డు అందుకున్నారు. వీరు ఈ ఫీట్ నమోదు చేయడం ఇది రెండోసారి. తద్వారా మహేళ జయవర్ధనే- కుమార సంగక్కర, డాన్ బ్రాడ్‌మన్- విల్ పోన్స్‌ఫోర్డ్, మైకేల్ క్లార్క్- రిక్కీ పాంటింగ్, మహ్మద్ యూసఫ్- యూనిస్ ఖాన్, రాహుల్ ద్రవిడ్- వీవీఎస్ లక్ష్మణ్‌ల తర్వాత ఈ ఘనత సాధించిన ఆరో జోడీగా నిలిచారు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా న్యూజిలాండ్ శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో తొలి టెస్టులో ఆఖరి బంతికి విజయం అందుకున్న కివీస్.. రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సరికి పటిష్ట స్థితిలో నిలిచింది. వన్‌డౌన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్(215), నాలుగో స్థానంలో వచ్చిన హెన్రీ నికోల్స్(200 నాటౌట్) డబుల్ సెంచరీలతో రాణించారు. పటిష్ట స్థితిలో వెల్లింగ్టన్లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో ఇద్దరూ కలిసి 363 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ క్రమంలో 4 వికెట్ల నష్టానికి 580 పరుగుల భారీ స్కోరు వద్ద న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో రెండో రోజు ఆట ముగిసే సరికి లంక రెండు వికెట్లు నష్టపోయి 26 పరుగులు చేసింది. దీంతో ఆతిథ్య కివీస్‌కు 554 పరుగుల ఆధిక్యం లభించింది. చదవండి: IPL 2023: కేకేఆర్‌కు మరో బిగ్‌షాక్.. స్టార్ ఆటగాళ్లు దూరం! IND vs AUS: హార్దిక్‌పై కోపంతో ఊగిపోయిన కోహ్లి.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్ -
డబుల్ సెంచరీలు బాదిన కేన్ విలియమ్సన్, హెన్రీ నికోల్స్
వెల్లింగ్టన్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు ఆటలొ న్యూజిలాండ్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్ (215), హెన్రీ నికోల్స్ (200 నాటౌట్) ద్విశతకాలతో విరుచుకుపడ్డారు. ఫలింతగా కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 580 పరుగుల భారీ స్కోర్ చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. డెవాన్ కాన్వే (78) హాఫ్ సెంచరీతో రాణించగా.. టామ్ లాథమ్ (21), డారిల్ మిచెల్ (17) తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యారు. లంక బౌలర్లలో కసున్ రజిత 2, ధనంజయ డిసిల్వ, ప్రభాత్ జయసూర్య తలో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. కేన్ మామకు ఆరోది, నికోల్స్‌కు తొలి ద్విశతకం.. 285 బంతుల్లో కెరీర్లో ఆరో ద్విశతకం పూర్తి చేసిన విలియమ్సన్.. దిగ్గజ ఆటగాళ్లు మర్వన్ ఆటపట్టు, వీరేంద్ర సెహ్వాగ్, జావిద్ మియాందాద్, యూనిస్ ఖాన్, రికీ పాంటింగ్‌ల రికార్డును సమం చేశాడు. విలియమ్సన్ సహా వీరందరూ టెస్ట్‌ల్లో ఆరు డబుల్ సెంచరీలు చేశారు. టెస్ట్‌ల్లో అధిక డబుల్ సెంచరీల రికార్డు దిగ్గజ డాన్ బ్రాడ్‌మన్ పేరిట ఉంది. బ్రాడ్‌మన్ 52 టెస్ట్‌ల్లో ఏకంగా 12 ద్విశతకాలు బాదాడు. మరోవైపు విలియమ్సన్తో పాటు మూడో వికెట్‌కు 363 పరుగులు జోడించిన హెన్రీ నికోల్స్ కూడా డబుల్ బాదాడు. 240 బంతుల్లో 200 పరుగులతో అజేయంగా నిలిచిన నికోల్స్‌కు ఇది కెరీర్లో తొలి ద్విశతకం. కాగా, శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్‌లో సూపర్ సెంచరీతో (121) మెరిసిన కేన్ మామ.. ఐదు రోజుల వ్యవధిలో ఏకంగా డబుల్ సెంచరీతో (215) చెలరేగాడు. కేన్ మామకు ఇది హ్యాట్రిక్ సెంచరీ కావడం విశేషం. శ్రీలంకతో తొలి టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లోనూ కేన్ మామ శతక్కొట్టాడు (132). -
హ్యాట్రిక్ సెంచరీలు సాధించిన కేన్ మామ
వెల్లింగ్టన్: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిధ్య న్యూజిలాండ్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. వర్షం, వెలుతురులేమి కారణంగా తొలి రోజు కేవలం 48 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడగా, రెండో రోజు ఆట నిర్దిష్ట సమయానికి ప్రారంభమైంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసిన న్యూజిలాండ్.. రెండో రోజు ఆటలో భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. తొలి టెస్ట్‌లో సూపర్ సెంచరీతో (121) తన జట్టుకు అపురూప విజయాన్నందించిన కేన్ విలియమ్సన్ ఐదు రోజుల వ్యవధిలో మరో సెంచరీతో (188 నాటౌట్) మెరిశాడు. కేన్ మామకు ఇది హ్యాట్రిక్ సెంచరీ కావడం విశేషం. శ్రీలంకతో తొలి టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లోనూ కేన్ మామ శతక్కొట్టాడు (132). మరోవైపు కేన్ మామతో హెన్రీ నికోల్స్ (113 నాటౌట్) సైతం సెంచరీతో మెరిశాడు. వీరిద్దరూ పోటాపోటీ శతకాలతో విరుచుకుపడటంతో 106 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 425/2గా ఉంది. విలియమ్సన్ (188), హెన్రీ నికోల్స్ (114) క్రీజ్‌లో ఉన్నారు. తొలి రోజు ఆటలో డెవాన్ కాన్వే (78) హాఫ్ సెంచరీతో రాణించగా.. టామ్ లాథమ్ (21) పర్వాలేదనిపించాడు. 2 మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో కివీస్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
దురదృష్టమంటే నికోల్స్‌దే.. ఇలా కూడా ఔట్ అవ్వొచ్చా..!
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతోన్న అఖరి టెస్టులో న్యూజిలాండ్ బ్యాటర్ హెన్రీ నికోల్స్ విచిత్రకర రీతిలో పెవిలియన్‌కు చేరాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 55 ఓవర్ వేసిన జాక్ లీచ్ బౌలింగ్‌లో నికోల్స్ నాన్ స్ట్రైకర్‌వైపు భారీ షాట్ ఆడాడు. అయితే బంతి నేరుగా నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్న మిచెల్ బ్యాట్‌కు తగిలి.. మిడ్-ఆఫ్ ఫీల్డర్ అలెక్స్ లీస్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో నికోల్స్ నిరాశగా మైదానాన్ని వీడాడు. అయితే నికోల్స్ ఔట్‌కాగానే ఇంగ్లండ్ బౌలర్లు సంబురాలు జరుపుకోగా, బౌలర్ లీచ్ మాత్రం ఆశ్చర్యంగా అలా ఉండిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్పందించిన మేరిల్బోన్ క్రికెట్ క్లబ్ నికోల్స్ ఔటైన విధానంపై మేరిల్బోన్ క్రికెట్ క్లబ్ స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి చట్టం ఏం చెబుతుందో మేరిల్బోన్ క్రికెట్ క్లబ్ ట్విట్టర్లో వెల్లడించింది. "దురదృష్టకరమైన రీతిలో నికోల్స్ తన వికెట్‌ను కోల్పోయాడు. కానీ ఇది పూర్తిగా చట్టాలకు లోబడి ఉంది. నియమం 33.2.2.2 ప్రకారం బంతి.. వికెట్, అంపైర్, ఫీల్డర్, ఇతర బ్యాటర్‌ని తాకిన తర్వాత క్యాచ్ తీసుకుంటే అది ఔట్‌గా పరిగణించబడుతుంది" అని మేరిల్బోన్ క్రికెట్ క్లబ్ ట్విటర్లో పేర్కొంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ తొలిరోజు ఆట ముగిసేసమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. బ్రాడ్ (2/45), లీచ్ (2/75)ల దెబ్బకు 123 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయిన కివీస్‌ను డరైల్ మిచెల్ (78 బ్యాటింగ్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆదుకున్నాడు. చదవండి: IND vs LEI: రాణించిన శ్రీకర్ భరత్.. టీమిండియా స్కోర్: 246/8 An unfortunate dismissal? Yes. But wholly within the Laws. Law 33.2.2.3 states it will be out if a fielder catches the ball after it has touched the wicket, an umpire, another fielder, a runner or the other batter. Read the Law: https://t.co/cCBoJd6xOSpic.twitter.com/eKiAWrbZiI — Marylebone Cricket Club (@MCCOfficial) June 23, 2022 -
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. న్యూజిలాండ్‌కు భారీ షాక్..!
Colin de Grandhomme ruled out of England tour: ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ఓటమి నుంచి కోలుకోక ముందే న్యూజిలాండ్‌కు మరో ఎదరు దెబ్బ తగిలింది. గాయం కారణంగా కివీస్ స్టార్ ఆల్‌రౌండర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గ్రాండ్‌హోమ్ తన కుడి కాలి గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అతడు గాయం నుంచి కోలుకోవడానికి 10 నుంచి 12 వారాలు పడుతుందని వైద్యులు తెలిపారు. అయితే సిరీస్ ఆరంభానికి ముందే గ్రాండ్‌హోమ్‌కు బ్యాకప్‌గా హెన్రీ నికోల్స్‌ను న్యూజిలాండ్ క్రికెట్ ఎంపిక చేసింది. కాగా నికోల్స్ ఇంగ్లండ్‌కు చేరుకున్న తర్వాత కరోనా బారిన పడ్డాడు. దీంతో గ్రాండ్‌హోమ్ స్థానంలో మైఖేల్ బ్రేస్‌వెల్ తుది జట్టులోకి రానున్నాడు. ఇక ఇరు జట్లు మధ్య రెండో టెస్టు ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా శుక్రవారం(జూన్14) ప్రారంభం కానుంది. కాగా లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఓటమి పాలైంది. చదవండి: Lionel Messi : మెస్సీ ‘వన్‌మ్యాన్ షో’.. అర్జెంటీనా ఘనవిజయం -
న్యూజిలాండ్ జట్టులో కరోనా కలకలం.. ముగ్గురికి పాజిటివ్..!
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ జట్టులో కరోనా కలకలం రేపింది. జట్టులో ముగ్గురు సభ్యలు కరోనా బారిన పడ్డారు. శుక్రవారం(మే 20) సస్సెక్స్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌కు ముందు నిర్వహించిన పరీక్షలలో ఆటగాళ్లు హెన్రీ నికోల్స్, బ్లెయిర్ టిక్నర్, బౌలింగ్ కోచ్ షేన్ జుర్గెన్సెన్కు పాజిటివ్‌గా నిర్ధారణైంది. దీంతో ఈ ముగ్గురు ఐదు రోజులు పాటు ఐసోలేషన్‌లో ఉండనున్నారు. అయితే మిగిలిన సభ్యులకు నెగెటివ్‌గా తేలడంతో.. షెడ్యూల్ ప్రకారమే నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ జరగనుంది. ఇక ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఇరు జట్లు మధ్య తొలి టెస్ట్ లార్డ్స్ వేదికగా జాన్ 2న ప్రారంభం కానుంది. చదవండి: Asia Cup and T20 WC: డీకేకు మొండిచేయి.. హార్దిక్, చహల్‌కు చోటు! బ్యాకప్ ప్లేయర్‌గా త్రిపాఠి -
WTC Final: గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన క్రికెటర్
ఆక్లాండ్: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ముంగిట న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ హెన్రీ నికోల్స్ ఒక ఇంటివాడయ్యాడు. కొంతకాలంగా లూసీ అనే అమ్మాయితో రిలేషిన్‌షిప్‌లో ఉన్న హెన్రీ ఆదివారం ఆమెను వివాహమాడాడు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్న నికోలస్ వారి వెడ్డింగ్ ఫోటోను పంచుకున్నాడు.'' మీ అందరికి ఒక గుడ్‌న్యూస్.. ఈరోజు నా గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్నా.. ఇప్పుడు మేము.. మిస్టర్ అండ్ మిసెస్ నికోలస్‌గా మారాం.. ఈ ఉత్సాహంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సిద్ధమవుతున్నా'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇక టీమిండియా, కివీస్‌ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా జరగనుంది. కాగా నికోలస్ వచ్చే వారం జట్టుతో కలవనున్నాడు. ఇక కివీస్ ఆటగాడు హెన్రీ నికోల్స్ అనగానే మనందరికి ముందుగా గుర్తుకు వచ్చేది ఐసీసీ 2019 ప్రపంచకప్ ఫైనల్. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నికోలస్ 55 పరుగులతో జట్టు తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే దురదృష్టవశాత్తూ న్యూజిలాండ్ ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. ఇక 2019 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత బెస్ట్ మ్యాచ్‌గా నిలిచిపోయింది. సూపర్ ఓవర్ కూడా టై కావడం.. బౌండరీ కౌంట్ ద్వారా ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించడం చరిత్రలో నిలిచిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. నికోల్స్ 55, విలియమ్సన్ 30,చివర్లో టామ్ లాథమ్ 47 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 81 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్(84 నాటౌట్) అసాధారణ ఇన్నింగ్స్ ఆడగా.. బట్లర్ 59 పరుగులతో సహకరించాడు. ఆఖరివరకు నిలిచిన స్టోక్స్ మ్యాచ్‌ను టై చేశాడు. దీంతో ఫలితం కోసం సూపర్ ఓవర్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ వికెట్ నష్టానికి 15 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ కూడా 15 పరగులే చేయడంతో మరోసారి టైగా ముగిసింది. దీంతో ఇన్నింగ్స్‌లో ఎక్కువ బౌండరీలు(22) సాధించిన ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించారు. చదవండి: ఈ వ్యక్తిని అందుకోవడం కష్టంగా ఉంది : వార్నర్ ఆ క్రికెటర్‌తోనే నా కూతురు పెళ్లి: పాక్ మాజీ క్రికెటర్ View this post on Instagram A post shared by Henry Nicholls (@henrynicholls27) -
'గెట్ అవుట్ మ్యాన్' అంటూ క్రికెటర్ అసహనం
మౌంట్ మాంగనుయ్ : కివీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో పాకిస్తాన్ బౌలర్ యాసిర్ షా న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ హెన్రీ నికోల్స్పై నోరు పారేసుకున్నాడు. ఆటలో మొదటిరోజు కివీస్ జట్టు పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్, రాస్ టేలర్లు జిడ్డుగా బ్యాటింగ్ చేస్తూనే పరుగులు రాబట్టారు. 120 పరుగులు భాగస్వామ్యం అనంతరం 70 పరుగుల వద్ద రాస్ టేలర్ అవుట్ అయ్యాడు. అనంతరం వచ్చిన హెన్రీ నికోలస్‌తో కలిసి మరో వికెట్ పడకుండా 89 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అలా కివీస్ 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల వద్ద తొలిరోజు ఆటను ముగించింది. (చదవండి : సిరాజ్ కోసం ఉదయం 4 గంటలకే టీవీ ముందుకు..) అయితే 90 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన పాక్ బౌలర్లు వికెట్లు తీయడానికి నానా కష్టాలు పడ్డారు. షాహిన్ ఆఫ్రిది తప్ప ఏ ఒక్క బౌలర్ ఆకట్టుకోలేదు. అప్పటికే 16 ఓవర్లు వేసిన స్పిన్నర్ యాసిర్ షా 56 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. తీవ్ర అసహనంతో ఉన్న యాసిర్ షా 77వ ఓవర్లో నికోల్స్పై మాట జారాడు. ఈ లెగ్ స్పిన్నర్ వేసిన డెలివరినీ నికోల్స్ కట్‌షాట్ ఆడదామని భావించాడు. అయితే బంతి మిస్ అయి కీపర్ చేతుల్లో పడింది. దీంతో చిర్రెత్తిపోయిన షా నికోల్స్‌ను ఉద్దేశించి 'ఔట్ ఓ జా బూత్నీకే'( గెట్ అవుట్ మ్యాన్) అంటూ గట్టిగా అరించాడు. అయితే షా అన్న మాట నికోల్స్‌కు అర్థం కాకపోవడంతో ఆ విషయం అక్కడితో ముగిసిపోయింది. అయితే ఈ వీడియోనూ ఒక వ్యక్తి ట్విటర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. యాసిర్ షా చర్యను తప్పుబడుతూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. OUT hoja Bhootni kay 😂😂😂😂😂😂😂😂😂😂 Yasir larky pic.twitter.com/2JSUc8W9uw — ... (@7Strang_er18) December 26, 2020 ఇక 227/3 క్రితం రోజు స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన కివీస్ 155 ఓవర్లలో 431 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ విలియమ్సన్ 129 పరుగులు.. సెంచరీతో మెరవగా, నికోల్స్ 56, కీపర్ వాట్లింగ్ 73 పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లో ఆఫ్రిది 4, యాసిర్ షా 3, అబ్బాస్, నసీమ్ షా, ఫహీమ్ అశ్రఫ్‌లు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన పాక్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది. అబీద్ అలీ 19, మహ్మద్ అబ్బాస్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. (చదవండి : పైన్ అద్భుత క్యాచ్‌కు పుజారా బలి) -
న్యూజిలాండ్ క్రికెటర్ల ప్రాక్టీస్ షురూ
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లోనూ క్రికెట్ కార్యకలాపాలు నెమ్మదిగా ప్రారంభమవుతున్నాయి. కివీస్ టాప్ క్రికెటర్లు టామ్ లాథమ్, హెన్రీ నికోల్స్, మ్యాట్ హెన్రీ, డరైల్ మిచెల్ సోమవారం ప్రాక్టీస్‌ను ప్రారంభించారు. క్రికెటర్ల కోసం సెప్టెంబర్ వరకు ఆరు జాతీయ క్యాంప్‌లను నిర్వహించనున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ (ఎన్‌జడ్‌సీ) ప్రకటించింది. ‘లింకన్‌లోని హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో ఈ వారం జరిగే తొలి జాతీయ శిబిరంలో కివీస్ అగ్రశ్రేణి పురుషుల, మహిళల క్రికెటర్లు పాల్గొంటారు. రెండో శిబిరం మౌంట్ మాంగనీలోని బే ఓవల్‌లో ఈనెల 19–24 జరుగుతుంది. మూడోది ఆగస్టు 10–13 వరకు, నాలుగో శిబిరం ఆగస్టు 16–21 వరకు, మిగతా రెండు సెప్టెంబర్‌లో నిర్వహిస్తాం’ అని ఎన్‌జడ్‌సీ పేర్కొంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ మౌంట్‌మాంగనీలో జరిగే రెండో శిబిరంలో పాల్గొననున్నాడు. మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభించడం పట్ల కివీస్ మహిళల వైస్ కెప్టెన్ ఆమీ సాటర్‌వైట్ ఆనందం వ్యక్తం చేసింది. -
ఆ టీషర్ట్‌ను యునిసెఫ్‌కు విరాళంగా ఇస్తా
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్ క్రికెటర్ హెన్రీ నికోల్స్ 2019 ప్రపంచకప్ ఫైనల్స్‌లో ధరించిన టీషర్ట్‌ను యునిసెఫ్‌కు విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపాడు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు తన వంతుగా ఈ సాయం అందించి విరాళాలను సేకరించనున్నట్లు మీడియాతో వెల్లడించాడు. హెన్రీ నికోల్స్ మాట్లాడుతూ.. ' కరోనాను తరిమికొట్టేందుకు నా వంతుగా ఏదైనా సాయం చేయాలనుకున్నా. బాగా ఆలోచించి ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ధరించిన హాప్ స్లీవ్ టీషర్ట్‌పై మా టీమ్ సహచర ఆటగాళ్లతో సంతకం చేయించి యునిసెఫ్(యునైటెడ్ నేషనల్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్)కు విరాళం ఇవ్వాలనుకున్నా. ప్రజలు స్వచ్చందంగా తమ వంతుగా విరాళం ఇచ్చేలా ప్రోత్సహించేదుకే ఈ పని చేస్తున్నా. దీనితో సంబంధం లేకుండా వచ్చే సోమవారం నాటికి ఎవరు పెద్ద మొత్తంలో విరాళం అందజేసిన వ్యక్తికి యునిసెఫ్ ద్వారా టీషర్ట్ లభిస్తుంది. అయితే నేనే డైరెక్టుగా టీషర్ట్‌ను వేలం వేస్తే సరిపోయేది కదా అని మీరు అనుకోవచ్చు.. కానీ నాకు ఆ పని చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే నేను విరాళం ఇచ్చేటప్పుడు నాకు మద్దతుగా ఎంతమంది స్వచ్చందంగా ముందుకు వస్తారో చూద్దామని భావించానంటూ' చెప్పుకొచ్చాడు. కాగా ఏప్రిల్ మొదటి వారంలో ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ ఇదే విధంగా తాను ప్రపంచకప్‌లో ధరించిన టీషర్ట్‌ను వేలం వేసి 65,100 పౌండ్ల విరాళం సేకరించాడు. ఈ మొత్తాన్ని లండన్‌లో కోవిడ్ బాధితులు చికిత్స పొందుతున్న రెండు ఆసుపత్రులకు అందజేశాడు. (కరోనా లేదన్నా ఇంట్లోకి రానివ్వలేదు) -
దిమ్మ తిరిగే బంతి.. అదిరేటి క్యాచ్!
మెల్బోర్న్: హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మార్చుకోవడంలో అత్యంత పరిణితి కనబరచే ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్.. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఒక అద్భుతమైన క్యాచ్‌తో వెనుదిరిగాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా కివీస్ పేసర్ నీల్ వాగ్నర్ వేసిన 105వ ఓవర్‌ను ఆడటానికి తీవ్ర ఇబ్బంది పడ్డాడు. కచ్చితమైన లెంగ్త్ డెలవరీలతో పాటు పదునైన బౌన్సర్లతో స్మిత్‌ను వాగ్నర్ హడలెత్తించాడు. చివరగా ఆ ఓవర్ నాల్గో బంతికి స్మిత్ తడబడ్డాడు. ఆ షార్ట్ పిచ్ బంతిని ఎలా ఆడాలో తెలియక బ్యాట్ అడ్డం పెట్టడంతో అది కాస్తా ఎడ్జ్ తీసుకుంది. ఆ సమయంలో గల్లీలో ఫీల్డింగ్ చేస్తున్న హెన్రీ నికోలస్ సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్‌ను అందుకోవడం మరొక హైలైట్. గల్లీ నుంచి బంతి వెనక్కి వెళుతున్న సమయంలో గాల్లో డైవ్ కొట్టి మరీ దాన్ని అందుకున్నాడు నికోలస్. కేవలం అది పూర్తిగా చేతిలో పడకపోయినా రెండు వేళ్లతో బంతిని ఒడిసి పట్టుకున్నాడు. దాంతో స్మిత్ ఇన్నింగ్స్ 85 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ముగిసింది. 257/4 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్..మరో 27 పరుగులు జత చేసిన తర్వాత స్మిత్ వికెట్‌ను కోల్పోయింది. ఇక్కడ స్మిత్ అతని ఓవర్ నైట్ స్కోరుకు మరో 8 పరుగులు మాత్రమే జోడించి ఐదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఇక ట్రావిస్ హెడ్(114) సెంచరీ సాధించగా, కెప్టెన్ టిమ్ పైన్(79) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దాంతో ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 467 పరుగులు చేసింది. ✈ We have takeoff! ✈ A flying Henry Nicholls takes a screamer in the gully to remove Steve Smith! @bet365_aus | #AUSvNZ pic.twitter.com/SlCDEWXNSY — cricket.com.au (@cricketcomau) December 27, 2019 -
జడేజా బంతికి నికోలస్ దిమ్మతిరిగింది
-
న్యూజిలాండ్‌ను ఆదుకున్న నికోల్స్
హెన్రీ నికోల్స్ సెంచరీ దక్షిణాఫ్రికా 24/2 వెల్లింగ్టన్: మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ హెన్రీ నికోల్స్ కెరీర్లో తొలి సెంచరీ (161 బంతుల్లో 118, 15 ఫోర్లు) సాధించడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండోటెస్టులో న్యూజిలాండ్ మెరుగైన స్కోరు సాధించింది. గురువారం తొలిరోజు మొదటి ఇన్నింగ్స్‌లో 268 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు బేసిన్ రిజర్వ్ మైదానంలో ప్రారంభమైన ఈమ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఆరంభంలోనే 21/3తతో కష్టాల్లో పడింది. ఈదశలో నికోల్స్.. నీల్ బ్రూమ్ (15)తో జట్టు ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. నాలుగో వికెట్‌కు వీర్దిదరూ 52 పరుగులు జోడించారు. అనంతరం బ్రూమ్ వెనుదిరిగినా.. బీజే వాట్లింగ్ (35)తో కలసి ప్రొటీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో ఆరో వికెట్‌కు రికార్డు స్థాయిలో 103 పరుగులు జోడించాడు. సఫారీలపై ఈ వికెట్‌కు కివీస్ తరఫున ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. ఈక్రమంలో సెంచరీ పూర్త చేసిన నికోల్స్ వెనుదిరిగాడు.చివర్లో టిమ్ సౌథీ (27) పోరాడడంతో జట్టు స్కోరు 250 పరుగుల మార్కును దాటింది. బౌలర్లలో డుమినికి నాలుగు, మోర్నీ మోర్కెల్, కంగిసో రబాడ, కేశవ్ మహారాజ్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సఫారీలు ఆటముగిసేసరికి 7 ఓవర్లలో రెండు వికెట్లకు 24 పరుగులు చేసింది. ఓపెనర్లు స్టీఫెన్ కుక్ (3), డీన్ ఎల్గర్ (9) త్వరగానే వెనుదిరిగారు. ప్రస్తుతం క్రీజులో హషీమ్ ఆమ్లా (0), నైట్ వాచ్‌మన్ రబాడ (8) క్రీజులో ఉన్నారు. ప్రత్యర్థి కంటే మరో 244 పరుగుల వెనుకంజలో ప్రొటీస్ నిలిచింది.