New Zealand vs Sri Lanka 2nd Test: విలియమ్సన్, నికోల్స్‌ ‘డబుల్‌’ సెంచరీలు | New Zealand vs Sri Lanka 2nd Test: Kane Williamson, Henry Nicholls hit double tons | Sakshi
Sakshi News home page

New Zealand vs Sri Lanka 2nd Test: విలియమ్సన్, నికోల్స్‌ ‘డబుల్‌’ సెంచరీలు

Published Sun, Mar 19 2023 4:38 AM | Last Updated on Sun, Mar 19 2023 4:38 AM

New Zealand vs Sri Lanka 2nd Test: Kane Williamson, Henry Nicholls hit double tons - Sakshi

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ క్రికెటర్లు కేన్‌ విలియమ్సన్, హెన్రీ నికోల్స్‌ ఆ దేశం తరఫున అరుదైన ఘనత సాధించారు. ఒకే ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీలు సాధించిన తొలి కివీస్‌ ద్వయంగా గుర్తింపు పొందారు. వీరిద్దరి జోరుతో  శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ను 4 వికెట్ల నష్టానికి 580 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. కేన్‌ విలియమ్సన్‌ (296 బంతుల్లో 215; 23 ఫోర్లు, 2 సిక్స్‌లు), హెన్రీ నికోల్స్‌ (240 బంతుల్లో 200 నాటౌట్‌; 15 ఫోర్లు, 4 సిక్స్‌లు) ద్విశతకాలతో చెలరేగారు.

మూడో వికెట్‌కు 363 పరుగులు జోడించిన వీరిద్దరు ఈ క్రమంలో పలు కొత్త రికార్డులు నమోదు చేశారు. టెస్టుల్లో 8 వేల పరుగులు పూర్తి చేసుకున్న విలియమ్సన్‌... ఈ మైలురాయిని దాటిన తొలి కివీస్‌ బ్యాటర్‌గా నిలవడంతో పాటు అన్ని ఫార్మాట్‌లలో కలిపి ఆ దేశం తరఫున అత్యధిక సెంచరీలు (41) సాధించిన ఆటగాడిగా కూడా నిలిచాడు. అనంతరం శ్రీలంక రెండో రోజు ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement