Double centuries
-
New Zealand vs Sri Lanka 2nd Test: విలియమ్సన్, నికోల్స్ ‘డబుల్’ సెంచరీలు
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ క్రికెటర్లు కేన్ విలియమ్సన్, హెన్రీ నికోల్స్ ఆ దేశం తరఫున అరుదైన ఘనత సాధించారు. ఒకే ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీలు సాధించిన తొలి కివీస్ ద్వయంగా గుర్తింపు పొందారు. వీరిద్దరి జోరుతో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 4 వికెట్ల నష్టానికి 580 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కేన్ విలియమ్సన్ (296 బంతుల్లో 215; 23 ఫోర్లు, 2 సిక్స్‌లు), హెన్రీ నికోల్స్ (240 బంతుల్లో 200 నాటౌట్; 15 ఫోర్లు, 4 సిక్స్‌లు) ద్విశతకాలతో చెలరేగారు. మూడో వికెట్‌కు 363 పరుగులు జోడించిన వీరిద్దరు ఈ క్రమంలో పలు కొత్త రికార్డులు నమోదు చేశారు. టెస్టుల్లో 8 వేల పరుగులు పూర్తి చేసుకున్న విలియమ్సన్... ఈ మైలురాయిని దాటిన తొలి కివీస్ బ్యాటర్‌గా నిలవడంతో పాటు అన్ని ఫార్మాట్లలో కలిపి ఆ దేశం తరఫున అత్యధిక సెంచరీలు (41) సాధించిన ఆటగాడిగా కూడా నిలిచాడు. అనంతరం శ్రీలంక రెండో రోజు ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది. -
డబుల్ సెంచరీలు బాదిన కేన్ విలియమ్సన్, హెన్రీ నికోల్స్
వెల్లింగ్టన్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు ఆటలొ న్యూజిలాండ్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్ (215), హెన్రీ నికోల్స్ (200 నాటౌట్) ద్విశతకాలతో విరుచుకుపడ్డారు. ఫలింతగా కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 580 పరుగుల భారీ స్కోర్ చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. డెవాన్ కాన్వే (78) హాఫ్ సెంచరీతో రాణించగా.. టామ్ లాథమ్ (21), డారిల్ మిచెల్ (17) తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యారు. లంక బౌలర్లలో కసున్ రజిత 2, ధనంజయ డిసిల్వ, ప్రభాత్ జయసూర్య తలో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. కేన్ మామకు ఆరోది, నికోల్స్‌కు తొలి ద్విశతకం.. 285 బంతుల్లో కెరీర్లో ఆరో ద్విశతకం పూర్తి చేసిన విలియమ్సన్.. దిగ్గజ ఆటగాళ్లు మర్వన్ ఆటపట్టు, వీరేంద్ర సెహ్వాగ్, జావిద్ మియాందాద్, యూనిస్ ఖాన్, రికీ పాంటింగ్‌ల రికార్డును సమం చేశాడు. విలియమ్సన్ సహా వీరందరూ టెస్ట్‌ల్లో ఆరు డబుల్ సెంచరీలు చేశారు. టెస్ట్‌ల్లో అధిక డబుల్ సెంచరీల రికార్డు దిగ్గజ డాన్ బ్రాడ్‌మన్ పేరిట ఉంది. బ్రాడ్‌మన్ 52 టెస్ట్‌ల్లో ఏకంగా 12 ద్విశతకాలు బాదాడు. మరోవైపు విలియమ్సన్తో పాటు మూడో వికెట్‌కు 363 పరుగులు జోడించిన హెన్రీ నికోల్స్ కూడా డబుల్ బాదాడు. 240 బంతుల్లో 200 పరుగులతో అజేయంగా నిలిచిన నికోల్స్‌కు ఇది కెరీర్లో తొలి ద్విశతకం. కాగా, శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్‌లో సూపర్ సెంచరీతో (121) మెరిసిన కేన్ మామ.. ఐదు రోజుల వ్యవధిలో ఏకంగా డబుల్ సెంచరీతో (215) చెలరేగాడు. కేన్ మామకు ఇది హ్యాట్రిక్ సెంచరీ కావడం విశేషం. శ్రీలంకతో తొలి టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లోనూ కేన్ మామ శతక్కొట్టాడు (132). -
సెలక్టర్లకు తలనొప్పి! కిషన్‌తో రోజూ గొడవే.. అందుకే తనని బాగా తిడతా.. అయినా
Shubman Gill- Rohit Sharma- Ishan Kishan: సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023కు ముందు యువ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్.. డబుల్ సెంచరీలతో దుమ్మురేపడం టీమిండియాకు శుభసూచకంగా పరిణమించింది. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ.. ఓపెనింగ్ స్థానం కోసం పోటీపడుతూ సెలక్టర్లకు తలనొప్పి తెప్పిస్తున్నారు ఈ యువ డైనమైట్లు. అయితే, ఈ ‘స్నేహపూరిత వైరం’ ఆట వరకే! బయట వీళ్లు జాన్‌జిగిరీ దోస్తులట.. డ్రెస్సింగ్‌రూంలో వీళ్లు చేసే అల్లరి ముఖ్యంగా.. ఇషాన్ వేసే చిలిపి వేషాలు మామూలుగా ఉండవట! ఈ విషయాన్ని శుబ్‌మన్ గిల్ స్వయంగా వెల్లడించాడు. హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో మొదటి వన్డేలో అద్భుతమైన ద్విశతకం బాది పంజాబీ బ్యాటర్ భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి సందడి చేశారీ ఇద్దరు మిత్రులు. ముచ్చటగా ముగ్గురు డబుల్ సెంచరీల వీరులు ఒక్కచోట చేరి సంభాషణ సాగించారు. ఆ విశేషాలు వారి మాటల్లోనే.. ఇషాన్ కిషన్: నేను అతడిని ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నా! మ్యాచ్‌కు ముందు నీ రొటిన్ ఎలా ఉంటుంది గిల్? రోహిత్ శర్మ: (మధ్యలో కలుగజేసుకుంటూ).. ఆ విషయం అయితే నీక్కూడా తెలియాలి. ఎందుకంటే మీ ఇద్దరు ఒకే రూమ్‌లో ఉంటారు కదా! శుబ్‌మన్ గిల్: కిషన్ నా ప్రి- మ్యాచ్ రొటిన్ మొత్తాన్ని పాడు చేస్తాడు. ఇయర్ ఫోన్స్ పెట్టుకోకుండా ఫుల్ సౌండ్ పెట్టి మూవీస్ చూస్తూ ఉంటాడు. నేను తనని తిట్టకుండా ఉండలేను. సౌండ్ తగ్గించమని చెప్తాను. కానీ తను మాత్రం మాట వింటే కదా! ఇది నా రూమ్.. నేను చెప్పిన రూల్సే ఇక్కడ పాటించాలి అంటాడు. ఈ విషయంలో ఇద్దరికీ గొడవ జరుగుతూనే ఉంటుంది. ఇదే నా ప్రి- మ్యాచ్ రొటీన్. ఒకే ఫ్రేమ్‌లో భారత ఓపెనింగ్ డబుల్ సెంచరీ వీరులు(PC: BCCI) ఇషాన్ కిషన్: నేనిలా ఎందుకు చేస్తానంటే.. నువ్వు నా గదిలో పడుకుంటున్నావు. అంతేకాదు నేను చేయాల్సిన పరుగులు నీ ఖాతాలో వేసుకుంటున్నావు! బహుశా అందుకే ఇలా జరుగుతుందేమో! రోహిత్ శర్మ: ఇదంతా ఊరికే సరదాకి! వీళ్లిద్దరు మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి చాన్నాళ్లుగా టీమిండియాకు ఆడుతున్నారు. వీళ్లకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ఇద్దరూ పరస్పరం సోదరభావంతో మెలుగుతారు. ఇషాన్ రికార్డు బద్దలు వీరి ముగ్గురి సరదా ముచ్చటకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. కాగా అత్యంత పిన్న వయసులో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా ఇషాన్ కిషన్(24 ఏళ్ల 145 రోజులు) పేరిట ఉన్న రికార్డును గిల్ (23 ఏళ్ల 132 రోజులు) బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. దీనితో పాటు మరిన్ని అరుదైన ఘనతలు కివీస్‌తో మ్యాచ్ సందర్భంగా సాధించాడు. ఆఖరి వరకు ఉత్కంఠ ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో కివీస్‌తో జరిగిన మొదటి వన్డేలో రోహిత్ సేన 12 పరుగుల తేడాతో గెలుపొందింది. శుబ్‌మన్ డబుల్ సెంచరీతో మెరవగా.. లోకల్ బాయ్ సిరాజ్ నాలుగు వికెట్లతో రాణించాడు. ఇక లక్ష్య ఛేదనలో విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన కివీస్ బ్యాటర్ బ్రేస్‌వెల్ టీమిండియాను కంగారు పెట్టాడు. అయితే, ఉత్కంఠరేపిన మ్యాచ్‌లో భారత్‌దే పైచేయి అయింది. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ గడ్డపై ద్విశతకం బాదిన ఇషాన్.. బుధవారం నాటి ఉప్పల్ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో వచ్చి కేవలం 5 పరుగులకే పెవిలియన్ చేరాడు. చదవండి: IND VS NZ 1st ODI: డబుల్ సెంచరీతో రికార్డుల మోత మోగించిన శుభ్‌మన్ గిల్ Mohammed Siraj: కుటుంబ సభ్యుల నడుమ మ్యాచ్.. నిప్పులు చెరిగిన లోకల్ బాయ్.. భావోద్వేగ ట్వీట్ 1⃣ Frame 3️⃣ ODI Double centurions Expect a lot of fun, banter & insights when captain @ImRo45, @ishankishan51 & @ShubmanGill bond over the microphone 🎤 😀 - By @ameyatilak Full interview 🎥 🔽 #TeamIndia | #INDvNZ https://t.co/rD2URvFIf9 pic.twitter.com/GHupnOMJax — BCCI (@BCCI) January 19, 2023 -
సెంచరీలు వద్దు.. డబుల్ సెంచరీలే ముద్దు
ఒకప్పుడు డబుల్ సెంచరీలు కొట్టాలంటే అది టెస్టుల్లో మాత్రమే సాధ్యమయ్యేది. ఐదు రోజుల పాటు జరిగే మ్యాచ్‌లు కాబట్టి బ్యాటింగ్‌కు ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి బ్యాటర్లు డబుల్ సెంచరీలతో చెలరేగడం సహజం. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్లో అది సాధ్యం కాకపోయేది. ఒక్కరోజులో ముగిసిపోయే వన్డే మ్యాచ్‌లో సెంచరీలను చాలా గొప్పగా చూసేవారు. అయితే సనత్ జయసూర్య, షాహిద్ అఫ్రిది, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి హిట్టర్లు వచ్చాకా వన్డే ఆటతీరు పూర్తిగా మారిపోయింది. వన్డే క్రికెట్లో దూకుడు అనే పదానికి నిర్వచనం చెప్పారు ఈ క్రికెటర్లు -సాక్షి, వెబ్‌డెస్క్ గొప్ప కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న ధోని.. 2004లో శ్రీలంకపై ఆడిన 183 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ కావొచ్చు.. 2000లో న్యూజిలాండ్‌పై భాగ్యనగరంలో(హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో) సచిన్ ఆడిన 186 పరుగుల ఇన్నింగ్స్ కావొచ్చు.. గంగూలీ 183 పరుగులు కావొచ్చు.. ఇలా అప్పట్లో 180, 190 పరుగుల ఇన్నింగ్స్‌ను గొప్పగా భావించేవారు. డబుల్ సెంచరీలు చేయనప్పటికి వాటికి సమాన ప్రాధాన్యత దక్కింది. అయితే 13 ఏళ్ల క్రితం(2009లో సౌతాఫ్రికాపై వన్డే మ్యాచ్‌లో) క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వన్డే క్రికెట్లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. అప్పటికే లెక్కలేనన్ని రికార్డులు సొంతం చేసుకున్న మాస్టర్ ఈ ఫీట్ అందుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా పేరు మార్మోగిపోయింది. అలా వన్డేల్లో డబుల్ సెంచరీ అనే పదానికి సచిన్ పురుడు పోస్తే.. ఆ తర్వాత టీమిండియా మాజీ విధ్వంసకర ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తానేం తక్కువ తిన్నానా అన్నట్లు 2011లో వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్‌లో పూనకం వచ్చినట్లు చెలరేగిన సెహ్వాగ్ 41 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 219 పరుగులు సాధించాడు. వన్డే క్రికెట్లో ఇది రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం. ఈ లెక్కన చూసుకుంటే వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీలకు పునాది వేసింది టీమిండియా ఓపెనర్లే అని చెప్పొచ్చు. ఆ తర్వాత టి20 క్రికెట్, ఐపీఎల్ లాంటి లీగ్ క్రికెట్లు ఎక్కువ కావడంతో ఆటగాళ్ల బ్యాటింగ్‌లో వేగం పెరిగింది. అలా వన్డేల్లోనూ బ్యాటర్లు టి20 తరహా స్టైల్లో బ్యాటింగ్ చేయడంతో ఆ తర్వాత చాలా డబుల్ సెంచరీలు వచ్చాయి. అందులో ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడు డబుల్ సెంచరీలతో ఎవరికి సాధ్యం కాని రికార్డు అందుకున్నాడు. అటుపై గేల్, మార్టిన్ గప్టిల్, ఫఖర్ జమాన్‌లు ఉన్నారు. ఇంకో విశేషం ఏంటంటే.. వన్డే క్రికెట్లో ఇప్పటివరకు 10 డబుల్ సెంచరీలు నమోదైతే అందులో టీమిండియా నుంచే ఏడు డబుల్ సెంచరీలు ఉండడం విశేషం. ఇందులో రోహిత్ శర్మవి మూడు కాగా.. సచిన్,సెహ్వాగ్, శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లు ఒక్కో డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నారు. పైన చెప్పుకున్న ఏడుగురు ఆటగాళ్లు అందరూ ఓపెనర్లుగా వచ్చి డబుల్ సెంచరీలు బాదారు. అయితే మిడిలార్డర్లో వచ్చి డబుల్ సెంచరీ కొట్టడం అసాధ్యమైనప్పటికి మిస్టర్ 360గా పేరు తెచ్చుకున్న సూర్య లాంటి ఆటగాళ్లకు ఈ డబుల్ ఫీట్ చేసే చాన్స్ ఉంది. ఇది జరిగితే మాత్రం విశేషమే అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా మారుతున్న కాలంలో ఆటకు వేగం తోడయ్యింది. టి20లకు బాగా అలవాటు పడి వన్డే క్రికెట్లో తుఫాన్ ఇన్నింగ్స్‌లతో బ్యాటర్లు అలరించడం మొదలెట్టారు. ఇప్పటికైతే వన్డేల్లో డబుల్ సెంచరీలు కొట్టడం గ్రేట్‌గా పరిగణిస్తున్నారు. ఆధునిక క్రికెట్లో టి20 క్రికెట్ ఎక్కువగా ఆడుతున్న ఈతరం క్రికెటర్లు దూకుడైన ఆటతీరు కనబరుస్తున్నారు. కొన్నిసార్లు ఇది చేటు చేసినా మంచి పరిణామమే. మరి రాబోయే కాలంలో డబుల్ సెంచరీలను మించి త్రిబుల్ సెంచరీలు కొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. చదవండి: డబుల్ సెంచరీతో రికార్డుల మోత మోగించిన శుభ్‌మన్ గిల్ హ్యాట్రిక్ సిక్సర్లతో డబుల్ సెంచరీ పూర్తి చేసిన గిల్.. టీమిండియా భారీ స్కోర్ అసలు హార్దిక్ పాండ్యాది ఔటేనా! -
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. రోహిత్ స్థానంలో జట్టులోకి వచ్చిన కిషన్.. ఆది నుంచే బంగ్లా బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ మ్యాచ్‌లో 131 బంతులు ఎదుర్కొన్న కిషన్ 23 ఫోర్లు, 10 సిక్స్‌లతో 210 పరుగులు చేశాడు. కాగా తన కెరీర్లో తొలి అంతర్జాతీయ శతకాన్నే డబుల్ సెంచరీగా మలుచుకున్నాడు. ఇక అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగిన కిషన్ పలు రికార్డులను తన పేరిట లిఖించకున్నాడు. కిషన్ సాధించిన రికార్డులు ఇవే ►వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా డుబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా కిషన్ నిలిచాడు. అంతకు ముందు ఈ రికార్డు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉండేది. 2015 ప్రపంచకప్‌లో గేల్ జింబాబ్వేపై 138 బంతుల్లోనే ద్విశతకం సాధించాడు. ఇక తాజా మ్యాచ్‌లో 126 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించిన కిషన్.. గేల్ రికార్డును బ్రేక్ చేశాడు. ►అదే విధంగా వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా కిషన్ రికార్డులకెక్కాడు. కిషన్ 24 ఏళ్ల వయస్సులోనే ఈ ఘనత సాధించాడు. ►బంగ్లాదేశ్ గడ్డపై వన్డేలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ఆటగాడిగా కిషన్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ పేరిట ఉండేది. 2011లో షేన్ వాట్సన్ 185 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ► బంగ్లాపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత ఆటగాడిగా కూడా కిషన్ రికార్డులకెక్కాడు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్ 175 పరుగులు సాధించాడు. ►బంగ్లాదేశ్‌పై ఒకే వన్డేలో అత్యధిక సిక్స్‌లు బాదిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(7 సిక్స్‌లు) పేరిట ఉండేది. ►అదే విధంగా వన్డేల్లో తొలి సెంచరీ చేస్తూ అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గా కిషన్ నిలిచాడు. గతంలో కపిల్ దేవ్ తొలి సెంచరీ చేసిన మ్యాచ్‌లో 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చదవండి: IND vs BAN: ఇషాన్ కిషన్ విధ్వంసం.. డబుల్ సెంచరీతో చెలరేగిన జార్ఖండ్ డైన్‌మేట్ -
ఒక్కరు కాదు ముగ్గురు క్యాచ్ పట్టారు.. ఊహించని ట్విస్ట్
South Australia Fielders Trying To Bizarre Catch: ఆస్ట్రేలియాలో జరుగుతున్న మార్ష్ కప్ టోర్నమెంట్లో బుధవారం జరిగిన దక్షిణ ఆస్ట్రేలియా, క్వీన్స్‌ల్యాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఓ క్యాచ్‌ను పట్టేందుకు ముగ్గురు ఫీల్డర్స్ ప్రయత్నించారు. చివరకి ఏమి జరిగిందో మీకు తెలుసా.. క్వీన్స్‌ల్యాండ్ ఇన్నింగ్స్ 36 వ ఓవర్ వేసిన బ్రెండన్ డాగెట్ బౌలింగ్‌లో మైఖేల్ నాసర్ స్క్వేర్ లెగ్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించగా.. అది మిస్ టైమ్ అయ్యి బంతి గాల్లోకి లేచింది. ఇక క్యాచ్ పట్టుకునేందకు ముగ్గురు ఫీల్డర్స్ బౌండరీ లైన్ వైపు పరిగెత్తారు. వీరిలో ఓ ఫీల్డర్ ఆ క్యాచ్‌ను అందుకున్నా.. అతడు అదుపు తప్పి బౌండరీ లైన్ దాటడంతో బంతిని గాల్లోకి విసిరేశాడు. మరో ఫీల్డర్ దాన్ని అందుకున్నప్పటికి .. అతడు కూడా అదుపు తప్పి బౌండరీ లైన్ దాటడంతో బంతిని గాల్లోకి విసిరేశాడు. ఈ క్రమంలో మూడో ఫీల్డర్ కూడా బంతిని అందుకునే క్రమంలో బౌండరీ లైన్ దాటేశాడు. చివరికి వీరి ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో అంపైర్ దాన్ని సిక్స్‌గా ప్రకటించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం కారణంగా 48 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆస్ట్రేలియా 392 పరుగుల భారీ లక్ష్యాన్ని క్వీన్స్లాండ్ ముందట ఉంచింది. 392 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన క్వీన్స్లాండ్ 40 ఓవర్లలో 312 పరుగులకే ఆలౌటైంది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 67 పరుగుల తేడాతో సౌత్ ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇదే మ్యాచ్‌లో సౌత్ ఆస్ట్రేలియా కెప్టెన్ ట్రెవీస్ హెడ్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. Trying to salvage something out of 2021 😝 #MarshCup pic.twitter.com/WLxxeCHeWL — cricket.com.au (@cricketcomau) October 13, 2021 చదవండి: T20 World Cup 2021: హార్దిక్ పాండ్యా జట్టులోనే.. బౌలింగ్ మాత్రం చేయడు! -
విలియమ్సన్ డబుల్ సెంచరీ
హామిల్టన్ (న్యూజిలాండ్): కెప్టెన్ కేన్ విలియమ్సన్ (412 బంతుల్లో 251; 34 ఫోర్లు, 2 సిక్స్‌లు) తన కెరీర్లో మూడో డబుల్ సెంచరీ సాధించడంతోపాటు అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేయడంతో... వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 243/2తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 145 ఓవర్లలో ఏడు వికెట్లకు 519 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. 97 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన విలియమ్సన్ విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కీమర్ రోచ్ వేసిన ఇన్నింగ్స్ 81వ ఓవర్లో మూడో బంతిని బౌండరీ దాటించిన విలియమ్సన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇతర బ్యాట్స్‌మెన్ వెనుదిరుగుతున్నా... మరోవైపు విలియమ్సన్ దూకుడు కొనసాగించాడు. ఈసారీ రోచ్ బౌలింగ్‌లోనే బౌండరీ బాది విలియమ్సన్ డబుల్ సెంచరీ సాధించాడు. జేమీసన్ (51 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి ఏడో వికెట్‌కు 94 పరుగులు జోడించాక విలియమ్సన్ అవుటయ్యాడు. జేమీసన్ అర్ధ సెంచరీ పూర్తి కాగానే విలియమ్సన్ కివీస్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ వికెట్ నష్టపోకుండా 49 పరుగులు చేసింది. -
రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ద్విశతకాలు చేసిన క్రికెటర్
కొలంబో: శ్రీలంక క్రికెటర్ ఏంజెలో పెరీరా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒకే మ్యాచ్‌లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. శ్రీలంక దేశవాళీ క్రికెట్లో భాగంగా నాండేస్రిప్ట్స్‌కు సారథిగా వ్యవహరిస్తున్న పెరీరా.. అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 201 పరుగులు చేసిన పెరీరా.. రెండో ఇన్నింగ్స్‌లో 231 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 203 బంతులను ఎదుర్కొని 20 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో డబుల్ సెంచరీ సాధించాడు. ఇక్కడ అతని స్ట్రైక్‌రేట్ దాదాపు వంద ఉండటం విశేషం. ఆపై రెండో ఇన్నింగ్స్‌లో 268 బంతుల్లో 20 ఫోర్లు, 3 సిక్సర్లతో 231 పరుగుల్ని నమోదు చేశాడు. ఫలితంగా ఒకే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ద్విశతకాలు సాధించిన రెండో క్రికెటర్‌గా పెరీరా గుర్తింపు సాధించాడు. అంతకుముందు 1938లో ఇంగ్లిష్ క్రికెటర్ ఆర్థర్ ఫాగ్ ఒకే మ్యాచ్‌లో రెండు ద్విశతకాలు సాధించాడు. ఆ తర్వాత ఇంతకాలానికి ఆ ఫీట్‌ను పెరీరా అందుకున్నాడు. 2013లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేసిన పెరీరా.. ఇప్పటివరకూ కేవలం నాలుగు వన్డేలు, రెండు టీ20లు మాత్రమే ఆడాడు. అతను చివరగా ఆస్ట్రేలియాతో 2016లో జరిగిన సిరీస్‌లో లంక తరఫున కనిపించాడు. ఇక ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 97 మ్యాచ్‌లు ఆడిన పెరీరా 18 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలతో 6,941 పరుగులు చేశాడు. -
తొలి డబుల్ సెంచరీ చేసింది ఎవరు? సచిన్ కాదా?
హైదరాబాద్ : ఫకార్ జమాన్.. ప్రస్తుతం క్రికెట్ అభిమానుల నోట మారు మోగుతున్న పేరు. జింబాబ్వేతో జరిగిన నాలుగోవన్డేలో ఈ పాకిస్తాన్ ఓపెనర్ 156 బంతుల్లో 24 ఫోర్లు, 5 సిక్సర్లతో డబుల్ సెంచరీ(210 నాటౌట్) సాధించాడు. దీంతో పాక్ తరుపున తొలి ద్విశతకం సాధించి తొలి ఆటగాడిగా ఫకార్ గుర్తింపు పొందాడు. అయితే ఫకార్ డబుల్‌తో మరోసారి డబుల్ సెంచరీ రికార్డులు చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే భారత్ నుంచి ఓపెనర్ రోహిత్ శర్మ (209, 264, 208) మూడు డబుల్ సెంచరీలు సాధించగా.. మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(219), మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (200)లు సైతం డబుల్ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. అయితే వన్డే క్రికెట్లో తొలి డబుల్ సెంచరీ చేసిందీ ఎవరు? అని అడిగితే వెంటనే అందరి నోట వచ్చే మాట.. సచిన్ టెండూల్కర్. కానీ వన్డే క్రికెట్లో సచిన్ కన్నా ముందే ఒకరు డబుల్ సెంచరీ నమోదు చేశారు. క్రికెట్లో ప్రతీ రికార్డును సచినే పరిచయం చేశాడు.. కానీ డబుల్ సెంచరీని మాత్రం ఓ మహిళా క్రికెటర్ సాధించింది. ఆమె.. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ బెలిండా క్లార్క్. ఓవరాల్ అంతర్జాతీయ వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ సాధించారు. 1997 మహిళా ప్రపంచకప్ గేమ్ టోర్నీలో ఆమె డెన్మార్క్‌పై 229 పరుగులు చేశారు. 155 బంతులు ఆడిన బెలిండా 22 ఫోర్లతో 229 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. అయితే ఈ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్స్ కూడా లేకపోవడం గమనార్హం. ఇక పురుషుల వన్డేల్లో తొలి డబుల్ సాధించింది మాత్రం సచిన్ టెండూల్కరే. వన్డే ఫార్మాట్లో డబుల్ సెంచరీ సాధించిన క్రికెటర్స్ బెలిండా డెన్మార్క్ 229 నాటౌట్ (డెనార్మ్‌పై, 1997) సచిన్ టెండూల్కర్ 200 నాటౌట్ ( 2010లో దక్షిణాఫ్రికాపై) వీరేంద్ర సెహ్వాగ్ 219 (2011లో వెస్టిండీస్) రోహిత్ శర్మ 209 (2013లో ఆస్ట్రేలియా) రోహిత్ శర్మ264 (2014లో శ్రీలంకపై) క్రిస్ గేల్ 215(2015 వరల్డ్‌కప్, జింబాబ్వేపై) మార్టిన్ గప్టిల్ 237 నాటౌట్ (2015, వెస్టిండీస్) రోహిత్ శర్మ 208( 2017, శ్రీలంక) ఫకార్ జమాన్ 210 నాటౌట్ ( 2018, జింబాబ్వే) చదవండి: నయా 'జమానా' -
వన్డేలో ఒక్కడే 350 పరుగులు
ఇంగ్లండ్ క్లబ్ క్రికెట్లో రికార్డు లండన్: వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీలు సాధారణమై పోయిన రోజుల్లో ఇక ట్రిపుల్ సెంచరీలు కూడా అసాధ్యం కాదని నిరూపించాడు ఇంగ్లండ్‌లోని యువ క్రికెటర్. 138 బంతుల్లో 34 ఫోర్లు, 27 సిక్సర్లతో 350 పరుగులు... ఇంగ్లండ్ బోర్డు నిర్వహించే జాతీయ క్లబ్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో లాంకషైర్‌కు చెందిన 20 ఏళ్ల క్రికెటర్ లియామ్ లివింగ్‌స్టోన్ ఈ ఘనత సాధించాడు. క్లాడీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో నాన్‌ట్‌విచ్ జట్టు తరఫున ఆడుతూ లివింగ్‌స్టోన్ పరుగుల వరద పారించాడు. ‘గతంలో భారత్‌లోని హైదరాబాద్‌లో జరిగిన క్లబ్ మ్యాచ్‌లో నిఖిలేశ్ అనే కుర్రాడు 334 పరుగులు చేశాడు. ఇన్నాళ్లూ వన్డేల్లో ఇదే రికార్డు. దీనిని లివింగ్‌స్టోన్ అధిగమించాడు’ అని ఇంగ్లండ్ బోర్డు తెలిపింది. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం కెనడాలోని ఒటాగోలో 2014లో ఈగెన్ అనే క్రికెటర్ 358 పరుగులు సాధించాడట. అత్యధిక పరుగుల రికార్డు సంగతి ఎలా ఉన్నా లివింగ్‌స్టోన్ 350 పరుగుల సాయంతో నాన్‌ట్‌విచ్ జట్టు 45 ఓవర్లలో 7 వికెట్లకు 579 పరుగులు చేసింది. ప్రత్యర్థి క్లాడీ జట్టు 79 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఏకంగా 500 పరుగుల విజయం సాధించి నాన్‌ట్‌విచ్ క్లబ్ కొత్త రికార్డు సృష్టించింది. -
నిబంధనలు మార్చాలి: ధోని
మెల్బోర్న్: వన్డేల్లో బ్యాట్స్‌మెన్‌కు ఎక్కువ అనుకూలంగా ఉన్న ప్రస్తుత నిబంధనలు మార్చాలని భారత కెప్టెన్ ధోని అన్నాడు. ఐసీసీ అనుసరిస్తున్న నలుగురు ఫీల్డర్ల వ్యూహం వల్ల 50 ఓవర్ల ఫార్మాట్లో ధారాళంగా పరుగులు సమర్పించుకోవాల్సి వస్తుందన్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ మండలి నిబంధన ప్రకారం మ్యాచ్ మొత్తంలో 30 యార్డ్ సర్కిల్ బయట నలుగురికంటే ఎక్కువ మంది ఫీల్డర్లను ఉంచరాదు. ఈ నిబంధన భారత్ బౌలింగ్‌పై తీవ్ర ప్రభా వం చూపిందని చెప్పిన మహీ సరైన సీమర్ ఆల్‌రౌండర్ లేకపోవడం సెమీస్‌లో దెబ్బతీసిందన్నాడు. ‘ఈ నిబంధనలను మార్చాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. వన్డేల్లో గత చరిత్రను పరిశీలిస్తే డబుల్ సెంచరీలను చూడలేదు. కానీ ఇప్పుడు మూడేళ్ల వ్యవధిలో మూడు ద్విశతకాలు నమోదయ్యాయి. ఎక్స్ట్రా ఫీల్డర్‌ను సర్కిల్ లోపలికి తీసుకురావడంతో చాలా డాట్ బాల్స్ నమోదవుతున్నాయని చాలా మంది అంటున్నారు. అదే లాజిక్ అయితే మరి 11 మందిని సర్కిల్లోనే ఉంచితే మరిన్ని డాట్ బాల్స్ వస్తాయి కదా’ అని ధోని విమర్శించాడు. వన్డేల్లో ఎక్కువ ఫోర్లు, సిక్సర్లు ఉంటే ఆట బోరింగ్‌గా ఉంటుందన్నాడు. ‘తొలి, చివరి 10 ఓవర్లలో ఎలాగూ టి20ల మాదిరిగా ఆడతాం. మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్‌పైనే వన్డేలు ఆధారపడి ఉండాలి. కాబట్టి ప్రస్తుత నిబంధన చాలా కఠినంగా ఉంది. స్పిన్నర్లకు ఇది మరింత భారంగా మారింది. ప్రతి బ్యాట్స్‌మన్ స్వీప్, రివర్స్ స్వీప్‌లతో పాటు ఇతరత్రా షాట్స్ అన్నీ అడుతున్నారు’ అని మహీ వ్యాఖ్యానించాడు.