బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. రోహిత్ స్థానంలో జట్టులోకి వచ్చిన కిషన్.. ఆది నుంచే బంగ్లా బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ మ్యాచ్‌లో 131 బంతులు ఎదుర్కొన్న కిషన్ 23 ఫోర్లు, 10 సిక్స్‌లతో 210 పరుగులు చేశాడు.
కాగా తన కెరీర్‌లో తొలి అంతర్జాతీయ శతకాన్నే డబుల్ సెంచరీగా మలుచుకున్నాడు. ఇక అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగిన కిషన్ పలు రికార్డులను తన పేరిట లిఖించకున్నాడు.
కిషన్ సాధించిన రికార్డులు ఇవే
►వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా డుబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా కిషన్ నిలిచాడు. అంతకు ముందు ఈ రికార్డు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉండేది. 2015 ప్రపంచకప్‌లో గేల్ జింబాబ్వేపై 138 బంతుల్లోనే ద్విశతకం సాధించాడు. ఇక తాజా మ్యాచ్‌లో 126 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించిన కిషన్.. గేల్ రికార్డును బ్రేక్ చేశాడు.
►అదే విధంగా వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా కిషన్ రికార్డులకెక్కాడు. కిషన్ 24 ఏళ్ల వయస్సులోనే ఈ ఘనత సాధించాడు.
►బంగ్లాదేశ్ గడ్డపై వన్డేలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ఆటగాడిగా కిషన్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ పేరిట ఉండేది. 2011లో షేన్ వాట్సన్ 185 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
► బంగ్లాపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత ఆటగాడిగా కూడా కిషన్ రికార్డులకెక్కాడు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్ 175 పరుగులు సాధించాడు.
►బంగ్లాదేశ్‌పై ఒకే వన్డేలో అత్యధిక సిక్స్‌లు బాదిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(7 సిక్స్‌లు) పేరిట ఉండేది.
►అదే విధంగా వన్డేల్లో తొలి సెంచరీ చేస్తూ అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గా కిషన్ నిలిచాడు. గతంలో కపిల్ దేవ్ తొలి సెంచరీ చేసిన మ్యాచ్‌లో 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
చదవండి: IND vs BAN: ఇషాన్ కిషన్ విధ్వంసం.. డబుల్ సెంచరీతో చెలరేగిన జార్ఖండ్ డైన్‌మేట్
Comments
Please login to add a commentAdd a comment