
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. గురువారం(ఫిబ్రవరి 19)న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) విలేకరుల సమావేశంలో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా హిట్‌మ్యాన్ పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని రోహిత్ తెలిపాడు.
"దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. ప్రతీ ఐసీసీ టైటిల్ కూడా మాకు ముఖ్యమైనదే. ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా ఇక్కడకు వచ్చాము. అయితే ప్రస్తుతం మా దృష్టి బంగ్లాదేశ్ మ్యాచ్‌పైనే ఉంది. ఈ మెగా టోర్నీని విజయంతో ఆరంభించాలని భావిస్తున్నాము.
మాపై ఎటువంటి ఒత్తడి లేదు. జట్టులోని ప్రతీ ఒక్కరికి వారి రోల్‌పై ఓ క్లారిటీ ఉంది. ఇంతకుముందు టోర్నీలో భారత్ తరపున ఎలా ఆడామో, ఇప్పుడు కూడా అలానే ఆడుతాము. ఈ టోర్నీకి ముందు ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో మా కుర్రాళ్లు బాగా రాణించారు. అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచాము.
వారిని తక్కువ స్కోర్లకే పరిమితం చేశాము. కానీ ప్రతీ సిరీస్, వేదిక ఒక కొత్త సవాలు వంటిందే. గతంలో దుబాయ్‌లో మేము చాలా క్రికెట్ ఆడాము. పిచ్‌ను వీలైనంత త్వరగా అంచనా వేయడం చాలా ముఖ్యం. పరిస్థితులను బట్టి మన ప్లాన్స్‌ను మార్చుకోవాలి" అని ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో రోహిత్ పేర్కొన్నాడు. కాగా ఈ టోర్నీ కోసం ఐదు రోజుల ముందే దుబాయ్‌కు చేరుకున్న భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది.
బుమ్రా లేకుండానే..
ఇక ఈ మెగా ఈవెంట్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే ఆడనుంది. బుమ్రా వెన్ను గాయం కారణంగా ఈ మినీ వరల్డ్‌కప్‌నకు దూరమయ్యాడు. అతడి స్దానంలో యువ పేసర్ హర్షిత్ రాణాను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అదేవిధంగా ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌ను జట్టు నుంచి రిలీజ్ చేశారు. అతడికి బదులుగా మణికట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకున్నారు.
బంగ్లాపై మనదే పై చేయి..
కాగా వన్డేల్లో బంగ్లాదేశ్‌పై భారత్ మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు వన్డే ఫార్మాట్‌లో 41 సార్లు తలపడగా.. భారత్ 32 విజయాలు నమోదు చేయగా, బంగ్లా జట్టు కేవలం ఎనిమిదింట మాత్రమే గెలుపొందింది. ఇందులో మూడు విజయాలు చివరి ఐదు మ్యాచ్‌ల్లో రావడం గమనార్హం. చివరగా ఈ రెండు జట్లు వన్డే ప్రపంచకప్-2023లో ముఖాముఖి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో బంగ్లాను భారత్ చిత్తు చేసింది.
చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీ: ఈ జట్ల మధ్యే ప్రధాన పోటీ?.. కివీస్‌కు ఛాన్సులు ఎక్కువే!
Comments
Please login to add a commentAdd a comment