
అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో అత్యంతవేగంగా 11000 పరుగుల మైలు రాయిని అందుకున్న రెండో క్రికెటర్‌గా రోహిత్ శర్మ రికార్డులకెక్కాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. ఈ ఫీట్‌ను చేరుకోవడానికి రోహిత్‌కు 261 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.
ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ ఈ రికార్డును 276 ఇన్నింగ్స్‌లలో సాధించాడు. తాజా మ్యాచ్‌తో లిటల్‌మాస్టర్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. కాగా ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో రన్-మెషీన్ విరాట్ కోహ్లి అగ్రస్ధానంలో ఉన్నాడు. కోహ్లి 2019లో కేవలం 222 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు.
రోహిత్ ధనాధన్ ఇన్నింగ్స్..
కాగా ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. తొలి రెండు ఓవర్లలో కాస్త ఆచితూచి ఆడిన రోహిత్.. మూడో ఓవర్ నుంచి బౌండరీల మోత మొదలు పెట్టాడు. కేవలం 36 బంతుల్లో 7 ఫోర్లతో 41 పరుగులు చేసి రోహిత్ శర్మ ఔటయ్యాడు. టాస్కిన్ ఆహ్మద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి హిట్‌మ్యాన్ తన వికెట్‌ను కోల్పోయాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది.
బంగ్లా బ్యాటర్లలో తౌహిద్ హ్రిదయ్(118 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 100) విరోచిత సెంచరీతో చెలరేగగా.. జాకర్ అలీ(68) ఆర్ధ శతకంతో రాణించాడు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఫైవ్ వికెట్ హాల్‌తో మెరిశాడు. తన 10 ఓవర్ల కోటాలో షమీ 53 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించాడు. అతడితో పాటు హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టాడు.
వన్డేల్లో అత్యంత వేగంగా 11000 పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
1 - విరాట్ కోహ్లి: 222 ఇన్నింగ్స్‌లు
2 - రోహిత్ శర్మ: 261 ఇన్నింగ్స్
3 - సచిన్ టెండూల్కర్: 276 ఇన్నింగ్స్
4 - రికీ పాంటింగ్: 286 ఇన్నింగ్స్‌లు
5 - సౌరవ్ గంగూలీ: 288 ఇన్నింగ్స్
చదవండి: Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..
Comments
Please login to add a commentAdd a comment