
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిట్‌మ్యాన్ తనదైన శైలిలో సహచర ఆటగాళ్లపై పంచ్‌లు వేస్తూ నవ్వులు పూయిస్తుంటాడు. అంతేకాకుండా ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్ల పట్ల కూడా రోహిత్ తన మంచి మనుసు చాటుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.
తాజాగా రోహిత్ శర్మ మరో తన క్రీడా స్పూర్తిని ప్రదర్శించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్, భారత జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో బంగ్లా బ్యాటర్ జాకర్ అలీ షూ లేస్‌ను రోహిత్ కట్టాడు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
దీంతో సోషల్ మీడియా వేదికగా భారత కెప్టెన్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శెభాష్ హిట్‌మ్యాన్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో జాకర్ అలీ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను రోహిత్ జారవిడిచాడు. తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఏకంగా 68 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.
హృదయ్ సూపర్ సెంచరీ..
ఇక టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో తౌహిద్ హ్రిదయ్(118 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 100) విరోచిత సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు జాకర్ అలీ(68) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
35 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన బంగ్లాను జాకర్ అలీ, హృదయ్ తమ అద్భుత ఇన్నింగ్స్‌లతో ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 154 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 5 వికెట్లతో చెలరేగగా.. హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టాడు.
తుది జట్లు..
బంగ్లాదేశ్: తంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్‌కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, రిషాద్ హొస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మన్
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్‌కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్
చదవండి: IND vs BAN: ఎంత పనిచేశావు రోహిత్..పాపం అక్షర్ పటేల్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment