ICC Champions Trophy
-
క్రికెట్ యాడ్స్ ద్వారా రూ.6,000 కోట్లు టార్గెట్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్ 2025 ద్వారా రూ.6,000 కోట్ల వరకు ప్రకటనల ఆదాయాన్ని ఆర్జించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన మీడియా పార్ట్నర్ జియో స్టార్ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇందులో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి రూ.1,500 కోట్లు, ఐపీఎల్ నుంచి రూ.4,500 కోట్లు సంపాదించాలని యోచిస్తోంది.ముందుగా ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రాధాన్యతకంపెనీ నిర్ణయించుకున్న టార్గెట్ చేరుకోవడానికి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జియో స్టార్ ఇప్పటికే వివరణాత్మక ప్రకటన రేటు కార్డులను విడుదల చేసింది. ఐపీఎల్ ప్రకటన రేట్ల కోసం త్వరలో చర్చలు జరుగుతాయని కంపెనీ తెలిపింది. జియో స్టార్ యాడ్ సేల్స్ టీమ్ ముందుగా ఛాంపియన్స్ ట్రోఫీ ఇన్వెంటరీకి ప్రాధాన్యత ఇస్తూ, ప్రకటనదారులతో ఒప్పందాలను పొందేందుకు పని చేస్తున్నట్లు పేర్కొంది.ఆఫర్ చేస్తున్న ధరలు ఇలా..ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు, ఐపీఎల్ 2025 మార్చి 23 నుంచి మే 25 వరకు జరగనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జియో స్టార్ కో-ప్రెజెంటింగ్ స్పాన్సర్షిప్ కోసం రూ.55 కోట్లు, అసోసియేట్ స్పాన్సర్షిప్ కోసం రూ.44 కోట్లు, పార్ట్నర్ స్పాన్సర్ల నుంచి రూ.28 కోట్లు కోరుతోంది. భారత్ మ్యాచ్‌లకు టీవీ స్పాట్ రేట్ 10 సెకన్లకు రూ.28 లక్షలుగా నిర్ణయించారు. డిజిటల్ ప్లాట్ఫామ్లో జియో స్టార్ కో-ప్రెజెంటింగ్ స్పాన్సర్ల నుంచి రూ.55 కోట్లు, పవర్ బై స్పాన్సర్ల నుంచి రూ.45 కోట్లు, అసోసియేట్ స్పాన్సర్ల నుంచి రూ.25 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: ఏడాదిలో రికార్డు స్థాయిలో ఐఫోన్ ఎగుమతులుఆచితూచి వ్యవహరిస్తున్న ఎఫ్ఎంసీజీ కంపెనీలుయాడ్ మార్కెట్లో ప్రస్తుతం కొంత మందగమనం ఉన్నప్పటికీ, తన ఆదాయ లక్ష్యాలను చేరుకోవడంపై జియో స్టార్ ఆశాజనకంగా ఉంది. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటోమొబైల్స్ వంటి రంగాలు వృద్ధి అవకాశాలను చూపిస్తున్నాయి. దాంతో ఆయా కంపెనీలు యాడ్ల కోసం ఖర్చు చేస్తాయని జియో స్టార్ భావిస్తుంది. అయితే భారీగా టీవీ ప్రకటనలకు దోహదం చేసే ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఈ విభాగంలో చేసే ఖర్చులపై ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. స్టార్ ఇండియా, వయాకామ్ 18ల విలీనం వల్ల జియో స్టార్ యాడ్ మార్కెట్ పెరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల.. భారత్ మ్యాచ్‌లు ఎక్కడంటే?
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 షెడ్యూల్ వచ్చేసింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అధాకరికంగా మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. పాకిస్తాన్ ఆతిధ్యమిస్తున్న ఈ మెగా టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ ఆశించినట్లే హ్రైబిడ్ మోడల్లో జరగనుంది.భారత్ తమ మ్యాచ్‌లను దుబాయ్ వేదికగా ఆడనుంది. ఇక ఈ మెగా ఈవెంట్ తొలి మ్యాచ్‌లో కరాచీ వేదికగా పాకిస్తాన్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీ ఫిబ్రవరి 19న ప్రారంభమై మార్చి 9న జరగనున్న ఫైనల్‌తో ముగియనుంది. ఈ ఈవెంట్ ఫైనల్ కోసం ఐసీసీ రిజర్వే డేను కేటాయించింది. పాక్‌లో జరిగే మ్యాచ్‌లకు లాహోర్, కరాచీ రావల్పిండి మైదానాలు ఆతిథ్యమివ్వనున్నాయి.దాయాదుల పోరు ఎప్పుడంటే?ఇక ఈ మెగా ఈవెంట్లో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. అనంతరం ఫిబ్రవరి 23న ఇదే దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో చిరకాల ప్రత్యర్ధులు భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్ మార్చి 2న న్యూజిలాండ్‌తో ఆడనుంది. కాగా గ్రూపు-ఎలో భారత్‌తో పాటు బంగ్లాదేశ్, న్యూజిలాండ్,పాకిస్తాన్ జట్లు ఉన్నాయి. అదే విధంగా గ్రూపు-బిలో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. షెడ్యూల్ ఇదే..ఫిబ్రవరి 19, 2025 (కరాచీ)- పాకిస్తాన్ vs న్యూజిలాండ్ఫిబ్రవరి 20, 2025 (దుబాయ్)- బంగ్లాదేశ్ vs భారత్ఫిబ్రవరి 21, 2025 (కరాచీ)- ఆఫ్ఘనిస్తాన్ vs సౌత్ ఆఫ్రికాఫిబ్రవరి 22, 2025 (లాహోర్)- ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ఫిబ్రవరి 23, 2025 (దుబాయ్)- పాకిస్తాన్ vs భారత్ఫిబ్రవరి 24, 2025 (రావల్పిండి)- బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్ఫిబ్రవరి 25, 2025 (రావల్పిండి)- ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికాఫిబ్రవరి 26, 2025 (లాహోర్)- ఆఫ్ఘనిస్తాన్ vs ఇంగ్లాండ్ఫిబ్రవరి 27, 2025 (రావల్పిండి)- పాకిస్తాన్ vs బంగ్లాదేశ్ఫిబ్రవరి 28, 2025 (లాహోర్)- ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియామార్చి 1, 2025 (కరాచీ) దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్మార్చి 2, 2025 (దుబాయ్) న్యూజిలాండ్ vs భారతమార్చి 4, 2025 (దుబాయ్) సెమీ-ఫైనల్ A1 vs B2మార్చి 5, 2025 (లాహోర్ )సెమీ-ఫైనల్ B1 vs A2మార్చి 9, 2025 (లాహోర్) ఫైనల్మార్చి 10, 2025 – దుబాయ్ రిజర్వ్ డే👉ఈ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:00 గంటలకు మొదలు కానున్నాయి. -
బీసీసీఐ దెబ్బకు దిగొచ్చిన పీసీబీ.. హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీ
బీసీసీఐ డిమాండ్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎట్టకేలకు తలొగ్గింది. ఛాంపియన్స్ ట్రోఫీ- 2025ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు పీసీబీ అంగీకరించింది. దీంతో ఈ మెగా టోర్నీలో భారత క్రికెట్ జట్టు తమ మ్యాచ్‌లను తటస్థ వేదికలో ఆడనుంది.టీమిండియా ఆడే మ్యాచ్‌లు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇదే విషయంపై పీసీబీ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుతో చర్చించినట్లు తెలుస్తోంది. క్రిక్‌బజ్ రిపోర్ట్స్ ప్రకారం.. గురువారం(డిసెంబర్ 5) సాయంత్రం బోర్డు మీటింగ్ అనంతరం ఐసీసీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనుంది.ఐసీసీ కొత్త చైర్మెన్‌గా ఎన్నికైన జైషా అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్లోఎ మొత్తం 15 దేశాల క్రికెట్ బోర్డుల ప్రతినిధులు పాల్గోనున్నారు. కాగా ఇటీవల జరిగిన ఐసీసీ బోర్డు మీటింగ్‌లో పీసీబీ హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించినప్పటికి బీసీసీఐకి కొన్ని షరతులు విధించింది.రాబోయే కాలంలో భారత్ వేదికగా జరిగే ఐసీసీ ఈవెంట్లను కూడా ఇదే హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని పీసీబీ కోరింది. కానీ బీసీసీఐ మాత్రం అందుకు సున్నితంగా తిరష్కరించింది.అదేవిధంగా హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకోకపోతే టోర్నీని వేరే చోటకు తరలిస్తామని పీసీబీకి ఐసీసీ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పీసీబీ హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.చదవండి: SMT 2024: అభిషేక్ శర్మ ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ -
పాకిస్తాన్లో ఆడేందుకు కోహ్లి ఉవ్విళ్ళూరుతున్నాడు: షోయబ్ అక్తర్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 జరుగుతుందా? లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఈ మెగా ఈవెంట్లో పాల్గోనేందుకు పాకిస్తాన్‌కు భారత జట్టును పంపేందుకు బీసీసీఐ నిరకారించిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.ఈ మెగా టోర్నీ హైబ్రిడ్ మోడల్ నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు డిమాండ్ చేస్తోంది. అందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బోర్డు మాత్రం ససేమేర అంటుంది. అయితే ఇటీవలే జరిగిన ఐసీసీ బోర్డు మీటింగ్‌లో హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ అంగీకరించిందని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.కానీ భారత క్రికెట్ బోర్డు ముందు బీసీసీఐ కొన్ని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. రాబోయే కాలంలో భారత్ వేదికగా జరిగే ఐసీసీ ఈవెంట్లను కూడా ఇదే హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని పీసీబీ కోరినట్లు తెలుస్తోంది.అయితే పీసీబీ కాండీషన్స్ను భారత బోర్డు తిరష్కరించినట్లు సమాచారం. దీంతో కథ మళ్లీ మొదటికే వచ్చింది. కాగా పాక్ మాజీ క్రికెటర్లు సైతం భారత జట్టు తమ దేశానికి రావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాక్ బౌలింగ్ దిగ్గజం షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశాడు."ఇండియన్ క్రికెట్ టీమ్ పాకిస్తాన్లో ఆడేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. వారికి మా దేశంలో ఆడటమంటే చాలా ఇష్టం. ఇక్కడ ఆడటం మా జట్టు కంటే భారత జట్టుకే ఎక్కువ ఇష్టం. విరాట్ కోహ్లి సైతం పాక్‌లో ఆడాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. భారత వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ మా దేశంలో జరిగితే.. టీవీ రైట్స్, స్పాన్సర్‌షిప్‌లు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుతాయి.కానీ అలా జరుగుతుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే పాక్‌కు పంపేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని" ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్ పేర్కొన్నాడు. కాగా కోహ్లి ఇప్పటివరకు భారత సీనియర్ జట్టు తరపున ఒక్కసారి కూడా పాక్ గడ్డపై ఆడలేదు. గతంలో భారత అండర్-19 జట్టు తరపున మాత్రం పాక్‌లో కోహ్లి ఆడాడు.చదవండి: ‘పింక్ బాల్’తో అంత ఈజీ కాదు.. నాకిదే ‘తొలి’ టెస్టు: టీమిండియా స్టార్ బ్యాటర్ -
‘పాక్‌కు మోదీ వెళ్లొచ్చు.. టీమిండియా వెళ్లకూడదా?’
పాట్నా : వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తుండగా.. ఆ దేశంలో పర్యటించేందుకు భారత్ నిరాకరించింది. ఈ నిర్ణయంపై రాజకీయం వివాదం రాజుకుంది. ఈ నిర్ణయాన్ని మాజీ క్రికెటర్, రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి యాదవ్ తప్పుబట్టారు. బిర్యానీ తినేందుకు ప్రధాని మోదీ పాకిస్థాన్‌కు వెళ్లొచ్చు. కానీ భారత క్రికెర్లు అక్కడకు వెళ్లి క్రికెట్ ఆడకూడదా? అని ప్రశ్నించారు. క్రీడలకు రాజకీయాలను ఉంచాలని కేంద్రాన్ని కోరారు. ‘క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదు.. వాళ్లు (పాకిస్తాన్) మన దేశానికి రావాలి. మన ఆటగాళ్లు పాకిస్థాన్‌కి వెళ్లాలి. క్రీడలతో సమస్య ఏంటి? దాయాది దేశాల మధ్య క్రీడలు జరుగుతుంటే యుద్ధం జరుగుతున్నట్లు కాదుగా అని అన్నారు. మోదీ బిర్యానీ తినేందుకు పాక్‌కు వెళితే మంచి విషయం. కానీ భారత క్రికెట్ టీమ్ వెళితే తప్పా? అని ప్రశ్నించారు. రాష్ట్ర స్థాయి క్రికెట్లో జార్ఖండ్‌కు ప్రాతినిధ్యం వహించిన తేజస్వి ప్రధాని హోదాలో ప్రధాని మోదీ 2015లో పాకిస్తాన్ లోని లాహోర్ నగరంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధానితో కలిసి మోడీ విందు చేశారు. ఈ పర్యటనను ఉద్దేశిస్తూ తేజస్వీ యాదవ్ పై విధంగా కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే.. భారత క్రికెట్ జట్టు చివరిసారిగా 2008లో పాకిస్థాన్‌లో పర్యటించింది. ఇక అప్పటి నుండి టీమిండియా మళ్లీ పాక్‌కు వెళ్లలేదు. చిరకాల ప్రత్యర్థులు చివరిసారిగా 2012-13లో భారత్‌లో ద్వైపాక్షిక సిరీస్ ఆడారు. -
పాకిస్తాన్ కాదు... సౌతాఫ్రికా వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ!?
పాకిస్తాన్ వేదికగా వచ్చే ఏడాది జరగాల్సి ఉన్న ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఇంకా సందిగ్ధం వీడలేదు. ఆటగాళ్ల భద్రత విషయంలో బీసీసీఐ- పీసీబీ మధ్య విభేదాల నేపథ్యంలో వేదిక మార్పు అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. భారత జట్టును పాకిస్తాన్‌కు పంపేది లేదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీని అభ్యర్దించింది. అందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా అంగీకరించింది. ఈ క్రమంలో భారత్ ఆడే మ్యాచ్‌లను హైబ్రిడ్ మొడల్‌లో యూఏఈలో నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ఐసీసీ కోరింది.సౌతాఫ్రికా వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ..!స్పోర్ట్స్ టాక్ కథనం ప్రకారం.. ఐసీసీ డిమాండ్‌ను పీసీబీ అంగీకరించకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ కోల్పోనున్నట్లు తెలుస్తోంది. ఐసీసీ తమకు ఉన్న విశిష్ట అధికారాలతో పాక్ హోస్టింగ్ రైట్స్‌ను లాక్ చేయనున్నట్లు సమాచారం.ఒక వేళ అదే జరిగితే టోర్నీ మొత్తాన్ని సౌతాఫ్రికాలో నిర్వహించాలని ఐసీసీ భావిస్తోందంట. మరోవైపు తమ ఆతిథ్య హక్కులను తగ్గిస్తే ఏకంగా టోర్నీ నుంచే వైదొలగాలని పాక్ నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా ఇకపై భారత్‌లో జరిగే మరే ఇతర ఐసీసీ ఈవెంట్లకు తమ జట్టును పంపకూడదని పీసీబీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.చదవండి: అదొక పగటి కల.. భారత్‌కు పీసీబీ స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలి: పాక్ మాజీ కెప్టెన్ -
ఛాంపియన్స్ ట్రోఫీపై నీలినీడలు.. ఐసీసీ రద్దు చేయనుందా!?
వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ మెగా టోర్నీని రద్దు చేసే ఆలోచనలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఐసీసీ మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.కాగా ఇప్పటికే మెగా టోర్నీలో పాల్గోనేందుకు భారత జట్టును పంపేది లేదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. భారత్ ఆడే మ్యాచ్‌లను హైబ్రిడ్ మోడల్‌తో నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తుండగా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం తమ దేశానికి రావాల్సిందేనని మొండి పట్టుపడుతోంది.దీంతో భారత్ ఆడే మ్యాచ్‌లను షెడ్యూల్ చేయడం ఐసీసీకి క్లిష్టంగా మారింది. ఈ క్రమంలోనే ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి నవంబర్ 11న లహోర్‌లో జరగాల్సిన ఓ మేజర్ ఈవెంట్‌ను ఐసీసీ రద్దు చేసింది. ఈ ఈవెంట్లో టోర్నీలో పాల్గోనే జట్ల జాతీయ జెండాలతో పాటు షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేయాలని భావించింది. కానీ రద్దు చేయకాగా ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించి వంద రోజుల కౌంట్‌డౌన్ కూడా ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఐసీసీ నుంచి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాలేదు. ఇవన్నీ చూస్తుంటే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఐసీసీ డైలమాలో పడినట్లు తెలుస్తోంది. తాజాగా ఇదే విషయంపై ఐసీసీ అధికారి ఒకరూ మాట్లాడుతూ.. ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇంకా ఖారారు కాలేదు."ఈ టోర్నీలో పాల్గోనే జట్లతో పాటు ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్‌తో కూడా చర్చలు జరుపుతున్నాము. షెడ్యూల్ ఖారారైన తర్వాత అధికారికంగా ప్రకటిస్తాము. ట్రోఫీ టూర్ ఫ్లాగ్, ట్రోఫీని లాంఛ్ చేసేందుకు లహోర్‌లో ఓ ఈవెంట్ నిర్వహించాలని భావించాము. కానీ అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాల్సి వచ్చింది అని ఆయన పేర్కొన్నారు.చదవండి: PAK vs AUS: నిప్పులు చెరిగిన పాక్ బౌలర్లు.. 140 పరుగులకే ఆసీస్ ఆలౌట్ -
'టీమిండియా ఓడిపోయినందుకు బాధ లేదు.. కానీ అదొక్కటే సమస్య'
శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. వన్డే సిరీస్‌లో మాత్రం ఘోర పరభావాన్ని మూటగట్టుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 0-2 తేడాతో ఓటమి పాలైంది. శ్రీలంకపై వన్డే సిరీస్‌ను భారత్ కోల్పోవడం 27 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.తొలి వన్డేను టైగా ముగించిన రోహిత్ సేన.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. భారత హెడ్‌కోచ్‌గా గౌతమ్ గంభీర్‌కు ఇదే తొలి సిరీస్ ఓటమి కాగా.. టీ20 వరల్డ్‌కప్ విజయం తర్వాత రోహిత్ శర్మకు కూడా మొదటి పరాజయం. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సన్నాహాకాల్లో భాగంగా జరిగిన ఈ సిరీస్‌లో భారత్ ఓడిపోవడం ఆందోళన కలిగిస్తోందని జాఫర్ అభిప్రాయపడ్డాడు."ఈ సిరీస్‌లో శ్రీలంక అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. కచ్చితంగా ఈ సిరీస్ విజయానికి వారే అర్హులు. అయితే భారత్ సిరీస్ ఓడిపోయినందుకు నాకు ఎటువంటి బాధ లేదు. ఆటలో గెలుపు ఓటములు సహజమే.కానీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ ఇటువంటి ప్రదర్శన కనబరిచడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ఈ మెగా టోర్నీకి ముందు భారత్ కేవలం మూడు వన్డేల మాత్రమే ఆడనుందని" ఎక్స్‌లో జాఫర్ రాసుకొచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సన్నాహాకాల్లో భారత్‌కు ఇంకా కేవలం మూడు వన్డేలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది నవంబర్‌లో ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్ భారత్ ఆడనుంది. -
‘పాకిస్తాన్‌కు టీమిండియా రావాల్సిందే.. మేమైతే’
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 పాకిస్తాన్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనుంది. ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్‌ను విజయంతంగా నిర్వహించాలని పాక్ క్రికెట్ బోర్డు ప్లాన్ చేస్తుంది.ఇప్పటికే డ్రాప్ట్ షెడ్యూల్‌ను సైతం పీసీబీ.. ఐసీసీకి పంపింది. అయితే ఈ మెగా టోర్నీలో భారత్ పాల్గోంటుందా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు, భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టును పాక్‌కు పంపించేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో యూఏఈ లేదా శ్రీలంకలో నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీని డిమాండ్ చేస్తోంది. కానీ పీసీబీ మాత్రం ఈ మెగా టోర్నీని తమ దేశంలో నిర్వహించాలని మొండి పట్టు పట్టింది.ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశాడు. తమ దేశానికి రావడానికి భారత్‌కు ఇష్టం లేదని, భద్రతను సాకుగా ఉపయోగించుకుంటుందని అఫ్రిది ఆరోపించాడు. ఇప్పటికే చాలా మంది పాక్ మాజీ క్రికెటర్లు భారత జట్టు తమ దేశానికి రావాలని వాదిస్తున్నారు."మేము క్లిష్లమైన పరిస్ధితుల్లో కూడా ఆడేందుకు భారత్‌కు చాలాసార్లు వెళ్లాం. మాకు బెదిరింపులు వచ్చిన సందర్భాల్లో కూడా మేము భారత్‌కు వెళ్లి క్రికెట్ ఆడాము. మమ్మల్ని భారత్‌కు పంపేందుకు మా దేశ ప్రభుత్వం గానీ, పీసీబీ గానీ ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.గతేడాది కూడా మా జట్టు వరల్డ్‌కప్‌లో తలపడేందుకు భారత్‌కు వెళ్లింది. మేము ఎప్పుడూ భారత్‌కు సపోర్ట్‌గా ఉంటాము. కాబట్టి వారు కూడా ఇక్కడకు వచ్చి ఆడాలని నేను కోరుకుంటున్నానని" అఫ్రిది ఓ పాక్ జాతీయ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్రిది పేర్కొన్నాడు. -
'ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. భారత్ జట్టులో సూర్యకుమార్‌కు నో ఛాన్స్'
భారత టీ20 కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఎంపికైన సంగతి తెలిసిందే. జూలై 26 నుంచి శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌తో టీమిండియా కెప్టెన్‌గా సూర్యకుమార్ ప్రస్థానం మొదలు కానుంది. అయితే ఇకపై సూర్య కేవలం టీ20ల్లో మాత్రమే భారత జెర్సీలో కన్పించే అవకాశముంది. ఎందుకంటే టీ20ల్లో అద్బుతమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్న సూర్యకుమార్.. వన్డేలు, టెస్టుల్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. గతేడాది వన్డే వరల్డ్‌కప్ రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులో సైతం సూర్య సభ్యునిగా ఉన్నాడు.కానీ మిస్టర్ 360 టోర్నీలో దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పటివరకు 37 వన్డేలు ఆడిన ఈ ముంబైకర్ కేవలం 773 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలోని అతడిని కేవలం టీ20లకే పరిమితం చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీతో పాటు కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో సూర్యకుమార్ యాదవ్ ఆడే అవకాశం లేదని చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ వేదికగా జరగనుంది. అయితే భారత్ పాల్గోంటుందా లేదా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు."గతేడాది వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరిన భారత జట్టులో సూర్యకుమార్ భాగంగా ఉన్నాడు. అదే విధంగా టీ20 వరల్డ్‌కప్-2024 విజేతగా నిలిచిన జట్టులోనూ సూర్య సభ్యునిగా ఉన్నాడు. డేవిడ్ మిల్లర్ క్యాచ్‌ను అద్భుతంగా అందుకుని భారత్‌ను ఛాంపియన్స్‌గా నిలిపాడు.అంతేకాకుండా టీ20ల్లో దాదాపు ఏడాది పాటు వరల్డ్‌నెం1గా కొనసాగాడు. కానీ ఇటువంటి అద్భుత ఆటగాడికి వన్డేల్లో మాత్రం చోటు దక్కడం కష్టమనే చెప్పుకోవాలి. ఇకపై సూర్య టీ20ల్లో మాత్రమే కొనసాగనున్నాడు. ఇదే విషయాన్ని బీసీసీఐ ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. అంటే వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో సూర్య ఆడడని ఆర్దం చేసుకోవచ్చు" అని తన యూట్యూబ్ ఛానల్లో ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. -
భారత్ రాకపోయినా నష్టం లేదు.. ఆ టోర్నీ మాత్రం పాక్‌లోనే: హసన్ అలీ
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 పాకిస్తాన్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిచ్చేందుకు పాకిస్తాన్ సిద్దమైంది. అయితే ఈ మెగా టోర్నీలో భారత జట్టు పాల్గోనడంపై ఇంకా సందిగ్ధం నెలకొంది. పాకిస్తాన్‌కు భారత జట్టును పంపిచేందుకు బీసీసీఐ విముఖత చూపుతోంది. భారత్ ఆడే మ్యాచ్‌లను తటస్ధ వేదికలపై నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే తమ నిర్ణయాన్ని బీసీసీఐ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు సైతం తెలియజేసింది.ప్రస్తుతం ఈ విషయాన్ని ఐసీసీ పరిశీలిస్తోంది. అయితే పీసీబీ మాత్రం మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్‌లోనే నిర్వహించాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ స్టార్ పేసర్ హసన్ అలీ కీలక వ్యాఖ్యలు చేశాడు.ఈ టోర్నీ నుంచి భారత్ వైదొలిగినా పాకిస్తాన్ మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీని విజయవంతంగా నిర్వహిస్తుందని అలీ థీమా వ్యక్తం చేశాడు."మేము గతేడాది వరల్డ్‌కప్‌లో ఆడేందుకు భారత్‌కు వెళ్లాము. అటువంటిప్పుడు వారు కూడా పాకిస్తాన్‌కు రావాలి కాదా. క్రీడలను రాజకీయాలకు దూరం పెట్టాలని ఇప్పటికే చాలా మంది లెక్కలేనన్ని సార్లు చెప్పారు. మరోవైపు చాలా మంది భారత ఆటగాళ్లు సైతం పాకిస్తాన్లో ఆడేందుకు సముఖత చూపిస్తున్నారు.ఈ విషయాన్ని భారత క్రికెటర్లే పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. అంటే భారత జట్టు సైతం పాక్‌కు వచ్చేందుకు సిద్దంగా ఉన్నారనే కదా. కానీ వారి దేశ విధి విధానాలకు కట్టుబడి ఉన్నారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్‌లోనే జరుగుతుందని పీసీబీ చైర్మెన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆయన చెప్పినట్లు ఈ మెగా ఈవెంట్ పాకిస్తాన్‌లోనే జరుగుతుంది.భారత్ రాకపోయినా ఈ టోర్నీ మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ పాక్ దాటి వెళ్లదు. కచ్చింగా పాక్‌లో ఆడాల్సిందే. భారత్ ఆడకపోతే ఓవరాల్‌గా క్రికెట్ ముగిసినట్లు కాదు కాదా. భారత్ ఒక్కటే కాదు మిగితా టీమ్స్ కూడా ఈ టోర్నీలో ఉన్నాయి" అని సమా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అలీ పేర్కొన్నాడు. -
పాకిస్తాన్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ.. బీసీసీఐ డిమాండ్ ఇదే!
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి మధ్య ఈ మెగా టోర్నీ జరగనుంది. ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) డ్రాప్ట్ షెడ్యూల్‌ను ఐసీసీ సమర్పించింది. అయితే ఈ డ్రాఫ్ట్ షెడ్యూల్‌పై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఈ మెగా టోర్నీలో ఆడేందుకు భారత జట్టును పాకిస్తాన్‌కు పంపేందుకు బీసీసీఐ నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తమ నిర్ణయాన్ని బీసీసీఐ పెద్దలు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.గతడేది ఆసియాకప్ మాదిరిగానే హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీని కూడా నిర్వహించాలని ఐసీసీని బీసీసీఐ కోరినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడతున్నాయి. పాక్ బదులుగా భారత్ ఆడే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లను దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించాలని బీసీసీఐ ప్రతిపాదించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా ఆసియాకప్-2023 కూడా హైబ్రిడ్ పద్ధతిలో జరిగింది. ఇతర దేశాలు పాకిస్తాన్‌కు వెళ్లి ఆడగా.. భారత్ మాత్రం తమ మ్యాచ్‌లు అన్నింటిని శ్రీలంకలో ఆడింది."ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్తాన్ వెళ్లే సూచనలు కన్పించడం లేదు. అయితే ఈ విషయంపై తుది నిర్ణయం భారత ప్రభుత్వం తీసుకుంటుంది. ఒకవేళ భారత్.. పాక్‌కు వెళ్లకపోతే హైబ్రిడ్ మోడల్లో టోర్నీ జరగనుంది. ఆసియా కప్ మాదిరిగానే భారత్ తమ మ్యాచ్‌లను యూఏఈ లేదా శ్రీలంకలో ఆడే అవకాశముంది. ఐసీసీ కూడా ప్రస్తుతం ఇదే విషయంపై దృష్టి పెట్టింది. అయితే, భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం వస్తుందో వేచి చూడాలి" అంటూ బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా, 2008 అనంతరం పాకిస్థాన్ పర్యటనకు భారత్ ఇప్పటివరకు వెళ్లలేదు. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు దృష్ట్యా భారత జట్టును పాక్‌కు బీసీసీఐ పంపడం లేదు. ఇరు జట్ల మధ్య ద్వైఫాక్షిక సిరీస్‌లు కూడా జరగడం లేదు. -
2025 చాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లో.. ఐసీసీకి పెద్ద సవాల్
ICC Confident Teams Travel For Pakistan For ICC Champions Trophy 2025.. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఇటీవలే 2024- 2031 ఐసీసీ మేజర్ టోర్నీలకు సంబంధించి ప్రాతినిధ్యం వహించనున్న దేశాల జాబితాను విడుదల చేసింది. అందులో 2025 చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో టోర్నీ అంటేనే కొన్ని దేశాలు భయపడిపోతున్నాయి. అక్కడ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయోనని క్రికెట్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇది ఐసీసీకి పెద్ద సవాల్‌గా మారినుంది. దీనికి తోడూ 2009లో లాహోర్‌లో శ్రీలంక జట్టు ఉన్న బస్‌పై ఉగ్రవాదులు దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఈ దాడుల్లో ఆరుగురు పోలీసు అధికారులు.. ఇద్దరు పాకిస్తాన్ పౌరులు చనిపోయారు. ఇక శ్రీలంక ఆటగాడు థిల్లాన్ సమరవీర తృటిలో ప్రాణాల నుంచి బయటపడ్డాడు. అప్పటినుంచి ఐసీసీ ఒక్క టోర్నీ కూడా నిర్వహించలేదు. పాకిస్తాన్ కూడా దుబాయ్ వేదికగానే తమ హోం సిరీస్‌లు ఆడింది. ఇక ఐసీసీ మేజర్ టోర్నీ 1996 వన్డే ప్రపంచకప్ భారత్, శ్రీలంక, పాకిస్తాన్‌లు కలిసి ఆతిథ్యమిచ్చాయి. ఒక ఐసీసీ మేజర్ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వడం అదే చివరిసారి. ఇక తాజాగా టి20 ప్రపంచకప్ 2021కు ముందు న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు పాకిస్తాన్ పర్యటనను ఆఖరి నిమిషంలో రద్దు చేసుకోవడం పాక్‌లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులకు నిదర్శనం అని చెప్పొచ్చు. చదవండి: Trolls On Babar Azam: మత్తు దిగనట్టుంది.. బంగ్లా సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు ఈ నేపథ్యంలో ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే పాకిస్తాన్లో జరగనున్న 2025 చాంపియన్స్ ట్రోఫీ సక్సెస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. '' చాంపియన్స్ ట్రోఫీకి దాదాపు నాలుగేళ్లు సమయం ఉంది. అప్పటిలోగా అన్ని జట్లు పాకిస్తాన్‌కు వెళతాయని భావిస్తున్నా. వారికి నమ్మకం పెంచడానికి పాకిస్తాన్ గడ్డపై ఈ గ్యాప్‌లో బైలెటరల్ సిరీస్‌లు ప్లాన్ చేసేలా ప్రణాళికలు రచించుకుంటాం. మనం పలానా దేశానికి వెళ్లి క్రికెట్ ఆడితేనే కదా.. ఆ దేశ క్రికెట్ బోర్డు తమ నమ్మకాన్ని కాపాడుకుంటుందో లేదో తెలిసేది. భద్రత విషయంలో మాత్రం మేం కఠినంగానే ఉండదలచుకున్నాం. చదవండి: Ban Vs Pak: చివరి బంతికి గట్టెక్కిన పాక్.. బంగ్లాదేశ్‌పై విజయం.. 3–0తో క్లీన్‌స్వీప్ ఇప్పటికైతే న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు పాకిస్తాన్లో పర్యటించడానికి అనాసక్తిగానే ఉన్నాయి. ఆస్ట్రేలియా మాత్రం వచ్చే సంవత్సరం పాకిస్తాన్లో క్రికెట్ సిరీస్ ఆడేందుకు సముఖంగా ఉంది. ఒకవేళ అదే నిజమైతే 1998 తర్వాత మళ్లీ ఆసీస్ పాక్‌లో పర్యటించినట్లవుతుంది. 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత పాకిస్తాన్లో పర్యటించేందుకు టీమిండియా ఇష్టపడడం లేదు. అయితే పాక్‌లో పర్యటించే విషయమై తాజాగా బీసీసీఐ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఇది చాలెంజింగ్ ఇష్యూ. కానీ సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నిస్తాం. కచ్చితంగా 2025 చాంపియన్స్ ట్రోఫీలో అన్ని దేశాలు ఆడబోతున్నాయి'' అంటూ చెప్పుకొచ్చాడు. -
ICC 2024-2031 Venues: ఒకటి అమెరికా.. మరొకటి పాకిస్తాన్.. మూడు ఇండియాలో
ICC Announces Venues For Upcoming Events From 2024 To 2031.. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) 2024 నుంచి 2031 మధ్య జరగనున్న ఐసీసీ మేజర్ ఈవెంట్లకు ఆతిథ్యమివ్వనున్న దేశాల జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఇక 2024-2031 మధ్య కాలంలో నాలుగు టి20 వరల్డ్‌కప్‌లు.. రెండు చాంపియన్స్ ట్రోపీలు, రెండు వన్డే వరల్డ్‌కప్‌లు జరగనున్నాయి. ఈ ఐసీసీ మేజర్ టోర్నీలకు ఎనిమిది దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇందులో ఒక టోర్నీకి అమెరికా- వెస్టిండీస్, మరొక టోర్నీకి పాకిస్తాన్, మూడు మేజర్ టోర్నీలకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. వాటిని ఒకసారి పరిశీలిద్దాం. ►జూన్ 2024లో జరగనున్న టి20 ప్రపంచకప్‌కు అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యమివ్వనున్నాయి. ►2025 ఫిబ్రవరిలో జరగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనుంది ►2026 ఫిబ్రవరిలో జరగనున్న టి20 ప్రపంచకప్‌కు భారత్,శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి ►2027 అక్టోబర్- నవంబర్ నెలలో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వేలు ఆతిథ్యమివ్వనున్నాయి. ►2028 అక్టోబర్ నెలలో జరగనున్న టి20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ►2029 అక్టోబర్ నెలలో జరగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది. ►2030 జూన్‌లో జరగనున్న టి20 ప్రపంచకప్‌కు ఇంగ్లండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్లు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ►2031 అక్టోబర్- నవంబర్ నెలలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు ఇండియా, బంగ్లాదేశ్‌లు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. -
బుల్లెట్ కంటే వేగంగా దూసుకొచ్చింది
జహీర్ ఖాన్.. టీమిండియా బౌలింగ్ దళానికి దశాబ్దానికి పైగా నాయకత్వం వహించాడు. 2000వ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన జహీర్ ఖాన్ 92 టెస్టుల్లో 311, 200 వన్డేల్లో 282, 17 టీ20ల్లో 17 వికెట్లు తీశాడు. 2011 ప్రపంచకప్‌ను భారత్ గెలవడంలో జహీర్ పాత్ర కూడా చాలా ఉంది. ఆ ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌లాడిన జహీర్ 21 వికెట్లు తీశాడు. ముఖ్యంగా జహీర్ 2006 నుంచి 2014 వరకు భారత జట్టుకు ప్రధాన బౌలర్‌గా వ్యవహరించాడు. (చదవండి : డేవిడ్ వార్నర్ ఇన్.. బర్న్స్ అవుట్) తాజాగా ఐసీసీ జహీర్ ఖాన్‌కు సంబంధించి త్రో బ్యాక్ థర్స్డే పేరిట ఒక వీడియోనూ ట్విటర్లో షేర్ చేసింది. ఆ వీడియోలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ .. టీమిండియా బౌలింగ్ కొనసాగుతుంది. అప్పటి ఆసీస్ కెప్టెన్ స్టీవ్ వా క్రీజులో ఉన్నాడు... బంతి టీమిండియా బౌలర్ జహీర్ ఖాన్ చేతిలో ఉంది. జహీర్ వేసిన బంతి బులెట్ వేగంతో దూసుకొచ్చి వికెట్లను గిరాటేయడంతో స్టీవా దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఆ వేగం ఎంత అంటే.. బంతి దాటికి మూడు వికెట్లు చెల్లాచెదురయ్యాయి. అయితే ఈ మ్యాచ్ ఏ టోర్నీలో జరిగింది.. ఏ సంవత్సరం జరిగిందో చెప్పాలంటూ క్యాప్షన్ జత చేసింది. చాలా మంది నెటిజన్లు ఆ మ్యాచ్ 2000వ సంవత్సరం.. ఐసీసీ నాకౌట్ చాంపియన్స్ ట్రోపీలో జరిగిందని కామెంట్లు చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐసీసీ నాకౌట్ చాంపియన్స్ ట్రోపీలో క్వార్టర్ ఫైనల్లో ఆసీస్, టీమిండియా తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ 84 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 46.4 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. పాంటింగ్ 46, మైఖెల్ బెవన్ 42 పరుగులు చేయగా.. మిగతవారు విఫలం కావడంతో 20 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కెన్యాలో జరిగిన ఈ టోర్నీలో న్యూజిలాండ్, భారత్‌ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. కాగా ఫైనల్లో కివీస్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించి తొలి మేజర్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. కాగా ఈ టోర్నీ ద్వారానే జహీర్ ఖాన్‌తో పాటు డాషింగ్ ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. #ThrowbackThursday ➜ When a young Zaheer Khan went through the gate of an experienced Steve Waugh! What a peach 🔥 Can you guess this game and year? 😉 pic.twitter.com/BQfGlr0FAR — ICC (@ICC) December 31, 2020 -
ఐదేళ్ల క్రితం టీమిండియా...
సరిగ్గా ఐదేళ్ల క్రితం మినీ ప్రపంచకప్‌గా భావించే చాంపియన్స్ ట్రోఫీని టీమిండియా ముద్దాడిన రోజు. ఆ మధుర క్షణాలకు నేటితో(జూన్ 23) సరిగ్గా ఐదేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఐసీసీ ఓ ట్వీట్ ద్వారా ఆ మధుర క్షణాలను గుర్తు చేసింది. 2013లో జరిగిన ఈ మెగా టోర్నీని ఇంగ్లండ్, వేల్స్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చాయి. మినీ ప్రపంచ కప్‌గా భావించే ఈ టోర్నీ ఫైనల్లో ఇంగ్లండ్ జట్టుపై ఐదు పరుగుల తేడాతో ధోని సేన అపురూప విజయం సాధించింది. మెగా టోర్నీని ఆ దఫా మాత్రమే టీ20 ఫార్మట్‌లో నిర్వహించటం విశేషం. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. అనంతరం 130 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ సులభంగా ఛేదించేలా కనిపించింది. 20 బంతుల్లో 22 పరుగులు చేయాలి, చేతిలో ఆరు వికెట్లు ఉండటంతో మ్యాచ్ ఇంగ్లండ్‌కే అనుకూలంగా మారింది. ఈ తరుణంలో ఇషాంత్ శర్మ వరుస బంతుల్లో రెండు కీలక వికెట్లు తీయడంతో ఆతిథ్య జట్టు కష్టాల్లో పడింది. చివర్లో ధోని మాస్టర్ కెప్టెన్సీ, బౌలర్ల కట్టదిట్టమైన బౌలింగ్‌తో ఒత్తిడికి గురైన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 124 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమిండియా రెండో సారీ చాంపియన్స్ ట్రోఫీని గెలచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, సిరీస్‌లో అద్భుతంగా రాణించిన భారత డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలవటం ఇది రెండో సారి. గతంలో(2002) గంగూలీ నేతృత్వంలోని టీమిండియా శ్రీలంకతో కలిసి సంయుక్తంగా ట్రోఫీని గెలుచుకుంది. #OnThisDay in 2013, India won the Champions Trophy 2013 in a thriller. In a rain-shortened game, England had needed 20 runs from 22 balls with six wickets in hand, before Ishant Sharma took two wickets in an over to spark a collapse as India won by five runs. pic.twitter.com/0hauhN1e86 — ICC (@ICC) June 23, 2018 -
చాంపియన్స్ ట్రోఫీకి చెల్లు
కోల్‌కతా: అయ్యో..! మళ్లీ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి కష్టకాలం వచ్చినట్లుంది. సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం బంగ్లాదేశ్‌లో మొదలైన ఈ ట్రోఫీ ఆడుతూ... అటకెక్కుతూ వచ్చింది. ఒకసారి ఈ వన్డే టోర్నీ రద్దయిందంటారు. ఆపేస్తారు. మరోసారి... కొన్నేళ్ల తర్వాత మళ్లీ నిర్వహిస్తామంటారు. ఆడిస్తారు. అలా సుదీర్ఘ విరామనంతరం గతేడాది ఇంగ్లండ్‌లో జరిగిన ఈ ట్రోఫీ... 2021లో భారత్‌లో జరగాల్సి ఉంది. కానీ ఐసీసీ తాజా నిర్ణయం ప్రకారం ఈ ట్రోఫీ జరగడం లేదు. దీని స్థానంలో టి20 ప్రపంచకప్ నిర్వహిస్తారు. ఇక్కడ జరిగిన ఐదు రోజుల ఐసీసీ ఎగ్జిక్యూటివ్‌ల బోర్డు మీటింగ్‌లో టోర్నీల మార్పు ను ఖరారు చేశారు. ఐసీసీ సభ్యదేశాలన్నీ 8 జట్ల చాంపియన్స్ ట్రోఫీకి బదులు 16 జట్లు తలపడే ప్రపంచ టి20 టోర్నీకి ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ డేవ్ రిచర్డ్సన్ వెల్లడించారు. బీసీసీఐ ప్రతినిధి అమితాబ్ చౌదరి కూడా టి20 మెగా ఈవెంట్‌కే మద్దతు పలికారు. దీంతో క్రికెట్ చరిత్రలో వరుసగా రెండేళ్లు ప్రపంచకప్ టి20 టోర్నీలు (2020–ఆస్ట్రేలియా, 2021 – భారత్) రెండోసారి జరుగనున్నాయి. 2009 (ఇంగ్లండ్), 2010 (వెస్టిండీస్)లో ఈ మెగా ఈవెంట్లు జరిగాయి. 2019, 2023లలో వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో మధ్యలో చాంపియన్స్ ట్రోఫీ అసమంజసమని ఐసీసీ సభ్య దేశాలు భావించాయి. అందుకే రద్దుచేసి టి20 ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు రిచర్డ్సన్ తెలిపారు. అంతర్జాతీయం చేసేశారు... ఇప్పటిదాకా శాశ్వత సభ్య దేశాలు(10) ఆడితేనే అంతర్జాతీయ హో దా ఉండేది. ఇకపై పొట్టి ఫార్మాట్లో ఆడే మ్యాచ్‌లన్నీ అంతర్జాతీయం కానున్నాయి. అంటే ఐసీసీలోని 104 సభ్యదేశాలు పొట్టి క్రికెట్ ఆడితే వాటిని అంతర్జాతీయ టి20గా పరిగణిస్తారు. ఈ జూలై 1 నుంచి మహిళల జట్లు, వచ్చే జనవరి 1 నుంచి పురుషుల జట్లు ఆడేవన్నీ అంతర్జాతీయ మ్యాచ్‌లే. పొట్టి ఫార్మాట్‌తో క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్? లాస్ ఏంజిల్స్ ఆతిథ్యమిచ్చే 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ ఆటను చేర్చే అవకాశముంది. మెగా ఈవెంట్లో క్రికెట్‌ను చేర్చేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కృషి చేస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే లాస్ ఏంజిల్స్‌లో క్రికెట్‌ను చూడొచ్చని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ వెల్లడించారు. పారిస్ (2024)లో జరిగే ఒలింపిక్స్‌లో కొత్త క్రీడలను చేర్చే తుదిగడువు ముగియడంతో తదుపరి ఈవెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. -
భారత్-పాక్ ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్
- కేంద్ర మంత్రి రాందాస్ సంచలన వ్యాఖ్యలు వడోదరా: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ పైనల్స్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్సైందా? ఈ అనుమానం సగటు క్రీడాభిమానికి వస్తే చేసేదేమీలేదు కానీ సాక్షాత్తూ కేంద్ర మంత్రే ఫిక్సింగ్ అనుమానాలను వెలిబుచ్చితే? ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. గత నెలలో(జూన్ 18న) జరిగిన ఐసీసీ చాంపియన్స్ ఫైనల్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో టీమిండియా ఘోరపరాజయంపాలైన తీరు తనను విస్మయానికి గురిచేసిందని, దీనిపై సమగ్రదర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర సామాజిక న్యాయ సహాయ మంత్రి రాందాస్ అథావాలే అన్నారు. శుక్రవారం వడోదరా(గుజరాత్)లో పర్యటించిన మంత్రి రాందాస్ విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భారత్ లాంటి బలమైన జట్టు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్(ఓవల్)లో బలహీనమైన పాకిస్తాన్‌ను 180 పరుగుల తేడాతో చిత్తుచేసింది. అయితే ఫైనల్స్‌లో మాత్రం ఇండియా 124 పరుగుల తేడాతో ఓడిపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అసలు ఇదెలా జరిగింది? మ్యాచ్ ఫిక్సైందా? దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి వాస్తవాలు వెలికితీయాలి’ అని రాందాస్ వ్యాఖ్యానించారు. టీమిండియాలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలి భారత జాతీయ క్రికెట్ జట్టులో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన క్రీడాకారులకు రిజర్వేషన్ కల్పించాలని సామాజిక న్యాయశాఖ మంత్రి రాందాస్ అభిప్రాయపడ్డారు. కనీసం 25 శాతం రిజర్వేషన్ కల్పిస్తే ఆయా వర్గాలకు ఎంతో ప్రయోజనం చేకూరినట్లవుతుందన్నారు. -
భారత్ ఓటమిపై అభిమానుల నిరసన
-
ప్రాక్టీస్‌లో భారత టాప్ బౌలర్‌కు గాయం!
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో కీలకమైన ఫైనల్ సమరానికి సన్నద్ధమవుతున్న తరుణంలో భారత్ టాప్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు గాయమైంది. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా ఫీల్డింగ్ చేస్తుండగా అతని మోకాలుకు గాయమైంది. దీంతో అతను 30 నిమిషాలపాటు విశ్రాంతి తీసుకున్నాడు. అనంతరం నెట్స్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనడంతో అశ్విన్‌కు అయిన గాయం పెద్దది కాకపోవచ్చునని భావిస్తున్నారు. అయితే, ఈ గాయం ప్రభావం ఆదివారం నాటి ఫైనల్ మ్యాచ్‌పై ఉంటుందా? అన్నది ఇంకా కచ్చితంగా తెలియదు. శనివారం కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌తో కలిసి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ పర్యవేక్షణలో క్యాచులు అందుకుంటూ.. విసురుతూ ఉన్న క్రమంలో కుడిమోకాలిపై పూర్తి బరువు వేసి పడటంతో అశ్విన్‌కు గాయమైంది. దీంతో బాధతో విలవిల్లాడిన అశ్విన్.. ప్రాక్టీస్ సెషన్‌ను మధ్యలోనే వదిలేసి విశ్రాంతి తీసుకున్నాడు. వెంటనే రంగంలోకి దిగిన ఫిజియో ప్యాట్రిక్ ఫర్హార్ట్ అశ్విన్‌కు ఉపశమన చర్యలు చేపట్టాడు. ఫర్హార్ట్ సూచనల మేరకు కొంత కసరత్తు అనంతరం నెట్స్‌లో బౌలింగ్ సెషన్స్‌కు వచ్చిన అశ్విన్.. విస్తారంగా పాల్గొన్నాడు. దీంతో గాయం ప్రభావం అంతగా ఉండకపోవచ్చునని, మ్యాచ్‌లో అతను అందుబాటులో ఉంటాడని భావిస్తున్నారు. -
భారత్-పాక్ మ్యాచ్: రాకెట్లా దూసుకుపోతున్న ఆ ధరలు
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఇరు దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉండే కోట్లాదిమంది అభిమానుల్లో ఎంతో ఉత్కంఠ నెలకొంటోంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ రెండు దేశాలు ఫైనల్ మ్యాచ్ తలపడబోతున్నాయంటే ఆ అంచనాలే వేరుంటాయి. అభిమానుల అంచనాలు మాత్రమే కాదు, టెలివిజన్ ప్రకటన రేట్లు కూడా రాకెట్లలా దూసుకుపోతున్నాయి. దాయాది దేశాలకు మధ్య జరుగబోయే ఫైనల్ మ్యాచ్ కు టెలివిజన్ ప్రకటన ధరలు సాధారణ ధర కంటే 10 రెట్లు ఎక్కువకు పెంచాయని ఇండస్ట్రి వర్గాలు చెప్పాయి. ఆదివారం జరిగే ఈ మ్యాచ్ విరామ సందర్భాల్లో వచ్చే ప్రకటనలకు 30 సెకన్లకే ఏకంగా కోటి రూపాయలు వసూలు చేస్తున్నాయని తెలిసింది. రూపర్ట్ ముర్డోచ్ స్టార్ స్పోర్ట్స్ లో 30 సెకన్ల గల ప్రకటన ఇవ్వాలంటే కోటి పైగా చెల్లిచాల్సిందేనట. అయితే సగటున ప్రకటనదారులు చెల్లించే మొత్తం 10 లక్షలు మాత్రమే ఉంటుందని ఇండస్ట్రి వర్గాలు తెలిపాయి. ఈ రేటు చాలా అత్యధికంగా ఉందని పేర్కొన్నాయి. ఈ టోర్నమెంట్ కు నిస్సాన్ మోటార్, ఇంటెల్ కార్ప్, ఎమిరేట్స్, చైనీస్ మొబైల్ మేకర్ ఒప్పో, దేశీయ టైర్ల దిగ్గజం ఎంఆర్ఎఫ్ లు కమర్షియల్ పార్టనర్లుగా ఉన్నాయి. అయితే ముందస్తుగా బుక్ చేసుకున్న వారికంటే కూడా ప్రస్తుతం యాడ్స్ ఇవ్వాలనుకుంటే ఇంకా ఎక్కువగా చెల్లించాల్సి ఉందని ఓ వ్యక్తి చెప్పారు. 2007లో జరిగిన ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో తలబడిన భారత్-పాక్.. పదేళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి తలపడుతుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. -
ఫస్ట్ సెమీస్: నిలకడగా ఇంగ్లండ్ బ్యాటింగ్
కార్డిఫ్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మొదటి సెమీఫైనల్స్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య ఇంగ్లాడ్ జట్టు నిలకడగా ఆడుతోంది. మొదటి 20 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. ఓపెనర్ అలెక్స్ హేల్స్ 13(13 బంతుల్లో) రయీస్ బౌలింగ్‌లో త్వరగా అవుటైనా, మరో ఓపెనర్ జానీ బెయిర్‌స్టో.. వన్‌డౌన్ జో రూట్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలకడగా నడిపించే ప్రయత్నం చేశాడు. అయితే హసన్ అలీ వేసిన17వ ఓవర్లో బెయిర్‌స్టో అనూహ్యంగా క్యాచ్ ఔట్ రూపంలో వెనుదిరిగాడు. అనంతరం ఇంగ్లాడ్ సారధి ఇయాన్ మోర్గాన్ క్రీజ్‌లోకి వచ్చాడు. పాకిస్తానీ స్పీడ్‌స్టర్ మొహమ్మద్ ఆమెర్ గాయంతో మ్యాచ్‌కు దూరంకాగా అతని స్థానంలో రయీస్ తుది జట్టులోకి వచ్చాడు. -
కెప్టెన్ కోహ్లీకి గంగూలీ కీలక సూచన!
లండన్: టీమిండియా తప్పనిసరిగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో జట్టులోకి ఓ ఆటగాడిని తీసుకోవాలని కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ఆసీస్ దిగ్గజం మైకెల్ క్లార్క్ సలహా ఇచ్చారు. అతడు మరెవరో కాదు ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో గత రెండు మ్యాచ్‌లలో జట్టులో చోటు దక్కించుకోని బౌలర్ అశ్విన్‌ను దక్షిణాఫ్రికాతో నేడు జరగనున్న కీలక మ్యాచ్‌లో తీసుకోవాలని కోహ్లీకి ఈ దిగ్గజాలు సూచించారు. దీంతో రవీంద్ర జడేజాను పక్కన పెడతారా అనే అనుమానాలు తలెత్తాయని దీనికి గంగూలీ క్లారిటీ ఇచ్చాడు. 'అశ్విన్ తో పాటు రవీంద్ర జడేజా జట్టులో ఉండటం కీలకమే. అయితే హార్దిక్ పాండ్యాను పక్కనపెట్టి అశ్విన్‌ను తీసుకుని ఐదు బౌలర్ల వ్యూహంతో బరిలోకి దిగితే టీమిండియాకు కలిసొస్తుంది. బ్యాటింగ్ గురించి ఎవరికీ ఆందోళన లేదు. లంక మ్యాచ్‌లో బౌలర్లు తేలిపోవడం వల్లే టీమిండియాకు ఓటమి పాలైంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో అశ్విన్‌ను తీసుకుంటే భారత బౌలింగ్ మరింత పటిష్టమవుతుంది. ప్రధాన మ్యాచ్‌లలో ఒత్తిడికి గురికావడం సఫారీలకే అలవాటేనని' గంగూలీ అభిప్రాయపడ్డాడు. కోహ్లీకి గంగూలీ చేసిన సూచనకు ఆసీస్ మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ మద్దతు పలకడం గమనార్హం. -
బోణీ కొట్టిన పాక్.. మిల్లర్ పోరాటం వృథా
బర్మింగ్ హామ్: దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ లో వర్షం తీవ్ర అంతరాయం కలిగిందచింది. దీంతో ఆడిన ఓవర్లు, పరుగులను లెక్కలోకి తీసుకుని డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో అంపైర్లు పాక్‌ను విజేతగా ప్రకటించారు. భారత్ చేతిలో ఓటమితో ట్రోఫీ ప్రారంభించిన పాక్‌కు తొలి విజయం దక్కింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాను నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 219 పరుగులకే పాక్ బౌలర్లు కట్టడి చేశారు. లక్ష్య ఛేదనకు దిగిన పాక్ ఇన్నింగ్స్ మధ్యలోనే వరుణుడు మ్యాచ్‌ను అడ్డుకున్నాడు. మ్యాచ్ నిలిపివేసే సమయానికి పాక్ 27 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. తిరిగి మ్యాచ్ ప్రారంభించే అవకాశం లేకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం పాక్ ఆడిన ఓవర్లలో మెరుగైన రన్ రేట్ ప్రకారం దక్షిణాఫ్రికాపై 19 పరుగుల తేడాతో నెగ్గింది. పాక్ ఓపెనర్లు అజహర్ అలీ (9), ఫకార్ జమాన్ (31)లతో పాటు మహ్మద్ హఫీజ్ (26)లు ఔట్ కాగా.. బాబర్ అజామ్ (31 బ్యాటింగ్), షోయబ్ మాలిక్ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. సఫారీ బౌలర్ మోర్ని మోర్కెల్ ఈ మూడు వికెట్లు తీశాడు. ఓపెనర్లు ఒకే ఓవర్లు ఔటయ్యాక బాబర్ అజామ్‌తో కలిసి మూడో వికెట్‌కు 53 పరుగులు జోడించిన తర్వాత హఫీజ్‌ను కూడా మోర్కెల్ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. ఓపెనర్ జమాన్, షోయబ్ మాలిక్ వేగంగా ఆడకపోతే డక్‌వర్త్ లూయిస్ ప్రకారం పాక్ కు గట్టి దెబ్బ తగిలేది. మిల్లర్ పోరాటం వృథా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వీరుడు హసన్ అలీ (3/24), ఇమాద్ వసీమ్ (2/20), జునైద్ ఖాన్ (2/53)ల ధాటికి సఫారీ జట్టు ఓ దశలో 118 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (33) పరవాలేదనిపించగా, హషీం ఆమ్లా (16), డివిలియర్స్ (0), డుమిని (8) విఫలమయ్యారు. జట్టును ఆదుకునే ప్రయత్నంలో డుప్లెసిస్ (26) ఔటయ్యాడు. హాఫ్ సెంచరీ వీరుడు డేవిడ్ మిల్లర్ (75 నాటౌట్; 104 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) క్రిస్ మోరిస్ (28), రబాడ (26)లతో కలిసి పోరాటం చేయడంతో దక్షిణాఫ్రికా 200 పైచిలుకు స్కోరు చేయగలిగింది. మొదట పాక్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్, ఆపై బ్యాట్స్‌మెన్ మెరుగైన రన్‌రేట్ తో పరుగులు చేయడం వల్ల డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 19 పరుగుల తేడాతో విజయం సాధించి పాక్ బోణీ కొట్టింది. -
మీడియాపై విజయ్ మాల్యా సెటైర్లు