ఫస్ట్ సెమీస్: నిలకడగా ఇంగ్లండ్ బ్యాటింగ్
కార్డిఫ్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మొదటి సెమీఫైనల్స్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య ఇంగ్లాడ్ జట్టు నిలకడగా ఆడుతోంది. మొదటి 20 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది.
ఓపెనర్ అలెక్స్ హేల్స్ 13(13 బంతుల్లో) రయీస్ బౌలింగ్‌లో త్వరగా అవుటైనా, మరో ఓపెనర్ జానీ బెయిర్‌స్టో.. వన్‌డౌన్ జో రూట్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలకడగా నడిపించే ప్రయత్నం చేశాడు. అయితే హసన్ అలీ వేసిన17వ ఓవర్లో బెయిర్‌స్టో అనూహ్యంగా క్యాచ్ ఔట్ రూపంలో వెనుదిరిగాడు. అనంతరం ఇంగ్లాడ్ సారధి ఇయాన్ మోర్గాన్ క్రీజ్‌లోకి వచ్చాడు. పాకిస్తానీ స్పీడ్‌స్టర్ మొహమ్మద్ ఆమెర్ గాయంతో మ్యాచ్‌కు దూరంకాగా అతని స్థానంలో రయీస్ తుది జట్టులోకి వచ్చాడు.