కళ్లు చెదిరే క్యాచ్‌.. సూపర్‌మేన్‌లా డైవ్‌ చేస్తూ! వీడియో వైరల్‌ | Alex Carey comes up with a Catch of the tournament contender at Champions Trophy | Sakshi
Sakshi News home page

Champions Trophy: కళ్లు చెదిరే క్యాచ్‌.. సూపర్‌మేన్‌లా డైవ్‌ చేస్తూ! వీడియో వైరల్‌

Published Sat, Feb 22 2025 3:54 PM | Last Updated on Sat, Feb 22 2025 4:24 PM

Alex Carey comes up with a Catch of the tournament contender at Champions Trophy

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో భాగంగా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ అలెక్స్ కారీ అద్బుత‌మైన ఫీల్డింగ్ విన్యాసం క‌న‌బ‌రిచాడు. సంచ‌ల‌న క్యాచ్‌తో ఇంగ్లండ్ విధ్వంస‌క‌ర ఆటగాడు ఫిల్ సాల్ట్‌ను పెవిలియన్‌కు పంపాడు. సాధరణం‍గా వికెట్ల వెనుక ఉండే కారీ.. ఈ మ్యాచ్‌లో మాత్రం కాకుండా ఫీల్డర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

లాహోర్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు.  ఇంగ్లండ్ ఓపెనర్లు ఫిల్ సాల్ట్‌, బెన్ డకెట్‌​ ఆరంభం నుంచే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించారు. అందుకు తగ్గట్టుగానే స్పెన్సర్ జాన్సన్ వేసిన తొలి ఓవర్‌లో సాల్ట్ ఓ బౌండరీ, సిక్సర్‌తో 10 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత రెండో ఓవర్ వేసేందుకు బెన్ ద్వార్షుయిస్ ఎటాక్‌లో వచ్చాడు.

ఈ క్రమంలో రెండో ఓవర్ వేసిన ద్వార్షుయిస్ నాలుగో బంతిని సాల్ట్‌కు ఫుల్-లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ డెలివరీ సాల్ట్ మిడ్‌​-ఆన్ పైనుంచి షాట్ ఆడేందుకు సాల్ట్ ప్రయత్నించాడు. కానీ మిడ్‌-ఆన్‌లో ఉన్న సాల్ట్ అద్భుతం చేశాడు. అలెక్స్ కారీ తన కుడివైపనకు దూకుతూ సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు.

అది చూసిన ప్రతీ ఒక్కరూ షాక్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ తర్వాత మరో క్యాచ్‌ను కూడా కారీ అందుకున్నాడు. అయితే అది మొదటి క్యాచ్‌తో పోలిస్తే సులువైనది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌​ చేస్తున్న ఇంగ్లండ్‌ 17 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది.

తుది జట్లు
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్‌), మార్నస్ లాబుషేన్‌, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీప‌ర్‌), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్
ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జామీ స్మిత్(వికెట్ కీప‌ర్‌), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్‌), లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
చదవండి: Champions Trophy 2025: పాకిస్తాన్‌ మ్యాచ్‌లో అతన్ని పక్కన పెట్టండి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement