Alex Carey
-
‘నీకసలు మెదడు ఉందా?’.. భారత పేసర్‌పై రోహిత్ ఫైర్
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సహనం కోల్పోయాడు. యువ పేసర్ ఆకాశ్ దీప్ బౌలింగ్ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ‘‘నీకసలు బుర్ర(మెదడు) ఉందా?’’ అంటూ ఆకాశ్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మూడో టెస్టులో పటిష్ట స్థితిలో ఆసీస్బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టెస్టులు ఆడుతోంది. ఇందులో ఇరుజట్లు ఇప్పటికే చెరో విజయం సాధించి 1-1తో సమంగా ఉన్నాయి. ఈ క్రమంలో భారత్- ఆసీస్ మధ్య శనివారం మొదలైన మూడో టెస్టులో ఆతిథ్య జట్టు పటిష్ట స్థితిలో కొనసాగుతోంది.గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన రోహిత్ సేనకు చేదు అనుభవం ఎదురైంది. తొలి రోజు నుంచే మెరుగైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా... రెండోరోజు ఆట పూర్తయ్యేసరికి ఏడు వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది.మొదటి ఇన్నింగ్స్‌లో 445ఈ క్రమంలో 405/7(101 ఓవర్లు) ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టి.. మరో 40 పరుగులు జతచేసింది. ఫలితంగా మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా మొత్తంగా 445 పరుగుల భారీ స్కోరు సాధించింది.ఇక ఆసీస్ ఇన్నింగ్స్‌లో సోమవారం 114వ ఓవర్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆకాశ్ దీప్ చేతికి బంతినిచ్చాడు. అయితే, 28 ఏళ్ల ఈ పేసర్.. ఆసీస్ కీపర్ అలెక్స్ క్యారీ క్రీజులో ఉన్న సమయంలో వైడ్ బాల్ వేశాడు.సర్ మే కుచ్ హై?వేగంగా వచ్చిన ఈ బంతిని ఆపేందుకు టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేసిన ప్రయత్నం వృథాగా పోయింది ఫలితంగా ఆసీస్ ఖాతాలో అదనపు పరుగులు(2) చేరగా.. సహనం కోల్పోయిన రోహిత్ శర్మ.. ఆకాశ్‌ను ఉద్దేశించి..‘‘అబ్బే సర్ మే కుచ్ హై?(బుర్రలో ఏమైనా ఉందా?)’’ అంటూ కామెంట్స్ చేయగా.. స్టంప్ మైకులో రికార్డయ్యాయి.ఇక మూడో రోజు ఆటలో భాగంగా బుమ్రా మరో వికెట్ తీయగా.. ఆకాశ్ దీప్(క్యారీ వికెట్), మహ్మద్ సిరాజ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. మొత్తంగా ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రాకు ఆరు, సిరాజ్‌కు రెండు, ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డిలకు ఒక్కో వికెట్ దక్కింది. వర్షం వల్ల మూడో రోజు ఆటకు అంతరాయంకాగా ఆకాశ్‌కు విదేశీ గడ్డపై ఇదే తొలి మ్యాచ్. అడిలైడ్‌లో ఆడిన హర్షిత్ రాణాపై వేటు పడగా.. అతడి స్థానాన్ని బ్రిస్బేన్‌లో ఆకాశ్ భర్తీ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. వర్షం వల్ల మూడో రోజు ఆట అర్ధంతరంగా ముగిసిపోయింది. అప్పటికి భారత్ 17 ఓవర్లు ఆడి నాలుగు వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. ఆసీస్ కంటే తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 394 పరుగులు వెనుకబడి ఉంది.చదవండి: ‘రోహిత్ శర్మ వెంటనే తప్పుకోవాలి.. అతడిని కెప్టెన్ చేయండి’Rohit Sharma & Stump-mic Gold - the story continues... 😅#AUSvINDOnStar 👉 3rd Test, Day 3 LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/vCW0rURX5q— Star Sports (@StarSportsIndia) December 16, 2024 -
హ్యారీ బ్రూక్ మెరుపు సెంచరీ.. ఆసీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్
చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో డక్‌వర్త్-లూయిస్ ప్రకారం 46 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో తమ సిరీస్ ఆశలను ఇంగ్లండ్ సజీవంగా ఉంచుకుంది. ఐదు వన్డేల సిరీస్‌లో ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కు ఇంగ్లీష్ జట్టు తగ్గించింది. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కంగారులు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 304 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌కు విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ దూరమైనప్పటకి మిగితా బ్యాటర్లు సత్తాచాటారు. ఆసీస్ బ్యాటర్లలో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(77) టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్టీవ్ స్మిత్(60), గ్రీన్(42), హార్దీ(44) రాణించారు.సెంచరీతో చెలరేగిన బ్రూక్..?అనంతరం 305 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆదిలోనే తడబడింది. మిచిల్ స్టార్క్ దెబ్బకు 11 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఇంగ్లండ్ తాత్కాలిక కెప్టెన్ హ్యారీ బ్రూక్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లపై బ్రూక్ ఎదురుదాడికి దిగాడు. అద్భుతమైన సెంచరీతో తమ జట్టును ఆదుకున్నాడు. కాగా హ్యారీ బ్రూక్‌కు ఇదే తొలి వన్డే సెంచరీ కావడం గమనార్హం. 94 బంతులు ఎదుర్కొన్న బ్రూక్.. 13 ఫోర్లు,2 సిక్సులతో 110 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు విల్ జాక్స్(84 పరుగులు; 9 ఫోర్లు,1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్ భాగ్యస్వామ్యానికి 156 పరుగులు జోడించారు. అయితే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 37.4 ఓవర్లలో 254-4 వద్ద మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్ ఆగిపోయింది. ఈ క్రమంలో వర్షం ఎంతకీ తగ్గుముఖం పట్టకపోవడంతో డక్‌వర్త్-లూయిస్ పద్ధతి ప్రకారం 46 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించినట్టు అంపైర్లు ప్రకటించారు. ఇక ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే లండన్ వేదికగా శుక్రవారం(సెప్టెంబర్ 27)న జరగనుంది. -
చరిత్ర సృష్టించిన ఆసీస్ వికెట్ కీపర్.. పంత్ రికార్డు బద్దలు
క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను 2-0 తేడాతో ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఆసీస్ విజయంలో ఆ జట్టు వికెట్ కీపర్ ఆలెక్స్ క్యారీ కీలక పాత్ర పోషించాడు. 98 పరుగులతో ఆజేయంగా నిలిచి తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. నాలుగో రోజు ఆటలో ఆసీస్ విజయానికి 202 పరుగులు అవసరమైన దశలో 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన క్యారీ కివీస్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. వీలు చిక్కినప్పుడుల్లా బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. తృటిలో సెంచరీతో చేసే అవకాశాన్ని క్యారీ కోల్పోయాడు. ఇక ఈమ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన క్యారీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో విజయవంతమైన ఛేజింగ్‌లో అత్యధిక స్కోర్ సాధించిన రెండో వికెట్ కీపర్‌గా క్యారీ(98*) నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ పేరిట ఉండేది. 2021లో బ్రిస్బేన్ వేదికగా ఆసీస్‌తో జరిగిన ఓ టెస్టులో పంత్ నాలుగో ఇన్నింగ్స్‌లో 89 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో ఆసీస్ క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 1999లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో గిల్ క్రిస్ట్ 149 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. -
లక్ అంటే నీదే బ్రో.. బౌల్డయినా కింద పడని బెయిల్స్! వీడియో వైరల్
గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ పేసర్లు నిప్పులు చేరుగుతున్నారు. విండీస్ ఫాస్ట్ బౌలర్ల దాటికి ఆసీస్ బ్యాటర్లు విల్లావిల్లాడుతున్నారు. 54 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆసీస్‌ను.. ఖ్వాజా(75), ఆలెక్సీ క్యారీ(65) అదుకున్నారు. ప్రస్తుతం 50 ఓవర్లకు ఆసీస్ 8 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. క్రీజులో అసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(53), నాథన్ లయోన్(3) పరుగులతో ఉన్నారు. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, అల్జారీ జోషప్ 3 వికెట్లు పడగొట్టగా.. షమీర్ జోషప్, కెవిన్ తలా వికెట్ సాధించారు. అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్ ఆలెక్స్ క్యారీని ఆదృష్టం వరించింది. బంతి వికెట్లను తాకినప్పటికీ క్యారీ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 15 ఓవర్లో షమీర్ జోషఫ్.. క్యారీకి అద్బుతమైన డెలివరీని సంధించాడు. సూపర్ డెలివరీ క్యారీ ను బీట్ చేస్తూ బ్యాట్, స్టంప్స్‌కు దగ్గరగా వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. వెంటనే బౌలర్‌తో పాటు కీపర్ క్యాచ్‌కు అప్పీల్ చేశారు. అయితే రిప్లేలో బంతి బ్యాట్‌కు కాకుండా స్టంప్స్‌కు తాకినట్లు కన్పించింది. 140 కిలోమీటర్ల వేగంతో స్టంప్స్ ను తాకినా బెయిల్స్ మాత్రం ఇంచు కూడా కదల్లేదు. ఇది చూసిన అందరూ షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం 8 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న క్యారీ ఏకంగా 65 పరుగులు చేశాడు. The bail spun in its groove - but didn't fall! 😱#AUSvWI pic.twitter.com/t6XgOibdqr — cricket.com.au (@cricketcomau) January 26, 2024 -
ఏంటి కిషన్.. తొలి మ్యాచ్‌లోనే ఇలా అయితే ఎలా? తెల్లముఖం వేశావుగా
వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. డొమినికా వేదికగా విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచి అతిథ్య విండీస్‌ను చిత్తు చేసింది. భారత విజయంలో అరేంట్ర ఆటగాడు యశస్వీ జైశ్వాల్, వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక పాత్ర పోషించారు. జైశ్వాల్(171) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. అశ్విన్ 12 వికెట్ల(రెండు ఇన్నింగ్స్‌లు కలిపి)తో సత్తా చాటాడు. ఇక కరీబియన్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 150 పరుగులకి ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. .టీమిండియాకి తొలి ఇన్నింగ్స్‌లో 271 పరుగుల భారీ ఆధిక్యం దక్కగా.. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 50.3 ఓవర్లు బ్యాటింగ్ చేసి, 130 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో టీమిండియాకి ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో భారీ విజయం దక్కింది. మరో అలెక్స్ క్యారీ అవుదామనుకున్నావా.. ఇక తొలి టెస్టు మూడో రోజు ఆటలో టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తన చర్యతో వార్తల్లోకెక్కాడు. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ మాదిరి కిషన్ స్టంపౌట్ చేసే ప్రయత్నం చేశాడు. విండీస్ రెండో ఇన్నింగ్స్ 31 ఓవర్ వేసిన జడేజా బౌలింగ్‌లో ఆఖరి బంతికి హోల్డర్ కట్‌షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో షాట్ మిస్స్ కావడంతో హోల్డర్ కాసేపు క్రీజులో అలా ఉన్నాడు. ఈ సమయంలో అధిక తెలివి ఉపయోగించిన కిషన్ హోల్డర్ క్రీజు వదిలి వెళ్లే వరకు వేచి ఉన్నాడు. హోల్డర్ ఓవర్ పూర్తి అయిందని క్రీజును వదిలి ముందుకు వెళ్లగానే కిషన్ వెంటనే బెయిల్స్ పడగొట్టాడు. దీంతో సంపౌట్కు అప్పీల్ చేశాడు. అయితే ఫీల్డ్ అంపైర్లు మాత్రం ఓవర్ డెడ్ అయిందని చెప్పడంతో కిషన్ తెల్లముఖం వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా కిషన్‌కు ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం. ఈ క్రమంలో కిషన్ తీరును కొంత మంది తప్పుబడుతున్నారు. తొలి మ్యాచ్‌లోనే ఇలా చేయడం సరికాదు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇక యాషెస్ రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్ స్టోను ఆసీస్ వికెట్ కీపర్ క్యారీ ఇదే తరహాలో ఔట్ చేశాడు. ఆసీస్ బౌలర్ గ్రీన్ వేసిన బౌన్సర్‌ను తప్పించుకునేందుకు బెయిర్‌స్టో కిందకు వంగాడు. బంతి వికెట్ కీపర్ కేరీ చేతుల్లోకి వెళ్లింది. ఇంతలో ఓవర్ పూర్తయిందనే ఉద్దేశంతో బెయిర్‌స్టో క్రీజు దాటాడు. వెంటనే వికెట్ కీపర్ అలెక్స్ కేరీ బంతిని కింద నుంచి విసిరి స్టంప్స్ పడగొట్టాడు. బంతి డెడ్ కాలేదని భావించిన థర్డ్ అంపైర్.. బెయిర్‌స్టోను స్టంపౌట్‌గా ప్రకటించాడు. ఇది తీవ్ర వివాదస్పదమైంది. చదవండి: Asia Games: జట్లను ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్‌కు చోటు pic.twitter.com/lyXveEs9us — Nihari Korma (@NihariVsKorma) July 15, 2023 -
'వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది'
యాషెస్ సిరీస్‌లో మ్యాచ్‌లు ఎంత రసవత్తరంగా సాగుతున్నాయో.. మ్యాచ్ బయట జరిగే విషయాలు కూడా అంతే ఆసక్తిగా ఉంటున్నాయి. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జానీ బెయిర్ స్టో వివాదాస్పద ఔట్ తర్వాత ఇంగ్లీష్ మీడియా, అభిమానులు వీలు చిక్కినప్పుడల్లా ఆసీస్ ఆటగాళ్లను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆసీస్ కీపర్ అలెక్స్ కేరీని విలన్‌గా ముద్రించారు. అతను కనిపించిన ప్రతీసారి ఏదో ఒకరీతిలో అతన్ని టార్గెట్ చేస్తూనే వస్తున్నారు. లీడ్స్ వేదికగా మొదలైన మూడో టెస్టులో బ్యాటింగ్, కీపింగ్‌కు వచ్చిన సందర్భంలో మైదానంలోని ఇంగ్లండ్ అభిమానుల నుంచి అతనికి చీత్కారాలే ఎక్కువగా వచ్చాయి. దీనికి తోడు ఇంగ్లీష్ పత్రిక ది సన్ అలెక్స్ కేరీ కటింగ్షాపు ఓవర్‌కు డబ్బులు ఎగ్గొట్టాడంటూ ఒక కథనాన్నే ప్రచురించింది. ''లీడ్స్‌లోని ఒక కటింగ్షాపుకు వెళ్లిన కేరీ హెయిర్ కట్ అనంతరం ఓనర్‌కు డబ్బులు ఎగ్గొట్టాడు. దాంతో సదరు వ్యక్తి కేరీకి డెడ్‌లైన్ విధించాడంటూ'' రాసుకొచ్చింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ తన థ్రెడ్స్ ఖాతాలో వివరణ ఇస్తూ సదరు పత్రికపై విమర్శలు గుప్పించాడు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదంటూ హితభోద చేశాడు. ''అలెక్స్ కేరీ లండన్ వచ్చినప్పటి నుంచి హెయిర్ కటింగ్ చేయించుకోలేదు. దానిని నేను కచ్చితంగా చెప్పగలను. ముందు నిజాలను తెలుసుకుంటే బాగుంటుంది'' అని స్మిత్ పోస్టు చేశాడు. ఇక యాషెస్ సిరీస్ మూడో టెస్టు రసవత్తర ముగింపునకు సిద్ధమైంది. 251 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లండ్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. డకెట్ (18 నాటౌట్), క్రాలీ (9 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. ఆ జట్టు మరో 224 పరుగులు చేయాల్సి ఉంది. చదవండి: #PrithviShaw: ''పుజారా సార్' నాలా బ్యాటింగ్ చేయలేడు.. నేను అంతే!' విలన్‌గా మారిన ఆసీస్ కీపర్.. కటింగ్షాపులో డబ్బులు ఎగ్గొట్టి -
విలన్‌గా మారిన ఆసీస్ కీపర్.. కటింగ్షాపులో డబ్బులు ఎగ్గొట్టి
యాషెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మూడోరోజు ఆటకు వరుణుడు అడ్డు పడ్డాడు. ఇప్పటికైతే ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ట్రెవిస్ హెడ్ 18, మిచెల్ మార్ష్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో బెయిర్ స్టో ఔట్ వివాదంతో ఆసీస్ కీపర్ అలెక్స్ కేరీ విలన్‌గా మారిపోయాడు. లీడ్స్ వేదికగా మొదలైన మూడో టెస్టులో ఇంగ్లండ్ అభిమానులు అలెక్స్ కేరీని టార్గెట్ చేస్తూ గేలి చేశారు''ఆడింది చాలు.. పెవిలియన్ వెళ్లు.. అంటూ షూ, చెప్పులు చూపించడం'' వైరల్‌గా మారింది. ఇంగ్లీష్ మీడియాలో యాషెస్ విలన్‌గా ముద్ర పడిన అలెక్స్ కేరీ తన చర్యతో మరోసారి వార్తల్లో నిలిచాడు. లీడ్స్‌లోని ఒక కటింగ్షాపు ఓనర్‌కు డబ్బులు ఎగ్గొట్టాడు. దాంతో సదరు వ్యక్తి కేరీకి డెడ్‌లైన్ విధించాడు. విషయంలోకి వెళితే.. ఆడం మహమూద్ అనే బార్బర్ వద్ద కేరీ కటింగ్ చేసుకున్నాడు.అందుకు 30 యూరోలు అంటే.. మన కరెన్సీలో రూ.2,718 అయింది. అయితే ఆసీస్ కీపర్ తన వద్ద అంత డబ్బు లేదని తప్పకుండా ఇచ్చేస్తానని ఆడంతో పేర్కొన్నాడు. కానీ ఇప్పటివరకు అతడికి పైసా కూడా ఇవ్వలేదు. దాంతో చిర్రెత్తుకొచ్చిన మహమూద్.. క్యారీకి డెడ్‌లైన్ విధించాడు. ఈ సోమవారం(జూలై 10)లోగా డబ్బులు ముడితే తాను సంతోషిస్తానని లేదంటే తన ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని తెలిపాడు. అయితే అలెక్స్ కేరీ ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: IND Vs WI: అంతా కొత్త మొహాలే.. ఎవర్రా మీరంతా? -
హద్దు మీరిన ఇంగ్లండ్ ఫ్యాన్స్.. అలెక్స్ కేరీకి చేదు అనుభవం
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు రసవత్తరంగా మారింది. రెండో రోజు ఆటలో ఆసీస్ బౌలర్ల దాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు నిలవలేకపోతున్నారు. ముఖ్యంగా కమిన్స్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడుతూ ఇంగ్లండ్ భరతం పట్టాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ రెండో సెషన్లో 9 వికెట్ల నష్టానికి 212 పరుగులతో ఆడుతుంది. స్టోక్స్ 60 పరుగులతో ఒంటరిపోరాటం చేస్తుండగా.. కమిన్స్ ఆరు వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 51 పరుగులు వెనుకబడి ఉంది. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జానీ బెయిర్ స్టో ఔట్ వివాదాన్ని ఇంగ్లండ్ అభిమానులు అంత తొందరగా మరిచిపోయేలా కనిపించడం లేదు. తాజాగా మూడో టెస్టులో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కేరీకి ఇంగ్లండ్ అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. మూడో టెస్టుకు ఆతిథ్యమిస్తున్న లీడ్స్.. జానీ బెయిర్ స్టోకు హోమ్ గ్రౌండ్. కాగా బెయిర్ స్టో ఇలాకాలో ఇంగ్లండ్ అభిమానులు హద్దుమీరి ప్రవర్తించారు. ఆసీస్ ఆటగాడు అలెక్స్ కేరీని ఉద్దేశించి ఇంగ్లండ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. అలెక్స్ కేరీ ఔటయ్యి పెవిలియన్ వెళ్తున్న సమయంలో ఇంగ్లండ్ అభిమానులు అతన్ని గేలి చేశారు.. ''గుడ్ బై.. ఇక మైదానంలోకి రాకు.. వస్తే ఇలాంటి అనుభవమే ఎదురవుతుంది'' అంటూ చప్పట్లు కొట్టారు. మరి కొంతమంది అభిమానులు తన షూస్ విప్పి చేతిలో పట్టుకొని కేరీ వైపు చూపించారు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది.అయితే ఆసీస్ అభిమానులు కూడా కాస్త దీటుగానే స్పందించినట్లు తెలుస్తోంది. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టు చివరి రోజు తొలిసెషన్ ఆటలో ఇంగ్లాండ్ 193/5గా ఉన్న సమయంలో.. గ్రీన్ బౌన్సర్‌ను తప్పించుకునేందుకు బెయిర్‌స్టో కిందకు వంగాడు. బంతి వికెట్ కీపర్ కేరీ చేతుల్లోకి వెళ్లింది. ఇంతలో ఓవర్ పూర్తయిందనే ఉద్దేశంతో బెయిర్‌స్టో క్రీజు దాటాడు. వెంటనే వికెట్ కీపర్ అలెక్స్ కేరీ బంతిని కింద నుంచి విసిరి స్టంప్స్ పడగొట్టాడు. బంతి డెడ్ కాలేదని భావించిన థర్డ్ అంపైర్.. బెయిర్‌స్టోను స్టంపౌట్‌గా ప్రకటించాడు. ఇది కాస్తా తీవ్ర దుమారం రేపింది. దీంతో ఆసీస్ ‘క్రీడా స్ఫూర్తి’ ప్రదర్శించలేదని ఇంగ్లాండ్ అభిమానులు విమర్శలు గుప్పించారు. తాము ఐసీసీ నిబంధనల ప్రకారమే ఔట్ చేసినట్లు ఆసీస్ ఆటగాళ్లు, అభిమానులు కౌంటర్ ఇచ్చారు. The Western Terrace is alive as Alex Carey departs 👋#Ashes pic.twitter.com/t6bWvcQRpF — England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) July 6, 2023 “Welcome” Alex Carey pic.twitter.com/tCNv1bKEsY — Justin it for the Cloutinho (@JUSTIN_AVFC_) July 6, 2023 -
'బెయిర్ స్టో అమాయక చక్రవర్తి.. బ్రాడ్ కపట సూత్రధారి'
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ముగిసి రెండు రోజులు కావొస్తుంది. మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించినప్పటికి బెయిర్ స్టో ఔట్ వివాదం ఎక్కువగా హైలెట్ అయింది. ఈ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. బెయిర్ స్టో ఔట్ విషయంలో కీలకపాత్ర పోషించిన అలెక్స్ కేరీ తాజాగా ఒక బ్రాడ్‌తో జరిగిన సంభాషణను రివీల్ చేశాడు. బ్రాడ్ అన్న ఒకే ఒక్క మాటను అలెక్స్ కేరీ పంచుకున్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం బ్రాడ్.. అలెక్స్ కేరీ వద్దకు వచ్చి ''క్రీడాస్పూర్తిని దిగజార్చారు.. మీరంతా ఎప్పటికీ గుర్తుండి పోతారు'' అని పేర్కొన్నాడు. దీనిపై అలెక్స్ కేరీ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ''బెయిర్‌స్టో ఒక అమాయక చక్రవర్తి. బ్రాడ్ పెద్ద కపటనాటక సూత్రధారి. స్టువర్ట్ బ్రాడ్ నుంచి క్రీడా స్ఫూర్తి వంటి పదాలు వింటుంటే వింతగా ఉంది. వారి వికెట్ల కోసం అంపైర్లకు అప్పీల్ చేయాల్సిన అవసరం లేదని భావించే ఆటగాళ్లు ఇప్పుడు ఇలా చెప్పడం హాస్యాస్పదం. ఇంగ్లండ్ ఆటగాళ్లకు తమకొచ్చేసరికి రూల్స్ వేరేగా ఉంటాయి. అదే ప్రత్యర్థి విషయంలో మాత్రం క్రీడాస్ఫూర్తి గుర్తుకొస్తుంది'' అంటూ కామెంట్ చేశాడు. ఇక అభిమానులు మాత్రం ఈ సంఘటనను అంత త్వరగా మరిచిపోలేరనుకుంటా. గతంలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ల సందర్భంగా జరిగిన సంఘటనలను గుర్తుకు తెస్తూ పలు వీడియోలను రిలీజ్ చేశారు. అందులో భాగంగా 2013 యాషెస్ సిరీస్‌లో బ్రాడ్ క్యాచ్ ఔట్ అని స్పష్టంగా తెలిసినా మైదానం వీడేందుకు మొగ్గు చూపలేదు. అంపైర్స్ కాల్ కోసం వేచి చూశాడు. ఇప్పుడు ఆ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చదవండి: 'ఎదుటోళ్లను విమర్శించే ముందు మీ కపటత్వం తెలుసుకోండి' మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు ఇంగ్లండ్‌కు భారీ షాక్.. సిరీస్ మొత్తానికి కీలక ప్లేయర్ దూరం -
బెయిర్ స్టో ఔట్ వివాదం.. మొదలుపెట్టింది ఇంగ్లండే కదా!
లార్డ్స్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే విజయం కన్నా బెయిర్ స్టో ఔట్ వివాదాస్పదంగా మారింది. ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేసిన పని క్రీడాస్పూర్తికి విరుద్ధంగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. ఐదోరోజు ఆటలో లంచ్ విరామానికి ముందు గ్రీన్ వేసిన బంతిని ఆడకుండా కిందకు వంగిన బెయిర్‌స్టో ఆ తర్వాత సహచరుడు స్టోక్స్‌తో మాట్లాడేందుకు ముందుకు వెళ్లాడు. అదే సమయంలో బంతిని అందుకున్న కీపర్ క్యారీ అండర్‌ఆర్మ్ త్రోతో ముందుకు విసరగా అది స్టంప్స్‌ను తాకింది. ఆ సమయంలో బెయిర్‌స్టో క్రీజ్‌కు చాలా దూరం ఉండడంతో థర్డ్ అంపైర్ బెయిర్‌స్టోన్‌ను అవుట్‌గా ప్రకటించాడు. దాంతో ఇంగ్లండ్ బృందం ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యింది. ఆసీస్ తమ అప్పీల్‌ను కూడా వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయకపోవడంతో బెయిర్‌స్టో మైదానం వీడాడు. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లపై స్టేడియంలోని ప్రేక్షకులు చీటర్స్ అంటూ దూషణల పర్వం మొదలుపెట్టారు. అయితే బెయిర్ స్టో ఇదే లార్డ్స్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో మార్నస్ లబుషేన్‌ను ఇలాగే ఔట్ చేసే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. బంతి మిస్సయ్యి కీపర్ బెయిర్ స్టో చేతుల్లోకి వెళ్లినా లబుషేన్ క్రీజులోనే ఉన్నాడు. త్రో వేయాలన్న ఉద్దేశంతో బెయిర్ స్టో నేరుగా వికెట్ల వైపు విసిరాడు. అయితే లబుషేన్ క్రీజులోనే ఉండడంతో అది ఔట్‌గా పరిగణించలేదు. ఒకవేళ లబుషేన్ క్రీజు దాటి బయట ఉంటే అప్పుడు బెయిర్ స్టో అప్పీల్‌కు వెళ్లేవాడా లేక క్రీడాస్పూర్తి ప్రదర్శించేవాడా అంటే చెప్పలేని పరిస్థితి. అంటే ఈ లెక్కన చూస్తే ఇంగ్లండ్ కీపర్ బెయిర్ స్టోనే తొలుత ఇది మొదలుపెట్టాడనిపిస్తుంది. ఆ సమయంలో అలెక్స్ క్యారీ గమనించాడేమో తెలియదు కానీ.. తనకు అవకాశం వచ్చినప్పుడు మాత్రం క్రీడాస్పూర్తిని పక్కకుబెట్టి బెయిర్ స్టోను ఔట్ చేశాడు. గెలుపు కోసం ప్రయత్నిస్తున్న ఏ జట్టైనా అలాగే చేస్తుందని.. ఆసీస్‌ను చీటర్స్ అని పిలుస్తున్నారు కానీ అదే స్థానంలో ఇంగ్లండ్ ఉండుంటే కూడా బహుశా అదే జరిగేదేమో అని కొంతమంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు. England’s hypocrisy exposed as Bairstow tries to stump Labuschagne on Day 3… but of course Stokes would’ve called Marnus back (coughs… BS) #Ashes #ashes2023 #ashes23 pic.twitter.com/MwF0T42dWX — Paul Kneeshaw (@Stick_Beetle) July 3, 2023 చదవండి: Ashes 2023: నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం.. వాళ్లు ఛీటర్స్! ఆస్ట్రేలియాకు ఇది అలవాటే బెయిర్‌స్టో వివాదాస్పద స్టంపౌట్‌పై బెన్ స్టోక్స్.. అలాంటి గెలుపు మాకొద్దు..! -
Eng Vs Aus: పట్టుదలగా నిలబడ్డ ఖ్వాజా.. క్యారీ సైతం..! కోలుకున్న ఆస్ట్రేలియా!
England vs Australia, 1st Test- బర్మింగ్హమ్: ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (279 బంతుల్లో 126 బ్యాటింగ్; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) మొండి పట్టుదలతో ఆడటంతో... ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా కోలుకుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 94 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 311 పరుగులు సాధించింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు (393/8 డిక్లేర్డ్)కు ఆస్ట్రేలియా మరో 82 పరుగుల దూరంలో ఉంది. ఖ్వాజాతో కలిసి అలెక్స్ క్యారీ (80 బంతుల్లో 52 బ్యాటింగ్; 7 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధ సెంచరీతో క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 14/0తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ దెబ్బ కొట్టాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో తొలి రెండు బంతుల్లో డేవిడ్ వార్నర్ (27 బంతుల్లో 9; 2 ఫోర్లు), లబుషేన్ (0)లను బ్రాడ్ అవుట్ చేశాడు. కాసేపటికి స్టీవ్ స్మిత్ (59 బంతుల్లో 16) కూడా పెవిలియన్ చేరడంతో ఆస్ట్రేలిచయా 67 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడింది. ఈ దశలో ట్రావిస్ హెడ్ (63 బంతుల్లో 50; 8 ఫోర్లు, 1 సిక్స్) తో ఖ్వాజా నాలుగో వికెట్‌కు 81 పరుగులు... గ్రీన్ (68 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్)తో ఐదో వికెట్‌కు 72 పరుగులు జత చేసి ఆదుకున్నాడు. గ్రీన్ అవుటయ్యాక వచ్చిన క్యారీ ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. ఖ్వాజాతో ఆరో వికెట్‌కు అజేయంగా 91 పరుగులు జోడించాడు. చదవండి: వరల్డ్‌కప్ క్వాలిఫియర్ మ్యాచ్‌లకు సర్వం సిద్దం.. ఫోటోలకు ఫోజులిచ్చిన కెప్టెన్లు -
కోహ్లి క్రీడాస్పూర్తి.. వీడియో వైరల్
టీమిండియా స్టార్.. కింగ్ కోహ్లి అభిమానులను ఎంటర్టైన్ చేయడంలో ఎప్పుడు ముందుంటాడు. తన చర్యతో అభిమానులను ఆకట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా కోహ్లి తన జెర్సీని ఆస్ట్రేలియా ప్లేయర్లు ఉస్మాన్ ఖవాజా, అలెక్స్ కేరీకి గిఫ్ట్ అందించి క్రీడాస్పూర్తిని ప్రదర్శించాడు. ఆ తర్వాత కాసేపు వారిద్దరితో మాట్లాడి కెరీర్ పరంగా ఆల్ ది బెస్ట్ చెప్పి తన పెద్ద మనసును చాటుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి కోహ్లి మాత్రం అహ్మదాబాద్ టెస్టు హీరోగా నిలిచాడు. కొంతకాలంగా టెస్టుల్లో సెంచరీ చేయడంలో విఫలమవుతూ వచ్చిన కోహ్లి ఆ కొరతను తీర్చుకోవడమే గాక తన బ్యాటింగ్‌పై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాడు. ఇక బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై బ్యాటర్లు పండగ చేసుకున్నారు. ఇరుజట్లు కలిపి నలుగురు బ్యాటర్లు సెంచరీలు బాదారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 480 పరుగులకు ఆలౌట్ కాగా.. ఉస్మాన్ ఖవాజా 180, గ్రీన్ 114 సెంచరీలతో మెరిశారు. ఆ తర్వాత టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లి 186, శుబ్‌మన్ గిల్ 128 పరుగులు.. సెంచరీలతో కదం తొక్కారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఐదో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 175 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ట్రెవిస్ హెడ్ 90 పరుగుల వద్ద ఔటయ్యి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మార్నస్ లబుషేన్ 63 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మ్యాచ్‌లో 186 పరుగులు చేసిన కోహ్లి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. సిరీస్‌లో పోటాపోటీగా వికెట్లు తీసిన అశ్విన్, జడేజాలు సంయుక్తంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును పంచుకున్నారు. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ మార్చి 17 నుంచి మొదలుకానుంది. తొలి వన్డే ముంబై వేదికగా మార్చి 17న జరగనుంది. Virat Kohli presents his match jersey to Usman Khawaja and Alex Carey. Class bloke! pic.twitter.com/tr3ciu1az7 — Vignesh Bharadwaj (@VBharadwaj31) March 13, 2023 -
ఎదురులేని ఆసీస్.. దక్షిణాఫ్రికా చిత్తు! డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఇక..
Australia vs South Africa, 2nd Test - World Test Championship: రెండో టెస్టులో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ మీద 182 పరుగుల తేడాతో పర్యాటక ప్రొటిస్ జట్టును చిత్తుగా ఓడించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మరో టెస్టు మిగిలి ఉండగానే.. సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. గ్రీన్ మ్యాజిక్ మెల్బోర్న్ వేదికగా జరిగి బాక్సింగ్ డే టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ 5 వికెట్లతో చెలరేగడంతో 189 పరుగులకే సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. వికెట్ కీపర్ బ్యాటర్ వెయిర్నే(52), మార్కో జాన్సన్(59) అర్ధ శతకాలతో రాణించడంతో ఈ మేరకు స్కోరు చేయగలిగింది. డబుల్ సెంచరీ హీరో అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య కంగారూ జట్టుకు ఓపెనర్ డేవిడ్ వార్నర్ డబుల్ సెంచరీ(200)తో అదిరిపోయే ఆరంభం అందించాడు. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(1), వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ (14) నిరాశపరిచినా.. స్టీవ్ స్మిత్ 85 పరుగులతో రాణించాడు. అతడికి తోడుగా ట్రవిస్ హెడ్(51), కామెరాన్ గ్రీన్ (51- నాటౌట్), వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ 111తో అదరగొట్టారు. ఈ నేపథ్యంలో 8 వికెట్ల నష్టానికి 575 పరుగుల భారీ స్కోరు వద్ద ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తప్పని పరాభవం ఇక తమ రెండో ఇన్నింగ్స్‌లో టాపార్డర్ విఫలం కావడంతో సౌతాఫ్రికాకు కష్టాలు తప్పలేదు. నాలుగో స్థానంలో వచ్చిన తెంబా బవుమా 65 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసిన వెయిర్నే 33 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ముఖ్యంగా ప్రొటిస్ కెప్టెన్, ఓపెనర్ డీన్ ఎల్గర్ డకౌట్‌గా వెనుదిరగడం ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో 204 పరుగులకే ఆలౌట్ అయిన సౌతాఫ్రికాకు భారీ ఓటమి తప్పలేదు. డబుల్ సెంచరీ హీరో డేవిడ్ వార్నర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఇక.. ఇక ఈ ఘన విజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో ముందు వరుసలో ఉన్న ఆస్ట్రేలియా తమ అగ్రస్థానం పదిలం చేసుకోగా.. రెండో స్థానం కోసం పోరులో పోటీ పడుతున్న సౌతాఫ్రికాకు చేదు అనుభవం మిగిలింది. తాజా ఓటమితో 72 పాయింట్లున్న ప్రొటిస్ పాయింట్ల పట్టికలో 54.55 నుంచి 50 శాతానికి పడిపోగా.. బంగ్లాదేశ్‌పై విజయంతో టీమిండియా 99 పాయింట్లతో 58.93 శాతంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: Suryakumar Yadav: మొన్న 90.. నిన్న 95.. చెలరేగుతున్న సూర్య! టెస్టుల్లో ఎంట్రీ ఖాయం! Kane Williamson: పాక్‌తో మ్యాచ్‌లో సెంచరీ.. విలియమ్సన్ అరుదైన రికార్డు -
Aus Vs SA: తొలి వికెట్ కీపర్‌గా అలెక్స్ క్యారీ సరికొత్త చరిత్ర
Australia vs South Africa, 2nd Test- Alex Carey: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్స్ క్యారీ సెంచరీతో మెరిశాడు. బుధవారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా 149 బంతుల్లో 111 పరుగులు సాధించాడు. కాగా టెస్టు క్రికెట్లో అలెక్స్ క్యారీకి ఇదే తొలి శతకం. అంతేగాకుండా.. ఈ అద్భుత ఇన్నింగ్స్ ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాడు అలెక్స్ క్యారీ. బాక్సింగ్ డే టెస్టులో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా.. సెంచరీ సాధించిన ఆస్ట్రేలియా తొలి వికెట్ కీపర్‌గా ఘనత సాధించాడు. ఇక డేవిడ్ వార్నర్ డబుల్ సెంచరీకి తోడు స్టీవ్ స్మిత్(85) సహా ట్రవిస్ హెడ్(51), కామెరాన్ గ్రీన్ (51- నాటౌట్) అర్ధ శతకాలతో రాణించగా.. క్యారీ సెంచరీతో అదరగొట్టాడు. ఈ క్రమంలో 8 వికెట్ల నష్టానికి 575 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. మరోవైపు.. మూడో రోజు ఆట ముగిసే సరికి సౌతాఫ్రికా ఒక వికెట్ నష్టానికి 15 పరుగులు చేసింది. చదవండి: Ind Vs SL T20 Series: సెంచరీ బాదినా కనబడదా? నువ్వు ఐర్లాండ్ వెళ్లి ఆడుకో! ఇక్కడుంటే.. Devon Conway: కాన్వే అరుదైన రికార్డు! తొలి కివీస్ బ్యాటర్‌గా.. కానీ అదొక్కటే మిస్! -
Aus Vs SA: ఆసీస్ భారీ స్కోరు.. చతికిల పడ్డ ప్రొటిస్! మరోసారి..
Australia vs South Africa, 2nd Test Day 3 Highlights: ఆస్ట్రేలియాలో సౌతాఫ్రికా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలిచేందుకు కీలకమైన సిరీస్‌లో ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఓడింది ప్రొటిస్. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆతిథ్య ఆసీస్ చేతిలో ఓడిన సౌతాఫ్రికా.. రెండో టెస్టులోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. మెల్బోర్న్ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సరికి 371 పరుగుల వెనుకబడి ఉంది. కాగా సోమవారం ఆరంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ప్రొటిస్‌ను ఆల్‌రౌండర్‌ను కామెరాన్ గ్రీన్ దెబ్బకొట్టాడు. 10.4 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు కూల్చాడు. 189కే ఆలౌట్ ఈ క్రమంలో 189 పరుగులకు ఆలౌట్ అయిన సౌతాఫ్రికా.. బౌలింగ్‌లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (200), స్టీవ్ స్మిత్(85) అద్భుత ఇన్నింగ్స్ ఆడగా.. ట్రవిస్ హెడ్(51), గ్రీన్(51- నాటౌట్) రాణించారు. ఇక అలెక్స్ క్యారీ టెస్టు కెరీర్లో తొలి సెంచరీ(111)తో మెరిశాడు. ఈ క్రమంలో మూడో రోజు ఆటలో 8 వికెట్ల నష్టానికి 575 పరుగులు చేసిన ఆస్ట్రేలియా 575 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ప్రొటిస్ బౌలర్లలో రబడకు రెండు, నోర్జేకు మూడు వికెట్లు దక్కగా.. లుంగి ఎంగిడి, మార్కో జాన్సెన్ తలా ఓ వికెట్ తీశారు. కెప్టెన్ మరోసారి విఫలం ఈ నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సౌతాఫ్రికాకు శుభారంభం లభించలేదు. ప్రొటిస్ కెప్టెన్, ఓపెనింగ్ బ్యాటర్ డీన్ ఎల్గర్ మరోసారి విఫలమయ్యాడు. ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక మూడో రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టానికి సౌతాఫ్రికా 17 పరుగులు చేసింది. ఓపెనర్ సారెల్ ఎర్వీ(7), థీనిస్ డి బ్రూయిన్ (6) క్రీజులో ఉన్నారు. కాగా ఎల్గర్ తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయ్యాడు. మూడో రోజు ఆట ముగిసే సరికి స్కోర్లు: ఆస్ట్రేలియా- 575/8 d సౌతాఫ్రికా- 189 & 15/1 (7) చదవండి: Ind Vs SL T20 Series: సెంచరీ బాదినా కనబడదా? నువ్వు ఐర్లాండ్ వెళ్లి ఆడుకో! ఇక్కడుంటే.. Devon Conway: కాన్వే అరుదైన రికార్డు! తొలి కివీస్ బ్యాటర్‌గా.. కానీ అదొక్కటే మిస్! Nothing sweeter than getting your opposition skipper... for a duck! #OhWhatAFeeling #AUSvSA | @Toyota_Aus pic.twitter.com/KdTEdLZNFq — cricket.com.au (@cricketcomau) December 28, 2022 -
క్యారీ, గ్రీన్ల అద్భుత పోరాటం.. ఆసక్తికర పోరులో కివీస్‌ను ఓడించిన ఆసీస్
3 వన్డేల సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న న్యూజిలాండ్ కెయిన్స్ వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 6) తొలి వన్డే ఆడింది. చివరి నిమిషం వరకు ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు అలెక్స్ క్యారీ (99 బంతుల్లో 85; 8 ఫోర్లు, సిక్స్), కెమరూన్ గ్రీన్ (92 బంతుల్లో 89 నాటౌట్; 10 ఫోర్లు, సిక్స్)లు అద్భుతమైన పోరాట పటిమ కనబర్చి జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించారు. ముఖ్యంగా గ్రీన్ చివరి నిమిషం వరకు క్రీజ్‌లో ఉండి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా ఆసీస్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (68 బంతుల్లో 46; 4 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ విలియమ్సన్ (71 బంతుల్లో 45; 3 ఫోర్లు, సిక్స్), వికెట్‌కీపర్ టామ్ లాథమ్ (57 బంతుల్లో 43; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లలో మ్యాక్స్‌వెల్ 4, హేజిల్‌వుడ్ 3, స్టార్క్, జంపా తలో వికెట్ పడగొట్టారు. Wow, that was some contest! Cameron Green (89no), Alex Carey (85) and Glenn Maxwell (4-52) impress in the Chappell-Hadlee series opener in Cairns #AUSvNZ pic.twitter.com/rxXnwpeb7Y— Cricket Australia (@CricketAus) September 6, 2022 అనంతరం 233 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 44 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, అలెక్స్ క్యారీ, కెమరూన్ గ్రీన్ అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి ఆసీస్‌ను గెలిపించారు. గ్రీన్ తొమ్మిదో వికెట్‌కు ఆడమ్ జంపాతో (13 నాటౌట్) కలిసి 26 పరుగులు జోడించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో ట్రెంట్ బౌల్ట్ (4/40), మ్యాట్ హెన్రీ (2/50)లు ఆసీస్‌ను వణికించారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికగా సెప్టెంబర్ 8న జరుగనుంది. చదవండి: రైనా రిటైర్మెంట్పై స్పందించిన చెన్నై యాజమాన్యం -
చివరి వన్డేలో ఆసీస్ విజయం.. ఆస్ట్రేలియాకు లంక ఫ్యాన్స్ కృతజ్ఞతలు
శ్రీలంకతో శుక్రవారం జరిగిన ఐదో వన్డేలో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 39.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఇప్పటికే లంక వరుసగా మూడు వన్డేలు గెలవడంతో సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుంది. 1992 తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాపై శ్రీలంక వన్డే సిరీస్ నెగ్గడం ఇదే తొలిసారి. ఇక ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంకకు ఆసీస్ క్రికెట్ ఆడేందుకు రావడం దేశానికి కాస్త ఊరటనిచ్చింది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఆసీస్ క్రికెట్ బోర్డు పెద్ద మనసుతో లంక పర్యటనకు రావడం కాస్త ఆదాయాన్ని తెచ్చి పెట్టిందనే చెప్పొచ్చు. ఇక లంక జట్టు టి20 సిరీస్ కోల్పోయినప్పటికి.. వన్డే సిరీస్‌ను మాత్రం కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో లంక అభిమానులు కష్టాల్లో ఉన్న తమ దేశానికి వచ్చిన ఆస్ట్రేలియాకు ధన్యవాదాలు తెలిపారు. చివరి వన్డే సందర్భంగా హాజరైన ప్రేక్షకులు ''లంక పర్యటనకు వచ్చినందుకు థాంక్యూ ఆస్ట్రేలియా'' అంటూ పెద్ద పెద్ద బ్యానర్లు ప్రదర్శించడం ఆసక్తి రేపింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. లంక అభిమానులు తమ చర్యతో అందరి హృదయాలను దోచుకున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన లంక ఒక దశలో 85 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ దశలో చమీర కరుణరత్నే 75 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 75 పరుగుల వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి ప్రమోద్ మధుసూదన్ 15 పరుగులతో సహకరించాడు. కాగా లంక 43.1 ఓవర్లలో 160 పరుగులు చేయగా.. కరుణరత్నేవి 75 పరుగులు ఉండడం విశేషం. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా కూడా మొదట్లో తడబడింది. డేవిడ్ వార్నర్(10), ఆరోన్ ఫించ్(0), జోష్ ఇంగ్లిష్(5) తొందరగానే వెనుదిరగడంతో 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మిచెల్ మార్ష్ (24 పరుగులు), మార్నస్ లబుషేన్(31 పరుగులు) ఆదుకున్నారు. ఆ తర్వాత అలెక్స్ క్యారీ 45 నాటౌట్, కామెరున్ గ్రీన్ 25 నాటౌట్ జట్టును విజయతీరాలకు చేర్చారు. The sea of blue has turned yellow 💛 A lovely gesture from the Sri Lanka fans for Australia 🤩#SLvAUS pic.twitter.com/zfip5VV7Zf — ICC (@ICC) June 24, 2022 చదవండి: సిక్సర్‌తో పంత్ అర్థశతకం.. ఫామ్‌లోకి వచ్చినట్టేనా! Daryl Mitchell: 73 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కివీస్ బ్యాటర్.. దిగ్గజాల సరసన చోటు -
Pak Vs Aus 3rd Test: ఆస్ట్రేలియా 391 ఆలౌట్
Pak Vs Aus 3rd Test Day 2- లాహోర్: పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 133.3 ఓవర్లలో 391 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 232/5తో ఆట రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 159 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. గ్రీన్ (79; 9 ఫోర్లు), క్యారీ (67; 7 ఫోర్లు) ఆరో వికెట్‌కు 135 పరుగులు జత చేశారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది (4/79), నసీమ్ షా (4/58) రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 90 పరుగులు చేసింది. షఫీఖ్ (45 బ్యాటింగ్), అజహర్ అలీ (30 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చదవండి: క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త నిర్ణయానికి 30 ఏళ్లు.. After a spectacular bowling stint by the Shahs, we close Day 2 trailing by 301 runs.#BoysReadyHain l #PAKvAUS pic.twitter.com/NEVQKidyZM — Pakistan Cricket (@TheRealPCB) March 22, 2022 -
ఆటగాళ్లతో మాట్లాడుకుంటూ వచ్చాడు.. స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయాడు
పాకిస్తాన్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు శిభరంలో ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు కరాచీలోని ఓ హోటల్లో బస చేస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ ఆలెక్స్ కారీ అనుకోకుండా స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయాడు. కారీ తన సహచరులతో మాట్లాడుకుంటూ వస్తూ.. స్విమ్మింగ్ పూల్‌ను గమనించకుండా దాంట్లో జారిపోయాడు. అయితే కారీ స్విమ్మింగ్ పూలో పడిపోయినప్పడు తన చేతిలోని ఫోన్‌ను పైన ఉన్న సహచర ఆటగాళ్లకు విసిరి వేశాడు. దీంతో కారీ చేసిన పనికి చుట్టుపక్కల ఉన్న ఆటగాళ్లందరూ ఒక్కసారిగి నవ్వు కున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ రికార్డు చేశాడు. అంతేకాకుండా తన ఇనస్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను కమ్మిన్స్ పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రావల్పిండి వేదికగా జరిగిన పాకిస్తాన్- ఆస్ట్రేలియా తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఇక ఇరు జట్లు మధ్య రెండో టెస్టు కరాచీ వేదికగా మార్చి 12న ప్రారంభం కానుంది. చదవండి: Trolls On Fawad Alam: పాక్ క్రికెటర్‌కు విచిత్ర పరిస్థితి.. 28 ఏళ్ల రికార్డు బద్దలు View this post on Instagram A post shared by Pat Cummins (@patcummins30) -
తాగింది చాలు.. ఇక దయచేయండి! క్రికెటర్లకు ఘోర అవమానం.. తరిమేసిన పోలీసులు!
Ashes Series: హోబర్ట్ వేదికగా ఐదో టెస్టులో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించి యాషెస్ సిరీస్ విజయాన్ని పరిపూర్ణం చేసుకుంది ఆస్ట్రేలియా. 4-0 తేడాతో యాషెస్ ట్రోఫీని కైవసం చేసుకుని సత్తా చాటింది. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. పార్టీలో ఎంజాయ్ చేస్తూ సంతోషంలో మునిగితేలారు. వీళ్లు ఆనందంతో తాగితే... ఇంగ్లండ్ క్రికెటర్లు బాధతో బాటిళ్లు చేతబట్టారు. ఏదైనా సరే శ్రుతి మించనంత వరకే కదా సాఫీగా సాగేది! ఒక్కసారి అదుపు తప్పితే ఇక అంతే సంగతులు! విమర్శల పాలు కాక తప్పదు. ఇరు జట్ల ఆటగాళ్లు ఇప్పుడు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఏకంగా పోలీసులు రంగ ప్రవేశం చేసి హోటల్ నుంచి వెళ్లగొట్టే దుస్థితి తెచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, ఆసీస్ ఆటగాళ్లు అలెక్స్ క్యారీ, నాథన్ లియాన్ సహా పలువురు ఆటగాళ్లు ఉన్నారు. ‘‘మరీ అల్లరి ఎక్కువైంది. తొందరగా ప్యాక్ చేసుకోవాలి.. అందుకే మేమిక్కడికి వచ్చాము. వెళ్లి నిద్రపోండి. థాంక్యూ’’అంటూ ఓ పోలీసు వాళ్లను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఈ విషయం గురించి టాస్మానియా పోలీసులు మాట్లాడుతూ... ‘‘క్రౌన్ ప్లాజా హోబర్ట్ నుంచి సోమవారం ఉదయం ఫిర్యాదు అందింది. కొంతమంది తాగిన మత్తులో అక్కడ రభస చేస్తున్నారని చెప్పారు. ఉదయం ఆరు గంటల సమయంలో మా వాళ్లు అక్కడికి వెళ్లి తాగిన వాళ్లను అక్కడి నుంచి పంపించేశారు. అంతకుమించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు’’ అని స్పష్టం చేశారు. యాషెస్ సిరీస్ 2021-2022లో ఆస్ట్రేలియా విజయ పరంపర: బ్రిస్బేన్ టెస్టు- 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై ఆసీస్ గెలుపు అడిలైడ్ టెస్టు: 275 పరుగుల తేడాతో ఘన విజయం మెల్బోర్న్ టెస్టు: ఇన్నింగ్స్ మీద 14 పరుగుల తేడాతో భారీ విజయం సిడ్నీ టెస్టు: డ్రా హోబర్ట్ టెస్టు: 146 పరుగుల తేడాతో కంగారూల జయకేతనం చదవండి: Virat Kohli: నువ్వు నా పెద్దన్నవు.. ఎల్లప్పుడూ కెప్టెన్ కింగ్ కోహ్లివే: సిరాజ్ భావోద్వేగం Police moving on early morning Ashes party. Story on https://t.co/fDqIhz1nzH #ashes @9NewsAUS pic.twitter.com/9XC39GoWUv — Tim Arvier (@TimArvier9) January 18, 2022 -
డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీశాడు.. పంత్ సహా ఐదుగురి రికార్డు బద్దలు
Alex Carey Suprass Rishab Pant And 5 Others Set New Test Record Debut.. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ డెబ్యూ టెస్టులోనే అదరగొట్టాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టు ద్వారా క్యారీ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. బ్యాటర్‌గా 12 పరుగులు చేసిన క్యారీ పెద్దగా ఆకట్టుకోకున్నా వికెట్ కీపర్‌గా మాత్రం అదుర్స్ అనిపించాడు. ఆడుతున్న తొలి టెస్టులోనే కీపర్‌గా 8 క్యాచ్‌లు అందుకొని చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి టెస్టులోనే అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న తొలి వికెట్ కీపర్‌గా అలెక్స్ క్యారీ రికార్డు సాధించాడు. చదవండి: Nathon Lyon: వికెట్ కోసం ఏడాది ఎదురుచూపులు.. ఇప్పుడు చరిత్ర ఇంతకముందు రిషబ్ పంత్(టీమిండియా) సహా క్రిస్ రీడ్, బ్రియాన్ టేబర్, చమర దనుసింఘే, పీటర్ నెవిల్, అలన్ నాట్లు తమ డెబ్యూ టెస్టులో వికెట్ కీపర్‌గా ఏడు క్యాచ్‌లు అందుకున్నారు. అయితే దక్షిణాఫ్రికా క్రికెటర్ క్వింటన్ డికాక్ ఒక టెస్టులో వికెట్ కీపర్‌గా తొమ్మిది క్యాచ్‌లు తీసుకున్నప్పటికీ అతనికి డెబ్యూ టెస్టు కాకపోవడం విశేషం. చదవండి: BBL 2021: సూపర్ క్యాచ్ పట్టాననే సంతోషం లేకుండా చేశారు ఇదే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్‌ను ఔట్ చేయడం ద్వారా టెస్టుల్లో 400వ వికెట్ల మార్కును చేరుకున్నాడు. టెస్టుల్లో 400 వికెట్లు తీసిన ఆసీస్ మూడో బౌలర్‌గా.. ఓవరాల్‌గా 17వ బౌలర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా తరపున లియోన్ కంటే ముందు దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్(708 వికెట్లు), గ్లెన్ మెక్‌గ్రాత్(563 వికెట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఘనంగా ప్రారంభించింది.ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టును నాలుగు రోజుల్లో ముగించింది. ఆసీస్ ఇంగ్లండ్‌పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించి ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంగ్లండ్ విధించిన 20 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు ఒక వికెట్ కోల్పోయి 5.1 ఓవర్లలో చేధించింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు డిసెంబర్ 16- 20 వరకు అడిలైడ్ వేదికగా జరగనుంది. చదవండి: వన్డే వరల్డ్‌కప్ 2019.. అంబటిని జట్టులోకి తీసుకోవాల్సింది.. కానీ సెలక్టర్లే Click Video For Here: Alex Carey Suprass Rishab Pant And 5 Others https://t.co/vMdRHsexqM — sakshi analytics (@AnalyticsSakshi) December 11, 2021 Alex Carey becomes the first player in men's Tests to take eight catches on debut! #Ashes https://t.co/H7QXaUzvGY — cricket.com.au (@cricketcomau) December 11, 2021 -
అలెక్స్ క్యారీకి జాక్‌పాట్.. టిమ్ పైన్ స్థానంలో
Alex Carey Test Debut By Ashes Series Repalces Tim Paine.. ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల ఆటగాడు.. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. కీలకమైన యాషెస్ సిరీస్ ద్వారా అలెక్స్ క్యారీ ఎంట్రీ ఇవ్వనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. డిసెంబర్ 8 నుంచి మొదలుకానున్న యాషెస్ సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా మొదటి రెండు టెస్టులు ఆడనున్న జట్టును ఎంపికచేసింది. 15 మంది ప్రాబబుల్స్‌తో కూడిన జట్టుకు పాట్ కమిన్స్ నాయకత్వం వహించనుండగా.. స్టీవ్ స్మిత్ వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. ఇక సెక్స్ స్కాండల్ ఆరోపణలతో కెప్టెన్సీ వదులుకున్న టిమ్ పైన్ యాషెస్ సిరీస్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. పైన్ స్థానంలో ఎంపికైన అలెక్స్ క్యారీ ఆసీస్ తరపున 461వ టెస్టు ఆటగాడిగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. చదవండి: Steve Smith: 'ఇయాన్ చాపెల్ వ్యాఖ్యలను బాత్రూం అద్దానికి అంటించా' ఇదే విషయమై ఆస్ట్రేలియన్ క్రికెట్ సెలక్టర్స్ చైర్మన్ జార్జ్ బెయిలీ మాట్లాడాడు. '' పరిమిత ఓవర్ల క్రికెట్లో అలెక్స్ క్యారీ రెగ్యులర్ సభ్యుడిగా ఉన్నాడు. వికెట్ కీపర్‌గా.. బ్యాటర్‌గా సక్సెస్ అయిన అలెక్స్ క్యారీ టెస్టుల్లోనూ అదే రీతిలో ఆడుతాడనే నమ్మకముంది. అతని దూకుడైన ఆటతీరు జట్టుకు ఇప్పుడు చాలా అవసరం. పైన్ స్థానంలో అతన్ని ఎంపికచేశాం. ఆసీస్ తరపున 461 వ టెస్టు ఆటగాడిగా ఎంట్రీ ఇవ్వనున్న క్యారీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతాడని భావిస్తున్నాం.'' అని చెప్పుకొచ్చాడు. ఇక అలెక్స్ క్యారీ ఆస్ట్రేలియా తరపున 45 వన్డేల్లో 1203 పరుగులు.. 38 టి20ల్లో 233 పరుగులు సాధించాడు. చదవండి: WI vs SL: క్రీజులో పాతుకుపోయాడు.. తెలివైన బంతితో బోల్తా తొలి రెండు టెస్టులకు ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్) అలెక్స్ కారీ, కామెరున్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రేవిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, మైఖేల్ నేజర్, జై రిచర్డ్సన్, స్టీవ్ స్మిత్(వైస్ కెప్టెన్), మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్, మిచెల్ స్వెప్సన్ -
క్యారీ స్టన్నింగ్ క్యాచ్.. వహ్వా అనాల్సిందే
అడిలైడ్ : బిగ్‌బాష్10 లీగ్‌లో గురువారం అడిలైడ్ స్ట్రైకర్స్, పెర్త్ స్కార్చర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించినా.. అడిలైడ్ స్ట్రైకర్స్ కెప్టెన్ అలెక్స్ క్యారీ మ్యాచ్ హీరోగా నిలిచాడు. మొదట బ్యాటింగ్‌లో మెరిసిన కేరీ ఆ తర్వాత కీపింగ్‌లోనూ అదరగొట్టాడు. పెర్త్ స్కార్చర్స్ ఇన్నింగ్స్ సమయంలో 8వ ఓవర్ వెస్ అగర్ వేశాడు. అగర్ వేసిన బంతి బౌన్స్ అయి లియామ్ లివింగ్‌స్టోన్ బ్యాట్‌ను తాకుతూ క్యారీకి దూరంగా వెళ్లింది. సాధారణంగా చూస్తే క్యాచ్ అందుకోవడం కష్టమే.. కానీ క్యారీ మాత్రం ఒకవైపుకు పడిపోతూ.. ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ వీడియోనూ క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విటర్లో షేర్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (చదవండి : జహీర్ బౌలింగ్‌లో ఆసీస్ ఆటగాడు క్లీన్‌బౌల్డ్) కాగా అంతకముందు అడిలైడ్ స్ట్రైకర్స్ బ్యాటింగ్ సమయంలో క్యారీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 59 బంతుల్లోనే 12 ఫోర్లు, 1 సిక్సర్‌తో 82 పరుగులు చేశాడు. కేరీ ఇన్నింగ్స్‌తో అడిలైడ్ స్ట్రైకర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పెర్త్ స్కార్చర్స్ 17.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసి విజయం సాధించింది. పెర్త్ ఇన్నింగ్స్‌లో జాసన్ రాయ్ 49 పరుగులు, జోష్ ఇన్‌గ్లిస్ 44* రాణించగా.. చివర్లో మిచెల్ మార్ష్ 38 పరుగులు చేసి జట్టు గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. Alex Carey is having some night! What a catch...#BBL10 | @BKTtires pic.twitter.com/ADfNd6f8To — cricket.com.au (@cricketcomau) December 31, 2020 -
టీమిండియాకే కాదు.. మాకూ ఉన్నారు: క్యారీ
మెల్బోర్న్: త్వరలో టీమిండియాతో జరగబోయే ద్వైపాక్షిక సిరీస్ రసవత్తరంగా సాగడం ఖాయమని ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ పేర్కొన్నాడు. ఇరుజట్లలో కీలక ఆటగాళ్లు ఉండటంతో పోరు ఆసక్తికరమేనని అభిప్రాయపడ్డాడు. మీడియా ఇంటరాక్షన్‌లో భాగంగా పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిచ్చాడు క్యారీ. ఈ క్రమంలోనే టీమిండియా జట్టులో బుమ్రా, షమీ వంటి టాప్ బౌలర్లను ఎలా ఎదుర్కొంటారు అనే ప్రశ్నకు క్యారీ బదులిస్తూ తమ జట్టులో కూడా స్టార్క్, కమిన్స్, హజిల్‌వుడ్ వంటి పేసర్లు ఉన్నారనే విషయాన్ని ప్రత్యర్థి గమనించాలన్నాడు. (భారత్ కంటే ఆస్ట్రేలియా మెరుగు) ‘బుమ్రా, షమీలు కీలక బౌలర్లు అనే విషయాన్ని మేము అర్థం చేసుకోగలం. అదే సమయంలో మా జట్టులో కూడా అదే తరహా క్వాలిటీ ఆటగాళ్లు ఉన్న విషయాన్ని గుర్తించాలి. బ్యాటింగ్‌లో డేవిడ్ వార్నర్, అరోన్ ఫించ్‌లు తమ జోరును చూపడానికి సిద్ధంగా ఉన్నారు. బుమ్రా, షమీ, జడేజా, చహల్ వంటి బౌలర్ల గురించి మేము కచ్చితంగా చర్చిస్తాం. వారిని ఎదుర్కోవడంపై తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. కమిన్స్, స్టార్క్‌ల దూకుడు చూడాలని ఆశగా ఎదురుచూస్తున్నా. హజిల్‌వుడ్ తనదైన రోజున ప్రత్యర్థికి చుక్కలు చూపెడతాడు.స్పిన్ విభాగంలో ఆడమ్ జంపా ఉన్నాడు. దాంతో సిరీస్‌కు మంచి మజా వస్తుంది’ అని క్యారీ తెలిపాడు. ఈనెల 27వ తేదీన ఇరుజట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది. -
ఐపీఎల్ జరిగేలా లేదు
మెల్బోర్న్ : ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని, అయితే ఈ ఏడాది ఐపీఎల్ జరిగేది అనుమానమే అని ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ అభిప్రాయపడ్డాడు. తొలిసారి ఐపీఎల్లో ఆడబోతోన్న క్యారీ... ఈ ఏడాది ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించే అవకాశం రాకపోవచ్చని అన్నాడు. ‘ఇది నాకు తొలి ఐపీఎల్ సీజన్. ఢిల్లీ జట్టుకు ఆడేందుకు ఎదురుచూస్తున్నా. కానీ ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి చూస్తే ఈ ఏడాది లీగ్ జరిగే అవకాశం కనిపించడంలేదు. కొన్నాళ్ల తర్వాత ఈ పరిణామాలన్నీ చక్కబడాలని కోరుకుంటున్నాను. అంతవరకు మనమంతా ఓపికగా ఎదురుచూడాల్సిందే’ అని ఆసీస్ జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్ వైస్ కెప్టెన్ క్యారీ అన్నాడు. ‘గత రెండేళ్లుగా మైదానంలోనే గడుపుతున్నా. ఇప్పుడు కుటుంబంతో ఉండే అవకాశం దక్కింది ఈ సమయాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు ఉపయోగించుకుంటున్నా’ అని క్యారీ వివరించాడు.