యాషెస్ సిరీస్‌లో మ్యాచ్‌లు ఎంత రసవత్తరంగా సాగుతున్నాయో.. మ్యాచ్ బయట జరిగే విషయాలు కూడా అంతే ఆసక్తిగా ఉంటున్నాయి. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జానీ బెయిర్ స్టో వివాదాస్పద ఔట్ తర్వాత ఇంగ్లీష్ మీడియా, అభిమానులు వీలు చిక్కినప్పుడల్లా ఆసీస్ ఆటగాళ్లను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆసీస్ కీపర్ అలెక్స్ కేరీని విలన్‌గా ముద్రించారు. అతను కనిపించిన ప్రతీసారి ఏదో ఒకరీతిలో అతన్ని టార్గెట్ చేస్తూనే వస్తున్నారు.
లీడ్స్ వేదికగా మొదలైన మూడో టెస్టులో బ్యాటింగ్, కీపింగ్‌కు వచ్చిన సందర్భంలో మైదానంలోని ఇంగ్లండ్ అభిమానుల నుంచి అతనికి చీత్కారాలే ఎక్కువగా వచ్చాయి. దీనికి తోడు ఇంగ్లీష్ పత్రిక ది సన్ అలెక్స్ కేరీ కటింగ్‌షాపు ఓవర్‌కు డబ్బులు ఎగ్గొట్టాడంటూ ఒక కథనాన్నే ప్రచురించింది. ''లీడ్స్‌లోని ఒక కటింగ్‌షాపుకు వెళ్లిన కేరీ హెయిర్ కట్ అనంతరం ఓనర్‌కు డబ్బులు ఎగ్గొట్టాడు. దాంతో సదరు వ్యక్తి కేరీకి డెడ్‌లైన్ విధించాడంటూ'' రాసుకొచ్చింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దీనిపై ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ తన థ్రెడ్స్ ఖాతాలో వివరణ ఇస్తూ సదరు పత్రికపై విమర్శలు గుప్పించాడు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదంటూ హితభోద చేశాడు. ''అలెక్స్ కేరీ లండన్ వచ్చినప్పటి నుంచి హెయిర్ కటింగ్ చేయించుకోలేదు. దానిని నేను కచ్చితంగా చెప్పగలను. ముందు నిజాలను తెలుసుకుంటే బాగుంటుంది'' అని స్మిత్ పోస్టు చేశాడు.
ఇక యాషెస్ సిరీస్ మూడో టెస్టు రసవత్తర ముగింపునకు సిద్ధమైంది. 251 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లండ్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. డకెట్ (18 నాటౌట్), క్రాలీ (9 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. ఆ జట్టు మరో 224 పరుగులు చేయాల్సి ఉంది.
చదవండి: #PrithviShaw: ''పుజారా సార్' నాలా బ్యాటింగ్ చేయలేడు.. నేను అంతే!'
విలన్‌గా మారిన ఆసీస్ కీపర్.. కటింగ్‌షాపులో డబ్బులు ఎగ్గొట్టి
Comments
Please login to add a commentAdd a comment