the sun
-
Book Fair: వెలుగులు విరజిమ్మనీ
-
చండ ప్రచండ మార్తాండ!
భగభగలాడే భానుడిపై ఓ నల్ల మచ్చ తొలిసారి ఈ నెల 18న కనిపించింది. భయం పుట్టించేలా అది నేరుగా భూమికేసి కసిగా చూస్తోంది. వారం రోజుల క్రితం తన నోట్లోంచి భూమి వైపు మూడు సౌరజ్వాలల్ని కక్కింది. దాంతో హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగింది. అదృష్టవశాత్తు కరోనల్ మాస్ ఎజెక్షన్స్ లేకపోవటంతో పెద్దగా నష్టం సంభవించలేదు. తర్వాత ఫిబ్రవరి 24–26 తేదీల మధ్యకాలంలో కేవలం రెండు రోజుల్లోనే ఆ మచ్చ అమాంతంగా 25 శాతం పెరిగింది. తొమ్మిది భూగోళాలకంటే పెద్ద మచ్చ అది. 2019లో మొదలైన ప్రస్తుత 25వ సౌరచక్రంలో సూర్యుడిపై ఏర్పడిన అతిపెద్ద మచ్చ ఇదే. దీనికి ఏఆర్3590 అని పేరుపెట్టారు. ఏఆర్ అంటే యాక్టివ్ రీజియన్. క్రియాశీల ప్రాంతం అని అర్ధం. సూర్యుడిపై నల్ల మచ్చలు మామూలే. అయితే భూమికి పొంచి వున్న ముప్పు దృష్ట్యా ఈ సౌరమచ్చపై ఖగోళ శాస్త్రవేత్తలు ఓ కన్నేశారు. సౌరజ్వాలలకు పుట్టినిల్లయిన ఈ మచ్చలు అంతరిక్ష వాతావరణం, సౌరవ్యవస్థలోని గ్రహాలపై ప్రభావం చూపుతాయి. సూర్యుడి ఉపరితలంపై భారీ వైశాల్యంలో ఏర్పడే ఈ మచ్చల అయస్కాంత క్షేత్రం భూ అయస్కాంత క్షేత్రం కంటే 2,500 రెట్లు శక్తిమంతమైంది. సూర్యుడు అంతర్గతంగా క్రియాశీలంగా ఉన్నచోట ఈ సౌరమచ్చలు ఏర్పడతాయి. అక్కడి పరిసరాలతో పోలిస్తే ఈ మచ్చ ఉష్ణోగ్రత తక్కువ. మచ్చలో 3,600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక మచ్చల సంఖ్య 11 ఏళ్ల సౌరచక్రాన్ని అనుసరించి మారుతుంది. సౌరచక్రంలో ఇప్పుడు మనం ముప్పు ముంగిట ఉన్నాం. గణించడం ఆరంభమయ్యాక ప్రస్తుతం 25వ సౌరచక్ర ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సౌరచక్రం భూమికి అనర్థాలు, చిక్కులు తెచి్చపెడుతుందేమోనని ఖగోళ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల సూర్యుడిపై మచ్చలు తరచూ ఏర్పడటం, వాటి సైజు పెరగడం, తీవ్ర సౌర తుపాన్లు చూస్తుంటే సూర్యుడు తన 11 ఏళ్ల సౌరచక్రంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నాడని, మహోగ్ర విస్ఫోట దశను సమీపిస్తున్నాడని తెలుస్తోంది. తాము గతంలో ఊహించిన దాని కంటే చాలా ముందుగానే అంటే 2024 జూలైలోపే ‘చండ మార్తాండ’(సోలార్ మాగ్జిమమ్/సౌర గరిష్టం) దశ దాపురిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. భూమిపై ఇది ఏ ఉత్పాతాలకు దారితీస్తుందో, ఏ ఉపద్రవాలు తెచి్చపెడుతుందోనని కలవరపడుతున్నారు. ఈ ఉగ్రరూపం అనంతరం సూర్యుడు మళ్లీ నెమ్మదిస్తాడు. సోలార్ మాగ్జిమమ్ దశ ముగిసిందనేది అది పూర్తయిన ఆరు నెలలకుగాని ఖగోళవేత్తలు గుర్తించలేరు. ఏఆర్3590తో ప్రమాదమే! సూర్యుడు లోలోపల ప్రజ్వలిస్తాడు. తన ఉపరితలంపై కొన్ని చోట్ల అకస్మాత్తుగా విస్ఫోటిస్తాడు. అప్పుడు ఆయా ప్రాంతాల నుంచి ఒక్కసారిగా హెచ్చు మొత్తంలో విద్యుదయస్కాంత వికిరణం విడుదలవుతుంది. వీటినే సౌరజ్వాలలు (సోలార్ ఫ్లేర్స్) అంటాం. ఇవి సూర్యుడి ఉపరితలంపై అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తాయి. తీవ్రత ఆధారంగా ‘సోలార్ ఫ్లేర్స్’ను X, M, C, B, A అంటూ అవరోహణ క్రమంలో 5 రకాలుగా వర్గీకరించారు. వీటిలో X రకం ఫ్లేర్స్ మహా శక్తిమంతం, భూమికి హానికరం. సౌరమచ్చ ఏఆర్3590 ఈ నెల 21న రెండు గీ రకం సౌరజ్వాలలను వెదజల్లింది. 22న X 6.3 తీవ్రతతో సౌరజ్వాలను వదిలింది. ఈ మచ్చలోని అస్థిర బీటా–గామా–డెల్టా అయస్కాంత క్షేత్రంలో మరిన్ని X రకం సౌరజ్వాలలకు కావాల్సిన శక్తి ఉండవచ్చని, మరో X రకం మహా సౌరజ్వాల కోసం అది శక్తిని సమీకరిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ రూపంలో ముప్పు తొలగిపోలేదని హెచ్చరిస్తున్నారు. సౌరచక్రంలో అయస్కాంత ధ్రువాల మారి్పడి సూర్యుడిలో 11 ఏళ్లకోసారి సౌరచక్రం తిరుగుతుంది. ఈ కాలచక్ర మధ్యంలో సౌరక్రియ గరిష్ట స్థితిని సంతరించుకునే ‘సోలార్ మాగ్జిమమ్’ దశ సందర్భంగా సూర్యుడి అయస్కాంత క్షేత్రం దాని అయస్కాంత ధ్రువాలను తారుమారు చేస్తుంది. అలా ఉత్తర అయస్కాంత ధ్రువం కాస్తా దక్షిణ అయస్కాంత ధ్రువంగా మారిపోతుంది. ఈ మారి్పడి జరిగేవరకు సూర్యుడు అంతకంతకూ ఉత్తేజితమవుతాడు. అనుక్షణం క్రియాశీలమవుతాడు. సౌరమచ్చలు, జ్వాలలు, సీఎంఈలు పుట్టుకొస్తాయి. ఈ ప్రక్రియ తర్వాత సూర్యుడు నెమ్మదిస్తాడు. మెల్ల గా సౌర కనిష్ట/సోలార్ మినిమమ్ దశకు చేరతాడు. ఇదొక చక్రం. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ‘కరోనా’ అనేది సౌర ధూళికణాలతో (ప్లాస్మా) నిండిన సూర్యుడి అతి బాహ్య పొర. X, M రకాల సౌర ప్రజ్వలనాలు కరోనల్ మాస్ ఎజెక్షన్స్ (సీఎంఈ)కు కారణమవుతాయి. కరోనా నుంచి ప్లాస్మా, విద్యుదయస్కాంత వికిరణం భారీగా విడుదలై భూ అయస్కాంత క్షేత్రంలోకి చొరబడి దుష్ప్రభావం చూపుతాయి. ‘నార్తర్న్ లైట్స్’గా పిలిచే ‘అరోరాలు’ సాధారణంగా ధ్రువాల వద్దనే కనిపిస్తాయి. కానీ సీఎంఈల వల్ల తలెత్తే భూ అయస్కాంత తుపాన్లు భూమధ్యరేఖ వద్ద ‘అరోరా’లను సృష్టిస్తాయి. 1989 మార్చిలో భూమిని తాకిన ఓ కరోనల్ మాస్ ఎజెక్షన్ వల్ల కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్ అంతటా 9 గంటలపాటు విద్యుత్ వ్యవస్థ కుప్పకూలి 60 లక్షల మంది ఇబ్బందిపడ్డారు. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వేళల్లో ఆవేశిత శక్తి కణాలు అతి వేగంగా ప్రయాణిస్తాయి. వీటి వల్ల పవర్ గ్రిడ్స్ కుప్పకూలతాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు తగలబడతాయి. జీపీఎస్ నేవిగేషన్ వ్యవస్థలు అస్తవ్యస్తమై నౌకలు, విమానాల రాకపోకలు, ఇతర ప్రజా రవాణా వ్యవస్థలు స్తంభిస్తాయి. టెలిఫోన్, కంప్యూటర్, కమ్యూనికేషన్, ఇంధన పంపిణీ–పైపులైన్ వ్యవస్థలు పాడవుతాయి. ఆ సమయాల్లో సౌరతుపాను గండం గడిచేదాకా కృత్రిమ శాటిలైట్లను స్విచాఫ్ చేస్తారు. లేకపోతే అవి మాడిపోయి భూమిపై పడతాయి. లక్షల కోట్ల ఆస్తినష్టం జరుగుతుంది. వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) బయటకు రారు. X, M రకాల సౌర ప్రజ్వలనాల కారణంగా భూ వాతావరణంలో రేడియో తరంగాలు ప్రయాణించే ‘దిగువ అయనోస్ఫియర్’లో ఎల్రక్టాన్ల సాంద్రత తీవ్రమవుతుంది. దాంతో రేడియో తరంగాల శక్తి క్షీణించి అవి పై పొరల్లోకి ప్రయాణించలేవు. సూర్యకాంతి 8 నిమిషాల్లో భూమిని చేరుతుంది. సోలార్ ఫ్లేర్స్ నుంచి వచ్చే సౌరధారి్మకత అదే వేగంతో భూమిని తాకుతుంది. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఫలితంగా వందల కోట్ల టన్నుల కరోనల్ ప్లాస్మా వెదజల్లబడుతుంది. సీఎంఈ వేగం సెకనుకు 250 కిలోమీటర్ల నుంచి 3 వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది. వేగవంతమైన కరోనల్ మాస్ ఎజెక్షన్ 15–18 గంటల్లో భూమిని చేరుతుంది. అతి పెద్ద సౌర తుపాను! 1860లో సోలార్ మాగ్జిమమ్ దశకు కొన్ని నెలల ముందు 1859 సెపె్టంబరులో ఓ సౌర తుపాను సంభవించింది. చరిత్రలో రికార్డయిన అతి పెద్ద సౌర తుపాను ఇదే. 1859 ఆగస్టులో సూర్యబింబంలో నల్లమచ్చల సంఖ్య పెరగడం ఖగోళ శాస్త్రవేత్తలు ఆసక్తిగా తిలకించారు. లండన్‌లోని ఔత్సాహిక వీక్షకుడు రిచర్డ్ కారింగ్టన్ వీరిలో ఒకరు. 1859 సెపె్టంబర్ ఒకటిన సౌరమచ్చల్ని ఆయన చిత్రీకరిస్తుండగా అకస్మాత్తుగా తెల్లటి కాంతి తళుక్కున మెరిసింది. అది 5 నిమిషాలు అలాగే ఉంది. నిజానికి అది కరోనల్ మాస్ ఎజెక్షన్. ఈ ఘటనకు ఆయన గౌరవార్థం ‘కారింగ్టన్ ఈవెంట్’ అని పేరు పెట్టారు. ఆ కరోనల్ మాస్ ఎజెక్షన్ 17.6 గంటల్లో భూమిని చేరుకుంది. కారింగ్టన్ ఈవెంట్ తర్వాత మర్నాడు జియోమాగ్నెటిక్ తుపాను ధాటికి టెలిగ్రాఫ్ వ్యవస్థలు మొరాయించాయి. కొన్ని చోట్ల టెలిగ్రాఫ్ లైన్లపై టెక్నీíÙయన్లు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. కొన్నిచోట్ల టెలిగ్రాఫ్ సాధన సంపత్తి దగ్ధమైంది. నాటి ‘కారింగ్టన్ ఈవెంట్’కు కారణమైన నలమచ్చతో పోలిస్తే నేటి సౌరమచ్చ పరిమాణం 60 శాతంగా ఉంది. సూర్యగ్రహణాన్ని వీక్షించడానికి వాడే సురక్షిత కళ్ళద్దాలు ఉంటే ఈ మచ్చను నేరుగా చూడొచ్చు. – జమ్ముల శ్రీకాంత్ -
సూర్యుడిపై పరిశోధనల్లోనూ ఈసీఐఎల్ కీలకపాత్ర
కుషాయిగూడ: చంద్రయాన్–3 ప్రయోగానికి డీప్‌స్పేస్ నెట్వర్క్ (డీఎస్ఎన్) యాంటెన్నాను అందజేసిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎల్రక్టానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సూర్యుడిపై పరిశోధనల కోసం చేపట్టిన ఆదిత్య–ఎల్1 శాటిలైట్ ప్రయోగానికి అవసరమైన యాంటెన్నాను సైతం ఇస్రోకు అందజేసి మరోమారు సత్తా చాటుకుంది. శనివారం ప్రయోగించిన ఆదిత్య–ఎల్1కు అవసరమైన కమ్యూనికేషన్ వ్యవస్థను ఈ యాంటెన్నా అందిస్తుందని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ యాంటెన్నా 18 మీటర్ల విస్తీర్ణంలో ఉంటుందన్నాయి. 15 లక్షల కి.మీ. దూరంలో కక్ష్యలో ఉన్న శాటిలైట్‌కు భూమి నుంచి నిర్థిష్టమైన సమాచారాన్ని చేరవేయడంలో యాంటెన్నా కీలకంగా వ్యవహరిస్తుందని వివరించాయి. బెంగళూరుకు 40 కి.మీ. దూరంలోని బైలాలు గ్రామంలో దీన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపాయి. ఎంటీఏఆర్ సహకారం... ఆదిత్య–ఎల్1 ప్రయోగం విజయంలో హైదరాబాద్‌కు చెందిన ఎంటీఏఆర్ టెక్నాలజీస్ లిమిటెడ్ సైతం కీలక సహకారం అందించిందని సంస్థ ఎండీ పర్వత శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పీఎస్ఎల్వీ–సీ57 మిషన్‌లో భాగంగా లాంచింగ్ వాహనం కోసం లిక్విడ్ ప్రొపల్షన్ ఇంజిన్లు, ఎలక్ట్రో–న్యూమాటిక్ మాడ్యూల్స్, ప్రొపల్షన్ సిస్టమ్, శాటిలైట్ వాల్వ్‌లు, సేఫ్టీ కప్లర్లు, లాంచ్ వెహికల్ యాక్చుయేషన్ సిస్టమ్‌ల కోసం బాల్ స్క్రూలు, కనెక్టర్ అసెంబ్లీలు, యాక్చుయేషన్ సిస్టమ్స్ హార్డ్‌వేర్, నోస్ కోన్ వంటి వాటిని సరఫరా చేశామన్నారు. -
'వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది'
యాషెస్ సిరీస్‌లో మ్యాచ్‌లు ఎంత రసవత్తరంగా సాగుతున్నాయో.. మ్యాచ్ బయట జరిగే విషయాలు కూడా అంతే ఆసక్తిగా ఉంటున్నాయి. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జానీ బెయిర్ స్టో వివాదాస్పద ఔట్ తర్వాత ఇంగ్లీష్ మీడియా, అభిమానులు వీలు చిక్కినప్పుడల్లా ఆసీస్ ఆటగాళ్లను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆసీస్ కీపర్ అలెక్స్ కేరీని విలన్‌గా ముద్రించారు. అతను కనిపించిన ప్రతీసారి ఏదో ఒకరీతిలో అతన్ని టార్గెట్ చేస్తూనే వస్తున్నారు. లీడ్స్ వేదికగా మొదలైన మూడో టెస్టులో బ్యాటింగ్, కీపింగ్‌కు వచ్చిన సందర్భంలో మైదానంలోని ఇంగ్లండ్ అభిమానుల నుంచి అతనికి చీత్కారాలే ఎక్కువగా వచ్చాయి. దీనికి తోడు ఇంగ్లీష్ పత్రిక ది సన్ అలెక్స్ కేరీ కటింగ్షాపు ఓవర్‌కు డబ్బులు ఎగ్గొట్టాడంటూ ఒక కథనాన్నే ప్రచురించింది. ''లీడ్స్‌లోని ఒక కటింగ్షాపుకు వెళ్లిన కేరీ హెయిర్ కట్ అనంతరం ఓనర్‌కు డబ్బులు ఎగ్గొట్టాడు. దాంతో సదరు వ్యక్తి కేరీకి డెడ్‌లైన్ విధించాడంటూ'' రాసుకొచ్చింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ తన థ్రెడ్స్ ఖాతాలో వివరణ ఇస్తూ సదరు పత్రికపై విమర్శలు గుప్పించాడు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదంటూ హితభోద చేశాడు. ''అలెక్స్ కేరీ లండన్ వచ్చినప్పటి నుంచి హెయిర్ కటింగ్ చేయించుకోలేదు. దానిని నేను కచ్చితంగా చెప్పగలను. ముందు నిజాలను తెలుసుకుంటే బాగుంటుంది'' అని స్మిత్ పోస్టు చేశాడు. ఇక యాషెస్ సిరీస్ మూడో టెస్టు రసవత్తర ముగింపునకు సిద్ధమైంది. 251 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లండ్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. డకెట్ (18 నాటౌట్), క్రాలీ (9 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. ఆ జట్టు మరో 224 పరుగులు చేయాల్సి ఉంది. చదవండి: #PrithviShaw: ''పుజారా సార్' నాలా బ్యాటింగ్ చేయలేడు.. నేను అంతే!' విలన్‌గా మారిన ఆసీస్ కీపర్.. కటింగ్షాపులో డబ్బులు ఎగ్గొట్టి -
పీఏతో మంత్రి రాసలీలలు.. ఫొటోలు లీక్
కరోనా టైం.. అందులో కఠిన ఆంక్షలు అమలులో ఉన్నవేళ. సోయి మరిచి తన అనుచరురాలితో ఆఫీసులోనే రాసలీలలు సాగించాడు ఓ మంత్రి. ఆ మంత్రి రొమాంటిక్ యాంగిల్ఫొటోలు మీడియా ద్వారా జనాల్లోకి లీక్ అయ్యాయి. ఇంకేం ప్రజాగ్రహం పెల్లుబిక్కింది. రాజకీయ విమర్శలు చుట్టు ముట్టాయి. చివరికి యూకే ఆరోగ్యశాఖా మంత్రి మ్యాట్ హాంకాక్ రాజీనామా చేయాల్సి వచ్చింది. లండన్: ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శి మ్యాట్ హాంకాక్ యవ్వారం.. వారం నుంచి యూకే రాజకీయాలను కుదేలు చేస్తోంది. వివాహితుడైన హాంకాక్.. ఓ మహిళను ఏరికోరి తన అసిస్టెంట్‌గా నియమించుకున్నాడు. ఆమెతో తన కార్యాలయంలోనే రాసలీలు కొనసాగించాడు. ఆమెను ముద్దులు పెట్టుకున్నట్లుగా ఓ ఫొటోతో ‘పీఏతో హాంకాక్ రాసలీలలు’ పేరుతో ది సన్ టాబ్లాయిడ్ ప్రముఖంగా ప్రచురించింది. పైగా కరోనా నిబంధనలు అమలులో ఉన్న టైంలో ఆ పని చేశాడంటూ కథనం ప్రచురించింది. ఇంకేం విమర్శలు మొదలయ్యాయి. ఈ బంధం ఏనాటిదో.. కాగా, ఆ ఫొటోలు మే 6 నుంచి 11 మధ్య కాలంలో, అది కూడా మ్యాట్ కార్యాలయంలోనే తీసినవని సమాచారం. అయితే ఆ ఫొటోల్ని ఎలా సంపాదించింది మాత్రం సన్ వెల్లడించలేదు. అప్పటికీ ఇంకా లాక్డౌన్ కఠిన నిబంధనల్ని, ఆంక్షల్ని ఎత్తివేయలేదని మాత్రం పేర్కొంది. ఇంట్లో వ్యక్తులతో తప్ప బయటివారిని కౌగిలించుకోవడం, వారితో శారీరక సంబంధం పెట్టుకోవడానికి అనుమతించని రోజుల్లో ఈ ఘటన జరిగిందని తెలిపింది. అంతేకాకుండా ఆ ఫొటోలో ఉన్న మహిళను హాంకాక్.. 2000 సంవత్సరంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కలిశాడని, పోయిన నెలలోనే ఆమెను ఇన్‌కంటాక్స్ విభాగంలో తన సహాయకురాలిగా నియమించుకున్నాడని తేలింది. ఎట్టకేలకు రాజీనామా కరోనా టైంలో మాస్క్‌లు లేకుండా తిరగొద్దని హాంకాక్ విస్తృతంగా ప్రచారం చేశాడు. పైగా భావోద్వేగంగా ఉపన్యాసాలు దంచాడు. అలాంటి వ్యక్తే.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై విమర్శలు వెలువెత్తాయి. ఈ మేరకు శనివారం ప్రధాని బోరిస్ జాన్సన్‌కు, మాట్ హాంకాక్‌కు ఓ క్షమాపణ లేఖ రాశాడు. నేనే మార్గదర్శకాల్ని ఉల్లంఘించా.. అందుకే రాజీనామా చేస్తున్నా అని తెలిపాడు. ఇక విమర్శల నేపథ్యంలో హాన్కాక్ రాజీనామాను ఆమోదించిన బోరిస్.. అప్పటిదాకా ఆయన అందించిన సేవలను కొనియాడాడు. చదవండి: పార్లమెంట్లో పొంగుతున్న బీర్లు -
మానిన గాయాన్ని మళ్లీ రేపారు..స్టోక్స్ ఆవేదన
లండన్: ‘ది సన్’ వార్తాపత్రికపై ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎప్పుడో 31 ఏళ్ల క్రితం తమ కుటుంబంలో జరిగిన ఓ విషాద ఘటనను తిరిగి గుర్తుచేస్తూ వార్తా కథనాన్ని ప్రచురించడం పట్ల అతడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. తాజాగా ముగిసిన యాషెస్ సిరీస్‌లో స్టోక్స్ తన ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో ‘ది సన్’ పత్రిక ‘స్టోక్స్ సీక్రెట్ ట్రాజెడీ’ అనే కథనాన్ని ప్రచురించింది. స్టోక్స్ పుట్టడానికి మూడేళ్ల ముందు అతడి కుటుంబంలో విషాదకర ఘటన జరిగింది. (స్టోక్స్ సోదరి, సోదరుడు అతి కిరాతకంగా హత్యకు గురవుతారు. స్టోక్స్ తల్లి మాజీ స్నేహితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు). ఇదే వార్తను మూడు దశాబ్దాల తర్వాత తిరిగి హైలెట్ చేస్తూ ఆ పత్రిక కథనాన్ని ప్రచురించింది. దీంతో ‘ది సన్’వార్తా పత్రికపై స్టోక్స్ అసహనం వ్యక్తం చేశాడు. ‘ఈ రోజు సన్ పత్రికలో వచ్చిన వార్తను చూసి నేను చాలా బాధపడ్డా. నా వ్యక్తిగత, బాధకరమైన విషయాన్ని బహిర్గతం చేశారు. ఎప్పుడో 31 ఏళ్ల క్రితం జరిగిన ఘటనను మళ్లీ తెరపైకి తీసుకొచ్చి మమ్మల్ని ఆవేదనకు గురిచేశారు. జర్నలిజం విలువలను ఏ మాత్రం పట్టించుకోకుండా ‘ది సన్’ వ్యవహరించింది. మూడు రోజుల క్రితం రిపోర్టర్లు మా ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులతో ఈ విషయం గురించి గుచ్చిగుచ్చి అడిగి బాధ కలిగించారు. మా కుటుంబానికి చెందిన విషాదకర విషయాన్ని అప్పటి నుంచి మా గుండెల్లోనే దాచుకుని కుమిలికుమిలి బాధపడుతున్నాం. ఇప్పుడు బయటి ప్రపంచానికి ఈ విషయాన్ని తెలిపి ‘ది సన్’ ఏదో సాధించింది అని ఆనందం పడుతోంది. మీ కుటంబానికి చెందిన సున్నితమైన, వ్యక్తిగత విషయాన్ని ఫ్రంట్ పేజీలో పబ్లిష్ చేయగలరా?’ అంటూ స్టోక్స్ మండిపడ్డాడు. -
ఎండ బాధలకు చర్మగీతం
వేసవి తీవ్రత పెరుగుతూ పోతోంది. మనం ఎండలోకి వెళ్లగానే చర్మం మండుతున్నట్లు అనిపిస్తుంది. దాని తీవ్రతను మొదట తెలియజెప్పే జ్ఞానేంద్రియమూ చర్మమే. కాబట్టి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్తే మొదట ప్రభావితమయ్యేది చర్మమే. చర్మానికి ఈ సీజన్లో వచ్చే సాధారణ సమస్యలు, వాటినుంచి కాపాడుకోవడం ఎలా అన్న అంశాలపై అవగాహన కలిగించడం కోసమే ఈ ప్రత్యేక కథనం. అసలు ఎండ అంటే ఏమిటో చూద్దాం... తీక్షణమైన కాంతితో మనకు హాని ఎందుకు కలుగుతుందో తెలుసుకునే ముందు అసలు కాంతి అంటే ఏమిటో చూద్దాం. మన భూమికి చేరే రేడియేషన్‌లో మనం చూడగలిగేదీ చూడటానికి ఉపయోగపడేది చాలా చాలా తక్కువ. సూర్యుడి నుంచి వచ్చే కాంతి అంతా రేడియేషన్ అంతా తరంగాల రూపంలో మనకు చేరుతుంది. ఇందులో రేడియో తరంగాలూ, ఎక్స్–కిరణాలూ, మైక్రోవేవ్ తరంగాలూ ఇలా ఎన్నెన్నో ఉంటాయి. దీన్నింతా ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ అంటారు. అయితే ఇందులో వేర్వేరు కిరణాలకు వేర్వేరు వేవ్‌లెంగ్త్ ఉంటుంది. అంటే కాంతి కిరణంలోని పక్కపక్కనే ఉండే అలలోని... ఒక పీక్‌కూ, మరో పీక్‌కూ మధ్యనున్న దూరాన్ని వేవ్లెంగ్త్గా చెప్పుకుంటే మన కళ్లకు కనిపించే కాంతి చాలా పరిమితమైన వేవ్లెంగ్త్తోనే ఉంటుంది. మరీ నిర్దిష్టంగా చెప్పాలంటే 400 – 700 నానో మీటర్ల రేంజ్లో ఉండే దాన్ని మాత్రమే మనం కాంతిగా పేర్కొంటాం. అంతకంటే తక్కువ వేవ్‌లెంగ్త్‌తో ఉండే కిరణాలను అల్ట్రా వయొలెట్ కిరణాలుగానూ, అంతకంటే ఎక్కువ వేవ్‌లెంగ్త్‌తో ఉండేవాటిని ఇన్ఫ్రా రెడ్ కిరణాలుగానూ చెబుతుంటారు. ఈ అన్ని వేవ్‌లెంగ్త్‌లతో కూడిన రేడియేషన్ కాంతి తీక్షణంగా, ప్రకాశవంతంగా కాయడమే ఎండ. మధ్యాన్నం 2 నుంచి 3 గంటల సమయంలో వెలువడే కిరణాలు చాలా హానికరం. సూర్యుడి నుంచి మన కంటి వరకు చేరే రేడియేషన్‌లోని చాలా హానికారక కిరణాలను ఓజోన్‌పొర వడపోస్తుంది. కేవలం 3 శాతం అల్ట్రా వయొలెట్ కిరణాలు మాత్రమే భూమి ఉపరితలం వరకు చేరతాయి. మానవులపై అల్ట్రావయొలెట్ కిరణాల ప్రభావం ఇలా... మామూలు కాంతిని మినహాయిస్తే... మనల్ని చేరే అల్ట్రా వయొలెట్ కిరణాల వల్ల చర్మంపై దుష్ప్రభావాలు ఉంటాయి. ఇక యూవీ–సి వల్ల కలిగే అనర్థాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. అత్యంత ప్రమాదకరమైన యూవీ–సీ అల్ట్రా వయొలెట్ కిరణాలు చాలా చాలా ప్రమాదకరమైనవి. అవి కొన్నిసార్లు ప్రాణాలకు సైతం ముప్పు కలిగించవచ్చు. చర్మంపై ప్రసరించినప్పుడు స్కిన్–క్యాన్సర్‌గానూ పరిణమించవచ్చు. అదృష్టవశాత్తు యూవీ–సీ రకానికి చెందిన కిరణాలను ఓజోన్ పొర అడ్డుకొని సకల జీవరాశినీ కాపాడుతుంటుంది. మనం ముందుగా చెప్పుకున్నట్లు 400 – 700 న్యానోమీటర్ల మేరకు ఉన్నదే కాంతి. అంతకు మించిన వేవ్లెంత్తోగానీ, అంతకు తగ్గిన వేవ్‌లెంత్‌తో గాని అంటే అల్ట్రావయొలెట్, ఇన్ఫ్రారెడ్ కిరణాలతో మన చర్మానికి ఎంతో ప్రమాదం అని తెలుసుకోవాలి. మన చర్మం తీవ్రమైన ఎండలోని తీక్షణ కాంతి కిరణాలను కొంతవరకు తట్టుకోలేదు. మనం సాధారణంగా తట్టుకోగల కాంతికిరణాలను మించిపోయి ఆ వేవ్లెంత్ ఫ్రీక్వెన్సీ 308 నానోమీటర్లు ఉన్నప్పుడు మన చర్మం ప్రభావితమవుతుంది. అయితే ఇక్కడ తట్టుకునే ప్రభావం కూడా వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు నల్లటిచర్మం (డార్క్ స్కిన్) ఉన్నవారు ఎండ తీవ్రత ఒకింత తీక్షణంగా ఉన్నా తట్టుకోగలరు. కానీ చర్మం రంగు తగ్గుతున్నకొద్దీ అంటే చర్మం ఫెయిర్‌గా అవుతున్న కొద్దీ ఎండ తీవ్రతను తట్టుకునే శక్తి తగ్గుతుంది. అందుకే తెల్లటి చర్మం (ఫెయిర్ స్కిన్) ఉన్నవారు ఎండ తీవ్రతకు చాలా త్వరగా ప్రభావితమవుతారు. ఎండ తీవ్రత ప్రభావం రెండు రకాలుగా ఉంటుంది. మొదట తీవ్రమైన ఎండకు ఎక్స్పోజ్ అయినప్పుడు మన చర్మం నల్లబారుతుంది. తొలుత ఇది తాత్కాలికం. ఎండకు వెళ్లడం తగ్గిస్తే ఇలా నల్లబారడమూ తగ్గుతుంది. ఇలా చర్మం నల్లబారడాన్ని పిగ్మెంటేషన్ అంటారు. తొలి దుష్ప్రభావం సన్‌బర్న్స్ రూపంలో... వైద్యపరిభాషలో ఎరిథిమా అని పిలిచే ఈ సమస్యను సాధారణ పరిభాషలో సన్బర్న్స్గా చెబుతారు. సాధారణంగా సూర్యుడి తీక్షణత ప్రభావం వల్ల ఎండలోకి వెళ్లగానే మొదట చర్మం ఎర్రగా మారుతుంది. ఆ తర్వాత మాడినట్లుగా నల్లబడుతుంది. కొన్ని సందర్భాల్లో చర్మంపైన ఎర్రగా పొక్కుల (బ్లిస్టర్స్) రూపంలోనూ ఇది వ్యక్తం కావచ్చు. చర్మం రంగును బట్టి కూడా దీని తీవ్రత తగ్గడం, పెరగడం ఉంటుంది. ఫెయిర్ చర్మం వారిలో సన్‌బర్న్ తీవ్రత ఎక్కువగానూ, నల్లటి చర్మం వారిలో తక్కువగానూ ఉంటుంది. బ్లిస్టర్స్ ఏర్పడితే దీని తీవ్రత ఎక్కువగా ఉందనడానికి సూచన. కొందరిలో భౌతిక లక్షణాలైన జ్వరం, వికారం, వాంతులు, నిస్సత్తువ కూడా కనిపించవచ్చు. కొందరిలో రక్తపోటు తగ్గడం, స్పృహతప్పడం కూడా జరగవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో రోగిని హాస్పిటల్‌కు తరలించాలి. చికిత్స: సన్‌బర్న్‌కు గురై చర్మం ఎర్రబారిన వారిని తక్షణం నీడకు తీసుకెళ్లాలి. కేవలం 12 – 24 గంటలు చల్లటిప్రాంతంలో ఉన్నా లేదా ఎయిర్‌కండిషన్ గదిలో ఉన్నా వారి లక్షణాలు వాటంతట అవే మాయమవుతాయి. చర్మంపై చల్లటి నీటిలో తడిపిన టవల్‌తో తుడవటం లాంటివీ చేయవచ్చు. అయితే సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు డర్మటాలజిస్టుల సూచన మేరకు నాన్‌స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ఎస్ఏఐడీస్), చర్మపు మంట తగ్గడానికి హైడ్రోకార్టికోసోన్ క్రీములు వాడాల్సిరావచ్చు. పొక్కులను పగలగొట్టకూడదు. మాయిశ్చరైజింగ్ క్రీములతో ఈ సమస్య తగ్గుతుంది. పిగ్మెంటేషన్ ఎండలో చర్మం రంగు నల్లబారడాన్ని పిగ్మెంటేషనగా చెప్పవచ్చు. యూవీ–ఏ, యూవీ... ఈ రెండింటి వల్ల చర్మంలోని మెలనిన్ కణాల్లో ఫొటోపిగ్మెంటేషన్ చర్య జరగడంవల్ల చర్మం రంగు నల్లగా మారుతుంది. అయితే దీని తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు అంటే... ఇమ్మిడియట్ పిగ్మెంటేషన్ డార్క్నెస్ (ఐపీడీ)లో నీడపట్టుకు వచ్చినప్పుడు కేవలం రెండు గంటల్లో దీని ప్రభావం తగ్గుతుంది. కానీ అదేపనిగా ఎండకు తిరిగే వారిలో తాత్కాలిక ఐపీడీ స్థానంలో పెరిసిస్టెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్ (పీపీడీ) అనే కండిషన్ ఏర్పడుతుంది. ఇలా ఏర్పడ్డప్పుడు దీని ప్రభావం కొద్ది రోజులు మొదలుకొని, కొన్ని వారాల వరకు ఉండవచ్చు. నీడపట్టున ఉండటమే దీనికి నివారణ. పెరిసిస్టెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్ (పీపీడీ) ఏర్పడినప్పుడు, ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా ఆ తర్వాత కూడా ఇంకా అదేపనిగా ఎండలో తిరగడం మంచిది కాదు. చెమటకాయలు (మిలీరియా) వైద్యపరిభాషలో మిలీరియా అని పిలిచే ఈ పరిణామంలో చర్మంపై ఉండే స్వేదగ్రంథుల్లో అడ్డంకి ఏర్పడి అవి ఉబ్బినట్లుగా అవుతాయి. బాగా చెమట పట్టినప్పుడు అది ఆవిరైపోయే పరిస్థితి లేనప్పుడు స్వేదగ్రంధుల చివర్లో చెక్కరతో కూడిన పదార్థం (పాలీశాకరైడ్ సబ్‌స్టాన్స్) రూపొంది అది చర్మగ్రంధి చివర అడ్డుగా నిలుస్తుంది. దాంతో లోపల ఉన్న స్వేదం బయటికి రాకుండా ఉండిపోయి, స్వేదగ్రంథిలో ఒత్తిడి పెంచుతుంది. ఫలితంగా స్వేదం పక్క కణజాలాల్లోకి స్రవించి చెమటకాయలు అదేపనిగా విస్తరించినట్లుగా అవుతాయి. అయితే పడకకే పరిమితమైన (బెడ్ రిడెన్) రోగుల్లో చెమట విపరీతంగా పట్టడం, వారు ఒళ్లు కదిలించలేకపోవడంతో ఇవి ఎక్కువగా వస్తుంటాయి. దీనిలోనూ మిలీరియా క్రిస్టలైన్ (సుడామినా), మిలీరియా రుబ్రా (ప్రిక్లి హీట్) ఉంటాయి. మిలీరియా క్రిస్టలైన్లో వీటి తీవ్రత అంతగా లేనప్పుడు చర్మంపై మంట ఉండదు. కానీ మిలీరియా రుబ్రాలో చెమటకాయలు ఎర్రగా చేతికి తగులుతూ ముళ్లతో గుచ్చిన ఫీలింగ్‌తో మంటనూ, తిమ్మిర్ల వంటి భావనను కలిగిస్తాయి. అవి మెడ, ఛాతీ, వీపు భాగంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇక మిలీరియా పుస్టులోజా అనే కండిషన్ మరింత తీవ్రమైనది. ఇందులో స్వేదగ్రంధిలోని స్వేదనాళానికి అడ్డంకి ఏర్పడటంతో పాటు అది దెబ్బతినడం కూడా జరగవచ్చు. ఇవి చర్మంలోని ఛాతీ, వీపు ప్రాంతాలలో పాటు ప్రైవేట్ పార్ట్స్‌లో కూడా విస్తరించవచ్చు. ఇది కొన్ని వారాల పాటు ఉంటుంది. చికిత్స: చల్లటి ప్రదేశాల్లో ఉండటం, క్రమం తప్పకుండా స్నానం చేయడం, ఒంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి చర్యలతో దీన్ని నివారించవచ్చు. పిల్లలకు లేదా పెద్దలకు వాడే డస్టింగ్ పౌడర్, ప్రిక్లీ హీట్ పౌడర్లతోనూ ఉపశమనం ఉంటుంది. ఎండ నుంచి చర్మానికి రక్షణ ఇలా... ►ఈ సీజన్లో ప్రతి రోజు రెండుపూటలా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం మంచిది. ►ఎండలో బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా గొడుగు తీసుకెళ్లాలి. ఈ సీజన్లో మనం వేసుకునే దుస్తులు లైట్ కలర్లో ఉండాలి. గాలి ఆడే కాటన్ దుస్తులు, ఎండ తగలనివ్వని లాంగ్‌స్లీవ్స్ దుస్తులు వాడటం మేలు. ►యాంటీ ట్యానింగ్ సన్‌స్క్రీన్స్, ఇన్ఫ్రారెడ్ యూవీ – ఏ అండ్ బీ రేడియేషన్ నుంచి రక్షణ ఇచ్చే సన్‌స్క్రీన్స్ వాడుకోవచ్చు. ఈ వేసవిలో ఎస్పీఎఫ్ ఎక్కువగా ఉన్న సన్‌స్క్రీన్ లోషన్లను డాక్టర్ చెప్పిన రీతిలో పద్ధతిగా వాడాలి. తమ చర్మానికి అనుగుణంగా వాడుకోవాల్సిన సన్‌స్క్రీన్‌ను డాక్టర్లు సూచిస్తారు. ఈ క్రీములను బయటకు వెళ్లడానికి అరగంట ముందు రాసుకోవడం వల్ల ఎండలోని హానికరమైన కిరణాలనుంచి అవి చర్మాన్ని ప్రభావపూర్వకంగా రక్షించగలుగుతాయి. అయితే ప్రతి మూడు గంటలకు ఒకసారి ఈ క్రీములు వాడాలి. ►ఇక రాత్రి వేళల్లో డాక్టర్ సలహా మేరకు డీ–పిగ్మెంటేషన్ క్రీమ్స్ వాడటం వల్ల చర్మం నల్లబడకుండా ఉంటుంది. ఇక ఈత వంటి ఆటల్లో పాల్గొనే వారు వాటర్ప్రూట్ సన్‌స్క్రీన్స్ వాడాల్సి ఉంటుంది. ►కళ్ల సంరక్షణ కోసం నాణ్యమైన అద్దాలు వాడటం మేలు. అలాగే తలకు టోపీని వాడవచ్చు. సూర్యకిరణాలు నేరుగా ముఖానికి తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్లజోళ్లలో అమర్చుకునే స్వెట్ ప్యాడ్స్ క్రమం తప్పకుండా మార్చుకునేలా జాగ్రత్త తీసుకోవాలి. ►చర్మం తన సాగేగుణాన్ని కోల్పోకుండా ఉండాలంటే ఎక్కువగా నీళ్లు, ద్రవాహారాలు తీసుకోవాలి. ప్రతిరోజూ కనీసం 12 గ్లాసులకు తగ్గకుండా నీళ్లు తాగాలి. ఈ సీజన్లో నీళ్లతో పాటు మజ్జిగ (బటర్‌మిల్క్), కొబ్బరినీళ్లు, పండ్ల రసాల వంటి ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవాలి. కోలా డ్రింక్స్ వంటివి చర్మానికి హాని చేస్తాయి. వాటికి దూరంగా ఉండాలి. ►తలకు రంగు వేసుకునే వారు సీజన్ మొదలు కావడానికి ముందే వేసుకోవడం మంచిది. లేదా చల్లటి వేళల్లో వేసుకోవాలి. ►స్విమ్మింగ్ చేసేవారు వాటర్ రెసిస్టెంట్ సన్‌స్క్రీన్ వాడాలి. ►వింటర్లో కోల్డ్ క్రీమ్స్ రాసుకున్నట్లే.... సమ్మర్లో మాయిశ్చరైజింగ్ క్రీమ్‌లు అవసరమవుతాయి. అవి చర్మంపై ఉండే తేమను కాపాడతాయి. వింటర్లో అయితే ఆయిల్ ఇన్ వాటర్ టైపు క్రీములు వాడతారు. సమ్మర్లో వాటర్ ఇన్ ఆయిల్ టైప్ ఆఫ్ క్రీములు వాడాలి. ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉండే క్రీములు వాడాలి. క్రీమ్ కంటే లోషన్ రూపంలో ఉండేవి వాడితే మంచిది. ►ఇక డియోడరెంట్స్ వాడేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా డియోడరెంట్స్‌లో బర్గ్యాప్టెన్ అనే సోరోలెన్స్ పదార్థం ఉంటుంది. దాంతోపాటు దీనికి మంచి సువాసన (ఫ్రాగ్రెన్స్) రావడానికి కొన్ని రసాయనాలు వాడతారు. ఎండాకాలంలో చెమటలు ఎక్కువగా పట్టడం వల్ల ఇవన్నీ చర్మంపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. కాబట్టి నేరుగా డియోడరెంట్స్ చర్మంపై రాసుకోవడం కంటే ఫ్రాగ్రెన్స్‌ను కోరుకునేవారు వాటిని బట్టలపై (స్ప్రే చేసుకునేలా) వేసుకుంటే మంచిది. అందునా బట్టలు ధరించకముందే వాటిపై స్ప్రే చేసి... ఒక అరగంట తర్వాత వాటిని ధరించాలి. అలా ఉపయోగిస్తే చర్మానికి కలిగే హానిని తగ్గించినట్లు అవుతుంది. ►ఈ సీజన్లో వెంట్రుకలు, జుట్టు పొడిబారిపోతాయి. కాబట్టి తలకు నూనె రాయడం మేలు చేస్తుంది. అయితే కొంతమంది తల చల్లబడటానికి మెంథాల్ కలిసిన ఆయిల్‌ను వాడతారు. ఇది వారి వ్యక్తిగత ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. ►సాధారణంగా ఈ సీజన్లో బిగుతుగా ఉన్న వస్తువులు ధరించడం వల్ల చెమట పట్టడంతో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేదా మెటల్స్ వల్ల కలిగే అలర్జిక్ రియాక్షన్స్ వల్ల దురద వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మరికొందరిలో ఉంగరం ఉన్న చోట సబ్బు నురగ ఇరుక్కుపోయి... అక్కడ డిటర్జెంట్ వల్ల అలర్జీ రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో తమకు సరిపడని... అంటే అలర్జీ కలిగించే వాటిని గుర్తించి, అలాంటి వాటిని ధరించకుండా దూరంగా ఉంచాలి. అలాగే మన ఆభరణాలు మరీ బిగుతుగా లేకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. యూవీతో దీర్ఘకాలిక పరిణామాలు ఫొటో ఏజింగ్: అదేపనిగా ఎండలో తిరగడం వల్ల కొన్ని అవాంఛనీయ దీర్ఘకాలిక పరిణామాలు ఏర్పడతాయి. అందులో ముఖ్యమైనది ఫొటోఏజింగ్. ఫొటోఏజింగ్ వల్ల చర్మంపై అవాంఛితమైన ముడతలు, వెడల్పుగా ప్యాచ్ వచ్చిన రీతిలో ఏర్పడే మచ్చలు (సోలార్ లెంటిజిన్స్), చర్మం తన సాగే గుణాన్ని కోల్పోవడం, చర్మంపైన రక్తనాళాలు దారపు పోచల్లా కనిపించడం (టెలాంజిక్టాసియాస్ – అవే తర్వాత సాలెగూళ్లలా అల్లుకుని కనిపిస్తాయి. వాటినే స్పైడర్ వెయిన్స్ అంటారు), చర్మం ఎండిపోయినట్టుగా అనిపించడం వంటి పరిణామాలు ఏర్పడతాయి. ఆ తర్వాత చర్మం చాలా ముదురుగా రఫ్‌గా కనిపిస్తుంది. అందుకే ఈ దశలోనైనా అదేపనిగా ఎండకు వెళ్లకుండా చర్మాన్ని కాపాడుకోవాలి. తద్వారా ఫొటో ఏజింగ్‌ను నివారించవచ్చు. యూవీకి ఎక్స్పోజ్ కావడం దీర్ఘకాలం కొనసాగితే మరిన్ని అనర్థాలు కూడా ఏర్పడే అకాశాలు ఉన్నాయి. హాని కలిగేది అల్ట్రా వయొలెట్, ఇన్ఫ్రా రెడ్ కిరణాలతోనే... మనకు చేరే కాంతితో పాటు మన వాతావరణంలో ప్రసరిస్తూ, ప్రవహిస్తూ ఉండే అల్ట్రా వయొలెట్, ఇన్ఫ్రా రెడ్ కిరణాలతో మన చర్మానికీ, కంటికి కూడా హాని కలిగే ప్రమాదం ఉంది. పైగా వేసవిలో ఈ కిరణాల తీవ్రత మరింత ఎక్కువగా ఉండటం వల్ల అమితమైన శక్తితో ఉండే ఈ కిరణాలు కంటికి హాని చేసే అవకాశాలు ఎక్కువ. అల్ట్రా వయొలెట్లో మూడు రకాలు కంటికి హాని చేయగల అల్ట్రా వయొలెట్ కిరణాల (యూవీ రేస్)ను మూడగా విభజించవచ్చు. అవి... యూవీ – ఏ (వీటి ఫ్రీక్వెన్సీ 320 – 400 న్యానో మీటర్లు)... తక్కువ శక్తిమంతమైనవి. యూవీ – బీ (వీటి ఫ్రీక్వెన్సీ 280 – 320 న్యానో మీటర్లు)... ప్రమాదకరమైనవి. యూవీ – సీ (వీటి ఫ్రీక్వెన్సీ 200 – 280 న్యానో మీటర్లు)... అత్యంత ప్రమాదకరం. మళ్లీ యూవీ–ఏ లో రెండు ఉప–రకాలు ఉంటాయి. అవి.. 340 – 400 న్యానో మీటర్ల వేవ్‌లెంత్‌తో ఉన్నవి యూవీ–ఏ1 అంటారు. 320 – 340 యూవీ–ఏ2 అంటారు. ఇన్ఫ్రా రెడ్ కిరాణాలూ మూడు రకాలు ఇన్ఫ్రారెడ్ – ఏ (వీటి ఫ్రీక్వెన్సీ 700 – 1400 న్యానో మీటర్లు) ఇన్ఫ్రారెడ్ – బీ (వీటి ఫ్రీక్వెన్సీ 1400 – 3000 న్యానో మీటర్లు) ఇన్ఫ్రారెడ్ – సీ (వీటి ఫ్రీక్వెన్సీ 3000 న్యానో మీ. – 1 మిల్లీమీటర్లు) ఇక అన్ని రకాల ఇన్ఫ్రారెడ్ కిరణాలూ చర్మానికి చాలా హానికరమైనవి. చర్మంపై అల్ట్రావయొలెట్ కిరణాల ప్రభావం ఇలా... యూవీ కిరణాలతో తాత్కాలిక ప్రభావాలు ►ఎరిథిమా (సన్‌బర్న్స్) ►పిగ్మెంటేషన్ (తక్షణం కనిపించేది ఇమ్మీడియట్ డార్క్పిగ్మెంటేషన్ (ఐపీడీ) / అదేపనిగా చాలాకాలంఎక్స్పోజ్ అయినప్పుడు కనిపించేది పెరిసిస్టెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్ (పీపీడీ) యూవీలతో దీర్ఘకాలిక ప్రభావాలు ►ఫొటో ఏజింగ్ ►ఇమ్యూనోసప్రెషన్ ►ఎగ్సాసెర్బేషన్ ఆఫ్ఫోటోడెర్మటోసిస్ డాక్టర్ స్వప్నప్రియ డర్మటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
ఏపీకి కొత్త బ్రాండ్ అంబాసిడర్.. సూర్యుడు
సాక్షి, విజయవాడ : రాష్ట్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కీలక అగుడు వేశారు. ఏకంగా సూర్యుడినే ఆంధ్రప్రదేశ్‌కు సరికొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. సూర్యుడు జస్టిస్ చౌదరి లాంటివాడని, అందరికీ సమన్యాయం చేస్తాడని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆదివారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ‘సూర్యారాధన’ కార్యక్రమంలో సీఎం ఈమేరకు ప్రటకటన చేశారు. ఇక్కడి నుంచే సూర్యోదయం : ‘అన్ని మతాల్లో సూర్యుడికి విశిష్టమైన స్థానం ఉంది. పొడవైన తీరప్రాంతామున్న ఏపీ నుంచే సూర్యుడు ఉదయిస్తున్నందున దీనిని ‘సన్ రైజ్ స్టేట్’గా నినాదం ఇచ్చాం. అందులో భాగంగానే సూర్యుడిని బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించాం. సూర్యారాధన కార్యక్రమాన్ని రాష్ట్ర వేడుకగా ప్రతి ఏటా నిర్వహిస్తాం’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టెక్నాలజీ కాదు ప్రకృతే ముఖ్యం : సూర్యారాధన కార్యక్రమం.. మతాలకు సంబంధంలేదని, శుద్ధ శాస్త్రవిజ్ఞానమని ముఖ్యమంత్రి వివరించారు. సూర్యకాంతితో ఎన్నో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని, టెక్నాలజీ కంటే ప్రకృతితో మమేకం కావడడానికే ప్రాధాన్యం ఇస్తానని, అందుకే జలహారతి, నీరుచెట్టు లాంటి ప్రకృతి సంబంధిత కార్యక్రమాలు చేపట్టామని చంద్రబాబు గుర్తుచేశారు. -
నా దివ్యమహిమలు వర్ణింపశక్యం కావు
మామిడిపూడి ‘గీత’ విభూతి యోగం అర్జునుని ప్రార్థనను అంగీకరించి శ్రీకృష్ణ పరమాత్ముడు తన విభూతులను ఇలా చెబుతున్నాడు. ‘‘అర్జునా! నా దివ్యమహిమలు అనంతాలు. అవి వర్ణింపశక్యమైనవి కావు. వాటిలో ముఖ్యమైన కొన్నింటిని మాత్రం వినిపిస్తాను. విను. సర్వభూతాలలోనూ ఉండే ఆత్మను నేనే. సమస్తభూతాల సృష్టి స్థితి లయములకు కారణభూతుడను నేనే. సర్వక్షేత్రములయందును క్షేత్రజ్ఞుడను నేనే. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత! (13-33) ఒక్క సూర్యుడు సమస్త లోకాన్ని ఎట్లా ప్రకాశింపజేస్తున్నాడో అట్లే నేను క్షేత్రజ్ఞుడనై ఎల్ల క్షేత్రాలను ప్రకాశింపజేస్తున్నాను. నా జ్యోతి పరంజ్యోతి. సూర్యచంద్రాదులను ప్రకాశింపజేస్తోంది. అర్జునా! సమస్త చరాచర భూతాల లోపల వెలుపల నేను నిండి ఉన్నాను. కానీ నా సూక్ష్మత్వ కారణం వల్ల నన్ను తెలుసుకోవడం సులభం కాదు. - కూర్పు: బాలు-శ్రీని -
ఇక మూడో ప్రపంచ యుద్ధమే..
-
ఇక మూడో ప్రపంచ యుద్ధమే.. సై అంటున్న దేశం!
మరో ప్రపంచయుద్ధానికి రష్యా సన్నద్ధమవుతున్నదా? ఇందులో భాగంగా ఆ దేశం ముందస్తుగా భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నదా? అంటే బ్రిటన్‌కు చెందిన ప్రముఖ టాబ్లాయిడ్ ‘ద సన్’ ఔననే అంటున్నది. అంతర్జాతీయ యుద్ధం పొంచి ఉన్న నేపథ్యంలో విదేశాల్లోని తమ పౌరులు వెంటనే స్వదేశం చేరుకోవాలని రష్యా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్టు ‘ద సన్’ ఓ కథనాన్ని ప్రచురించింది. మరో ప్రపంచ యుద్ధం జరిగే అవకాశముండటంతో ఏకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతినే ఈ ఆదేశాలు జారీచేసినట్టు తెలిపింది. నాలుగు కోట్ల మంది పౌరులకు రక్షణ కల్పించేరీతిలో రష్యా ఇటీవల సైనిక విన్యాసాలు నిర్వహించింది. పూర్తిస్థాయిలో అణ్వాయుధ యుద్ధం వస్తే దానిని ఎదుర్కొనేందుకు సన్నాహకంగానే ఈ విన్యాసాలు చేసినట్టు ఆ పత్రిక వివరించింది. సాధ్యమైనంత త్వరగా రష్యా అధికారులు, వారి పిల్లలు, బంధువులు స్వదేశం చేరుకోవాలని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిపింది. అంతేకాకుండా రష్యా రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులకు కూడా ఈ విషయంలో అధ్యక్షుడు పుతిన్ నుంచి అత్యున్నత స్థాయి హెచ్చరికలు అందినట్టు తెలిపింది. స్వదేశానికి తిరిగి రావాలన్న పుతిన్ పిలుపు ప్రభుత్వాధికారులందరికీ వర్తిస్తుందని పేర్కొంది. అధ్యక్షుడు పుతిన్ అకస్మాత్తుగా ఫ్రాన్స్ పర్యటనను రద్దు చేసుకున్న నేపథ్యంలో ఈ పిలుపు ఇవ్వడం గమనార్హం అని మరో బ్రిటన్ పత్రిక డెయిలీ స్టార్ పేర్కొంది. ఈ ఆదేశాలను ఎవరైనా పట్టించుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలుంటాయని, వారి ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయని ప్రభుత్వం హెచ్చరించినట్టు తెలిపింది. ఉన్నపళంగా విదేశాల్లోని రష్యాన్లందరినీ తిరిగి స్వదేశానికి రమ్మనడం దేనికి సంకేతం అంటే ఇవన్ని యుద్ధ సంకేతాలేనని, పెద్ద యుద్ధాన్ని చేసేందుకు సన్నహాకాల్లో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు రష్యా రాజకీయ విశ్లేషకుడు స్టానిస్లావ్ బెల్కోవ్స్కీ పేర్కొన్నారు. ప్రచ్ఛన్న యుద్ధం అనంతరం అమెరికా-రష్యా మధ్య సంబంధాలు ఇటీవలికాలంలో దారుణంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా సిరియా విషయంలో రష్యా-అమెరికా బాహాబాహీకి దిగుతున్నాయి. సిరియాలో శాంతికోసం తలపెట్టిన చర్చల ప్రక్రియ నుంచి అమెరికా తప్పుకోవడమే కాకుండా తమ దేశ వెబ్సైట్లను రష్యా హ్యాకింగ్ చేస్తున్నదని ఆరోపించిన సంగతి తెలిసిందే. -
భానుడి వరం...
అసలు విషయం చెప్పుకునే ముందుగా ఒక్కసారి పురాణకాలంలోకి వెళ్దాం. కుంతీదేవికి సూర్యుడి అంశతో కర్ణుడు సహజకవచకుండలాలతో పుట్టాడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే... అది మన పూర్వికులు సూర్యుడి వల్ల ఎముకలూ, శరీరం అభేద్యంగా ఉంటాయన్న సంగతిని ప్రతీకాత్మకంగా చెప్పారేమో అనిపిస్తుంది. ఇప్పుడు మళ్లీ నవీనకాలంలోకి వద్దాం. భానుడి కాంతి తమ శరీరంపై సరైన రీతిలో ప్రసరించనివారి ఎముకలు గుల్లబారిపోతున్నాయి. అంతేకాదు... ఆ సూర్యుడి వెలుగుకి తగినంత మోతాదులో ఎక్స్పోజ్ కానివారు ఎన్నో రకాల వ్యాధులకు గురవుతున్నారు. కారణం... విటమిన్ ‘డి’ లోపం! బహుశా ఈ విటమిన్ అనేక వ్యాధులకు, అంతులేనంతగా ఇచ్చే వ్యాధినిరోధకతనే మన పూర్వికులు సహజ ‘కవచం’ అంటూ అభివర్ణించారేమో అనిపిస్తోంది కదా! పురాణాల మాట ఎలా ఉన్నా... ఈ నవీనకాలంలో విటమిన్ డి అంటే వ్యాధుల పట్ల అది సహజకవచమే. ఆ వ్యాధినిరోధక కవచాన్ని ధరించడం ఎలా అన్నది తెలిపేందుకే ఈ ప్రత్యేక కథనం. ప్రపంచంలోని చాలా పాశ్చాత్య దేశాల్లో సూర్యకాంతి అంతగా ప్రసరించదు. అందుకే వారి రచనల్లో ఆహ్లాదకరమైన రోజును ‘సన్నీడే’ అంటూ అభివర్ణిస్తుంటారు. ఎప్పుడూ మబ్బుపట్టి ముసురుతుంటుంది కాబట్టి ‘రెయిన్ రెయిన్... గో అవే’ అంటూ రయిమ్స్ పాడుతుంటారు. కాబట్టి... అక్కడ విటమిన్ ‘డి’ లోపం చాలా సహజం, సాధారణం. ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ అంటే నూరు కోట్లమంది, (వారిలో పాశ్చాత్యులే ఎక్కువ) విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారని ఒక అంచనా. అందుకే వారు సూర్యకాంతి కోసం సన్బాత్ల వంటి ప్రక్రియలను ఆశ్రయిస్తుంటారు. కానీ ఎండ పుష్కలంగా ఉండే మన భారతదేశంలాంటి చోట కూడా ఇప్పుడు ప్రజల్లో విటమిన్ ‘డి’ లోపం వేధిస్తోంది. సామాజికంగా ఎండలోకి వెళ్లి చేసే పనుల కంటే నీడపట్టునే ఉండి చేసే పనులు క్రమంగా పెరిగిపోవడం, ఎండకు ఎక్స్పోజ్ అయ్యే అవకాశాలు తగ్గడమే దీనికి కారణం. విటమిన్ డి లోపం కారణంగా వస్తాయని పేర్కొనే అనేక అనర్థాలు ఇప్పుడు చాలా మందిలో కనిపిస్తుండటంతో డాక్టర్లు సైతం పెద్ద ఎత్తున రోగులకు విటమిన్ ‘డి’ సప్లిమెంట్లు వాడుతుండటం ప్రస్తుత చికిత్సాశైలిగా మారింది. విటమిన్ ‘డి’ అంటే... శరీరానికి అవసరమైన పోషకాల్లో అతి ముఖ్యమైనది విటమిన్ డి. అయితే ఈ పోషకం ఆహారంలో కంటే సూర్మరశ్మి నుంచే ఎక్కువగా లభ్యమవుతుంది. సూర్యకాంతి వల్ల దొరికేది 80 శాతమైతే... కేవలం మిగతా 20 శాతం మాత్రమే ఆహార పదార్థాల నుంచి లభ్యమవుతుంటుంది. ఇది కొవ్వులో కరిగే విటమిన్. దీన్ని సాంకేతికంగా సెకోస్టెరాయిడ్ అంటారు. అంటే దీని నిర్మాణంలో పరమాణు వలయాలు తెగినట్లుగా ఉంటాయి. (సెకో అంటే బ్రోకెన్ అని అర్థం). పైగా స్టెరాయిడ్ వంటి పదార్థాల నుంచి ఆవిర్భవించిందనే మరో అర్థం కూడా ఉంది. కాబట్టి స్వాభావిక స్టెరాయిడ్‌తో పాటూ విటమిన్ కూడా! ఫలితంగా ఇది శరీరానికి కలిగించే ప్రయోజనాలెన్నో ఉన్నాయి. ఎలా తయారవుతుంది?... చర్మానికి సూర్యకాంతి తగలగానే విటమిన్ డి ఆవిర్భవిస్తుంది. ఇది రక్తంలో కలిసి కాలేయాన్ని చేరుతుంది. కాలేయంలో అది ‘క్యాల్సీడియల్’ అనే ఒక పూర్తిస్థాయి హార్మోన్‌కు తొలిరూపాన్ని తీసుకుంటుంది. మళ్లీ అది రక్తప్రవాహంలో కలిసి ‘క్యాల్సీడియల్’ నుంచి క్యాల్సిట్రియల్గా మారుతుంది. ఈ క్యాల్సిట్రియాల్నే ‘విటమిన్-డి’ అనుకోవచ్చు. రక్తప్రవాహం ద్వారా ఇది మూత్రపిండాల్లోకి చేరినప్పుడు పూర్తిస్థాయి ‘విటమిన్-డి’గా రూపొందుతుంది. అంతేకాదు... వ్యాధి నిరోధకత కలిగించే కణాల్లోనూ ఈ విటమిన్ రూపొందుతుంది. అందుకే ఈ విటమిన్ ఇంత ప్రభావపూర్వకమైన ‘సహజవ్యాధి నిరోధకారి’గా పనిచేస్తుంది. అంటే ఇది ఒక శరీరానికి అవసరమైన పోషకం, దాంతోపాటూ శరీరం తయారు చేసుకునే ఒక హార్మోన్ లాంటిది కూడా కావడంతో రెండు రకాల భూమికలనూ పోషిస్తుంది. కనుగొన్న తీరు ఆసక్తిదాయకం... విటమిన్-డి ని కనుగొన్న తీరును కథలా చెబితే ఒక థ్రిల్లర్‌ను తలపింపజేస్తుంది. రెండు శతాబ్దాల క్రితం రికెట్స్ అనే ఎముకల వ్యాధి వ్యాప్తి విస్తృతంగా ఉండేది. ఈ వ్యాధి వచ్చిన వారిలో ఎముకలు తమ సహజ ఆకృతిని కోల్పోయి వంకరలు తిరిగిపోవడం, దొడ్డికాళ్లలా మారడం వంటివి జరిగేవి. పిల్లల్లో వచ్చిన రికెట్స్‌ను ‘ఆస్టోమలేసియా’ అనేవారు. దాదాపు నూరేళ్ల క్రితం హాలెండ్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో ఈ రికెట్స్‌కు విరుగుడుగా వైద్యులు ‘కాడ్ లివర్ ఆయిల్’ అనే నూనెను ఉపయోగించేవారు. దీన్ని కాడ్ అనే రకం చేప కాలేయం నుంచి సంగ్రహించేవారు. 1918లో ఎడ్వర్డ్ మెలాన్‌బీ అనే శాస్త్రవేత్త - కాడ్‌లివర్ ఆయిల్‌లోని కొవ్వులో కరిగే ఒక నిర్దిష్టమైన పోషకమే ఈ రికెట్స్ వ్యాధికి సమర్థమైన చికిత్సగా పని చేస్తోందని తెలుసుకున్నాడు. ఆ తర్వాత 1924లో హెచ్. స్టీన్‌బాక్, ఆల్ఫ్రెడ్ ఫేబియన్ హెస్ అనే శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో సూర్యరశ్మిలోని అల్ట్రా వయొలెట్ కిరణాలు కొన్ని జీవులను తాకినప్పుడు ఆ జీవుల్లో కొవ్వులాంటి పోషకం ఉత్పత్తి అవుతుంటుందని కనుగొన్నారు. ఆ పోషకాన్ని ‘వయొస్టెరాల్’ అని పిలిచేవారు. ఇక 1935లో దీన్ని ల్యాబ్‌లో ఐసోలేట్ చేసి, దానికి ‘క్యాల్సిఫెరాల్’ అని పేరుపెట్టారు. ఆ తర్వాత అందులో కొద్దికొద్ది నిర్మాణపరమైన మార్పులతో... అనేకరకాల విటమిన్ డి (డి1, డి2, డి3.... డి7, డి8)లను కనుగొన్నారు. విటమిన్ ‘డి’లో రకాలు... ‘విటమిన్ డి’లో విటమిన్ డి1, డి2, డి3...డి7... ఇలా చాలా రకాలు (దాదాపు పది వరకు) ఉన్నాయి. కానీ వాటిల్లో విటమిన్ డి2 (ఎర్గో క్యాల్సిఫెరాల్), విటమిన్ డి3 (కోలీ క్యాల్సిఫెరాల్) ముఖ్యమైనవి. ఇతర సమస్యలకూ చికిత్సగా... ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికీ విటమిన్ ‘డి’ని వైద్యులు ప్రిస్క్రయిబ్ చేస్తారు. హై కొలెస్ట్రాల్‌తో బాధపడేవారికి, డయాబెటిస్, స్థూలకాయం ఉన్నవారికి, మల్టిపుల్ స్క్లిరోసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడీ) ఉన్నవారికి, ఆస్తమా, బ్రాంకైటిస్ బాధితులకు, మహిళల్లో ప్రీ-మెన్స్ట్రువల్ సిండ్రోమ్‌తో బాధపడేవారికి, పంటి, చిగుళ్ల వ్యాధుల నివారణకు, విటిలిగో (బొల్లి), స్క్లిరోడెర్మా, సోరియాసిస్ వంటి చర్మరోగాలు ఉన్నవారికి డాక్టర్లు విటమిన్-డిని సూచిస్తారు. సోరియాసిస్ చికిత్సలో ‘క్యాల్సిట్రియల్’ లేదా ‘క్యాల్సిపోట్రియాల్ / క్యాల్సిపోట్రిన్’ అనే రూపంలో విటమిన్-డిని పైపూతమందుగా పూస్తారు. ఇక విటమిన్-డి ఎన్నో రకాల క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తుంది. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. అందుకే అనేక రకాల క్యాన్సర్ల చికిత్సల్లో ‘విటమిన్-డి’ని ఒక మందులాగానే ప్రిస్క్రిప్షన్‌లో సూచిస్తారు. విటమిన్ డి లోపాన్ని నిర్ధారణ చేస్తారిలా... రక్తపరీక్ష ద్వారా విటమిన్-డి ఉండాల్సిన పరిమాణంలో ఉందా, లేదా అన్న విషయాన్ని తెలుసుకుంటారు. ఇందుకోసం 25 (ఓహెచ్)డీ అనే పరీక్షనూ లేదా 1,25 (ఓహెచ్) డీ3 అనే పరీక్షను చేస్తారు. విటమిన్-డి ఉండాల్సిన పాళ్లు తెలుసుకునేందుకు పైన పేర్కొన్న మొదటి పరీక్ష అయిన 25 (ఓహెచ్)డీ మంచి ఫలితాలను ఇస్తుందని చాలామంది వైద్యుల అభిప్రాయం. 25 (ఓహెచ్)డీ పరీక్షనే 25-హైడ్రాక్సీక్యాల్సిఫెరాల్ లేదా 25-హైడ్రాక్సీ విటమిన్- డి అనే మాటకు సంక్షిప్త రూపం. సాధారణంగా ఆరోగ్యవంతుడి రక్తంలో విటమిన్ డీ పాళ్లు 50-65 ఎన్జీ/ఎమ్ఎల్ ఉండాలి. దాని కంటే తక్కువగా ఉంటే విటమిన్-డి మాత్రలను డాక్టర్లు సూచిస్తారు. విటమిన్ ‘డి’ - విశేషాలు... ఎండవేళలోనే విటమిన్-డి తయారవుతుంది. పైగా చర్మాన్ని తాకాక అది కాలేయాన్ని చేరుతుంది. ఇలా విటమిన్-డి తయారీలోనూ, నిక్షిప్తం చేయడంలోనూ కాలేయం కీలక పాత్ర వహిస్తుంది కాబట్టి... ఎండ తక్కువగా ఉండే చలికాలం నాలుగు నెలల కోసం అవసరమైన విటమిన్-డిని కాలేయం నిల్వ చేసుకుని పెట్టుకుంటుంది. క్యాల్షియమ్ సక్రమంగా ఎముకల్లోకి ఇంకి... వాటిని పటిష్టం చేసేందుకు విటమిన్-డి ఎంతో అవసరం. ఆహారంలోని క్యాల్షియమ్‌ను శరీరం తీసుకునే ప్రక్రియలో అది పేగుల్లోనే జరిగేలా విటమిన్-డి తోడ్పడుతుంది.గర్భిణులకు తగినంత విటమిన్ -డి ఇవ్వడం వల్ల భవిష్యత్తులో పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. వాళ్ల వికాసానికి విటమిన్-డి ఎంతగానో తోడ్పడుతుంది.జుట్టు ఒత్తుగా పెరగడం కోసం కూడా విటమిన్-డి తోడ్పడుతుంది.విటమిన్-డి లోపం ఉన్నవారు సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యే వేళల్లో మాత్రం సన్‌స్క్రీన్ వాడకూడదు. సన్‌స్క్రీన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అల్ట్రావయొలెట్ కిరణాలను చర్మంలోకి ఇంకనివ్వక లోపాన్ని పెంచుతుంది. విటమిన్-డి లోపాలతో వచ్చే సమస్యలు... విటమిన్-డి లోపాలతో వచ్చే ఆరోగ్య సమస్యల చిట్టా చాలా పెద్దదే. అందుకే ఇటీవల సాధారణ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వెళ్లే రోగుల్లోనూ డాక్టర్లు విటమిన్‘డి’ లోపాన్ని ఎక్కువగా కనుగొంటున్నారు. విటమిన్ ‘డి’లోపం వల్ల కనిపించే సమస్యలు... శరీరంలో ఖనిజలవణాల అసమతౌల్యత (ముఖ్యంగా జింక్, ఐరన్, ఫాస్ఫరస్ వంటివి) హార్మోన్ల అసమతౌల్యత అత్యంత వేగంతో భావోద్వేగాలు మారిపోవడం (మూడ్స్ స్వింగింగ్) మానసిక ఆరోగ్యం దెబ్బతినడం గర్భవతుల్లో పిండం ఎదుగుదలలో లోపాలు మెదడు కణాలైన న్యూరాన్లు (నరాల కనెక్షన్లలో) లోపాలు కండరాల కదలికల్లో సమన్వయలోపాలు రక్తపోటు ధమనుల్లో రక్తప్రసరణ లోపాలు చక్కెర నియంత్రణలో లోపాలు దంతసంబంధమైన సమస్యలు కణ విభజనలో లోపాలు ఎముకల బలం లోపించడం వ్యాధి నిరోధక శక్తి తగ్గడం రికెట్స్ వ్యాధి ఆస్టియోపోరోసిస్ ఆస్టియోమలేసియా ఒక్కోసారి ఫిట్స్ రావడం మొదలైనవి. విటమిన్ ‘డి’ని పొందడం ఇలా... ముఖం, చేతులు, భుజాలు, సాధ్యమైనంత వరకు శరీర భాగాలు లేత ఎండ కాంతికి ఎక్స్పోజ్ అయ్యేలా సూర్యోదయ వేళల్లో ఆరుబయట నడవడం మంచి మార్గం. దీనితో పాటూ... డాక్టర్లు అనేక రకాల విటమిన్ ‘డి’ మాత్రలను, వాటిని ఉపయోగించాల్సిన మోతాదులను సూచిస్తుంటారు. ఒకవేళ మాత్రలు సరిపడక స్వాభావిక రూపంలోనే విటమిన్-డి ని పొందాలని అనుకుంటే తీసుకోవాల్సిన ఆహారాలివి... చేపల కాలేయాల్లో లభ్యమయ్యే నూనెల్లో విటమిన్ డి దొరుకుతుంది. ప్రధానంగా కాడ్, మాక్రెల్, సొరచేప (షార్క్), సార్డైన్, ట్యూనా వంటి చేపల కాలేయాలలో. వేటమాసం, అందులోనూ ప్రత్యేకంగా కాలేయంతో పాటు వెన్న, నెయ్యి, గుడ్డులోని పచ్చసొనలో ‘విటమిన్-డి’ ఎక్కువ. ఇటీవల చాలామంది పచ్చసొన ఆరోగ్యానికి మంచిది కాదంటూ దాన్ని పరిహరిస్తున్నారు. కానీ దానిలో కొలెస్ట్రాల్‌తో పాటు క్యాలిటరాల్ అని పిలిచే విటమిన్-డి ఉంటుంది. కాబట్టి విటమిన్-డి కోసం పచ్చసొన తీసుకోవడం చాలా మంచిది. పచ్చసొనను పరిహరించడం వల్ల ఆరోగ్యానికి కలిగే మేలు కంటే క్యాల్సిటరాల్ వంటి ఎన్నో పోషకాలు పోగొట్టుకునే నష్టమే ఎక్కువ. అందుకే పరిమిత స్థాయిలో పచ్చసొన తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే. పుట్టగొడుగుల్లో విటమిన్-డి2 ఎక్కువగా ఉంటుంది. విటమిన్-డి లోపం ఉన్నవారు పుట్టగొడుగులతో చేసిన రకరకాల ఆహార పదార్థాలతో పాటు ఎండలో నడవటం వల్ల స్వాభావికంగానే విటమిన్-డి2 సమకూరుతుంది. ఫోర్టిఫైడ్ ఆహారాల్లో...: పాలు, జ్యూస్ వంటి కొన్ని రకాల ఆహారపదార్థాల్లో ఇతర పోషకాలతో మరింత సంతృప్తం చేస్తారు. ఇలాంటి ఆహారాలను ఫోర్టిఫైడ్ ఆహారాలుగా పేర్కొంటారు. మామూలుగా అయితే పాలలో విటమిన్-డి పాళ్లు తక్కువే. కానీ ఫోర్టిఫైడ్ మిల్క్, ఫోర్టిఫైడ్ సోయామిల్క్, ఫోర్టిఫైడ్ ఆరెంజ్, ఫోర్టిఫైడ్ ఓట్మీల్, ఫోర్టిఫైడ్ సిరేల్స్ (తృణధాన్యాల) వంటి ఆహార పదార్థాల్లో విటమిన్-డి పాళ్లు ఎక్కువ. ఏయే పదార్థాలలో ఎంతెంత...? వాస్తవానికి ఆహారపదార్థాల ద్వారా లభ్యమయ్యేదాని కంటే సూర్యరశ్మికి తాకినప్పుడు చర్మం కింది పొరలో దీని ఉత్పత్తి ఎక్కువ. అయినప్పటికీ కొద్ది మోతాదుల్లో కొన్ని రకాల ఆహారపదార్థాల నుంచి అది లభిస్తుంది. అవి... ఆహార పదార్థం పరిమాణం (మైక్రోగ్రాముల్లో) కాడ్‌లివర్ ఆయిల్ 175 షార్క్ లివర్ ఆయిల్ 50 గుడ్లు (పచ్చసొనతో) 1.5 నెయ్యి 2.5 వెన్న 1.0 (ఇవన్నీ 100 గ్రాముల ఎడిబుల్ పోర్షన్లో లభించే మోతాదులు) విటమిన్ - డి కోసం డైట్‌ప్లాన్ ఒక వ్యక్తి ఆరోగ్యకరంగా విటమిన్-డిని స్వాభావికంగానే పొందాలంటే న్యూట్రిషనిస్టులు వ్యక్తిగతంగా వారిని పరిశీలించి, డైట్ ప్లాన్ చెబుతారు. ఇక్కడ పేర్కొన్న డైట్ ప్లాన్ సగటు వ్యక్తి కోసం రూపొందించినదిగా భావించవచ్చు. ఉదయం 6.30కి: ఒక గ్లాసు విటమిన్-డితో ఫోర్టిఫై చేసిన (వాస్తవ అర్థంలో చెప్పాలంటే మరింత బలోపేతం చేసిన అని చెప్పుకో వచ్చు) లో ఫ్యాట్ (కొవ్వు తక్కువగా వున్న) పాలు. బ్రేక్‌ఫాస్ట్ 8 గం.లకు: ఒక కప్పు ఫోర్టిఫైడ్ విత్ విటమిన్ డి ఓట్మీల్ లేదా ఒకకప్పు కార్న్‌ఫ్లేక్స్ ప్లస్ ఒక ఉడికించిన గుడ్డు (పచ్చసొనతో సహా ఇందులో 42 ఐయూ విటమిన్ డి ఉంటుంది). బ్రంచ్ 11 గంటలకు: విటమిన్-డి ఫోర్టిఫైడ్ ఆరెంజ్ జ్యూస్ / ఆపిల్ జ్యూస్ / స్ట్రాబెర్రీ జ్యూస్ ఒక గ్లాసు. లంచ్ (ఒంటిగంటకు): రాగులు / జొన్నలు / పొట్టు తీయని ముడిబియ్యంతో ఒక పెద్ద కప్పు అన్నం ప్లస్ అంతే మోతాదులో ఆకుపచ్చని ఆకుకూరలతో చేసిన కూర ప్లస్ 100 గ్రాముల చేపల కూర (ఈ చేపలు ట్యూనా/సార్డిన్ రకానికి చెందినవైతే మంచిది) ప్లస్ ఒక కప్పు వెజ్ సలాడ్. ప్లస్ చివర్లో పెరుగు. సాయంత్రానికి కాస్త ముందు అంటే 3 గంటలప్పుడు: ఫోర్టిఫైడ్ సోయా మిల్క్.సాయంత్రం వేళ అంటే 5 గంటల ప్రాంతంలో: మొలకెత్తిన ధాన్యాలు (స్ప్రౌట్స్) ఒక కప్పు ప్లస్ చీజ్ శాండ్విచ్ / టోఫూ శాండ్విచ్. రాత్రి భోజనంలో అంటే రాత్రి 8 గంటలకు : ఫోర్టిఫైడ్ ఓట్మీల్ ఒక కప్పు ప్లస్ మష్రూమ్‌తో చేసిన కూర లేదా ఆకుపచ్చటి ఆకుకూరలతో చేసిన కూర. నిద్రకు ఉపక్రమించే ముందు 10 గంటలకు: ఒక గ్లాసెడు విటమిన్-డి ఫోర్టిఫైడ్ అండ్ లో ఫ్యాట్ పాలు. విటమిన్ డి టాక్సిసిటీ అంటే ఇంతటి ఉపయోగకరమైన విటమిన్-డి ఉండాల్సిన మోతాదు కంటే మించితే... అది ప్రతికూల ఫలితాలకు దారి తీస్తుంది. ఉదాహరణకు సొంతంగా విటమిన్-డి మాత్రలు వాడటం, కాడ్‌లివర్ ఆయిల్ క్యాప్సూల్స్ తీసుకోవడం వల్ల రోజుకు 125 మైక్రో గ్రాముల మోతాదు దాటితే ఒక్కోసారి విపరీతంగా దాహం, కంట్లో కురుపులు, చర్మంపై దురదలు రావడం సాధారణం. దాంతోపాటు వాంతులు, నీళ్లవిరేచనాలు వంటివి కూడా కనిపించవచ్చు. ఒక్కోసారి రక్తనాళాల్లోని గోడలపైనా, మూత్రపిండాలలో క్యాల్షియమ్ పెచ్చులు (క్యాల్సిఫికేషన్) రావచ్చు. రక్తనాళాలతో పాటు కాలేయంలో, ఊపిరితిత్తుల్లో, మూత్రపిండాల్లో, కడుపులో క్యాల్షియమ్ మోతాదులు పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎండలో తిరగడం లేదా స్వాభావికమైన ఆహారం ద్వారా కాకుండా... ఇతరత్రా రూపాల్లో విటమిన్-డి తీసుకోవాల్సి వచ్చినప్పుడు కేవలం నిపుణుల సూచనల మేరకే దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. -
అమ్మో.. చలి
=గణనీయంగా తగ్గిన ఉష్ణోగ్రతలు =కనిష్టంగా 12 డిగ్రీల సెల్సియస్ =ఇబ్బంది పడుతున్న వృద్ధులు, పిల్లలు సాక్షి, హన్మకొండ: జిల్లాలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఈ నెల ప్రారంభం నుంచి క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. వారం రోజులుగా జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత సగటున 15 సెల్సియస్ డిగ్రీ లుగా నమోదైంది. ఇక శని, ఆదివారాల్లో ఏకంగా12 సెల్సియస్ డిగ్రీలకు పడిపోయింది. ఈ ఏడాదిలోఇప్పటివరకు అతి తక్కువ ఉష్ణోగ్రతగా ఇది రికార్డుల్లోకెక్కింది. ఉదయం, సాయంత్రం వేళలో చలితీవ్రత ఎక్కువగా ఉంటోంది. పొగమంచు కారణంగా ఉదయం వేళ వాహనాలపై వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. గత నెలలో ఇదే సమయంలో మొదటి సారిగా ఉష్ణోగ్రతలు 20 సెల్సియస్ డిగ్రీల కంటే కిందికి పడిపోయాయి. అయితే ఆ తర్వాత హెలెన్, లెహర్ తుపాను ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా నవంబర్ మధ్య నుంచి మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగాయి. కానీ... వారం రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం మొదలైంది. ఈ క్రమంలో బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీస్తున్నాయి.చలి తీవ్రత పెరగడంతో పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం ఆరుగంటల తర్వాతే సూర్యుడు మబ్బుల మాటు నుంచి బయటకు వస్తున్నాడు. తొమ్మిదింటి వరకు చలి తీవ్రత తగ్గడం లేదు. తిరిగి సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతూ ఐదున్నర గంటలకల్లా చీకటి పడుతోంది. జనవరిలో చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు.