బుధవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ‘సూర్యారాధన’ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
సాక్షి, విజయవాడ : రాష్ట్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కీలక అగుడు వేశారు. ఏకంగా సూర్యుడినే ఆంధ్రప్రదేశ్‌కు సరికొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. సూర్యుడు జస్టిస్ చౌదరి లాంటివాడని, అందరికీ సమన్యాయం చేస్తాడని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆదివారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ‘సూర్యారాధన’ కార్యక్రమంలో సీఎం ఈమేరకు ప్రటకటన చేశారు.
ఇక్కడి నుంచే సూర్యోదయం : ‘అన్ని మతాల్లో సూర్యుడికి విశిష్టమైన స్థానం ఉంది. పొడవైన తీరప్రాంతామున్న ఏపీ నుంచే సూర్యుడు ఉదయిస్తున్నందున దీనిని ‘సన్ రైజ్ స్టేట్’గా నినాదం ఇచ్చాం. అందులో భాగంగానే సూర్యుడిని బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించాం. సూర్యారాధన కార్యక్రమాన్ని రాష్ట్ర వేడుకగా ప్రతి ఏటా నిర్వహిస్తాం’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
టెక్నాలజీ కాదు ప్రకృతే ముఖ్యం : సూర్యారాధన కార్యక్రమం.. మతాలకు సంబంధంలేదని, శుద్ధ శాస్త్రవిజ్ఞానమని ముఖ్యమంత్రి వివరించారు. సూర్యకాంతితో ఎన్నో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని, టెక్నాలజీ కంటే ప్రకృతితో మమేకం కావడడానికే ప్రాధాన్యం ఇస్తానని, అందుకే జలహారతి, నీరుచెట్టు లాంటి ప్రకృతి సంబంధిత కార్యక్రమాలు చేపట్టామని చంద్రబాబు గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment