brand ambassidor
-
14 ఏళ్ల బాలిక ఘనత.. స్లమ్ నుంచి లగ్జరీ బ్యూటీ బ్రాండ్ అంబాసిడర్‌గా..
టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదు.. ప్రతిభకు డబ్బుతో సంబంధం లేదు. గుడిసెలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారిలోనూ విశేష ప్రతిభ దాగి ఉంటుంది. కానీ టాలెంట్‌ను నిరూపించుకునేందుకు సమయం, అవకాశాలు, వేదికలు కావాలి.. అంతేగాదు సరైన ప్రోత్సాహం ఉండాలి. తాజాగా టాలెంట్ ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చని నిరూపించింది మురికి వాడల్లో నివసించే 14 ఏళ్ల అమ్మాయి. చిన్న వయసులోనే గొప్ప విజయాన్ని అందుకొని తనలాంటి మరెంతో మందికి ఆదర్శంగానూ నిలిచింది. ముంబై ధారవి స్లమ్ వాడల్లో నివసించే మలీషా ఖర్వా.. ప్రఖ్యాతి గాంచిన లగ్జరీ బ్యూటీ బ్రాండ్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్ సంస్థ కొత్తగా ప్రారంభించిన ‘ది యువతి కలెక్షన్’కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. స్లమ్ ఏరియాలో ఉండే మలీషా ఇప్పుడు ‘యువతి కలెక్షన్’ను ముందుండి నడిపించనుంది. ఇది యువ శక్తిని పెంపొందించే లక్ష్యంతో మొదలు పెడుతున్న ఓ సామాజిక కార్యక్రమం. ఈ మేరకు ఏప్రిల్‌లో మలీషాను తమ సంస్థలోకి స్వాగతం పలుకుతూ ఓ అందమైన వీడియో షేర్ చేసింది ఫారెస్ట్ ఎసెన్షియల్స్. #BecauseYourDreamsMatter అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో బ్రాండ్ స్టోర్‌లోకి వెళ్లి అక్కడ ప్రదర్శనకు ఉంచిన తన ఫోటోలను చూస్తూ ఆనందంతో మురిసిపోతుంది. ఈ వీడియో.. నెటిజన్ల మనసు దోచుకుంటోంది. దీనికి 5 మిలియన్ల వ్యూస్, 4 లక్షలకు పైగా కామెంట్లు వచ్చాయి. ‘అందాన్ని చూసే ధృక్పథంలో మార్పు అవసరం. ఇది సామాన్యుడికి దక్కిన విజయం. ఇంత గొప్ప ఘనత అందుకున్న మలీషాకు అభినందనలు. భవిష్యత్తులో ఆమె మరింత ఎత్తుకు ఎదగాలి’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనిపై మలీషా మాట్లాడుతూ.. ఫారెస్ట్ ఎసెన్షియల్స్‌తో తన ప్రచారం ఇప్పటి వరకు తనకు దక్కిన పెద్ద గౌరవమని తెలిపింది. భవిష్యత్తులో మోడల్‌గా రాణించాలనుకుంటున్నట్లు పేర్కొంది. అందుకు చదవును నిర్లక్ష్యం చేయనని.. చదువే తన మొదటి ప్రధాన్యమని తెలిపింది. View this post on Instagram A post shared by @forestessentials కాగా మూడేళ్ల కిత్రం 2020లో మలీషా ప్రతిభను హాలీవుడ్ డైరెక్టర్ రాబర్ట్ హాఫ్మన్ గుర్తించారు. ఆమె కోసం గో ఫండ్ మీ పేజ్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2, 25,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల అనేక మోడలింగ్ ప్రదర్శనలు ఇచ్చింది. ర్సాలా ఖురేషి, జాన్ సాగూ రూపొందించిన ‘లివ్ యువర్ ఫెయిరీటేల్’ అనే షార్ట్ ఫిల్మ్‌లో కూడా నటించింది. -
పాక్ కెప్టెన్‌పై షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజంపై జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాబర్‌కు ఇంగ్లీష్ అంతగా రాదని.. అందుకనే తమ దేశంలో అతను బ్రాండ్ అంబాసిడర్ కాలేకపోయాడంటూ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా అక్తర్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్తర్ మాట్లాడుతూ..''పాకిస్థాన్‌లో ఇంగ్లీష్ చక్కగా మాట్లాడగల క్రికెటర్లు ఎవరైనా ఉన్నారంటే?.. అది నేను, షాహిద్ ఆఫ్రిది, వసీం అక్రమ్ మాత్రమే. అందుకనే మా ముగ్గురికే అన్ని వ్యాపార, వాణిజ్య ప్రకటనలు వస్తాయి. ఎందుకంటే.. మేము ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడడం అనే విషయాన్ని ఒక జాబ్‌గా భావించాం. ఇక క్రికెట్లో రాణించడం ఒక ఎత్తు అయితే.. మీడియాతో మాట్లాడడం, వాళ్ల ప్రశ్నలకు బదులివ్వడం అనేది మరొక ఎత్తు. ప్రస్తుతం పాక్ జట్టులో ఉన్న ఎవరూ పెద్దగా ఇంగ్లీష్ మాట్లాడలేరు. అవార్డు ప్రజెంటేషన్ సమయంలో వాళ్లకు ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. బాబర్ ఆజం ఎప్పుడైనా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడేటప్పుడు గమనించండి. హిందీ, ఇంగ్లీష్ మిక్స్ చేసి మాట్లాడడం చూస్తుంటాం. బాబర్‌కు తన గురించి, తన ఆట గురించి కూడా ఇంగ్లీష్‌లో వర్ణించడం రాదు. ఒకవేళ అతను అనర్గళంగా, చక్కగా ఆంగ్లం మాట్లాడగలిగితే పాకిస్థాన్‌లో నంబర్ 1 బ్రాండ్ అంబాసిడర్ అయ్యేవాడు. అయినా ఇంగ్లీష్ నేర్చుకోవడం పెద్ద కష్టమైన పనా?'' అని అక్తర్ ప్రశ్నించాడు. ఇక పాకిస్తాన్ క్రికెటలో తన ఆటతో అక్తర్ చెరగని ముద్ర వేశాడు. 1997లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అక్తర్ 2011లో ఆటకు గుడ్‌బై చెప్పాడు. వేగానికి మారుపేరైన అక్తర్ పాకిస్తాన్ తరపున 46 టెస్టుల్లో 178 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు, 15 టి20 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ క్రికెట్లో వేగవంతమైన బంతి వేసిన బౌలర్‌గా షోయబ్ అక్తర్ రికార్డు సృష్టించాడు. 2003లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో అక్తర్ గంటకు 161.3. కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు. అక్తర్ తర్వాత ఎందరో ఫాస్ట్ బౌలర్లు వచ్చినప్పటికి అక్తర్ రికార్డు మాత్రం పదిలంగా ఉంది. Former Pakistan speedster Shoaib Akhtar says Babar Azam cannot speak and hence he is not the biggest brand in Pakistan. Modern-day cricketers in Pakistan cannot speak on media, TV or in post-match presentations. Do you agree with this statement? pic.twitter.com/xMrNwYQe1X — Farid Khan (@_FaridKhan) February 21, 2023 చదవండి: 'బజ్‌బాల్' ఎలా అడ్డుకోవాలి?.. ఫ్యాన్స్‌ను వేడుకున్న కివీస్ టాప్ వెబ్సైట్ 10 వికెట్ల తేడాతో విజయం.. దర్జాగా సెమీస్‌కు -
పీలే క్రేజ్‌కు ఉదాహరణ.. షూ లేస్ కట్టుకున్నందుకు రూ.కోటి
బ్రెజిల్‌కి మూడు ఫిఫా వరల్డ్ కప్స్ (1958, 1962, 1970) అందించిన పీలే... బ్రాండ్స్‌కి మార్కెటింగ్ చేయడంలోనూ తన మార్కు చూపించారు. రెండు ప్రపంచ కప్స్ గెలిచిన తర్వాత పీలే ఫిఫా వరల్డ్‌లో తిరుగులేని సూపర్ స్టార్‌గా వెలుగొంతున్న సమయంలో ఆయనతో బ్రాండ్ ప్రమోషన్ చేయించాలని కంపెనీలన్నీ క్యూ కట్టాయి. 1970లో స్పోర్ట్స్ షూస్ కంపెనీ పూమా, పీలేతో బ్రాండ్ ప్రమోషన్‌కి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే సాధారణంగా ప్రమోట్ చేస్తే కుదురదని బ్రాండ్ ప్రమోషన్ కోసం ఓ వినూత్న ప్లాన్‌ను వాడింది పూమా. 1970 వరల్డ్ కప్ సమయంలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో పూమా, తన షూ లేస్‌ని కట్టుకోవడం మొదలెట్టాడు.. అంతే కంపెనీకి కోట్ల రూపాయాల్లో టర్నోవర్ వచ్చింది. కేవలం మ్యాచ్ ఆరంభానికి ముందు షూ లేస్ కట్టుకున్నందుకు 120000 డాలర్లు (దాదాపు కోటి రూపాయల వరకూ) పీలేకి ముట్టచెప్పింది పూమా కంపెనీ. మ్యాచ్ సమయంలో పీలే షూ లేస్ కట్టుకోవడం వల్ల పూమా కంపెనీకి కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి. అప్పట్లో పీలేకి ఎంతటి క్రేజ్ ఉండేదో చెప్పడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ మాత్రమే... తన సుదీర్ఘ కెరీర్లో తిరుగులేని రికార్డులెన్నో క్రియేట్ చేసిన పీలే... 1363 మ్యాచులు ఆడి 1283 గోల్స్ సాధించాడు. బ్రెజిల్ తరుపున 77 అంతర్జాతీయ గోల్స్ సాధించిన పీలే.. 1959లో ఒకే ఏడాదిలో 127 గోల్స్ సాధించి రికార్డు క్రియేట్ చేశాడు. చదవండి: పీలే టాప్-10 స్టన్నింగ్ గోల్స్‌పై లుక్కేయాల్సిందే 'పీలే'.. ఆ పేరు ఎలా వచ్చింది; అసలు పేరేంటి? -
డబ్బుల కోసం ఇలాంటి పనులు చేస్తావా? హీరోయిన్‌పై ట్రోలింగ్
Regina Cassandra Trolled For Promoting Whiskey: సాధారణంగా సెలబ్రిటీలు ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు యాడ్స్ చేస్తూ రెండు వైపులా సంపాదిస్తుంటారు. అయితే ఒక్కోసారి వాళ్లు చేసే ప్రమోషన్స్ వివాదాస్పదం అవుతుంటాయి. తాజాగా హీరోయిన్ రెజీనా కసాండ్రాకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఓ కంపెనీ అల్కహాల్ను ప్రమోట్ చేస్తూ చేతిలో మందు గ్లాసు పట్టుకొని స్టైల్‌గా ఫోజిచ్చిన రెజీనా ఇన్‌స్టా పోస్ట్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. డబ్బుల కోసం ఇలాంటి పనులు చేస్తావా అంటూ ఆమెను దుమ్మెత్తిపోస్తున్నారు. మధ్యపానం అనారోగ్యమని తెలిసినా డబ్బుల కోసం ఇలా ప్రమోట్ చేస్తారా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో నెటిజన్ అయితే.. ఈ ఫోటో చూశాక మీ మీద గౌరవం పోయింది. ఇప్పుడే మిమ్మల్ని అన్‌ఫాలో అవుతున్నాను అంటూ కామెంట్ చేశారు. ఇక ఇటీవలె పొగాకు బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నందుకు అమితాబ్‌పై విమర్శలు రావడంతో ఆ యాడ్ నుంచి ఆయన తప్పుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Regina Cassandra (@reginaacassandraa) -
75వేల కోట్ల కంపెనీ ..! అందులో అమితాబ్ బచ్చన్ ఎంట్రీ...!
ప్రపంచవ్యాప్తంగా సంప్రాదాయ కరెన్సీ స్థానాల్లో పలు డిజిటల్ కరెన్సీలు(క్రిప్టోకరెన్సీలు) గణనీయమైన అభివృద్ధిని సాధిస్తున్నాయి. ప్రపంచదేశాల్లోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోని ప్రజలు క్రిప్టోకరెన్సీలను భారీగా ఆదరిస్తున్నారు. క్రిప్టోకరెన్సీకు స్వీకరణలో భారత్ రెండో స్థానంలో నిలవడం గమనర్హం. క్రిప్టోకరెన్సీపై పలు కంపెనీల దృష్టి..! క్రిప్టోకరెన్సీపై భారతీయులు ఎక్కువ ఆదరణను చూపడంతో పలు ఫిన్‌టెక్ కంపెనీలు క్రిప్టోకరెన్సీపై పలు ఇన్వెస్టర్లకు థర్డ్‌పార్టీ వెండర్‌గా ఉండేందుకు సమయాత్తం అయ్యాయి. ఇప్పటికే కాయిన్స్‌స్విచ్, వజీర్ఎక్స్, కాయిన్‌డీసీఎక్స్ వంటి కంపెనీలు క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్ట్‌చేసేవారికి వారధిగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా భారత ప్రజల్లో క్రిప్టోకరెన్సీపై మరింత అవగాహన కల్పించడం కోసం పలు దిగ్గజ నటీనటులను బ్రాండ్ అంబాసిడర్స్‌గా నియమించుకుంటున్నాయి. చదవండి: బిగ్‌బీ ఆగయా..! కాయిన్స్‌డీసీఎక్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ నియమితులయ్యారు. ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు ఎడ్వర్డో సావెరిన్స్ బి క్యాపిటల్ గ్రూప్, ఇతర ఇన్వెస్టర్లతో సారథ్యం వహించిన సిరీస్-సి ఫండింగ్ రౌండ్లో కాయిన్‌డీసీఎక్స్ సుమారు 90 మిలియన్ డాలర్లను సేకరించి భారత తొలి క్రిప్టో యునికార్న్‌గా అవతరించింది. అమితాబ్ బచ్చన్ కొద్ది రోజుల క్రితమే వారి నాన్ ఫంగిబుల్ టోకెన్‌ను కూడా ప్రారంభించారు. అమితాబ్ రాకతో క్రిప్టోకరెన్సీపై భారత్‌లో మరింత అవగాహన వస్తోందని కాయిన్ డీసీఎక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుమిత్ గుప్తా అభిప్రాయపడ్డారు. చదవండి: క్రిప్టో కరెన్సీ బ్యాన్.. చైనా కాదు కదా ఏదీ ఏం చేయలేవు -
టైడ్ ప్రచారకర్తగా ఆయుష్మాన్ ఖురానా
ముంబై: ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ ఇండియాకు చెందిన ‘టైడ్’ బ్రాండ్‌కు బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. వాషింగ్ మెషిన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన టైడ్ ఆల్ట్రా పౌడర్‌కు ఈయన నటించిన తొలి ప్రకటనను ఇప్పటికే పూర్తి చేసినట్లు కంపెనీ ప్రకటించింది. బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం జరగక ముందు వరకు టైడ్ అవాక్కయ్యారా ప్రకటనలు చూసి ఇష్టపడిన తాను.. ఇప్పుడు స్వయంగా బ్రాండ్‌కు ప్రచారకర్తగా ఉండడం సంతోషంగా ఉందని ఆయుష్మాన్ అన్నారు. -
ఏపీకి కొత్త బ్రాండ్ అంబాసిడర్.. సూర్యుడు
సాక్షి, విజయవాడ : రాష్ట్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కీలక అగుడు వేశారు. ఏకంగా సూర్యుడినే ఆంధ్రప్రదేశ్‌కు సరికొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. సూర్యుడు జస్టిస్ చౌదరి లాంటివాడని, అందరికీ సమన్యాయం చేస్తాడని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆదివారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ‘సూర్యారాధన’ కార్యక్రమంలో సీఎం ఈమేరకు ప్రటకటన చేశారు. ఇక్కడి నుంచే సూర్యోదయం : ‘అన్ని మతాల్లో సూర్యుడికి విశిష్టమైన స్థానం ఉంది. పొడవైన తీరప్రాంతామున్న ఏపీ నుంచే సూర్యుడు ఉదయిస్తున్నందున దీనిని ‘సన్ రైజ్ స్టేట్’గా నినాదం ఇచ్చాం. అందులో భాగంగానే సూర్యుడిని బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించాం. సూర్యారాధన కార్యక్రమాన్ని రాష్ట్ర వేడుకగా ప్రతి ఏటా నిర్వహిస్తాం’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టెక్నాలజీ కాదు ప్రకృతే ముఖ్యం : సూర్యారాధన కార్యక్రమం.. మతాలకు సంబంధంలేదని, శుద్ధ శాస్త్రవిజ్ఞానమని ముఖ్యమంత్రి వివరించారు. సూర్యకాంతితో ఎన్నో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని, టెక్నాలజీ కంటే ప్రకృతితో మమేకం కావడడానికే ప్రాధాన్యం ఇస్తానని, అందుకే జలహారతి, నీరుచెట్టు లాంటి ప్రకృతి సంబంధిత కార్యక్రమాలు చేపట్టామని చంద్రబాబు గుర్తుచేశారు. -
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్రాండ్ అంబాసిడర్‌గా అఖిల్
హైదరాబాద్: రిటైల్ రంగంలో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్రాండ్ అంబాసిడర్‌గా అఖిల్ అక్కినేని నియమితులయ్యారు. రిటైల్‌లో వేగంగా దూసుకుపోతున్న బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా అఖిల్ అన్నారు. శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అందరికీ అభిమాన షాపింగ్ మాల్ అని చెప్పారు. యువ కస్టమర్లతో అనుసంధానానికి అఖిల్ సరైన జోడి అని సంస్థ ఎండీ సురేశ్ సీర్న అభిప్రాయపడ్డారు. అయిదేళ్లలో నంబర్ వన్ ఫ్యామిలీ షాపింగ్ మాల్గా సంస్థ రూపుదిద్దుకుందని డెరైక్టర్ స్పందన పొట్టి తెలిపారు. హైదరాబాద్‌లోని కొత్తపేటలో తొలి మాల్తో ప్రారంభమైన సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కు కూకట్పల్లి, అమీర్‌పేటతోపాటు విజయవాడలో స్టోర్లు ఉన్నాయి. ఇంటిల్లిపాదికీ అవసరమైన దుస్తులు, యాక్సెసరీస్ కేంద్రంగా వీటిని మలిచింది. త్వరలో హైదరాబాద్‌లోని అత్తాపూర్‌తోపాటు గుంటూరులో ఔట్లెట్లను తెరవనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన పట్టణాల్లో ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ ప్రకటించింది. మీడియా సమావేశంలో రాకేశ్, అభినయ్, కేశవ్ పాల్గొన్నారు.