సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్రాండ్ అంబాసిడర్‌గా అఖిల్ | akhil the brand ambassador of South India Shopping Mall | Sakshi
Sakshi News home page

సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్రాండ్ అంబాసిడర్‌గా అఖిల్

Published Sat, Dec 5 2015 2:17 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 PM

సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్రాండ్ అంబాసిడర్‌గా అఖిల్

సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్రాండ్ అంబాసిడర్‌గా అఖిల్

హైదరాబాద్: రిటైల్ రంగంలో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్రాండ్ అంబాసిడర్‌గా అఖిల్ అక్కినేని నియమితులయ్యారు. రిటైల్‌లో వేగంగా దూసుకుపోతున్న బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా అఖిల్ అన్నారు. శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అందరికీ అభిమాన షాపింగ్ మాల్ అని చెప్పారు. యువ కస్టమర్లతో అనుసంధానానికి అఖిల్ సరైన జోడి అని సంస్థ ఎండీ సురేశ్ సీర్న అభిప్రాయపడ్డారు.

అయిదేళ్లలో నంబర్ వన్ ఫ్యామిలీ షాపింగ్ మాల్‌గా సంస్థ రూపుదిద్దుకుందని డెరైక్టర్ స్పందన పొట్టి తెలిపారు. హైదరాబాద్‌లోని కొత్తపేటలో తొలి మాల్‌తో ప్రారంభమైన సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కు కూకట్‌పల్లి, అమీర్‌పేటతోపాటు విజయవాడలో స్టోర్లు ఉన్నాయి. ఇంటిల్లిపాదికీ అవసరమైన దుస్తులు, యాక్సెసరీస్ కేంద్రంగా వీటిని మలిచింది. త్వరలో హైదరాబాద్‌లోని అత్తాపూర్‌తోపాటు గుంటూరులో ఔట్‌లెట్లను తెరవనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన పట్టణాల్లో ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ ప్రకటించింది. మీడియా సమావేశంలో రాకేశ్, అభినయ్, కేశవ్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement