కాబోయే భార్యతో అఖిల్ అక్కినేని.. పెళ్లి పనులు మొదలైనట్టేనా? | Tollywood Hero AKhil Akkineni With His Engagement Girl Zainab Ravdjee | Sakshi
Sakshi News home page

AKhil Akkineni: కాబోయే భార్యతో అఖిల్ అక్కినేని.. పెళ్లి పనులు మొదలైనట్టేనా?

Published Wed, Feb 19 2025 4:57 PM | Last Updated on Wed, Feb 19 2025 5:40 PM

Tollywood Hero AKhil Akkineni With His Engagement Girl Zainab Ravdjee

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ గతేడాది నిశ్చితార్థం చేసుకుని అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. జైనాబ్ రవ్జీ అనే అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభించేందుకు రెడీ అయిపోయాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అక్కినేని నాగార్జున పంచుకున్నారు. అయితే ‍అఖిల్ ఎంగేజ్‌మెంట్‌ తర్వాత నాగచైతన్య వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ శోభిత దూళిపాలను చైతూ పెళ్లాడారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఇక అక్కినేని అభిమానులంతా అఖిల్ పెళ్లి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ ఏడాదిలోనే అఖిల్ పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. వచ్చేనెలలోనే అఖిల్- జైనాబ్‌ ఒక్కటి కాబోతున్నట్లు సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే మార్చి 24న గ్రాండ్‌ వెడ్డింగ్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది తాజా వీడియో. అఖిల్ అక్కినేని తనకు కాబోయే భార్య జైనాబ్‌ రవ్జీతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. దీంతో పెళ్లి పనులు మొదలైనట్లేనని కొందరు అభిమానులు భావిస్తున్నారు. ఇద్దరు కలిసి జంటగా వెళ్తున్న వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఇది చూసిన కొందరు నెటిజన్స్‌ అక్కినేని వారి చిన్న కోడలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. గతేడాది నవంబర్ 26న జైనాబ్ రావ్‌జీతో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. అయితే వీరి పెళ్లికి  సంబందించిన అధికారిక ప్రకటనైతే ఇంకా రావాల్సి ఉంది.

ఇక సినిమాల విషయాకొనిస్తే.. అఖిల్ అక్కినేని 1994లో  సిసింద్రీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత 2 015 అఖిల్ మూవీతో హీరోగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ వంటి చిత్రాలతో అభిమానులను మెప్పించారు. ప్రస్తుతం సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌తో బిజీగా ఉన్నారు అఖిల్. ప్రముఖ పారిశ్రామిక వేత్త జుల్ఫీ రవ్జీ కూతురే జైనాబ్.. ఆమెకు స్కిన్ కేర్‌కి సంబంధించిన కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. భారత్, దుబాయి, లండన్‌లో జైనాబ్ పెరిగింది. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న అఖిల్-జైనాబ్ త్వరలోనే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నారు.
 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement