Zainab Ravdjee
-
కాబోయే భార్యతో అక్కినేని అఖిల్.. పెళ్లి కళ వచ్చేసిందా?
టాలీవుడ్లో అక్కినేని హీరో అఖిల్ ఏజెంట్ మూవీ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయలేదు. 2023లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి మిక్స్డ్ టాక్ రావడంతో ఓటీటీ రిలీజ్ కూడా ఆలస్యమైంది. ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. అఖిల్ ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్ ప్రకటించకపోవడంతో ఫ్యాన్స్ కాస్తా నిరాశకు గురవుతున్నారు. అయితే త్వరలోనే అఖిల్ బర్త్ డే సందర్భంగా కొత్త సినిమాను అనౌన్స్ చేయనున్నట్లు నిర్మాత నాగవంశీ ఇప్పటికే ట్విటర్ ద్వారా హింట్ ఇచ్చాడు.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. అఖిల్ త్వరలోనే వివాహాబంధంలోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన ప్రియురాలు జైనాబ్ రావ్జీతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఈ ఏడాది మార్చిలోనే పెళ్లి పీటలెక్కుతారని టాక్ వినిపించింది. కానీ అలా జరగలేదు. దీంతో మరోసారి టాలీవుడ్లో అఖిల్ పెళ్లి ఎప్పుడనే విషయంపై చర్చ మొదలైంది.ోఈ నేపథ్యంలో త్వరలోనే పెళ్లి చేసుకోబోయే అఖిల్, జైనాబ్ జంటగా కనిపించారు. హైదరాబాద్ విమానాశ్రయంలో ఒకరి చేయి ఒకరు పట్టుకుని సందడి చేశారు. ఇది చూసిన నెటిజన్స్.. చూడ ముచ్చటగా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే వీరి పెళ్లి పనులతో బిజీగా ఉన్నారేమో అంటూ పోస్టులు పెడుతున్నారు. వీరిద్దరు జంటగా వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి అఖిల్ పెళ్లిపై చర్చ మొదలైంది. అయితే ఈనెల 8న అఖిల్ పుట్టినరోజు కావడంతో సెలబ్రేట్ చేసుకునేందుకు వెళ్లారా? అని మరికొందరు చర్చించుకుంటున్నారు. #TFNExclusive: Hero @AkhilAkkineni8 and #ZainabRavdjee get papped walking hand in hand at the Hyderabad airport!!❤️📸#AkhilAkkineni #Akhil6 #TeluguFilmNagar pic.twitter.com/oDD6SU2sMq— Telugu FilmNagar (@telugufilmnagar) April 6, 2025 -
కాబోయే భార్యతో అఖిల్ అక్కినేని.. పెళ్లి పనులు మొదలైనట్టేనా?
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ గతేడాది నిశ్చితార్థం చేసుకుని అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. జైనాబ్ రవ్జీ అనే అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభించేందుకు రెడీ అయిపోయాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అక్కినేని నాగార్జున పంచుకున్నారు. అయితే అఖిల్ ఎంగేజ్మెంట్ తర్వాత నాగచైతన్య వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ శోభిత దూళిపాలను చైతూ పెళ్లాడారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఇక అక్కినేని అభిమానులంతా అఖిల్ పెళ్లి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ ఏడాదిలోనే అఖిల్ పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. వచ్చేనెలలోనే అఖిల్- జైనాబ్ ఒక్కటి కాబోతున్నట్లు సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే మార్చి 24న గ్రాండ్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది తాజా వీడియో. అఖిల్ అక్కినేని తనకు కాబోయే భార్య జైనాబ్ రవ్జీతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. దీంతో పెళ్లి పనులు మొదలైనట్లేనని కొందరు అభిమానులు భావిస్తున్నారు. ఇద్దరు కలిసి జంటగా వెళ్తున్న వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ అక్కినేని వారి చిన్న కోడలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. గతేడాది నవంబర్ 26న జైనాబ్ రావ్జీతో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. అయితే వీరి పెళ్లికి సంబందించిన అధికారిక ప్రకటనైతే ఇంకా రావాల్సి ఉంది.ఇక సినిమాల విషయాకొనిస్తే.. అఖిల్ అక్కినేని 1994లో సిసింద్రీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత 2 015 అఖిల్ మూవీతో హీరోగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ వంటి చిత్రాలతో అభిమానులను మెప్పించారు. ప్రస్తుతం సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌తో బిజీగా ఉన్నారు అఖిల్. ప్రముఖ పారిశ్రామిక వేత్త జుల్ఫీ రవ్జీ కూతురే జైనాబ్.. ఆమెకు స్కిన్ కేర్‌కి సంబంధించిన కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. భారత్, దుబాయి, లండన్‌లో జైనాబ్ పెరిగింది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్-జైనాబ్ త్వరలోనే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నారు. Dhisti Teeyandra..😍😍Chinnodu ,Chinna Vadhina Merisipothunaru Iddharu ..😍#akhilakkineni & #zainabravdjee 👩❤️👨 pic.twitter.com/c9ovnyfnyc— 𝗖𝗵𝗮𝘆-𝗦𝗮𝗶 ⛓️ (@SaiNavabathula) February 18, 2025 Anna style vere level #Akhil6 #akhilakkineni pic.twitter.com/cfy3ZBOMUQ— SAITEJA VARMA (@Missile_Saiteja) February 18, 2025 -
అక్కినేని చిన్న కోడలు అఖిల్ కంటే వయసులో ఎన్నేళ్లు పెద్దో తెలుసా..?
-
హీరో అఖిల్‌తో ప్రేమ-నిశ్చితార్థం.. ఎవరీ జైనాబ్?
హీరో నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య-శోభితల పెళ్లి మరో వారం రోజుల్లో అంటే డిసెంబరు 4న జరగనుంది. ఇంతలోనే తన చిన్న కొడుకు అఖిల్ నిశ్చితార్థం జరిగిపోయిందని ప్రకటించారు. జైనాబ్ రవ్జీ అనే అమ్మాయి తమ ఇంటికి కోడలు కాబోతుందని ప్రకటించారు. అంతా బాగానే ఉంది కానీ అసలు ఎవరీ అమ్మాయి? సినిమా నటి లేదా మోడల్ అనేది ప్రశ్నగా మారింది.(ఇదీ చదవండి: హమ్మయ్యా.. 'పుష్ప 2' షూటింగ్ ఇన్నాళ్లకు పూర్తి)అఖిల్ చేసుకోబోయే అమ్మాయి పేరు జైనాబ్ రవ్జీ అని.. ఈమె ఓ ఆర్టిస్ అని మాత్రమే బయటపెట్టారు. అంతకు మించి ఒక్క డీటైల్ కూడా చెప్పలేదు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈమెది హైదరాబాద్. కానీ లండన్, దుబాయిలో చదువంతా పూర్తి చేసిందట. హైదరాబాద్‌లోనే గతంలో రిఫ్లెక్షన్ పేరుతో ఆర్ట్ గ్యాలరీలో పెయింట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. అందులో ఈమె వేసిన మోడ్రన్, అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్‌ని కూడా ప్రదర్శించారట.జైనాబ్ ప్రస్తుతం ముంబైలో నివసిస్తోందట. ఇన్ స్టాలో ఈమెకు ఖాతా ఉంది గానీ అది ప్రైవేట్‌లో ఉంది. అఖిల్ ఈమెని చాలా ఏళ్లుగా ప్రేమించాడని చెప్పారు కానీ వీళ్లిద్దరూ ఎక్కడ ఎప్పుడు పరిచయమైంది ప్రస్తుతానికి సస్పెన్స్. బహుశా ఏదైనా పెయింటింగ్ ఎగ్జిబిషన్లో వీళ్లిద్దరూ పరిచయమై, అది ప్రేమగా మారిందేమో? అలానే జైనాబ్.. అఖిల్ కంటే వయసులో పెద్దది అనే మాట కూడా వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంతనేది తెలియాలి.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ ఫేమ్, నటితో సిరాజ్ డేటింగ్?.. రూమర్లకు కారణం ఇదే!) View this post on Instagram A post shared by Akhil Akkineni (@akkineniakhil) -
నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చిన అక్కినేని అఖిల్
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నిశ్చితార్థం చేసుకున్నాడు. జైనాబ్ రవ్జీ అనే అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. హైదరాబాద్‌లోని నాగార్జున ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఈ క్రమంలో అఖిల్.. తన నిశ్చితార్థం ఫొటోలని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఇలా సడన్ సర్ప్రైజ్ ఇచ్చేసరికి అందరూ అవాక్కవుతున్నారు.(ఇదీ చదవండి: శివంగి మళ్లీ గెలుపు.. బిగ్‌బాస్ 8 తొలి ఫైనలిస్ట్ ఎవరంటే?)ప్రముఖ పారిశ్రామిక వేత్త జుల్ఫీ రవ్జీ కూతురే జైనాబ్ అని తెలుస్తోంది. ఈమెకు స్కిన్ కేర్‌కి సంబంధించిన కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. భారత్, దుబాయి, లండన్‌లో ఈమె పెరిగింది. కొన్నాళ్ల క్రితంగా ప్రేమలో ఉన్న అఖిల్-జైనాబ్.. పెద్దల్ని ఒప్పించి ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు. వచ్చే ఏడాది పెళ్లి ఉంటుందని అక్కినేని ఫ్యామిలీ ప్రకటించింది. ప్రస్తుతం అఖిల్ కాబోయే భార్య ఎవరా అని సోషల్ మీడియాలో అందరూ తెగ వెతికేస్తున్నారు. ఇకపోతే అఖిల్-జైనబ్‌ని ఆశీర్వదించాలని నాగార్జున అక్కినేని కోరారు. ఇదలా ఉండగా నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య-శోభిత.. డిసెంబరు 4న హైదరాబాద్‌లో వివాహం చేసుకోబోతున్నారు. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీకి పెళ్లికళ వచ్చేసింది.(ఇదీ చదవండి: అమ్మాయిలకే 'సెకండ్ హ్యాండ్' లాంటి ట్యాగ్ ఎందుకు?: సమంత)