నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చిన అక్కినేని అఖిల్ | Akhil Akkineni Engagement Pics And Wife Details | Sakshi
Sakshi News home page

Akhil Akkineni Engagement: హీరో అఖిల్ ఎంగేజ్‌మెంట్.. అమ్మాయి ఎవరంటే?

Published Tue, Nov 26 2024 5:25 PM | Last Updated on Tue, Nov 26 2024 6:17 PM

Akhil Akkineni Engagement Pics And Wife Details

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నిశ్చితార్థం చేసుకున్నాడు. జైనాబ్ రవ్జీ అనే అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. హైదరాబాద్‌లోని నాగార్జున ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఈ క్రమంలో అఖిల్.. తన నిశ్చితార్థం ఫొటోలని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఇలా సడన్ సర్‪‌ప్రైజ్ ఇచ్చేసరికి అందరూ అవాక్కవుతున్నారు.

(ఇదీ చదవండి: శివంగి మళ్లీ గెలుపు.. బిగ్‌బాస్ 8 తొలి ఫైనలిస్ట్ ఎవరంటే?)

ప్రముఖ పారిశ్రామిక వేత్త జుల్ఫీ రవ్జీ కూతురే జైనాబ్ అని తెలుస్తోంది. ఈమెకు స్కిన్ కేర్‌కి సంబంధించిన కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. భారత్, దుబాయి, లండన్‌లో ఈమె పెరిగింది. కొన్నాళ్ల క్రితంగా ప్రేమలో ఉన్న అఖిల్-జైనాబ్.. పెద్దల్ని ఒప్పించి ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు. 

వచ్చే ఏడాది పెళ్లి ఉంటుందని అక్కినేని ఫ్యామిలీ ప్రకటించింది. ప్రస్తుతం అఖిల్ కాబోయే భార్య ఎవరా అని సోషల్ మీడియాలో అందరూ తెగ వెతికేస్తున్నారు. ఇకపోతే అఖిల్-జైనబ్‌ని ఆశీర్వదించాలని నాగార్జున అక్కినేని కోరారు. ఇదలా ఉండగా నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య-శోభిత.. డిసెంబరు 4న హైదరాబాద్‌లో వివాహం చేసుకోబోతున్నారు. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీకి పెళ్లికళ వచ్చేసింది.

(ఇదీ చదవండి: అమ్మాయిలకే 'సెకండ్‌ హ్యాండ్‌' లాంటి ట్యాగ్‌ ఎందుకు?: సమంత)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement