సెకండ్‌ హ్యాండ్‌.. అమ్మాయిలకే అలాంటి ట్యాగ్‌ ఎందుకు?: సమంత | Samantha Ruth Prabhu Reveals She Spent Ridiculous Money On Expensive Gifts For Ex, Is She Saying About Naga Chaitanya? | Sakshi
Sakshi News home page

నా మాజీకి ఖరీదైన గిఫ్టులిచ్చా.. అదే అనవసరపు ఖర్చు : సమంత

Nov 26 2024 10:43 AM | Updated on Nov 26 2024 11:53 AM

Samantha Reveals She Spent Ridiculous Money On Expensive Gifts For Ex

సమంత, నాగచైతన్య విడాకులు తీసుకొని ఏళ్లు గడుతుస్తున్నా..ఇప్పటికీ వీరిద్దరిపై ఏదో ఒక పుకారు వస్తున్నే ఉన్నాయి. అయితే అటు చైతూ కానీ ఇటు సామ్‌ కానీ వాటిని పెద్దగా పటి​ంచుకోకుండా తమ పనిలో బిజీ అయిపోయారు. ప్రస్తుతం చైతన్య ‘తండేల్‌’ సినిమా చేస్తున్నాడు. ఇక సమంత ఇటీవల విడుదలైన ‘సిటాడెల్‌’ వెబ్‌సిరీస్‌ ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది. నవంబర్‌ 7 నుంచి ఈ వెబ్‌ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా సమంత తాజాగా వరుణ్‌ ధావన్‌తో కలిసి సరదా చిట్‌ చాట్‌ నిర్వహించింది. అందులో తన మాజీ భర్త నాగ చైతన్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఖరీదైన బహుమతులు ఇచ్చా
సమంతతో వరుణ్‌ ధావన్‌ ‘స్పైసీ రాపిడ్‌ ఫైర్‌’ నిర్వహించాడు. అందులో భాగంగా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం ఇష్టంలేకపోతే పచ్చిమిర్చి తినాలి. ఈ క్రమంలో వరుణ్‌ అడుగుతూ.. ‘నీ జీవితంలో అవసరం లేకపోయినా అత్యధిక డబ్బులు దేని కోసం ఖర్చు చేశారు?’ అని అడిగాడు.

వరుణ్‌ ప్రశ్నకు సమంత సమాధానం చెబుబూత.. ‘నా మాజీ కోసం ఖరీదైన బహుమతులు కొనుగోలు చేశాను’ అని చెప్పింది. ‘వాటి ధర ఎంత ఉంటుంది?’అని వరుణ్‌ అడగ్గా.. ‘కాస్త ఎక్కువే..ఇక విషయం మాట్లాడదామా’ అంటూ ఆ టాపిక్‌కు అక్కడితో చెక్‌ పెట్టింది. సామ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉన్న సమంత, నాగచైతన్యలు 2017లో పెళ్లి చేసుకున్నారు. దాదాపు నాలుగేళ్లు కలిసి కాపురం చేసిన తర్వాత 2021లో విడాకులు తీసుకున్నారు. 

అమ్మాయిలకే ఎందుకలా?
ఇక మరో ఇంటర్వ్యూలో విడాకుల సమయంలో తనపై వచ్చిన ట్రోలింగ్‌పై మాట్లాడుతూ.. ‘ ఇద్దరి మధ్య బంధం విచ్ఛిన్నమైతే అమ్మాయిలనే నిందిస్తారన్నారు. విడాకుల తర్వాత అమ్మాయిలకు ఈ సమాజం కొన్ని ట్యాగులను తలిగిస్తుంది. ‘సెకండ్‌ హ్యాండ్‌,యూజ్డ్‌’ అనే ట్యాగ్స్‌ని అమ్మాయిలకు మాత్రమే ఎందుకు యాడ్‌ చేస్తారో అర్థం కాదు. కష్టాల్లో ఉన్న అమ్మాయికి  ఇలాంటి మాటలు మరింత బాధను కలిగిస్తాయి. నా విడాకుల విషయంలో కూడా ఎన్నో అవాస్తవాలను ప్రచారం చేశారు. అవన్నీ అబద్దాలే కాబట్టి నేను స్పందించలేదు. కష్ట సమయంలో నా స్నేహితులు, కుటుంబసభ్యులుతో పాటు చాలా మంది నాకు మద్దతుగా నిలిచారు’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement