varun dawan
-
సెకండ్ హ్యాండ్.. అమ్మాయిలకే అలాంటి ట్యాగ్ ఎందుకు?: సమంత
సమంత, నాగచైతన్య విడాకులు తీసుకొని ఏళ్లు గడుతుస్తున్నా..ఇప్పటికీ వీరిద్దరిపై ఏదో ఒక పుకారు వస్తున్నే ఉన్నాయి. అయితే అటు చైతూ కానీ ఇటు సామ్ కానీ వాటిని పెద్దగా పటించుకోకుండా తమ పనిలో బిజీ అయిపోయారు. ప్రస్తుతం చైతన్య ‘తండేల్’ సినిమా చేస్తున్నాడు. ఇక సమంత ఇటీవల విడుదలైన ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్ ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది. నవంబర్ 7 నుంచి ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా సమంత తాజాగా వరుణ్ ధావన్‌తో కలిసి సరదా చిట్ చాట్ నిర్వహించింది. అందులో తన మాజీ భర్త నాగ చైతన్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఖరీదైన బహుమతులు ఇచ్చాసమంతతో వరుణ్ ధావన్ ‘స్పైసీ రాపిడ్ ఫైర్’ నిర్వహించాడు. అందులో భాగంగా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం ఇష్టంలేకపోతే పచ్చిమిర్చి తినాలి. ఈ క్రమంలో వరుణ్ అడుగుతూ.. ‘నీ జీవితంలో అవసరం లేకపోయినా అత్యధిక డబ్బులు దేని కోసం ఖర్చు చేశారు?’ అని అడిగాడు.వరుణ్ ప్రశ్నకు సమంత సమాధానం చెబుబూత.. ‘నా మాజీ కోసం ఖరీదైన బహుమతులు కొనుగోలు చేశాను’ అని చెప్పింది. ‘వాటి ధర ఎంత ఉంటుంది?’అని వరుణ్ అడగ్గా.. ‘కాస్త ఎక్కువే..ఇక విషయం మాట్లాడదామా’ అంటూ ఆ టాపిక్కు అక్కడితో చెక్ పెట్టింది. సామ్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉన్న సమంత, నాగచైతన్యలు 2017లో పెళ్లి చేసుకున్నారు. దాదాపు నాలుగేళ్లు కలిసి కాపురం చేసిన తర్వాత 2021లో విడాకులు తీసుకున్నారు. అమ్మాయిలకే ఎందుకలా?ఇక మరో ఇంటర్వ్యూలో విడాకుల సమయంలో తనపై వచ్చిన ట్రోలింగ్‌పై మాట్లాడుతూ.. ‘ ఇద్దరి మధ్య బంధం విచ్ఛిన్నమైతే అమ్మాయిలనే నిందిస్తారన్నారు. విడాకుల తర్వాత అమ్మాయిలకు ఈ సమాజం కొన్ని ట్యాగులను తలిగిస్తుంది. ‘సెకండ్ హ్యాండ్,యూజ్డ్’ అనే ట్యాగ్స్‌ని అమ్మాయిలకు మాత్రమే ఎందుకు యాడ్ చేస్తారో అర్థం కాదు. కష్టాల్లో ఉన్న అమ్మాయికి ఇలాంటి మాటలు మరింత బాధను కలిగిస్తాయి. నా విడాకుల విషయంలో కూడా ఎన్నో అవాస్తవాలను ప్రచారం చేశారు. అవన్నీ అబద్దాలే కాబట్టి నేను స్పందించలేదు. కష్ట సమయంలో నా స్నేహితులు, కుటుంబసభ్యులుతో పాటు చాలా మంది నాకు మద్దతుగా నిలిచారు’ అని చెప్పారు. -
నీ వెనుక నేనుంటా.. నెటిజన్ ప్రపోజల్‌కి సమంత ఎమోషనల్!
సమంత ప్రస్తుతం ‘సిటాడెల్: హనీ బన్నీ ’ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఆమె వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ముంబైతో పాటు పలు నగరాలు తిరుగుతూ వెబ్ సిరీస్‌ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తోంది. ఒకవైపు మీడియాతో ముచ్చటిస్తూనే..మరోవైపు సోషల్ మీడియా ద్వారా అభిమానులను పకలరిస్తోంది.వీలున్నప్పుడల్లా నెట్టింట సందడి చేసే సామ్..తాజాగా తన ఫాలోవర్స్, అభిమానులతో మాట్లాడేందుకు ఇన్‌స్టాలో చిట్‌చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నెటిజన్స్ ఆమెకు పలు ప్రశ్నలు సంధించారు. వాటన్నింటికి ఎంతో ఓపికగా సామ్ సమాధానం చెప్పింది. ఇక ఓ నెటిజన్ అయితే సమంతపై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ.. ‘నిన్ను చూస్తే గర్వంగా ఉంటుంది. నీకు తోడుగా ఎవ్వరు లేకపోతే.. ఆ సమయంలో నేను ఉంటా. ఐ లవ్ యూ సమంత’ అని కామెంట్ చేశాడు. నెటిజన్ ప్రపోజ్కి సమంత ఫిదా అయింది. మీ ప్రేమే నాకు బలం అంటూ ఎమోషనల్ అయింది. ‘సిటాడెల్’ భారీ అంచనాలుసమంత, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కలిసి నటిచిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’. ‘దీ ఫ్యామిలీమేన్’ వెబ్ సిరీస్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ నవంబర్ 7 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ప్రియాంక చోప్రా నటించిన అమెరిక్ వెబ్ సిరీస్ ‘సీటాడెల్’కి ఇది ఇండియన్ వెర్షన్. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి భారీ స్పందన వచ్చింది. ప్యామిలీమేన్ తరహాలో ఈ వెబ్ సిరీస్ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. ట్రైలర్ బట్టి చూస్తే.. ఇందులో సమంత భారీ యాక్షన్ సీన్స్ చేసినట్లు తెలుస్తోంది. భారీ అంచనాలతో వస్తోన్న ఈ వెబ్ సిరీస్ ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. -
మరో అతిథి పాత్రలో సల్మాన్ ఖాన్
అతిథి పాత్రలపై సల్మాన్ ఖాన్ ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నట్లున్నారు. ఆల్రెడీ వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న హిందీ చిత్రం ‘బేబీ జాన్’లో సల్మాన్ ఖాన్ ఓ అతిథి పాత్ర చేస్తున్నారు. అజయ్ దేవగన్ హీరోగా చేస్తున్న ‘సింగమ్ ఎగైన్’ సినిమాలోనూ సల్మాన్ ఓ గెస్ట్ రోల్ చేశారనే టాక్ బాలీవుడ్లో వినిపించింది. తాజాగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్న హిందీ మూవీ ‘వార్ 2’లో కూడా సల్మాన్ ఖాన్ ఓ అతిథి పాత్రలో కనిపించనున్నారనే టాక్ బాలీవుడ్లో తెరపైకి వచ్చింది. వైఆర్ఎఫ్ (యశ్ రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లో భాగంగా ‘వార్ 2’ చిత్రం తెరకెక్కుతోంది. ఆల్రెడీ ఈ స్పై యూనివర్స్‌లోని ‘టైగర్’ ఫ్రాంచైజీ చిత్రాల్లో సల్మాన్ ఖాన్ నటించారు. దీంతో ‘వార్ 2’లో సల్మాన్ ఖాన్ స్పైగా ఓ అతిథి ΄ాత్రను ΄ోషించేలా ఈ చిత్రదర్శకుడు అయాన్ ముఖర్జీ కథలో చిన్న మార్పు చేశారట. మరి... ‘వార్ 2’లో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఒకే సీన్లో కనిపిస్తే సినిమా ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పవచ్చు. ఇది నిజం అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆదిత్యా చో్ర΄ా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. -
శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. హీరో ఎవరంటే..?
యంగ్ బ్యూటీ శ్రీలీల తెలుగులో దూసుకెళుతున్నారు. ఇక ఆమె బాలీవుడ్ ఎంట్రీ గురించి ఏదో ఒక వార్త ప్రచారంలోకి వస్తూనే ఉంది. కొన్ని రోజుల క్రితం సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ నటించనున్న ఓ హిందీ చిత్రం ద్వారా శ్రీలీల బాలీవుడ్ అరంగేట్రం జరగనుందనే వార్త ప్రచారంలోకి వచ్చింది. తాజాగా హిందీలో ఆమె తొలి చిత్రం ఇది కాదన్నట్లుగా మరో వార్త వైరల్‌గా మారింది. వరుణ్ ధావన్ హీరోగా రూపొందనున్న చిత్రం ద్వారా హీరోయిన్గా శ్రీలీల బాలీవుడ్ తెరపై కనిపించనున్నారన్నది ఆ వార్త సారాంశం. ముక్కోణపు ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుందని టాక్. శ్రీలీల ఓ హీరోయిన్గా, మృణాల్ ఠాకూర్ మరో హీరోయిన్గా నటిస్తారట. కామెడీ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని దర్శకుడు డేవిడ్ ధావన్ తెరకెక్కించనున్నారని సమాచారం. జూలై నెల చివర్లో చిత్రీకరణ ఆరంభించి, అక్టోబర్‌లో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారట. మరి... శ్రీలీలకు హిందీలో ఇదే తొలి చిత్రం అవుతుందా? అనే ప్రశ్నకు సమాధానం తెలియా లంటే మరో నెల ఆగాల్సిందే. -
ప్యూబ్లో ఓ అంటావా మావ పాటకు డాన్స్ చేస్తూ రెచ్చిపోయిన సమంత
-
‘కాంతార’తరహాలో మరో చిత్రం.. మళ్లీ హిట్ కొట్టేనా!
టాలీవుడ్ బడా నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు. సినిమాల విషయంలో ఈయన తీసుకునే నిర్ణయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. డబ్బింగ్ సినిమాలను థియేటర్స్‌లో విడుదల చేసి భారీ కలెక్షన్స్‌ని రాబడుతూ రికార్డు సృష్టిస్తున్నాడు. కన్నడలో సూపర్ హిట్ అయిన ‘కాంతార’ చిత్రాన్ని తెలుగులో అక్టోబర్ 15న ‘గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్’ ద్వారా విడుదల చేసి హిట్ కొట్టాడు. ఈ సినిమా కలెక్షన్స్ చూసి టాలీవుడ్ ఆశ్చర్యపోయింది. విడుదలైన 2 వారాల్లోనే 45 కోట్లు వసూళ్లు సాధించి దాదాపుగా ఇప్పుడు 60 కోట్ల వసూళ్లను సాధించింది.ఒక డబ్బింగ్ సినిమా ఈ స్థాయిలో హిట్ అవుతుందనేది ఊహాతీతం. కానీ అల్లు అరవింద్ కంటెంట్‌ని నమ్మి ధైర్యంగా సినిమాను రిలీజ్ చేశాడు. ఇప్పుడు కాంతార తరహాలోనే ‘గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్’ నుంచి మరో డబ్బింగ్ చిత్రం రాబోతుంది. వరుణ్ ధావన్, కృతి సనన్ నటిస్తున్న ‘భేదియా’ చిత్రాన్ని తెలుగులో ‘తోడేలు’పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 25న తెలుగు రాష్ట్రాల్లో విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్ కు సాంగ్స్ కు అనూహ్య స్పందన లభిస్తోంది. మరోవైపు ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే వరుణ్ ధావన్, కృతిసనన్ కూడా నేరుగా హైదరాబాద్ విచ్చేసి ఈ సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొననున్నారు. కాంతారతో సూపర్ సక్సెస్ అందుకున్న ‘గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్’ ఇప్పుడు తోడేలు చిత్రంతో కూడా అదే స్థాయి విజయాన్ని సాధించుకుంటుంది అనే పరిణామాలు కనిపిస్తున్నాయి. -
స్కూల్ స్టార్ట్.. అడ్మిషన్స్ క్లోజ్
క్లాసులు స్టార్టయ్యాయి. ఆల్రెడీ స్టూడెంట్స్ కూడా వెళ్తున్నారు. అరె.. ఇదేమన్నా జూన్ నెలా! అడ్మిషన్స్ ఓపెన్ అవ్వడానికి. ఏప్రిల్ బాబూ.. సమ్మర్‌ను ఫుల్‌గా ఏంజాయ్ చేస్తున్నారు స్టూడెంట్స్ అంటే.. నిజమే.. కాకపోతే ఇది రియల్ స్కూల్ కాదు కదా. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2’ సినిమా కోసం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఓపెన్ చేసిన స్కూల్. అందుకే వేసవిలో ఓపెన్ చేశారు. గతేడాది నవంబర్‌లో అడ్మిషన్స్ స్టార్ట్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. టైగర్ ష్రాఫ్ హీరోగా పునీత్మల్హోత్రా దర్శకత్వంలో ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2’. ఆరేళ్ల క్రితం కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రానికి సీక్వెల్ ఇది. ఈ సినిమాతోనే వరుణ్‌ధావన్, అలియాభట్, సిద్ధార్థ్ మల్హోత్రా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, ప్రస్తుతం స్టార్ యాక్టర్స్‌గా మారిన సంగతి తెలిసిందే. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2’ షూటింగ్ మొదలైంది. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు చోటు ఉందని చిత్రబృందం అనౌన్స్ చేసింది. అనన్యపాండే సెలక్ట్ అయ్యిందనీ, మిగిలిన హీరోయిన్ పాత్రలో జాన్వీ కపూర్ లేదా సారా అలీఖాన్‌ను ఎంచుకునే స్కోప్ ఉందని బాలీవుడ్ టాక్. ఈ సినిమాలో ఫైనల్‌గా ఎవరు నటించనున్నారన్నది ఈ రోజు ఎనౌన్స్ చేస్తామని నిర్మాత కరణ్ జోహార్ పేర్కొన్నారు. నవంబర్‌లో ఓపెన్ అయిన కరణ్‌జోహార్ స్కూల్ అడ్మిషన్స్ ఈ రోజుతో క్లోజ్ కానున్నాయన్నమాట. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రాన్ని ఈ ఏడాది నవంబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
శ్రీదేవి ప్లేస్‌లో మాధురి
శ్రీదేవి అతిలోక సుందరి. అందంలో కానీ అభినయంలో కానీ పోటీ అనే ప్రసక్తి లేకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని రూల్ చేశారు. ఇటీవల దుబాయ్‌లో ఆమె దురదృష్టవశాత్తూ బాత్ టబ్‌లో పడి మరణించిన విషయం తెలిసిందే. ఇది జరగకముందే ‘2 స్టేట్స్’ ఫేమ్ అభిషేక్ వర్మ దర్శకత్వంలో ‘షిద్ధత్’ అనే సినిమాలో నటించటానికి అంగీకరించారట శ్రీదేవి. ఆమె హఠాన్మరణంతో ఆ ప్లేస్‌లో వేరే తారను తీసుకునే పనిలో పడింది చిత్రబృందం. పలువురు కథానాయికలను సంప్రదించారని సమాచారమ్. ఫైనల్లీ మాధురీ దీక్షిత్ ‘యస్’ చెప్పారు. ఈ విషయాన్ని శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ స్వయంగా వెల్లడించారు. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ‘‘అభిషేక్ వర్మ రూపొందించబోయే తదుపరి సినిమా మమ్మీ హృదయానికి చాలా దగ్గరైనది. ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నందుకు నేను, ఖుషీ, డాడీ మాధురీజీకి చాలా థాంక్‌ఫుల్‌గా ఉంటాం’’ అని పేర్కొన్నారామె. కరణ్ జోహార్ నిర్మించనున్న ఈ సినిమాలో వరుణ్ ధావన్, ఆలియా భట్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఇయర్ సెకండ్ హాఫ్‌లో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. -
మార్చి తర్వాత అక్టోబర్
... అదేంటి మార్చి తర్వాత ఏప్రిల్ రావాలి కదా. మరి మార్చి తర్వాత అక్టోబర్ రావడమేంటి అనుకుంటున్నారా? ప్రస్తుతం మా క్యాలెండర్ ఇలానే ఉంది అంటున్నారు బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్. ‘విక్కీ డోనార్, పీకు’ ఫేమ్ సూజిత్ సర్కార్ దర్శకత్వంలో వరుణ్ ధావన్, బనితా సంధూ జంటగా రూపొందిన చిత్రం ‘అక్టోబర్’. ఈ సినిమాకు సంబంధించిన చిన్న మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు వరుణ్ ధావన్. ఈ వీడియోలో జనవరి, ఫిబ్రవరి, మార్చి ఆ తర్వాత ఏప్రిల్ బదులుగా అక్టోబర్‌ను చూపిస్తుంది క్యాలెండర్. ఏప్రిల్ 13న ‘అక్టోబర్’ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. అందుకే మార్చి తర్వాత అక్టోబర్ అని వినూత్న రీతిలో విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ‘‘అక్టోబర్ సినిమా నాకు చాలా స్పెషల్. నటుడిగానే కాదు హ్యూమన్ బియింగ్గా కూడా ఈ సినిమా నా మీద చాలా ఇంపాక్ట్ చూపించింది. నేచర్‌తో లవ్‌లో పడిపోయా’’ అని పేర్కొన్నారు వరుణ్ ధావన్. ఈ సినిమా కేవలం 38 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకోవడం విశేషం. రైజింగ్ సన్ బ్యానర్ పై రోన్నీ లహరీ నిర్మించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. -
'ఆయనతో గడిపిన క్షణాలు ఇప్పటికీ గుర్తొస్తున్నాయి'
వరుస షూటింగ్ లతో నిద్ర కూడా లేకుండా బిజీగా గడుపుతున్న షారూఖ్ ఖాన్ గత రెండు రోజులుగా ఫ్యామిలీతోనే గడుపుతున్నాడు. శనివారం తన తండ్రి మీర్ తాజ్ మొహమ్మద్ ఖాన్ వర్థంతి సందర్భంగా ఆయనతో ఉన్న అనుబందాన్ని బాద్ షా అభిమానులతో పంచుకున్నాడు. తన తండ్రి మరణించి 35 సంవత్సరాలు పూర్తయినా ఆయనతో గడిపిన క్షణాలు ఇప్పటికీ గుర్తొస్తున్నాయంటూ ట్వీట్ చేశాడు. నిన్న కూడా ఆసక్తి కరమైన ట్వీట్ లతో అభిమానులను అలరించాడు షారూఖ్. షూటింగ్ లకు కాస్త బ్రేక్ దొరకటంతో ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. మొన్నటి వరకు దిల్వాలే సినిమా కోసం హైదరాబాద్ షెడ్యూల్ లో బిజీగా ఉన్న బాద్షా, శుక్రవారం ఉదయం కూడ అదే మూడ్ లో నిద్రలేచాడు. అయితే షూటింగ్ లేకపోవటంతో 'ఇవాళ ఇంకా చాలా సేపు పడుకునే ఛాన్స్ ఉంది, ఇంత కన్నా ఆనందం కలిగించే ఫీలింగ్ ఏముంటుంది' అంటూ ట్వీట్ చేశాడు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజోల్ హీరోయిన్గా నటిస్తుండగా, వరుణ్ ధావన్, కృతిసనన్లు ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. దిల్వాలే సినిమాకు సంబందించిన వర్క్ పూర్తి కాగానే ఫ్యాన్, రాయిస్ సినిమాల షూటింగ్లో పాల్గొననున్నాడు షారూఖ్. Yrs accumulate & our wounds turn into water, & reflect the unlikely glimmer of happiness in moments of remembrance.35 yrs since I saw my Dad — Shah Rukh Khan (@iamsrk) September 18, 2015