'ఆయనతో గడిపిన క్షణాలు ఇప్పటికీ గుర్తొస్తున్నాయి' | Sharukh khan tweets about his father and sleep | Sakshi
Sakshi News home page

'ఆయనతో గడిపిన క్షణాలు ఇప్పటికీ గుర్తొస్తున్నాయి'

Published Sat, Sep 19 2015 1:23 PM | Last Updated on Sun, Sep 3 2017 9:38 AM

'ఆయనతో గడిపిన క్షణాలు ఇప్పటికీ  గుర్తొస్తున్నాయి'

'ఆయనతో గడిపిన క్షణాలు ఇప్పటికీ గుర్తొస్తున్నాయి'

వరుస షూటింగ్ లతో నిద్ర కూడా లేకుండా బిజీగా గడుపుతున్న షారూఖ్ ఖాన్ గత రెండు రోజులుగా ఫ్యామిలీతోనే గడుపుతున్నాడు. శనివారం తన తండ్రి మీర్ తాజ్ మొహమ్మద్ ఖాన్ వర్థంతి సందర్భంగా ఆయనతో ఉన్న అనుబందాన్ని బాద్ షా అభిమానులతో పంచుకున్నాడు. తన తండ్రి మరణించి 35 సంవత్సరాలు పూర్తయినా ఆయనతో గడిపిన క్షణాలు ఇప్పటికీ  గుర్తొస్తున్నాయంటూ ట్వీట్ చేశాడు.

నిన్న కూడా ఆసక్తి కరమైన ట్వీట్ లతో అభిమానులను అలరించాడు షారూఖ్. షూటింగ్ లకు కాస్త బ్రేక్ దొరకటంతో ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. మొన్నటి వరకు దిల్వాలే సినిమా కోసం హైదరాబాద్ షెడ్యూల్ లో బిజీగా ఉన్న బాద్షా, శుక్రవారం ఉదయం కూడ అదే మూడ్ లో నిద్రలేచాడు. అయితే షూటింగ్ లేకపోవటంతో 'ఇవాళ ఇంకా చాలా సేపు పడుకునే ఛాన్స్ ఉంది, ఇంత కన్నా ఆనందం కలిగించే ఫీలింగ్ ఏముంటుంది' అంటూ ట్వీట్ చేశాడు.

రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజోల్ హీరోయిన్గా నటిస్తుండగా, వరుణ్ ధావన్, కృతిసనన్లు ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. దిల్వాలే సినిమాకు సంబందించిన వర్క్ పూర్తి కాగానే ఫ్యాన్, రాయిస్ సినిమాల షూటింగ్లో పాల్గొననున్నాడు షారూఖ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement